Ball tampering
-
భారత క్రికెటర్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. అంపైర్‌పై కిషన్ ఫైర్?
మెక్కే వేదికగా ఆ్రస్టేలియా ‘ఎ’ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ‘ఎ’ ఓటమి పాలైంది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో హైడ్రామా చోటు చేసుకుంది. టీమిండియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు.ఇదే విషయంపై భారత జట్టును అంపైర్ బెన్ ట్రెలోర్, షవాన్ క్రెగ్లు మందలించారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సైతం తాము ఏ తప్పు చేయలేదని అంపైర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఫీల్డ్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.అసలేం జరిగిందంటే?ఆఖరి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఎ విజయానికి 86 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆసీస్ బ్యాటర్లు మెక్‌స్వీనీ, బ్యూ వెబ్‌స్టర్ భారత ప్లేయర్లు ఫీల్డ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో అంపైర్ షాన్ క్రెయిగ్ భారత జట్టుకు కొత్త బంతిని అందించాడు.అయితే బంతిని మార్చడంపై భారత ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేశారు. 'మీరు బంతిని స్క్రాచ్ చేశారు. కాబట్టి మేం బాల్‌ను మార్చాం. దీనిపై ఇక ఎలాంటి చర్చ లేదు. ఆట కొనసాగించండి' అంటూ అంపైర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదంతా స్టంప్ మైక్రోఫోన్లో రికార్డు అయింది. అయితే అంపైర్ వ్యాఖ్యలకు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఘాటుగా బదులిచ్చాడు. "మేము ఏమీ చేయలేదు. మీ నిర్ణయం అత్యంత మూర్ఖత్వం’’ అని అన్నాడు. ఈ క్రమంలో కిషన్‌పై అంపైర్ అగ్రహం వ్యక్తం చేశాడు. మీపై ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది మంచి పద్దతి కాదు. మీ జట్టు చేసిన పనికి బంతిని మార్చాం'' అని అంపైర్ పేర్కొన్నాడు.క్లారిటీ ఇచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇక ఈవివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. భారత ఆటగాళ్లు ఎవరూ ఎటువంటి బాల్ టాంపరింగ్ పాల్పడలేదు. పూర్తిగా దెబ్బతిన్నడం వల్లనే బంతిని మార్చాల్సి వచ్చింది. ఈ విషయం నాలుగో రోజు ఆటకు ముందే ఇరు జట్ల కెప్టెన్, మేనేజర్‌కు తెలియజేశారు. ఈ వివాదంపై తదుపరిగా ఎటువంటి చర్యలు తీసుకోబడవు" అని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది.చదవండి: IND vs NZ: ట్రాప్‌లో చిక్కుకున్న రోహిత్.. అసలు ఆ షాట్ అవసరమా? వీడియో -
T20 World Cup 2024: పాక్ పేసర్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు
టీ20 వరల్డ్‌కప్ 2024లో పటిష్టమైన పాకిస్తాన్‌పై పసికూన యూఎస్ఏ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యూఎస్ఏ పాక్‌పై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించి చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. ఇరు జట్ల నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్లో యూఎస్ఏ మరింత అద్భుతంగా ఆడి పాక్‌ను మట్టికరిపించింది.యూఎస్ఏ ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాధిస్తుండగానే ఆ దేశానికే చెందిన బౌలర్ (ప్రపంచకప్ జట్టులో సభ్యుడు కాడు) రస్టీ థెరాన్ పాక్ పేసర్ హరీస్ రౌఫ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. రౌఫ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని థెరాన్ ఆరోపించాడు. కేవలం రెండు ఓవర్లు వాడిన బంతిని రౌఫ్ వేళ్లతో రద్దుతూ (బంతిని పాతగా చేసే ఉద్దేశంతో) కనిపించాడని అన్నాడు. బంతి రివర్స్ స్వింగ్ అవుతున్నందుకు రౌఫ్ ఈ పనికి చేశాడని కామెంట్ చేశాడు.ఈ విషయాన్ని ఐసీసీ చూసీ చూడనట్లు వదిలేసిందని మండిపడ్డాడు. రౌఫ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు టీవీల్లో స్పష్టంగా కనిపించిందని అన్నాడు. రౌఫ్‌పై ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు థెరాన్ ట్వీట్ చేశాడు.38 ఏళ్ల థెరాన్ 2010 నుంచి 2019 వరకు సౌతాఫ్రికాకు ఆడాడు. ఆ తర్వాత ఆ దేశం తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అమెరికాకు వలస వచ్చాడు. 2019 సెప్టెంబర్ నుంచి థెరాన్ యూఎస్ఏ జట్టుకు ఆడుతున్నాడు. యూఎస్ఏ టీ20 వరల్డ్‌కప్ జట్టులో థెరాన్కు చోటు దక్కలేదు. థెరాన్ 2010-15 మధ్యలో వివిధ ప్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన థెరాన్ 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. -
న్యూజిలాండ్ ఆటగాడిపై బ్యాల్ టాంపరింగ్ ఆరోపణలు
న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల కిందట జరిగిన దేశవాలీ క్రికెట్ మ్యాచ్‌లో నికోల్స్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆ మ్యాచ్ ఫీల్డ్ అంపైర్లు ఆరోపించారు. నికోల్స్ న్యూజిలాండ్ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు వారు అభియోగాలు మోపారు. ఈ విషయంపై నికోల్స్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం.. న్యూజిలాండ్ దేశవాలీ టోర్నీ అయిన ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్యాంటర్బరీ, ఆక్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా నికోల్స్ హెల్మెట్‌తో బంతిని రుద్దినట్లు అంపైర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అంపైర్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నికోల్స్‌ను దోషిగా తేలిస్తే, అతను కొంతకాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కోవచ్చు. ఈ నెలాఖరులో జరిగే బంగ్లాదేశ్ పర్యటనలో నికోల్స్ న్యూజిలాండ్ టెస్టు జట్టులో చేరనున్న నేపథ్యంలో బాల్ టాంపరింగ్ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, 31 ఏళ్ల నికోల్స్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. అతను ఇప్పటివరకు 54 టెస్టులతో పాటు 72 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. తన కెరీర్లో నికోల్స్ ఓవరాల్‌గా 5000 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
స్టీవ్ స్మిత్‌ను దారుణంగా అవమానించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్-2023 తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను దారుణంగా అవమానించారు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తూ రాక్షసానందం పొందారు. 2018 బాల్ టాంపరింగ్ ఇష్యూ తదనంతరం జరిగిన ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ గేలి చేశారు. Atmosphere 💀pic.twitter.com/Oxt4mQ860k — Shivani (@meme_ki_diwani) June 19, 2023 బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్మిత్ మీడియా ముందు ఏడుస్తూ తప్పు ఒప్పుకున్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఓ పాట ద్వారా టీజ్ చేశారు. We Saw You Crying On Telly (నువ్వు టీవీలో ఏడుస్తుంటే మేము చూశాం) అంటూ స్టేడియం మొత్తం ముక్తకంఠంతో పాట పాడుతూ స్మిత్ మనసు గాయపడేలా ప్రవర్తించారు. Heartbreaking. Steve Smith has broken down delivering a message to young Aussie cricket fans. pic.twitter.com/l14AsvAhXz — cricket.com.au (@cricketcomau) March 29, 2018 స్టేడియంలో ప్రేక్షకులు ఇలా చేస్తుంటే స్మిత్ తెగ ఇబ్బంది పడ్డాడు. పైకి నవ్వుతూ ఇంకా పాడండి అంటున్నట్లు తల ఊపినప్పటికీ.. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. నెటిజన్లు ఇంగ్లండ్ ప్రేక్షకులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. ఎలాంటి వ్యక్తినైనా ఈ తరహాలో ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. Steve Smith heads over to the Hollies for the first time this series….#Ashes pic.twitter.com/Hs1cRB56Lb — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 19, 2023 ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
'ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసింది.. అందుకే కోహ్లి ఔటయ్యాడు'
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ పాల్పడందని బాసిత్ అలీ ఆరోపణలు చేశాడు. 15 ఓవర్లో ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ చేసందని, కోహ్లి, పుజారాలు ఔట్ కావడానికి ఇదే కారణమని అతడు అన్నాడు. "కామెంటరీ బాక్స్‌లోంచి మ్యాచ్ చూస్తున్న వారికి, అంపైర్లకు ముందుగా చప్పట్లు కొట్టాలి అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా కచ్చితంగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ఏదో చేసింది. ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. బ్యాటర్లు కూడా దాన్ని పెద్దగా గమనించలేదు. బ్యాటర్లు బాల్ ను వదిలేస్తూ బౌల్డ్ అయ్యారు. అంతే తప్ప ఏం జరుగుతుందని ఆలోచించలేకపోయారు. ఈ ఆరోపణలకు నా దగ్గర ఆధారం కూడా ఉంది. భారత ఇన్నింగ్స్ 17, 18, 19 ఓవర్లు ఓసారి చూడండి. విరాట్ కోహ్లి ఔటైనప్పుడు బంతికి మెరుపు ఏవైపు ఉందో ఓ సారి గమనించండి. మిచెల్ స్టార్క్ బంతి పట్టుకున్నప్పుడు మెరుపు బంతికి బయటి ఉంది. కానీ బంతి మాత్రం లోపలకు వచ్చింది. మెరుపు బయట వైపు ఉండి బంతి ఎప్పుడూ రివర్స్ స్వింగ్ అవ్వదు. ఆసీస్ ఎదో చేసింది. అదే విధంగా జడేజా బాల్ ను ఆన్ సైడ్ ఆడుతుంటే అది పాయింట్ వైపు వెళ్తోంది. ఇది అంపైర్లకు కనిపించలేదా? ఈ చిన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు అంటూ అలీ తన యూట్యూబ్ ఛానెల్లో విమర్శలు గుప్పించాడు. చదవండి: ఇటువంటి కమ్‌బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు.. అతడొక అద్భుతం: గంగూలీ -
టిమ్ పెయిన్ సంచలన ఆరోపణలు
-
Aus Vs SA: ‘మేమే కాదు దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసింది’
Tim Paine- Ball Tampering- Sandpaper Scandal- సిడ్నీ: 2018లో కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్ టాంపరింగ్’ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దాంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడటంతో పాటు తర్వాతి మ్యాచ్‌నుంచి టిమ్ పెయిన్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే నాటి ఘటనను తన పుస్తకం ‘ద పెయిడ్ ప్రైస్’లో గుర్తు చేసుకున్న పెయిన్... తామే కాదు, తర్వాతి టెస్టులో దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే స్థానిక ప్రసారకర్తల సహాయంతో ఆ వీడియోను దాచేశారని అతను ఆరోపించాడు. ‘సిరీస్ నాలుగో టెస్టులో ఇది జరిగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ చేతిలో ఉన్న బంతిపై చాలా పగుళ్లు ఉన్న దృశ్యం అక్కడి భారీ స్క్రీన్‌పై కనిపించింది. కానీ ఆ వెంటనే దానిని తొలగించారు. మేం ఈ విషయంపై అంపైర్లతో మాట్లాడినా అసలు ఎవరూ పట్టించుకోలేదు’ అని పెయిన్ చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఘటన సమయంలో తమ ముగ్గురు క్రికెటర్లకు ఎవరూ అండగా నిలవలేదని విషయాన్ని అతను అంగీకరించాడు. ‘సాధారణంగా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సహచర క్రికెటర్లు ఆదుకోవాలి. మానసికంగా వారికి అండగా నిలవాలి. కానీ వారందరినీ వెలి వేసినట్లు చూశారు’ అని పెయిన్ చెప్పాడు. చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ T20 WC 2022: అక్తర్, బ్రాడ్ హాగ్‌లు దొరికేశారు కదా..! -
డేవిడ్ వార్నర్‌కు భారీ ఊరట
టీ20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు భారీ ఊరట లభించింది. 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఎదుర్కొంటున్న అతనికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ తియ్యటి కబురు చెప్పనుందని తెలుస్తుంది. సీఏ.. వార్నర్‌పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు ఫించ్ తర్వాత ఆసీస్ పరిమిత ఓవర్ల పగ్గాలు కూడా అప్పజెప్పాలని డిసైడైనట్లు కధనాలు వినిపిస్తున్నాయి. రేపు జరుగబోయే సీఏ బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. వార్నర్‌పై కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేయాలని అభిమానులు, ప్రస్తుత, మాజీ ఆటగాళ్ల నుంచి భారీ స్థాయిలో డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సీఏ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇదే బాల్ టాంపరింగ్ ఉదంతంలో వార్నర్‌తో పాటు నాటి ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్, ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై కూడా క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ముగ్గురు ఆటగాళ్లు నేరం అంగీకరించిన నేపథ్యంలో బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, స్టీవ్ స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం పడింది. అయితే ఈ కేసులో వార్నర్‌ను కీలక సూత్రధారిగా పరిగణించిన సీఏ.. అతనిపై లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్‌ను విధించింది. -
వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలోనే కెప్టెన్సీపై జీవిత కాల నిషేధం ఎత్తివేత..!
నాలుగేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. 2018లో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ పాల్పడ్డారు. ఈ ఘటన జరగిన సమయంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్ క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది కాలం పాటు నిషేదం విధించింది. ఇక నిషేధం ముగిసిన ఏడాది వరకు స్మిత్‌ను కెప్టెన్సీకి అనర్హుడిగా ప్రకటించారు. అదే విధంగా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై క్రికెట్ ఆస్ట్రేలియా జీవిత కాల నిషేదం విధించింది. అయితే తాజా పరిణామాల ప్రకారం.. వార్నర్ కెప్టెన్సీపై జీవిత కాల నిషేదం ఎత్తి వేసే యోచనలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు బెన్ హార్న్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. 2018 బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో వార్నర్‌పై విధించిన కెప్టెన్సీ నిషేదాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పునః పరిశీలిస్తుంది. ఈ నిషేదంతో టీ20 లీగ్‌లలో వార్నర్ తన కెప్టెన్సీ అవకాశాలు కోల్పోతున్నాడని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ముఖ్యంగా ఆ దేశ మేజర్ టోర్నీ బిగ్‌బాష్ లీగ్‌లో కూడా కేవలం ఆటగాడిగానే వార్నర్ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై నిషేదం ఎత్తి వేయనున్నట్లు సమాచారం. చదవండి: IND-W Vs SL-W: రాణించిన షఫాలీ, రోడ్రిగ్స్.. శ్రీలంకపై భారత్ ఘనవిజయం -
బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన బౌలర్..
నెదర్లాండ్ ఫాస్ట్ బౌలర్ వివియన్ కింగ్మా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో కింగ్మా బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 3ని ఉల్లంఘించినందుకు కింగ్మాపై నాలుగు మ్యాచ్‌ల నిషేదాన్ని ఐసీసీ విధించింది. అంతేకాకుండా క్రమశిక్షణా రికార్డులో ఐదు డీమెరిట్ పాయింట్లు కూడా వచ్చి చేరాయి. ఏం జరిగిందంటే.. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ 31వ ఓవర్ బౌలింగ్ వేసిన కింగ్మా తన చేతి గోళ్లతో బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడు. కింగ్మా తన నేరాన్ని అంగీకరించడంతో నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని మ్యాచ్ రిఫరీ విధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో పది ఓవర్లు బౌలింగ్ వేసిన కింగ్మా ఒకే ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నెదర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంలో బ్యాటర్లు రియాజ్ హుసాన్(50 పరుగులు), నజీబుల్లా(71 పరుగులు) అర్ధ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. చదవండి: హార్ధిక్ పాండ్యా నాన్నమ్మనూ వదలని "పుష్ప" ఫోబియా.. తగ్గేదేలే అంటున్న బామ్మ -
'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా'
Steve Smith Says Ian Chapell Coloumn Stuck On Bathroom Mirror: ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కెరీర్లో బాల్ టాంపరింగ్ ఉదంతం ఒక చీకటికోణంలా మిగిలిపోయింది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్, బెన్క్రాఫ్ట్లతో కలిసి స్మిత్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడడం సంచలనంగా మారింది. ఈ అంశం అప్పట్లో తీవ్ర దుమారం రేపడంతో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీరియస్‌గా పరిగణించింది. కెప్టెన్సీ పదవి నుంచి స్మిత్‌ను తొలిగించిన సీఏ అతనితో పాటు డేవిడ్ వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం.. బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. అలా 2018 నుంచి 2019 వరకు క్రికెట్‌కు దూరంగా ఉన్న స్మిత్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. చదవండి: WI vs SL: క్రీజులో పాతుకుపోయాడు.. తెలివైన బంతితో బోల్తా తాజాగా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌కు సిద్ధమవుతున్న ఈ ఆసీస్ ఆటగాడు మరోసారి ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో ఇయాన్ చాపెల్ చేసిన వ్యాఖ్యలు తనకు ఎప్పటికి గుర్తుండిపోయాయని చెప్పుకొచ్చాడు. '' బాల్ టాంపరింగ్ ఉదంతం నాకు చీకటిరోజులు. ఈ ఉదంతంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. నాకు ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలు బాగా గుర్తున్నాయి. ఒక పత్రికలో ఇయాన్ చాపెల్ తన కాలమ్‌లో '' బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు ఆటకు దూరం కానున్న స్మిత్ .. ఏడాది తర్వాత రీ ఎంట్రీలో అతనిలో అదే బ్యాటర్ కనబడడు'' అని పేర్కొన్నాడు. ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న నేను ఆ పేపర్ ముక్కను కట్‌చేసి నా బాత్రూం గోడకు తగిలించాను. ప్రతీరోజు రాత్రి నిద్రపోయే ముందు.. ఉదయం నిద్ర లేవగానే దానిని చూసుకునేవాడిని. ఆ వ్యాఖ్యల చదువుతూ బ్రష్ చేసేవాడిని. అయితే 2019లో రీఎంట్రీ తర్వాత యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించాను. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అటు చాపెల్‌కు.. విమర్శలకు ఒక విషయం చెప్పా.. అదేంటంటే.. ''నిషేధం తర్వాత నేను ఏం కోల్పోలేదు.. అది ఇంకా నా దగ్గరే ఉంది''. ఈ విషయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నేను సాధించాననే సంతోషం కలుగుతుంది'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ టెస్టు సిరీస్ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఇక సెక్స్ స్కాండల్ ఆరోపణలతో టిమ్ పైన్ అనూహ్యంగా కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయడంతో పాట్ కమిన్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇక స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇక 2019లో జరిగిన యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఏడాది నిషేధం నుంచి తిరిగొచ్చిన స్టీవ్ స్మిత్ ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు సహా మొత్తంగా 777 పరుగులు సాధించి ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
బాల్ టాంపరింగ్ వివాదం సద్దుమణిగినట్టే: ఆసీస్ కెప్టెన్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియాలో పెను దుమారం రేపిన బాల్ టాంపరింగ్ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగిందని ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ వెల్లడించాడు. బాన్‌క్రాఫ్ట్‌తో బౌలర్లు సమావేశమై సమస్యను పరిష్కరించుకున్నారని అతను ప్రకటించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విలేఖరులు అడిన ప్రశ్నలకు తికమక పడిన బాన్‌క్రాఫ్ట్.. ఒత్తిడిలో అలా మాట్లాడాడని, ఈ ఉదంతం గురించి బౌలర్లకు ముందుగానే తెలుసన్న విషయమై అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించాడు. కాగా, 2018లో వెలుగు చూసిన బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ ఘటనపై పునర్విచారణ జరిపేందుకు తాము సిద్దమని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది.దీంతో నాటి జట్టులో సభ్యులైన కమిన్స్, హాజిల్‌వుడ్, స్టార్క్‌లు బాన్‌క్రాఫ్ట్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఈ ముగ్గురు బౌలర్లు ఆ వివాదంలో తమ పాత్ర ఏమీ లేదంటు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ వివాదం గురించి ఓ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకులో ఏదో సమాధానం చెప్పానని బాన్‌క్రాఫ్ట్ తమకు వివరణ ఇచ్చాడని వారు పేర్కొన్నారు. ఈ విషయమై బాన్‌క్రాఫ్ట్ కూడా అదే సమాధానం చెప్పాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్‌కు వివరణ ఇచ్చాడు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. కాగా, 2018లో కేప్‌టౌన్ వేదికగా ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టులో బాల్ టాంపరింగ్ ఉదంతం వెలుగు చూసింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బంతికి సాండ్ పేపర్ రుద్దుతూ కెమెరాల కంటపడ్డాడు. దీంతో అతనితో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై నిషేధం విధించారు. చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం.. -
వాళ్లు అమాయకులంటే అస్సలు నమ్మలేం: పాక్ మాజీ కెప్టెన్
ఇస్లామాబాద్: 2018 నాటి బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా బౌలర్ బాన్‌క్రాఫ్ట్ బంతికి సాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాల కంటపడ్డ సంగతి తెలిసిందే. దీంతో, అతడితో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై నిషేధం విధించారు. అది ముగిసిపోయింది కూడా. అయితే, ఇటీవల బాన్‌క్రాఫ్ట్ ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. తాను బాల్ టాంపరింగ్ చేయడం తమ జట్టులోని మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ బాంబు పేల్చాడు. దీంతో అప్పటి మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు అయిన పాట్ కమిన్స్, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తమకేమీ తెలియదంటూ ఈ నలుగురూ సంయుక్తంగా లేఖ విడుదల చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్... ఆసీస్ బౌలర్లు అమాయకులు అంటే తాను అస్సలు నమ్మనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘బాల్ రివర్స్‌లో స్వింగ్ అవుతుంటే బౌలర్లకు దాని గురించి తెలియదని చెప్పడం అబద్ధమే అవుతుంది. రివర్స్ స్వింగ్ రాబట్టాలని వారు ముందే నిర్ణయించుకుని ఉంటారు. బంతిని పదే పదే రుద్దుతూ షైన్ చేస్తే ఈ విధంగా చేయవచ్చు. డ్రెస్సింగ్ రూంలో దీని గురించి చర్చ జరుగకుండానే ఇదంతా సాధ్యమైందంటే అస్సలు నమ్మను. నిజానికి బాన్‌క్రాఫ్ట్ బంతిని సాండ్ పేపర్‌తో రుద్దాడు ఈ విషయం తెలిసి కూడా ఊరుకున్నారు కాబట్టి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు కూడా శిక్ష పడింది. కానీ ఈ విషయంలో ఇతర బౌలర్లు మాత్రం తప్పించుకున్నారు. అంతా కలిసే చేసినా, కొందరు మాత్రమే శిక్ష అనుభవించారు. బంతి ఎలా తిరుగుతుంది అన్న విషయంపై బౌలర్లకు అవగాహన లేదనడం హాస్యాస్పదమే’’ అని సల్మాన్ భట్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఇక్కడితో ముగించండి.. ఆసీస్ బౌలర్ల వేడుకోలు ఇండియాకు వచ్చెయ్ ప్లీజ్ .. పంత్ స్థానంలో ఆడు -
Ball Tampering:ఇక్కడితో ముగించండి.. ఆసీస్ బౌలర్ల వేడుకోలు
సిడ్నీ: క్రికెట్లో బాల్ టాంపరింగ్ ఉదంతం పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. అయితే బ్యాన్‌క్రాఫ్ట్ తాజాగా ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ..తాను బాల్ టాంపరింగ్ చేయడం ఆసీస్ జట్టులో మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాల్ టాంపరింగ్ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. బాల్ టాంపరింగ్ ఉదంతంలో మిగతా బౌలర్ల హస్తం ఉందంటూ అక్కడి మీడియా కోడై కూసింది. ఈ విషయంపై ఆసీస్ క్రీడా జర్నలిస్టులు సీఏపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో రంగంలోకి దిగిన సీఏ బ్యాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అప్పటి మ్యాచ్‌లో బౌలర్లుగా ఉన్న పాట్ కమిన్స్, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, మిచెల్ స్టార్క్‌లు స్పందించారు. ఆసీస్ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ నలుగురు కలిసి ఒక సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.''ఆస్ట్రేలియన్ ప్రజలారా..మా నిజాయితీపై మాకు పూర్తి నమ్మకముంది. మా సమగ్రత, వ్యక్తిత్వంపై కొందరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలు మాకు బాధ కలిగించాయి. అయినా ఈ ప్రశ్నలకు మేం వివిధ సందర్బాల్లో ఎన్నోసార్లు సమాధానాలు ఇచ్చాము. ఒకవేళ అవసరం అనుకుంటే.. మరోసారి దానిపై చర్చ పెట్టండి.. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వాస్తవానికి ఆరోజు మ్యాచ్‌లో బంతి షేప్ మార్చడానికి బయటనుంచి మైదానంలోకి ఒక పదార్థం తీసుకొచ్చారన్న సంగతి మాకు తెలియదు. బాల్ టాంపరింగ్ జరిగిందని అంపైర్లు గుర్తించాకా.. మైదానంలో ఉన్న స్క్రీన్‌పై బంతి షేప్ మారిందంటూ చూపించిన తర్వాత మాకు మిషయం అర్థమైంది. ఆరోజు మ్యాచ్‌లో ఉన్న ఇద్దరు అంపైర్లు నీల్ లాంగ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. మంచి అనుభవం కలిగినవారు. వారిద్దరు బంతిని పరిశీలించి షేప్ మారిందని చెప్పారు. బ్యాన్‌క్రాఫ్ట్ అప్పటికే సాండ్పేపర్కు బంతిని రుద్దాడని మాకు తెలియదు. కానీ అతను బాల్ టాంపరింగ్ చేస్తున్నట్లు ఇతర బౌలర్లకు కూడా తెలుసని చెప్పాడు. ఇది నిజం కాదు. ఒక బౌలర్‌గా మా బాధ్యత బంతులు విసరడం మాత్రమే.. బంతి షేప్ మారిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ మాకెలా తెలుస్తాయి. వార్నర్, స్మిత్, బ్యాన్‌క్రాఫ్ట్‌లు చేసింది తప్పు కాబట్టే శిక్ష అనుభవించారు. కానీ ఈ ఉదంతం నుంచి మంచి పాఠాలు నేర్చుకున్నాం. మేము ఆటను ఆడే విధానం.. మైదానంలో ప్రవర్తించే తీరును ప్రజలు మంచి దృష్టితో చూడాలి. ఇలాంటి పుకార్లు, అవాస్తవాలను నమ్మద్దొని కోరుకుంటున్నాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది.. ఇక ఇది ముందుకు సాగవలసిన సమయం.'' అంటూ ముగించారు. చదవండి: వార్నర్ రిటైరైన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా: బ్రాడ్ ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు View this post on Instagram A post shared by 7Cricket (@7cricket) -
వార్నర్ రిటైరైన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా
లండన్: 2018లో ఆసీస్ క్రికెటర్ల బాల్ టాంపరింగ్ వివాదం అందరూ మరిచిపోతున్నారన్న దశలో దానిలో భాగస్వామిగా ఉన్న క్రికెటర్ కామెరున్ బ్యాన్‌క్రాఫ్ట్.. బాల్ టాంపరింగ్ విషయం మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బ్యాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సీఏ మరోమారు విచారణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''బ్యాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలతో బాల్ టాంపరింగ్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. నేను ఆస్ట్రేలియాకు బౌలింగ్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇంగ్లండ్ తరపున బౌలింగ్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయె చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ బౌలింగ్ సమయంలో నీ సీమ్‌లో తేడా ఉంటే అండర్సన్ సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. బాల్ టాంపరింగ్ జరిగిన రోజు ఆసీస్ జట్టులో ఇది కనిపించలేదు. బంతిని రివర్స్‌సింగ్ రాబట్టడం కోసం బ్యాన్‌క్రాఫ్ట్ ఆ పని చేసి ఉండొచ్చు. కానీ టెస్టుల్లో ఉపయోగించే ఎర్రబంతి పాతబడ్డాక స్వింగ్ రాబట్టడం కొంచెం కష్టమే. కానీ దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని ఆసీస్ ఉపయోగించుకోలేదు. ఇక బాల్ టాంపరింగ్ ఉదంతంపై డేవిడ్ వార్నర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బుక్ రాస్తాడని భావిస్తున్నా. ఈ విషయం నాకు వార్నర్‌కి దగ్గరగా ఉండే వ్యక్తి ద్వారా తెలిసింది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ నవంబర్,డిసెంబర్లో జరగనుంది. దీనికి ముందు ఇంగ్లండ్ జట్టు కివీస్, భారత్‌తో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. మరోవైపు ఆస్రేలియా విండీస్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా బాల్ టాంపరింగ్ ఉదంతం క్రికెట్లో పెను దుమారం రేపింది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. చదవండి: Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్’ బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు: బ్యాన్‌క్రాఫ్ట్ -
Ball Tampering: మళ్లీ తెరపైకి ‘ట్యాంపరింగ్’
మెల్బోర్న్: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదం మరోసారి ముందుకు వచ్చింది. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఘటనలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) నిషేధం విధించింది. వారి శిక్ష ముగిసి మళ్లీ మైదానంలోకి దిగడంతో అంతా ముగిసిపోయినట్లు భావించగా... బాన్‌క్రాఫ్ట్ తాజా వ్యాఖ్యలతో ఆ వివాదాన్ని మళ్లీ రేపాడు. ‘బాల్ ట్యాంపరింగ్ గురించి బౌలర్లకు తెలుసా’ అంటూ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ బాన్‌క్రాఫ్ట్...‘దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా’ అన్నాడు. దాంతో ఇందులో ఆసీస్ బౌలర్లకు కూడా భాగం ఉందని కొత్తగా చర్చ మొదలైంది. బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలపై సీఏ వెంటనే స్పందించింది. 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎవరి వద్దనైనా ఇంకా అదనపు సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని... అవసరమైతే దీనిపై పునర్విచారణ చేస్తామని కూడా ప్రకటించింది. అంతే కాకుండా అవినీతి నిరోధానికి సంబంధించిన సీఏ ప్రత్యేక బృందం (ఇంటిగ్రిటీ యూనిట్) వెంటనే బాన్‌క్రాఫ్ట్‌తో మాట్లాడింది. నాడు ఇచ్చిన వాంగ్మూలంకంటే అదనంగా ఇంకా ఏమైనా చెప్పేది ఉందా అంటూ ప్రశ్నించింది. ఆశ్చర్యమేమీ లేదు: క్లార్క్ బాన్‌క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై కొందరు ఒక్కసారిగా ఏదో అనూహ్యం జరిగిపోయినట్లు స్పందిస్తున్నారని, అయితే ఇందులో అంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు. ‘బంతిని ట్యాంపరింగ్ చేసిన విషయం జట్టులో ముగ్గురు ఆటగాళ్లకే తెలుసంటే ఎలా నమ్ముతాం. బంతిని షైనింగ్ చేసిన తర్వాత ఎవరైనా బౌలర్ వద్దకే విసురుతారు. వారికి ఆ తేడా అర్థం కాదా. అలాంటి ఘటన ఒక్కసారిగా ఏమీ జరిగిపోదు. దానికి ముందు ఎంతో ప్రణాళిక ఉండే ఉంటుంది. అందులో ఎవరెవరు భాగస్వాములో తెలియాలి కదా. అయితే ఆసీస్ బోర్డు ఈ విషయంలో అసలు నిజాలను దాటి పెట్టేందుకే ప్రయత్నించింది’ అని క్లార్క్ ఘాటుగా విమర్శించాడు. -
బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం..
మెల్బోర్న్: మూడేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఆ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాన్‌క్రాఫ్ట్ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌లు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రక్తి కట్టించాయి. ఈ విషయమై తొలుత బాన్‌క్రాఫ్ట్ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్‌లో తాను సాండ్ పేపర్ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చగా, తాజాగా ఆసీస్ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం బాన్‌క్రాఫ్ట్‌తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. కాగా, ఈ వివాదంలో బాన్‌క్రాఫ్ట్‌తోపాటు నాటి జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
బాల్ టాంపరింగ్: ఇక్కడితో ఆగిపోయేలా లేదు
సిడ్నీ: 2018లో ఆసీస్ క్రికెటర్లు చేసిన బాల్ టాంపరింగ్ క్రికెట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. తాజాగా బాన్‌క్రాఫ్ట్.. బాల్ టాంపరింగ్ విషయం స్మిత్, వార్నర్‌లతో పాటు మిగతా బౌలర్లకు కూడా తెలుసంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని మరోసారి విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బాల్ టాంపరింగ్ వివాదం ఇంకా ముగిసిపోలేదని..అది బాన్‌క్రాఫ్ట్‌తో ఆగిపోదని.. ఇంకా ముందుకు సాగుతుందని ఆసీస్ మాజీ బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్ పేర్కొన్నాడు. ఆసీస్ ప్లేయర్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సమయంలో ఆసీస్ బౌలింగ్ కోచ్‌గా డేవిడ్ సాకర్ ఉండడం విశేషం. డేవిడ్ సాకర్ స్పందిస్తూ.. ''ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ వివాదం చాలా మందిని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అది నేనైనా కావొచ్చు లేదా ఇంకెవరో కావొచ్చు. బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని సీఏ విచారణ చేపట్టడం మంచిదే కావొచ్చు.. కానీ తప్పు చేయనివాళ్లు కూడా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విచారణలో భాగంగా రేపు నన్ను పాయింట్ అవుట్ చేయొచ్చు.. లేదంటే ఆ సమయంలో కోచ్‌గా ఉన్న డారెన్ లీమన్వైపు కూడా వెళ్లొచ్చు. ఈ విచారణతో వాళ్లు(సీఏ) ఎక్కడిదాకా వెళతారో నాకు తెలియదు.. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఇది బాన్‌క్రాఫ్ట్‌తో ముగిసిపోలేదు.. ఇది ఎప్పటికి ఆగిపోదు.. ముందుకు సాగుతూనే ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు అతనికి బౌలింగ్ చేస్తే.. అమ్మాయిని ఇంప్రెస్ చేసినట్లే -
బాల్ ట్యాంపరింగ్ చేస్తున్నానని వారికీ తెలుసు: బాన్‌క్రాఫ్ట్
లండన్: క్రికెట్లో పెను దుమారానికి కారణమైన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆ ఘటన ప్రధాన సూత్రధారి ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు (బాల్ ట్యాంపరింగ్) ప్రయత్నిస్తున్నాననే విషయం అప్పటి సారథి స్మిత్, వార్నర్‌లతోపాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చేసే పని వల్ల వారికే లాభం ఎక్కువగా ఉంటుంది. జట్టులో గుర్తింపు తెచ్చుకోవడం కోసం నేను ట్యాంపరింగ్‌కు పూనుకున్నాను. ఆ సమయంలో నైతిక విలువలను నేను పూర్తిగా మరిచిపోయాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో’ అని ఇంగ్లండ్‌కు చెందిన ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాన్‌క్రాఫ్ట్ పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్ బంతికి స్యాండ్ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్ ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్ షిప్లో డర్హామ్ జట్టుకు ఆడుతున్నాడు. విచారణకు సిద్ధమైన సీఏ బాల్ ట్యాంపరింగ్‌పై బాన్‌క్రాఫ్ట్ చేసిన తాజా వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణ ఉంటుందని సీఏ పేర్కొంది. -
బాల్ ట్యాంపరింగ్‌పై వార్నర్ పుస్తకం!
మెల్బోర్న్ : క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పుస్తకం రాయనున్నట్లు అతని భార్య క్యాండిస్ వార్నర్ వెల్లడించింది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్ (అప్పటి కెప్టెన్), వార్నర్, బాన్‌క్రాఫ్ట్ కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. ఈ ఉదంతం ఆటగాళ్ల కెరీర్‌కు మచ్చగా నిలిచింది. అయితే దీనిపై వాస్తవాల్ని వివరించేందుకు తన భర్త పుస్తకం రాస్తాడని క్యాండిస్ తెలిపింది. బంతిని ఉద్దేశపూర్వకంగా మార్చాలనే ప్రణాళిక వార్నర్దేనన్న ఆరోపణల్ని ఆమె కొట్టిపారేసింది. అది వేరొకరి ప్రమేయంతో జరిగిందని చెప్పింది. వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్క్సిన్ కూడా పుస్తకంలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని, తప్పకుండా వార్నర్ సమీప భవిష్యత్తులో వాస్తవాలతో పుస్తకం రాస్తాడని చెప్పారు. (చదవండి : అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది) సరిగ్గా రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదంలో వార్నర్, స్మిత్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోగా, బాన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడింది. (చదవండి : 'కెరీర్ మొత్తం మానసిక క్షోభకు గురయ్యా') -
మార్చాల్సిన అవసరం ఏమిటి?: వార్నర్
సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్లో బంతికి లాలాజలాన్ని(సలైవా) రుద్దడాన్ని రద్దు చేయాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రతిపాదనను ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వ్యతిరేకించాడు. ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. ఈ మార్పుతో ఆటగాళ్లకు తక్కువ రిస్క్ లేదా, అసలు రిస్కే ఉండదు అనుకోవడం పొరపాటన్నాడు. బంతిని షైన్ చేయడం కోసం లాలాజలాన్ని రుద్దడం వందల ఏళ్ల నుంచి వస్తున్నదన్నాడు. ఇలా చేయడం వల్ల పూర్తిగా వైరస్‌ను నియంత్రించవచ్చనే విషయాన్ని మనం చెప్పలేమన్నాడు. ఈ విధానాన్ని పూర్తిగా తొలగించి కొత్త మార్పును తీసుకొస్తారని తాను అనుకోవడం లేదని వార్నర్ తెలిపాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బంతికి లాలాజలం రుద్దడాన్ని నిలిపివేయాలనే ఐసీసీ చూస్తోంది. అదే సమయంలో అంపైర్ల సమక్షంలో బంతిని షైన్ చేయడం కోసం కొత్త విధానాన్ని తీసుకురావడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీనిపై ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వకార్ యూనిస్, ఆశిష్ నెహ్రాలు, హర్భజన్ సింగ్‌లు సలైవా మార్పు వద్దన్నారు. దీనిని యథావిధిగా కొనసాగించాలని సూచించారు. మరికొంతమంది మాత్రం సలైవాను బంతిపై రుద్దడాన్ని ఆపాలని కోరుతున్నారు. (అది షేన్ వార్న్కే సాధ్యం: యూసఫ్) టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్‌మెన్ చితక్కొడతారు. తమ కెరీర్ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్ పేసర్ కమిన్స్ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్‌ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్ ఉదంతంలో స్యాండ్ పేపర్ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్లీన్, ప్యాంట్ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా కాదేది టాంపరింగ్‌కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. (ఖవాజా, షాన్ మార్ష్‌లను తప్పించారు..!) -
‘బాల్ టాంపరింగ్ చేసుకోవచ్చు’
దుబాయ్: సరిగ్గా రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడి శిక్షను అనుభవించారు. తమ పేరు, పరపతి అంతా చెడగొట్టుకున్నారు. క్రికెట్లో బాల్ టాంపరింగ్ కొత్త కాదు. వారికంటే ముందు కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే ఇకపై టాంపరింగ్ చేసినా కూడా ఎలాంటి శిక్షా ఉండకపోవచ్చు. ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీయడాన్ని నేరంగా పరిగణిస్తోన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమ నిబంధనలు సడలించే అవకాశం కనిపిస్తోంది. బాల్ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలనే ప్రతిపాదన ప్రస్తుతం ఐసీసీ పరిశీలనలో ఉంది. అంపైర్ల పర్యవేక్షణలో బంతిని పాలిష్ చేసేందుకు అనుమతిస్తారు. ఇదీ కారణం... పరిమిత ఓవర్ల క్రికెట్లో తెల్ల బంతితో సమస్య కాకున్నా... టెస్టుల్లో ఎర్ర బంతితో పేసర్లు ప్రభావం చూపించాలంటే దానిని పదే పదే పాలిష్ చేయడం అవసరం. అలా చేస్తేనే ఇరు వైపులా స్వింగ్‌ను రాబట్టేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు నిబంధనలకు లోబడి నోటి ఉమ్ము (సలైవా)ను బౌలర్లు వాడుతున్నారు. అయితే కరోనా దెబ్బకు బంతిపై ఉమ్మి రుద్దాలంటేనే బౌలర్లు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది. అందులోనూ ఒకే బంతిని మైదానంలో అందరూ తీసుకోవడం అంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్లే. ఈ నేపథ్యంలో బంతి మెరుపు కోసం ఉమ్మిని వాడకుండా ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని ఐసీసీ మెడికల్ కమిటీ సూచించింది. దాంతో బయటి వస్తువుల ద్వారా కూడా టాంపరింగ్ చేసే అవకాశం కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. వచ్చే మేలో జరిగే టెక్నికల్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఏం వాడొచ్చంటే... టెస్టుల్లో కేవలం ఆరంభ ఓవర్లలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్లకు మధ్య సమమైన పోరు జరగాలంటే బంతిని షైన్ చేయడం తప్పనిసరి. లేదంటే బ్యాట్స్‌మెన్ చితక్కొడతారు. తమ కెరీర్ నరకప్రాయమవుతుందని ఇటీవలే ఆసీస్ పేసర్ కమిన్స్ కూడా అభిప్రాయపడ్డాడు. టాంపరింగ్‌ను ఐసీసీ నిషేధించినా... మ్యాచ్ చేజారిపోతున్న దశలో చాలా మంది వేర్వేరు వస్తువులతో బంతి ఆకారాన్ని మారుస్తుంటారు. స్మిత్, వార్నర్ ఉదంతంలో స్యాండ్ పేపర్ (ఉప్పు కాగితం) వాడగా...గతంలో సీసా బిరడా, చెట్టు జిగురు, వ్యాస్లీన్, ప్యాంట్ జిప్, జెల్లీ బీన్స్, మట్టి... ఇలా కాదేది టాంపరింగ్‌కు అనర్హం అన్నట్లుగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఐసీసీ ఏదైనా ఒక ప్రత్యేక పదార్థాన్ని అధికారికంగా టాంపరింగ్‌కు వాడేలా ఎంపిక చేయాలని భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాడుతున్న మూడు రకాల బంతులు ఎస్జీ, కూకాబుర్రా, డ్యూక్స్‌లన్నింటిపై ఒకే రకంగా పనిచేసేలా ఆ పదార్థం ఉండాలనేది కీలక సూచన. ఈ రకంగా చూస్తే బంతి మెరుపు కోసం లెదర్ మాయిశ్చరైజర్, మైనం, షూ పాలిష్ కొంత వరకు మెరుగ్గా ఫలితమిచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలనలో తేలింది. చివరకు ఐసీసీ దేన్ని ఓకే చేస్తుందనేది ఆసక్తికరం. -
పూరన్ సస్పెన్షన్
దుబాయ్: వెస్టిండీస్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. లక్నోలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో అతను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధించింది. బంతి ఆకారాన్ని మార్చినట్లు పూరన్ అంగీకరించడంతో క్షమాపణలు కూడా కోరాడు. సస్పెన్షన్ కారణంగా విండీస్ ఆటగాడు తదుపరి నాలుగు టి20 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్–3 నిబంధనను అతిక్రమించడంతో ఆరి్టకల్ 2.14 ప్రకారం నాలుగు సస్పెన్షన్ పాయింట్లను విధించామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఔను... నా వల్ల తప్పు జరిగింది. ఐసీసీ శిక్షకు నేను అర్హుడినే. భవిష్యత్తులో ఇలాంటి తప్పు పునరావృతం చేయను’ అని పూరన్ జట్టు వర్గాలను క్షమాపణలు కోరాడు. -
బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి మళ్లీ కష్టాల్లోకి..
కరాచీ: సుదీర్ఘ కాలం తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన షెహజాద్ అహ్మద్ మళ్లీ కష్టాల్లో పడ్డాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తిరిగి ఇబ్బందుల్ని కొనితెచ్చుకున్నాడు. క్వాయిద్ ఈ అజామ్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజామ్.. సింధ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాల్ ఆకారాన్ని దెబ్బ తీసే యత్నం చేశాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)దృష్టికి వెళ్లడంతో పాటు దీన్ని సీరియస్‌గా తీసుకోవడంతో అజామ్ కెరీర్ డైలమాలో పడింది. ‘ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన అజామ్‌పై విచారణ చేపట్టాం. అతనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైసలాబాద్‌లో సింధ్‌తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండో రోజు ఆటలో షెహజాద్ బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు రిఫరీ నదీమ్ దృష్టికి తీసుకెళ్లడంతో షెహజాద్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా క్రమ శిక్షణా నియమావళిని ఉల్లంఘించడం షెహజాద్ ఇది తొలిసారి కాదు. 2018లో యాంటీ డోపింగ్ రూల్స్‌ను అతిక్రమించి నాలుగు నెలలపాటు నిషేధానికి గురయ్యాడు. దాంతో గతేడాది జూలై 10వ తేదీన అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది పీసీబీ. కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన షెహజాద్ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో విమర్శల పాలయ్యాడు. కాకపోతే కోచ్ మిస్బావుల్ హక్ మాత్రం షెహజాద్‌కు మద్దతుగా నిలవడంతో ఊరట లభించింది. అయితే ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకున్న షెహజాద్‌పై పీసీబీ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..
సిడ్నీ : యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధం ఎదుర్కొని జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ ఎట్టకేలకు పిలుపునందుకున్నాడు. ప్రతిష్టాత్మక యాషేస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన 17 మంది సభ్యులు గల జట్టులో చోటుదక్కించుకున్నాడు. బెన్‌క్రాఫ్ట్‌తో ఆసీస్ సీనియర్ ఆటగాళ్లు ఓపెనర్ డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు సైతం శిక్షను అనుభవించినప్పటికీ.. ప్రపంచకప్ టోర్నీతో వారిద్దరు అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశారు. బెన్‌క్రాఫ్ట్ నిషేధం 9 నెలల్లోనే ముగిసినప్పటికీ ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. యాషెస్ సిరీస్ కోసం టిమ్ పెయిన్ నేతృత్వంలోని 17 మంది సభ్యుల గల జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టులో మిచెల్ నెసెర్ అనే అన్క్యాప్డ్ ప్లేయర్ చోటు దక్కించుకున్నాడు. ‘25 మంది ఆటగాళ్ల జాబితాను 17 మందికి కుదించడం చాలా కష్టమైన పని. ఈ సిరీస్ కోసం అద్భుతంగా సాధన చేశాం. ఇందులో 8 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా-ఏ తరఫున గత నెలరోజులుగా ఇంగ్లండ్‌లో ఆడుతున్నారు. ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో ఆడిన ఆరుగురిని తీసుకున్నాం. కౌంటీ క్రికెట్ ఆడిన మరో ముగ్గురిని ఎంపిక చేశాం. తొలి టెస్ట్‌కు సిద్ధంగా ఉండేలా చూసుకున్నాం’ అని ఆసీస్ జాతీయ సెలక్టర్ ట్రెవర్ హోన్స్ తెలిపారు. ఇక 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ జట్టును ప్రపంచం ముందు దోషులగా నిలబెట్టింది. దీంతో ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన శిక్షలు విధించడం.. శిక్షణ కాలం ముగిసి పునరాగమనం చేయడం తెలిసిందే. -
జంపా ట్యాంపరింగ్ చేశాడా?
లండన్ : ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ట్యాంపరింగ్‌కు యత్నించాడా? అతను ప్రతి బంతికి జేబులో చేతులు ఎందుకు పెడ్తున్నాడు? జేబులో ఏముంది.. సాండ్ పేపరా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు తగ్గట్టే మైదానంలో జంపా తీరు టాంపరింగ్ సందేహాలను రేకెత్తించింది. ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో జంపా తన తొలి స్పెల్ బౌలింగ్ చేస్తున్న సమయంలో పదేపదే తన ప్యాంటు జేబులో చేతులు పెట్టి తీయడం.. బంతిని రుద్దడంతో ఈ అనుమానాలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తూ ఐసీసీ దృష్టి సారించాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే గతేడాది కిందట చోటుచేసుకున్న బాల్ టాంపరింగ్ ఉదంతం ఆసీస్ జట్టును ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. అలాంటిది ఆ జట్టు ఆటగాళ్లు టాంపరింగ్ గురించి ఆలోచన చేస్తారని మాత్రం అనుకోలేం. (చదవండి : మావాళ్ల తరఫున సారీ స్మిత్ : కోహ్లి) Whats in the pocket Zampa??? Are Australia upto old tricks again? pic.twitter.com/MPrKlK2bs9 — Peter Shipton (@Shippy1975) June 9, 2019 అది హ్యాండ్ వార్మర్.. ఈ సందేహాలను ఆసీస్ క్యాంప్ నివృత్తి చేసింది. జంపా హ్యాండ్వార్మర్ సాధనాన్ని ఉపయోగిస్తాడని, అతని జేబులో ఉన్నది అదేనని తెలిపారు. ఈ సాధానాన్ని బిగ్‌బాష్ లీగ్‌తో పాటు.. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా అతను ఉపయోగిస్తాడని పేర్కొంది. చల్లని వాతావరణంలో బంతిపై పట్టుచిక్కడం కోసం దాన్ని పదేపదే ఉపయోగిస్తాడని స్పష్టం చేసింది. (చదవండి : కంగారూలను కసిగా...) ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సైతం ఈ వ్యవహారంపై మ్యాచ్ అనంతరం స్పందించాడు. ‘ నేను ఆ ఫొటోలను చూడలేదు. కానీ అతని జేబులో హ్యాండ్ వార్మర్ ఉందని తెలుసు. ప్రతి మ్యాచ్‌లో జంపా దాన్ని ఉపయోగిస్తాడు. ఆ ఫొటోలను చూడలేదు కాబట్టి దానిపై ఎక్కువగా మాట్లాడలేను. కానీ వాస్తవం మాత్రం అతను హ్యాండ్ వార్మర్‌ను ఉపయోగించడం’ అని పేర్కొన్నాడు. గతేడాది నవంబర్‌లో జంపా ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా ఈ తరహా ఫొటోలు, వీడియోలు సందేహాలను రేకెత్తించాయి. కానీ అప్పుడు కూడా అతను హ్యాండ్ వార్మర్ ఉపయోగిస్తాడనే స్పష్టమైంది. -
మరోసారి తండ్రి కాబోతున్న వార్నర్
సిడ్నీ : ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమై 2018 సంవత్సరమంతా చేదు అనుభవాలు ఎదుర్కొన్న ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్‌కు నూతన ఏడాది తీపికబురుతో ప్రారంభమైంది. మరో నాలుగు నెలల్లో నిషేధం పూర్తిచేసుకోని అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయనున్న వార్నర్‌కు అంతకు ముందే శుభవార్త విన్నాడు. తను మరోసారి తండ్రికాబోతున్నట్లు తన భార్య క్యాండిక్ వార్నర్ నోట వచ్చిన తీపి కబురుతో వార్నర్ కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. ఇక వార్నర్ తండ్రికాబోతున్నాడనే విషయాన్ని అతని భార్య క్యాండికే స్వయంగా ట్వీటర్లో పేర్కొంది. ‘ఈ ఏడాదంతా మా వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికి తెలియజేసేది ఏమంటే.. 2019లో మా కుటుంబంలోని నలుగురం కాస్త ఐదుగురు కానున్నాం. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తాను గర్భవతిననే విషయాన్ని ట్వీట్ చేసింది. ఇక వార్నర్ ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలకు తండ్రన్న విషయం తెలిసిందే. ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమైన వార్నర్.. మరో నాలుగు నెలల్లో అతనిపై పడ్డ నిషేదం పూర్తికానుంది. ఇక వార్నర్ పునరాగమం కోసం ఆసీస్ ఆటగాళ్లు, అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు ఈ ఘటనకు పూర్తి కారణం వార్నరే అని వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వార్నర్ ప్రోద్భలంతోనే బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని బాన్‌క్రాప్ట్ పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరి ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. Being together has made us into the family we are today. We are so grateful for all the love and support everyone has shown us this year. It is with a full heart that we would like to share with you that in 2019 our family of 4 will become a family of 5. Happy new year. X pic.twitter.com/pE3EAmR611 — Candice Warner (@CandyFalzon) December 31, 2018 -
ఇప్పుడిది అవసరమా : ఆసీస్ మాజీ క్రికెటర్
మెల్బోర్న్ : ట్యాంపరింగ్ వివాదంతో ఆటకు దూరమైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లపై ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖెల్ క్లార్క్ మండిపడ్డాడు. ఇటీవల ఫాక్స్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు మాట్లాడింది సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం పునరాగమనంపై దృష్టి పెట్టాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని హితవు పలికాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అప్పటి సీఈఓ జేమ్స్ సథర్‌ల్యాండ్, ఫర్ఫామెన్స్ కోచ్ ప్యాట్ హోవర్డ్లను విమర్శించడం, నిందించడంపై కూడా మండిపడ్డాడు. ట్యాంపరింగ్ ఘటనలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకలేదని, అనవసరంగా మాట్లాడుతూ రచ్చచేసుకోవద్దని సూచించాడు. సరైన సమాధానాలు రాబట్టలేనప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు చేయవద్దని పరోక్షంగా వీరిని ఇంటర్వ్యూ చేసిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌కు చురకలంటించాడు. అలాగే తప్పంతా వార్నర్‌పైనే నెట్టేయడం ఏంటని మండిపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్లు ట్యాంపరింగ్ సూత్రదారి వార్నర్ అని చెప్పడంతో అతని పునరాగమనంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే సీఏ సీఈవో కెవిన్ రాబర్ట్స్ మాత్రం.. స్మిత్, బాన్క్రాప్ట్ల వ్యాఖ్యలు వార్నర్ అడ్డుకుంటాయని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఎంపికకు అర్హత సాధించగానే జట్టు ప్రణాళికలో భాగమవ్వడం గురించి అడితో చర్చినట్లు స్పష్టం చేశాడు. ఇక ఇంటర్వ్యూల్లో స్మిత్, బాన్‌క్రాప్ట్‌లు మాట్లాడుతూ.. వార్నర్ ప్రోద్భలంతోనే ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు చెప్పడమే కాకుండా.. గతంలో జట్టు వరుస ఓటములు ఎదుర్కొన్నప్పుడు సథర్ ల్యాండ్, హై ఫర్ఫామెన్స్ కోచ్ ప్యాట్ హోవర్డ్ గెలిచేందుకు డబ్బులిస్తున్నామని, ఆడేందుకు కాదు అని అన్నారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అతను చెప్పడంతోనే ట్యాంపరింగ్ చేశా : బాన్‌క్రాఫ్ట్
సిడ్నీ : ట్యాంపరింగ్ వివాదంతో క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచ క్రికెట్ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టింది. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న ఈ వివాదం ఆస్ట్రేలియా జట్టును కుదిపేసింది. ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను ఏడాది పాటు ఆటకు దూరం చేయగా.. యువ ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు దూరం చేసింది. అయితే ఈ ఘటన సూత్రదారి డేవిడ్ వార్నరేనని అప్పట్లో విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది. కానీ ఇప్పటి వరకు వార్నర్ పాత్రపై ఈ ఆటగాళ్లు నోరు విప్పలేదు. తాజాగా వార్నర్ ప్రోద్భలంతోనే తాను బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించినట్లు ఈ వివాద పాత్రదారి, యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ తొలిసారి మీడియా వేదికగా అంగీకరించాడు. మరో నాలుగు రోజుల్లో బాన్‌క్రాఫ్ట్ తన నిషేధ కాలాన్ని పూర్తి చేసుకోనున్నాడు. డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాష్ టి20 లీగ్‌తో క్రికెట్లోకి పునఃప్రవేశం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో బాన్‌క్రాఫ్ట్ ముచ్చటించాడు. ‘ఆ మ్యాచ్ పరిస్థితుల దృష్ట్యా బంతి ఆకారం దెబ్బతీయమని వార్నర్ నాకు సూచించాడు. అయితే అది మంచి పనా? కాదా? అనే విషయాన్ని గ్రహించలేకపోయాను. ఆ పరిస్థితుల్లో అలా చేయడం సరైందేననిపించింది. కానీ నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన ఈ పని జట్టుపై చాలా ప్రభావం చూపింది.’ అని చెప్పుకొచ్చాడు. తనపై బహిష్కరణ వేటు పడ్డాక తన దృక్పథం పూర్తిగా మారిపోయిందని... ఒక దశలో క్రికెట్ వదిలేసి యోగా టీచర్‌గా మారిపోదామని అనుకున్నానని ఇటీవల బాన్‌క్రాఫ్ట్ తెలిపిన విషయం తెలిసిందే. ఇక స్టీవ్ స్మిత్సైతం ట్యాంపరింగ్‌ను అడ్డుకోకపోవడం కెప్టెన్‌గా తన వైఫల్యమేనని ఇటీవల మీడియా ముందు అంగీకరించాడు. -
ఆటను కుదిపేసిన వివాదాలు!
సాక్షి, వెబ్‌డెస్క్ : నిన్న జరిగింది.. రేపు గుర్తొస్తే జ్ఞాపకం. ఈ ఏడాదంతా జరిగింది ఒక్కరోజు గుర్తుచేసుకుంటే మననం. 365 రోజులు.. ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. ఒక్కో ఘటనకు ఒక్కో విశిష్టత. ఇందులో మంచి ఉంది.. చెడు ఉంది. ఒక్కో ఘటన ఓ గుణపాఠం. మంచి మరిచిపోయినా పర్వాలేదు కానీ చేసిన తప్పును.. దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని మరవద్దు. ఇలా మనదేశంలో ఓ మతంలా ఆరాదించే క్రికెట్లో అంతర్జాతీయంగా 2018లో చోటు చేసుకున్న వివాదాలు.. వాటి పర్యవసనాలపై ఓ లుక్కెద్దాం! 1.బాల్ ట్యాంపరింగ్.. యావత్ క్రీడా ప్రపంచం నివ్వెరపోయిన ఘటన. ప్రపంచ క్రికెట్ ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లను దోషులుగా నిలబెట్టిన సంఘటన. క్రీడాస్పూర్తిని దెబ్బతీసిన ఈ వ్యవహారంతో ఆ ఆటగాళ్లు తమ ఇష్టమైన ఆటకే దూరమయ్యేలా చేసిన వివాదం. చివరకు తాము చేసింది ఘోర తప్పిదమని మీడియా ముందు కన్నీళ్లతో పశ్చాతాపం వ్యక్తం చేసేలా చేసిన అతిపెద్ద వివాదస్పద ఘటన. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ సూచనల మేరకు సాండ్ పేపర్‌తో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం.. దీనికి కెప్టెన్ స్టీవ్ స్మిత్ వత్తాసు పలకడం వివాదానికి దారితీసింది. టీవీ కెమెరాల్లో రికార్డైన ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆసీస్ ఆటగాళ్ల బండారం బయట పడింది. ఈ ఘటనతో కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం పడగా.. యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు ఆటకు దూరం చేసింది. చివరకు ఐపీఎల్ లీగ్‌లో కూడా ఆడకుండా చేసింది. 2018లో చోటు చేసుకున్నఅతిపెద్ద వివాదం బాల్ ట్యాంపరింగే అనడంలో అతిశయోక్తి లేదు. 2. డేవిడ్ వార్నర్-డికాక్‌ల మాటల యుద్దం బాల్ ట్యాంపరింగ్ వివాదానికి కారణమైన ఘటన. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో చోటు చేసుకున్న వాడివేడి వాగ్వాదం. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో టీ బ్రేక్ సమయంలో ప్రొటీస్ ఆటగాడు డికాక్ వ్యక్తిగత దూషణలకు దిగడంతో సహనం కోల్పోయిన వార్నర్ అతనిపై నోరుపారేసుకుంటూ దూసుకెళ్లాడు. ఇది అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డవ్వడంతో వ్యవహారం బయటకు వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ వార్నర్‌కు 75 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు డీమెరిట్ పాయింట్స్ విధించారు. ఈ ఘటనతో ఆ సీరిస్‌లో ఆటగాళ్ల మధ్య మొదలైన మాటల యుద్దం చివరకు బాల్ ట్యాంపరింగ్ వివాదానికి దారితీసింది. 3. స్మిత్‌ను నెట్టేసిన రబడా ఈ ఏడాది అత్యంత వివాదాస్పద ద్వైపాక్షిక సిరీస్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా సిరీసే అని చెప్పాలి. తొలి టెస్ట్‌లో వార్నర్-డికాక్‌ల తిట్టుకోగా.. రెండో టెస్ట్‌లో స్మిత్- కగిసో రబడాలు కలియబడ్డారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ ఔటవ్వడంతో.. అత్యుత్సాహం ప్రదర్శిన రబడా స్మిత్‌కు ఎదురుగా వెళ్తూ భుజంతో ఢీకోట్టి పెవిలియన్ వైపు వెళ్లూ అంటూ సూచించాడు. ఇది వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో రబడాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాచ్ రిఫరీ మూడు డీమెరిట్ పాయింట్లతో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. దీంతో రబడా రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై పశ్చాతాపం వ్యక్తం చేసిన రబడా అప్పీల్‌కు వెళ్లడంతో విచారణ జరిపిన ఐసీసీ డీమెరిట్ పాయింట్లను మూడు నుంచి ఒకటి తగ్గించింది. దీంతో అతను మ్యాచ్లాడెందుకు మార్గం సుగుమమైంది. మ్యాచ్ ఫీజు విషయంలో కూడా 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంపై అప్పట్లో స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. 4. మహ్మద్ షమీపై లైంగిక ఆరోపణలు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ స్త్రీలోలుడని అతని భార్య హసీన్ జహాన్ చేసిన సంచలన ఆరోపణలు అతని కెరీర్‌ను ప్రశ్నార్థకంలో నెట్టాయి. అతను పలువురి అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కొనసాగించాడని, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని మీడియా ముందే బహిరంగంగా ప్రకటించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. చివరకు బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వకుండా పునరాలోచనలో పడేలా చేశాయి. హసీన్ జహాన్ వ్యవహారంతో విచారణ జరిపిన బీసీసీఐ.. షమీ ఎలాంటి తప్పిదం చేయలేదని క్లీన్‌చీట్ ఇచ్చింది. ఇక తనను షమీ మానిసికంగా.. లైంగికంగా వేధించాడని, చంపాలని ప్రయత్నించాడని కూడా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో జహాన్‌ను షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం షమీకి దూరంగా ఉంటున్న జహాన్.. కూతురు పోషణ కోసం భరణం చెల్లించాలని కోర్టులో పోరాడుతోంది. 5. నాగిని డ్యాన్స్ వివాదం.. నిదహాస్ ముక్కోణపు టోర్నీలో నాగిని డ్యాన్స్ వివాదం చర్చనీయాంశమైంది. శ్రీలకం-బంగ్లాదేశ్ ఆటగాళ్లు మైదానంలో గెలిచినప్పుడు నాగిని డ్యాన్స్, వికెట్ తీసినప్పుడు నాదస్వరం ఊదినట్లు హావభావాలు వ్యక్తపరచడం అభిమానులను ఆకట్టుకుంది. కానీ ఇది చివరకు వివాదానికి దారి తీసింది. ఈ టోర్నీలో బంగ్లా-శ్రీలంక మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో షార్ట్ పిచ్ బంతుల వివాదం చోటు చేసుకుంది. చివరి ఓవర్ బంగ్లా గెలవాలంటే 12 పరుగులు చేయాలి. ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌కు వెళ్తారు. క్రీజులో ముస్తఫిజుర్. బౌలర్ ఉదాన. తొలి బంతి భుజం కంటే ఎత్తులో వెళ్లినా ‘నో బాల్’ ఇవ్వలేదేమని మహ్ముదుల్లా అంపైర్లను అడిగాడు. మరోవైపు ఇదే తరహాలో వచ్చిన రెండో బంతిని పుల్ చేయలేకపోయిన ముస్తఫిజుర్ పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. ఈ సమయంలో మైదానంలోకి వచ్చిన బంగ్లా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు నురుల్ శ్రీలంక కెప్టెన్ తిసారా పెరిరాతో వాగ్వాదానికి దిగాడు. అంపైర్లు కలగజేసుకుని సర్ది చెప్పారు. ఈలోగా కెప్టెన్ షకీబ్ సహా బంగ్లా ఆటగాళ్లంతా బౌండరీ దగ్గరకు వచ్చేశారు. షకీబ్ అంపైర్లతోనూ తీవ్ర వాదులాటకు దిగాడు. మైదానం వీడి వచ్చేయాల్సిందిగా తమ బ్యాట్స్‌మెన్‌ను పదేపదే ఆదేశించాడు. అయితే.. బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ శాంతపర్చడంతో మహ్ముదుల్లా తిరిగి బ్యాటింగ్‌కు వెళ్లాడు. మ్యాచ్ ముగిశాక బంగ్లా ఆటగాళ్లు నాగిని డ్యాన్స్‌లతో ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వ్యవహారంలో షకీబ్ అల్ హసన్, రిజర్వ్ ప్లేయర్ నురుల్ హసన్లపై మ్యాచ్ రిఫరీ వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించాడు. 6. దేశం విడిచి వెళ్లిపో కామెంట్.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన ఓ కామెంట్ వివాదానికి దారి తీసింది. నవంబర్ 5న పుట్టిన రోజు సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి భారత క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని సదరు అభిమాని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన విరాట్ .. ‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో.’ అని ఘాటుగా బదులిచ్చాడు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 7. మిథాలీ ఆవేదన.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత సీనియర్ క్రికెటర్, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్, హెడ్ కోచ్ రమేశ్ పవార్ల మధ్య నెలకొన్న వివాదం మహిళా క్రికెట్లో సంచలనం సృష్టించింది. ఈ ఆధిపత్య పోరు చివరకు భారత మహిళలు ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశం కోల్పోయేలా చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్ రమేశ్ పవార్, మాజీ కెప్టెన్, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్ డయానా ఎడుల్జీల హస్తం ఉందని మిథాలీ రాజ్ ఆరోపించడంతో ఈ వివాదం వెలుగు చూసింది. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్‌తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్ రమేశ్ పొవార్ వ్యవహరించారని మిథాలీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తన పట్ల అవమానకర రీతిలో ప్రవర్తించారని ఈ హైదరాబాద్ ప్లేయర్ కన్నీటి పర్యంతమైంది. కాగా, ఓపెనర్‌గా పంపకపోతే ప్రపంచకప్ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని మిథాలీ రాజ్ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో పవర్ తెలపడం మరింత అగ్గి రాజేసింది. అయితే మరొకసారి పొవార్‌నే కోచ్‌గా నియమించాలంటూ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలు కోరడంతో ఆటగాళ్ల మధ్య నెలకొన్న లుకలుకలు బయటపడ్డాయి. బీసీసీఐ మాత్రం పొవార్‌ను తప్పించి కొత్త కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను నియమించింది. 8. ఇషాంత్-రవీంద్ర జడేజా వాగ్వాదం ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్ట్‌లో టీమిండియా ఆటగాళ్లు ఇషాంత్ శర్మ- రవీంద్ర జడేజాలు మైదానంలో గొడవపడటం హాట్ టాపిక్ అయింది. ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో రోజు (సోమవారం) ఆటలో భాగంగా ఫీల్డింగ్ మార్పులో తలెత్తిన వివాదం ఇద్దరి ఆటగాళ్ల మధ్య తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. అయితే వీరి వాగ్వాదాన్ని గమనించిన పేస్ బౌలర్ మహ్మద్ షమీ, డ్రింక్స్ అందివ్వడానికి మైదానంలోకి వచ్చిన కుల్దీప్ యాదవ్‌లు వారికి సర్ధిచెప్పారు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా లేనప్పటికి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. ఈ సందర్భంగా బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ శర్మకి లాంగాన్, లాంగాఫ్‌లో ఫీల్డర్ల కూర్పుపై సలహాలివ్వబోయాడు. దీంతో.. చిర్రెత్తిపోయిన ఇషాంత్ శర్మ అతడిపై నోరుజారాడు. దీంతో.. జడేజా కూడా అదేరీతిలో స్పందించడంతో.. సహనం కోల్పోయిన ఇషాంత్ శర్మ.. అతడిపైకి దూసుకెళ్లాడు. వీరి మాటలు స్టంప్స్‌లో రికార్డవ్వడం.. ఈ దృశ్యాలను సదరు బ్రాడ్‌కాస్టర్ ప్రసారం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అయితే ఈ వ్యవహారం అంత పెద్దది కాదని, ఆటగాళ్ల ఎలాంటి హద్దులు దాటలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. 9. విరాట్ కోహ్లి-టిమ్ పైన్ మాటల యుద్దం పెర్త్ టెస్ట్‌ల్లోనే ఇరు జట్ల కెప్టెన్లు మాటల యుద్దానికి దిగారు. మైదానంలో వీరిద్దరు బాగా దగ్గరకు వచ్చి ఒకరినొకరు ఢీకొట్టుకున్నంత పని చేశారు! ఈ సమయంలో కోహ్లి ‘నేను నిన్నేమీ అనడం లేదు కదా. ఎందుకు ఆ అసహనం’ అని పైన్‌తో అన్నాడు. దాంతో ‘నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు’ అంటూ పైన్ బదులిచ్చాడు! ఈ వ్యవహారంతో అంపైర్ క్రిస్ గాఫ్నీ జోక్యం చేసుకొని మాట్లాడింది చాలు, మీరిద్దరు కెప్టెన్లు అంటూ సర్దిచెప్పాల్సి వచ్చింది. ‘నేనేమీ తిట్టడం లేదు, మాట్లాడటంలో తప్పేమీ లేదంటూ పైన్ చెప్పే ప్రయత్నం చేసినా అంపైర్ మళ్లీ అడ్డుకున్నారు. కోహ్లి ఔటైన తర్వాత కూడా క్రీజ్‌లో ఉన్న విజయ్‌తో ‘అతను నీ కెప్టెన్ అని నాకు తెలుసు. కానీ వ్యక్తిగా నువ్వు కూడా అతడిని ఇష్టపడవు’ అని పైన్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ ఘటనలో ఇరుజట్ల ఆటగాళ్లు హద్దులు దాటలేదని, ఇవి ఆటలో సర్వసాధారణమే అని కొట్టిపారేశారు. కానీ ఆసీస్ మీడియా మాత్రం ఈ ఘటనలో కెప్టెన్ కోహ్లిని విలన్‌గా చూపించే ప్రయత్నం చేసింది. - శివ ఉప్పల -
నిషేధం ఎత్తేసే ముచ్చటే లేదు!
మెలోబోర్న్: ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’అంటోంది క్రికెట్ ఆస్ట్రేలియా. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ప్రసక్తే లేదని మంగళవారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. గత కొంతకాలంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోషియేషన్(ఏసీఏ) ఆ ముగ్గురు క్రికెటర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతోంది. మంగళవారం చైర్మన్ ఎడ్డింగ్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. క్రికెట్‌కు, దేశానికి మాయని మచ్చ తెచ్చిన ఆ క్రికెటర్లను ఉపేక్షించేది లేదని సమావేశం తర్వాత ఎడ్డింగ్స్ పేర్కొన్నారు. (గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన స్టీవ్ స్మిత్) ఇంటా బయట ఓటములతో ఆస్ట్రేలియా గడ్డుకాలాన్ని ఎదుర్కోంటోంది. ఈ తరుణంలో జట్టులో సమతుల్యం దెబ్బతిన్నదని, కీలక టీమిండియా పర్యటన నేపథ్యంలో స్మిత్, వార్నర్‌లపై ఉన్న నిషేధాన్ని సడలించాలని ఏసీఏ కోరుతోంది. అయితే ఆటగాళ్లపై నిషేధాన్ని సడలిస్తే భవిష్యత్ క్రికెట్‌కు మంచిది కాదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఏ ప్రకటించింది. దీనిపై ఏసీఏ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్ పరిస్థితుల కంటే కన్నా వారి పంతమే ముఖ్యమని సీఏ భావిస్తోందని దుయ్యబట్టారు. (అందుకు సిగ్గుపడుతున్నా: వార్నర్) కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధాన్ని విధిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. దీంతో స్మిత్, వార్నర్‌లపై నిషేధం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుండగా, బాన్‌క్రాఫ్ట్ పై నిషేధం జనవరిలో తొలగనుంది. -
అందుకు సిగ్గుపడుతున్నా: వార్నర్
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. ఆ ఉదంతంతో ఇప్పటికీ సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాదిపాటు నిషేధం పడింది. బౌలర్ బెన్ క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అప్పట్నుంచి దేశవాళీ టోర్నీలకు మాత్రమే వీరు పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఇద్దరూ ప్రత్యర్థులుగా ఆస్ట్రేలియాలోని దేశవాళీ టీ20లో తొలిసారిగా ఆడారు. ఈ క్రమంలో వార్నర్ మాట్లాడుతూ.. ‘బాల్ ట్యాంపరింగ్ చర్య నన్నెంతగానో నిరాశకు గురిచేసింది. ఆ చర్యతో సిగ్గుపడుతున్నా. అయితే సీఏ విధించిన ఏడాది సస్పెన్షన్ పూర్తి అయ్యేంత వరకూ శిక్ష అనుభవిస్తాను. అనంతరం తిరిగి వచ్చే ప్రపంచకప్ నాటికల్లా జాతీయ జట్టుకు ఆడటమే నా లక్ష్యం.’ అని చెప్పుకొచ్చాడు. మరొవైపు స్మిత్‌తో తనకు సత్సంబంధాలు లేవనే వార్తలను వార్నర్ ఖండించాడు. వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నాడు. గతంలో తామిద్దరం ఎలా ఉన్నామో, బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత కూడా అలానే ఉన్నామన్నాడు. -
అలిగి మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు!
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్‌తో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్లెడ్జింగ్‌తో మరోసారి అసహనానికి గురయ్యాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఇదే స్లెడ్జింగ్‌కు బలైన వార్నర్ 12 నెలల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సిడ్నీగ్రేడ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లు స్లెడ్జింగ్ పాల్పడటంతో చికాకు గురైన వార్నర్ అసహనంతో మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు. అనంతరం తన సహచర ఆటగాళ్లు బతిమాలడంతో తిరుగొచ్చి సెంచరీ బాదాడు. గత శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌కు పాల్పడింది బౌన్సర్ తగిలి మరణించిన ఫిలిఫ్ హ్యూస్ సోదరుడు జాసన్ హ్యూస్‌గా ఆసీస్ మీడియా గుర్తించింది. అతడు డేవిడ్ వార్నర్‌ను అవమానించడాన్ని.. దీంతో అసహనం వ్యక్తం చేసిన వార్నర్ ఏం మాట్లాడకుండా మైదానం వీడాడని పేర్కొంది. ఇక వార్నర్ చర్య పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వార్నర్‌కు మద్దతిస్తుండగా.. మరికొందరు అతని చర్యను తప్పుబడుతున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఉదంతం.. వార్నర్‌తో పాటు స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం పడేటట్లు చేసిన విషయం తెలిసిందే. -
క్రికెట్లో కొత్త నియమాలు.!
దుబాయ్: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని సవరించడంతో పాటు కోడ్ ఆఫ్ కండక్ట్, ఐసీసీ ప్లేయింగ్ నిబంధనల్లోని మార్పులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) శనివారం విడుదల చేసింది. వివాదాస్పదంగా మారిన డక్‌వర్త్ లూయిస్(డీఎల్ఎస్) పద్దతి నిబంధనలను సవరించింది. ఇక బాల్ టాంపరింగ్ సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మారిన ఈ నిబంధనలు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాగా జింబాబ్వేతో సౌతాఫ్రికా తలపడే తొలి వన్డే కొత్త నిబంధనలతో ఆడే తొలి మ్యాచ్‌గా నిలువనుంది. ఐసీసీ 2014లో డీఎల్ఎస్ నూతన పద్దతిని ప్రవేశపెట్టింది. ఈ పద్దతి ప్రకారం బంతి, బంతికి వచ్చే పరుగులతో పవర్ ప్లేను పరిగణలోకి తీసుకొని విశ్లేషించి లిమిటెడ్ ఫార్మాట్లో విజేతను ప్రకటించేవారు. అయితే ప్రస్తుతం వన్డే, టీ20ల్లో బ్యాట్స్‌మెన్ చేసే పరుగుల సగటు మారిందని, ఈ నేపథ్యంతో ఈ పద్దతిని కొంత మార్చినట్లు ఐసీసీ పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బంతి ఆకారం మార్చడాన్ని (బాల్ ట్యాంపరింగ్) ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 3 నేరంగా పరిగణిస్తారు. ఏ ఆటగాడైనా బాల్ టాంపరింగ్‌కు పాల్పడితే అతనికి పెనాల్టీ కింద గతంలో 8 సస్పెన్షన్ పాయింట్లు విధించేవారు. దీనిని 12 సస్పెన్షన్ పాయింట్లకు పెంచుతూ ఐసీసీ నిబంధనలు మార్చింది. 12 సస్పెన్షన్ పాయింట్లంటే 6 టెస్టులు లేదా 12 వన్డేల నిషేదంతో సమానం.ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బెన్క్రాఫ్ట్ల బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఐసీసీ ఈ నిబంధనల సవరణకు పూనుకుంది. బాల్ టాంపరింగ్‌ను తీవ్ర నేరంగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వ్యక్తిగత దూషణకు దిగితే లెవల్ 1 నేరంగా పరిగణిస్తూ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు. -
ట్యాంపరింగ్‌తో సంబంధం లేదు: ఆసీస్ ఆటగాడు
సిడ్నీ : దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదం యావత్ క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు పీటర్ హ్యాండ్స్కాంబ్. గత మార్చిలో సఫారీతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ సాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసి కెమెరాలకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో హ్యాండ్స్‌కాంబ్‌కు సంబంధం ఉందని ప్రచారం జరిగింది. అప్పటి కోచ్ డారెన్ లీమన్ సూచనల మేరకు హ్యాండ్స్కాంబ్ బాన్‌క్రాఫ్ట్‌ను అప్రమత్తం చేశాడని ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. తాజాగా ఈ ఆరోపణలను హ్యాండ్స్కాంబ్ ఖండించాడు. ఆ వీడియో ఎడిట్ చేసిందని, ఆ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నాడు. ఆ వీడియోలో ఏముందంటే.. బాన్‌క్రాఫ్ట్ సాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండగా.. అది కెమెరాల్లో స్పష్టమైంది. దీన్నిగమనించిన కోచ్ లీమన్ వాకీటాకీ ద్వారా హ్యాండ్స్‌కాంబ్‌కు తెలియజేశాడు. దీంతో అతను నవ్వుతూ.. ఎదో మాట్లాడుతున్నట్లు చేస్తూ బాన్‌క్రాఫ్ట్‌ను హెచ్చరించగా.. అతను సాండ్‌పేపర్‌ను లోదుస్తుల్లో దాచాడు. అయితే తను ఎలాంటి హెచ్చరికలు చేయలేదని, అతన్ని అప్రమత్తం కూడాచేయలేదని, ఓ జోక్ వేసనంతేనని హ్యాండ్స్కాంబ్ స్పష్టం చేశాడు. ఇక ఈ వివాదంతో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డెవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేదం విధించగా.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
భారత్‌కు మున్ముందు ముప్పే!
సాక్షి, న్యూఢిల్లీ : క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ చేయడం తన దృష్టిలో మోసం కాదని, అది ఆటలో భాగమేనని మాజీ పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం, ప్రస్తుతం పాక్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయం. ఈ విషయాన్ని ఆయన 1994లో విడుదల చేసిన తన జీవిత చరిత్ర పుస్తకంలో, ఆ తర్వాత కొన్ని రోజులకే ‘ఛానల్–4’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తాను కూడా బాల్ ట్యాంపరింగ్ చేసినట్టు అంగీకరించారు. ఇప్పుడు పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పాక్ సైన్యం తనకు సహకరించడం తప్పుకాదని, అది బాల్ ట్యాంపరింగ్ లాంటిదేనని ఆయన భావిస్తున్నారు. పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య సమతౌల్యతను కాపాడుతానని ప్రమాణం చేయడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పాక్ సైనిక మద్దతును సమకూర్చున్నట్లు తెలుస్తోంది. తీవ్రవాద శక్తులు కూడా ఆయనకు మద్దతిస్తున్న విషయం తెల్సిందే. ముంబైలో జరిగిన 26–11 దాడుల్లో హఫీద్ సయీద్, లఖ్వీ లాంటి టెర్రరిస్టుల హస్తం ఉందని మొట్టమొదట ధ్రువీకరించినది కూడా ఇమ్రాన్ ఖానే. 1996లోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అనేక పరాజయాల అనంతరం పార్టీ తరఫున ఇప్పటి వరకు ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ప్రధాని స్థాయి అభ్యర్థిగా ఎదగడం దేశీయ, అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే భారత్‌కు మున్ముందు పాక్‌తో ముప్పుందనే విషయం అర్థం అవుతుంది. 1988 నుంచి పాక్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పాక్ సైన్యం గుప్పిట్లోనే బేనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ ప్రభుత్వాలు పనిచేశాయి. వీరిద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు పాక్ సైన్యంతో కలిసి కుట్ర పన్నడం ద్వారా ప్రభుత్వాలను పడగొట్టుకున్నారు. మొదటి నుంచి ఇప్పటి వరకు పాక్ విదేశాంగ విధానాన్ని, రక్షణ విధానాన్ని నిర్దేశిస్తున్న పాక్ సైన్యానికి 2011 నుంచి పౌర ప్రభుత్వంతో విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, సైన్యం సలహాలను తీసుకోకుండా అప్పటికి పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నవాజ్ షరీఫ్ పార్టీ సహకారంతో రాజ్యాంగ సవరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రాల అధికారాలను సడలించిన సంస్కరణలు కూడా వాటిలో ఉన్నాయి. 2013లో జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. నాటి నుంచి ఆయన భారత్‌తో శాంతియుత సంబంధాలను కోరుతూ విదేశాంగ విధానాన్ని తన ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. దానికి సైన్యం (ఐఎస్ఐ సహా) ససేమిరా అంటూ వచ్చింది. మెల్లగా ఇమ్రాన్ ఖాన్‌తో చేతులు కలపడం ప్రారంభించింది. ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఇమ్రాన్ ఖాన్ బహిరంగ సభలకు జనం రావడం ప్రారంభం కావడానికి కారణం ఐఎస్ఐ శక్తులే అన్న వాదన వచ్చింది. ఐఎస్ఐయే జనాన్ని సమీకరించిందనడానికి ఐఎస్ఐతో అంటకాగిన రాజకీయ నాయకుల్లో 90 శాతం మంది ఇమ్రాన్ ఖాన్ పార్టీలో చేరడమే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలవడం పాక్ సైన్యం మొదటి ప్రాధాన్యత కాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడాలనే పాక్ సైన్యం కోరుకుంటోందని, రెండో ప్రాథమ్యం మాత్రమే ఇమ్రాన్ ఖాన్ పార్టీ విజయమని ఇస్లామాబాద్ మాజీ భారత హైకమిషనర్ శరద్ సభర్వాల్ అన్నారు. హంగ్ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని కార్యాలయం పూర్తిగా తమ గుప్పిట్లోనే ఉంటుందన్నది పాక్ సైన్యం అభిప్రాయమని, ఇందులో ఏది జరిగిన భారత్‌కు ప్రతికూలమైన పరిణామమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధం చేస్తే భారత్‌తో గెలవలేమని పాక్ సైన్యానికి తెలుసు. టెర్రరిస్టు శక్తులతో భారత్‌లో, ముఖ్యంగా కశ్మీర్లో కల్లోలం సష్టించేందుకే ప్రయత్నిస్తుంది. -
షకీబ్ అవుట్... స్మిత్ ఇన్
కాన్బెర్రా : బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఏడాది పాటు దూరమైన విషయం తెలిసిందే. ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కొనసాగుతుండగానే.. గ్లోబల్ టీ20(కెనడా) లీగ్‌లో టొరంటో నేషనల్స్ తరపున బరిలోకి దిగాడు. నిషేధం తర్వాత తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టిన స్మిత్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు కూడా. ఈ నేపథ్యంలో మరో టీ20 లీగ్‌లోనూ సత్తా చాటేందుకు స్మిత్ సిద్ధమయ్యాడు. ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో బార్బడోస్ ట్రెడెంట్స్కు స్మిత్ ప్రాతినిథ్యం వహించనున్నట్లు సదరు ఫ్రాంచైజీ తెలిపింది. షకీబ్ స్థానంలో స్మిత్.. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరమవడంతో అతని స్థానంలో స్మిత్‌ను తుది జట్టులోకి ఎంపిక చేసినట్లు ట్రెడెంట్స్ జట్టు కోచ్ రాబిన్ సింగ్ తెలిపాడు. స్మిత్ రాకతో బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుందని, వరల్డ్ క్లాస్ క్రికెటర్ తమ జట్టులోకి రావడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించాడు. ట్రెడెంట్స్ జట్టు విజయాల్లో స్మిత్ కీలక పాత్ర పోషిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ట్రెడెంట్స్ జట్టు ఆగస్టు 12న గయానా అమెజాన్ వారియర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. -
సొంతగడ్డపై వార్నర్ తొలిసారి!
డార్విన్: బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆసీస్ డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు లీగ్ మ్యాచ్‌ల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్‌లో వార్నర్ ఆడగా, తాజాగా ఆస్ట్రేలియాలో డార్విన్స్ లిమిటెడ్ ఓవర్స్ స్ట్రైక్ లీగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ లీగ్‌లో సిటీ సైక్లోన్ తరపున వార్నర్ ఆడుతున్నాడు. దీనిలో భాగంగా నార్త్రన్ టైడ్ జరిగిన మ్యాచ్‌లో 36 పరుగులతో వార్నర్ ఫర్వాలేదనిపించాడు. కొన్నినెలల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వార్నర్, స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లు ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని నిషేధానికి గురయ్యారు. వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై ఏడాది పాటు అంతర్జాతీయ నిషేధం విధించగా, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం పడింది. అయితే దేశవాళీ లీగ్‌ల్లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అనుమతి ఇచ్చిన క్రమంలో ఈ త్రయం లీగ్‌ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత వార్నర్ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి. అంతకుముందు కెనడా గ్లోబల్ టీ20లో ఆడిన వార్నర్.. ఇప్పుడు స్వదేశంలో జరిగే పరిమిత ఓవర్ల లీగ్‌ల్లో సైతం ఆడేందుకు మొగ్గుచూపుతున్నాడు. -
‘వార్నర్ లేడని నా పిల్లలు ఏడ్చారు’
హైదరాబాద్ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ప్రపంచ క్రికెట్‌ను కలవరపాటుకు గురిచేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనతో ఆస్ట్రేలియా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డెవిడ్ వార్నర్, యువ ఆటగాడు బాన్ క్రాఫ్ట్‌లపై ఆ దేశ క్రికెట్ బోర్డు నిషేదం విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిషేదంతో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌కు సైతం స్మిత్, వార్నర్‌లు దూరమయ్యారు. వీరి గైర్హాజరితో భారత అభిమానులు చాలా బాధపడ్డారు. ముఖ్యంగా హైదరాబాదీలు వార్నర్ జట్టులో లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అభిమానులే కాదు తన పిల్లులు సైతం కంటతడి పెట్టారని టీమిండియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ప్రముఖ హోస్ట్ గౌరవ్ కపూర్ ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్’ షోలో పాల్గొన్న లక్ష్మణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘వార్నర్ ఈ సీజన్ ఐపీఎల్ ఆడటం లేదనే విషయం తెలుసుకొని నా పిల్లలు సర్వజిత్, అచింత్యాలు చాలా బాధపడ్డారు. వారు వార్నర్‌ను అభిమానిస్తారు. సన్‌రైజర్స్‌కు ఆడటానికి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారికి వార్నర్‌తో గట్టి బంధం ఏర్పడింది. అతను జట్టులో ఎంత కీలకమో వారికి తెలుసు. ట్యాంపరింగ్ వివాదాన్ని టీవీల్లో చూసి.. తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కూడా వారు చాలా బాధపడ్డారు.’ అని చెప్పుకొచ్చారు. వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు పగ్గాలు చేపట్టి.. ఫైనల్‌కు చేర్చిన విషయం తెలిసిందే. ఇక వార్నర్ 2016 ఐపీఎల్ సీజన్లో బ్యాటింగ్‌లో, కెప్టెన్‌గా రాణించి సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించాడు. -
ఐసీసీ రూల్స్.. చూయింగ్ గమ్ మాటేంటి?
కేప్‌టౌన్: బాల్ ట్యాంపరింగ్ పాల్పడే క్రికెటర్ల పట్ల కఠినంగా వ్యవహరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కొత్త రూల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ తప్పిదానికి పాల్పడే వారు కనిష్టంగా ఆరు టెస్టులు లేదా 12 వన్డేల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే 12 సస్పెన్షన్ పాయింట్లనూ విధిస్తూ ఐసీసీ నిబంధనల్ని సవరించింది. అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతున్నాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. ‘ ట్యాంపరింగ్ పాల్పడే వారి పట్ల రూల్స్‌ను కఠినతరం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. బాల్ ట్యాంపరింగ్ కొత్త రూల్స్‌పై నాకు ఇంకా క్లియరెన్స్ లేదు. జట్టు సభ్యులు గ్రౌండ్లోకి వెళ్లేటప్పుడు ఏమి తీసుకెళ్లాలి.. ఏది తీసుకెళ్లకూడదు అనే దానిపై ఏమీ చెప్పలేదు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్రికెటర్లు చూయింగ్ గమ్ నమలడానికి అనుమతి ఉందా? లేదా చెప్పండి’ అని డుప్లెసిస్ డిమాండ్ చేశాడు. దీనిపై మరొక దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా స్పందిస్తూ.. ‘నాకు ఫీల్డ్‌లో మింట్స్ను నమలడం అలవాటు. ఎక్కువ సేపు మైదానంలో ఉన్న సమయంలో వాటిని తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదనే అనుకుంటున్నా. దీనిపై నాకు కూడా క్లారిటీ కావాలి’ అని ప్రశ్నించాడు. -
ట్యాంపరింగ్‌కు 6 టెస్టుల నిషేధం
దుబాయ్: మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేస్తే ఇకపై క్రికెటర్లు భారీ శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా సమావేశంలో ట్యాంపరింగ్‌కు శిక్షలు కఠినం చేయాలని నిర్ణయించారు. ఇకపై ట్యాంపరింగ్‌కు పాల్పడితే 6 టెస్టు మ్యాచ్‌లు లేదా 12 వన్డేల నిషేధం పడుతుంది. గత మార్చిలో కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆసీస్ ఆటగాళ్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ ట్యాంపరింగ్‌కు పాల్పడి పట్టుబడిన నేపథ్యంలో అనిల్ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్ కమిటీ శిక్షల స్థాయిని పెంచాలని ప్రతిపాదించింది. మోసానికి పాల్పడటం, వ్యక్తిగత దూషణ, బూతులు వాడటం, అంపైర్ నిర్ణయాన్ని ధిక్కరించడంవంటి నాలుగు కొత్త అంశాలను ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ (క్రమశిక్షణా నియమావళి)లో చేర్చి వాటికి కూడా శిక్షలు విధించాలని నిర్ణయించారు. -
ఇక బాల్ ట్యాంపరింగ్ చేస్తే అంతే..
డబ్లిన్: ఇక నుంచి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయించింది. ఈ తప్పిదానికి పాల్పడే వారు కనిష్టంగా ఆరు టెస్టులు లేదా 12 వన్డేల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే 12 సస్పెన్షన్ పాయింట్లనూ విధిస్తారు. గతంలో ఈ తప్పిదం చేసిన వారిపై ఒక టెస్ట్, రెండు వన్డేల నిషేధం విధించేవారు. అంతేకాదు కొత్త ప్రవర్తనా నిబంధనావళిలో ఈ తప్పిదాన్ని లెవెల్-3కి పెంచారు. ఈమేరకు డబ్లిన్‌లో సోమవారం ముగిసిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాలతో క్రికెట్లో మరింత పారదర్శకత వస్తుందని ఆశిస్తున్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి సుదీర్ఘ కాలం నిషేధానికి గురి కాగా, ఇటీవల శ్రీలంక క్రికెటర్ చండిమాల్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఒక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. -
వారిని కఠినంగా శిక్షిస్తేనే..: డుప్లెసిస్
కేప్‌టౌన్: ఇక నుంచి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో బాల్ ట్యాంపరింగ్ ఉదంతాలు తరుచు వెలుగు చూడటంతో డుప్లెసిస్ స్పందించాడు. బాల్ ట్యాంపరింగ్ పాల్పడే వారి కోసం ప్రస్తుతం అవలంభిస్తున్న నిబంధనల్ని కఠినతరం చేయాలన్నాడు. ‘బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తే మంచిది. ప్రస్తుతం ఉన్న విధానంతో ఎటువంటి ఉపయోగం కనబడటం లేదు. అవి తరచు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఐసీసీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి పదునుపెట్టాలి. బాల్ ట్యాంపరింగ్‌కు చెక్ పెట్టాలంటే జరిమానా అనేది పరుషంగా ఉండాల్సిందే. అప్పుడే బాల్ ట్యాంపరింగ్ ఫుల్స్టాప్ పడుతుంది’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు. మరికొద్ది రోజుల్లో శ్రీలంకతో సుదీర్ఘ పర్యటనకు సిద్దమవుతున్న తరుణంలో డుప్లెసిస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల శ్రీలంక కెప్టెన్ చండిమాల్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఒక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే ట్యాంపరింగ్‌కు కారణమైన ప్రతీ ఒక్కరికీ ఒక నిబంధన ఉండేలా చూడాలని డుప్లెసిస్ సూచించాడు. ఐసీసీ నిబంధనల్లో క్లారిటీతో పాటు నిలకడ ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ఇక్కడ కఠినమైన శిక్షలు పడితేనే బాల్ ట్యాంపరింగ్ ఉదంతాలకు చరమగీతం పాడే అవకాశం ఉందన్నాడు. -
ఘనం... స్మిత్ పునరాగమనం
టొరంటో: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌కు ఏడాది పాటు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ గ్లోబల్ టి20 లీగ్‌లో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఒకవైపు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కొనసాగుతుండగా... మరోవైపు ఈ లీగ్‌లో బరిలోకి దిగిన అతను ఆడిన తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. టొరంటో నేషనల్స్ తరఫున ఆడిన స్మిత్ (41 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరిశాడు. అతనితోపాటు ఆంటోన్ డేవ్‌సిచ్ (44 బంతుల్లో 92 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్ ఆరు వికెట్ల తేడాతో వాంకోవర్ నైట్స్‌పై విజయం సాధించింది. మొదట వాంకొవర్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. ఎవిన్ లూయిస్ (55 బంతుల్లో 96; 5 ఫోర్లు, 10 సిక్స్‌లు), రసెల్ (20 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అదరగొట్టారు. అనంతరం టొరంటో నేషనల్స్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి గెలిచింది. -
4 గంటల విచారణ.. చండిమాల్‌కు చుక్కెదురు
గ్రాస్ ఐలెట్: తనపై విధించిన టెస్టు మ్యాచ్ సస్పెన్షన్‌ను సవాల్ చేసిన శ్రీలంక క్రికెట్ కెప్టెన్ చండిమాల్‌కు చుక్కెదురైంది. ఈ మేరకు మిచెల్ బెలాఫ్ నేతృత్వలోని ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిషన్.. చండిమాల్ అప్పీల్‌ను కొట్టేసింది. శుక్రవారం నాలుగు గంటల పాటు చండిమాల్‌ను విచారించిన తర్వాత సదరు జ్యుడిషియల్ కమిషన్ అతని అప్పీల్లో ఎటువంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. దాంతో చండిమాల్‌కు మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజులో వంద శాతం జరిమానా యథావిధిగా అమలవుతుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. చండిమాల్ సస్పెన్షన్‌పై ఎటువంటి మార్పు లేకపోవడంతో వెస్టిండీస్‌తో జరుగనున్న చివరిదైన మూడో టెస్టుకు అతను దూరం కానున్నాడు. విండీస్‌తో రెండో టెస్టులో భాగంగా చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అతను నోటిలో ఏదో పదార్థాన్ని వేసుకొని నమిలి దాని ద్వారా ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు.. ఇదంతా వీడియో ఫూటేజీలో పరిశీలించిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్లు’ రిఫరీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారమే అతనిపై అభియోగాలు మోపి నిర్ధారించుకున్న తర్వాతే ఒక టెస్టు సస్పెన్షన్ విధించినట్లు వివరించారు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని వాదించిన చండిమాల్.. రిఫరీ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లాడు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిషన్.. చండిమాల్ అప్పీల్‌ను తిరస్కరించింది. కెప్టెన్‌గా లక్మల్.. ట్యాంపరింగ్ కారణంగా లంక రెగ్యులర్ కెప్టెన్ చండిమాల్ విండీస్‌తో మూడో టెస్టుకు దూరం కానున్న నేపథ్యంలో అతని స్థానంలో లక్మల్‌ను సారథిగా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మూడో టెస్ట మ్యాచ్‌కు లక్మల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయాన్ని ఎస్ఎల్సీ ఓ ప్రకటనలో తెలిపింది. విండీస్‌తో టెస్టు మ్యాచ్‌కు వెటరన్ రంగనా హెరాత్‌ను కెప్టెన్‌గా నియమించాలని ఎస్ఎల్సీ తొలుత భావించినా, అతను గాయం కారణంగా ఆఖరి టెస్టులో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దాంతో చండిమాల్ స్థానంలో సీమర్ లక్మల్‌ను కెప్టెన్‌గా నియమించారు. -
సస్పెన్షన్‌పై చండిమాల్ అప్పీల్
గ్రాస్ ఐలెట్: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్‌పై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు చండిమాల్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పడింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో చండిమాల్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో అతనిపై టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో అతను వెస్టిండీస్‌తో మూడో టెస్టుకు దూరం కానున్నాడు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి చండిమాల్ అప్పీలు చేశాడు. బంతి ఆకారాన్ని మార్చేందుకు తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదంటూ తనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు. చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అతను నోటిలో ఏదో పదార్థాన్ని వేసుకొని నమిలి దాని ద్వారా ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు.. ఇదంతా వీడియో ఫూటేజీలో పరిశీలించిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్లు’ రిఫరీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారమే అతనిపై అభియోగాలు మోపి నిర్ధారించుకున్న తర్వాతే ఒక టెస్టు సస్పెన్షన్ విధించినట్లు వివరించారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ కూడా మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్నే సమర్థించారు. రిఫరీ అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో చండిమాల్ ఐసీసీకి అప్పీలు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండొకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బాల్ ట్యాంపరింగ్; మరో క్రికెటర్‌పై నిషేధం
దుబాయ్ : బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలంక జట్టుకు ‘ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్’(ఐసీసీ) గట్టి షాక్ ఇచ్చింది. శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్‌పై ఐసీసీ ఒక టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. దీంతో వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్టు సిరీస్ చివరి మ్యాచ్‌కు చండిమాల్ దూరం కానున్నాడు. గత శనివారం సెయింట్ లూసియా టెస్టు మ్యాచ్‌లో భాగంగా శ్రీలంక జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్‌లో చండీమాల్ బాల్ కండీషన్ మార్చడానికి ప్రయత్నించాడనే ఆరోపణల ఎదుర్కొన్నాడు. దాంతో వీడియో ఫుటేజీ ఆధారంగా ఈ విషయాన్ని పరిశీలించిన ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను చండిమాల్ అతిక్రమించాడని నిర్ధారించి ఈ చర్యలు తీసుకుంది. -
చండిమల్‌పై ‘ట్యాంపరింగ్’ అభియోగం
సెయింట్ లూసియా: మళ్లీ ‘బాల్ ట్యాంపరింగ్’ కలకలం చెలరేగింది. ఈసారి వెస్టిండీస్ గడ్డపై శ్రీలంక బంతి ఆకారాన్ని మార్చినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్విట్టర్లో స్పందించింది. లంక కెప్టెన్ చండిమల్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని అతిక్రమించాడని, లెవెల్ 2.2.9 ప్రకారం అతనిపై ‘బాల్ ట్యాంపరింగ్’ అభియోగం మోపుతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (రెండో రోజు ఆట) చివరి సెషన్లో చండిమల్ తన ఎడమ జేబులోంచి స్వీట్ ముక్కల్ని తీసి బంతిపై అదేపనిగా అదిమిపెట్టి రాసినట్లు వీడియో ఫుటేజ్‌లో కనబడినట్లు ఐసీసీ తెలిపింది. మరోవైపు చండిమల్ మాత్రం తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశాడు. ఇకపై కఠిన వైఖరి: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడితే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీ సూచనప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెలలో జరిగే వార్షిక సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇలాంటి అతిక్రమణలపై లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి మార్చి చర్యలు చేపట్టనుంది. అతిక్రమణ లెవెల్ 3కి చేరితే ఆటగాడిపై ఏకంగా నాలుగు టెస్టులు, లేదంటే 8 వన్డేల నిషేధం విధిస్తారు. లంకను ఆదుకున్న మెండిస్ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంకను కుశాల్ మెండిస్ (85 బ్యాటింగ్) ఆదుకున్నాడు. 34/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక ఒక దశలో 48 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మెండిస్, కెప్టెన్ చండిమల్ (39) ఐదో వికెట్‌కు 117 పరుగులు జోడించి పరిస్థితి చక్కదిద్దారు. కడపటి వార్తలందేసరికి శ్రీలంక 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. -
శ్రీలంకపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు!
సెయింట్ లూసియా: ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్ ఉదంతం యావత్ క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ మరోసారి చర్చనీయాంశమైంది. శ్రీలంక జట్టుపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు రావడంతో ఆ జట్టు ఆగ్రహంతో మూడో రోజు మైదానంలోకి వచ్చేందుకు నిరాకరించింది. ఇలా లంక ఆటగాళ్లు నిరసన వ్యక్తం చేయడంతో ఆట రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. తమ ఆటగాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని టీమ్ మేనేజ్మెంట్ తమకు వివరించిందని శ్రీలంక బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. వీడియో ఫుటేజిని పరిశీలించిన తరువాత ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగిందా లేదా అనేది తేల్చాల్సి ఉంది. అసలేం జరిగిందంటే.. రెండో రోజు ఆట ముగిసే దశలో బంతి ఆకారం మారిందని సందేహించిన ఫీల్డు అంపైర్లు అలీమ్ దార్, ఇయాన్ గౌల్డ్ మూడో రోజు బంతిని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆటకు ముందే లంక కెప్టెన్ చండిమాల్‌కు చెప్పారు. దీంతో లంక జట్టు మైదానంలోకి దిగేందుకు ససేమిరా అనడంతో వివాదమైంది. ఈ దశలో మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్... లంక కోచ్ హతురుసింఘా, మేనేజర్ గురుసిన్హాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక ఎట్టకేలకు లంకేయులు ఆడేందుకు సిద్ధమయ్యారు. లంక బౌలింగ్ సందర్భంగా బంతి ఆకారం దెబ్బతిన్నందుకు అంపైర్లు విండీస్‌కు ఐదు పెనాల్టీ పరుగులిచ్చారు. దీంతో లంకేయులు మరోసారి మ్యాచ్ ఆడేందుకు నిరాకరించారు. మళ్లీ శ్రీనాథ్ జోక్యం చేసుకొని మ్యాచ్ జరిగేలా చూశారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 253 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 300 పరుగులు సాధించింది. మూడో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 34/1తో ఉంది. -
మా పరువు తీసేశారు : క్రికెటర్ ఆవేదన
సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం విషయంలో మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ తీరును ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తప్పుపట్టాడు. ఎలాగో ట్యాంపరింగ్ జరిగిపోయిందని, అప్పుడైనా తమ తప్పును స్మిత్, అందుకు సహకరించిన ఆసీస్ క్రికెటర్లు ఒప్పుకోక పోవడం దారుణమన్నాడు. ఈ కారణంగా ఆసీస్ జట్టును, ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లైన నన్ను, హజెల్‌వుడ్, నాథన్ లయన్ లాంటి ప్లేయర్లు ట్యాంపరింగ్‌కు కారకులుగా భావించారని తెలిపాడు. వివాదం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న స్టీవ్‌స్మిత్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు నిజాలు చెప్పి ఉంటే జట్టుకు కూడా మంచి జరిగేదన్నాడు. కానీ తప్పిదం చేసిన వారితో పాటు జట్టు మొత్తానికి కళంకం అంటించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్పొరేట్ అడ్వైజర్ సూ కెటో సలహా ప్రకారం స్మిత్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని.. కొన్ని వాస్తవాలు మాత్రమే వెల్లడించాడని పేర్కొన్నాడు. జట్టుతో పాటు మరో వర్గం కలిసి కొన్ని నిజాలు దాచిపెట్టడంతో అంతా నాశనమైందన్నాడు. ఇతర క్రికెటర్ల పేరు, ప్రఖ్యాతలు మంటకలిసిపోతాయని ఎందుకు ఆలోచించలేదంటూ స్మిత్, అతడి మద్దతుదారులను ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ప్రశ్నించాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాపరింగ్‌కు యత్నించి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న బోర్డు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించగా, ట్యాంపరింగ్‌కు యత్నించిన బాన్‌క్రాఫ్ట్‌ను 9 నెలలు నిషేధించారు. -
స్టీవ్ స్మిత్ గొప్ప నిర్ణయం
సిడ్నీ : బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన మంచితనాన్ని చాటుకున్నాడు. నిషేదం ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్‌తో పాటు స్మిత్ కెనడా టీ20 లీగ్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ లీగ్ ద్వారా తాను ఆర్జించే మొత్తాన్ని క్రికెట్ ప్రచారా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్లు ఈ ఆసీస్ మాజీ సారథి ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఆ కథనం మేరకు స్మిత్ విరాళాలను ఆస్ట్రేలియా, కెనడాలోని క్రికెట్ ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమ్యే ఈ లీగ్‌లో స్మిత్ పాల్గొంటాడని ఇప్పటికే నిర్వాహకులు సైతం స్పష్టం చేశారు. లీగ్ ఒప్పందం ప్రకారం స్మిత్ కెనడాలో శిక్షణా క్యాంపులకు హాజరవ్వడమే కాకుండా ఆ దేశ క్రీడల కోసం నిర్వహించే ప్రచారకార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటుండగా.. కెనడా పట్టణాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఆరో జట్టు క్రికెట్ వెస్టిండీస్ తరుపున బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆసీస్ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సూత్రదారి అయిన డేవిడ్ వార్నర్, జట్టు వ్యూహమని చెప్పిన స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేదం విధిస్తూ చర్యలు తీసుకుంది. చదవండి: మళ్లీ బ్యాట్ పట్టనున్న స్టీవ్ స్మిత్ -
వారి శిక్షలు చాలా దారుణం : వాట్సన్
దుబాయ్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లపై విధించిన శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని ఆ జట్టు మాజీ ఆటగాడు, ఐపీఎల్ ఫైనల్ హీరో షేన్‌వాట్సన్ అభిప్రాపడ్డాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఆసీస్ యువ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సూత్రదారైన డేవిడ్ వార్నర్, ఇది జట్టు వ్యూహమే అని తెలిపిన స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్‌కు 9 నెలలు, వార్నర్, స్మిత్‌లను ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధిస్తూ శిక్షలు ఖరారు చేసింది. అంతేకాకుండా వార్నర్ ఎప్పటికి కెప్టెన్ కాలేడని ప్రకటించింది. దీంతో స్మిత్, వార్నర్‌లు ఈ సీజన్ ఐపీఎల్‌కు సైతం దూరమయ్యారు. దుబాయ్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన వాట్సన్ బాల్‌ట్యాంపరింగ్ ఉదంతపై స్పందిస్తూ.. ‘‘గతంలో పలువురు ఆటగాళ్లకు విధించిన శిక్షలతో పోలిస్తే.. ఇవి చాలా దారుణమైన శిక్షలు. ఇప్పటికే వాళ్లు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్లు మళ్లి తిరిగొచ్చే సమయానికి మరింత దృఢంగా తయారవుతారు. వారు చేసిన తప్పులే వారిని అలా తయారు చేస్తాయి. వారు చేసింది పెద్ద నేరమే. కాదనడం లేదు. ఈ వివాదం నుంచి ఆస్ట్రేలియా జట్టు కోలుకునేలా చేసే సత్తా కొత్త కోచ్ జస్టిన్ లాంగర్‌కు ఉంది. అతనే సరైనవాడు.’ అని వాట్సన్ తెలిపాడు. ఐపీఎల్-11 సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్ సెంచరీతో రాణించి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ అందుకోవడం కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శిక్షలు మరి ఎక్కువగా ఉన్నాయని గతంలో భారత క్రికెటర్లతో సహా ఆసీస్ మాజీ క్రికెటర్లు సైతం ఈ ఆటగాళ్లపై సానుభూతి వ్యక్తం చేశారు. -
వార్నర్ స్థానం భర్తీ చేయలేనిది
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ లేని లోటు పూడ్చలేనిదని ప్రస్తుత సారథి కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. అలెక్స్ హేల్స్ కానీ మరొకరు కానీ అతని స్థానాన్ని భర్తీచేయలేరని పేర్కొన్నాడు. ‘గత కొన్నేళ్లుగా వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం చాలా చేశాడు. అతను లేని లోటు పూడ్చటం అసాధ్యం. టి20ల్లో అతను ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడు’ అని విలియమ్సన్ అన్నాడు. బాల్ ట్యాంపరింగ్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్‌పై ఏడాది నిషేధం విదించడంతో బీసీసీఐ అతన్ని ఐపీఎల్‌కు కూడా దూరం చేసింది. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో అతను మాట్లాడుతూ.... ‘పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం ఆనందకరం. ప్రతి మ్యాచ్‌లో ప్రదర్శన మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్లడం ముఖ్యం. ఐపీఎల్లో బలమైన జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్లతో ఉన్న ఆ జట్టు ఎప్పుడూ ప్రమాదకారే’ అని తెలిపాడు. నేడు ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, బెంగళూరుతో తలపడనుంది. -
బాల్ ట్యాంపరింగ్‌తో గుణపాఠం
సిడ్నీ: బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంపై డేవిడ్ వార్నర్ మరోసారి స్పందించాడు. ఆ ఘటన తనకు జీవితంలో మరిచిపోలేని గుణపాఠం నేర్పిందని చెబుతున్నాడు. కష్టకాలంలో తనకు మద్ధతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వార్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘క్రికెట్ ఆడుతున్నంత కాలం జీవితం ఓ వలయంలా అనిపించేంది. క్రికెట్.. ప్రాక్టీస్, హోటల్స్, ప్యాకింగ్స్, ప్రయాణాలు ఇవే ఉండేవి. కుటుంబ సభ్యులతో గడిపేందుకు క్షణం తీరిక దొరికేది కాదు. కానీ, ఇప్పుడు పూర్తిగా పిల్లలతోనే గడుపుతున్నా. నా క్రికెట్ ప్రయాణంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నా. కానీ, వారి నమ్మకానికి నేను తూట్లు పొడిచా.అయినా వారు కష్టకాలంలో నాకు అండగా నిల్చున్నందుకు కృతజ్ఞుడిని. ఈ అనుభవాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నానని భావిస్తున్నా. ఇకపై ఇతరులకు సాయం చేయటానికి నా వంతు కృషి చేస్తా’ అని వార్నర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. -
మీ నమ్మకాన్ని నిలబెడతా: స్టీవ్ స్మిత్
మెల్బోర్న్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి దేశప్రజల నమ్మకం పొందడానికి కృషి చేస్తానంటున్నాడు. నిషేధం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన స్మిత్ స్వదేశానికి చేరుకున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. ‘స్వదేశం చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. బయట కొంత సమయం విశ్రాంతి తీసుకున్నా. ఆ సమయంలో నాకోసం ఎన్నో ఈ–మెయిల్స్, లెటర్స్ వచ్చాయి. మీరు నాపై చూపిన ప్రేమకు కృతజ్ఞతలు. తిరిగి మీ నమ్మకాన్ని గెలిచేందుకు కృషిచేస్తాను’ అని స్మిత్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్ చేసినట్లు రుజువవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్మిత్, వార్నర్‌లపై ఏడాది.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన భవిష్యత్ గురించి స్మిత్ పెదవి విప్పాడు. -
స్టీవ్ స్మిత్ ఎమోష్నల్ సందేశం..
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు నిషేదం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి అభిమానుల నమ్మకాన్ని పొందుతానన్నాడు. ఈ ఉదంతం అనంతరం స్మిత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తొలిసారి స్పందించాడు. తన సతీమణి డానీ విల్స్‌తో దిగిన ఫొటోకు క్యాఫ్షన్‌గా అభిమానులకు ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. ‘‘ఆస్ట్రేలియాకు తిరిగి రావడం గొప్పగా ఉంది. నేను కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో దూరంగా ఉన్నా. దాని నుంచి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. చాలామంది ఈమెయిల్స్, లెటర్స్‌తో నాకు మద్దతు తెలిపారు. మళ్లీ మీ నమ్మకాన్ని తిరిగి పొందుతాను. ఆ సమయంలో మా తల్లితండ్రులు, నా భార్య ఇచ్చిన మద్దతు వెలకట్టలేనిది. వారికి ధన్యవాదాలతో్ సరిపెట్టలేను. ప్రపంచంలో ముఖ్యమైనది కుటుంబమే. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’’ అని స్మిత్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో యువఆటగాడు బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ కెమెరాలకు చిక్కడం.. ఇది జట్టు వ్యూహంలో భాగమని స్మిత్ ప్రకటించడం పెనుదుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఉదంతానికి సూత్రదారైన డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు ఏడాది పాటు.. బాన్‌క్రాఫ్ట్‌కు 9 నెలలు నిషేధం విధించింది. సీఏ చర్యతో స్మిత్, వార్నర్‌లను బీసీసీఐ ఈ సీజన్ ఐపీఎల్‌కు అనుమతించలేదు. It’s great to be back home in Australia. I have had some time away to come to terms with everything and now it’s time to get back into it. The amount of emails and letters I have received has been incredible and I have been extremely humbled by the enormous amount of support you have given me. I now have a lot to do to earn back your trust. To my Mum, Dad and Dani you have been my rock through this and I can’t thank you enough. Family is the most important thing in the world and I thank you for your love and support. A post shared by Steve Smith (@steve_smith49) on May 3, 2018 at 8:30pm PDT -
స్మిత్, వార్నర్‌లపై సర్రే కౌంటీ ఆసక్తి
లండన్: బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్‌లపై ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రే ఆసక్తి కనబరుస్తోంది. సర్రే హెడ్ కోచ్ మైకేల్ డి వెనుటో వాళ్లిద్దరిని ఆడించాలని ఆశిస్తున్నారు. ఆయన 2013 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు. అయితే వీళ్లిద్దరు కౌంటీల్లో ఆడాలంటే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆమోదం తప్పనిసరి. డి వెనుటో మాట్లాడుతూ... ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ, దేశవాళీ టోర్నీల్లోనే వాళ్లపై నిషేధం విధించిందని, ఆసీస్‌లో క్లబ్, ఇతర దేశాల్లో జరిగే టోర్నీల్లో ఆడేందుకు అవకాశముందని చెప్పారు. ‘స్మిత్, వార్నర్‌లకు ఆడాలని ఉంటే కౌంటీల్లో ఆడించవచ్చు. ఈసీబీ కూడా అనుమతించవచ్చు. అలా కాకుండా... ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లయిన వారిని నిరోధించడం తలతిక్క పనే అవుతుంది’ అని ఆయన అన్నారు. -
బాల్ ట్యాంపరింగ్‌పై నోరువిప్పిన పాంటింగ్
న్యూఢిల్లీ : బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తొలి సారి నోరు విప్పాడు. ఐపీఎల్ సందర్భంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ గురువారం మీడియాతో మాట్లాడారు. బాల్ ట్యాంపరింగ్ వివాదం తెలుసుకొని షాక్ గురయ్యానని, గత రెండు వారాల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ ఘటనపై తొలి సారి స్పందిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘ఆ రోజు మైదానంలో జరిగినది చూసి ఓ మాజీ ఆటగాడిగా, మాజీ కెప్టెన్‌గా షాక్‌కు గురయ్యా. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వారు ఇప్పటికే కన్నీటితో పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఆసీస్ అభిమానులు ఎప్పుడు నిజాయితీతో కూడుకున్న ఆటను కోరుకుంటారు. మేం కూడా ఇప్పటి వరకు అలానే ఆడాం. ఈ ఘటనపై ఇంత దుమారం రేగాడికి కారణం ఆసీస్ ఆటగాళ్ల ఆటలో నిజాయితీ తప్పడమేనని భావిస్తున్నా. ఆస్ట్రేలియా క్రికెట్ సంప్రదాయం గురించి చర్చ జరగడం ఆసక్తి కరంగా ఉంది. కొన్ని నెలల క్రితం ఆసీస్ యాషెస్ నెగ్గినపుడు ఎవరు సంప్రదాయం గురించి మాట్లాడలేదు. కాబట్టి సంప్రదాయం, డ్రెస్సింగ్ రూం వ్యవహారాలు వేరని ’ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఇక పాంటింగ్ సారథ్యంలో ఆసీస్ రెండు సార్లు ప్రపంచకప్ గెలిచింది. దక్షిణాఫ్రికా పర్యటనలో వెలుగుచూసిన బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో ఆసీస్ ఆటగాళ్లు బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఆదేశ క్రికెట్ బోర్డు నిషేదం విధించిన విషయం తెలిసిందే. -
అప్పుడే మైదానంలో అడుగుపెడుతా : ఆసీస్ ఆటగాడు
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్నఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విధించిన శిక్షను సవాలు చేయబోనని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంతో నిషేదానికి గురైన మరో ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ సైతం స్మిత్ బాటలోనే నడుస్తానని తెలిపాడు. తాను సైతం సీఏ శిక్షను సవాలు చేయడం లేదని ఈ నిషేద కాలాన్ని పూర్తిచేసుకోని ఆస్ట్రేలియా ప్రజల మనసు గెలుచుకున్న తర్వాతే మైదానంలో అడుగుపెడుతానని స్పష్టం చేశాడు. కెప్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా ఈ యువ ఆటగాడు ఉప్పుకాగితంతో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర దుమారం చెలరేగగా క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తోపాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది, బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేదం విధించింది. ఈ నిషేదాన్ని సవాలు చేసే అవకాశం కూడా కల్పించింది. అయితే తాము చేసిన తప్పుకు సరైన శిక్షే అని భావించిన స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లు సవాలు చేయడం లేదని ప్రకటించారు. ఈ వివాదంపై ఇప్పటికే పశ్చాతాపం వ్యక్తం చేసిన వార్నర్ సవాలు అంశంపై మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ ముగ్గురు ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తీవ్ర శిక్షలు విధించిందని, వారికి విధించిన శిక్షలను తగ్గించాలని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) డిమాండ్ చేస్తూ మద్దతు తెలిపింది. -
నిషేధం: స్టీవ్ స్మిత్ అనూహ్య నిర్ణయం
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విధించిన శిక్షను సవాలు చేయబోనని ఆయన ప్రకటించారు. నిషేధాన్ని ఎదుర్కొంటానని తెలిపారు. కెప్టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ చేయడంతో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తోపాటు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌పై సీఏ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘కెప్టెన్‌గా ఈ వివాదంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని ఇంతకుముందే చెప్పాను. ఆ మాటకు కట్టుబాడి ఉన్నాను. నేను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. నాపై విధించిన ఆంక్షలను సవాల్ చేయడం లేదు. గట్టి సందేశం ఇచ్చే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ చర్యలు తీసుకుంది. వాటిని నేను ఆమోదిస్తున్నాను’ అని స్మిత్ బుధవారం ట్వీట్ చేశారు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో స్మిత్, వార్నర్‌పై ఏడాది చొప్పున నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. బెన్క్రాఫ్ట్ను తొమ్మిది నెలలు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది. ఈ నిషేధం నేపథ్యంలో స్మిత్, వార్నర్ ఐపీఎల్ నుంచి కూడా ఏడాదిపాటు వైదొలగనున్నారు. స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఈ సారి కెప్టెన్సీ నిర్వహించాల్సి ఉంది. 2016లో వార్నర్ నాయకత్వంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు గత ఐపీఎల్ టోర్నీని గెలుపొందింది. -
ఆస్ట్రేలియా జట్టు: మరింతమందిపై వేటు..!
సిడ్నీ, ఆస్ట్రేలియా : దక్షిణాఫ్రికా పర్యటన డిజాస్టర్‌గా మారిన నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులోని మరింత మందిపై వేటు పడాలని, ముఖ్యంగా దేశ క్రికెట్ అధినాయకత్వం ఇందుకు బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ జట్టు 3-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన నాలుగో టెస్టులో 492 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చిత్తయింది. 1960 దశకం తర్వాత సఫారీ జట్టు ఆసీస్‌పై టెస్టు సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి. కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టు సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఉదంతం వెలుగుచూడటం, ఈ వివాదంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం జట్టు కోచ్ డారెన్ లీమన్ కూడా స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియా క్రికెట్లో ఈ సంక్షోభం ఇద్దరు లేదా ముగ్గురు దిగిపోవడం వల్ల సమసిపోదని పెద్దస్థాయిలోని వ్యక్తులు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సిందేనని వార్న్ అభిప్రాయపడ్డారు. ‘ఆస్ట్రేలియా జట్టు మరోసారి ప్రపంచ శక్తిగా ఎదగాలంటే సరైన వ్యక్తులు రంగంలోకి దిగాల్సిన అవసరముంది. ఇప్పుడు కొత్తవారికి ఆటతోపాటు క్రికెట్ నాయకత్వంలోనూ అవకాశాలు ఉన్నాయి. (బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో) అన్ని హోదాల్లో ఉన్నవారు ప్రమాదంలో పడ్డారు. పెద్ద తలకాయలు దిగిపోవాల్సింది’ అని షేన్ వార్న్ విశ్లేషించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ఓటమి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్, టీమ్ మేనేజర్ ప్యాట్ హోవార్డ్ తమ పదవుల నుంచి దిగిపోవాల్సిందేనని పరోక్షంగా వార్న్ పేర్కొన్నట్టు ఫాక్స్ స్పోర్ట్స్ తెలిపింది. కోచ్‌తోపాటు బ్యాటింగ్ కోచ్‌లు కూడా బాధ్యత వహించాలని, ఇంకెప్పుడు ఒక మంచి బ్యాట్స్‌మన్‌ను జట్టుకు అందిస్తారని ప్రశ్నించారు. -
క్రికెటర్ల కళ్లు తెరుచుకున్నాయి: కలిస్
సాక్షి, కోల్‌కతా : క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదంపై దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాకస్ కలిస్ స్పందించాడు. ‘ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన ఈ పని క్రికెట్ ప్రపంచానికి ఒక వేకప్ కాల్ వంటిది. ప్రతీ ఆటగాడు తాము అనుసరించాల్సిన విధానాలపై స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని’ కలిస్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ఈ మాజీ ఆల్‌రౌండర్ కేకేఆర్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాడు. విలేకరుల సమావేశంలో ట్యాంపరింగ్ వివాదంపై మాట్లాడుతూ.. ‘స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ చేసిన పని, ఎదుర్కొన్న పరిస్థితులు ప్రతీ ఆటగాడి కళ్లు తెరుచుకున్నాయి. క్రీడాస్పూర్తితో సరైన పద్ధతిలో మాత్రమే ఆడాలి. ఐపీఎల్లో కేకేఆర్ టీమ్ ఆట తీరుతో సంతోషంగా ఉన్నాను. గతంలో మెరుగైన ప్రదర్శన చేశాం. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని’ కలిస్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో కలిస్‌తో పాటు కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్ప, పియూష్ చావ్లా, ఆండ్రూ రస్సెల్, శివమ్ మావి, శుభమ్ గిల్, కమలేశ్ నాగర్కోటి పాల్గొన్నారు. ఏప్రిల్ 8న ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కేకేఆర్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. -
ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ!
జోహన్నెస్‌బర్గ్ : మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లుంది ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి. ఇప్పటికే ట్యాంపరింగ్ వివాదంతో సీనియర్ ఆటగాళ్లైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాఫ్ట్‌లపై నిషేధంతో జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో జట్టు పగ్గాలను యువ ఆటగాడు, వికెట్ కీపర్ టీమ్ పెయిన్‌కు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో ఈ యువ సారథి గాయపడ్డాడు. రెండో రోజు ఆటలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు చాద్ సేయర్స్ వేసిన బంతిని అందుకునే ప్రయత్నంలో టీమ్ పెయిన్ కుడి బొటన వేలికి ఫ్రాక్చర్ అయ్యింది. గాయంతో విలవిలాడిన అతను అసౌకర్యంగానే మ్యాచ్‌లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌లో సైతం ఆర్డర్ మార్చుకుని 7వ స్థానంలో బరిలోకి దిగాడు. అయితే అతని బొటన వేలు చిట్లినట్లు ఫిజియోలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సైతం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అతను ఈ టెస్టు చివరి వరకు కొనసాగడం కష్టంగా మారింది. ఏ నిమిషంలోనైనా సిరీస్ నుంచి వైదొలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ టెస్టు ఆరంభం ముందే స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ కాలి గాయంతో సిరీస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
బాల్ ట్యాంపరింగ్ నావల్లే : వార్నర్ భార్య
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ ఘటన తనవల్లే జరిగిందని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భార్య క్యాండిస్ వార్నర్ తెలిపారు. సిడ్నీ సండే టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. ఈ ఘటనకంతా తానే కారణమని, ఇది తనని చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమి తన భర్త తప్పిదాన్ని సమర్ధించడం లేదని, కానీ వార్నర్ తన భార్య, పిల్లలను రక్షించుకునే ప్రయత్నంలో మాత్రమే అలా చేసాడన్నారు . కానీ ఆ సమయంలో తానక్కడుంటే ఇలా జరిగేది కాదని, వార్నర్ ఒత్తిడికి లోనవ్వకుండా తాను అండగా నిలిచేదానినని పేర్కొన్నారు. అభిమానులు, ప్రత్యర్ధి ఆటగాళ్లు తన మీద జోకులు వేస్తూ.. వార్నర్‌కు ఆగ్రహం తెప్పించేలా మాస్క్‌ల ధరించారని, ఇవే వార్నర్‌ను మానసికంగా దెబ్బతీసాయని క్యాండిస్ చెప్పుకొచ్చారు. వార్నర్ భార్య క్యాండిస్, న్యూజిలాండ్ రగ్బీ స్టార్ సోని బిల్ విలియమ్స్‌కు ఎఫైర్ ఉందని, 2007లో సిడ్నీలో వీరు గడిపారనే పుకార్లను మైదానంలో సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీ కాక్ వార్నర్‌ను రెచ్చగొట్టేలా ప్రస్తావించాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా అభిమానులు కూడా ఈ ఎఫైర్ గురించి మైదానంలో వ్యాఖ్యలు చేయడం, సోని బిల్ మాస్కులు ధరించి రావడం వార్నర్ మానసిక స్థితి మరింత దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే వార్నర్ ఓటమి నుంచి తప్పించుకునేందుకు బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించాడని క్యాండిస్ వెనుకేసుకొచ్చారు. వార్నర్ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఆసీస్ అభిమానులు సానుభూతి కనబరుస్తూ కొంత ఓపికతో ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక ట్యాంపరింగ్ పూర్తి బాధ్యత తనేదనని వార్నర్ శనివారం మీడియా ముందు పశ్చాతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఆస్ట్రేలియా తరఫున ఆడనని, శాశ్వతంగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అంశంపై కుటుంబ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తానని పేర్కొన్నాడు. -
దేశానికి ఇక ఆడలేనేమో!
బాల్ ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం డేవిడ్ వార్నర్ తొలిసారి మీడియా ముందుకొచ్చాడు. ఆ ఘటనకు సూత్రధారిగా నింద మోస్తున్న అతడు... తన తప్పునకు అందరికీ క్షమాపణలు చెప్పాడు. స్టీవ్ స్మిత్‌లాగే ఒక దశలో భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ఇకపై దేశానికి ఆడలేనేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. సిడ్నీ: తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసినందుకు, తలవంపులు తెచ్చినందుకు క్రికెట్ ప్రేమికులు, అభిమానులకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనతో తాను మళ్లీ దేశానికి ఆడలేనేమోనంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఒకవేళ మళ్లీ అవకాశం వస్తే ఈసారి తప్పు చేయనని పేర్కొన్నాడు. ఈ క్రీడా ప్రయాణంలో అండగా నిలిచి, ప్రోత్సహించిన వారి గౌరవం తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. శనివారం అతడు ఇక్కడ మీడియాతో మాట్లాడాడు. ‘జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బందికి నా క్షమాపణలు. కేప్‌టౌన్ టెస్టులో జరిగిన దానికి నాదే పూర్తి బాధ్యత. క్రికెట్ ఆస్ట్రేలియాను కూడా క్షమించమని అడుగుతున్నా. దేశ క్రికెట్ సంస్కృతిలో మార్పునకు మీరు తలపెట్టిన సమీక్షకు నా పూర్తి మద్దతునిస్తున్నా’ అని వార్నర్ చెప్పాడు. అప్పీల్‌పై ఆలోచించి నిర్ణయం... ఏడాది నిషేధంపై అప్పీలుకు వెళ్లే ఆలోచనను కుటుంబ సభ్యులతో చర్చించి, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తానని వార్నర్ చెప్పాడు. ట్యాంపరింగ్‌లో ఇతర ఆటగాళ్ల ప్రమేయం, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయా? అన్నవాటిని ప్రస్తావించలేదు. ట్యాంపరింగ్ గురించి ఇంకా వివరాలు కోరగా... ‘ఆ ఘటనలో నా పాత్ర, బాధ్యతకు క్షమాపణలు కోరేందుకే ఈ రోజు మీ ముందుకొచ్చా. తీవ్ర నిర్ణయాలకు సంబంధించిన ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం. ఇది క్షమించలేనిది. వైస్ కెప్టెన్‌గా నా బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యా. ఏం జరిగిందో, ఒక మనిషిగా నేనేవరినో రాబోయే రోజుల్లో ఒక్కసారి తరచి చూసుకుంటా. దీనిపై సలహాలు తీసుకుని భారీ మార్పునకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు. భార్య, పిల్లలకూ క్షమాపణలు మీడియా సమావేశంలో వార్నర్ తన భార్య, పిల్లలతో పాటు విదేశీగడ్డపై ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ‘నా కుటుంబాన్ని క్షమాపణలు కోరుతున్నా. ప్రత్యేకించి నా భార్య, కూతుళ్లను. మీ ప్రేమే నాకు అన్నింటికంటే ముఖ్యం. మీరు లేకుంటే నేను లేను. ఈ పరిస్థితి మళ్లీ తీసుకురాను. అందరితో చర్చించాకే ఆటకు వీడ్కోలు చెప్పాలా వద్దా అనేది ఆలోచిస్తా’ అని అన్నాడు. -
వార్నర్ పశ్చాతాపంపై నెటిజన్ల ఫైర్
సిడ్నీ : బాల్ ట్యాంపరింగ్ వివాదంలో తప్పంతా తనదేనని ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం మీడియా సమావేశంలో వార్నర్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే వార్నర్ ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. వార్నర్‌ది నకీలీ ఏడుపని కొందరంటే, ఆస్కార్ నటులను మించిపోయాడని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే వార్నర్‌కు బెస్ట్ టెలివిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వొచ్చని సెటైరేస్తున్నారు. మీడియా అడిగిన ప్రశ్నల నుంచి ఎలా తప్పించుకున్నాడో గమనించారా అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో వార్నర్ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడనని వెల్లడించాడు. కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై వార్నర్ పునరాలోచన చేయాలని అతని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పులు అందరు చేస్తారని కానీ చేసిన తప్పును ఒప్పుకోవడం పెద్ద విషయమని, వార్నర్‌కు మద్దతివ్వాలని అతని అభిమానులు కోరుతున్నారు. Best television of the year so far — Joe kennedy (@kennedy510) 31 March 2018 Do you have to weep to be considered truly sorry for your actions? #DavidWarner — Dan Walker (@mrdanwalker) 31 March 2018 Notice how well he’s avoiding EVERY question? — Nathan Edwards (@NathanEdwards16) 31 March 2018 -
నా గుండె పగిలింది: రషీద్ ఖాన్
సాక్షి, హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పరిస్థితి చూస్తే తన గుండె తరుక్కుపోతుందని అఫ్గనిస్తాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ట్యాంపరింగ్ ఉదంతం అనంతరం దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకు బయలు దేరిన వార్నర్‌ను సిడ్నీ ఏయిర్‌పోర్టులో అతని కుటుంబ సభ్యులు కలుసుకున్న విధానం చూస్తే తన గుండె పగిలిందని ట్వీట్ చేశాడు. ‘ఈ ఫొటో నా గుండె పగిలేలా చేసింది. క్రికెట్ అభిమానులు ఇంత కఠినంగా ఎలా వ్యవహరిస్తారు. ప్రతి ఒక్కరు పొరపాటు చేస్తారు. కానీ వారిలో కొంతమందే తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరుతారు. ఈ చాంపియన్(వార్నర్)కు అండగా నిలబడి మద్దతివ్వండి. ప్రస్తుతం మన ప్రేమ, మద్దతు అతనికెంతో అవసరం.’ అని ట్వీట్ చేశాడు. This picture broke my heart ,how can the cricket fans be so harsh. everyone make a mistake and best among them are those who accept their mistakes and apologize, So stand with the champ and support him when he really needs our support and love @davidwarner31 @CandyFalzon pic.twitter.com/AhuALO3lYD — Rashid Khan (@rashidkhan_19) 30 March 2018 ఇక సిడ్నీ ఏయిర్‌పోర్టులో వార్నర్‌ను అతని కూతుళ్లు కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నారు. కళ్లలో పశ్చాతపం వ్యక్తం చేస్తూ వార్నర్ ఆ చిన్నారులను భుజాన వేసుకొని ముందుకు సాగాడు. కల్లాకపటం తెలియని ఆ చిన్నారులు తండ్రిని చూసి రోదించడం ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలపై సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం అవుతోంది. తాను తప్పు చేశాననే బాధ కంటే తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాననే మానసిక క్షోభనే వార్నర్‌ను వెంటాడుతోంది. దీంతోనే జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడబోనని, కుటుంబంతో చర్చించిన అనంతరం క్రికెట్ నుంచి శాశ్వతంగా తప్పుకోవాలనే అంశంపై నిర్ణయం కూడా తీసుకుంటానని వెల్లడించాడు. ఇక డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్మెట్స్ అన్న విషయం తెలిసిందే. -
బాల్ ట్యాంపరింగ్: వెలుగుచూసిన మరో వీడియో
-
దక్షిణాఫ్రికా 313/6
జొహన్నెస్‌బర్గ్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు శుక్రవారం ప్రారంభమైంది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు దూరమై బలహీనంగా కనిపిస్తున్న ఆసీస్‌పై దక్షిణాఫ్రికా తొలిరోజు ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ మార్క్రమ్ (152; 17 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకానికి తోడు డివిలియర్స్ (69; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. నిషేధానికి గురైన ముగ్గురి స్థానంలో బర్న్స్, రెన్షా, హ్యాండ్స్కోంబ్ బరిలో దిగారు. మార్క్రమ్, ఎల్గర్ (19)తో తొలి వికెట్‌కు 53, రెండో వికెట్‌కు ఆమ్లా(27)తో 89 పరుగులు జతచేశాడు. ఆ తర్వాత డివిలియర్స్‌తో మూడో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ఒక దశలో 247/2తో పటిష్టంగా కనిపించిన సఫారీలు 52 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం బవుమా (25 బ్యాటింగ్), డికాక్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కొత్త ఆరంభం.. వివాదం అనంతరం జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్ టిమ్ పైన్ కొత్త తరహా ఒరవడితో నాయకత్వాన్ని ఆరంభించాడు. మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల జాతీయ గీతాలాపన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లందరితో ఆసీస్ క్రికెటర్లు వరుసగా కరచాలనం చేశారు. సాధారణంగా మ్యాచ్ ముగిశాక కనిపించే ఇలాంటి దృశ్యం మ్యాచ్‌కు ముందు కనిపించడం ఇదే తొలిసారి. టిమ్ పైన్ తన ఆలోచనను డు ప్లెసిస్‌తో పంచుకొని ఈ ఏర్పాటు చేశాడు. ఇది ప్రతీ సారి కొనసాగుతుందని చెప్పలేకపోయినా... తాను కొత్తగా మొదలు పెట్టాలనుకున్నట్లు పైన్ వెల్లడించాడు.పరోక్షంగా ‘మరక’ తర్వాత మళ్లీ కొత్త ఆరంభం చేస్తున్నట్లు అతను చెప్పాడు. -
ఏడాది శిక్ష... చాలా ఎక్కువ!
బాల్ ట్యాంపరింగ్‌లో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరకడంతో క్రీడాలోకం ఒక్కసారిగా భగ్గుమంది. క్షమించరాని నేరమంది. వారు చేసింది ఘోరమంది. శిక్షలు పడ్డాక... పశ్చాత్తాపంతో విలపిస్తుంటే అదే ‘లోకం’ అయ్యో పాపమంటోంది. సానుభూతి కురిపిస్తోంది. న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్‌లో తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటున్న స్మిత్ విలాపం బహుశా అందర్ని కదిలిస్తోంది. దీంతో అప్పుడు ఛీ అన్నోళ్లే ఇప్పుడు కనికరించాలంటున్నారు. ఐదు రోజుల క్రితం కెప్టెన్ స్మిత్‌పై ఐసీసీ కేవలం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించడంతో భారత స్పిన్నర్ హర్భజన్ ఐసీసీది ద్వంద్వ నీతంటూ ధ్వజమెత్తాడు. అతనే ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్ చేసిన నేరానికి విధించిన ఏడాది శిక్ష చాలా ఎక్కువని... ఏదో ఒక టెస్టు సిరీస్‌కో లేదంటే రెండు సిరీస్‌లకో వేటు వేయాల్సిందని భజ్జీ అన్నాడు. మరో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆస్ట్రేలియన్లపై సానుభూతి చూపాడు. ‘ప్రపంచం మీ కన్నీళ్లు చూడాలనుకుంది... చూసింది. ఇప్పుడు చూశాక సంతోషించినట్లుంది. కానీ సానుభూతి అనేది పదంలా మాత్రమే కాకుండా నిజంగా చూపిస్తే బాగుంటుంది. దీనినుంచి బయటపడే ధైర్యాన్ని దేవుడు వారికివ్వాలి’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు. మోసగాళ్లు, దోషులు అని పతాక శీర్షికల్లో నిందించిన దిన పత్రికలు కూడా ఇవేం శిక్షలంటూ రాశాయి. ‘దిస్ ఈజ్ బాల్ ట్యాంపరింగ్. నాట్ మర్డర్’ (ఇది బాల్ ట్యాంపరింగే... హత్య కాదు), అని, ‘డియర్ ఆస్ట్రేలియా దట్స్ ఎనఫ్ నౌ’ (ఆస్ట్రేలియా... ఇక చాలు) అని పత్రికలు ఆసీస్ ఆటగాళ్లపై నిందలు చాలించాలని కోరాయి. పాక్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియన్ మైకీ అర్థర్ మాట్లాడుతూ స్మిత్‌కు క్రికెటే లోకమని, ఆటకోసమే పరితపిస్తాడని... అతని కెరీర్లో ఇలాంటి ఘటన దురదృష్టకరమని అన్నారు. మళ్లీ పునరాగమనంలో మరింత కష్టపడతాడని... సుదీర్ఘకాలం జట్టుకు సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ ట్యాంపరింగ్!
ఆక్లాండ్ : ఆస్ట్రేలియా ఆటగాళ్లు 2015 ప్రపంచకప్ ఫైనల్లో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి ఉంటారని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ గ్రాంట్ ఇలియట్ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ రేడియో స్టేషన్లో తాజా బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై మాట్లాడుతూ.. 2015 ప్రపంచకప్ ఫైనల్లో మా జట్టు ఆరంభం బాగుందని, 150 పరుగులకు మూడు వికెట్లే కోల్పయమన్నారు. అయితే ఈ సమయంలో బంతి అనూహ్యంగా రివర్స్ స్వింగ్ అయిందని, అప్పటి వరకు మాములుగా బౌలింగ్ చేసిన బౌలర్లు బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడన్నారు. దీంతో తాను బ్యాటింగ్‌లో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వారు బంతి ఆకారాన్ని ఏమైనా దెబ్బతీసారేమో అనే అనుమానం వచ్చినట్లు నాటి రోజును ఈ కివీస్ ప్లేయర్ గుర్తు చేసుకున్నారు. ఇక 2015 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఆసీస్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఈమ్యాచ్‌లో గ్రాంట్ ఇలియట్ ఒక్కరే (83) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. స్మిత్ నిషేదంపై సానుభూతి.. స్మిత్, వార్నర్, బెన్ క్రాఫ్ట్‌ల నిషేదం పట్ల ఇలియట్ సానుభూతిని వ్యక్తం చేశారు. జోహన్నస్ బర్గ్ ఏయిర్‌పోర్టులో స్మిత్ పట్ల వ్యవహరించిన తీరును ఖండించారు. వారు నేరస్థులు ఏం కాదని, వారి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమన్నారు. ‘నేను చూసిన వీడియోలో స్మిత్‌ను ఓ నేరస్థుడిలా పోలీసులు చుట్టుముట్టి మరి తీసుకెళ్లారు. అతనేం నేరస్థుడు కాదు. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు’ అని ఏలియట్ అభిప్రాయపడ్డారు. -
ప్రపంచం మీ ఏడుపును కోరుకుంది: అశ్విన్
సాక్షి, హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాదంతో తమ తప్పును అంగీకరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లపై టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన సానుభూతిని వ్యక్తం చేశాడు. ‘ప్రపంచం మీ ఏడుపును కోరుకుంది. మీరు ఏడ్చారు కదా! ఇక వారంతా సంతృప్తి చెందారు. ప్రశాంతంగా జీవిస్తారు. ఈ ఘటన నుంచి బయటపడే శక్తిని ఆ దేవుడు మీకివ్వాలి (స్మిత్, బెన్ క్రాప్ట్, డెవిడ్ వార్నర్)’ అని ట్వీట్ చేశాడు. ఇక మరో ట్వీట్లో ‘వార్నర్‌కు ఈ ఘటనను ఎదర్కునే శక్తి కావాలి. వారి దేశ ఆటగాళ్ల యూనియన్ నుంచి అతనికి మద్దతు లభిస్తోందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నాడు. ఇక ట్యాంపరింగ్ ఘటనపై తమ తప్పును అంగీకరిస్తూ కెప్టెన్ స్టీవ్ స్మిత్, బాన్ క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్‌లు పశ్చాతాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మరో వైపు జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ కోచ్ పదవికి కూడా రాజీనామా చేసాడు. కన్నీళ్లు పెట్టుకున్న ఆటగాళ్లపై మాజీ క్రికెటర్లు, అభిమానులు సైతం సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. శిక్షల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని అభిప్రాయ పడుతున్నారు. The world simply wants to see you cry, once you have cried they will feel satisfied and live happily ever after. If only Empathy was not just a Word and people still had it. God give @stevesmith49 and Bancroft all the strength to come out of this.🙏 — Ashwin Ravichandran (@ashwinravi99) 30 March 2018 -
ట్యాంపరింగ్ వివాదంపై హర్భజన్ యూటర్న్
సాక్షి, న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ వివాదంపై భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ యూ టర్న్ తీసుకున్నాడు. తప్పు చేశారని తేలినా ఆస్ట్రేలియా క్రికెటర్ బాన్ క్రాఫ్ట్‌పై నిషేధం విధించడానికి ఆలోచిస్తున్నారని, కానీ గతంలో తమ జట్టు కేవలం మోతాదుకు మించి అప్పీల్ చేశామన్న కారణంగా ఆరుగురు ఆటగాళ్లపై వేటు వేయడం, మంకీ గేట్ వివాదంలో ఏ తప్పుడు చేయకున్నా తనకు శిక్ష విధించారని ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాడు. కానీ కొన్ని రోజుల్లోనే హర్భజన్ తన మనసు మార్చుకుని ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు మద్ధతు తెలిపాడు. తప్పు చేశారని తేలితే కేవలం ఒకటి లేక రెండు సిరీస్‌లకు పక్కన పెడితే సరిపోతుందని, కానీ ఆటగాళ్లను ఏడాదిపాటు ఆటకు దూరం చేయడం చాలా పెద్దశిక్షేనని ఆసీస్ క్రికెటర్లకు విధించిన నిషేధం నిర్ణయాన్ని హర్భజన్ వ్యతిరేకించాడు. ఏడాది నిషేధం.. పెద్ద జోక్ 'కేవలం బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారన్న కారణంగా ఏడాదిపాటు నిషేధం విధించడం జోక్. వాళ్లు ఏ నేరానికి పాల్పడ్డారని ఇంత పెద్ద శిక్ష వేశారు. ఆట నుంచి ఏడాది పాటు దూరం చేయడం తెలివి తక్కువ నిర్ణయం. ఒక టెస్ట్ సిరీసో లేక రెండు సిరీస్‌లకు నిషేధం పరిమితం చేస్తే సరిపోయేది. కానీ ఇది దారుణం. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై నిషేధం గడువును క్రికెట్ స్ట్రేలియా తగ్గించాలంటూ' హర్భజన్ తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేశాడు. A year ban for ball tempering ?? That’s a joke.What kind of crime they have done ?Taking the game away from someone for a year is absolutely nonsense.understand if ban was for 1 test series or 2 but this is ridiculous.hope @CricketAus reduce th ban @stevesmith49 @davidwarner31 — Harbhajan Turbanator (@harbhajan_singh) 29 March 2018 కొన్ని రోజుల కిందట భజ్జీ ట్వీట్ ఇలా.. 'వావ్ ఐసీసీ. ట్యాంపరింగ్ వివాదంలో గొప్ప శిక్షే వేశారు. అన్ని ఆధారాలున్నా బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం లేదు. గతాన్ని మర్చిపోయారా. మితిమిరి అప్పీల్ చేశారన్న కారణంతో 2001 దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆరుగురు టీమిండియా ప్లేయర్లపై ఒక్కొ మ్యాచ్ నిషేధించారు. 2008 సిడ్నీ టెస్టులో ఎలాంటి ఆధారాలు లేకుండానే జాతి వివక్ష వ్యాఖ్యలంటూ (మంకీగేట్ వివాదం) నాపై మూడు టెస్టుల వేటేశారు. వ్యక్తిని, అతను ప్రాతినిథ్యం వహించే జట్టును బట్టి అధికారులు శిక్షలను ఖరారు చేస్తుంటారా?' అని ట్వీట్ ద్వారా హర్భపన్ ప్రశ్నించాడు. wow @ICC wow. Great treatment nd FairPlay. No ban for Bancroft with all the evidences whereas 6 of us were banned for excessive appealing in South Africa 2001 without any evidence and Remember Sydney 2008? Not found guilty and banned for 3 matches.different people different rules — Harbhajan Turbanator (@harbhajan_singh) 25 March 2018 -
స్మిత్, వార్నర్ లేకున్నా నష్టం లేదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం దురదృష్టకరమని భారత క్రికెటర్ పార్థీవ్ పటేల్ అన్నాడు. ఐపీఎల్ నుంచి ఈ ఇద్దరు క్రికెటర్లపై వేటు అనేది టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపించదని, ఎంతో మంది నాణ్యమైన క్రికెటర్లున్నాయరని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ అనేది బిగ్ బ్రాండ్ అని అందులో కేవలం ఇద్దరు క్రికెటర్లు ఆడకపోతే వచ్చే నష్టమేం లేదన్నాడు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ పార్థీవ్ పటేల్‌ను రూ.1.7 కోట్లకు తీసుకున్న విషయం తెలిసిందే. 'ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగినా ఐపీఎల్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ మెగా టోర్నీపై ప్రభావం చూపించదు. ఐపీఎల్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సాధ్యమైనంత వరకు జట్టు ప్రయోజనాల కోసం శాయశక్తులా కృషి చేస్తాను. అంతకంటే ముఖ్యంగా భారత జట్టులో వికెట్ కీపర్లకు చాలా పోటీ ఉంది. ఓ వైపు దినేశ్ కార్తీక్ కీలక ఇన్నింగ్స్ ఆడితే మరోవైపు దేశవాలీలో వృద్ధిమాన్ సాహా రాణిస్తున్నాడు. జట్టులో చోటు దక్కాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఇతర దేశాల జట్లతో పోల్చితే భారత జట్టులో కీపర్‌గా స్థానం దక్కించుకోవడం చాలా కష్టమని' పార్థీవ్ వివరించాడు. కాగా, బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాదిపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. సీఏ నిర్ణయం అనంతరం ఐపీఎల్‌లోనూ ఈ సీజన్ నుంచి స్మిత్, వార్నర్‌లను నిషేధిస్తున్నామని, వేరే క్రికెటర్లను తీసుకోవచ్చునని నిర్వాహకులు వెల్లడించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు స్మిత్, వార్నర్ స్థానాలను మరో ఆటగాడితో భర్తీ చేయాలని భావిస్తున్నాయి. -
జోరు ఎవరిదో!
జొహన్నెస్‌బర్గ్: గత వారం రోజులుగా బాల్ ట్యాంప రింగ్ వివాదంతో వార్తల్లో నిలిచిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. వాండరర్స్ మైదానంలో శుక్రవారం మొదలయ్యే నాలుగో టెస్టు ‘డ్రా’ చేసుకుంటే దక్షిణాఫ్రికా సొంతగడ్డపై 1970 తర్వాత ఆస్ట్రేలియాపై సిరీస్ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు 2–1తో ముందంజలో ఉంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు దూరమై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన ఆసీస్ ఈ మ్యాచ్‌లో గెలిచి తమ అభిమానుల మనసులు గెలవాలని భావిస్తోంది. మరోవైపు మూడో టెస్టులో విజయం సాధించిన సఫారీలు అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్న మోర్నీ మోర్కెల్‌పై అందరి దృష్టి నిలవనుంది. -
సానుభూతి!
స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో కళ్ళనీళ్లు పెట్టుకొని భావోద్వేగంగా మాట్లాడిన తర్వాత అతనిపై క్రికెట్ ప్రపంచం నుంచి సానుభూతి కురుస్తోంది. శిక్షల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉందని వారు అభిప్రాయ పడుతున్నారు. వీరిలో స్మిత్‌తో తలపడిన ప్రత్యర్థులు కూడా ఉండటం విశేషం. విమానాశ్రయంలో స్మిత్‌ను తీసుకొస్తున్న దృశ్యం, అతని మీడియా సమావేశం నన్ను వెంటాడుతున్నాయి. వారు తప్పు చేశారనేది వాస్తవం. కానీ దానిని అంగీకరించారు. వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. ఈ ఘటనను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం తప్పు. –రోహిత్ శర్మ క్రికెట్‌ను అవినీతి రహితంగా ఉంచాల్సిందే. కానీ స్మిత్, వార్నర్‌లకు వేసిన శిక్ష చాలా పెద్దది. గతంలో జీతాల పెంపు కోసం వీరిద్దరు పోరాడటం వల్లే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారేమో! ఆటగాళ్ల తరఫున నిలబడిన వారిని పరిపాలకులు అణచివేసిన చరిత్ర ఉంది. నాకు స్మిత్‌లో మోసగాడు కనిపించడం లేదు. తన దేశం కోసం గెలిచేందుకు ప్రయత్నించి నాయకుడే కనిపిస్తున్నాడు. అతను ఎంచుకున్న పద్ధతి తప్పు కావచ్చు కానీ అతడిని అవినీతిపరుడిగా ముద్ర వేయకండి. – గంభీర్ సీఏ విచారణ లోపభూయిష్టంగా జరిగింది. శిక్షలు తీవ్రంగా ఉన్నాయి. ఐసీసీ విధించిన శిక్షలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతంలో ఇదే నేరానికి విధించిన శిక్షకు, ఇప్పటిదానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. ముందూ వెనక ఆలోచించకుండా ఆటగాళ్లను ఘటన జరిగిన రోజు మీడియా ముందు ప్రవేశపెట్టడమే పెద్ద తప్పు. క్రికెటర్లకు మేం నైతిక మద్దతుతో పాటు న్యాయపరంగా కూడా సహకరిస్తాం. – ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ వారు తాము చేసిన పనికి బాధపడటంతో పాటు పశ్చాత్తాపం చెందుతున్నారు. తమ చర్య ద్వారా జరగబోయే తదనంతర పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇలాంటి సమయంలో వారి కుటుంబ సభ్యులు అండగా నిలవడం ఎంతో ముఖ్యం. ఇక మనం దాని గురించి చర్చించడం మాని పక్కకు తప్పుకొని వారికి కాస్త ఏకాంతం కల్పిస్తే బాగుంటుంది. – సచిన్ టెండూల్కర్ స్మిత్‌ను చూస్తే చాలా బాధగా ఉంది. అతడిని ఇలాంటి స్థితిలో చూడలేం. రాబోయే రోజులు చాలా కఠినంగా గడుస్తాయి. మానసికంగా దృఢంగా ఉండమని నేను మెసేజ్ పంపించాను కూడా. మా ఇద్దరికీ పరస్పర గౌరవం ఉంది. ఆస్ట్రేలియాకు అతను అత్యుత్తమ కెప్టెన్. – ఫాఫ్ డు ప్లెసిస్ వార్నర్ చెడ్డవాడు కాదు. నేను అతనికి ప్రత్యర్థిగా, ఐపీఎల్లో అతనితో కలిసి ఆడాను. ఘటన జరిగిన తర్వాత కూడా మేం టచ్‌లోనే ఉన్నాం. ప్రజల భావోద్వేగాల వల్లే భారీ శిక్ష పడింది తప్ప అతను తప్పుడు మనిషి మాత్రం కాదు. – కేన్ విలియమ్సన్ మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు – నాకు తెలిసి స్మిత్, బాన్‌క్రాఫ్ట్ కొద్ది క్షణాలు మతి తప్పారంతే. వారికి రెండో అవకాశం ఇవ్వాలి. చుట్టుపక్కల ఉన్నవారు అండగా నిలవాలి. – మైకేల్ వాన్ స్మిత్ ఒక మగాడిలా తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అతని ఏడుపు, కొందరు అతనితో వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధేస్తోంది. – షోయబ్ అక్తర్ ఇప్పుడు జనం కళ్లు చల్లబడ్డాయా... స్మిత్ మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాను. – ఆండ్రూ ఫ్లింటాఫ్ -
అభిమాన ఆటకు చేటు చేశామని వేదన..
బాల్ ట్యాంపరింగ్ ఘటనతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కుదుపునకు లోనైతే... అందుకు పాల్పడి శిక్షకు గురైన ఆటగాళ్లు తీవ్ర మనో వ్యథకు గురవుతున్నారు. తమది ఎంత పెద్ద తప్పో, తమను ఇంతవారిని చేసిన ఆటకు చేసిన చేటేమిటో తలచుకుని కుమిలిపోతున్నారు. సస్పెన్షన్ కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు గురువారం మీడియాతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న స్మిత్ విమానాశ్రయంలోనే మీడియా సమావేశం నిర్వహించాడు. ఓ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చాడు. అబద్ధమాడాను... ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువు విషయంలో నేను అబద్ధమాడాను. ఆస్ట్రేలియన్లంతా తలదించుకునేలా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరడం ఒక్కటే ఇప్పుడు చేయగలను. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించాను. అయితే అంపైర్లు, మీడియాతో దానిని పసుపు రంగు టేపుగా చెప్పాను. విచారణ తర్వాత అసలు విషయం తేలింది. భవిష్యత్‌లోనూ నేను చింతించే అంశం ఇది. ఈ ఘటన నా హృదయాన్ని చాలా బాధించింది. జట్టులో స్థానాన్ని చేజేతులా పోగొట్టుకున్నా. గతంలో ఎన్నడూ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదు. వ్యక్తిగా, ఆటగాడిగా నమ్మిన విలువల విషయంలో రాజీ పడ్డాను. అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ, క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ పాల్పడిన ఈ చర్య క్రికెట్ ఎలా ఆడకూడదో చెప్పేందుకు ఓ ఉదాహరణ. కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి పొందడం కష్టమే అయినా అది నాకు చాలా ముఖ్యం. నిషేధంలో భాగమైన స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి ఎంతో కొంత చేస్తాను. నేను కూడా... ► రాజీనామా ప్రకటించిన లీమన్ ► స్మిత్ భావోద్వేగ ప్రసంగమే కారణం ► హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై జొహన్నెస్‌బర్గ్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆటగాళ్ల నిషేధం తర్వాత ఇప్పుడు కోచ్ వంతు! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నివేదిక ప్రకారం తన తప్పేమీ లేదని తేలినా... జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం లీమన్ ప్రకటించాడు. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టు కోచ్‌గా తనకు చివరిదని అతను వెల్లడించాడు. వివాదంలో తన గురించి వినిపించిన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందానన్న లీమన్... ఉదయం స్మిత్ భావోద్వేగ ప్రసంగం కూడా తన రాజీనామాకు కారణమని వెల్లడించాడు. ‘గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తీవ్రమైన పదజాలంతో మమ్మల్ని ద్వేషిస్తున్న తీరును బట్టి చూస్తే ఇక కొనసాగడం కష్టమనిపించింది. నేను, నా వాళ్లు ఎంతో భరించాం. వివాదంలో నాకు భాగం లేదని మరోసారి చెబుతున్నాను. సంవత్సరంలో నేను 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నా వాళ్లతో సమయం గడిపేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. గత ఐదు రోజులుగా మేమెవ్వరం సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో, మనసులో ఎంతో సంఘర్షణతో ఆటతో అనుబంధం కొనసాగించలేం’ అని లీమన్ వ్యాఖ్యానించాడు. తన నిర్ణయం జట్టుకు కూడా ఉపయోగపడుతుందని, అన్నీ మరచి కొత్త ఆరంభంతో ముందుకు వెళ్లేందుకు అది అవసరమని లీమన్ ఉద్వేగంగా చెప్పాడు. ‘ఇద్దరు యువ ఆటగాళ్లు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు అసాధారణం. స్మిత్ ఏడవడం చూస్తే నాకు చాలా బాధ వేసింది. మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు’ అని లీమన్ అన్నాడు. తాను రాజీనామా చేయడం లేదని ఇంతకు ముందే ప్రకటించినా... స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను చూసిన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు అతను స్పష్టం చేశాడు. ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా కోచ్‌గా లీమన్ బాధ్యతలు చేపట్టాడు. మళ్లీ మాట్లాడతా... చిన్నతనం నుంచి నేను అభిమానించిన క్రీడపై మచ్చపడేలా చేసినందుకు దేశంలోని, ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరికి క్షమాపణలు కోరుతున్నాను. ఇది నా భార్య, పిల్లలకు తీవ్ర భావోద్వేగ సమయం. ఇప్పుడు నా ప్రాధాన్యం నా పిల్లలను నిద్ర పుచ్చడమే. మనసు కొంత స్థిమితపడ్డాక రెండు రోజుల్లో మళ్లీ మాట్లాడతాను. ఏడాది నిషేధ సమయాన్ని కుటుంబం, స్నేహితులు, సన్నిహితులతో గడపాలని అనుకుంటున్నా. కుటుంబంతో వార్నర్ పూర్తి బాధ్యత నాదే... ట్యాంపరింగ్ ఘటన నా నాయకత్వ వైఫల్యమే. అందుకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఇతరులెవరినీ నిందించలేను. చేసిన తప్పునకు పర్యవసానాలను ఎదుర్కొంటున్నాను. గొప్ప వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు. ఇలా చేసేందుకు అనుమతించడం నా నిర్ణయ లోపం. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్‌లో జరగదని హామీ ఇస్తున్నాను. ఇది జీవితాంతం చింతించాల్సిన విషయం. అందరికీ పాఠం. కానీ నష్టం భర్తీకి చేయగలిగినంత చేస్తా. ఓ మార్పునకు నేనో కారణం కావొచ్చు. కాలంపై ఆశగా ఉన్నా. కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందగలనన్న నమ్మకం ఉంది. ప్రపంచంలోనే క్రికెట్ గొప్ప క్రీడ. ఇది నా జీవితం. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఉన్నత స్థితి, గౌరవం పొందా. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఓ నిర్ణయం తీసుకునేటపుడు దాని ప్రభావం ఎవరిపై ఉంటుందో ఆలోచించాలి. అది తల్లిదండ్రులనూ ఇబ్బంది పెట్టొచ్చు. వృద్ధాప్యంలోని నా తండ్రి బాధను చూడండి. నా చర్యతో అమ్మ కూడా బాధపడుతోంది. అందరి మనసులను తీవ్రంగా గాయపర్చినందుకు ఆస్ట్రేలియా ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. -
కోచ్ పదవి నుండి తప్పుకున్న డారెన్ లీమన్
-
ఆసీస్‌కు మరో షాక్.. కోచ్ కూడా..!
బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తూనే ఉంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ ఇప్పటికే నిషేధానికి గురయ్యారు. ఈ వివాదంతో కుంగిపోయిన ఆసీస్ జట్టుకు మరో షాక్ తగిలింది. తాజాగా ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ కూడా జట్టుకు దూరం కాబోతున్నారు. బాల్ ట్యాంపరింగ్ స్కాంతో ప్రమేయం లేకపోయినప్పటికీ.. తాను రాజీనామా చేస్తున్నట్టు లీమన్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు ముగిసిన తర్వాత తాను కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. ‘ఈ ప్రస్థానంలో ఎన్నిసార్లు ప్రియమైన వారికి దూరంగా ఉంటామో ఇక్కడ ఉండేవారికి తెలుసు. కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాత నేను రాజీనామా చేయడానికి ఇదే మంచి సమయమని నిర్ణయించుకున్నా’ అంటూ కంటతడి పెడుతూ లీమన్ మీడియాతో తెలిపారు. బాల్ ట్యాంపరింగ్ విషయంలో లీమన్ ప్రమేయం లేదని, తాము బాల్ ఆకారాన్ని మార్చాలనుకున్న విషయం ఆయనకు తెలియనే తెలియదని స్టీవ్ స్మిత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైదానంలో బాల్ ఆకారాన్ని మార్చేందుకు బెన్‌క్రాఫ్ట్ ప్రయత్నిస్తున్న సమయంలో ‘ఏం జరుగుతోంది. అసలేం జరుగుతోంది’ అంటూ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు పీటర్ హ్యాంద్స్కంబ్తో లీమన్ వాకీటాకీలో పేర్కొనడంతో.. ఆయన ఈ వివాదం నుంచి బయటపడ్డారు. ‘ఆటగాళ్లతో మాట్లాడి.. వారికి వీడ్కోలు చెప్పడం చాలా కష్టమైన పని. కానీ నేను వెళ్లిపోక తప్పదు. గత కొన్నిరోజులుగా ఎన్నో పరిణామాలు.. ఎన్నో దుర్భాషలు ఎదుర్కొన్నాను. దీనికి ఎవరో ఒకరు మూల్యం చెల్లించాలి. వాళ్లు (స్టీవ్‌స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్) తప్పు చేశారు. ఆస్ట్రేలియా జట్టు మళ్లీ బలోపేతం అవుతుందని, ఈ యువ ఆటగాళ్లను ఆస్ట్రేలియా ప్రజలు మన్నిస్తారని, వారు తిరిగి జట్టులోకి వస్తారని ఆశిస్తున్నా’ అని లీమన్ మీడియాతో తెలిపాడు. -
అయ్యో స్మిత్.. నిన్ను చూస్తే గుండె తరుక్కుపోతోంది!
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో జరిగిన తప్పును ఒప్పుకుంటూ స్టీవ్ స్మిత్ కంటతడి పెట్టాడు. ఈ తప్పిదానికి తనదే పూర్తి బాధ్యత అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎగదన్నుకొని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. మాట్లాడానికి ప్రయత్నించాడు. మీడియా సమావేశంలో ఉద్విగ్నుడై.. మాటలు వెతుక్కుంటూ వెక్కీ వెక్కీ ఏడ్చాడు. బాల్ ట్యాంపరింగ్ తప్పిదం తనను ఎంతో బాధకు గురిచేసిందని కన్నీరు కార్చాడు. సిడ్నీలో స్టీవ్ స్మిత్ నిర్వహించిన మీడియా సమావేశం ఆయన అభిమానుల్నే కాదు తోటి క్రికెటర్లను కదిలించింది. అతను వ్యక్తం చేసిన బాధను చూసి.. అయ్యో స్మిత్ అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో మంచి బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ ఒకరని, అతను తప్పకుండా తిరిగొచ్చి.. మళ్లీ క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంటాడని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. స్టీవ్ స్మిత్ ప్రెస్‌మీట్ తర్వాత.. గుండె పగిలిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ట్వీట్ చేశాడు. స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్ మీడియా సమావేశాలను చూడలేకపోయానని, వారు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్‌లో మరింత ఉత్తమంగా తిరిగొస్తారని మరో ఆటగాడు మిట్చెల్ జాన్సన్ ట్వీట్ చేశాడు. ‘స్టీవ్ స్మిత్ బాధ నన్ను కదిలిస్తోంది. మళ్లీ క్రికెట్లోకి తిరిగొచ్చి తన సుప్రీం బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానల్ని అలరిస్తాడని ఎదురుచూస్తున్నా.. షేన్ వార్న్ కూడా ఇలాగే ఏడాది నిషేధం ఎదుర్కొని.. తిరిగొచ్చి శ్రీలంకపై మూడు టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు’ అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు. -
భయపడి అబద్ధం చెప్పాను.. సారీ!
పెర్త్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో తొమ్మిది నెలలపాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ కామెరాన్ బెన్‌క్రాఫ్ట్.. తాను తప్పు చేసినట్టు అంగీకరించాడు. బాల్ ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమేనని, కానీ భయపడి.. ఆ విషయంలో అబద్ధం చెప్పానని తెలిపాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందని అతను కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. కెప్టౌన్లో దక్షిణాఫ్రికాతో మూడోటెస్టు సందర్భంగా సాండ్ పేపర్‌తో బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించి.. బెన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తోపాటు బెన్క్రాఫ్ట్పైనా క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది. బెన్క్రాఫ్ట్ను 9 నెలలపాటు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశం తిరిగొచ్చిన బెన్‌క్రాఫ్ట్ పెర్త్‌లో మీడియాతో మాట్లాడాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు దేశ ప్రజలకు, క్రికెట్ అభిమానులకు బెన్‌క్రాఫ్ట్ క్షమాపణలు చెప్పాడు. జరిగిన తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దేశం తరఫున, తన రాష్ట్రం తరఫున ఆడటం కన్నా గొప్ప గౌరవం తనకు మరోటి లేదని చెప్పాడు. గత ఐదురోజులుగా జరిగిన పరిణామాలు వివరిస్తూ.. బెన్‌క్రాఫ్ట్ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను చేసిన తప్పు దేశ ప్రజలను, క్రికెట్ కమ్యూనిటీ తలదించుకునేలా చేసిందని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని తెలిపాడు. -
ఐయామ్ సారీ.. నాదే బాధ్యత
-
సారీ.. నాదే బాధ్యత : కంటతడి పెట్టిన స్మిత్
సాక్షి, సిడ్నీ : బ్యాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు క్షమాపణలు తెలియజేశాడు. గురువారం సిడ్నీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్మిత్ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన తప్పుకు ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తూ స్మిత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ట్యాంపరింగ్ వ్యవహారం ‘నన్ను క్షమించండి. కెప్టెన్‌గా జరిగిన పరిణామాలకు నాదే పూర్తి బాధ్యత. నాయకుడిగా నేను పూర్తిగా విఫలం అయ్యా. నిర్ణయం పేరిట నేను ఘోర తప్పిదం చేశాను. పైగా దానిని కప్పిపుచ్చుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలు నాకు మరింత నష్టాన్ని కలిగించాయి. ఈ తప్పు నన్ను జీవితం వెంటాడుతుంది’ అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. .. ‘నాకు జరిగిన ఈ నష్టం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే.. ఇది ఇతరులకు గుణపాఠం కావటమే. ఇది క్రీడా వ్యవస్థలో ఒక మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నా. క్రికెట్ నా జీవితం. మైదానంలో మళ్లీ త్వరగా అడుగుపెట్టాలని కొరుకుంటున్నా’ అని స్మిత్ గద్గద స్వరం స్వరంతో చెప్పుకొచ్చాడు. (బయటపడ్డ మరో నిజం) కాగా, బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల అనంతరం మీడియా ముందు మాట్లాడిన స్మిత్.. మ్యాచ్ వ్యూహంలోనే భాగంగా టీమంతా ఈ పనికి పాల్పడినట్లు చెప్పటం.. ఆ వ్యాఖ్యలు మరింత విమర్శలకు దారితీయటం తెలిసిందే. (ట్యాంపరింగ్‌పై సంచలన వ్యాఖ్యలు), (ఈ వీడియో చూస్తే నవ్వాగదు) -
స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం
-
స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం
సాక్షి, జొహన్నెస్‌బర్గ్ : ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభం ఎదురైంది. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో స్వదేశానికి బయలుదేరిన అతన్ని జొహన్నెస్‌బర్గ్ ఎయిర్‌పోర్టులో కొందరు చుట్టు ముట్టారు. ఛీట్.. ఛీట్.. అంటూ నినాదాలు చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది స్మిత్‌ను లోపలికి తీసుకెళ్లారు. అదే సమయంలో మీడియా స్మిత్‌ను ముట్టడించి ప్రశ్నల వర్షం గుప్పించింది. అయినప్పటికీ అతనేం స్పందించపోగా.. అధికారులు అతన్ని వేగంగా తీసుకెళ్లారు. ఇక గురువారం సాయంత్రం సిడ్నీలో స్మిత్ విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నాడు. ట్యాంపరింగ్‌పై విలేకరుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటాడో... వాటికి ఎలా స్పందిస్తాడో చూడాలి. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ర్టేలియా(సీఏ) స్మిత్, వార్నర్‌పై ఏడాది నిషేధం, మరో ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. -
కోట్లు పోతున్నాయి
ట్యాంపరింగ్‌తో పరువు ఎలాగూ పోయింది...ఏడాది పాటు బ్యాట్‌ను ఇంట్లో మూలన పెట్టేయాల్సిందే... కానీ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు వీటితో పాటు ఆర్థికపరంగా కూడా భారీ స్థాయిలో నష్టం జరగనుంది. ఆటపరంగా, ఆర్జనపరంగాఆస్ట్రేలియా క్రికెట్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నవీరిద్దరిపై తాజా పరిణామాలతో పెద్ద దెబ్బే పడబోతోంది. ఐపీఎల్‌కు దూరం కావడంతో పెద్ద మొత్తం కోల్పోయిన వీరిద్దరు సంవత్సరం పాటు ఇతర మ్యాచ్ ఫీజుల డబ్బులు కూడాపోగొట్టుకుంటారు. అన్నింటికి మించి వ్యక్తిగత స్పాన్సర్షిప్ ఒప్పందాలు దూరం కావడం వల్ల జరిగే నష్టం కూడా చాలా పెద్దది. సాక్షి క్రీడా విభాగం: ఆస్ట్రేలియా జట్టు రాబోయే షెడ్యూల్‌ను బట్టి చూస్తే సంవత్సర కాలంలో ఆ జట్టు 12 టెస్టులు, 26 వన్డేలు, 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడబోతోంది. కచ్చితంగా మూడు ఫార్మాట్లలో కూడా తుది జట్టులో ఉండగలిగే స్మిత్, వార్నర్ ఈ మ్యాచ్‌లు అన్నింటికీ దూరమవుతున్నారు. ఇంగ్లండ్ పర్యటన (ఐదు వన్డేలు, ఒక టి20), పాకిస్తాన్‌తో యూఈఏలో సిరీస్ (3 టెస్టులు), స్వదేశంలో దక్షిణాఫ్రికా (ఐదు వన్డేలు, 3 టి20లు), భారత్ (నాలుగు టెస్టులు) ఇందులో అతి ప్రధానమైనవి. ఇవి కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగే సిరీస్‌లకు కూడా వీరిద్దరు దూరం కానున్నారు. ఐపీఎల్ దెబ్బ... స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్, వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలానికి ముందు తమతో అట్టి పెట్టుకున్నాయి. నిబంధనల ప్రకారం ఇద్దరిని చెరో రూ. 12 కోట్ల మొత్తానికి ఆయా ఫ్రాంచైజీలు ఉంచుకున్నాయి. స్మిత్ బ్యాటింగ్‌కంటే కూడా అతని నాయకత్వ ప్రతిభకారణంగానే రాయల్స్ ఎంచుకుందనేది వాస్తవం. 45 రోజుల వ్యవధిలో అతను ఇంత పెద్ద మొత్తం కోల్పోతున్నాడు. మరోవైపు 2016లో జట్టును చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా వార్నర్‌కు సన్‌రైజర్స్ ప్రత్యేక విలువ ఇచ్చింది. అందుకే కెప్టెన్‌గా తొలగించడంలో తొందర పడలేదు. బ్యాట్స్‌మన్‌గానైనా అతడిని ఆడించాలనే ఆలోచనే చివరి నిమిషం వరకు కూడా వారిలో కనిపించింది. అయితే నేరుగా బీసీసీఐ అడ్డు చెప్పడంతో మరో అవకాశం లేకుండా పోయింది. కాంట్రాక్ట్ మొత్తమూ... ప్రస్తుతం స్మిత్, వార్నర్ మ్యాచ్ ఫీజు రూపంలో ఆసీస్ బోర్డు నుంచి చెరో 5 లక్షల 80 వేల ఆస్ట్రేలియా డాలర్లు తీసుకుంటున్నారు. వార్షిక కాంట్రాక్ట్ రూపంలో స్మిత్‌కు 15 లక్షల డాలర్లు, వార్నర్‌కు 8 లక్షల 16 వేల డాలర్లు లభిస్తున్నాయి. ఐపీఎల్ మొత్తంతో పాటు దీనిని కలిపితే స్మిత్ ఏడాదికి 45 లక్షల 80 వేల ఆసీస్ డాలర్లు, వార్నర్ 38 లక్షల 96 వేల ఆసీస్ డాలర్లు పోగొట్టుకుంటారు. మన కరెన్సీలో చూస్తే స్మిత్‌కు రూ. 22 కోట్ల 90 లక్షలు... వార్నర్‌కు రూ. 19 కోట్ల 48 లక్షల నష్టం జరగనుంది. ఏ రకంగా చూసినా మైదానంలో ఆట ద్వారా దక్కే ఆర్జనను వీరు భారీగా కోల్పోయినట్లే లెక్క. స్పాన్సర్లూ వెనక్కి... ట్యాంపరింగ్‌తో దేశ ప్రజలందరి దృష్టిలో విలన్లుగా మారిన క్రికెటర్లతో అనుబంధం కొనసాగించడం ఏ సంస్థకైనా కష్టమే. బ్రాండ్ అంబాసిడర్లుగా తమ ఉత్పత్తుల స్థాయిని పెంచాల్సినవాళ్లు చేసిన పనితో తమ ప్రతిష్ట ఇంకా దెబ్బ తినవచ్చని వారు భయపడటం సహజం. అందుకే ఇప్పుడు వీరిద్దరి స్పాన్సర్లలో ఎంత మంది కొనసాగుతారో చెప్పడం కష్టం. వార్నర్‌తో ఒప్పందం పునరుద్ధరించుకోబోమని ఎల్జీ ఇప్పటికే ప్రకటించింది. అతనికి నెస్లే మైలో, టయోటా, అసిక్స్, గ్రే నికోల్స్‌తో ఒప్పందం ఉంది. స్మిత్‌కు న్యూ బ్యాలెన్స్ ప్రధాన స్పాన్సర్ కాగా...జిల్లెట్, ఫిట్‌బిట్, వీట్ బిక్స్ తదితర సంస్థలతో పెద్ద ఒప్పందాలు ఉన్నాయి. క్రికెట్‌పరంగా కోల్పోయే డబ్బుతో పాటు ఇవన్నీ కూడా జత కలిస్తే ట్యాంపరింగ్ వీరిద్దరిపై ఎంత ప్రభావం చూపించబోతోందో అర్థమవుతుంది. ఇందుకే వారికి శిక్ష తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనను ఉల్లంఘించినందుకే ముగ్గురు ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రధానంగా నాలుగు అంశాలను ఇందులో ప్రస్తావించింది. అవి 1) క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయడం 2) స్థాయికి తగినట్లు ప్రవర్తించకపోవడం 3)క్రికెట్ ప్రయోజనాలకు హాని కలిగించడం 4) ఆటను వివాదాస్పదం చేయడం. వీటితోపాటు ఆటగాళ్లు వ్యక్తిగతంగా చేసిన తప్పులనూ పేర్కొంది. దాని ప్రకారం ఎవరెలా అంటే... స్టీవ్ స్మిత్: 1. బంతి ఆకారాన్ని కృత్రిమంగా మార్చే ఆలోచన గురించి ఇతడికి తెలుసు. 2. ట్యాంపరింగ్ ప్రణాళిక అమలు కాకుండా నిరోధించలేదు. 3. ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువును మైదానంలో దాచి ఉంచేందుకు ప్రయత్నించడం. 4. బాన్‌క్రాఫ్ట్ ప్రయత్నాలపై మ్యాచ్ అఫీషియల్స్, ఇతరులను తప్పుదారి పట్టించడం. 5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలతో పాటు ప్లాన్‌ను పొడిగించి, అందులో అందరినీ భాగస్వాములుగా చేసేందుకు ప్రయత్నించడం. డేవిడ్ వార్నర్: 1. ట్యాంపరింగ్ ఆలోచనను రూపొందించడం. 2. బంతి ఆకారం దెబ్బతీసేలా జూనియర్ ఆటగాడికి సూచనలు చేయడం. 3. బంతి స్వరూపాన్ని ఎలా మార్చవచ్చో సలహాలివ్వడంతో పాటు వివరించి చూపడం. 4. ప్లాన్ అమలును నిరోధించడంలో విఫలమవడం. 5. తన పరిజ్ఞానంతో మ్యాచ్ అధికారులను తప్పుదోవ పట్టించడం, ట్యాంపరింగ్‌లో భాగం కావడం. 6. మ్యాచ్ అనంతరం కూడా తన ఆలోచనను స్వచ్ఛందంగా వెల్లడించకపోవడం. బాన్‌క్రాఫ్ట్: 1. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసే ఆలోచనలో నేరుగా పాల్గొనడం. 2. ట్యాంపరింగ్ ప్రయత్నాన్ని కొనసాగించడం 3. తన దగ్గర ఉన్న వస్తువును దాచి ఉంచేందుకు ప్రయత్నించడం. 4. మ్యాచ్ అధికారులు, ఇతరులను తప్పుదారి పట్టించడం. 5. పరిస్థితిపై తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం. -
నిజాయతీగా ఆడాలని నేను నమ్ముతాను..
అంతా ఊహించిందే జరిగింది. బాల్ ట్యాంపరింగ్ దుశ్చర్య స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌ల కెరీర్‌కు చుట్టుకుంది. ఈ ఘటనలో వీరిని దోషులుగా తేల్చిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)... బుధవారం చర్యలను ప్రకటించింది. స్మిత్,వార్నర్‌లపై 12 నెలలు, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది. ఆ తర్వాత స్మిత్ మరో ఏడాది పాటు కెప్టెన్సీ చేపట్టేందుకూ వీల్లేకుండా,వార్నర్‌ను శాశ్వతంగా కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవులకు అనర్హుడిగా పేర్కొంటూ ఆదేశాలిచ్చింది. స్మిత్ ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ సారథ్యం వదులుకోగా...సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి వార్నర్ తప్పుకొన్నాడు. నిషేధంపై వీరు ముగ్గురు అప్పీల్ చేసుకునేందుకు వారం గడువు ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో చివరిదైన నాలుగో టెస్టులో వీరి స్థానాలను ఓపెనర్లు జో బర్న్స్, మ్యాట్ రెన్షా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ భర్తీ చేయనున్నారు. వికెట్ కీపర్ టిమ్ పైన్ సారథ్యం వహించనున్నాడు. సిడ్నీ: తమ ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై తగిన చర్యలు తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. దీనిప్రకారం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్ 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. అయితే... క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్ క్రికెట్ ఆడుకునేందుకు అనుమతించింది. నిషేధం ముగిసిన 12 నెలల అనంతరం కూడా స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోమని సీఏ పేర్కొంది. ఆ తర్వాత బాధ్యతలు అప్పగించే విషయం ఇతర ఆటగాళ్లు, అభిమానుల అభిప్రాయాల మేరకు ఉంటుందని వివరించింది. వార్నర్‌కు భవిష్యత్‌లో ఎప్పటికీ సారథ్యం దక్కదని స్పష్టం చేసింది. అసలేం జరుగుతోంది? బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడుతుండటాన్ని తెరపై చూసిన కోచ్ డారెన్ లీమన్... వాకీటాకీలో హ్యాండ్స్కోంబ్తో ఏమని మాట్లాడాడో క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ వెల్లడించారు. ఆ సందర్భంగా లీమన్... ‘ఏం జరుగుతోంది అక్కడ?’ అంటూ హ్యాండ్స్‌కోంబ్‌ను ప్రశ్నించాడని సదర్లాండ్ తెలిపారు. టీ విరామంలో డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన ఆటగాళ్లనూ అతడు ఇదే ప్రశ్న అడిగాడని వివరించారు. విచారణ నివేదికలోనూ ఇదే విషయం ఉండటంతో ట్యాంపరింగ్‌లో లీమన్ పాత్ర ఏమీ లేదని స్పష్టమైంది. ఈ కారణంగానే అతడిపై చర్యలకు అవకాశం లేకుండా పోయింది. క్రికెట్‌కు జెంటిల్మన్ గేమ్‌గా గుర్తింపు ఉంది. నిజాయతీగా ఆడాలని నేను నమ్ముతాను. జరిగిన ఘటన దురదృష్టకరం. అయితే క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు సరైన నిర్ణయమే తీసుకున్నారు. గెలవడం ముఖ్యమే కానీ ఎలా గెలిచారనేది కూడా అంతకంటే ముఖ్యం. –సచిన్ టెండూల్కర్ అన్ని కోణాల్లో విచారించాం. తప్పు చేసిన ఆటగాళ్లకు ఈ శిక్షలు సరైనవే. క్రికెట్ కీర్తి, స్ఫూర్తి నిలిపేందుకు తీసుకున్న ఈ చర్యలతో నేను సంతృప్తి చెందాను. దీని నుంచి అందరూ పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మా పురుషుల జట్టులోని సంస్కృతి, ఆటగాళ్ల ప్రవర్తన స్వీయ సమీక్ష చేసుకుంటాం. – సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ భావోద్వేగాలను కాస్త పక్కనపెట్టి ఆలోచిద్దాం. అవసరం లేకపోయినా ఒకరిని నష్టపరచడం సరైంది కాదు. వారు చేసిన చర్యను సమర్థించుకోలేరు. కానీ ఏడాది నిషేధం అనేది సరైంది కాదు. నా దృష్టిలో ఒక టెస్టు నిషేధం, కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవులనుంచి ఉద్వాసన, భారీ జరిమానాలే సరైన శిక్ష. ఆ తర్వాత వారు ఆడేందుకు అనుమతించాల్సింది. – షేన్‌వార్న్ ఐపీఎల్ నుంచీ తప్పించారు... న్యూఢిల్లీ: తమ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ కూడా స్పందించింది. వారిని ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరం పెడుతూ నిర్ణయం తీసుకుంది. లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం ఈ మేరకు మీడియాకు తెలిపారు. ‘మొదట ఐసీసీ నిర్ణయం కోసం వేచి చూశాం. తర్వాత సీఏ ఏం చర్యలు తీసుకుంటుందో గమనించాం. ఇప్పుడు మా వంతుగా ఆలోచించి దీనిని ప్రకటించాం. వీరి స్థానాలను భర్తీ చేసుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది’ అని ఆయన వివరించారు. మరోవైపు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్ష, కార్యదర్శులు సీకే ఖన్నా, అమితాబ్ చౌధరి, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలతో సంప్రదించిన తర్వాత స్మిత్, వార్నర్‌లను లీగ్ నుంచి పక్కనపెట్టినట్లు సీఓఏ పేర్కొంది. -
కుట్ర పన్నింది అతడే.. ఎన్నటికీ కెప్టెన్ కాలేడు!
న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అసాధారణ నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్తులో ఎవరూ బాల్ ట్యాంపరింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడకుండా ఆదర్శప్రాయమైన శిక్షలు విధించిందని చెప్పాలి. కెప్టౌన్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మూడో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ వివాదంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌పై అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ ఆడకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన బౌలర్ కామెరాన్ బెన్క్టాఫ్ట్పై తొమిది నెలల నిషేధం విధించింది. అయితే, బాల్ ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు విచారణలో తేలింది. అతనే కుట్రదారుడు.. ఎన్నటికీ కెప్టెన్సీ లేదు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన తాజా బాల్ ట్యాంపరింగ్ పథకానికి ప్రధాన సూత్రధారి డేవిడ్ వార్నర్ అని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చింది. బాల్ ఆకారాన్ని మార్చేందుకు వార్నర్ చేసిన పథక రచన గురించి స్మిత్ కూడా పూర్తిగా తెలుసునని తెలిపింది. ఈ వివాదానికి ప్రధాన కారకుడైన డేవిడ్ వార్నర్ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్, బౌలర్ బెన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. అలాగే కెప్టెన్సీ విషయంలో బెన్క్రాఫ్ట్పైనా రెండేళ్ల నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ రెండేళ్లకాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని, ఆ తర్వాత ప్రజల నుంచి, క్రికెట్ అభిమానుల నుంచి, క్రికెట్ అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే.. అప్పుడు వీరు జట్టు నాయకత్వ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. అయితే, ఈ ఏడాది నిషేధకాలంలో వీరు క్లబ్ క్రికెట్ ఆడవచ్చునని, ఇలా క్లబ్ క్రికెట్ ఆడుతూ.. క్రికెట్ కమ్యూనిటీతో సంబంధాలు కొనసాగించేందుకు వారిని తాము ప్రోత్సహిస్తామని తెలిపింది. ఈ మేరకు విధించిన ఆంక్షలపై అప్పీల్ చేసుకునేందుకు దోషులైన క్రికెటర్లకు ఏడు రోజులు గడువు ఇచ్చింది. -
మరో 24 గంటలు!
ఇప్పటివరకు క్రికెట్లో ఉత్కంఠఅంటే మనకు తెలిసింది మ్యాచ్ చివరి ఓవర్ వరకు పోటాపోటీగా సాగడం... ఆఖరి బంతికి సిక్స్ కొట్టో... వికెట్ తీసో జట్టును గెలిపించడం! అచ్చంగా వీటిని తలపించేలా ‘బాల్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ ఫలితం’ సాగుతోంది! ఇటు ట్యాంపరింగ్ మోసంపై కొనసాగిన విమర్శలు! అటు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఆటగాళ్లతో పాటు కోచ్‌పై ఆ తరహా చర్యలుంటాయి... ఈ తరహా చర్యలుంటాయంటూ రోజంతా ఊహాగానాలు! వీటన్నిటికీ జవాబు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ వైపు అందరి చూపు! ‘విషయం తేల్చేశాం’ అన్నట్లు మంగళవారం రాత్రి ఆయన గంభీరంగా మీడియా సమావేశానికి వచ్చారు. కానీ... సగం తీర్పే చెప్పారు. తదుపరి వివరాలను 24 గంటల్లో వెల్లడిస్తామని ప్రకటించి ముగించారు. మొత్తానికిదోషులెవరో స్పష్టమైంది. మిగిలింది వారి క్రీడా భవితవ్యంపై కీలకనిర్ణయమే! బుధవారంతో ఈ సస్పెన్స్ కూడా వీడిపోనుంది. జొహన్నెస్‌బర్గ్: తమ దేశ క్రికెట్‌ను కుదిపేస్తూ... అవమానాల పాల్జేస్తున్న ‘బాల్ ట్యాంపరింగ్’ ఘటన వెనుక ఉన్నదెవరో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ అధికారికంగా వెల్లడించారు. తమ బోర్డు అధికారుల విచారణ వివరాలతో మంగళవారం రాత్రి ఆయన ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ట్యాంపరింగ్ ఉదంతంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌లు దోషులుగా తేలినట్లు ప్రకటించారు. కోచ్ డారెన్ లీమన్ సహా మిగతా ఆటగాళ్లెవరికీ ఇందులో పాత్ర లేదని స్పష్టం చేశారు. విచారణ ముగిశాక, ముగ్గురు ఆటగాళ్లపై తాము తీసుకునే చర్యలను 24 గంటల తర్వాత తెలియజేస్తామన్నారు. వేటుపడినవారు తక్షణమే స్వదేశానికి పయనమవుతారని వారి స్థానాలను మాథ్యూ రెన్షా, జో బర్న్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో భర్తీ చేయనున్నట్లు.... వికెట్ కీపర్ టిమ్ పైన్ నాలుగో టెస్టుకు సారథ్యం వహిస్తాడని పేర్కొన్నారు. లీమన్ రాజీనామా చేశాడన్న వార్తలు నిజం కాదని... ప్రస్తుత కాంట్రాక్ట్‌తోనే అతడు కొనసాగుతాడని వివరించారు. ‘కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో మా ఆటగాళ్ల ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నాం. స్మిత్, వార్నర్, బాన్క్రాఫ్ట్లే ట్యాంపరింగ్‌లో భాగస్వాములని సీఏ విచారణలో తేలింది. విస్తృత స్థాయి పేరు ప్రఖ్యాతులు ముడిపడి ఉన్న ఈ ఘటనలో తీసుకునే చర్యలు కూడా అంతే కఠినమైనవి. విచారణలో స్పష్టమైన అంశాలతో ఇది ముందుకు సాగుతుంది. ఈ ఉదంతంతో మా పురుషుల జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై నిపుణుల బృందంతో స్వీయ సమీక్ష చేసుకుంటాం’ అని సదర్లాండ్ అన్నారు. కలుపు మొక్క వార్నర్! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణలో ముగ్గురు ఆటగాళ్లు దోషులుగా తేలినా జట్టు గత రెండు రోజులుగా సాగుతున్న పరిణామాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అంతర్గత సమాచారం ప్రకారం ట్యాంపరింగ్‌కు అసలు సూత్రధారి డేవిడ్ వార్నరే అని వినిపిస్తోంది. బంతిని టేపుతో ట్యాంపరింగ్ చేయాలనే ఆలోచన తనదే అని, ఓపెనింగ్ సహచరుడు బాన్‌క్రాఫ్ట్‌తో ఆ పని చేయించాలని కూడా అతనే చెప్పాడని తెలిసింది. దీనికి ఊ కొట్టడం వరకే స్మిత్ పరిమితమయ్యాడు. ట్యాంపరింగ్కంటే కూడా ‘అసలు సమస్య వార్నర్’ అని ఒక సీనియర్ ఆసీస్ బోర్డు అధికారి చెప్పడం పరిస్థితిని సూచిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే ఆసీస్ జట్టులోని ఆటగాళ్లంతా వార్నర్‌ను వెంటనే జట్టు నుంచి బయటకు పంపించాలని కూడా కోరుకున్నట్లు సమాచారం. తమతో ఎలాంటి సంప్రదింపులు జరగకపోయినా ట్యాంపరింగ్‌కు సంబంధించి తమ పేర్లను చేర్చడంపై పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్, స్పిన్నర్ నాథన్ లయన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన దగ్గరి నుంచి అతను సహచరులతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నాడు. టీమ్ వాట్సప్ గ్రూప్ నుంచి వార్నర్ తనంతట తానుగా తప్పుకోవడం కూడా జట్టుతో అతనికి ప్రస్తుతం ఉన్న సంబంధాల పరిస్థితి గురించి చెబుతోంది! 2013లో బార్లో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌ను కొట్టిన నాటి నుంచి తమ బోర్డుతో వార్నర్‌కు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. గత ఏడాది ఆటగాళ్ల జీతాల పెంపు విషయంలో అతను గట్టిగా పోరాడాడు. ఇప్పుడు సరిగ్గా అదను చూసి బోర్డు కూడా వార్నర్‌ను బద్నామ్ చేసే కార్యక్రమంలో చేరింది. 2014లో యాషెస్‌తో 0–5తో ఇంగ్లండ్ చిత్తుగా ఓడిన తర్వాత కెవిన్ పీటర్సన్పై వేటు పడింది. నిజానికి జట్టు మొత్తం విఫలమైనా... వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాడనే సాకుతో అతనిపై బోర్డు చర్య తీసుకుంది. ఆసీస్ జట్టులో తాజా పరిణామాలు కూడా సరిగ్గా అదే తరహాలో సహచరులతో సమస్యలు చూపిస్తూ వార్నర్ కెరీర్‌కు ముగింపు పలకవచ్చు! లీమన్‌కు ఏమీ తెలీదా! బాల్ ట్యాంపరింగ్ వివాదం గురించి సదర్లాండ్ చేసిన ప్రకటనలో అన్నింటికంటే ఆశ్చర్యకరమైంది కోచ్ డారెన్ లీమన్‌కు క్లీన్చిట్ ఇవ్వడం. అతను ఎలాంటి తప్పు చేయలేదని, తన కాంట్రాక్ట్ ప్రకారం కోచ్‌గా కొనసాగుతాడని సదర్లాండ్ చెప్పారు. కానీ ఘటన జరిగిన రోజు వీడియోను చూస్తే లీమన్ పాత్ర ఏమిటో చిన్న పిల్లాడు కూడా చెప్పగలడు. టీవీ స్క్రీన్‌పై బాన్‌క్రాఫ్ట్ టేపు దృశ్యాలు కనిపించగానే వాకీటాకీలో హ్యాండ్స్కోంబ్కు సమాచారం ఇవ్వడం... అతడు దానిని బాన్‌క్రాఫ్ట్‌కు చేరవేయడం స్పష్టంగా కనిపించింది. జట్టు కోచ్‌గా అతని ప్రమేయం ఏమీ లేకుండా ఇంత పెద్ద ఘటన జరిగిందనడం నమ్మశక్యంగా లేదు. కాబట్టి లీమన్‌ను కావాలనే రక్షిస్తున్నట్లుగా అనిపిస్తోంది. నైపుణ్యం పరంగా గొప్ప కోచ్ కాకపోయినా కేవలం బోర్డులో తనకు ఉన్న సంబంధాలతో ‘సిఫారసు’ వ్యక్తిగా లీమన్ కోచ్‌గా కొనసాగుతున్నాడనేది చాలా కాలంగా ఉన్న ఆరోపణే. ఐదేళ్ల క్రితం మికీ ఆర్థర్‌తో ఆస్ట్రేలియా బోర్డుకు గొడవ జరిగిన సమయంలో అప్పటికప్పుడు తాత్కాలికంగా ఎంపిక చేయబడిన లీమన్, ఆ తర్వాత ఎన్ని వైఫల్యాలు ఎదురైనా వేటు పడకుండా తప్పించుకోగలగడం అతనికి ఉన్న పట్టును సూచిస్తోంది. మరోవైపు తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యను కూడా సదర్లాండ్ ‘అబద్ధం’గా మార్చేశారు. లంచ్ సమయంలో తమ మధ్య చర్చ జరిగిందని, ‘లీడర్షిప్ గ్రూప్’ కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమని ఆ రోజు స్మిత్ చెప్పాడు. కానీ కేవలం ముగ్గురే దోషులంటూ తాజా విచారణలో తేల్చారు. జట్టులో అందరికంటే తక్కువగా ఏడు టెస్టుల అనుభవం ఉన్న బాన్‌క్రాఫ్ట్ లీడర్షిప్ గ్రూప్‌లో ఏ రకంగా చూసినా భాగం కాదు. అంటే కేవలం వార్నర్, స్మిత్ మాత్రమే కలిసి వ్యూహం రచించారా! అన్నింటికి మించి ఒక్క బౌలర్‌కు కూడా ట్యాంపరింగ్‌లో పాత్ర లేదనేని మరింత ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా బాల్ ట్యాంపరింగ్ చేస్తే దానిని సమర్థంగా వాడుకోగలిగేది బౌలర్ మాత్రమే. అప్పటి వరకు బంతి ఏ మేరకు స్వింగ్ అయింది? అసలు రివర్స్ స్వింగ్ అవుతోందా లేదా? ఒక వేళ బంతి ఆకారాన్ని దెబ్బ తీస్తే అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందో ఒక బౌలర్ మాత్రమే అంచనా వేయగలడు. కానీ సదర్లాండ్ చెప్పిన దాని ప్రకారం ఆ జట్టు బౌలర్లకు పనికొచ్చేలా ముగ్గురు బ్యాట్స్‌మెన్ కలిసి కుట్ర పన్నారు! మొత్తం సదర్లాండ్ ప్రకటన చూస్తే ఈ ఘటన పట్ల తామంతా బాధపడిపోతున్నట్లు, జాతికి క్షమాపణలు కోరుతున్నట్లు కనిపించినా... మొత్తం మీడియా సమావేశంలో ఒక్కసారి ‘చీటింగ్’ పదం వాడకపోవడం గానీ చూస్తే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మాత్రం నిజాయితీ లేదనేది వాస్తవం. బుధవారం ముగ్గురు క్రికెటర్లపై శిక్షలు ఖరారయ్యాక గానీ ఆసీస్ బోర్డు ఈ వ్యవహారంలో ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుంది. -
నీ భార్యాపిల్లలకు జరిగితే.. ఇలాగే స్పందిస్తావా?
బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కొందరు నెటిజన్లు ఆసీస్ క్రికెటర్లపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆసీస్ క్రికెటర్లపై ‘వ్యక్తిగత దూషణలు’ ప్రోత్సహించేవిధంగా ఆయన ట్వీట్ ఉండటంతో.. డేవిడ్ వార్నర్ భార్య క్యాండైస్ ఘాటుగా స్పందించింది. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడించింది. అయితే, క్రికెటర్లపై ‘వ్యక్తిగత దూషణ’ను తాను ప్రోత్సహించడం లేదని వాన్ వివరణ ఇచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆసీస్ బౌలర్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం.. ఈ వివాదంలో జట్టు కెప్టెన్ స్టీవ్ స్మీత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై వేటుపడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆగ్రహంపై వాన్ స్పందిస్తూ.. ‘తమకు వ్యక్తిగత దూషణ ఎదురవుతోందని ఆసీస్ ఆటగాళ్లు అధికారికంగా ఫిర్యాదుచేయడం నాకు కితకితలు తెప్పిస్తోంది’ అని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై క్యాండైస్ ఆగ్రహంగా స్పందించింది. ‘నీకు నవ్వు తెప్పించడం నాకు ఆనందంగా ఉంది. కాబట్టి, నీ భార్యా, పిల్లలకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఎదురైతే.. నువ్వు ఆమోదిస్తావన్నమాట’ అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే, దానిని తాను అంగీకరించబోనని, అయితే, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన ఆధారంగానే బయట ప్రతిస్పందన వ్యక్తమవుతుందని, ఈ విషయాన్ని గుర్తించాలని వాన్ మరో ట్వీట్లో వివరణ ఇచ్చారు. ఆస్ట్రేలియా జట్టు తాజా దక్షిణాఫ్రికా పర్యటన వివాదాల మధ్య నడుస్తున్న సంగతి తెలిసిందే. వార్నర్ భార్య క్యాండైస్, న్యూజీల్యాండ్ రగ్బీ స్టార్ సోని బిల్ విలియమ్స్‌కు ఎఫైర్ ఉందని, 2007లో సిడ్నీలో వీరు గడిపారనే పుకార్లను మైదానంలో సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీ కాక్.. వార్నర్‌ను రెచ్చగొట్టేలా పేర్కొనడంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగే పరిస్థితి నెలకొంది. దక్షిణాఫ్రికా అభిమానులు కూడా ఈ ఎఫైర్ గురించి మైదానంలో వ్యాఖ్యలు చేయడం, సొని బిల్ మాస్కులు ధరించి రావడం ఆసీస్ ఆటగాళ్లను రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలో వెలుగుచూసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ ఆటగాళ్ల ప్రతిష్టను దిగజార్చింది. -
ట్యాంపరింగ్: పట్టించింది డివిలియర్సే.!
కేప్‌టౌన్ : ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్ వివాదం అంతర్జాతీయ క్రికెట్లో తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ జరుగుతుండగా.. అందరూ ఆటపై నిమగ్నమైన వేళ ఒక ఆటగాడి కదలికలపై కన్నేసి, ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్టు ప్రపంచానికి తెలిసేలా చేసింది మాత్రం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫానీ డివిలియర్స్. తాను ఆడుతున్న రోజుల్లోనే ఆసీస్ పని పట్టిన ఈ మాజీ పేస్ బౌలర్ తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఆటగాళ్ల తొండాటను ప్రపంచానికి తెలియ జేశాడు. సాధారణంగా బంతి పాత బడిన తర్వాతే రివర్స్ స్వింగ్ చేయాడానికి వీలుంటుంది. కానీ ఆసీస్ మాత్రం 30 ఓవర్లలోపే కష్టతరమైన పచ్చిక మైదానంపై రివర్స్ స్వింగ్ చేయడం డివిలియర్స్‌కు అనుమానం వచ్చేలా చేసింది. వెంటనే కెమరామెన్లను అప్రమత్తంచేసి ఆసీస్ ఆటగాళ్లపై నిఘా పెట్టమని సూచించాడు. అప్పటికే ఫీల్డ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వారు బెన్‌క్రాఫ్ట్ వివరణ కోరారు. ఆ సమయంలో బెన్ క్రాఫ్ట్ అలాంటిదేమి లేదని, సన్ గ్లాస్ కవర్ అని బుకాయించే యత్నం చేశాడు. దీంతో అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా మ్యాచ్‌ను కొనసాగించారు. అయితే బెన్ క్రాఫ్ట్ అంపైర్లకు చూపించింది, అతని ప్యాంట్లో దాచిన వస్తువు వేరు కావడంతో డివిలియర్స్ వ్యక్తం చేసిన అనుమానం నిజమయింది. దీంతో ఆసీస్ ఆటగాళ్ల ట్యాంపరింగ్ వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌ను 30 కెమెరాలతో కవరేజ్ చేసామని, ట్యాంపరింగ్ యత్నం జరుగుతందని డివిలియర్స్ తమకు చెప్పగానే మరో ఏడు కెమెరాలతో ప్రత్యేకంగా బంతిపైనే నిఘా ఉంచామని మ్యాచ్ ప్రసారం చేసిన టెలివిజన్ అధికారి ఒకరు తెలిపారు. -
ఈ ట్యాంపరింగ్ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
సిడ్నీ : ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రతి సారీ తమ ఆటగాళ్ల తప్పును కప్పిపుస్తూ వెనకెసుకొచ్చె ఆసీస్ మీడియా ఈసారి మాత్రం అందుకు విరుద్దంగానే ప్రవర్తించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై విమర్శల బాణాలను ఎక్కిపెడుతూ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి, ‘స్మిత్స్ షేమ్’ అని స్థానిక మీడియా చానెళ్లు సైతం ఆగ్రహం వెల్గగక్కాయి. ఇదే తరహాలో ఓ ఆస్ట్రేలియన్ రేడియో స్టేషన్ తమ ఆటగాళ్ల తొండాటపై ఓ స్పూఫ్ వీడియో రూపొందించి మరి ట్రోల్ చేస్తోంది. ఈ వీడియోలో తాజా ట్యాంపరింగ్‌తో పాటు 1981 వరల్డ్‌కప్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రేగ్ చాపెల్ అతని సోదరుడు ట్రివర్ చాపెల్‌కు అండర్‌ఆర్మ్ బౌలింగ్ చేయాల్సిందిగా సూచించాడాన్ని కూడా ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ బెన్ క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు యత్నిస్తూ అడ్డంగా దొరికిన విషయం తెలిసిందే. అంతేగాకుండా ఇది జట్టు వ్యూహంలో భాగమేనని కెప్టెన్ స్మిత్ ప్రకటించడంపై తీవ్ర దూమారం రేగింది. ఇప్పటికే ఐసీసీ స్మిత్‌పై ఓ మ్యాచ్ నిషేదం, మ్యాచ్ ఫీజు కోత విధించింది. బెన్ క్రాఫ్ట్, డెవిడ్ వార్నర్‌లకు సైతం మ్యాచ్ ఫీజు కోతతో జరిమానా విధించింది. ఇక ఆసీస్ మీడియా కథనాల ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఈ ముగ్గురి ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేదం విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. -
బాల్ ట్యాంపరింగ్‌పై ఫన్నీ స్పూఫ్!
-
ట్యాంపరింగ్: 37 ఏళ్లుగా నరకం
సాక్షి, స్పోర్ట్స్ : క్రికెట్ ప్రపంచంలో అగ్రశేణి జట్టుగా వెలుగొందుతున్న ఆస్ట్రేలియా పరువు బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఒక్కసారిగా మసకబారింది. సొంత అభిమానులు, దేశ ప్రజల నుంచి ఆసీస్ ఆటగాళ్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కెప్టెన్‌గా స్మిత్ చేసిన పనికి తగిన శిక్ష పడాలంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఆసీస్ మాజీ ఆటగాడు ట్రివర్ చాపెల్(గ్రెగ్ చాపెల్ సోదరుడు) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే 1981 వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా ట్రివర్ చాపెల్ అసాధారణ రీతిలో బౌలింగ్ చేశాడనే ఆరోపణల ఎదుర్కొన్నాడు. దేశ ప్రతిష్టను దిగజార్చాడనే కారణంతో అతడు జీవితంలో చాలా నష్టపోవాల్సి వచ్చింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం గురించి ట్రివర్ చాపెల్ డైలీ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. తప్పు చేశాననే కారణంగా తాను ఎంతో క్షోభ అనుభవించానని చెప్పాడు. 1981 వివాదం గురించి పలు విషయాలు తెలిపాడు. ‘న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కివీస్‌కు ఆరు పరుగులు అవసరం. అప్పుడు కివీస్ టెయిలెండర్ బ్రేన్ మెఖేన్ క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న నా సోదరుడు గ్రెగ్ చాపెల్ అండర్‌ఆర్మ్ బౌలింగ్ చేయాల్సిందిగా సూచించాడు. నేను కూడా అది మంచి ఆలోచన అని భావించాను. కానీ అది నా భవిష్యత్తును అంధకారంలో పడేస్తుందని ఊహించలేదంటూ’ చేదు ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. నా భార్య వదిలి వెళ్లింది.. ‘నేను చేసిన తప్పిదం వల్ల అప్పటి వరకు క్రికెట్లో ఆస్ట్రేలియాకు ఉన్న ప్రఖ్యాతి మంటగలిసింది. ఇప్పటికీ చాలామంది దాని గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు. ఈ వివాదం కారణంగా నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది. మళ్లీ నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఎంతో నష్టపోయాను. జీవితం పరిపూర్ణం కావాలంటే కుటుంబం ఉండాలి. కానీ నాకు అవేమీ లేవు. ప్రస్తుతం పిల్లలకు క్రికెట్ కోచ్‌గా ఉంటూ, గోల్ఫ్ ఆడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాన’ని 37 ఏళ్ల క్రితం నాటి వివాదాన్ని గుర్తుచేసుకున్నాడు 65 ఏళ్ల చాపెల్. వారిని కూడా జీవితాంతం వెంటాడుతుంది.. ‘ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. ఇది నేను స్వయంగా అనుభవించాను. ఇప్పుడు స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లు కూడా అనుభవించక తప్పదు. ఈ వివాదం వారి కెరీర్‌పైనే కాకుండా వ్యక్తిగత జీవితంపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకు వారు సిద్ధంగా ఉండాలి’ అని చాపెల్ సలహా ఇచ్చాడు. ఇప్పటికైనా నన్ను మర్చిపోతే చాలు.. ‘37 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్‌ను మసకబార్చిన వారిలో ముఖ్య పాత్రధారి ఎవరంటే ట్రివర్ చాపెల్ అని గూగుల్‌లో కన్పిస్తుంది. కానీ తాజా ఉదంతం వల్ల నా స్థానంలో స్మిత్, బెన్క్రాప్ట్ల పేరు కన్పిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది’ అంటూ ముగించాడు. -
ట్యాంపరింగ్; ఆ ముగ్గురిపై ఏడాది నిషేధం!
జొహన్నెస్‌బర్గ్/కాన్బెరా: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం విధించనున్నారా, ప్రధాన కోచ్ డారెన్ లీమన్ తక్షణమే పదవి నుంచి తప్పుకుంటారా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మంగళవారం ఆస్ట్రేలియన్ ప్రధాన మీడియా నిండా ఇవే కథనాలు. ట్యాంపరింగ్ వ్యవహారాన్ని తేలికగా తీసుకోవద్దన్న ప్రధాని టర్న్‌బుల్ సూచన మేరకు ఆస్ట్రేలియా క్రికెట్(సీఏ).. స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై కొరడా ఝుళిపించడం ఖాయమని, నాలుగో టెస్టు ప్రారంభానికి ముందే లీమన్ రాజీనామా చేస్తాడని సర్వత్రా చర్చజరుగుతోంది. ఇప్పటికే సౌతాఫ్రికాకు వచ్చి ఆటగాళ్లను విచారిస్తోన్న సీఏ బృందం.. మంగళవారమే తన రిపోర్టును సమర్పించనున్న నేపథ్యంలో నిషేధం వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐసీసీ చేయనిది సీఏ చేస్తుంది: నిబంధనలకు విరుద్ధంగా బంతి ఆకారాన్ని మార్చి ప్రత్యర్థిని దెబ్బతీయాలనే కుట్ర చేయడమేకాక, అది సమిష్టి నిర్ణయమని చెప్పిన ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అరకొర చర్యలతో సరిపెట్టడం దుమారాన్ని రేపుతోంది. అంతపెద్ద తప్పుకు ఇంత చిన్న శిక్ష ఏమిటనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి. తన చేతులతో ట్యాంపర్ చేసిన బెన్‌క్రాఫ్ట్‌పై వేటు పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే, ఆటగాళ్లను శిక్షించడంలో ఐసీసీ చేయనిది సీఏ తప్పక చేస్తుందని ఆసీస్ మీడియా తెలిపింది. క్రికెట్ నిబంధనలను రూపొందించే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) సైతం ట్యాంపరింగ్ ఉదంతంపై ఘాటుగా స్పందించింది. ఆసీస్ ప్లేయర్లను కఠినంగా శిక్షించాల్సిందేనని, అలా చేస్తేనే జెంటిల్మన్ గేమ్ పట్ల భవిష్యత్ తరాలకు మంచి సందేశం ఇచ్చినట్లు అవుతుందని ఎంసీసీ ఉపకార్యదర్శి జాన్ స్టీఫెన్సన్ అభిప్రాయపడ్డారు. కుట్రలో హెడ్ కోచ్ పాత్ర ఏంటి?: జట్టు సభ్యులంతా ముందే చర్చించుకుని ట్యాంపరింగ్ కుట్రను అమలు చేసినట్లు చెప్పుకొచ్చిన స్మిత్.. ఇందులో కోచింగ్ స్టాఫ్ ప్రమేయమేది లేదని అన్నాడు. కాగా, స్మిత్ చెప్పినదాంట్లో అర్థంలేదని ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. ‘‘కుట్రలో కోచ్ లీమన్‌కు ప్రమేయం లేదంటే.. జట్టుపై అతనికి పట్టులేనట్టు అర్థం. ఒకవేళ ప్రమేయం ఉందని తేలితే ఆటగాళ్లతోపాటు అతనూ దోషే అవుతాడు. ఈ రెండు సందర్భాల్లోనూ లీమన్ తప్పుచేసినవాడే అవుతాడు’’ అని క్లార్క్ వ్యాఖ్యానించాడు. -
స్మిత్ బుద్ధి తక్కువ పని చేశాడు
ఎలాగైనా గెలవాలనే ఆస్ట్రేలియా ఆలోచనలో అర్థం లేదు. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ అలా చేయకుండా ఉండాల్సింది. బాల్ ట్యాంపరింగ్ తెలివి తక్కువ పని. భారత్‌తో రివ్యూ వివాదం సమయంలో తన బుర్ర పని చేయలేదని అతను అంటే ఏదో మాట వరసకు అనుకున్నాను. కానీ ఇప్పుడు నిజంగా స్మిత్‌కు బుర్ర లేదని నాకర్థమైంది. 1981 నుంచి ఆస్ట్రేలియా ఇదే తరహాలో క్రికెట్ ఆడుతోంది. –సౌరవ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్ -
విచారణ ప్రారంభం
కేప్‌టౌన్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తున్న ‘బాల్ ట్యాంపరింగ్’పై సోమవారం విచారణ ప్రారంభమైంది. ఇందుకోసం నియమితులైన క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్ కేప్‌టౌన్ చేరుకున్నారు. అసలీ ఆలోచన ఎవరిదో తేల్చేందుకు జట్టు బస చేసిన హోటల్లోనే స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లను వారు విచారిస్తారు. ప్రధాన కోచ్ డారెన్ లీమన్, సహాయక సిబ్బందిని కూడా ప్రశ్నలడగనున్నారు. బుధవారం నాటికి ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా వచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్... రాయ్‌తో జొహన్నెస్‌బర్గ్‌లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా విచారణ అంశాలను తెలుసుకుని తదుపరి చర్యలపై ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే... పరిణామాలపై కొంత ఓపిక పట్టాలని సీఏ చైర్మన్ డేవిడ్ పీవర్ అభ్యర్థించాడు. మరో 48 గంటల్లో ప్రజలకు పూర్తి వివరాలు చెబుతామని ఆయన పేర్కొన్నారు. తాజా సమాచారం ప్రకారం స్మిత్, వార్నర్‌లను కనీసం ఏడాది పాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్ పట్ల కూడా సీఏ కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా జట్టులో మార్పులు? దక్షిణాఫ్రికాతో ఈ నెల 30 నుంచి జరిగే నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులో భారీ మార్పులు ఉంటాయని సమాచారం. బాల్ ట్యాంపరింగ్‌తో స్మిత్ దూరమవడం, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ పైనా చర్యలుంటాయని వార్తలు వస్తుండటంతో వీరి స్థానాలను ఓపెనర్లు రెన్షా, జో బర్న్స్, వెటరన్ బెయిలీలతో భర్తీ చేసే అవకాశముంది. దీంతో పాటు ట్యాంపరింగ్‌ను సారథ్య బృంద ఆలోచనగా స్మిత్ చెప్పడం పట్ల... అందులోని సభ్యులైన పేసర్లు హాజల్‌వుడ్, స్టార్క్‌లు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు స్మిత్ వ్యక్తిగత స్పాన్సర్ అయిన శానిటేరియం సంస్థ అతడితో ఒప్పందాన్ని సమీక్షించనున్నట్లు తెలిపింది. -
ఇది నిలువెల్లా మోసం
సిడ్నీ: సహజంగా తమ ఆటగాళ్లను బాగా వెనకేసుకొచ్చే ఆస్ట్రేలియా మీడియాకు కూడా బాల్ ట్యాంపరింగ్ ఘటన కంపరం పుట్టించినట్లుంది. దేశ జాతీయ క్రీడకు తీరని ద్రోహం, కుళ్లిన సంస్కృతి అంటూ స్థానిక ప్రసార మాధ్యమాలు ధ్వజమెత్తుతుండటమే దీనికి నిదర్శనం. ‘స్మిత్స్ షేమ్’ అంటూ మొదటి పేజీలో కథనం ఇచ్చిన ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక... ‘ఇది హెల్మెట్ నుంచి బూటు వరకు చేసిన నిలువెత్తు మోసం’గా అభివర్ణించింది. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తప్పుకోవాలని డిమాండ్ చేసింది. ‘రెండు దశాబ్దాలుగా సీఏను నడిపిస్తున్న సదర్లాండ్ జాతీయ జట్టు సంస్కృతిని మార్చలేకపోయారు. స్మిత్ చర్య పరిస్థితులరీత్యా చేసింది కాదని సిడ్నీ డైలీ టెలిగ్రాఫ్ పేర్కొనగా, ఈ ఉదంతం స్మిత్, జట్టు పేరు ప్రఖ్యాతులకు కోలుకోలేని దెబ్బని, తీవ్ర మూల్యం చెల్లించారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అభివర్ణించింది. పునరాలోచనలో జట్టు స్పాన్సర్లు... ట్యాంపరింగ్ ఆస్ట్రేలియా జట్టు స్పాన్సర్షిప్పైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. 600 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్ల టీవీ ప్రసార హక్కుల ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. తాజా పరిణామాలతో స్పాన్సర్లు బేరానికి దిగనున్నట్లు తెలుస్తోంది. అతిపెద్ద స్పాన్సర్ అయిన మాజిలాన్ సంస్థ... ట్యాంపరింగ్‌ను తీవ్ర మోసంగా పేర్కొంది. ‘మేం చాలా అసంతృప్తికి గురయ్యాం. మా జాతీయ జట్టు నుంచి ఇలాంటిది ఆశించలేదు’ అని ఎయిర్‌లైన్ క్వాంటాస్ స్పష్టం చేసింది. ఈ సంస్థ పేరున్న జెర్సీనే ప్రస్తుత సిరీస్‌లో ఆటగాళ్లు ధరిస్తున్నారు. ఆ దేశ మహిళా జట్టు స్పాన్సర్ అయిన కామన్వెల్త్ బ్యాంక్ కూడా దీనిపై సీఏ నుంచి వివరణ కోరింది. -
బాటిల్ మూత... దగ్గు బిళ్ల...!
ట్యాంపరింగ్ చేయాలంటే కాస్త కొత్తగా ఏదైనా ఆలోచించాలమ్మా అనుకున్నారేమో... స్మిత్, బాన్‌క్రాఫ్ట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి అడ్హెసివ్ టేపును వాడుకున్నారు. అయితే ఇన్నేళ్లలో బంతిని దెబ్బ తీసేందుకు ‘రొటీన్‌కు భిన్నం’గా ప్రయత్నించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వీటిని చూస్తే ఇలా కూడా బంతి ఆకారాన్ని మార్చవచ్చా అనే సందేహం మీకు రావచ్చు. ట్యాంపరింగ్ చరిత్రలో కొన్ని ఆసక్తికర అంశాలను చూస్తే... –సాక్షి క్రీడావిభాగం ►జాన్ లేవర్ (వ్యాజ్‌లీన్): భారత గడ్డపై 1976–77లో జరిగిన సిరీస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లను కూడా ఇంగ్లండ్ గెలుచుకుంది. ఆ తర్వాత చెన్నైలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ పేసర్ లేవర్ వ్యాజ్‌లీన్ ద్వారా ఒక వైపు బంతి మెరుపును పెంచేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. లేవర్ పదే పదే బంతిని తన నుదుటికి రాయడాన్ని భారత జట్టు గుర్తించి ఫిర్యాదు చేసింది. తాను చెమట మాత్రమే తుడుచుకున్నానని అతను చెప్పినా... బంతిని పరిశీలించగా దానికి వ్యాజ్‌లీన్ రాసి ఉన్నట్లుగా బయటపడింది. అయితే లేవర్ కావాలని చేశాడా... లేక అంతకు ముందు చెమట నుంచి తప్పించుకునేందుకు ఫిజియో ఇచ్చిన వ్యాజ్‌లీన్ టేప్‌లను నుదుటిపై పెట్టుకోవడం వల్ల జరిగిందా అనేది తేలలేదు. ►షాహిద్ ఆఫ్రిది (దంతాలు): ట్యాంపరింగ్‌లో ఇదో సంచలనం. 2010లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన వన్డేలో కెప్టెన్‌గా ఉన్న ఆఫ్రిది బంతిని పళ్లతో గట్టిగా కొరుకుతూ కనిపించాడు. ముందుగా తప్పు అంగీకరించని ఆఫ్రిది... ఆ తర్వాత మ్యాచ్ గెలిచేందుకు చేసిన పనని ఒప్పుకున్నాడు. అతనిపై రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల నిషేధం పడింది. ►రాహుల్ ద్రవిడ్ (దగ్గు బిళ్ల): 2004లో బ్రిస్బేన్‌లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. సాధారణంగా మనకు మార్కెట్లో దొరికే హాల్స్, స్ట్రెప్సిల్స్ తరహా ట్యాబ్లెట్‌తో బంతిని రుద్దడం కెమెరాల్లో కనిపించింది. దాంతో మ్యాచ్ రిఫరీ క్లైవ్ లాయిడ్ ద్రవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు. ►క్రిస్ ప్రింగిల్ (బాటిల్ మూత): పాకిస్తాన్లో 1990లో పర్యటించిన న్యూజిలాండ్ జట్టు పేసర్ ప్రింగిల్ తనదైన శైలిలో ట్యాంపరింగ్ చేశాడు. ఒక బాటిల్ మూతను నాలుగు భాగాలుగా కోసి మొన మాత్రమే బయటికి కనిపించేలా వాటికి టేపులు చుట్టి జేబులో పెట్టుకున్నాడు. మ్యాచ్‌లో అనేక సార్లు దాంతో బంతిని గీకి తాను అనుకున్న విధంగా రివర్స్ స్వింగ్‌ను రాబట్టాడు. ఇది బాగా పని చేసి తొలి ఇన్నింగ్స్‌లో ప్రింగిల్ 7 వికెట్లు తీయడంతో పాక్ 102కే కుప్పకూలింది. సిరీస్‌లో పాక్ బౌలర్లు ఇదే తరహాలో ఎన్నో సార్లు చేసినా అంపైర్లు పట్టించుకోకపోవడంతో తాము అలాగే చేయాల్సి వచ్చిందని ప్రింగిల్, కెప్టెన్ మార్టిన్ క్రో ఆ తర్వాత చెప్పుకున్నారు. రిఫరీలు లేని జమానా కావడంతో ప్రింగిల్కు ఎలాంటి శిక్ష పడలేదు. సచిన్ వివాదం... భారత క్రికెట్–బాల్ ట్యాంపరింగ్‌కు సంబంధించి తీవ్ర వివాదంలో నిలిచిన ఘటన 2001లో జరిగింది. దక్షిణాఫ్రికాతో పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన రెండో టెస్టులో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడని సచిన్ టెండూల్కర్‌పై రిఫరీ మైక్ డెన్నిస్ ఒక టెస్టు నిషేధం, జరిమానా విధించాడు. జట్టును అదుపులో ఉంచనందుకు కెప్టెన్ గంగూలీ, అతిగా అప్పీల్ చేసినందుకు మరో నలుగురు భారత క్రికెటర్లు సెహ్వాగ్, హర్భజన్, శివ్‌సుందర్ దాస్, దీప్ దాస్గుప్తాలపై కూడా నిషేధం పడింది. అయితే దీనిపై భారత జట్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరీస్ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. చివరకు సచిన్ తప్పు లేదని తేలడం, ఇరు బోర్డుల మధ్య చర్చల అనంతరం తర్వాతి టెస్టుకు అనధికారిక గుర్తింపు ఇవ్వడంతో భారత్ బరిలోకి దిగింది. టెస్టు మూడో రోజు సచిన్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగా... ఇతర భారత బౌలర్లకంటే సచిన్ అద్భుతంగా స్వింగ్ చేశాడు. అతని గ్రిప్‌ను చూసేందుకు కెమెరా ఫోకస్ చేయగా రెండు సార్లు బొటన వేలితో బంతితో సచిన్ ఏదో చేస్తున్నట్లుగా సందేహాస్పదంగా కనిపించింది. దీని ఆధారంగా శిక్ష విధించానని డెన్నిస్ చెప్పగా... తాను బంతిపై మట్టిని మాత్రమే తొలగించానని సచిన్ వివరణ ఇచ్చాడు. ► కొత్త పద్ధతుల కోసం ప్రయత్నించకుండా తమ చేతితో, వేలితో బంతిని దెబ్బ తీసిన క్రికెటర్లు కూడా ఉన్నారు. 2000లో దక్షిణాఫ్రికాతో వన్డేలో గోళ్లతో వకార్ యూనిస్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ట్యాంపరింగ్ చేసి శిక్షకు గురైన తొలి క్రికెటర్ వకార్ కావడం విశేషం. అతనిపై ఒక మ్యాచ్ నిషేధం, 50 శాతం జరిమానా పడింది. 2014లో గాలేలో శ్రీలంకతో జరిగిన టెస్టులో చేతి వేళ్ళతో బంతి ఆకారాన్ని మార్చిన దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్‌పై 75 శాతం జరిమానా పడింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ పేసర్ బ్రాడ్ షూ స్పైక్స్‌తో తొక్కి బంతిని దెబ్బ తీశాడని ఆరోపణలు వచ్చినా అవి రుజువు కాలేదు. బంతిని ఆపడంతో బద్ధకించి తాను కాలు పెట్టానని అతను చెప్పుకున్నాడు. ►మైక్ అథర్టన్ (జేబులో మట్టి): దక్షిణాఫ్రికాతో 2004లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో అథర్టన్ అనుమానాస్పద రీతిలో బంతిపై దేనితోనో రుద్దడం బయట పడింది. అయితే ఆ తర్వాత అథర్టన్ జేబులో మట్టి ఉన్నట్లుగా తేలింది. తాను బంతి ఆకారాన్ని దెబ్బ తీయలేదని, అర చేతులకు చెమట పట్టినప్పుడు తుడుచుకునేందుకు మాత్రమే మట్టిని ఉపయోగించానని బుకాయించాడు. రిఫరీ ముందు కూడా తప్పు ఒప్పుకోకపోయినా...అతనిపై 2 వేల పౌండ్ల జరిమానా పడింది. ►డు ప్లెసిస్ (ప్యాంట్ జిప్): 2013లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో బంతి ఆకారాన్ని దెబ్బ తీస్తూ దక్షిణాఫ్రికా క్రికెటర్ డు ప్లెసిస్ పట్టుబడ్డాడు. బంతిని తన ప్యాంట్ సైడ్ జిప్కు బలంగా రాస్తూ దొరికిపోయాడు. 2016లో కూడా ప్లెసిస్ మరో తప్పు చేశాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన టెస్టులో నోట్లో మింట్ చప్పరించి దానితో బంతి మెరుపును పెంచే ప్రయత్నం చేశాడు. తొలిసారి ఫీజులో 50 శాతం, రెండోసారి అతనిపై 100 శాతం జరిమానా పడింది. -
ఆ నిర్ణయం తర్వాతే వార్నర్‌పై చర్యలు : లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : ట్యాంపరింగ్ వివాద సెగలు ఐపీఎల్‌కు సైతం తాకాయి. ఈ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తూ వేటు వేసింది. నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను ప్రకటించింది. దీంతో ఈ వివాదంలో సంబంధమున్న మరో ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్‌ను సైతం తప్పిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునే చర్యలను బట్టే, వార్నర్ విషయంలో తాము నిర్ణయం తీసుకుంటామని సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం మీడియాకు తెలిపారు. కేప్‌టౌన్ టెస్టులో జరిగిన ఉదంతం నిజంగా దురదృష్టకరం, కానీ వార్నర్‌పై తాము ఇప్పుడే ఏమీ చెప్పలేమని, క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ప్రకటించిన తరువాతే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని లక్ష్మణ్ పేర్కొన్నారు. వార్నర్ అసాధారణ కెప్టెన్ అని గత కొన్ని ఏళ్లుగా సన్రైజర్స్జట్టును సమర్ధవంతంగా నడిపిస్తున్నాడని, అతని విషయంలో చర్చించిన తరువాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇక డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో సన్‌రైజర్స్ జట్టు టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. వార్నర్ కెప్టెన్సీ లేక జట్టు నుంచి తొలిగించినా.. సన్‌రైజర్స్ జట్టు బలహీనం కానుంది. -
నీ భర్త ద్రోహి.. ఆ క్రికెటర్ భార్యపై ఆగ్రహం!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండైస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆమె.. అక్కడ తాము సందర్శించిన ప్రదేశాలకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేసుకుంది. రోజుకు రెండు పోస్టులైనా ఆమెవి ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేవి. తాను దిగిన ఫొటోలు, భర్తతో, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు ఆమె షేర్ చేసుకునేది. దక్షిణాఫ్రికా అందాలను పర్యటనను ఆస్వాదిస్తూ.. ఆమె పెట్టే ఫొటోలకు అభిమానులు, ఫాలోవర్స్ నుంచి మంచి మద్దతు లభించేది. కానీ, బాల్ ట్యాంపరింగ్ వివాదం వెలుగుచూడటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ బెన్‌క్రాప్ట్ బాల్‌ను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించడం, ఇది సమిష్టి తప్పిదమని ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచంలో పెనుదుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్సీ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ భార్య క్యాండైస్ పైనా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తను అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘నీ భర్త ఒక ద్రోహి.. అతన్ని చూసి సిగ్గుపడుతున్నాం’ అని నెటిజన్ ఆమె ఫొటోపై కామెంట్ చేయగా.. ‘నీ భర్త నీ దేశాన్ని అప్రతిష్టపాలు చేశారు. ద్రోహి’ అంటూ మరో నెటిజన్ విరుచుకుపడ్డారు. ‘మీ నాన్న ద్రోహి అని నువ్వెప్పుడు తెలుసుకుంటావు’ అని ఇంకో నెటిజన్.. డేవిడ్ వార్నర్ పిల్లల ఫొటోపై విద్వేషం వెళ్లగక్కాడు. బాల్ ట్యాంపరింగ్ పరిణామం వెలుగుచూడటంతో క్యాండైస్ సోషల్ మీడియాకు దూరం జరిగినట్టు కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా ఆమె ఏమీ పోస్టు చేయడం లేదు. దక్షిణాఫ్రికా క్రికెటర్ పర్యటనలో భాగంగా అక్కడి పర్యాటక ప్రాంతాల్లో, బీచుల్లో విహరిస్తున్న ఫొటోలు డేవిడ్ వార్నర్‌తోపాటు ఆస్ట్రేలియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టీవ్ స్మీత్, అతని ఫియాన్సీ డానీ విల్లిస్ ఇప్పటివరకు పోస్టు చేస్తూ వచ్చారు. బ్యాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత క్యాండైసే కాదు.. డానీ విల్లిస్ కూడా సోషల్ మీడియాలో ఏమీ పోస్టు చేయలేదు. బ్యాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఒక టెస్టు మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్ సోమవారం ఆస్ట్రేలియాకు తిరుగుముఖం పట్టనున్నారు. డేవిడ్ వార్నర్ మాత్రం దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. -
క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ తీవ్రంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ అనేది ఇప్పుడే కనిపెట్టిన విషయమే కాదని, దశాబ్దాల నుంచి ఇది కొనసాగుతుందన్నాడు. టీమిండియాకు కూడా బాల్ ట్యాంపరింగ్ తెలుసునని, వారికి ఇది కొత్తేమీ కాదన్నాడు శ్రీశాంత్. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్ పాల్పడ్డ బాల్ ట్యాంపరింగ్ వివాదంపై స్పందించిన భారత క్రికెటర్లు, మాజీలు ఓ సారి తన వివాదంపై కూడా స్పందిస్తే మంచిదన్నాడు. ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్ స్మిత్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ నుంచి అతడిని తొలగిస్తూ అజింక్యా రహానేకు బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐపీఎల్ సమయం ఆసన్నమైంది కనుక.. ఇప్పుడైనా తనపై విధించిన క్రికెట్ బ్యాన్పై నిర్ణయం తీసుకోవాలన్నాడు. ఐసీసీ, బీసీసీఐ పెద్దలు తనకు క్రికెట్ మళ్లీ ఆడే అవకాశం ఇవ్వాలని కోరాడు. బాల్ ట్యాంపరింగ్ క్లబ్ స్థాయి క్రికెట్లోనూ ఉందని, ఆసీస్ జట్టు చేసిన ట్యాంపరింగ్ తనను ఆశ్చర్యానికి గురిచేయలేదని తెలిపాడు. శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్‌లోనూ ఆడుతున్న వారిలో ఆరుగురు నుంచి 10 మంది టాప్ ప్లేయర్లకు ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని శ్రీశాంత్ గతంలో ఆరోపించాడు. కానీ బీసీసీఐ తన ఒక్కడిపైనే కక్ష సాధించిందని.. కొందరు క్రికెటర్లపై ఢిల్లీ పోలీసులు ఇది వరకే కేసులు కూడా నమోదు చేశారని చెప్పాడు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్‌కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. అప్పటి నుంచి క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాడు శ్రీశాంత్. -
స్మిత్ చెప్పిందంతా కట్టుకథ..!
సాక్షి, స్పోర్ట్స్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌పై ఇప్పటికే అభిమానులతో పాటు పలువురు ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై జీవితకాల నిషేధం విధిస్తారనే ప్రచారం జరగడంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ నుంచి స్మిత్‌ను తొలగించింది. షాక్‌ల మీద షాక్‌లకు గురవుతున్న స్మిత్‌పై సహచర ఆటగాడు, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మోజెస్ హెన్రిక్స్ చేసిన ట్వీట్ అతని వ్యక్తిత్వంపై అనుమానాలు రేకెత్తించేలా ఉంది. ఈ వివాదంపై స్పందించిన హెన్రిక్స్.. ‘నా అభిప్రాయం ప్రకారం సీనియర్ ఆటగాళ్లెవరూ ఈ విధమైన మోసంలో భాగస్వాములుగా ఉండరు. బెన్క్రాఫ్ట్ను రక్షించడం కోసమే స్మిత్ జట్టు సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకున్నామని కట్టుకథ అల్లాడు. కెప్టెన్‌గా స్మిత్ యువ ఆటగాళ్లను రక్షించే ప్రయత్నంలో ఇలా ప్రవర్తిస్తున్నాడంటూ’ ట్వీట్ చేశాడు. ట్యాంపరింగ్ వివాదం గురించి స్మిత్ మాట్లాడుతూ.. ఇదంతా జట్టు సమష్టి నిర్ణయమేనని చెప్పిన విషయం తెలిసిందే. ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు వీడియోలో కనిపించడంతో కామెరున్ బెన్‌క్రాప్ట్.. ఈ తప్పిదానికి తాను పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని వివరణ కూడా ఇచ్చుకున్నాడు. In my uneducated opinion, I dare say there was never a senior players meeting to discuss cheating - Smith made that up to take the heat of a young Cameron Bancroft not realising the outrage that would follow. — Moises Henriques (@Mozzie21) March 26, 2018 Ps. Not saying no one was aware of Cameron doing it, just highly doubt there was a ‘senior players meeting’ to decide to cheat. I think it was the captain attempting to protect a young player. They had 10 mins of panic between end of play & press conference. — Moises Henriques (@Mozzie21) March 26, 2018 -
ఐపీఎల్ : కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ స్టీవ్ స్మిత్‌పై వేటు
-
ఐపీఎల్: స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్‌కు జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించి అతడిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ నుంచి స్టీవ్ స్మిత్‌ను యాజమాన్యం తప్పించింది. నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను నియమించింది. బాల్ ర్యాంపరింగ్కు పాల్పడటంతో పాటు తాము చేసింది చిన్న తప్పు అన్నతీరుగా వ్యవహరించి స్మిత్ క్రీడాస్ఫూర్తిని దెబ్బతీశాడని అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు రాజస్థాన్ ఫ్రాంచైజీ ప్రకటించినట్లు తెలుస్తోంది. స్టీవ్ స్మిత్ పై ఐసీసీ తీసుకునే చర్యలపై ఈ ఆసీస్ ఆటగాడిని ఐపీఎల్ లో ఆడనివ్వాలా.. వద్దా.. అన్నదానిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రధాని మాల్కం టర్న్‌బుల్ స్పందించడంతో.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సైతం స్మిత్‌పై తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. -
ట్యాంపరింగ్: బయటపడ్డ మరో నిజం
అనూహ్యంగా బయటపడిన బాల్ ట్యాంపరింగ్ వివాదం పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. గత రెండు రోజులు నుంచి అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఆటగాడు కెమరాన్ బెన్ క్రాప్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ఆ దేశ ప్రధాని మార్కమ్ టర్న్‌బుల్ ఆదేశించారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా బయటపడిన ఓ వీడియో ఆస్ట్రేలియా క్రికెట్‌ను మరింత వివాదంలోకి నెట్టింది. గత జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ కెమరాన్ బెన్ క్రాప్ట్ బాల్ టాంపరింగ్ చేసినట్టు అనుమానం కలిగిలే ఓ వీడియా ఇప్పుడు బయటకొచ్చింది. అందులో బెన్ క్రాప్ట్ ఓ స్పూన్‌తో చక్కెర తీసుకుని ప్యాంటు పోకెట్లో వేసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో బెన్ క్రాప్ట్ చక్కెరతో బంతి షేప్‌ను మార్చే ప్రయత్నం చేశాడా అన్న సందేశాలు కలుగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయినట్టుగా భావిస్తున్నఈ వీడియోను ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ ప్రచురించగా, ద సన్ రిపోర్టర్ డేవిడ్ కవర్‌డేల్ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. తాజా ఘటనతో క్రికెట్ అభిమానులు నివ్వెరపోతున్నారు. అయితే తన కెప్టెన్సీలో ఇలాంటి సంఘటనలు జరగడం మొదటిసారి అని చెప్పిన స్టీవ్ స్మిత్ మాటలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
యాషెస్ సిరీస్‌లోనూ బాల్ ట్యాంపరింగ్?
-
వాళ్లకు తెలియకుండానే జరిగిందా?
సాక్షి, స్పోర్ట్స్ : గత రెండు రోజులుగా క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్న బాల్ ట్యాంపరింగ్ వివాదంపై పలువురు క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వ్యక్తిని బట్టి, ప్రాతినిథ్య జట్టును బట్టి శిక్షలు ఖారారు చేయడం ఐసీసీ తీరును తెలియజేస్తుంది.. వారెవ్వా ఐసీసీ’ అంటూ హర్భజన్ మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. ‘కోచ్‌తో సహా ఆటగాళ్లంతా కలిసి క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఆస్ట్రేలియాను, టెస్ట్ క్రికెట్‌ను అవమానపరిచారు. మీరు చేసిన ఈ పని ఏమాత్రం సరైంది కాదు. జట్టు కోచ్ లీమన్, బౌలింగ్ కోచ్ డేవిడ్ సాకర్‌కు తెలియకుండానే ఇదంతా జరిగిందా? వీరిద్దరిపై కూడా చర్యలు తీసుకోవాల’ని పీటర్సన్ ట్వీట్ చేశాడు. కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ఉద్వాసన పలికింది. కాగా ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ సదర్లాండ్ ఆస్ట్రేలియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. పరువు తీసేలా ప్రవర్తించకండి: ఏఎస్సీ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్ అధికారి జాన్ వీలీ, బోర్డు సీఈఓ కేట్ పామర్ మాట్లాడుతూ.. ఏ ఆటలోనైనా మోసానికి పాల్పడితే ఒప్పుకోబోమని, బాల్ ట్యాంపరింగ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, కోచ్, సహాయ సిబ్బందితో పాటు, జట్టులోని ఇతర సభ్యులెవరైనా సీఏ ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎవరెవరు భాగమై ఉన్నారనేది తెలుకోవాల్సి ఉందని ఏఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియా అథ్లెట్లు, ఇతర జట్లు అన్నీ నిజాయితీగా వ్యవహరించాలని.. క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని కోరింది. Anyone heard from Lehmann? Saker? That’s Head Coach & Bowling Coach. Pretty instrumental in all of this... — Kevin Pietersen (@KP24) March 25, 2018 Slept on it...Lehmann, Saker & the leaderships groups jobs are untenable! They’ve disgraced a great cricketing nation & Test cricket! — Kevin Pietersen (@KP24) March 25, 2018 -
ట్యాంపరింగ్; ఆసీస్‌పై చర్యలు.. అబ్బో సూపరు!
సాక్షి, స్పోర్ట్స్: నిన్నటికి నిన్న స్మిత్ భుజం తాకడన్న కారణంతో రబడాపై తీవ్రచర్యలు.. చాన్నాళ్ల కిందట బంతికి అంటిన మట్టి తుడిచినందుకే సచిన్ టెండూల్కర్‌పై మ్యాచ్ నిషేధం.. తప్పెవరిదో తేలకముందే మంకీగేట్ వివాదంలో హర్భజన్‌పై మూడు టెస్టుల నిషేధం.. ఇప్పటికి కూడా అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోతలు! అదే ఒక జట్టు జట్టంతా విలువల్ని తుంగలో తొక్కేసినా, ‘అవును.. మేం పథకం ప్రకారమే బాల్ ట్యాంపరింగ్ చేశా’మని నిస్సిగ్గుగా చెప్పుకున్నప్పటికీ వారిపై అరకొర చర్యలు!! సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్ జట్టుపై అరకొర చర్యలు తీసుకున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. సూత్రధారి స్టీవ్ స్మిత్‌పై ఒక్క టెస్టు నిషేధం, పాత్రధారి బెన్‌క్రాఫ్ట్‌కు జరిమానతో ఐసీసీ సరిపెట్టడాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా పట్ల తనకున్న విధేయతను పదేపదే ప్రకటించుకుంటున్న ఐసీసీ తీరును తప్పుపడుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వారిలో ప్రముఖ క్రికెటర్లు కూడా ఉన్నారు. కాగా, ఆసీస్ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మాత్రం ట్యాంపరింగ్ ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు, స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై జీవితకాల నిషేధం విధించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ మేరకు అధికార ప్రకటనలేవీ ఇప్పటివరకు జారీకాలేదు. వారెవ్వా ఐసీసీ: హర్భజన్ ‘‘బాల్ ట్యాంపరింగ్ వివాదంలో గొప్ప శిక్షే వేశారు! వారెవ్వా! అన్ని ఆధారాలున్నా బెన్‌క్రాఫ్ట్‌పై నిషేధంలేదు. గతాన్ని మర్చిపోయారా? మితిమిరి అప్పీల్ చేశారన్న కారణంతో 2001 దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆరుగురు టీమిండియా ప్లేయర్లపై ఒక్కొ మ్యాచ్ నిషేధించారు. 2008 సిడ్నీలోనూ జాతివివక్ష వ్యాఖ్యలంటూ(మంకీగేట్ వివాదం) నాపై మూడు టెస్టుల వేటేశారు. ఒక్కొక్కరికి ఒక్కో శిక్షలా? వ్యక్తి బట్టి, అతను ప్రాతినిథ్యం వహించే జట్టునుబట్టి ఐసీసీ అధికారులు శిక్షలను ఖరారు చేస్తుంటారా?’’ అని నిప్పులుచెరిగాడు లెజెండ్ హర్భజన్ సింగ్. ఆసీస్‌కు ఊహించని మద్దతు బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆసీస్, ఐసీసీలపై నెటిజన్ల విమర్శలు కొనసాగుతున్నవేళ ఆ జట్టుకు ఊహించని మద్దతు లభించింది. అవును. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా కాస్త భిన్నంగా స్పందించారు. తప్పు చేసినట్లు ఒప్పుకున్నందుకుగానూ స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లను అభినందించారు. ‘‘ఆటలో ఇలాంటి ఉదంతాలు గతంలోనూ జరిగాయి. స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లు తప్పుచేశారని ఐసీసీ భావిస్తే వారిని శిక్షించాల్సిందే. అయితే వాళ్లు తప్పు చేసినట్లు అంగీకరించడం ఇక్కడ గమనార్హం. ఒకవేళ ఆసీస్ ప్లేయర్లు తామే పొరపాటూ చేయలేదని వాదించిఉంటే గనుక చర్యలు మరోలా ఉండేవనడంలో సందేహంలేదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డారు. 30 నుంచి నాలుగో టెస్టు.. సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియాల మధ్య నాలుగో టెస్టు మార్చి 30 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభంకానుంది. ఆదివారం ముగిసిన మూడో టెస్టులో ఆసీస్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ ఘటనతో తీవ్ర ఒత్తిడిలో పడిపోయిన ఆ జట్టు మూడో టెస్టులో322 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో సఫారీలు 2–1తో ముందంజ వేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
ఆసీస్ కుదేల్... సఫారీలు జిగేల్
కేప్‌టౌన్: వివాదంతో ఏకాగ్రత చెదిరింది... ఆటగాళ్లపై నిషేధంతో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది... ప్రదర్శన అట్టడుగుకు పడిపోయింది... ఫలితం ఆస్ట్రేలియా దారుణ పరాజయం. బాల్ ట్యాంపరింగ్ ఘటనతో తీవ్ర ఒత్తిడిలో పడిపోయిన ఆ జట్టును... మరింత కుదేలు చేస్తూ మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 322 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2–1తో ముందంజ వేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన మోర్నీ మోర్కెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక్కడి న్యూలాండ్స్ మైదానంలో నాలుగో రోజు 430 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ పేలవ ఆటతీరుతో 107 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ ఏ దశలోనూ ఆశావహంగా కనిపించని కంగారూలు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు. వార్నర్ (32), బాన్‌క్రాఫ్ట్ (26) తొలి వికెట్‌కు 57 పరుగులు జత చేసినా... ఆ తర్వాత 50 పరుగుల వ్యవధిలోనే 10 వికెట్లూ కోల్పోయి ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. మోర్నీ మోర్కెల్ (5/23) పదునైన పేస్‌తో, కేశవ్ మహరాజ్ (2/32) స్పిన్‌తో ప్రత్యర్థి పనిపట్టారు. ఓపెనర్లు మినహా మిచెల్ మార్‡్ష (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. స్మిత్ (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోరు 238/5తో ఆదివారం ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా డికాక్ (65; 8 ఫోర్లు, 1 సిక్స్), ఫిలాండర్ (52 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో 373 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 56తో కలుపుకొని ఆసీస్ ముందు 430 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇరు జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు జొహన్నెస్‌బర్గ్‌లో ఈ నెల 30న మొదలవుతుంది. -
పరువు పాతాళంలోకి!
అనూహ్యంగా బయటడిన బాల్ ట్యాంపరింగ్ పెద్ద కుదుపులకే దారి తీస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్లో పెను సంక్షోభంగా నిలుస్తోంది. స్వదేశీ, విదేశీ మాజీ ఆటగాళ్ల విమర్శల తుఫానులో చిక్కుకుంది. ఏకంగా ఆ దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ రంగంలోకి దిగేంతగా తీవ్ర స్థాయి దాల్చింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లను తక్షణమే పదవుల నుంచి తప్పించాలని ఆయన ఆదేశించగా... ఇటువైపు స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌లపై జీవితకాల నిషేధం వంటి మరిన్ని సంచలన నిర్ణయాలకూ ఆస్కారం కనిపిస్తుండగా... పులి మీద పుట్రలా దక్షిణాఫ్రికా చేతిలో మూడో టెస్టులో దారుణ పరాజయం ఆసీస్‌ను మరింత కుంగదీసింది. సిడ్నీ/దుబాయ్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఏకంగా దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ జోక్యం చేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి తప్పించింది. వికెట్ కీపర్ టిమ్ పైన్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. ‘ఈ టెస్టు పూర్తిగా సాగాల్సిన అవసరం ఉంది. స్మిత్, వార్నర్‌లతో చర్చించాం. వైదొలగేందుకు వారు అంగీకరించారు’ అని సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపాడు. దీంతోపాటు ట్యాంపరింగ్ ఘటనపై అత్యవసర విచారణ జరిపేందుకు సీఏ హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, టీమ్ ఫెర్ఫార్మెన్స్ హెడ్ ప్యాట్ హోవార్డ్‌లు దక్షిణాఫ్రికా బయల్దేరారు. ‘మాతో సహా ఆస్ట్రేలియన్లంతా సమాధానం కోరుకుంటున్నారు. మా దర్యాప్తులో తేలిన అంశాలను ఎప్పటికప్పుడు ప్రాధాన్యంగా తెలియపరుస్తాం’ అని సదర్లాండ్ పేర్కొన్నాడు. మరోవైపు బాల్ ట్యాంపరింగ్‌కు గాను ఆసీస్ సారథిపై ఒక టెస్టు నిషేధంతో పాటు వంద శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతతో పాటు, మూడు డి మెరిట్ పాయింట్లు ఇచ్చింది. ‘క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే తీవ్ర చర్యలకు పాల్పడిన ఆటగాళ్లకు మద్దతుగా నిలిచినందుకు స్మిత్‌పై కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2.1 ఆర్టికల్ కింద, బంతి ఆకారం మార్చేందుకు ప్రయత్నించి లెవల్ 2 నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆర్టికల్ 2.2.9, నిబంధన 41.3 కింద బాన్‌క్రాఫ్ట్‌పై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ ఈ చర్యలు చేపట్టారు. దీంతో పాటు రెండు సస్పెన్షన్ పాయింట్లను ఎదుర్కొన్న స్మిత్ తదుపరి టెస్టుకు దూరం కానున్నాడు. అతడి ఖాతాలో నాలుగు డి మెరిట్ పాయింట్లు కూడా జమ కానున్నాయి. ‘ట్యాంపరింగ్ చేసేలా స్వయంగా ఆస్ట్రేలియా జట్టు నాయకత్వమే ప్రోత్సహించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. ఇది తీవ్రమైన అంశం. కెప్టెన్‌గా స్మిత్ దీనికి పూర్తిగా బాధ్యుడు. సస్పెన్షనే సరైనది’ అని రిచర్డ్సన్ స్పష్టం చేశారు. ఈ సిరీస్‌లో చోటుచేసుకున్న దూషణలు, అంపైర్ల నిర్ణయాలపై నిరసన, ప్రేక్షకుల అతి వంటి వాటిని ఇకపై నివారించే దిశగా ఐసీసీ చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాడు. సభ్య దేశాలు కూడా క్రికెట్ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రయత్నించాలని కోరాడు. ఆలోచించాకే నిర్ణయం... న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో స్మిత్, వార్నర్‌ల ఐపీఎల్ భవితవ్యంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఆస్ట్రేలియా బోర్డు, ఐసీసీ చర్యలు చేపట్టినప్పటికీ... బీసీసీఐ ఈ విషయమై ఎటువంటి ఆలోచన చేయడం లేదని శుక్లా వివరించారు. బీసీసీఐతో సమాలోచన చేశాకే స్మిత్‌పై తమ నిర్ణయం వెలువరిస్తామని రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తెలిపింది. వార్నర్‌పై మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పందించలేదు. స్మిత్, వార్నర్ వంటి కీలక ఆటగాళ్లను ఒక్క ఘటనతో దూరం పెట్టలేమని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ చేశారనే వార్త విని షాక్‌కు గురయ్యా. ఆదర్శంగా నిలవాల్సిన వారు మోసపూరిత చర్యలకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ డేవిడ్ పీవెర్తో ఈ విషయంపై మాట్లాడాను. స్మిత్, వార్నర్‌లను వారి బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించాను. –టర్న్‌బుల్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి నిజాయతీగా చెప్పాలంటే గత 24 గంటలు మాకెంతో భారంగా గడిచాయి. మా అభిమానులందరినీ ఈ సందర్భంగా నేను క్షమాపణలు కోరుతున్నాను. మా నుంచి వారు ఇలాంటి ప్రదర్శనను ఆశించలేదు. –టిమ్ పైన్, ఆసీస్ తాత్కాలిక సారథి స్మిత్ చేసింది చాలా చాలా పెద్ద తప్పే. సరైన వ్యక్తులు పిలిస్తే ఆస్ట్రేలియా జట్టులోకి మళ్లీ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. –మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఎంతవాడుగానీ... నైతికత లేకుంటే పతనమే! స్టీవ్ స్మిత్ ఉదంతం చెబుతున్నదిదే అతడు ఎనిమిదేళ్ల క్రితం టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసింది ఒక స్పిన్నర్‌గా. బ్యాటింగ్‌కు దిగింది 8వ స్థానంలో. కానీ, తర్వాత ఎంతో మెరుగయ్యాడు. ఓపెనింగ్‌తో పాటు 3, 4, 5 ఇలా పలు స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. కీలక ఆటగాడిగా ఎదగడమే కాదు... కెప్టెన్ కూడా అయ్యాడు. సంధి దశలో ఉన్న జట్టును ముందుండి నడిపించాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌గానూ నిలిచాడు. 64 టెస్టులు ముగిసేసరికి ఇప్పుడతడి సగటు 61.37. అయినా... ఏం లాభం? నైతికత అనే ఒక్క లక్షణం లేకపోవడంతో నాయకుడు కాస్తా ప్రతినాయకుడిలా కనిపిస్తున్నాడు. అతడే ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్. ఒక్కో మెట్టు ఎక్కి... క్రీజులో చిత్రవిచిత్ర స్టాన్స్, మెరుపు ఫీల్డింగ్‌తో పాటు అచ్చం బొమ్మలాంటి ముఖంతో తొలినాళ్లలో స్మిత్ కొంత ప్రత్యేకంగా కనిపించే వాడు. స్పిన్నర్‌గా అడుగుపెట్టినా పేరుగాంచింది మాత్రం బ్యాట్స్‌మన్‌గానే. అడ్డదిడ్డమైన షాట్లతో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి, ప్రపంచ వ్యాప్తంగా పరుగులు రాబడుతూ ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అత్యధిక సగటు ఉన్న ఆటగాడిగా ఎదిగాడు. ఇలా కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఎంతటి పేరు సంపాదించాడో, దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌తో అంతటి చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. తన ప్రతిష్ఠకు తానే మచ్చ తెచ్చుకున్నాడు. గతేడాది బెంగళూరులో భారత్‌తో టెస్టు సందర్భంగా డీఆర్ఎస్ కోరేందుకు జట్టు సభ్యులున్న బాల్కనీ వైపు చూసి స్మిత్ అప్పట్లోనే వివాదాస్పదమయ్యాడు. మతి చెడి అలా చేశానని తర్వాత ఒప్పుకున్నాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో టెస్టులోనూ అనుచిత ప్రవర్తనతో జరిమానాకు గురయ్యాడు. ఆ సందర్భంలో ‘నాయకుడిగా నేనింకా ఎదగాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి’ అని చెప్పాడు. తర్వాత కూడా అండర్సన్, రబడ వంటి బౌలర్లతో వాగ్యుద్ధానికి దిగాడు. ఇప్పుడు ఏకంగా ట్యాంపరింగ్‌తో పెద్ద తప్పే చేశాడు. అంత అవసరం ఏమొచ్చింది... దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల సిరీస్ 1–1తో ఉంది. జరుగుతున్నది మూడో టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ పోరాడి ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించింది. సఫారీల నుంచి రెండో ఇన్నింగ్స్‌లో ప్రతిఘటన ఎదురవుతోంది. మరీ బెదిరిపోవాల్సిన పనిలేదు. తమ రెండో ఇన్నింగ్స్‌లో దానికి బదులివ్వొచ్చు. అప్పటికీ విఫలమైతే టెస్టు చేజారుతుంది అంతే! లోపాలు సరిచేసుకుని చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయొచ్చు. ఆసీస్‌లాంటి జట్టుకు ఇదేమంత కష్టమూ కాదు. కానీ తప్పు దారిలో ఆలోచించి దోషిగా నిలబడ్డాడు. పైగా జట్టంతా తీసుకున్న నిర్ణయమంటూ అందరికీ ఆపాదించాడు. కొత్త కుర్రాడు బాన్‌క్రాఫ్ట్ సహా, నేరుగా ప్రమేయం లేని వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తునూ బలి చేశాడు. జీవితకాలం వెంటాడే తప్పు... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మిత్ ఆల్‌టైమ్ రెండో అత్యధిక రేటింగ్ పాయింట్లు (945) సాధించి ఉండవచ్చుగాక, చరిత్రలో రెండో అత్యధిక సగటుతో కెరీర్ ముగించొచ్చుగాక... ఇలాంటి ఘనతలు ఇంకెన్ని తన ఖాతాలో ఉన్నా బాల్ ట్యాంపరింగ్ అతడిని జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. ఒక మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలా, ఒక అండర్ ఆర్మ్ బౌలింగ్‌లా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. –సాక్షి క్రీడా విభాగం -
స్మిత్ మళ్లీ మైండ్ పనిచేయ లేదా!
సాక్షి, హైదరాబాద్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంతో చిక్కుల్లో పడ్డ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్మిత్ మళ్లీ మైండ్ పనిచేయ లేదా ( బ్రెయిన్ ఫేడ్) అంటూ గత భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ వివాదాన్ని గుర్తు చేస్తున్నారు. గతేడాది భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో స్మిత్ డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ సిస్టమ్‌గా మార్చి విమర్శలపాలైన విషయం తెలిసిందే. అప్పట్లో తన మైండ్ పనిచేయలేదని, దాంతోనే అలా చేసానని స్మిత్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను తాజా వివాదానికి అంటగడుతూ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. కేప్‌టౌన్ టెస్టులో ఓ కెప్టెన్‌గా స్మిత్ దిగజారిపోయాడని ఒకరంటే.. రబడ వ్యవహారంలో నీతులు చెప్పిన స్మిత్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించవచ్చా అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు. బాల్‌టాంపరింగ్ ఉదంతం స్మిత్ కెరీర్‌ను ప్రశ్నార్ధకంలో పడేసిందని, ఆటలో చీటింగ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని మరొకరు కామెంట్ చేశారు. బాల్‌ట్యాంపరింగ్ జట్టు సమష్టి నిర్ణయమని చెప్పడంపై కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మిత్‌కు వివాద పరిస్థితి అర్థం కాలేదని, తమ జట్టు చీటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయిన విషయాన్ని అతను అర్థం చేసుకోలేకపోయాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో ఈ సీజన్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు స్మిత్‌ను కెప్టెన్ నుంచి తొలిగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై సైతం నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. రాజస్తాన్ జట్టు చర్య నీరవ్ మోదీ మోసం చేస్తే ఉద్యోగిని తొలిగించినట్లుందని కామెంట్ చేస్తున్నారు. -
బాల్ ట్యాంపరింగ్: ఐపీఎల్‌ను తాకిన సెగలు!
న్యూఢిల్లీ : యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరబోయేలా చేసిన ఆసీస్ క్రికెటర్ల బాల్ ట్యాంపరింగ్ వివాదం సెగలు తాజాగా ఐపీఎల్‌ను తాకాయి. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇలా బాల్ ట్యాంపరింగ్‌కు పూనుకోమని తానే చెప్పానని, ఇదంతా తమ సామూహిక పాపమేనని స్మిత్ అంగీకరించడం ఆసీస్ క్రికెట్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ తప్పుకున్నారు. దేశీయంగా జరిగే టీ20 క్రీడా ఉత్సవం ఐపీఎల్‌ను కూడా ఈ వివాదం ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో రాజస్థాన్ జట్టుకు స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరించాల్సి ఉంది. అయితే, తాజా వివాదం నేపథ్యంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథిగా కొనసాగించాలా? వద్దా? అన్నది తెలియక జట్టు యాజమాన్యం అయోమయంలో పడింది. ఈ వివాదంలో తదుపరి పరిణామాలను బట్టి ఐపీఎల్‌లోనూ స్మిత్ ను జట్టు సారథిగా తొలగించేదిశగా నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో స్మిత్ క్రీడా భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. -
ట్యాంపరింగ్: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్మిత్
కేప్‌టౌన్ : బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు చివరి రెండు రోజులకు ఆసీస్ వికెట్ కీపర్ టిమ్ పైన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈవో జేమ్స్ సదర్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వివాదం నేపథ్యంలో స్మిత్, వార్నర్‌లతో చర్చించామని వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అంగీకరించారని చెప్పారు. ఈ మ్యాచ్ జరుగుతుండగానే వేగంగా విచారణ పూర్తి చేస్తామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలుంటాయన్నారు. టిమ్ పైన్ కెప్టెన్సీలోనే స్మిత్, వార్నర్‌లు మూడో టెస్టు చివరి రెండు రోజులు ఆడనున్నారని పేర్కొన్నారు. ఈ ట్యాంపరింగ్ వివాదంలో స్మిత్‌పై ఆరోపణలు రావడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తం అయ్యింది. సీనియర్ ఆటగాళ్లతో పాటు ఆసీస్ స్పోర్ట్స్ కమిషన్ అధికారులు సైతం స్మిత్‌ను బాధ్యత వహించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత టెస్టు మ్యాచ్ వరకు తమ బాధ్యతల నుంచి స్మిత్, వార్నర్‌లు తప్పుకున్నారు. మూడో టెస్టు మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో ఆసీస్ ఆటగాడు బెన్ క్రాఫ్ట్ పసుపు రంగు టేపుతో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించాడు. ఇది కెమెరాల్లో స్పష్టం అయింది. దీంతో అంపైర్లు వివరణ కోరగా ఏమి లేదని సన్‌గ్లాస్ తుడిచే నల్లటి వస్త్రం అని బుకాయించాడు. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా ఆటను కొనసాగించారు. అయితే అంపైర్లకు చూపించింది వేరు అని వీడియోలో స్పష్టం కావడంతో ట్యాంపరింగ్ యత్నం జరిగిందని రుజువైంది. మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని జట్టు సమష్టి నిర్ణయమని నిస్సిగ్గుగా చెప్పుకున్న స్టీవ్ స్మిత్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లను చూసి క్రీడాభిమానులు నివ్వెరపోతున్నారు. -
బాల్ ట్యాంపరింగ్ : ఆటగాళ్లపై ఆసీస్ బోర్డు ఆగ్రహం
-
ట్యాంపరింగ్ ఉదంతం; క్రికెటర్లపై తీవ్ర చర్యలు!
కాన్బెరా/కేప్‌టౌన్: బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఆసీస్ ఆటగాళ్లపై సొంత బోర్డే ఆగ్రహం వ్యక్తం చేసింది. అసాధారణ చర్యకు పాల్పడటమేకాక, అది జట్టు సమష్టి నిర్ణయమని నిస్సిగ్గుగా చెప్పుకున్న స్టీవ్ స్మిత్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్‌లను చూసి క్రీడాభిమానులు నివ్వెరపోతున్నారని, ఒక విధంగా దేశం అప్రతిష్టపాలైందని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈవో జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ట్యాంపరింగ్ ఘటనను బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నదని, తక్షణమే విచారణకు ఆదేశించామని, ఈ మేరకు ఇద్దరి (ఇయాన్ రాయ్, పాట్ హోవార్డ్) బృందం ఇప్పటికే కేప్‌టౌన్‌కు బయలుదేరిందని తెలిపారు. కాగా, ఇప్పటికే స్టీవ్‌స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లపై వేటుకు రంగం సిద్ధమైందని, విచారణ తంతు ముగిసిన వెంటనే నిర్ణయం వెలువడుతుందని సమాచారం. ఘటన తీవ్రత దృష్ట్యా మొత్తం జట్టుపై చర్యలు తీసుకునే అవకాశాలూ లేకపోలేవని తెలుస్తోంది. అడ్డంగా దొరికిపోయాడిలా..: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో అతను చేసిన పనులు వీడియోలో బయట పడ్డాయి. ముందుగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బెన్‌క్రాఫ్ట్ తన కుడి చేతి వేళ్ల మధ్య టేపును ఉంచి బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను దానిని తన జేబులో వేసుకున్నాడు. ఇదంతా టీవీలో ప్రసారమైంది. వెంటనే ఆసీస్ కోచ్ లీమన్ అదనపు ఆటగాడు హ్యాండ్స్కోంబ్కు వాకీటాకీ ద్వారా ఇదే విషయాన్ని చెప్పాడు. దాంతో ఓవర్ల మధ్య మైదానంలోకి వెళ్లిన హ్యాండ్స్కోంబ్, బెన్‌క్రాఫ్ట్‌కు ఈ సమాచారం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఫీల్డ్ అంపైర్లు నైజేల్ లాంజ్, ఇల్లింగ్‌వర్త్ ఈ విషయంపై బెన్క్రాఫ్ట్ను వివరణ అడిగారు. అయితే అప్పటికే ఆ వస్తువును జేబులోంచి తీసిన ఆసీస్ క్రికెటర్ దానిని అండర్వేర్లో వేసుకున్నాడు. అంపైర్లు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జేబులోంచి సన్‌గ్లాసెస్ క్లాత్‌ను తీసి చూపించాడు! ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా ఆటను కొనసాగించారు. అసలేం జరిగిందంటే..: నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. తొలి టెస్టులో ఆసీస్ నెగ్గగా, రెండో టెస్టును సఫారీలు నిలుపుకున్నారు. దీంతో మూడో టెస్టు కీలకంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా, ఆసీస్ మాత్రం 255 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స ప్రారంభించిన సఫారీలు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 238 రన్స్ చేసింది. తద్వారా 294 పరుగుల ఆధిక్యతతో మ్యాచ్‌పై పట్టుబిగించింది. సరిగ్గా ఈ సందర్భంలోనే(మూడో రోజు ఆటలో) ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం తీవ్ర వివాదాన్ని రేపింది. మ్యాచ్ తర్వాతా హైడ్రామా: మూడో రోజు ఆట ముగిసిన తర్వాత స్టేడియంలో హైడ్రామా నెలకొంది. ఆసీస్ సారధి స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లు మీడియా ముందుకొచ్చి తప్పు చేసినట్లు ఒప్పుకున్నారు. ‘మా ఆటగాళ్ల బృందానికి దీని గురించి తెలుసు. లంచ్ విరామ సమయంలో మేం దీనిపై మాట్లాడుకున్నాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెలుసు. ఇది నేను బాధపడాల్సిన విషయం. నాకు, మా జట్టుకు ఇది చాలా చెడ్డపేరు తీసుకొచ్చే విషయం. ఇక ముందు ఇలా జరగనివ్వను. అయితే ఇప్పటికిప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకోబోను’ అని స్మిత్ చెప్పాడు. బెన్‌క్రాఫ్ట్ వివరణ: స్మిత్‌తో కలిసి ప్రెస్‌తో మాట్లాడిన బెన్‌క్రాఫ్ట్..‘ట్యాంపరింగ్ చేసేందుకు నాకు అవకాశం కనిపించింది. అయితే నా ప్రయత్నం పని చేయలేదు. బంతి ఆకారంలో మార్పు రాలేదు. దాంతో అంపైర్లు బంతిని మార్చలేదు. నేను బంతిని చేత్తో రుద్దుతున్న దృశ్యాలు మైదానంలో భారీ స్క్రీన్‌పై కనిపించాయి. దాంతో కంగారుపడి ఆ టేపును నా ప్యాంట్ లోపల దాచేశాను. పర్యవసానాలను నేను ఎదుర్కోక తప్పదు’అని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. (ట్యాంపరింగ్ పూర్తి వీడియో) -
దాచినా దాగదులే!
కేప్‌టౌన్: అద్భుతమైన ఆట, అదే స్థాయి రచ్చతో పోటాపోటీగా సాగుతున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను మరో కొత్త వివాదం ముంచెత్తింది. ఆసీస్ ఆటగాడు కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం తీవ్ర వివాదాన్ని రేపింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో అతను చేసిన పనులు వీడియోలో బయట పడ్డాయి. ముందుగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బెన్‌క్రాఫ్ట్ తన కుడి చేతి వేళ్ల మధ్య టేపును ఉంచి బంతి ఆకారాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను దానిని తన జేబులో వేసుకున్నాడు. ఇదంతా టీవీలో ప్రసారమైంది. వెంటనే ఆసీస్ కోచ్ లీమన్ అదనపు ఆటగాడు హ్యాండ్స్కోంబ్కు వాకీటాకీ ద్వారా ఇదే విషయాన్ని చెప్పాడు. దాంతో ఓవర్ల మధ్య మైదానంలోకి వెళ్లిన హ్యాండ్స్కోంబ్, బెన్‌క్రాఫ్ట్‌కు ఈ సమాచారం చేరవేశాడు. విషయం తెలుసుకున్న ఫీల్డ్ అంపైర్లు నైజేల్ లాంజ్, ఇల్లింగ్‌వర్త్ ఈ విషయంపై బెన్క్రాఫ్ట్ను వివరణ అడిగారు. అయితే అప్పటికే ఆ వస్తువును జేబులోంచి తీసిన ఆసీస్ క్రికెటర్ దానిని అండర్వేర్లో వేసుకున్నాడు. అంపైర్లు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ జేబులోంచి సన్‌గ్లాసెస్ క్లాత్‌ను తీసి చూపించాడు! ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన అంపైర్లు బంతిని మార్చకుండా, పెనాల్టీ పరుగులు విధించకుండా ఆటను కొనసాగించారు. ఇదీ ప్లాన్... మనం సాధారణంగా వాడే టేపులో జిగురు భాగంతో పిచ్ సమీపంలో నేలపై రాయాలని బెన్‌క్రాఫ్ట్ భావించాడు. అప్పుడు అక్కడ ఉండే తేలికపాటి కంకర రాళ్లు టేపుకు అంటుకుంటాయి. అప్పుడు ఆ గరుకుతనంతో బంతిని రుద్దితే ఆకారం దెబ్బ తిని రివర్స్ స్వింగ్‌కు అనుకూలంగా మారుతుంది. అయితే అతను అనుకున్న రీతిలో అది ప్రభావవంతంగా పని చేయకపోగా... వీడియోలో మాత్రం పట్టుబడిపోయాడు. -
తప్పుడు నాయకుడు
అనూహ్యం... అసాధారణం... ఒక అగ్రశ్రేణి జట్టు కెప్టెన్ తాము కావాలనే బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని, ఇదంతా వ్యూహంలో భాగంగా తాము తీసుకున్న సమష్టి నిర్ణయమని ప్రకటించడం! క్రీడాస్ఫూర్తి అనే పదానికి ఎప్పుడూ మైళ్ల దూరంలో ఉండే ఆస్ట్రేలియా మరోసారి తన అథమ స్థాయి తెలివితేటలను బయట పెట్టుకుంది. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు తప్పుడు పని చేయాలనుకోవడమే నేరం కాగా... ఒక యువ ఆటగాడిని అందుకోసం బలి పెట్టే ప్రయత్నం చేయడం నిజంగా క్షమించరానిది. పైగా తాను బాధ్యత తీసుకుంటున్నానని, అయితే కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకోనంటూ మళ్లీ బుకాయింపు కూడా. సరిగ్గా ఏడాది క్రితం భారత్‌తో టెస్టులో డ్రెస్సింగ్ రూమ్ నుంచి రివ్యూ విషయంలో రచ్చ చేసి ‘తన బుర్ర పని చేయలేదని’ అంగీకరించిన స్మిత్, కోచ్ లీమన్ మార్గనిర్దేశనంలోనే ఇప్పుడు అలాంటి సీక్వెల్ తయారు కావడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద సంచలనం. కేప్‌టౌన్: అంతర్జాతీయ క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ వివాదాలు కొత్త కాదు. రివర్స్ స్వింగ్‌ను రాబట్టేందుకు ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన ఘటనలు అనేకం. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాము కావాలని చేయలేదనే వివరణ ఇస్తూ ఒక క్షమాపణతో, చిన్నపాటి శిక్షతో వారంతా బయటపడిపోయారు. కానీ తాజా ఘటనకు ఆ పాపాల జాబితాలో అగ్రస్థానం దక్కుతుంది. క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్మన్వంటి ఆటగాళ్ల ఆత్మలు కూడా సిగ్గుతో తలదించుకునే స్థితి ఇది. ప్రత్యర్థిని అడ్డుకోలేక ఒక కెప్టెన్ అంత పచ్చిగా ట్యాంపరింగ్‌ను ఆశ్రయించడం ఊహకు అందనిది. పైగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడమంటూ తన సహచరుల్లో ఒకరిని పురమాయించాడు. ఇదంతా తమ సామూహిక పాపమేనని స్మిత్ ఒప్పుకున్నాడు. ‘మా ఆటగాళ్ల బృందానికి దీని గురించి తెలుసు. లంచ్ విరామ సమయంలో మేం దీనిపై మాట్లాడుకున్నాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెలుసు. ఇది నేను బాధపడాల్సిన విషయం. నాకు, మా జట్టుకు ఇది చాలా చెడ్డపేరు తీసుకొచ్చే విషయం. ఇక ముందు ఇలా జరగనివ్వను’ అని స్మిత్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. అతని ప్రతీ మాటలో అపరాధ భావం కనిపించింది. వీడియో ఫుటేజీలో తాము పట్టుబడకపోయినా జరిగిన సంఘటన పట్ల తాను బాధ పడేవాడినని అతను చెప్పాడు. ‘మేమందరం కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమిది. ఇందులో కోచ్‌ల పాత్ర ఏమీ లేదు. కానీ ఇది చాలా తప్పుడు ఆలోచన. నా నాయకత్వంలో ఇలాంటిది మొదటిసారి జరిగింది. ఇది చాలా కీలకమైన మ్యాచ్ అని తెలుసు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు బంతి బాగా రివర్స్ అయింది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. అందుకే అలాంటి ప్రయత్నం చేశాం. నిజంగా చాలా బాధగా ఉంది. ఇంకెప్పుడూ ఇలాంటిది జరగనివ్వను’ అని స్మిత్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ప్రస్తుతం కెప్టెన్‌గా తన అవసరం ఆసీస్ జట్టుకు ఉందని, కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను చేసింది చాలా పెద్ద తప్పని, అయితే మున్ముందు దీని నుంచి తాను నేర్చుకుంటానన్న స్మిత్... ఫలితాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైనట్లు చెప్పుకొచ్చాడు. లంచ్ సమయంలో మేం దీనిపై చర్చించాం. ట్యాంపరింగ్ చేసేందుకు నాకు అవకాశం కనిపించింది. అయితే నా ప్రయత్నం పని చేయలేదు. బంతి ఆకారంలో మార్పు రాలేదు. దాంతో అంపైర్లు బంతిని మార్చలేదు. నేను బంతిని చేత్తో రుద్దుతున్న దృశ్యాలు మైదానంలో భారీ స్క్రీన్‌పై కనిపించాయి. దాంతో కంగారుపడి ఆ టేపును నా ప్యాంట్ లోపల దాచేశాను. పర్యవసానాలను నేను ఎదుర్కోక తప్పదు. – బెన్‌క్రాఫ్ట్ -
ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్ ప్లేయర్!
కేప్‌టౌన్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో మరో వివాదానికి తెరలేచింది. ఇప్పటికే రబడ-స్మిత్, వార్నర్-డికాక్‌ల మధ్య స్లెడ్జింగ్ శృతి మించడంతో ఐసీసీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు బెన్ క్రాప్ట్ మైదానంలో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. ఆట మధ్యలో ప్యాంట్లో పసుపు రంగు వస్తువును దాచడం కెమెరాల్లో స్పష్టం అయింది. అతను బాల్ ట్యాంపరింగ్ యత్నించాడని ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు రావడంతో ఆట మధ్యలోనే అతన్ని పిలిచి వివరణ కోరగా ఏమి లేదని బంతిని తుడిచే నల్లటి వస్త్రం అని చూపించాడు. దీనికి సంతృప్తి చెందిన అంపైర్లు ఆటను కొనసాగించారు. అయితే తొలుత కెమెరాల్లో కనిపించిన వస్తువు.. తీరా అంపైర్ల చూపించినది వేరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం బెన్ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. రివర్స్ స్వింగ్ కోసం ఆసీస్ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ యత్నించారని, సఫారీ బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాలని ఇలా అడ్డదార్లు తొక్కారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్ ప్లేయర్!
-
డు ప్లెసిస్ అప్పీలు తిరస్కరణ
బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై జరిమానా విధించినందుకు అప్పీలుకు వెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెటర్ డు ప్లెసిస్‌కు నిరాశే ఎదురైంది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి కమిషన్ చైర్మన్ మైకేల్ బిలాఫ్ అతని అప్పీలును తోసిపుచ్చారు. హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా బంతి ఆకారాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చినట్లు (ట్యాంపరింగ్) వీడియోల్లో తేలడంతో అప్పటి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. దీనిని ఐసీసీ కమిషన్‌కు డు ప్లెసిస్ అప్పీలు చేసుకోగా...దానిని తిరస్కరించారు. -
బాల్ ట్యాంపరింగ్ కథనాలపై కోహ్లీ మండిపాటు
-
బాల్ ట్యాంపరింగ్ కథనాలపై కోహ్లీ మండిపాటు
మొహాలీ: తనపై వచ్చిన బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇండియా- ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అర్థంలేని ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ కోసం మొహాలీ వచ్చిన కోహ్లీ.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నిజానికి నాకు న్యూస్ పేపర్లు చదివే అలవాటులేదు. రాజ్‌కోట్(మొదటి) టెస్ట్‌లో నేను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని ఒక పేపర్లో వచ్చిన సంగతి నాకు ఐదు రోజుల కిందటే తెలిసింది. ఆ విషయం తెలిసి మొదట నవ్వుకున్నా. విచక్షణతో ఆలోచిస్తే.. హోరాహోరీగా సాగుతోన్న ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్‌పై దృష్టి మరల్చేందుకే ఇలాంటి కథనాల్ని పుట్టించారని అర్థం అవుతుంది’అని కోహ్లీ మీడియాతో అన్నారు. న్యూస్ పేపర్లో కథనం ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తనపై చర్యలకు ఉపక్రమించబోదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నవంబర్9 నుంచి 13 వరకు రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్’ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యర్థి జట్టు (ఇంగ్లాండ్) ఆటగాళ్లుకానీ, మ్యాచ్ అంపైర్లుగానీ కనీసం ఫిర్యాదు చేయని విషయాన్ని హైలైట్ చేస్తూ బ్రిటీష్ పత్రిక రాసిన కథనాన్ని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే సహా కొందరు మాజీలు ఖండించారు. ఒకవేళ నిజంగా ట్యాంపరింగ్‌కి పాల్పడినా.. మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లోపే ఫిర్యాదుచేయాల్సి ఉంటుంది. కాగా, బీసీసీఐ, ఐసీసీల మధ్య నడుస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధంలో కోహ్లీ బలవుతాడా? అనే అనుమానాలూ లేకపోలేదు. పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్‌లు ఆడని కారణంగా టీమిండియా మహిళా జట్టు పాయింట్లను ఐసీసీ కోత విధించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా కోహ్లీ పైనా నిబంధనలకు విరుద్ధంగా ఐసీసీ చర్యలకు దిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అనుమానం. -
గాలి వార్తలను పట్టించుకోం
-
గాలి వార్తలను పట్టించుకోం
బాల్‌టాంపరింగ్ కథనాలపై కోచ్ కుంబ్లే మొహాలీ: తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడని బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనాలను కోచ్ అనిల్ కుంబ్లే తోసిపుచ్చారు. ఇలాంటి గాలి వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ‘మీడియాలో వచ్చిన వార్తపై నేను స్పందించాలనుకోవడం లేదు. దానిపై చింతించాల్సిన అవసరమే లేదు. కొందరు వారేమనుకుంటున్నారో అదే మీడియాలో రాస్తారు. నాకు సంబంధించిన వరకు మా ఆటగాళ్లెవరూ అలాంటి చర్యలకు పాల్పడలేదు. అసలు ఈ విషయంలో మాట్లాడేందుకు అంపైర్, రిఫరీ ఎవరూ మా దగ్గరికి రాలేదు. అందుకే ఇలాంటి కథనాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు’ అని కుంబ్లే స్పష్టం చేశారు. -
డుప్లెసిస్ ‘తీపి’ సెంచరీ!
దక్షిణాఫ్రికా 259/9 డిక్లేర్డ్ ఆస్ట్రేలియాతో చివరి టెస్టు అడిలైడ్: వారం రోజులుగా వెంటాడుతున్న వివా దం... బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో జరిమా నా... తాను తప్పు చేయలేదని మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సి రావడం... ఇలాంటి స్థితిలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మూడో టెస్టులో బరిలోకి దిగాడు. బ్యాటింగ్‌కు వస్తుంటే మైదానం అన్ని వైపులనుంచి ఎగతాళి చేస్తున్న ప్రేక్షకులు... ఇవేవీ డు ప్లెసిస్ స్థైర్యాన్ని, ఏకాగ్రతను దెబ్బ తీయలేకపోయారుు. సహచరులంతా విఫలమైన చోట ఒక్కడే నిలబడి ముందుండి నడిపించాడు. చివరకు అద్భుత శతకం సాధించి అంతకు ముందు వెక్కిరించిన ప్రేక్షకులే నిలబడి చప్పట్లతో అభినందించేలా చేశాడు. ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టు (డే అండ్ నైట్)లో దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 259 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. డు ప్లెసిస్ (164 బంతుల్లో 118 నాటౌట్; 17 ఫోర్లు) కెరీర్లో ఆరో సెంచరీ సాధించగా, స్టీఫెన్ కుక్ (40) పర్వాలేదనిపించాడు. 44/3 స్కోరు వద్ద క్రీజ్‌లోకి వచ్చిన ప్లెసిస్ కీలక భాగస్వామ్యాలతో జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, బర్డ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 12 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. ‘ఇది నా అత్యుత్తమ ఇన్నింగ్స్ . ఈ రోజు ఆట పట్ల గర్వంగా ఉన్నాను. ఇలాంటి సమయంలో కెప్టెన్‌గా ముందుండి నడిపించడం గొప్పగా అనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంతగా ఒక ఘటన నాలో స్ఫూర్తిని పెంచలేదు. ప్రేక్షకులు నన్ను ఆటపట్టిస్తారని ముందే ఊహిం చాను’ - డు ప్లెసిస్ -
కోహ్లి బాల్ ట్యాంపరింగ్: సెహ్వాగ్ ఫైర్
బ్రిటిష్ మీడియాపై మండిపడిన నజబ్‌గఢ్ నవాబ్ ముంబై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ బ్రిటీష్ మీడియా కథనాలు వండివార్చడంపై మాజీ క్రికెటర్, నజబ్‌గఢ్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డాడు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఓటమిని ఇంగ్లండ్ గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే.. ఆ జట్టు గౌరవం పెరిగేదని వ్యాఖ్యానించాడు. ‘ఓడిపోయే జట్టు ఎప్పుడూ కొన్ని అంశాలు లేవనెత్తి లబ్ధి పొందాలని చూస్తుందని ఆయన ‘హిందూస్తాన్ టైమ్స్’ తో మాట్లాడుతూ అన్నారు. రాజ్‌కోట్‌లో మొదటి టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లి బాల్‌ను ట్యాంపర్ చేస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వెలుగుచూసింది. చూయింగమ్ నములుతూ ఉన్న కోహ్లి తన లాలాజలాన్ని బాల్‌కు రుద్ది.. అది మెరిసేలా చేశాడని, ఇది బాల్ ట్యాంపరింగ్‌యేనని ఆరోపిస్తూ బ్రిటన్ మీడియా కథనాలు రాసింది. ఇలా లాలాజలముతో బాల్‌ను ట్యాపరింగ్ చేసినందుకు ఇప్పటికే ఐసీసీ దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్‌కు జరిమానా విధించింది. అయితే, బ్రిటన్ మీడియా కథనాలపై సెహ్వాగ్ ఘాటుగా స్పందించాడు.‘ ఇంగ్లండ్ జట్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ ఆ దేశ మీడియానే ఇలాంటి రాతలు రాస్తున్నది. ఓటమిని కూడా గౌరవప్రదంగా అంగీకరించాలి. విదేశాల్లో ఓడిపోయినప్పుడు మేం ఎప్పుడూ సాకులు చెప్పలేదు. మేం ఆడలేనందువల్లే ఓడిపోయాం అని మేం గతంలో హుందాగా ఒప్పుకొనేవాళ్లం’ అంటూ బ్రిటన్ మీడియాను ఆయన తప్పుబట్టాడు. -
డుప్లెసిస్ ‘తప్పు’ చేశాడు!
ధ్రువీకరించిన ఐసీసీ నిషేధం లేదు, జరిమానాతో సరి అడిలైడ్: దక్షిణాఫ్రికా టెస్టు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ధారించింది. ఇందుకు అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానాగా విధించింది. అరుుతే మ్యాచ్ నిషేధం నుంచి మాత్రం డు ప్లెసిస్ తప్పించుకున్నాడు. ఫలితంగా గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో అతను ఆడనున్నాడు. ఆస్ట్రేలియాతో హోబర్డ్‌లో జరిగిన రెండో టెస్టులో ట్యాంపరింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ముందు డు ప్లెసిస్ సుదీర్ఘ విచారణకు హాజరయ్యాడు. తాను తప్పు చేయలేదని అతను వాదించాడు. అనంతరం ఐసీసీ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘తన నోటిలో ఉన్న చాక్లెట్ లేదా మింట్లాంటి పదార్థంతో డు ప్లెసిస్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించినట్లు టీవీ ఫుటేజీలో కనిపించింది. అంపైర్లతో చర్చించిన తర్వాతే ఈ చర్య తీసుకుంటున్నాం. వారు కూడా తగిన సాక్ష్యాలు అందించారు. ఐసీసీ నిబంధన 2.2.9 ప్రకారం కృత్రిమ వస్తువులు వాడి బంతి ఆకారాన్ని దెబ్బ తీయడం నిబంధనలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది. దీనిని మొదటి తప్పుగా భావించి వంద శాతం జరిమానా విధించిన ఐసీసీ, దాంతో పాటు ప్లెసిస్ క్రమశిక్షణా రికార్డులో మూడు పారుుంట్లు తగ్గించింది. అరుుతే ఐసీసీ శిక్షపై డు ప్లెసిస్ మరోసారి అప్పీల్‌కు వెళ్లాలని భావిస్తున్నాడు. 2013లోనూ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా చెల్లించాడు. -
బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన డు ప్లెసిస్!
దుబాయ్: దక్షిణాఫ్రికా ప్రస్తుత టెస్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆరోపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో మంగళవారం నాలుగో రోజు ఆటలో తన లాలాజలం, బబుల్గమ్తో బంతిని మరింత మెరిసేలా చేస్తున్నట్టు వీడియో ఫుటేజిలో కనిపించింది. ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ 2.2.9ను అతిక్రమించినట్టేనని ఐసీసీ స్పష్టం చేసింది. డు ప్లెసిస్ దోషిగా తేలితే అతనిపై ఒక టెస్టు మ్యాచ్ నిషేధం పడే అవకాశముంటుంది.