ఆఫ్ఘనిస్తాన్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం | T20 WC 2026: new zealand beat afghanistan by 5 wickets | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘనిస్తాన్‌పై న్యూజిలాండ్‌ ఘన విజయం

Feb 8 2026 2:49 PM | Updated on Feb 8 2026 3:04 PM

T20 WC 2026: new zealand beat afghanistan by 5 wickets

టీ20 ప్రపంచకప్‌ 2026లో న్యూజిలాండ్‌ ఘనంగా బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 8) ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో గుల్బదిన్‌ నైబ్‌ (63) టాప్‌ స్కోరర్‌ కాగా.. రహానుల్లా గుర్బాజ్‌ 27, ఇబ్రహీం జద్రాన్‌ 10, సెదిఖుల్లా అటల్‌ 29, దర్విష్‌ రసూల్‌ 20, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ 14, మొహమ్మద్‌ నబీ 10 (నాటౌట్‌) పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్‌ 2, రచిన్‌ రవీంద్ర, మ్యాట్‌ హెన్రీ, జేకబ్‌ డఫీ తలో వికెట్‌ తీశారు.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ సీఫర్ట్‌ 65 పరుగులతో సత్తా చాటగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 42, మార్క్‌ చాప్‌మన్‌ 28, డారిల్‌ మిచెల్‌ 25 (నాటౌట్‌), మిచెల్‌ సాంట్నర్‌ 17 (నాటౌట్‌), ఫిన్‌ అలెన్‌ ఒక పరుగు చేశారు. రచిన్‌ రవీంద్ర గోల్డెన్‌ డకౌటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో ముజీబ్‌ రహ్మాన్‌ 2, ఒమర్‌జాయ్‌, రషీద్‌ ఖాన్‌, నబీ తలో వికెట్‌ తీశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement