డ్రగ్స్‌ రహిత భారత్‌ను నిర్మించాలి  | PM Narendra Modi calls for whole-of-nation approach to make India drug-free | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత భారత్‌ను నిర్మించాలి 

Nov 20 2026 4:32 AM | Updated on Nov 20 2026 4:32 AM

PM Narendra Modi calls for whole-of-nation approach to make India drug-free

సమాజం, ఆధ్యాత్మిక సంస్థలు, విద్యా సంస్థలు చొరవ తీసుకోవాలి  

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు  

న్యూఢిల్లీ: మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో సమాజం, ఆధ్యాత్మిక సంస్థలు, విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచాలని పిలుపునిచ్చారు. ఆయా సంస్థలు చొరవ తీసుకోవాలని కోరారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాలు రొటీన్‌గా ఉండొద్దని, ప్రజలపై ప్రభావం చూపేలా రూపొందించాలని అన్నారు. మనుషుల్లో వైకల్యాలను ముందుగానే గుర్తించడంలో, వాటికి సంబంధించి సమాజంలో ఉన్న వివక్షను అధిగమించడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు.

 గురువారం సామాజిక న్యాయం, సాధికారతపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రజలకు అవసరమైన సాంకేతికతలను చౌకగా రూపొందించడానికి స్టార్టప్‌లను ప్రోత్సహించాలని స్పష్టంచేశారు. నషా ముక్త్‌ భారత్‌ దిశగా సమాజం మొత్తం పాలుపంచుకోవాలని విన్నవించారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. 

ఈ శిఖరాగ్ర సమావేశంలో జరిగిన చర్చలు, కార్యాచరణ అంశాలు కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి లక్ష్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఒకరి అనుభవాలు, ఆవిష్కరణల నుంచి మరొకరు నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. సంకోచం, అవగాహన లోపం వంటి కారణాల వల్ల తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లల్లోని సమస్యలను గుర్తించలేకపోతున్నారని, దానివల్ల పిల్లలు సకాలంలో సహాయం పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మార్పు రావాలని ప్రధానమంత్రి తేలి్చచెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement