ప్రిక్వార్టర్స్‌కు సౌరవ్‌ కొఠారి | Sourav Kothari reaches pre quarterfinals of Snooker Championship | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌కు సౌరవ్‌ కొఠారి

Nov 20 2026 3:52 AM | Updated on Nov 20 2026 3:52 AM

Sourav Kothari reaches pre quarterfinals of Snooker Championship

ఇండోర్‌: ప్రపంచ స్నూకర్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ అగ్రశ్రేణి క్రీడాకారులు సౌరవ్‌ కొఠారి, పంకజ్‌ అద్వానీ, కమల్‌ చావ్లా నేరుగా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారంతో గ్రూప్‌ దశ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. టాప్‌–8లో నిలిచిన వారికి నేరుగా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ జాబితాలో సౌరవ్‌ కొఠారి (టాప్‌ ర్యాంక్‌)... పంకజ్‌ అద్వానీ (మూడో స్థానం), కమల్‌ చావ్లా (ఏడో స్థానం) ఉన్నారు. 

నాకౌట్‌ దశ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో భారత్‌కే చెందిన బ్రిజేశ్‌ దమాని 4–0 (75–33, 77–13, 83–34, 80–30) ఫ్రేమ్‌ల తేడాతో అలీ అలోబైద్లి (ఖతర్‌)పై, దిగి్వజయ్‌ కడియాన్‌ 4–1 (80–40, 76–22, 34–81, 76–37, 69–66) ఫ్రేమ్‌ల తేడాతో నాన్‌సెన్‌ వాన్‌ (హాంకాంగ్‌)పై, మనన్‌ చంద్ర 4–3 (69–55, 30–77, 71–9, 65–26, 36–71, 30–76, 58–40) ఫ్రేమ్‌ల తేడాతో క్రిష్‌ గుర్బాక్సాని (భారత్‌)పై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement