బెంగళూరులో నాటకీయ పరిణామం.. తేజస్వీ సూర్య అరెస్ట్‌! | BJP MP Tejasvi Surya Detained While Protesting Against Bengaluru Metro Fare Hike, Watch Video Inside | Sakshi
Sakshi News home page

బెంగళూరులో నాటకీయ పరిణామం.. తేజస్వీ సూర్య అరెస్ట్‌!

Feb 9 2026 10:38 AM | Updated on Feb 9 2026 10:51 AM

BJP MP Tejasvi Surya detained amid Bengaluru Metro protest

బెంగళూరు: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలో మెట్రో చార్జీల పెంపు వ్యవహారంపై బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో నిరసనల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత తేజస్వీని వదలిలేశారు. దీంతో, కాంగ్రెస్‌ సర్కార్‌ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బీజేపీ మెట్రో చార్జీల పెంపుపై ప్రతిపక్ష బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. ఆర్‌వీ రోడ్ మెట్రో స్టేషన్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ సూర్య ఖాళీ ట్రంక్‌ పెట్టెలు పట్టుకుని నిరసనలకు దిగారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. తేజస్వీ సూర్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, తేజస్వీ సూర్యను వదిలిపెట్టారు. ఈ క్రమంలో తేజస్వీ మాట్లాడుతూ.. అరెస్ట్‌ చేయడం వల్ల నా నోరు మూయించలేరు. కర్ణాటక ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రజలకు తెలియాలి. బడ్జెట్ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం ఒత్తిడి వల్లే రెండోసారి మెట్రో చార్జీల పెంపు ఆగిపోయింది అని చెప్పుకొచ్చారు. అయితే, నిరసనల్లో పాల్గొనవద్దని ప్రభుత్వం తేజస్వీ సూర్యకు నిన్ననే నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ నిరసనల్లో పాల్గొనడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. 

అంతకుముందు, సిద్దరామయ్య ప్రభుత్వం బెంగళూరులో నమ్మ మెట్రో రైలు ప్రయాణ ఛార్జీలు ఐదు శాతం పెంచేందుకు పచ్చజెండా ఊపింది. బీఎంఆర్‌సీఎల్‌ చేసిన ఈ ప్రతిపాదనను అంగీకరించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కొత్త ఛార్జీలు నేటి నుంచి(ఫిబ్రవరి 9) అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10, గరిష్ఠ ఛార్జీ రూ.90 అమలులో ఉన్న విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీల ప్రకారం కనీస ఛార్జీ రూపాయి నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నిరసనలకు దిగింది. అనంతరం, కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు స్థానిక బీజేపీ నేతలు లేఖలు రాశారు. దీంతో, చార్జీల పెంపు తాత్కాలికంగా నిలిపివేయాలని బీఎంఆర్‌సీఎల్‌ను ఆదేశించారని తెలిపారు. దీంతో, చార్జీల పెంపు ప్రక్రియ ఆగిపోయింది. అయితే, ఇప్పుడు చార్జీలను పెంచకపోయినా, మార్చిలో గాని ఏప్రిల్‌లో మాత్రం బాదుడు తప్పదని అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆ పెంపు 100 శాతం ఉన్నా ఆశ్చర్యం వద్దని మెట్రో వర్గాలు చెప్పడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement