శాండ్‌పేపర్ కాదు.. బాటిల్ మూతలతో ట్యాంపరింగ్ చేశాం: షోయబ్‌ అక్తర్‌ | Shoaib Akhtar recalls ball tampering, says cricket is dying in Pakistan | Sakshi
Sakshi News home page

శాండ్‌పేపర్ కాదు.. బాటిల్ మూతలతో ట్యాంపరింగ్ చేశాం: షోయబ్‌ అక్తర్‌

Nov 19 2026 3:03 PM | Updated on Nov 19 2026 3:40 PM

Shoaib Akhtar recalls ball tampering, says cricket is dying in Pakistan

ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన ‘శాండ్‌పేపర్ గేట్’ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. ఆసీస్ మాజీ ఓపెనర్‌ ఉస్మాన్ ఖవాజా తన ‘సబర్’ పుస్తకంలో వెల్లడించిన సంచలన విషయాలతో ఈ వివాదం మళ్లీ చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము బాల్‌ ట్యాంపరింగ్‌ చేసేందుకు తాము బాటిళ్ల మూతలు వాడేవాళ్లమని తెలిపాడు. సాండ్‌పేపర్‌ వివాదం గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఉస్మాన్‌ అనవసరంగా రచ్చ చేస్తున్నాడని.. ఇకనైనా ఈ విషయం వదిలేయాలని విజ్ఞప్తి చేశాడు.

"మేము గతంలో ఇంగ్లండ్‌లో ఆడేటప్పుడు రివర్స్ స్వింగ్ రాబట్టడానికి శాండ్‌పేపర్ కాకుండా బాటిల్ మూతలను ఉపయోగించేవాళ్ళం" అని విజ్డెన్'ది స్కూప్' పాడ్‌కాస్ట్‌లో అక్తర్ పేర్కొన్నాడు.

కాగా గ‌తంలో షోయబ్ అక్త‌ర్ కూడా బాల్ టాంప‌రింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. 2003లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో  బాల్-ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు షోయబ్ అక్తర్‌పై రెండు వ‌న్డే మ్యాచ్‌ల నిషేధం విధించారు. 

ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని లెవల్ 2.10 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా కూడా ప‌డింది. ఆ మ్యాచ్‌లో బంతి ఆకారాన్ని అక్త‌ర్‌ మార్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. దీంతో అప్పటి మ్యాచ్ రిఫరీ గుండప్ప విశ్వనాథ్ అతనికి ఈ శిక్ష విధించారు.
చదవండి: IND vs NZ: వాళ్ల కోసమే.. అతడిని పక్కనపెట్టేశాము.. కుండబద్దలు కొట్టిన కోచ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement