ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ
మ.గం. 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
దోహా: సీనియర్ ఆసియా కప్, ఆసియా క్రీడలు, అండర్–19 ఆసియా కప్ తర్వాత ఇప్పుడు కొత్తగా మరో ఆసియా ఖండపు టోర్నమెంట్లో సత్తా చాటేందుకు భారత బృందం సిద్ధమైంది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో భాగంగా గ్రూప్ ‘బి’లో నేడు తమ తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ తలపడుతుంది.
బుధవారం ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్‌తో పాటు నేపాల్, పాకిస్తాన్, యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్, అఫ్గానిస్తాన్ బరిలోకి దిగుతున్నాయి. తిలక్ వర్మ సారథ్యంలో పోటీపడుతున్న భారత జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ప్రధాన ఆకర్షణ కానున్నారు. నేపాల్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా ఈనెల 22న పాకిస్తాన్‌తో... 24న యూఏఈ జట్టుతో ఆడుతుంది. నవంబర్ 29 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.


