PC: X
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. సెంచూరియన్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు సఫారీ కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా దూరమయ్యాడు.
మొదటి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా బవుమా కాలి పిక్క కండరాలు పట్టేశాయి. నొప్పితో విలవిల్లాడిన అతడు బ్యాటింగ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ, వికెట్ల మధ్య కుంటుతూనే పరుగులు తీశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బవుమా ఫీల్డింగ్‌కు కూడా రాలేదు.
అతడి గాయం కాస్త తీవ్రమైనది కావడంతో దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ప్రోటీస్ వైద్య బృందం సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బవుమా సెంచూరియన్ టెస్టుకు దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో వైస్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ మరోసారి సఫారీ జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్‌లో ప్రోటీస్
తొలి టెస్టులో సాధించిన విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుత సైకిల్‌లో ప్రోటీస్ జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలను నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతోంది.
చదవండి: కెప్టెన్సీ ఉంటుందా? ఊడిపోతుందా? కమిన్స్‌ను చుట్టుముట్టిన రిపోర్టర్లు


