రాణించిన కేఎల్‌ రాహుల్‌ | KL Rahul steady fifty vs Mumbai takes Karnataka closer to Ranji Trophy semi final | Sakshi
Sakshi News home page

రాణించిన కేఎల్‌ రాహుల్‌

Feb 8 2026 8:06 PM | Updated on Feb 8 2026 8:06 PM

KL Rahul steady fifty vs Mumbai takes Karnataka closer to Ranji Trophy semi final

ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో కర్ణాటక జట్టు గెలుపు దిశగా పయనిస్తుంది. మరో 212 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలి ఉంది. కేఎల్‌ రాహుల్‌ (60) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ సాధించి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌ (9) ఉన్నాడు. వీరిద్దరూ క్రీజ్‌లో కుదురుకుంటే కర్ణాటక గెలుపు నల్లేరుమీద నడకే. 

మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (3), ఇన్‌ ఫామ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ (39) వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, తనుశ్‌ కోటియన్‌ తలో వికెట​్‌ తీశారు.

అంతకుముందు ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 377 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ ఆనంద్‌ (70) అర్ద సెంచరీతో రాణించగా.. తనుశ్‌ కోటియన్‌ (48 నాటౌట్‌), తుషార్‌ దేశ్‌పాండే (47), ముషీర్‌ ఖాన్‌ (49), యశస్వి జైస్వాల్‌ (36), అఖిల్‌ హెర్వాద్కర్‌ (33), సిద్దేశ్‌ లాడ్‌ (25), సూర్యాంశ్‌ షేడ్గే (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌, కావేరప్ప తలో 2, శిఖర్‌ షెట్టి 3, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ తీశారు.

కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున మయాంక్‌ అగర్వాల్‌ (92) ఒక్కడే రాణించాడు. మోహిత్‌ అవస్తి, తుషార్‌ దేశ్‌పాండే తలో 4 వికెట్లు తీశారు. దీనికి ముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే చాపచుట్టేసింది.కావేరప్ప, ప్రసిద్ద్‌ కృష్ణ, శ్రేయస్‌ గోపాల్‌ తలో 3 వికెట్లు తీసి ముంబైని దెబ్బేశారు. ముంబై ఇన్నింగ్స్‌లో అఖిల్‌ హెర్వాద్కర్‌ (60) ఒక్కడే రాణించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement