Tim Paine: ‘వెలి వేసినట్లు చూశారు.. మేమే కాదు దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్‌ చేసింది’

Former Australia skipper Tim Paine accuses South Africa of Ball-Tampering - Sakshi

టిమ్‌ పెయిన్‌ వెల్లడి

Tim Paine- Ball Tampering- Sandpaper Scandal- సిడ్నీ: 2018లో కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సందర్భంగా జరిగిన ‘బాల్‌ టాంపరింగ్‌’ ఉదంతం క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దాంతో స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై వేటు పడటంతో పాటు తర్వాతి మ్యాచ్‌నుంచి టిమ్‌ పెయిన్‌ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అయితే నాటి ఘటనను తన పుస్తకం ‘ద పెయిడ్‌ ప్రైస్‌’లో గుర్తు చేసుకున్న పెయిన్‌... తామే కాదు, తర్వాతి టెస్టులో దక్షిణాఫ్రికా కూడా టాంపరింగ్‌ చేసిందని వ్యాఖ్యానించాడు. అయితే స్థానిక ప్రసారకర్తల సహాయంతో ఆ వీడియోను దాచేశారని అతను ఆరోపించాడు.

‘సిరీస్‌ నాలుగో టెస్టులో ఇది జరిగింది. దక్షిణాఫ్రికా ప్లేయర్‌ చేతిలో ఉన్న బంతిపై చాలా పగుళ్లు ఉన్న దృశ్యం అక్కడి భారీ స్క్రీన్‌పై కనిపించింది. కానీ ఆ వెంటనే దానిని తొలగించారు. మేం ఈ విషయంపై అంపైర్లతో మాట్లాడినా అసలు ఎవరూ పట్టించుకోలేదు’ అని పెయిన్‌ చెప్పాడు.

బాల్‌ టాంపరింగ్‌ ఘటన సమయంలో తమ ముగ్గురు క్రికెటర్లకు ఎవరూ అండగా నిలవలేదని విషయాన్ని అతను అంగీకరించాడు. ‘సాధారణంగా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సహచర క్రికెటర్లు ఆదుకోవాలి. మానసికంగా వారికి అండగా నిలవాలి. కానీ వారందరినీ వెలి వేసినట్లు చూశారు’ అని పెయిన్‌ చెప్పాడు.   

చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దిగ్గజ అంపైర్‌
T20 WC 2022: అక్తర్‌, బ్రాడ్‌ హాగ్‌లు దొరికేశారు కదా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top