టీమిండియా స్టార్‌ ఆటగాడికి అస్వస్థత | India opener down with fever ahead of T20 World Cup match vs Namibia | Sakshi
Sakshi News home page

టీమిండియా స్టార్‌ ఆటగాడికి అస్వస్థత

Feb 8 2026 5:03 PM | Updated on Feb 8 2026 5:47 PM

India opener down with fever ahead of T20 World Cup match vs Namibia

టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న టీమిండియాను జ్వరాల పీడ వేధిస్తుంది. తొలుత బుమ్రా.. తాజాగా అభిషేక్‌ శర్మ వైరల్‌ ఫీవర్‌ బారిన పడ్డారు. జ్వరం కారణంగా బుమ్రా యూఎస్‌ఏతో మ్యాచ్‌కు దూరం కాగా.. అభిషేక్‌ నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. అభిషేక్‌కు జ్వరంతో పాటు కడుపు నొప్పి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నమీబియాతో మ్యాచ్‌ ఫిబ్రవరి 12న జరగాల్సి ఉంది. ఆ సమయానికి అభిషేక్‌ కోలుకుంటాడో లేదో చూడాలి.

కాగా, నిన్న యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ జ్వరంతోనే బాధపడుతూనే బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (84 నాటౌట్‌) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 

స్కై మినహా భారత ఇన్నింగ్స్‌లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్‌ వర్మ (25), ఇషాన్‌ కిషన్‌ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్‌ శర్మ, శివమ్‌ దూబే, వరుణ్‌ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్‌ 6, హార్దిక్‌ పాండ్యా 5,అక్షర్‌ పటేల్‌ 14చ, అర్షదీప్‌ సింగ్‌ 4 పరుగులు చేశారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్విక్‌ 4, హర్మీత్‌ సింగ్‌ 2, మొహమ్మద్‌ మొహిసిన్‌, అలీ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్‌ఏ తడబడింది. సిరాజ్‌ (4-0-29-3), అర్షదీప్‌ సింగ్‌ (4-0-18-2), అక్షర్‌ పటేల్‌ (4-0-24-2), వరుణ్‌ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమై, 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

యూఎస్ఏ ఇన్నింగ్స్‌లో సంజయ్‌ కృష్ణమూర్తి, శుభమ్‌ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్‌ కుమార్‌ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్‌ గౌస్‌ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్‌ ఖాన్‌ 8, స్కాల్విక్‌ 2 (నాటౌట్‌) పరుగులు చేయగా.. మోనాంక్‌ పటేల్‌, హర్మీత్‌ సింగ్‌ డకౌట్లయ్యారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement