భారతీయులకు జనవరి 1 నుంచి వీసా–ఫ్రీ ఎంట్రీ బంద్‌ | Malaysia ends visa-free entry for Indian nationals from Jan 1, 2027 | Sakshi
Sakshi News home page

భారతీయులకు జనవరి 1 నుంచి వీసా–ఫ్రీ ఎంట్రీ బంద్‌

Nov 20 2026 4:49 AM | Updated on Nov 20 2026 4:49 AM

 Malaysia ends visa-free entry for Indian nationals from Jan 1, 2027

మలేసియా ఇమిగ్రేషన్‌ విభాగం ప్రకటన

సింగపూర్‌: భారతీయ పౌరులకు కల్పిస్తున్న వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రద్దు చేయనున్నట్లు మలేషిసియా ఇమిగ్రేషన్‌ విభాగం ప్రకటించింది. ఆగ్నేయాసియా దేశమైన మలేషిసియాకు ప్రయాణించే భారతీయులకు 30 రోజుల పాటు వీసా మినహాయింపు ఉండేది. ప్రయాణానికి మూడు రోజుల ముందుగా ‘మలేషిసియా డిజిటల్‌ అరైవల్‌ కార్డ్‌’కోసం నమోదు చేసుకుంటే సరిపోయేది. 

ఈ వీసా మినహాయింపును 2023 డిసెంబర్‌ 1న ప్రవేశపెట్టారు, ఆ తర్వాత దీనిని 2026 చివరి వరకు పొడిగించారు. భారతీయులకు వీసా–ఫ్రీ ఎంట్రీ సదుపాయం 2027 జనవరి 1 నుంచి రద్దవుతుందని పేర్కొంటూ మలేషిసియా ఇమిగ్రేషన్‌ విభాగం ఈ నెల 17న నోటీసు జారీ చేసింది. ఇకపై మలేషిసియాకు వెళ్లే భారతీయ పౌరులు, అక్కడికి చేరుకోకముందే చెల్లుబాటు అయ్యే వీసాను పొందాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement