breaking news
New Zealand
-
టీ20 వరల్డ్ కప్: ఇంగ్లండ్ 'హ్యాట్రిక్'
కొలంబో: న్యూజిలాండ్‌తో ‘సూపర్ ఎయిట్స్’ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్‌కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించారు. దాంతో ‘సూపర్ ఎయిట్స్’లో ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచి ఇంగ్లండ్ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్ చేరే అవకాశాన్ని కివీస్ పోగొట్టుకుంది. శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), టీమ్ సీఫెర్ట్ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్ బాంటన్ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ (18 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ప్రదర్శన కనబర్చారు. ఓపెనర్లు మినహా... తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్ అలెన్ (19 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. ఆర్చర్ ఓవర్లో సీఫెర్ట్ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన రేహన్ అహ్మద్ తన తొలి బంతికే రచిన్ రవీంద్ర (11)ను అవుట్ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్ మిడిలార్డర్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమష్టి ప్రదర్శన... ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు సాల్ట్ (2), బట్లర్ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), బెతెల్ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్ బాధ్యత తీసుకోగా, స్యామ్ కరన్ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్ చేసి కివీస్ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్ అహ్మద్ (7 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. స్వదేశానికి మ్యాట్ హెన్రీ... కొలంబో: న్యూజిలాండ్ ప్రధాన పేస్ బౌలర్ మ్యాట్ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ తర్వాత అతను న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. జట్టు హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్ ఫలితం తర్వాత కివీస్ సెమీస్‌కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫెర్ట్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 35; అలెన్ (సి) బెతెల్ (బి) జాక్స్ 29; రచిన్ (సి) బెతెల్ (బి) రేహన్ 11; ఫిలిప్స్ (బి) జాక్స్ 39; చాప్మన్ (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 15; మిచెల్ (సి) జాక్స్ (బి) డాసన్ 3; సాంట్నర్ (నాటౌట్) 9; మెక్‌కోన్‌కీ (బి) రేహన్ 14; హెన్రీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్: ఆర్చర్ 3–1–24–0, డాసన్ 4–0–32–1, కరన్ 1–0–10–0, రషీద్ 4–0–28–2, జాక్స్ 4–0–23–2, బెతెల్ 1–0–13–0, రేహన్ 3–0–28–2. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సీఫెర్ట్ (బి) హెన్రీ 2; బట్లర్ (సి) సీఫెర్ట్ (బి) ఫెర్గూసన్ 0; బ్రూక్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 26; బెతెల్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 21; బాంటన్ (సి) చాప్మన్ (బి) రచిన్ 33; కరన్ (సి) ఫిలిప్స్ (బి) రచిన్ 24; జాక్స్ (నాటౌట్) 32; రేహన్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117. బౌలింగ్: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్ 2–0–14–1, సాంట్నర్ 4–0–29–0, మెక్‌కోన్‌కీ 1–0–13–0, ఫిలిప్స్ 4–0–43–1, రచిన్ 4–0–19–3, సోధి 2–0–21–0. -
టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో నేడు (ఫిబ్రవరి 27) కీలక సమరం జరుగనుంది. గ్రూప్-2 నుంచి ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఇంగ్లండ్.. మరో బెర్త్ కోసం రేసులో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ న్యూజిలాండ్ జట్టు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆ జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. తద్వారా పాక్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ రెండో బెర్త్ కోసం పోటీ సజీవంగా ఉంటుంది. పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధిస్తే, అప్పుడు పాక్, న్యూజిలాండ్ తలో 3 పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు రన్‌రేట్ కీలకమవుతుంది. ప్రస్తుత గణాంకాలు చూస్తే.. న్యూజిలాండ్ ఇంగ్లండ్ చేతిలో సాధారణంగా ఓడినా, పాక్ శ్రీలంకపై నామమాత్రంగా గెలిచినా న్యూజిలాండే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం న్యూజిలాండ్ రన్ రేట్ 3.050గా ఉంది. అదే పాక్ రన్‌రేట్ -0.461గా ఉంది. పాక్ మైనస్ నుంచి ప్లస్ రన్‌రేట్‌లోకి రావాలంటేనే శ్రీలంకపై భారీ విజయం సాధించాలి. అదే న్యూజిలాండ్ రన్‌రేట్‌ను అధిగమించాలంటే అతి భారీ విజయం సాధించాలి. కాబట్టి, నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా, న్యూజిలాండ్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉంటాయి. వాస్తవానికి న్యూజిలాండ్ పరిస్థితిని అంతవరకు తీసుకుపోకపోవచ్చు. ఎందుకంటే, ఈ ఎడిషన్‌లో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. గ్రూప్ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి మినహా మిగతా మ్యాచ్‌ల్లో సామర్థ్యం మేరకు రాణించింది. పాక్‌తో జరగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ రద్దు కావడంతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది. అదే మ్యాచ్ జరిగి ఉంటే, న్యూజిలాండ్ సునాయాసంగా పాక్‌ను చిత్తు చేసి, దర్జాగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేది.బలాబలాల ప్రకారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ సమతూకంగా కనిపించినా ఎడ్జ్ న్యూజిలాండ్‌వైపే మొగ్గు చూపుతోంది. ఆ జట్టులో దాదాపు అందరు ఆటగాళ్లు మంచి టచ్‌లో ఉన్నారు. అదే ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఓపెనర్ జోస్ బట్లర్, జేకబ్ బేతెల్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. ఫామ్ విషయాన్ని కూడా పక్కన పెడితే, 40 ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే జట్టే అంతిమ విజేతగా నిలుస్తుంది.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్/జాకబ్ డఫీఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్/రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శ్రీలంకతో నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఆతిథ్య శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్‌కోంచి (31 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.ఈ క్రమంలో సాంట్నర్-మెక్‌కోంచి జోడీ ఓ వరల్డ్‌కప్ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు మైక్ హస్సీ-స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. 2010 ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌పై ఈ జోడీ ఏడో వికెట్‌కు 74 పరుగులు జోడించింది. తాజాగా సాంట్నర్-మెక్‌కోంచి జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.డెత్ ఓవర్లలో దూకుడుడెత్ ఓవర్లలో సాంట్నర్-మెక్‌కొంచి జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టింది. 17వ ఓవర్లో 18, 18వ ఓవర్లో 21, చివరి రెండు ఓవర్లలో 19 మరియు 12 పరుగులు పిండుకుంది.అరుదైన మైలురాయిని తాకిన సాంట్నర్ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేయడంతో సాంట్నర్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొహమ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా, షకీబ్ అల్ హసన్ వంటి ప్రముఖులు ఉన్నారు.బెంబేలెత్తించిన హెన్రీ.. తిప్పేసిన స్పిన్నర్లు169 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లు ఆది నుంచే రెచ్చిపోయారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ (2-1-3-2) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ నిస్సంకను క్లీన్ బౌల్డ్ చేసిన హెన్రీ.. ఆతర్వాతి ఓవర్లో అసలంకను పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత స్పిన్నర్లు లైన్లోకి వచ్చి లంక ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. వీరిలో రచిన్ రవీంద్ర (4-0-27-4) లంక పతనాన్ని శాశించారు. సాంట్నర్ (4-0-19-1), గ్లెన్ ఫిలిప్స్ (4-0-21-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక ఆటగాళ్లను కట్టడి చేశారు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన కమిందు మెండిసే టాప్ స్కోరర్. -
శ్రీలంక ఖేల్ ఖతం
కొలంబో: టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సొంతగడ్డపై కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన లంక... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ ఓడింది. ఫలితంగా రెండు పరాజయాలతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. బుధవారం జరిగిన ‘గ్రూప్–2’ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, తాజా విజయంతో కివీస్ అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే కివీస్ కూడా సెమీస్‌లోకి అడుగు పెడుతుంది. ఓడితే శనివారం పాక్, లంక మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. పాక్ ఓడితే కివీస్‌కు చోటు ఖాయమవుతుంది. పాక్ గెలిస్తే అప్పుడు రన్‌రేట్‌లో పోటీ పడాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (26 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), కోల్ మెక్‌కోన్‌కీ (23 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. 9.2 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 75/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే లంక బౌలర్లు చెలరేగడంతో 9 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 84/6కు చేరింది. ఈ దశలో సాంట్నర్, మెక్‌కోన్‌కీ ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివరి 4 ఓవర్లలో న్యూజిలాండ్ 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో 70 పరుగులు రాబట్టడం విశేషం. ఆరు వికెట్లు కోల్పోయే సమయానికి 84 పరుగులు చేసిన కివీస్... తర్వాతి వికెట్ భాగస్వామ్యంలో సరిగ్గా అన్నే పరుగులు చేయడం విశేషం. టి20 వరల్డ్ కప్‌లో గతంలో ఏడో వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం 74 పరుగులు (మైక్ హస్సీ, స్టీవ్ స్మిత్ మధ్య 2010లో) కాగా...సాంట్నర్, మెక్‌కోన్‌కీ దీనిని సవరించారు. మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో లంక పూర్తిగా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే నిసాంక (0) బౌల్డ్ కావడంతో మొదలైన పతనం వేగంగా సాగింది. అసలంక (5), కుశాల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10), షనక (3) వరుస కట్టి పెవిలియన్‌కు చేరడంతో 10.3 ఓవర్లలో 46 పరుగులకే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కమిందు మెండిస్ (31; 4 ఫోర్లు), వెలలాగె (29; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా దాని ప్రభావం ఫలితంపై పడలేదు. రచిన్ రవీంద్ర (4/27) లంకను కుప్పకూల్చగా, హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. రచిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
టీ20 వరల్డ్ కప్: శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు
టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన టీ20 వరల్డ్‌కప్ సూపర్ 8 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. సెమీఫైనల్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలైంది.టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఒక దశలో వరుస వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. 75 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన కివీస్, కొద్ది సమయంలోనే 84/6కి కుప్పకూలింది. వరుసగా మూడు వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ శ్రీలంక వైపు మళ్లినట్టే అనిపించింది.అయితే, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్కాంచీ (31 నాటౌట్) కీలకమైన 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును గట్టెక్కించారు. మిచెల్,కోల్ అద్భుతమైన ఆటతీరుతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది.169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ప్రారంభం నుంచే కష్టాల్లో పడ్డారు. న్యూజిలాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి లంకన్ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. చివరికి శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది.ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ల చక్కటి లైనప్, అలాగే సాంట్నర్-మెక్కాంచీ భాగస్వామ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు, పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో శ్రీలంక ఓటమి చవిచూసింది. -
టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో సూపర్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 25) మరో సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఆతిథ్య శ్రీలంకను న్యూజిలాండ్ కొలొంబో వేదికగా ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇరు జట్లు సెమీస్ రేసులో ఉంటాయి. ఓడినా ఛాన్స్‌లు ఉంటాయి కానీ, అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ మ్యాచ్ చాలా కీలకం.శ్రీలంక తొలి సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెమీస్ రేసులో చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దై న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారు కావడంతో మిగిలిన బెర్త్ కోసం న్యూజిలాండ్-పాక్-శ్రీలంక మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది.న్యూజిలాండే ఫేవరెట్నేటి మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలిస్తే.. న్యూజిలాండే ఫేవరెట్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. గ్రూప్ దశలో ఈ జట్టు నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో (సౌతాఫ్రికా మినహా) గెలిచింది. శ్రీలంక సైతం నాలుగింట మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచినప్పటికీ (జింబాబ్వే మినహా).. బలాబలాల ప్రకారం న్యూజిలాండ్‌దే ఆధిక్యత కనిపిస్తుంది. గ్రూప్ దశలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించినా, హోం అడ్వాంటేజ్ ఉన్నా.. బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే న్యూజిలాండ్‌పై గెలవడం శ్రీలంకకు చాలా కష్టమనే చెప్పాలి.రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయిఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలించినా, న్యూజిలాండ్‌దే అధిపత్యమని చెబుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు జరగగా.. న్యూజిలాండ్ 16, శ్రీలంక 11 మ్యాచ్‌లు గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ ఆధిపత్యమే కనిపిస్తుంది. లంకలో ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. న్యూజిలాండ్ 5, శ్రీలంక 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది.తుది జట్లు (అంచనా)న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్ శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(w), పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(c), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక -
పాకిస్తాన్, న్యూజిలాండ్ ‘సూపర్–8’ మ్యాచ్ రద్దు
టి20 వరల్డ్ కప్ ‘సూపర్ ఎయిట్స్’ దశ పోటీలు వర్షం ప్రభావంతో మొదలయ్యాయి. గ్రూప్–2లో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కొలంబోలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. టాస్ నెగ్గిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత సమయానికే మ్యాచ్ ఆరంభమవుతున్నట్లు కనిపించిన దశలో ఒక్కసారిగా వాన ముంచెత్తింది. స్వల్పంగా చినుకులతో మొదలైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది.ప్రేమదాస స్టేడియంలో సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా వాన తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సూపర్–8లో పాక్ తమ తర్వాతి మ్యాచ్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో... న్యూజిలాండ్ బుధవారం శ్రీలంకతో తలపడతాయి. నేటి సూపర్ – 8 మ్యాచ్లుశ్రీలంక X ఇంగ్లండ్‌వేదిక: పల్లెకెలె ; మ.3.00 గంటల నుంచి భారత్ X దక్షిణాఫ్రికావేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
టీ20 ప్రపంచ కప్ లో నేడు కీలక మ్యాచ్
-
‘సూపర్–8’ సమయం
టి20 ప్రపంచ కప్‌లో మరింత వినోదానికి నేటితో తెర లేవనుంది. పసికూనలు, పస లేని జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా టాప్–8 టీమ్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మాజీ చాంపియన్ పాకిస్తాన్ తలపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో మూడు మ్యాచ్‌లు గెలిచి పాక్ ముందంజ వేయగా, గ్రూప్ ‘డి’ నుంచి కూడా మూడు విజయాలతో కివీస్ తర్వాతి దశకు అర్హత సాధించింది. కొలంబో: పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ఇటీవల వన్డేలు, టి20 ఫార్మాట్లలో తరచుగా తలపడ్డాయి. రెండున్నరేళ్ల వ్యవధిలో ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరగ్గా... ఇందులో 17 వన్డేలు, 24 టి20లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి బలాబలాల గురించి ఇరు జట్లకు మంచి అవగాహన ఉంది. ద్వైపాక్షిక సిరీస్‌లను మినహాయిస్తే... 2022 టి20 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత రెండు జట్లు ఒక పెద్ద టోర్నీలో పోటీకి దిగడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ జట్టు లీగ్ దశను దాటినా... అంచనాలకు తగినట్లుగా ఆడలేకపోతోంది. సీఫెర్ట్, అలెన్ మాత్రమే బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించగా... రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, డరైల్ మిచెల్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. బౌలింగ్‌లో కూడా డఫీ, సోధి భారీగా పరుగులిస్తున్నారు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వైఫల్యం కూడా వరల్డ్ కప్‌లో జట్టును ఇబ్బంది పెట్టింది. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్ ఆశలు మిగలాలంటే కివీస్ బృందం సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు పాకిస్తాన్‌కు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడటం కాస్త కలిసొచ్చే అంశం. ముఖ్యంగా ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో మ్యాచ్ ఆడిన ఆ జట్టుకు పిచ్ పరిస్థితిపై మంచి అవగాహన ఉంది. అందుకే తమ స్పిన్ బలగాన్ని జట్టు నమ్ముకుంది. ప్రధాన పేసర్ షాహిన్ అఫ్రిది ఘోరంగా విఫలం కాగా... మరో పేసర్ ఫహీమ్ ఒక్క ఓవర్ కూడా బౌలింగే చేయలేదు. స్పిన్నర్లు ఉస్మాన్ తారిఖ్, అబ్రార్, షాదాబ్, నవాజ్‌లపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే బ్యాటింగ్‌లో ఫర్హాన్ మినహా సయీమ్ అయూబ్, సల్మాన్, బాబర్ ఆజమ్ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఇరు జట్లు ఫామ్‌లో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఆసక్తికర పోరు ఖాయం. మ్యాచ్ రోజున వర్షసూచన ఉంది. -
T20 WC 2026: ఏ జట్లకు సెమీస్ అవకాశాలు..?
టీ20 వరల్డ్‌కప్ 2026లో మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఫైనల్-8కి అర్హత సాధించాయి.సూపర్-8 దశలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, భారత్, జింబాబ్వే గ్రూప్ 1లో ఉండగా.. ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ గ్రూప్ 2లో ఉన్నాయి. సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్ 1 మ్యాచ్‌లన్నీ భారత్‌లో జరుగనుండగా.. గ్రూప్ 2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. సెమీస్, ఫైనల్స్ వేదికలు ఇంకా ఖరారు కాలేదు.సూపర్-8 సమరాలకు సర్వం సిద్దమైన వేల ఏయే జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ జోరందుకుంది. ఈ టాపిక్‌పై ఎవరి అంచనాలు వారికున్నా, ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఫైనల్-4కు చేరడం ఏ జట్టుకూ అంత ఈజీగా అయితే కనిపించడం లేదు. సూపర్-8 దశకు చేరాయంటేనే ఆ జట్ల సత్తా ఏంటో ఇదివరకే నిరూపితమైనట్లు. అలాంటిది టగ్ ఆఫ్ వార్ ఫైట్లలో అన్నీ జట్లు శక్తివంచన లేకుండా పోరాడటం ఖాయంగా కనిపిస్తుంది.సూపర్ 8 దశలో రెండు గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరతాయి. ఇరు గ్రూప్‌ల్లో ఆ రెండు బెర్త్‌ల కోసం అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది.గ్రూప్ 1 విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్, జింబాబ్వేను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా విండీస్ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మిగతా జట్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. విండీస్ ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా గ్రూప్ దశలో ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి జోష్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విండీస్‌తో ఏమరపాటుగా ఉంటే సౌతాఫ్రికా ప్రపంచకప్ కల ఈసారి కూడా కలగానే మిగిలిపోతుంది.ఎందుకంటే, ప్రస్తుతం భారత్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు ఓడించడం అంత కష్టం కాకపోవచ్చు. పైగా టీమిండియాకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంది. కాబట్టి భారత్ ఫైనల్-4కు చేరడం నల్లేరుపై నడకే అవుతుంది. ఇక మిగిలిన రెండో బెర్త్ కోసం ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది. జింబాబ్వే సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జింబాబ్వే గ్రూప్ దశలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, తామేంటో ఈసారి ప్రపంచానికి చూపిస్తామని ఛాలెంజ్ చేసింది. మరోపక్క సౌతాఫ్రికా సమతూకమైన, పటిష్టమైన జట్టుతో గత ఎడిషన్‌లో తృటిలో మిస్ అయిన టైటిల్ కోసం ఆకలితో ఎదురుచూస్తుంది. విండీస్ గురించి ఇదివరకే మాట్లాడుకున్నాం. ఈ జట్టు మూడోసారి టైటిల్ సాధించి, క్రికెట్ ప్రపంచానికి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతుంది. గ్రూప్ 1 నుంచి అండర్ డాగ్ ఏ జట్టు అంటే విండీస్ పేరు చెప్పాలి. జట్టు పరంగా చూసినా, ప్రస్తుత విండీస్ జట్టు గతంలో స్టార్లతో నిండిన జట్టు కంటే పటిష్టంగా కనిపిస్తుంది. షాయ్ హోప్ సారథ్యంలో ఈ జట్టు నూతనోత్సహంతో పూర్వవైభవం దిశగా ఉరకలేస్తుంది. హోప్ సహా హెట్‌మైర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మోటీ, షమార్ జోసఫ్ సూపర్-8 దశలో సంచలన ప్రదర్శనలతో చెలరేగే అవకాశం ఉంది.గ్రూప్ 2 విషయానికొస్తే.. ఈ గ్రూప్ గ్రూప్ 1 కంటే ప్రమాదకరంగా ఉంది. పాక్ మినహా మిగతా మూడు జట్లు సెమీస్ రేసులో నువ్వా-నేనా అన్నట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. ఈ జట్టు సెమీస్‌కు చేరడమే కాదు, తమ తొలి ప్రపంచకప్ టైటిల్ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేపర్‌పై ఈ జట్టు సాదాసీదాగా కనిపించినా, పోరాటపటిమ వారిని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలబెడుతుంది. ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టు పోరాటాన్ని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. పైగా ఈ జట్టులోకి చాలామంది ఆటగాళ్లకు ఉపఖండపు పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్ తర్వాత అత్యధిక హోం అడ్వాంటేజ్ లభించే జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది.ఈ గ్రూప్ నుంచి మరో అండర్ డాగ్‌గా శ్రీలంకను చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ జట్టుకు కూడా హోం అడ్వాంటేజ్ ఉంది. ప్రదర్శనల ఆధారంగా చూసినా, ఈ జట్టు గ్రూప్ దశలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. జట్టు పరంగా చూస్తే.. వీరు పేపర్‌పై బలంగా కనిపించకపోయినా, తమదైన రోజున ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ను మట్టికరిపించగల సమర్దులు. కాబట్టి ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ గ్రూప్ హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ విషయానికొస్తే.. చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఈ గ్రూప్‌లో హాట్ ఫేవరెట్ అవుతుంది. ఎందుకంటే, ఈ జట్టుకు మిగతా మూడు జట్ల నుంచి టఫ్ ఫైట్ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు గ్రూప్ దశలో పసికూనలపై గెలిచేందుకు కూడా తీవ్రంగా శ్రమించింది. పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా, కీలక ఆటగాళ్లు ఇప్పటివరకు సామర్థ్యం మేరకు రాణించలేదు. సూపర్-8 దశలో కీలక ఆటగాళ్లు టచ్‌లోకి వస్తే.. ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇక ఈ గ్రూప్‌లో అత్యంత బలహీనమైన, ఏమాత్రం అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే. అతికష్టం మీద సూపర్-8కు అర్హత సాధించిన ఈ జట్టు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్లను కాదని ముందుకు వెళ్లడం దాదాపుగా అసంభవమేనని చెప్పాలి.ఓవరాల్‌గా చూస్తే.. గ్రూప్ 1 నుంచి సెమీస్ రేసులో భారత్ హాట్ ఫేవరెట్ కాగా.. రెండో బెర్త్ కోసం సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్ 2 నుంచి ఏ జట్టునూ హాట్ ఫేవరెట్ అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు పోటీ ఉండవచ్చు. -
సూపర్-8కు న్యూజిలాండ్.. మిగిలిన రెండు బెర్త్‌లు ఎవరివి..?
టీ20 ప్రపంచకప్ 2026లో మరో సూపర్-8 బెర్త్ ఖరారైంది. కెనడాపై గెలుపుతో న్యూజిలాండ్ ఫైనల్-8కు అర్హత సాధించింది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక సూపర్-8కు చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్త్‌లు మాత్రమే. ఆ రెండు ఎవరివి.. ఏయే జట్లు వాటి కోసం పోటీపడుతున్నాయి.. ఏ జట్లకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.. వంటి అంశాలపై ఈ కథనంలో చర్చిద్దాం.గ్రూప్-సి,డి నుంచి సూపర్-8 బెర్త్‌లు ఖరారైపోగా.. ఏ,బి గ్రూప్‌ల్లో ఓ బెర్త్ ఖరారైనా, మరో బెర్త్‌పై సందిగ్దత నెలకొంది. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్, ఇంగ్లండ్ సూపర్-8కు క్వాలిఫై కాగా.. స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి.గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.గ్రూప్-ఏ నుంచి ప్రస్తుతానికి భారత్ ఒక్కటే సూపర్-8కు అర్హత సాధించింది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్ నుంచి మరో బెర్త్ కోసం టెక్నికల్‌గా 3 జట్ల మధ్య పోటీ ఉంది. అయితే ప్రధాన పోటీ మాత్రం యూఎస్ఏ, పాకిస్తాన్ మధ్యే ఉంటుంది. నెదర్లాండ్స్ టెక్నికల్‌గా టోర్నీలో ఉన్నా, ఆ జట్టు సూపర్-8 అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యం.పాక్, యూఎస్ఏ మధ్య ప్రధాన పోటీగా చెప్పుకుంటున్నా, పాక్‌కే సూపర్-8 అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ జట్టుకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. అది కూడా పసికూన నమీబియాతో. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే.. నేరుగా సూపర్-8కు చేరుకుంటుంది. అప్పుడు యూఎస్ఏ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. యూఎస్ఏ ఇప్పటికే తమ నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని, పాక్‌తో సమంగా నాలుగు పాయింట్లు కలిగి ఉంది.యూఎస్ఏ సూపర్-8కు చేరాలంటే పాక్ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడిపోవాలి. అప్పుడు పాక్, యూఎస్ఏ చెరి నాలుగు పాయింట్లు కలిగి ఉంటాయి. మెరుగైన రన్‌రేట్ ఆధారంగా యూఎస్ఏ సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం యూఎస్ఏ పాక్ కంటే మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంది.గ్రూప్-ఏ నుంచి టెక్నికల్‌గా సూపర్-8 లైన్లో ఉన్న మరో జట్టు నెదర్లాండ్స్. ఈ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ గెలవడం అసాధ్యమే కాబట్టి, ఆ జట్టు అనధికారికంగా సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించింది. ఒకవేళ నెదర్లాండ్స్ భారత్‌పై ఘన విజయం సాధించి, పాక్ నమీబియా చేతిలో భారీ తేడాతో ఓడితే, అప్పుడు రన్‌రేట్ కీలకమవుతుంది. ఇలా జరిగిన పక్షంలో యూఎస్ఏ, పాక్, నెదర్లాండ్స్ జట్లలో మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సూపర్-8కు అర్హత సాధిస్తుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో శ్రీలంక ఇదివరకే సూపర్-8కు చేరిపోగా.. ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన బెర్త్ కోసం జింబాబ్వే, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. అధికారకంగా 3 జట్లు రేసులో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది. ఇవాళ (ఫిబ్రవరి 17) ఐర్లాండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జింబాబ్వే విజయం సాధిస్తే.. మిగతా సమీకరణలతో పని లేకుండా జింబాబ్వే సూపర్-8కు, ఐర్లాండ్, ఆస్ట్రేలియా ఇంటి బాట పడతాయి. ఒకవేళ ఆస్ట్రేలియాకు సూపర్-8 బెర్త్ దక్కాలంటే.. ఆ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఒమన్‌పై భారీ విజయం సాధించాలి. అలాగే జింబాబ్వే తమ మిగిలిన రెండు గ్రూప్ మ్యాచ్‌ల్లో ఐర్లాండ్, శ్రీలంక చేతుల్లో భారీ తేడాతో ఓడాలి. ఇవాల్టి జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా, జింబాబ్వే సూపర్-8కు వెళ్తుంది. ఆసీస్, ఐర్లాండ్ ఇంటిముఖం పడతాయి. ఐర్లాండ్ సూపర్-8 అవకాశాలను పరిశీలిస్తే.. ఈ జట్టు నేడు జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాలి. జింబాబ్వే తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలోనూ దారుణంగా ఓడాలి. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్‌లో ఒమన్ చేతిలో ఓడాలి. అప్పుడు ఐర్లాండ్‌కు సూపర్-8 అవకాశం దక్కుతుంది. ఈ సమీకరణలు కార్యరూపాం దాల్చడం దాదాపుగా అసాధ్యమే కాబట్టి, ఐర్లాండ్ అనధికారికంగా సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించినట్టే. UPDATE: T20 WC 2026: సూపర్-8 షెడ్యూల్ ఇదే.. ఎవరు ఎవరితో ఢీ? -
న్యూజిలాండ్‌కు కొత్త కెప్టెన్
న్యూజిలాండ్ మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ ఆ జట్టు నూతన ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా నియమించబడింది. సోఫీ డివైన్ గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో కెర్ న్యూజిలాండ్ సారధిగా బాధ్యతలు చేపట్టింది.25 ఏళ్ల కెర్ 2016లో 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కుడి చేతి వాటం బ్యాటర్, లెగ్ స్పిన్నర్ అయిన కెర్.. ఇప్పటివరకు 84 వన్డేలు, 88 టీ20లు ఆడింది. వన్డేల్లో 4 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 2304 పరుగులు చేసింది. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా (232*) ఉంది. అలాగే బౌలింగ్‌లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన సహా 106 వికెట్లు తీసింది. టీ20ల్లో 100కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో, 5 హాఫ్ సెంచరీల సాయంతో 1453 పరుగులు చేసిన కెర్.. బౌలింగ్‌లో 2 నాలుగు వికెట్ల ప్రదర్శనల సాయంతో 95 వికెట్లు తీసింది.కెర్ 2024 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు గెలుచుకుంది. అదే ఏడాది ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకొని, ఈ ఘనత సాధించిన తొలి న్యూజిలాండ్ ప్లేయర్ అయ్యింది. కెర్ న్యూజిలాండ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత భావోద్వేగానికి లోనైంది. న్యూజిలాండ్ తరఫున ఆడటం నా చిన్ననాటి కల. ఇప్పుడు కెప్టెన్‌గా అవకాశం రావడం గొప్ప గౌరవమని పేర్కొంది. ఈ జట్టులో ఉన్న ప్రతిభ, కృషి, అంకితభావం నన్ను ఉత్సాహపరుస్తున్నాయి. మనం కలిసి గొప్ప విజయాలు సాధించగలమని నమ్ముతున్నాను అంటూ కెర్ సోషల్‌మీడియాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.కెర్ ఎంపికపై ఆ జట్టు హెడ్ కోచ్ బెన్ సాయర్ హర్షం వ్యక్తం చేశారు. కెర్ జట్టులో గౌరవం పొందిన నాయకురాలు. ఆమె నాయకత్వం న్యూజిలాండ్ మహిళల క్రికెట్ భవిష్యత్తుకు స్థిరత్వం, నిరంతరతను ఇస్తుందని అన్నారు. కెర్ తన కెప్టెన్సీ కెరీర్‌ను జింబాబ్వేతో జరిగే హోమ్ సిరీస్‌తో ప్రారంభించనుంది. ఫిబ్రవరి 25న సెడ్డన్ పార్క్‌లో జరిగే మొదటి టీ20 ఈ సిరీస్ మొదలవుతుంది. కెర్ ముందున్న సవాళ్లు - 2026లో ఇంగ్లండ్‌లో T20 ప్రపంచకప్ నిలబెట్టుకోవడం. - 2027లో శ్రీలంకలో ICC T20 ఛాంపియన్స్ ట్రోఫీ. - 2028లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్, T20 ప్రపంచకప్. -
మార్క్రమ్, యాన్సెన్ జోరు
అహ్మదాబాద్: బౌలింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కో యాన్సెన్ జోరు (4/40), బ్యాటింగ్‌లో కెప్టెన్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (44 బంతుల్లో 86 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుతో దక్షిణాఫ్రికా ఖాతాలో మరో విజయం చేరింది. గ్రూప్ ‘డి’లో శనివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన మార్క్రమ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ (26 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలిచింది. ఫెర్గూసన్, నీషమ్, రచిన్ రవీంద్రలకు తలా ఒక వికెట్ దక్కింది. టాపార్డర్ టపటపా... ఇన్‌గిడి మూడో ఓవర్లో అలెన్ 3 ఫోర్లు, 1 సిక్స్‌తో కివీస్ శిబిరానికి జోష్ తెచ్చాడు. యాన్సెన్ తర్వాతి ఓవల్‌లో సీఫెర్ట్ (13) అవుటైనా... అలెన్ 4, 6తో జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ఆరో ఓవర్ వేసిన యాన్సెన్ ఈ సారి రచిన్ రవీంద్ర (13), అలెన్ (17 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుకు చెక్‌పెట్టాడు. కివీస్ పవర్ ప్లే కష్టాల నుంచి కోలుకోకముందే కేశవ్ మహరాజ్... ఫిలిప్స్ (1)ను బౌల్డ్ చేయడంతో 64 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్ కోల్పోయింది.ఈ దశలో చాప్మన్ ధాటిగా ఆడి న్యూజిలాండ్ స్కోరు పెంచాడు. డారిల్ మిచెల్ (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో నీషమ్ (15 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు) బౌండరీలతో న్యూజిలాండ్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యాన్సెన్ సగటున ఓవర్‌కు 10 చొప్పున పరుగులిచ్చినా కీలక వికెట్లు తీశాడు. రఫాడించిన మార్క్రమ్ కివీస్ చేసిందేమీ తక్కువ స్కోరు కాదు. దీంతో ఈ గ్రూప్‌లో రెండు పోటీ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందనుకుంటే మార్క్రమ్ ఏకపక్షంగా మార్చేశాడు. అతను ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా మూడో ఓవర్లోనే 50 స్కోరుకు చేరుకుంది. జట్టు స్కోరు 62 పరుగుల వద్ద డికాక్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. కాసేపటికే మార్క్రమ్ 19 బంతుల్లోనే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. రికెల్టన్ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కెప్టెన్‌లాగే కివీస్ బౌలర్లపై విరుచుకుపడటంతో దక్షిణాఫ్రికా 7.2 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. తర్వాత వచ్చిన బ్రెవిస్ (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), మిల్లర్ (17 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ఇంకో 2.5 ఓవర్లముందే సఫారీ లక్ష్యాన్ని దాటేసింది. -
న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ
టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ గాయం కారణంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. బ్రేస్‌వెల్ ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు (కాలి కండరానికి సంబంధించింది). అతను ప్రపంచకప్ సమయానికంతా ఫిట్నెస్ సాధిస్తాడని అశించినా కుదర్లేదు. వార్మప్ సమయంలో మరోసారి గాయపడ్డాడు. వైద్య పరీక్షల్లో అతని గాయం తీవ్రత అధికంగా ఉందని గుర్తించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో బ్రేస్‌వెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. బ్రేస్‌వెల్‌కు ప్రత్యామ్నాయంగా ఆశ్చర్యకర ఎంపిక జరిగింది. గత రెండు సంవత్సరాలుగా జట్టుకు దూరంగా ఉన్న కోల్ మెక్‌కాంచీని బ్రేస్‌వెల్‌కు రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించారు. మెక్కాంచీ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 6 వన్డేలు, 12 టీ20లు ఆడారు. 2024లో పాకిస్తాన్‌తో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మెక్కాంచీ ఇటీవల స్థానికంగా జరిగిన టోర్నీల్లో విశేషంగా రాణించాడు. 125 పరుగులు చేయడంతో పాటు 18 ఇన్నింగ్స్‌ల్లో 20 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ అండర్ డాగ్‌గా బరిలోకి దిగి, ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఈ జట్టు వరుసగా ఆఫ్ఘనిస్తాన్, యూఏఈపై భారీ విజయాలు నమోదు చేసింది. ఫిబ్రవరి 14 అహ్మదాబాద్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఢీకొనేందుకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17న తమ చివరి గ్రూప్ (డి) మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర
టీ20 వరల్డ్‌కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ జట్టు.. తాజాగా (ఫిబ్రవరి 10) యూఏఈపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. ఫిన్ అలెన్ (50 బంతుల్లో 84 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 89 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత ధాటికి న్యూజిలాండ్ కేవలం 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. సీఫర్ట్-అలెన్ దెబ్బకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదారు. అలెన్ కాస్త నిదానంగా ఆడినా, సీఫర్ట్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. విన్నింగ్ రన్స్‌ను కూడా సీఫర్ట్ సిక్సర్‌తోనే సాధించాడు. అలెన్ తన హాఫ్ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేస్తే, సీఫర్ట్ కేవలం 23 బంతుల్లోనే పని కానిచ్చేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ సీఫర్ట్ ఇదే తరహా విధ్వంసం (42 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సీఫర్ట్ ధాటికి ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. సీఫర్ట్ విధ్వంసకర ఫామ్ చూస్తుంటే, ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమేమో అనిపిస్తుంది. అతనికి ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్ లాంటి బ్యాటర్లు తోడైతే, బ్యాటింగ్‌కు స్వర్గధామమమైన ఉపఖండపు పిచ్‌లపై న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమే. బ్యాటింగ్ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత న్యూజిలాండ్ జట్టు బౌలింగ్‌లో మరింత ప్రమాదకరంగా ఉంది. ఆ జట్టులో డఫీ, హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్ లాంటి ప్రమాదకర ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అలాగే స్పిన్ విభాగంలో మిచెల్ సాంట్నర్ లాంటి టాప్ స్పిన్నర్ ఉన్నాడు. ఈ గెలుపుతో గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్ సూపర్-8 బెర్త్ దాదాపుగా ఖరారైనట్లే.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ జట్టు బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్.కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.బెంబేలెత్తిపోయిన యూఏఈ బౌలర్లు174 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ ఓపెనర్లు ఆచితూచి ప్రారంభించారు. అయితే వీరిద్దరు క్రమంగా గేర్ మార్చి వీలు చిక్కనప్పుడల్లా యూఏఈ బౌలర్లును ఉతికి ఆరేశారు. వీరి ధాటికి రోహిద్ ఖాన్ 3.2 ఓవర్లలో 51 పరుగులు, జునైద్ సిద్దిఖీ 4 ఓవర్లలో 47 పరుగులు, అర్ఫాన్ 3 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నారు. యూఏఈ బౌలర్లలో హైదర్ అలీ (4-0-27-0) ఒక్కడు కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. మొత్తంగా టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ ధాటికి యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. -
T20 WC 2026: గ్లెన్ ఫిలిప్స్‌కు ఘోర పరాభవం
న్యూజిలాండ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన (27 పరుగులు) ఫుల్ మెంబర్ జట్టు బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ఫిలిప్స్ ఈ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది జరిగింది. ఆ ఓవర్లో ఫిలిప్స్ వరుసగా 1, 4, 6, 1wd, 4nb, 6, 1, 2 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం, మయాంక్ కుమార్ ఫిలిప్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు.టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఫుల్ మెంబర్ జట్టు బౌలర్ ఓ ఓవర్లో సమర్పించుకున్న అత్యధిక పరుగులు27 పరుగులు – గ్లెన్ ఫిలిప్స్ (NZ) vs UAE, చెన్నై, 202622 పరుగులు – కైల్ అబ్బాట్ (SA) vs ఆఫ్ఘనిస్తాన్, 201622 పరుగులు – తబ్రైజ్ షంసీ (SA) vs USA, 202422 పరుగులు – జోఫ్రా ఆర్చర్ (ENG) vs నేపాల్, 2026ఇదిలా ఉంటే, యూఏఈతో మ్యాచ్‌లో ఫిలిప్ ఒక్క ఓవర్లో తడబడినా, ఫీల్డ్‌లో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక క్యాచ్‌లు పట్టడంతో పాటు, పలు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు చేసి యూఏఈని 200 పరుగుల మార్కును తాకకుండా కట్టడి చేశాడు. తాను బౌలింగ్ చేసిన 2 ఓవర్లలో ఓ ఓవర్లో 27 పరుగులిచ్చినా, మరో ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు.అసాధారణ ప్రదర్శనఈ మ్యాచ్‌లో యూఏఈ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్. కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు. -
శ్రీలంక జట్టుకు అతి భారీ షాక్
టీ20 ప్రపంచకప్‌కు సహా అతిథ్యమిస్తున్న శ్రీలంకకు అతి భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాడు వనిందు హసరంగ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఐర్లాండ్ మ్యాచ్‌లో హసరంగ గాయంతో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు. అయితే మ్యాచ్ అయిపోయాక తీసిన ఎంఆర్ఐ స్కానింగ్‌లో హసరంగ ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్‌లో తీవ్రమైన చీలక ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో అతను ఉన్నపళంగా ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. ఐర్లాండ్ మ్యాచ్‌లో హసరంగ గాయంతో బాధపడుతూనే తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 3 వికెట్లు (25 పరుగులిచ్చి) తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. హసరంగ విషయాన్ని లంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అతనికి ప్రత్యామ్నాయంగా 31 ఏళ్ల లెగ్ స్పిన్నర్ దుషన్ హేమంతను ఎంపిక చేసింది. హేమంత బౌలింగ్ శైలి హసరంగను పోలి ఉంటుంది. హేమంత శ్రీలంక ఆడబోయే తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగవచ్చు. శ్రీలంక ఫిబ్రవరి 12న జరిగే మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడనుంది. హసరంగ స్థానాన్ని హేమంత భర్తీ చేసినా, ఆ స్థాయి ప్రదర్శనలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. హసరంగ లేని లోటు శ్రీలంకకు సూపర్-8 దశలో స్పష్టంగా కనిపించవచ్చు. గత కొంతకాలంగా హసరంగ తరుచూ గాయాల బారిన పడుతూ కీలక సమయాల్లో జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. హసరంగ వైవిధ్యభరితమైన బౌలర్‌గానే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సమర్దుడు. హసరంగ స్థాయి ఆటగాడిని శ్రీలంక త్వరలో తయారు చేసుకోలేకపోతే, చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో శ్రీలంక.. ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించి, సూపర్-8 దిశగా సాగుతోంది. గ్రూప్ దశలో శ్రీలంకకు ఎలాంటి ఇబ్బందులు (ఆస్ట్రేలియా మినహా) ఎదురుకాకపోయినా, సూపర్-8లో మాత్రం ఇబ్బందిపడాల్సి ఉంటుంది. -
ఆఫ్ఘనిస్తాన్పై న్యూజిలాండ్ ఘన విజయం
టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ ఘనంగా బోణీ కొట్టింది. చెన్నై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 8) ఉదయం జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో గుల్బదిన్ నైబ్ (63) టాప్ స్కోరర్ కాగా.. రహానుల్లా గుర్బాజ్ 27, ఇబ్రహీం జద్రాన్ 10, సెదిఖుల్లా అటల్ 29, దర్విష్ రసూల్ 20, అజ్మతుల్లా ఒమర్జాయ్ 14, మొహమ్మద్ నబీ 10 (నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో లోకీ ఫెర్గూసన్ 2, రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ తలో వికెట్ తీశారు.న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టిమ్ సీఫర్ట్ 65 పరుగులతో సత్తా చాటగా.. గ్లెన్ ఫిలిప్స్ 42, మార్క్ చాప్మన్ 28, డారిల్ మిచెల్ 25 (నాటౌట్), మిచెల్ సాంట్నర్ 17 (నాటౌట్), ఫిన్ అలెన్ ఒక పరుగు చేశారు. రచిన్ రవీంద్ర గోల్డెన్ డకౌటయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ముజీబ్ రహ్మాన్ 2, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నబీ తలో వికెట్ తీశారు. -
భారత్ ధనాధన్ ‘షో’
తిరువనంతపురం: పొట్టి ప్రపంచకప్‌కు ముందు భారత్ పెద్ద పండగే చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. శనివారం జరిగిన ఐదో టి20లో టీమిండియా 46 పరుగులతో కివీస్‌ను ఓడించింది. 4–1 ఆధిక్యంతో సిరీస్‌ను ముగించింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. టి20ల్లో భారత్‌కిది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 103; 6 ఫోర్లు, 10 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ సూర్యకుమార్ (30 బంతుల్లో 63; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా సిక్సర్ల మోత మోగించారు. అనంతరం న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. అలెన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 6 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అర్ష్ దీప్ కు 5 వికెట్లు దక్కాయి. మెరుపు భాగస్వామ్యం... అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సిక్స్‌తో ఖాతా తెరిచిన భారత్ తొలి ఓవర్లో మరో 2 ఫోర్లతో 14 పరుగులు సాధించింది. రెండో ఓవర్లోనూ 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 15 పరుగులు పిండుకుంది. సొంత మైదానంలోనూ సామ్సన్ (6) మరో అవకాశాన్ని వృథా చేసుకొని నిరాశపర్చాడు. పవర్‌ప్లేలో భారత్ స్కోరు 54/2. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దంచేయడంతో మైదానం హోరెత్తింది. సాంట్నర్ పదో ఓవర్లో సూర్య ఓ సిక్స్ కొడితే స్ట్రయిక్ అందుకున్న కిషన్ 4, 6 కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. జట్టు స్కోరు కూడా వంద దాటింది. ఓ వైపు నుంచి ఇషాన్, మరోవైపు నుంచి కెప్టెన్ సూర్యకుమార్ కివీస్ బౌలర్లను నిర్దయగా బాదేశారు. 28 బంతుల్లో ఇషాన్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇష్ సోధి వేసిన 12వ ఓవరైతే ప్రతి బంతి లైన్ అవతలే! మొదటి బంతి వైడ్ అయి ఊపిరి పీల్చుకుంటే తర్వాతి బంతుల్ని కిషన్ 4, 4, 4, 6, 4, 6లుగా బాదేశాడు. ఈ ఒక్క ఓవర్లోనే 29 పరుగులొచ్చాయి. బౌలర్లు ఎంతమంది మారినా... కిషన్ ధాటి మారనేలేదు. 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక సూర్య నిష్క్రమించాడు. హార్దిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడటంతో 16వ ఓవర్లోనే భారత్ 200 మార్క్ చేరుకుంది. సాంట్నర్ 17వ ఓవర్లో పాండ్యా 6, 2, 4, 1 ధాటిని ప్రదర్శిస్తే మిగిలిన 2 బంతుల్ని సిక్స్‌లు బాదిన కిషన్ 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన మూడో ఓవర్లో (2 పరుగులు, 1 వికెట్), సాంట్నర్ వేసిన 8వ ఓవర్లో మాత్రమే (5 పరుగులు) భారత్ బౌండరీ రాబట్టలేకపోయింది. అలెన్ అర్ధ సెంచరీ... ఆరంభంలోనే సీఫర్ట్ (5) అవుటైనా... అలెన్, రచిన్ రవీంద్ర (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్) న్యూజిలాండ్ స్కోరును పరుగెత్తించారు. రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక అలెన్ దూకుడుకు అక్షర్ అడ్డుకట్ట వేశాడు. తర్వాత అర్‡్షదీప్, అక్షర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు 20 పరుగుల వ్యవధిలో ఫిలిప్స్ (7), రచిన్, సాంట్నర్ (0) వికెట్లను కోల్పోవడంతో కివీస్ పనైపోయింది. మిచెల్ (26), ఆఖర్లో ఇష్ సోధి (15 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్ 200 పైచిలుకు పరుగులు దాటగలిగింది.తిలక్ వర్మ రెడీ... టి20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన తిలక్... బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. అతడు మంగళవారం ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన సంజు సామ్సన్ స్థానంలో టి20 ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. 3 టి20ల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు. గతంలో 297/6 (బంగ్లాదేశ్‌పై), 283/1 (దక్షిణాఫ్రికాపై) సాధించింది.3 రోహిత్, కోహ్లి తర్వాత అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా సూర్యకుమార్ (3030) నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మైలురాయిని దాటిన 12 మందిలో అతి తక్కువ బంతుల్లో (1822) సూర్య ఈ ఘనతను అందుకోవడం విశేషం.1 అర్ష్ దీప్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/51) నమోదు చేశాడు.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (బి) ఫెర్గూసన్ 30; సామ్సన్ (సి) జాకబ్స్ (బి) ఫెర్గూసన్ 6; ఇషాన్ కిషన్ (సి) ఫిలిప్స్ (బి) డఫీ 103; సూర్యకుమార్ (స్టంప్డ్) సీఫర్ట్ (బి) సాంట్నర్ 63; పాండ్యా (సి) జాకబ్స్ (బి) జేమీసన్ 42; రింకూ నాటౌట్ 8; దూబే నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–31, 2–48, 3–185, 4–233, 5–261. బౌలింగ్: డఫీ 4–0–53–1, జేమీసన్ 4–0–59–1, ఫెర్గూసన్ 4–0–41–2, ఇష్ సోధి 3–0–48–0, ఫిలిప్స్ 1–0–10–0, సాంట్నర్ 4–0–60–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: సీఫర్ట్ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్ 5; అలెన్ (సి) రింకూ (బి) అక్షర్ 80; రచిన్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 30; ఫిలిప్స్ (సి) రింకూ (బి) అక్షర్ 7; మిచెల్ (బి) అర్ష్ దీప్ 26; సాంట్నర్ (సి) సూర్య (బి) అర్ష్ దీప్ 0; జాకబ్స్ (బి) వరుణ్ 7; జేమీసన్ (బి) అర్ష్ దీప్ 9; ఇష్ సోధి (సి) అర్ష్ దీప్ (బి) రింకూ 33; ఫెర్గూసన్ (బి) అక్షర్ 3; డఫీ నాటౌట్ 9; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 225 వికెట్ల పతనం: 1–17, 2–117, 3–131, 4–137, 5–137, 6–166, 7–179, 8–180, 9–191, 10–225. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–51–5, పాండ్యా 2–0–15–0, బుమ్రా 4–0–58–0, వరుణ్ 4–0–36–1, అక్షర్ 4–0–33–3, అభిషేక్ 1–0–13–0, రింకూ సింగ్ 0.4–0–7–1. -
ఇండియా Vs న్యూజిలాండ్ T20 లాస్ట్ ఫైట్!
-
ప్రపంచ కప్‌కు ముందు ఆఖరి పోరు
తిరువనంతపురం: టి20 ప్రపంచ కప్‌కు ముందు ఆడుతున్న ఆఖరి సిరీస్‌లో భారత్ ఇప్పటికే తమ అస్త్రశ్రస్తాలు అన్నింటినీ పరీక్షించుకుంది. న్యూజిలాండ్‌పై తొలి మూడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టు 3–0తో సిరీస్‌ను గెలుచుకుంది. విశాఖపట్నంలో జరిగిన గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడినా...ఆందోళన చెందాల్సిన పరిస్థితేమీ లేదు. అయితే మెగా పోరుకు ముందు మిగిలిన ఒక మ్యాచ్‌లో మళ్లీ చెలరేగాలని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో టి20కి రంగం సిద్ధమైంది. మరోవైపు సిరీస్ కోల్పోయిన తర్వాత గత మ్యాచ్‌లో రాణించిన క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకున్న కివీస్ కూడా విజయంతో ముగించాలని భావిస్తోంది. భారత్‌లోనే జరిగే వరల్డ్ కప్‌కు ముందు ఈ గెలుపు ఆ టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఖాయం. సిరీస్‌లో జట్టు ప్రదర్శనను బట్టి చూస్తే ఒక్క సంజు సామ్సన్ ఫామ్ విషయంలోనే మేనేజ్మెంట్ కొంత ఇబ్బంది పడుతోంది. తన సొంత మైదానంలో అశేష అభిమానుల మధ్య బరిలోకి దిగనున్న సామ్సన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ఇంతకంటే సరైన వేదిక, సమయం ఉండదు. తొలి టి20 ఆడుతూ గాయంతో తప్పుకున్న అక్షర్ పటేల్ తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను పూర్తిగా కోలుకుంటే ఆడతాడు. స్వల్ప గాయంతో వైజాగ్ మ్యాచ్ ఆడని ఇషాన్ కిషన్ కూడా ఫిట్‌గా ఉంటే మళ్లీ తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు కివీస్ కూడా ఒక మార్పుతో ఆడే అవకాశం ఉంది. ఓపెనర్, వికెట్ కీపర్ ఫిన్ అలెన్ అందుబాటులో రావడంతో సీఫెర్ట్‌ను విశ్రాంతినిచ్చి అతడిని ఆడించే అవకాశం ఉంది. తిరువనంతపురంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇక్కడా మంచు ప్రభావం ఉంది. గతంలో ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్ 3 గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. చివరిసారిగా 2023 నవంబర్‌లో ఆ్రస్టేలియాతో జరిగిన పోరులో భారత్ 235 పరుగులు నమోదు చేసింది. -
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్‌కు ఊహించని అవకాశం
న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్‌కు ఊహించని అవకాశం దక్కింది. గతేడాది గాయాలతో సతమతమైన అతనికి ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్ బెర్త్ దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా కైల్ జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేస్తాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది.ఆడమ్ మిల్నే గాయపడటంతో అప్పటివరకు ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న జేమీసన్ ప్రధాన జట్టులోకి ప్రమోట్ అయ్యాడు. ఇప్పుడు జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేశాడు. సియర్స్ ఫిబ్రవరి 5న ముంబైలో అమెరికాతో జరగబోయే వార్మప్ మ్యాచ్‌లోపు జట్టుతో కలుస్తాడు. సియర్స్‌కు ప్రపంచకప్ అవకాశం కల్పించడంపై న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. సియర్స్ చాలా కష్టపడి ఫిట్నెస్ సాధించాడని కితాబునిచ్చాడు. ప్రధాన జట్టులో ఎవరికైనా గాయాలైతే సియర్స్ మొదటి ఆప్షన్‌గా ఉంటాడని స్పష్టం చేశాడు.తాజాగా ముగిసిన న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్‌లో సియర్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి, రెండో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీనికి ముందు కౌంటీ డివిజన్ వన్ టోర్నీలోనూ అతను సత్తా చాటాడు. రెండు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లతో రాణించాడు. ఇప్పటివరకు 22 అంతర్జాతీయ టీ20లు ఆడిన సియర్స్ 23 వికెట్లు తీశాడు. 140 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించడం సియర్స్ ప్రత్యేకత. బౌన్స్ అతని అదనపు బలం.టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు మిచెల్ సాంట్నర్ (c), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫర్ట్, ఇష్ సోధీ, బెన్ సియర్స్ (రిజర్వ్)ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరుగబోయే టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టు గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో అఫ్గనిస్తాన్, కెనడా, దక్షిణాఫ్రికా, యూఏఈ మిగతా జట్లుగా ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదో టీ20 తిరువనంతపురం వేదికగా జనవరి 31న జరుగనుంది. -
ట్రంప్ శాంతి మండలి.. ఫస్ట్ షాక్
గాజా సంక్షోభాన్ని చల్లార్చే క్రమంలో.. బోర్డు ఆఫ్ పీస్ పేరిట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హడావిడి చూస్తున్నదే. ఇప్పటికే ఈ జాబితాలో 35 దేశాలు చేరాయి. రష్యా(చేరుతుందని ట్రంప్ ప్రకటించినా పురోగతి కనిపించడం లేదు), చైనా, జీ7 కూటమిలోని కొన్ని దేశాలు(యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా) ఇంకా చేరలేదు. భారత్ కూడా వాణిజ్య ఒప్పందం ఖరారు కాకపోవడంతో తన వైఖరిని స్పష్టం చేయకుండా దోబుచులాడుతోంది. ఈ క్రమంలో ట్రంప్ ఆహ్వానాన్ని నేరుగా తిరస్కరించింది న్యూజిలాండ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రారంభించిన శాంతి మండలికి తొలి షాక్ తగిలింది. ఇందులో చేరాలని ఇచ్చిన ఆహ్వానాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు ఆ దేశపు ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇందులో చేరకూడదనే నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారాయన. న్యూజిలాండ్ ఏం చెబుతోంది?ట్రంప్ ఈ బోర్డును గత వారం ప్రారంభించారు. మొదటగా గాజా ప్రాంతంలో తాత్కాలిక కాల్పుల విరమణను బలపరచడమే లక్ష్యంగా ఉన్నా, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తృత పాత్ర పోషించాలనే ఉద్దేశం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ స్పందిస్తూ.. ఇది కొత్త సంస్థ. దీని పరిధి, భవిష్యత్తు పాత్రపై స్పష్టత అవసరం ఉంది. అప్పుడే మా నిర్ణయాన్ని కూడా చెప్పగలం అని పేర్కొన్నారు. ఇదే విషయంపైనా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ‘‘గాజా సమస్యపై ఇప్పటికే ప్రాంతీయ దేశాలు ముందుకు వచ్చి సహకరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో న్యూజిలాండ్ పీస్ బోర్డులో చేరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. న్యూజిలాండ్ అనేది ఇప్పటికే ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశం. అలాంటప్పుడు ఈ కొత్త బోర్డు చేసే పనులు UN చార్టర్‌కు అనుగుణంగా ఉండాల్సిందే’’ అని విన్స్టన్ పీటర్స్ స్పష్టం చేశారు.ఇప్పటికే ట్రంప్ పీస్ బోర్డులో టర్కీ(తుర్కియే), ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి మధ్యప్రాచ్య(Middle East) దేశాలు. అలాగే ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం చేరాయి. కానీ, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న దేశాలు సైతం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండడం కొసమెరుపు.భారత్ ఇంకా ఎందుకు చేరలేదు?భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ట్రంప్ ఆహ్వానం పంపించారు. అయితే భారత్ ఈ బోర్డు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బోర్డు అంతర్జాతీయ చట్టబద్ధత, దీర్ఘకాల ప్రభావాలపై స్పష్టత లేకపోవడాన్ని భారత్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పైగా ఈ బోర్డు యూఎన్ చార్టర్‌కు విరుద్ధంగా ఉండే అవకాశం ఉండడం, ఐరాస శాంతి దళాల పనిని బలహీనపర్చవచ్చనే ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటోంది. అన్నింటికీ మించి పాకిస్తాన్ ఈ బోర్డులో చేరడంతో భారత్‌కు ఇది సున్నితమైన అంశంగా మారింది. ఈ క్రమంలో వేచిచూడాలనే ధోరణితో వ్యూహాత్మక వైఖరిని అవలంభిస్తోంది భారత్. -
IND Vs NZ: నాలుగోది చేజారె...
టి20 సిరీస్‌లో వరుసగా మూడు అద్భుత ప్రదర్శనల తర్వాత భారత జట్టు విశాఖ తీరంలో న్యూజిలాండ్ ముందు తలవంచింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి బంతికే అభిషేక్ శర్మ అవుట్‌తో మొదలైన ఇన్నింగ్స్ చివరకు ఓటమితో ముగిసింది. 15 బంతుల అర్ధ సెంచరీతో శివమ్ దూబే పోరాడినా... దురదృష్టవశాత్తూ అతని నిష్క్రమణతో ఓటమి ఖాయమైంది. సీఫెర్ట్, కాన్వే, సాంట్నర్‌ల మెరుగైన ప్రదర్శనతో ఎట్టకేలకు సిరీస్‌లో తొలి గెలుపుతో కివీస్‌కు కాస్త ఊరట దక్కింది. సాక్షి, విశాఖపట్నం: న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. సిరీస్ గెలుచుకున్న తర్వాత బుధవారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో కివీస్ 50 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 50 బంతుల్లోనే 100 పరుగులు జోడించగా... చివర్లో డరైల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించాడు. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే (23 బంతుల్లో 65; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రింకూ సింగ్ (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సిరీస్‌లో భారత్ 3–1తో ఆధిక్యంలో ఉండగా, చివరి పోరు శనివారం తిరువనంతపురంలో జరుగుతుంది. ఓపెనర్ల దూకుడు... అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి కివీస్ ఇన్నింగ్స్‌ను జోరుగా మొదలు పెట్టిన సీఫెర్ట్... హర్షిత్ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. అతడి మరుసటి ఓవర్లో కూడా ఓపెనర్లిద్దరు కలిసి 15 పరుగులు రాబట్టగా... రవి బిష్ణోయ్ తొలి ఓవర్లో కాన్వే 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. 25 బంతుల్లో సీఫెర్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే శతక భాగస్వామ్యం తర్వాత కివీస్ 35 బంతుల వ్యవధిలో 37 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కొంత దూకుడుగా ఆడగా, చివరి 3 ఓవర్లలో 47 పరుగులు రాబట్టి న్యూజిలాండ్ మెరుగైన స్కోరును అందుకుంది. బుమ్రా వేసిన 19వ ఓవర్లో మిచెల్, హెన్రీ (6 నాటౌట్) కలిసి 2 ఫోర్లు, సిక్స్ సహా మొత్తం 19 పరుగులు సాధించారు. దూబే సిక్సర్ల జోరు... భారీ లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే వెనుదిరగ్గా... కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (8) కూడా విఫలమయ్యాడు. సామ్సన్ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా భారీ స్కోరు చేయడంలో మళ్లీ విఫలం కాగా, హార్దిక్ పాండ్యా (2) ప్రభావం చూపలేదు. వరుసగా రెండు సిక్సర్లతో తన స్కోరును మొదలు పెట్టిన రింకూ ఆ తర్వాతా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. రింకూ అవుటైన తర్వాత దూబే మెరుపు షాట్లతో జట్టు విజయంపై ఆశలు రేపాడు. తొలి బంతికే సిక్స్‌తో ఖాతా తెరిచిన దూబే... సోధి ఓవర్లో వరుసగా 2, 4, (వైడ్), 6, 4, 6, 6 బాదడంతో మొత్తం 29 పరుగులు లభించాయి. డఫీ వేసిన తర్వాతి ఓవర్లో కూడా అతను మరో 2 సిక్స్‌లు కొట్టి 15 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే దురదృష్టవశాత్తూ అతను రనౌటయ్యాడు. 31 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్షిత్ కొట్టిన షాట్ బౌలర్ హెన్రీ చేతికి తగిలి నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో స్టంప్స్‌కు తగిలింది. దాంతో దూబే అవుట్ కావడంతో పాటు భారత్ గెలుపు ఆశలు ముగిశాయి. 4 రెండేళ్ల క్రితం టి20 ప్రపంచకప్ సాధించిన తర్వాత భారత జట్టు 40 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. కేవలం నాలుగుసార్లు మాత్రమే టీమిండియా ఆలౌటైంది. భారత్‌ను ఆలౌట్ చేసిన జట్లలో జింబాబ్వే, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి. 2 అంతర్జాతీయ టి20ల్లో ‘గోల్డెన్ డక్’గా వెనుదిరగడం అభిషేక్ శర్మకిది రెండోసారి. ఈ భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (3 సార్లు) తొలి స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్, సంజు సామ్సన్, అభిషేక్ శర్మ (2 సార్లు చొప్పున) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు.3 అంతర్జాతీయ టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా శివమ్ దూబే (15 బంతుల్లో) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో), అభిషేక్ శర్మ (14 బంతుల్లో) ఉన్నారు.4 రింకూ సింగ్ ఈ మ్యాచ్‌లో ఫీల్డర్‌గా 4 క్యాచ్‌లు అందుకొని భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన అజింక్య రహానే రికార్డు (4)ను సమం చేశాడు.స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రింకూ (బి) కుల్దీప్ 44; సీఫెర్ట్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 62; రచిన్ (సి అండ్ బి) బుమ్రా 2; ఫిలిప్స్ (సి) రింకూ (బి) కుల్దీప్ 24; చాప్మన్ (సి) హర్షిత్ (బి) బిష్ణోయ్ 9; మిచెల్ (నాటౌట్) 39; సాంట్నర్ (రనౌట్) 11; ఫోక్స్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 13; హెన్రీ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–100, 2–103, 3–126, 4–137, 5–152, 6–163, 7–182. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–33–2, హర్షిత్ 4–0–54–0, బుమ్రా 4–0–38–1, రవి బిష్ణోయ్ 4–0–49–1, కుల్దీప్ యాదవ్ 4–0–39–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) కాన్వే (బి) హెన్రీ 0; సామ్సన్ (బి) సాంట్నర్ 24; సూర్యకుమార్ (సి అండ్ బి) డఫీ 8; రింకూ (ఎల్బీ) (బి) ఫోక్స్ 39; పాండ్యా (సి) ఫోక్స్ (బి) సాంట్నర్ 2; దూబే (రనౌట్) 65; హర్షిత్ (సి) రచిన్ (బి) సోధి 9; రవి బిష్ణోయ్ (నాటౌట్) 10; అర్ష్ దీప్ (సి) సాంట్నర్ (బి) సోధి 0; బుమ్రా (సి) సోధి (బి) సాంట్నర్ 4; కుల్దీప్ (సి) సీఫెర్ట్ (బి) డఫీ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 165. వికెట్ల పతనం: 1–0, 2–9, 3–55, 4–63, 5–82, 6–145, 7–157, 8–157, 9–162, 10–165. బౌలింగ్: హెన్రీ 3–0–24–1, డఫీ 3.4–0– 33–2, ఫోక్స్ 3–0–29–1, సోధి 4–0–46–2, సాంట్నర్ 4–0–26–3, ఫిలిప్స్ 1–0–7–0. -
నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్
వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో డారిల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.సీఫర్ట్, కాన్వే ధాటికి న్యూజిలాండ్ 8.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో భారత్‌పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడిగా రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో కాన్వే కూడా జోరును ప్రదర్శించాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు.వీరిద్దరు ఔటైన తర్వాత న్యూజిలాండ్ మధ్యలో కాస్త తడబడింది. రచిన్ రవీంద్ర (2), మార్క్ చాప్మన్ (9) త్వరితగతిన ఔటయ్యారు. ఈ మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో డారిల్ మిచెల్ బ్యాట్ ఝులిపించడంతో న్యూజిలాండ్ 200 పరుగుల మార్కును దాటింది. సాంట్నర్ (11), ఫౌల్క్స్ (13) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. సాంట్నర్‌ను హార్దిక్ పాండ్యా అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. మిచెల్‌తో పాటు మ్యాట్ హెన్రీ (6) అజేయంగా నిలిచాడు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-2), కుల్దీప్ యాదవ్ (4-0-39-2), బుమ్రా (4-0-38-1) కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా (4-0-54-0), రవి బిష్ణోయ్ (4-0-49-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. -
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
వైజాగ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టింది. గత మ్యాచ్‌లో అతను స్వల్ప గాయానికి గురయ్యాడు. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పుతో బరలోకి దిగింది. జేమీసన్ స్థానంలో ఫౌల్క్స్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
విశాఖలో భారత్‌ను ఆపతరమా!
న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత భారత్ ఆ కసినంతా టి20ల్లో చూపిస్తోంది. ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయి ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకుంది. అయినా సరే ఉదాసీనతకు తావు ఇవ్వకుండా అదే జోరు కొనసాగించాలని జట్టు భావిస్తోంది. వరల్డ్ కప్‌కు ముందు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తమ బలాన్ని మరోసారి ప్రదర్శించుకునేందుకు జట్టు సిద్ధమైంది. మరోవైపు సిరీస్‌లో ఒక్క విజయంతోనైనా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తున్న కివీస్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్‌లో మరో పోరుకు రంగం సిద్ధమైంది. వైజాగ్‌లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నేడు ఇరు జట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. సిరీస్ భారత్ సొంతమైన నేపథ్యంలో ఫలితం పరంగా ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేదు. అయితే మరోసారి చెలరేగి ఆధిక్యాన్ని 4–0కు పెంచుకోవాలని సూర్య బృందం పట్టుదలగా ఉంది. వన్డేల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన కివీస్ టి20ల్లో పూర్తిగా చేతులెత్తేసింది. వరల్డ్ కప్‌కు ముందు ఇది ఆందోళన కలిగిస్తుండటంతో తమ లోపాలు సరిదిద్దుకోవడంపై జట్టు దృష్టి పెట్టింది. సామ్సన్‌కు చివరి చాన్స్! తొలి మూడు టి20ల్లో భారత జట్టు ప్రదర్శన చూస్తే జట్టులో లోపాలేమీ కనిపించడం లేదు. వరల్డ్ కప్‌కు ముందు టీమ్ కూర్పుపై కూడా చాలా స్పష్టత వచ్చింది. అయితే ఓపెనర్ సంజు సామ్సన్ ఫామ్ మాత్రమే ఆందోళన కలిగిస్తోంది. గిల్‌పై వేటు వేయడంతో ఓపెనర్‌గా వరల్డ్ కప్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న సామ్సన్ తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 10, 6, 0 పరుగుల తర్వాత అతనిపై తీవ్ర ఒత్తిడి ఉంది. తిలక్ వర్మ గాయంతో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ రెండు మ్యాచ్‌లలో చెలరేగిపోయాడు. తిలక్ తిరిగి వస్తే ఇషాన్ ఓపెనర్‌గా వెళితే సామ్సన్‌పై వేటు వేయడం ఖాయం. అదృష్టవశాత్తూ తిలక్ కోలుకోకపోవడంతో సామ్సన్‌కు మరో రెండు అవకాశాలు దక్కుతున్నాయి కాబట్టి అతను దీనిని వాడుకొని భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మరోవైపు అభిషేక్ శర్మ అసాధారణ బ్యాటింగ్‌ను నిలువరించడం కివీస్ వల్ల కావడం లేదు. భారత అభిమానుల కోణంలో చూస్తే అభిషేక్ ఇంకా ఎంతగా విధ్వంసం సృష్టిస్తాడనేదే ప్రస్తుతం చర్చనీయాంశం. గత మ్యాచ్‌లో అతనితో పాటు సూర్య కూడా చెలరేగిపోవడంతో అతి సులువుగా భారత్ గెలిచింది. పాండ్యా, దూబే, రింకూ తమ స్థాయిలో సత్తా చాటుతుండటంతో భారత్ తిరుగులేని జట్టుగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో రొటేషన్‌లో ఆటగాళ్లను ప్రయతి్నంచే క్రమంలో మరోసారి బుమ్రాకు విశ్రాంతిచ్చే అవకాశం ఉంది. బుమ్రా, బిష్ణోయ్ స్థానాల్లో అర్‡్షదీప్, వరుణ్ చక్రవర్తి రావడం ఖాయం. రెండు మార్పులతో... న్యూజిలాండ్ పరిస్థితి చూస్తే ఏ ఆటగాడు కూడా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేలా కనిపించడం లేదు. ఒక్కో మ్యాచ్‌కు జట్టు ప్రదర్శన మరింత పేలవంగా మారుతూ వచ్చింది. తొలి పోరులో 190 పరుగులు చేసి కాస్త పోటీనిచ్చినట్లు కనిపించినా...ఆ తర్వాత భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో... 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించడం కివీస్ పరిస్థితిని చూపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమ్‌లో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాబిన్సన్, క్లార్క్ స్థానాల్లో పేసర్ ఫెర్గూసన్, ఆల్‌రౌండర్ నీషమ్ తుది జట్టులోకి వస్తారు. గాయం నుంచి కోలుకున్న తమ ప్రధాన పేసర్ ఫెర్గూసన్ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగలడని కివీస్ ఆశిస్తోంది. మూడు మ్యాచ్‌లలో కలిపి జట్టు నుంచి ఒకే ఒక అర్ధసెంచరీ నమోదైంది. ఫిలిప్స్ మాత్రమే ఫర్వాలేదనిపించగా, వన్డేల్లో చెలరేగిన మిచెల్ ఇక్కడ ప్రభావం చూపలేకపోతున్నాడు. కెపె్టన్ సాంట్నర్ కూడా విఫలమయ్యాడు. శుభారంభాలు లేకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. టీమ్ బౌలింగ్ చెత్తగా కనిపిస్తోంది. టీమ్‌లో ఒక బౌలర్ నమోదు చేసిన అతి తక్కువ ఎకానమీ 10 ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి స్థితి నుంచి కివీస్ ఎలా కోలుకుంటుందనేది కీలకం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్ ), సీఫెర్ట్, కాన్వే, రచిన్, ఫిలిప్స్, మిచెల్, చాప్మన్, నీషమ్, హెన్రీ, ఫెర్గూసన్, సోధి. పిచ్, వాతావరణంబ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌తో భారీ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావం కూడా కాస్త ఉండవచ్చు. ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్ 3 గెలిచి ఒకటి ఓడింది. 2023 నవంబర్‌లో ఆఖరి మ్యాచ్ జరగ్గా... ఆసీస్‌పై 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో ఛేదించింది. -
ఊచకోత అంటే ఇదే..
-
లక్ష్యం 154... 60 బంతుల్లోనే ఉఫ్...
గువాహటి: న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా... ఐదు టి20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన మూడో టి20లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్లతో కివీస్‌పై గెలుపొందింది. 3–0తో సిరీస్‌ను వశం చేసుకుంది. టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. చాప్మన్ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ సాంట్నర్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. ప్రపంచకప్‌కు ముందు ప్రీమియం బౌలర్ బుమ్రా (3/17) తన పేస్ వాడి ఏంటో నిలకడగా చూపించాడు. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో 2 వికెట్లు తీశారు.అనంతరం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ సూర్యకుమార్ (26 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ షోతో స్టేడియాన్ని ఊపేశారు. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ బుధవారం విశాఖపట్నంలో జరుగుతుంది. అభి‘షో’... 14 బంతుల్లో ఫిఫ్టీ! తొలి బంతికే సామ్సన్ (0) క్లీన్‌బౌల్డ్... ఈ మ్యాచ్‌లో కివీస్ శిబిరం సంతోషించిన క్షణమిదే! తర్వాత గడిచిన క్షణాలు... పడిన బంతులు... వేసిన బౌలర్లు... పడిన పాట్లు... అన్ని ఇన్నీ కావు మరి! ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మూడో బంతికి సిక్స్‌తో మొదలుపెట్టిన విధ్వంసం... అతను అవుటైనా కూడా ప్రతి ఓవర్లోనూ కొనసాగింది. ఓపెనర్ అభిషేక్, కెప్టెన్ సూర్యకుమార్ ‘హైలైట్స్’నే ఇన్నింగ్స్ అసాంతం చూపించారు. అభి, ఇషాన్, సూర్య ముగ్గురు కలిసి 10 సిక్స్‌లు బాదారు. అంటే సగటున ఓవర్‌కు ఒక్కోటి వచ్చింది. బౌండరీలైతే 16! ఎంత సులువుగా వచ్చాయంటే! ప్రత్యర్థి ఫీల్డర్లు, బౌలర్లు మొత్తం 20 ఓవర్లు కష్టపడకుండానే సగం ఓవర్లతోనే ముగించేలా బౌండరీల భరతం పట్టారు భారత బ్యాటర్లు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. సూర్య 25 బంతుల్లో పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు కేవలం 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. 3.1 ఓవర్లో 50 దాటిన భారత్ స్కోరు 6.3 ఓవర్లలో వందకు చేరుకుంది. 9.5 ఓవర్లలో 150ని సైతం అధిగమించింది.స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్ 1; సీఫర్ట్ (బి) బుమ్రా 12; రచిన్ (సి) బిష్ణోయ్ (బి) పాండ్యా 4; ఫిలిప్స్ (సి) ఇషాన్ (బి) బిష్ణోయ్ 48; చాప్మన్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 32; మిచెల్ (సి) ఇషాన్ (బి) పాండ్యా 14; సాంట్నర్ (సి) అభిషేక్ (బి) బుమ్రా 27; జేమీసన్ (బి) బుమ్రా 3; హెన్రీ (రనౌట్) 1; ఇష్ సోధి (నాటౌట్) 2; డఫీ (నాటౌట్) 4: ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–2, 2–13, 3–34, 4–86, 5–112, 6–112, 7–132, 8–134, 9–144. బౌలింగ్: హర్షిత్ రాణా 4–0–35–1, హార్దిక్ పాండ్యా 3–0–23–2, రవి బిష్ణోయ్ 4–0–18–2, బుమ్రా 4–0–17–3, కుల్దీప్ 3–0–32–0, శివమ్ దూబే 2–0–24–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) హెన్రీ 0; అభిషేక్ శర్మ (నాటౌట్) 68; ఇషాన్ (సి) చాప్మన్ (బి) సోధి 28; సూర్యకుమార్ (నాటౌట్) 57; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–53. బౌలింగ్: హెన్రీ 2–0–28–1, డఫీ 2–0–38–0, జేమీసన్ 1–0–17–0, ఇష్ సోధి 2–0–28–1, సాంట్నర్ 2–0–28–0, ఫిలిప్స్ 1–0–16–0. -
రెచ్చిపోయిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన న్యూజిలాండ్
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 153 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం బుమ్రా మహోగ్రరూపం దాల్చాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీటిలో టిమ్ సీఫర్ట్, కైల్ జేమీసన్ వికెట్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్లీన్ బౌల్డ్ అంటే ఏదో సాదాసీదా కాదు. బుమ్రా బౌలింగ్ వేగానికి వికెట్లు గాల్లో నాట్యం చేశాయి. మరో బౌలర్ రవి బిష్ణోయ్ కూడా ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, బిష్ణోయ్.. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాంగా వచ్చి చెలరేగడం విశేషం.న్యూజిలాండ్‌ను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో మరో ఇద్దరు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషించారు. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి కీలకమైన డెవాన్ కాన్వే వికెట్ తీయగా.. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3-0-32-0), శివమ్ దూబే (2-0-24-0) వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27), డారిల్ మిచెల్ (14), సీఫర్ట్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్ (4), జేమీసన్ (3), హెన్రీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టాస్ గెలిచిన సూర్యకుమార్
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 25) జరుగనున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్ స్థానంలో కైల్ జేమీసన్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా -
సిరీస్‌పై గురి...
గువాహటి: సొంతగడ్డపై టి20 ప్రపంచకప్‌నకు ముందు ఆడుతున్న చివరి దైపాక్షిక సిరీస్‌లో టీమిండియా జోరు కనబరుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడిన రెండు టి20ల్లోనూ గెలిచిన సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు నేడు న్యూజిలాండ్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. గత రెండు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... అదే జోష్‌లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఇక్కడే సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. మరో వైపు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ జట్టు... టి20ల్లో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతోంది. ముఖ్యంగా టీమిండియా హిట్టర్లను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు విఫలమవుతున్నారు. మరి సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు సమానంగా సహకరించనుండగా... మంచు ప్రభావం ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపనుంది. సంజూ రాణించేనా..! ఐసీసీ టి20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టు మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండగా... బ్యాటింగ్ ఆర్డర్‌పై టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. మెగాటోర్నీలో ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడనుకుంటున్న సంజూ సామ్సన్ గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. అదే సమయంలో రెండో టి20ల్లో ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా సంజూ స్థాయికి తగ్గ ప్రద్రర్శన చేస్తాడా చూడాలి. ముఖ్యంగా సామ్సన్ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాడు. దాన్ని అధిగమించకపోతే... మెగా టోర్నీలో తిలక్ వర్మ వస్తే సామ్సన్ స్థానాన్ని ఇషాన్ భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. అభిషేక్ గత మ్యాచ్‌లో ‘గోల్డెన్ డకౌట్’ అయినా... అతడి దూకుడుపై ఎవరికీ సందేహాలు లేవు. తనదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేసుకునే అభిõÙక్ నుంచి అభిమానులు అలాంటి సుడిగాలి ఇన్నింగ్స్‌లే ఆశిస్తున్నారు. ఇక సుదీర్ఘ కాలం తర్వాత సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వరల్డ్‌కప్‌నకు ముందు ఇది జట్టుకు శుభపరిణామం కాగా... మిడిలార్డర్లో శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ రూపంలో ధాటిగా ఆడగల సమర్థులు ఉన్నారు. వీరంతా కలిసికట్టుగా కదం తొక్కితే... మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్‌లో అర్ష్ దీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నారు. గత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి వస్తే హర్షిత్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. డరైల్ మిచెల్‌పై ఆశలు టీమిండియాతో వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో విజృంభించిన డారిల్ మిచెల్‌పై న్యూజిలాండ్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వన్డేల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన అతడు టి20ల్లో మాత్రం పెద్దగా మెరవడం లేదు. దీంతో కివీస్ గెలుపుబాట పట్టలేకపోతోంది. ఓపెనర్లు కాన్వే, సీఫెర్ట్ జట్టుకు మెరుపు ఆరంభాలను ఇచ్చినట్లే కనిపిస్తున్నా... ఈ జంట ఎక్కువసేపు నిలవలేకపోతుండటంతో మిడిలార్డర్‌పై భారం పడుతోంది. గత మ్యాచ్‌లో చక్కటి షాట్లతో ఆకట్టుకున్న రచిన్ రవీంద్ర అదే జోరు కొనసాగించాలని చూస్తుండగా... గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, సాంట్నర్ కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. కెపె్టన్ సాంట్నర్ గత మ్యాచ్‌లో బ్యాట్‌తో ఆకట్టుకున్నా... బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఫౌల్క్స్ బంతులనైతే టీమిండియా బ్యాటర్లు చీల్చి చెండాడారు. మూడు ఓవర్లలోనే 67 పరుగులు సమర్పించుకున్న అతడు కివీస్ పరాజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని కివీస్ సమష్టిగా సత్తా చాటాలని భావిస్తోంది. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్, దూబే, హార్దిక్, రింకూ సింగ్, హర్షిత్/ బుమ్రా, కుల్దీప్, అర్ష్ దీప్, వరుణ్ చక్రవర్తి. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, సైఫెర్ట్, రచిన్, ఫిలిప్స్, డరైల్ మిచెల్, చాప్మన్, ఫౌల్క్స్, హెన్రీ, సోధి, డఫీ. -
న్యూజిలాండ్ చిత్తు చిత్తు.. భారత్ హ్యాట్రిక్ విజయం
బులావాయో:: ఐసీసీ అండర్ 19 వరల్డ్‌కప్‌లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు(శనివారం, జనవరి 24వ తేదీ) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం నమోదు చేసింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. దాంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 36.2 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆపై 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 13.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌లో విజేతను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్ణయించారు. ఫలితంగా భారత్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయాన్ని అందుకుంది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 17 ఓవర్లలో 90 పరుగులు చేస్తే విజయం సాధించినట్లు. దాంతో భారత్ అప్పటికే ముందంజలో ఉండటంతో విజయం అడ్డుకోవడానికి కివీస్‌కు ఎటువంటి చాన్స్ లేకుండా పోయింది. భారత బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ(40: 23 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి విజృంభించి ఆడాడు. అతనికి జతగా కెప్టెన్ ఆయుష్(53: 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దాంతో భారత్ స్కోరు 9.5 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటేసింది. అంతకుముందు భారత బౌలర్లలో అంబ్రిష్ నాలుగు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, హెనిల్ పటేల్ మూడు వికెట్లతో మెరిశాడు. -
సూర్య, ఇషాన్ విధ్వంసం
టి20ల్లో భారత్ ఆధిపత్య ప్రదర్శన కొనసాగుతోంది. సిరీస్ తొలి పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా మరో ఏకపక్ష గెలుపును అందుకొని 2–0తో పైచేయి సాధించింది. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన వేళ 209 పరుగుల లక్ష్యం పెద్దదిగా అనిపించినా... భారత్ అలవోకగా 28 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. ఓపెనర్లు విఫలమైన చోట ఈసారి నేనున్నానంటూ ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, ఎట్టకేలకు తన స్థాయిని చూపిస్తూ కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ 23 ఇన్నింగ్స్‌ల తర్వాత ఈ ఫార్మాట్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌లో బౌండరీల (21 ఫోర్లు, 12 సిక్స్‌లు) ద్వారానే 156 పరుగులు వచ్చాయి. రాయ్‌పూర్: భారత జట్టు దూకుడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌పై వరుసగా రెండో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20లో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (27 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (26 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 49 బంతుల్లోనే 122 పరుగులు జోడించారు. ఆ తర్వాత సూర్య, శివమ్ దూబే (18 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో అభేద్యంగా 81 పరుగులు జత చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. గాయం కారణంగా అక్షర్ పటేల్ ఆడలేదు. వీరిద్దరి స్థానాల్లో హర్షిత్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం గువాహటిలో జరుగుతుంది. హాఫ్ సెంచరీ లేకుండానే... న్యూజిలాండ్ జట్టు బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించిన 7 ఓవర్లలో కలిపి 120 పరుగులు రాగా... భారత బౌలర్లు కట్టడి చేసిన మిగతా 13 ఓవర్లలో 88 పరుగులే లభించాయి. ఓపెనర్లు కాన్వే (9 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్), సీఫెర్ట్ (13 బంతుల్లో 24; 5 ఫోర్లు) కలిసి 20 బంతుల్లోనే 43 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్ష్ దీప్ వేసిన తొలి ఓవర్లోనే కాన్వే 3 ఫోర్లు, 1 సిక్స్ బాది 18 పరుగులు రాబట్టగా, అర్ష్ దీప్ తర్వాతి ఓవర్లో సీఫెర్ట్ వరుసగా 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఓపెనర్లిద్దరూ ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. హర్షిత్ తన తొలి ఓవర్‌ను ‘మెయిడిన్’గా వేసినా... అతని తర్వాతి ఓవర్లో రచిన్ 2 భారీ సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు. వరుణ్ ఓవర్లోనూ రెండు సిక్స్‌లతో రచిన్ జోరు కొనసాగించగా... కుల్దీప్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు కొట్టిన గ్లెన్ ఫిలిప్స్ (19) అదే ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మిచెల్ (18), రచిన్ పెవిలియన్ చేరడంతో కివీస్ స్కోరు వేగం మందగించింది. చాప్మన్ (10) కూడా విఫలమైనా, చివర్లో సాంట్నర్, ఫోక్స్ (15 నాటౌట్) ధాటిగా ఆడటంతో స్కోరు 200 దాటింది. చివరి 3 ఓవర్లలో వీరిద్దరు కలిసి 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో మొత్తం 47 పరుగులు రాబట్టారు. కివీస్ ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అభిషేక్ శర్మ ‘డకౌట్’ ఇన్నింగ్స్ రెండో బంతికే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా దానిని ఉపయోగించుకోలేక సామ్సన్ (6) తొలి ఓవర్లోనే నిష్క్రమించాడు. తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్ శర్మ (0) ఈసారి మొదటి బంతికే అవుటయ్యాడు. అయితే ఇషాన్ మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్య ఛేదన సులువుగా మారిపోయింది. ఫోక్స్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిన ఇషాన్... సాంట్నర్ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత హెన్రీ ఓవర్లోనూ వరుసగా 6, 4, 4 బాది 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ చేసిన తొలి 100 పరుగుల్లో 76 అతని బ్యాట్ నుంచే వచ్చాయి. ఇషాన్ వెనుదిరిగిన తర్వాత సూర్య బాధ్యత తీసుకున్నాడు. భారత కెపె్టన్ చాలా కాలం తర్వాత అంచనాలకు తగిన ఆటను ప్రదర్శించాడు. ఫోక్స్ ఓవర్లో అతను వరుసగా 4, (వైడ్), 4, 4, 4, 6 బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. 23 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న సూర్య ఆ తర్వాత అదే ధాటిని చివరి వరకు కొనసాగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) పాండ్యా (బి) హర్షిత్ 19; సీఫెర్ట్ (సి) ఇషాన్ (బి) వరుణ్ 24; రచిన్ (సి) అర్ష్ దీప్ (బి) కుల్దీప్ 44; ఫిలిప్స్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 19; మిచెల్ (సి) పాండ్యా (బి) దూబే 18; చాప్మన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 10; సాంట్నర్ (నాటౌట్) 47; ఫోక్స్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–43, 2–43, 3–98, 4–125, 5–129, 6–161. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–53–0, పాండ్యా 3–0–25–1, హర్షిత్ 3–1–35–1, వరుణ్ 4–0–35–1, కుల్దీప్ 4–0–35–2, అభిషేక్ 1–0–12–0, దూబే 1–0–7–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రచిన్ (బి) హెన్రీ 6; అభిషేక్ (సి) కాన్వే (బి) డఫీ 0; ఇషాన్ కిషన్ (సి) హెన్రీ (బి) సోధి 76; సూర్యకుమార్ (నాటౌట్) 82; శివమ్ దూబే (నాటౌట్) 36; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.2 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–128. బౌలింగ్: హెన్రీ 3–0–41–1, డఫీ 4–0–38–1, ఫోక్స్ 3–0–67–0, సాంట్నర్ 2–0–27–0, సోధి 3–0–34–1, మిచెల్ 0.2–0–2–0. -
IND VS NZ 2nd T20I: న్యూజిలాండ్ భారీ స్కోర్
రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఈ స్కోర్ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. కాన్వే (19), సీఫర్ట్ (24), ఫిలిప్స్ (19), డారిల్ మిచెల్ (18), మార్క్ చాప్మన్ (10), జకరీ ఫౌల్క్స్ (15 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నంతసేపు బ్యాట్ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్, ఫౌల్క్స్ క్యామియో న్యూజిలాండ్‌ను 200 పరుగుల మార్కును దాటించింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్‌లో తెచ్చారు.మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు.కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్‌లో తెచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
నేడు భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
-
ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు...
రాయ్‌పూర్: న్యూజిలాండ్‌తో తొలి టి20లో ఘన విజయం తర్వాత భారత్ మరో విజయంపై గురి పెట్టింది. గత పోరులో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన జట్టు 2–0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు న్యూజిలాండ్ కోలుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సామ్సన్, ఇషాన్‌లపై దృష్టి... తొలి టి20లో భారత బ్యాటర్లలో అభిõÙక్ శర్మ చెలరేగగా, సూర్యకుమార్ కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు పాండ్యా ప్రభావం చూపించగా... ఫినిషర్‌గా రింకూ సింగ్ తన పేరును నిలబెట్టుకున్నాడు. అయితే సామ్సన్, ఇషాన్ కిషన్ మాత్రమే ప్రభావం చూపలేకపోయారు. గిల్‌ను తప్పించడంతో టి20 టీమ్‌లో ఓపెనర్‌గా తన స్థానం చేసుకున్న సామ్సన్ అంచనాలకు తగినట్లుగా ఆడాల్సి ఉంది. అదే విధంగా వరల్డ్ కప్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్‌పై నమ్మకంతో మేనేజ్మెంట్ మూడో స్థానంలో ఆడే అవకాశం కల్పించింది. ఒక్క మ్యాచ్‌లో వైఫల్యం సమస్య కాకపోయినా... చెత్త షాట్లతో వీరు వికెట్లు సమర్పించుకున్నారు. ఈసారి తప్పులు దిద్దుకునే అవకాశం వీరికి ఉంది. పేస్ బౌలింగ్‌లో మరోసారి అర్‡్షదీప్, బుమ్రా ప్రదర్శనపై జట్టు ఆధారపడి ఉండగా, పాండ్యా కూడా కీలక పాత్ర పోషిస్తాడు. స్పిన్నర్లుగా వరుణ్, అక్షర్ ప్రత్యర్థిపై పైచేయి సాధించగలరు. అయితే తొలి మ్యాచ్‌లో చేతికి గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్న అక్షర్ ఆడకపోతే మరో స్పిన్నర్ బిష్ణోయ్‌కు చోటు లభించవచ్చు. తుది జట్టులోకి బ్రేస్‌వెల్! భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ గత మ్యాచ్‌లో న్యూజిలాండ్ పోరాడినా ఫలితం లేకపోయింది. అయితే ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి సిరీస్‌ను సమం చేయాలని జట్టు ఆశిస్తోంది. టాప్–3 విఫలం కావడంతో జట్టును దెబ్బ తీసింది. వన్డే సిరీస్‌లో కూడా ఘోరంగా విఫలమైన కాన్వే ఇప్పటికైనా రాణించాలని టీమ్ కోరుకుంటోంది. రచిన్‌పై కూడా ప్రధాన బాధ్యత ఉండగా, రాబిన్సన్ దూకుడుగా ఆడగల సమర్థుడు. ఫిలిప్స్, చాప్మన్ మరోసారి కీలకం కానుండగా, వన్డే ఫామ్‌ను కొనసాగిస్తున్న మిచెల్ ఈ సారైనా జట్టును గెలిపించాలని పట్టుదలగా ఉన్నాడు. గాయంతో ఆల్‌రౌండర్ బ్రేస్‌వెల్ గత మ్యాచ్‌కు దూరం కావడం కివీస్‌ను బలహీనపర్చింది. అతను కోలుకొని ఈ సారి బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లలో క్లార్క్‌ను తప్పించి బ్రేస్‌వెల్‌ను ఆడించవచ్చు. ఇతర స్పిన్నర్లు సాంట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది చూడాలి.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, దూబే, రింకూ సింగ్, అక్షర్/బిష్ణోయ్, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), కాన్వే, రాబిన్సన్, రచిన్, ఫిలిప్స్, చాప్మన్, మిచెల్, క్లార్క్/బ్రేస్‌వెల్, జేమీసన్, సోధి, డఫీ.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలమైన పిచ్. ఈ మైదానంలో రెండేళ్ల క్రితం జరిగిన ఏకైక టి20లో ఆ్రస్టేలియాపై భారత్ గెలిచింది. మంచు ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఛేదన సులువు. ఇటీవల భారత్‌పై వన్డేలో దక్షిణాఫ్రికా 358 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
అదరగొట్టిన అభిషేక్
ఎప్పటిలాగే తనదైన శైలిలో అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్... సూర్యకుమార్, రింకూ సింగ్ దూకుడు... ఆపై బౌలర్ల ప్రతాపం... వెరసి న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ముందుగా కేవలం బౌండరీల ద్వారానే 168 పరుగులు రాబట్టి భారీ స్కోరుతో చెలరేగిన టీమిండియా... అనంతరం ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమైంది. కివీస్ కొంత పోరాడినా లక్ష్యానికి దూరంలో నిలిచిపోయింది. నాగ్‌పూర్: న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్ టి20 సిరీస్ తొలి మ్యాచ్‌లో నెగ్గి 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత్ 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్ల వర్షం కురిపించగా... రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్ ) ధాటిగా ఆడారు. అభిషేక్, సూర్యకుమార్ మూడో వికెట్‌కు 47 బంతుల్లోనే 99 పరుగులు జోడించారు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 78; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్క్ చాప్మన్ (24 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. రెండో టి20 శుక్రవారం రాయ్‌పూర్‌లో జరుగుతుంది. సమష్టి ప్రదర్శన 14 సిక్సర్లతో 84 పరుగులు... 21 ఫోర్లతో 84 పరుగులు... భారత్ జోరు బౌండరీలతో ఈ తరహాలో సాగింది. ముందుగా అభిషేక్, మధ్యలో సూర్య, పాండ్యా, చివర్లో రింకూ చెలరేగి భారత్‌కు భారీ స్కోరును అందించారు. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. సంజు సామ్సన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు), ఇషాన్ కిషన్ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు) ఆరంభంలోనే వెనుదిరిగినా... మరోవైపు అభిషేక్ సిక్స్‌తో దూకుడుగా ఆటను మొదలు పెట్టాడు. జేమీసన్, క్లార్క్ వేసిన వరుస ఓవర్లలో అతను రెండేసి సిక్స్‌లు బాదాడు. దాంతో పవర్‌ప్లేలో భారత్ 68 పరుగులు చేసింది. ఫిలిప్స్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అభిషేక్ 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సోధి ఓవర్లో సూర్య వరుసగా రెండు బౌండరీలు బాదడంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 117కు చేరింది. సూర్య అవుటైన తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) అదే ధాటిని ప్రదర్శించాడు. సోధి ఓవర్లో వరుసగా 4, 6, 6 బాది సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అదే ఓవర్ చివరి బంతికి మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ వెనుదిరిగాడు. తక్కువ వ్యవధిలో శివమ్ దూబే (4 బంతుల్లో 9; 1 సిక్స్), పాండ్యా, అక్షర్ పటేల్ (5) అవుటైన తర్వాత ఆఖర్లో రింకూ చెలరేగిపోయాడు. క్లార్క్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి స్కోరును 200 దాటించిన అతను... మిచెల్ వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఫిలిప్స్ అర్ధ సెంచరీ న్యూజిలాండ్ ఛేదన పేలవంగా ప్రారంభమైంది. రెండో బంతికే కాన్వే (0) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రచిన్ (1) కూడా అవుటయ్యాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాబిన్సన్ (21) కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. ఇలాంటి స్థితిలో ఫిలిప్స్, చాప్మన్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఫిలిప్స్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత ఐదు బంతుల వ్యవధిలో అతను మూడు భారీ సిక్స్‌లు బాదాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా 4, 6 కొట్టిన అనంతరం తర్వాతి బంతికి ఫిలిప్స్ అవుట్ కావడంతో 79 పరుగుల (42 బంతుల్లో) నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్లో చాప్‌మన్‌ను వరుణ్ అవుట్ చేయడంతో కివీస్ ఆశలు కోల్పోయింది. ఈ దశలో విజయానికి చివరి 5 ఓవర్లలో 95 పరుగులు చేయాల్సిన జట్టు చివరకు 46 పరుగులే చేయగలిగింది. డరైల్ మిచెల్ (18 బంతుల్లో 28; 4 ఫోర్లు), సాంట్నర్ (13 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) రచిన్ (బి) జేమీసన్ 10; అభిషేక్ (సి) జేమీసన్ (బి) సోధి 84; ఇషాన్ కిషన్ (సి) చాప్మన్ (బి) డఫీ 8; సూర్యకుమార్ (సి) రాబిన్సన్ (బి) సాంట్నర్ 32; పాండ్యా (సి) చాప్మన్ (బి) డఫీ 25; దూబే (సి అండ్ బి) జేమీసన్ 9; రింకూ సింగ్ (నాటౌట్) 44; అక్షర్ (సి) మిచెల్ (బి) క్లార్క్ 5; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 238. వికెట్ల పతనం: 1–18, 2–27, 3–126, 4–149, 5–166, 6–185, 7–209. బౌలింగ్: డఫీ 4–0–27–2, జేమీసన్ 4–0–54–2, క్లార్క్ 4–0–40–1, సోధి 3–0–38–1, ఫిలిప్స్ 1–0–20–0, సాంట్నర్ 3–0–37–1, మిచెల్ 1–0–21–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; రాబిన్సన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; రచిన్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 1; ఫిలిప్స్ (సి) దూబే (బి) అక్షర్ 78; చాప్మన్ (సి) అభిషేక్ (బి) వరుణ్ 39; మిచెల్ (సి) (సబ్) బిష్ణోయ్ (బి) దూబే 28; సాంట్నర్ (నాటౌట్) 20; క్లార్క్ (సి) రింకూ (బి) దూబే 0; జేమీసన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–52, 4–131, 5–143, 6–189, 7–189. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–31–1, పాండ్యా 2–0–20–1, బుమ్రా 3–0–29–0, అక్షర్ పటేల్ 3.3–0–42–1, వరుణ్ 4–0–37–2, దూబే 3–0–28–2, అభిషేక్ 0.3–0–3–0. -
అభిషేక్ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్ (238/7) చేసింది. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్‌కు జతగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేసింది.మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, ఇషాన్ కిషన్ 8, శివమ్ దూబే 9, అక్షర్ పటేల్ 5, అర్షదీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. -
అభిషేక్ శర్మ ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే..!
నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌పై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 2020లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.అభిషేక్‌కు టీ20ల్లో ఇది ఏడో హాఫ్ సెంచరీ. దీంతో అతను మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు (8) పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తర్వాతి స్థానాల్లో ఫిల్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ ఉన్నారు. వీరంతా తలో ఏడు సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఐష్ సోధి బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి జేమీసన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఇన్నింగ్స్‌లో అభిషేక్ టీ20ల్లో 5000 పరుగుల మార్కును తాకాడు. అభిషేక్ తన స్వల్ప అంతర్జాతీయ టీ20 కెరీర్లో (33 ఇన్నింగ్స్‌లు) 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో, 190.92 స్ట్రయిక్‌రేట్‌తో, 37.46 సగటున 1199 పరుగులు చేశాడు. ఇందులో 112 ఫోర్లు, 81 సిక్సర్లు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) స్వల్ప స్కోర్‌కే ఔటైనా అభిషేక్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8) సైతం నిరాశపర్చినా, అభిషేక్ మెరుపులు ఆగలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్ ఔటయ్యాక శృతి మించాయి.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన శివమ్ దూబే (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న హార్దిక్ (14 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనికి జతగా రింకూ సింగ్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. 15.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 185/5గా ఉంది. -
భారత్‌తో తొలి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్‌పూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌తో క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పేసర్లుగా జేమీసన్, డఫీ ఉన్నారు.మరోవైపు భారత్ ముందుగా చెప్పినట్లుగానే శ్రేయస్‌ను కాదని వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చింది. హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేసింది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
ఫైనల్ రిహార్సల్...
భారత జట్టు 2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వరుసగా ఎనిమిది సిరీస్‌లలో విజేతగా నిలిచింది. సరిగ్గా చెప్పాలంటే 36 మ్యాచ్‌లు ఆడితే 29 గెలిచి, 5 మాత్రమే ఓడిందంటే టీమ్ ఎలాంటి ఫామ్‌లో ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు మరో వరల్డ్‌కప్ టైటిల్ వేటలో చివరి రిహార్సల్‌గా సొంతగడ్డపై ఈ ఫార్మాట్లో పోరుకు టీమిండియా సిద్ధమైంది. అయితే ఈ విజయాల పర్వంలో తాము ఒక్కసారి కూడా తలపడని న్యూజిలాండ్ ఇప్పుడు ప్రత్యర్థిగా ఉంది. సంచలనాల కివీస్‌ను రెండేళ్లుగా టి20ల్లో భారత్ ఎదుర్కోలేదు. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఫలితం తర్వాత ఇప్పుడు టి20 సిరీస్ ఆసక్తిని రేపుతోంది.నాగ్‌పూర్: టి20 వరల్డ్ కప్‌కు ముందు చివరి సన్నాహకం కోసం భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి పోరు జరగనుంది. ఇటీవల సిరీస్ ఆడిన వన్డే టీమ్‌తో పోలిస్తే ఒకరిద్దరు మినహా భారత బృందం పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మరోవైపు కివీస్ కూడా రెగ్యులర్ సభ్యులు అందుబాటులోకి రావడంతో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.టి20 వరల్డ్ కప్ ఇక్కడే జరగనుండటం, రెండు టీమ్‌లు కూడా ఐసీసీ టోరీ్నలో ఆడే టీమ్‌నే దాదాపుగా ఎంపిక చేయడంతో ఈ సిరీస్ సరైన ప్రాక్టీస్ కానుంది. తమ బలాబలాలను అంచనా వేసుకోవడంతో పాటు తుది జట్టు కూర్పుపై కూడా జట్లు దృష్టి పెట్టాయి. అనూహ్యంగా వన్డే సిరీస్ విజయంతో ఆత్మవిశ్వాసం పెరిగిన న్యూజిలాండ్‌ను భారత్ తక్కువగా అంచనా వేస్తే అదే ఫలితం పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది. స్టార్లంతా సిద్ధం... బుమ్రా వచ్చేశాడు, హార్దిక్ పాండ్యా కూడా వచ్చాడు... మెరుపు ఆరంభాలకు అభిషేక్ శర్మ, సామ్సన్ కూడా సిద్ధం. ఎప్పటిలాగే భారత టి20 జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో ప్రతీ ఆటగాడు ఒంటిచేత్తో విజయం అందించే స్థాయిలో ఉన్నాడు. ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బుమ్రా, పాండ్యాలు సత్తా చాటితే టీమిండియాకు ఎదురే ఉండదు. శస్త్ర చికిత్స కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన తిలక్ వర్మకు బదులుగా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసినా... మూడో స్థానంలో ఇషాన్ కిషన్ ఆడతాడని కెప్టెన్ సూర్యకుమార్ స్పష్టం చేసిన నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా సందేహాలు లేవు.ఏడు, ఎనిమిది స్థానాల్లో హిట్టర్లు రింకూ సింగ్, శివమ్ దూబే ఆడటం అంటే జట్టు బ్యాటింగ్ లోతు ఏమిటో తెలుస్తోంది. ఇద్దరు రెగ్యులర్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి భారం మోస్తారు. వన్డే సిరీస్‌లో కుల్దీప్ ప్రభావం చూపకపోయినా... టి20ల్లో ప్రత్యర్థిని కుప్పకూల్చగల సమర్థుడు. ఇన్ని సానుకూలతల మధ్య ఏదైనా ఆందోళన ఉందంటే అది కెప్టెన్ సూర్య ఫామ్ గురించి మాత్రమే. గత 22 ఇన్నింగ్స్‌లలో అతను అర్ధసెంచరీ సాధించలేకపోయాడు. జట్టు సారథిగా, విధ్వంసకర బ్యాటర్‌గా తనకున్న గుర్తింపును ప్రదర్శించేందుకు ఈ సిరీస్ అతనికి సరైన వేదిక. కెరీర్లో ఇది సూర్యకు 100వ టి20 మ్యాచ్ కానుంది. మిచెల్, ఫిలిప్స్‌పై దృష్టి... న్యూజిలాండ్ వన్డేల తరహాలో ఈ సిరీస్ కోసం కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే వన్డేల్లో సత్తా చాటిన డరైల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. టి20ల్లో మిచెల్‌కు కూడా మెరుగైన రికార్డు ఉండగా, ఫిలిప్స్ దూకుడుకు మారుపేరు. వన్డేల్లో విఫలమైన కాన్వే ఇక్కడ మెరుగ్గా ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. కివీస్ కూడా పలువురు టి20 స్పెషలిస్ట్‌లు చాప్మన్, డఫీ, సోధిలకు అవకాశం కల్పిస్తోంది. పేసర్ డఫీ చక్కటి ఫామ్‌లో ఉండగా... రచిన్ రవీంద్ర, కెప్టెన్ సాంట్నర్ విరామం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చారు. ఇటీవల ఆ్రస్టేలియాపై మెరుపు సెంచరీ చేసిన రాబిన్సన్ ఓపెనర్‌గా చెలరేగిపోగలడు. 1210 భారత్, న్యూజిలాండ్ మధ్య మొత్తం 25 టి20లు జరగ్గా... భారత్ 12 గెలిచి 10 ఓడింది. మరో 3 మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. భారత్‌లో 2017, 2023లలో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లు జరగ్గా... రెండూ భారత్ గెలిచింది.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, సామ్సన్, ఇషాన్ కిషన్, పాండ్యా, అక్షర్, రింకూ, దూబే, కుల్దీప్, బుమ్రా, వరుణ్. న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), రాబిన్సన్, కాన్వే, రచిన్, మిచెల్, ఫిలిప్స్, చాప్మన్, నీషమ్, హెన్రీ, సోధి, డఫీ. పిచ్, వాతావరణంబ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా అనుకూలించే మంచి స్పోర్టింగ్ వికెట్. అయితే స్పిన్నర్లు కొంత అదనపు ప్రభావం చూపగలరు. దేశంలో పెద్ద బౌండరీలు ఉన్న మైదానాల్లో ఒకటి కాబట్టి భారీ స్కోర్లు కష్టం. వర్షం సమస్య లేదు.సినెర్ గెలుపు బోణీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేసిన డిఫెండింగ్ చాంపియన్ఐపీఎల్లో ‘జెమినై’రూ. 270 కోట్లతో ఒప్పందంన్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాన్సర్ల సుదీర్ఘ జాబితాలో ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక సంస్థ కూడా చేరింది. గూగుల్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫామ్ ‘జెమినై’ ఐపీఎల్లో భాగస్వామిగా మారుతూ బీసీసీఐతో జత కట్టింది. ఇందు కోసం మూడేళ్ల కాలానికి ‘జెమినై’ రూ. 270 కోట్లు చెల్లిస్తుంది. భారత క్రికెట్లో ఏఐ ప్లాట్‌ఫామ్‌ల పాత్ర పెరిగేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో మరో ప్రముఖ సంస్థ, ‘జెమినై’కి పోటీదారు అయిన చాట్ జీపీటీ ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో స్పాన్సర్‌గా ఉండటం విశేషం. గత నవంబర్లోనే బీసీసీఐ ఈ ఒప్పందం చేసుకుంది. 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 26 నుంచి మే 31 వరకు జరుగుతుంది. -
భారత్‌తో తొలి టీ20.. న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..!
భారత్-న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం. ప్రపంచకప్‌కు ముందు జరుగబోయే చివరి సిరీస్ కావడంతో ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ అన్ని కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది.ఓపెనర్లుగా టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే బరిలోకి దిగడం లాంఛనమే. వీరిలో రాబిన్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాన్వే టీ20 ఫామ్ కాస్త కలవరపెడుతున్నా, ఇతర ఫార్మాట్లలో మంచి టచ్‌లో ఉండటం ఊరట కలిగించే అంశం. ఫస్ట్ ఛాయిస్ వికెట్‌కీపర్ కావడంతో తుది జట్టులో కాన్వే స్థానం పక్కా. వన్‌డౌన్‌లో రచిన్ రవీంద్ర రావడం కూడా దాదాపుగా ఖాయమే. రచిన్‌కు ఈ స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 మ్యాచ్‌ల్లో 143.81 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేయగల సమర్దత రచిన్‌ను ఈ స్థానానికి ఫిక్స్ చేస్తుంది.న్యూజిలాండ్ మిడిలార్డర్లో చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఆ జట్టుకు ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం రాదు. నాలుగో స్థానంలో డారిల్ మిచెల్, ఆతర్వాత మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి బలమైన హిట్టర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. సమయానుసారంగా వీరి స్థానాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.లోయర్ ఆర్డర్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా దాదాపు అన్ని బెర్త్‌లు ఖరారై ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ కమ్ బ్యాటర్‌గా మిచెల్ సాంట్నర్ ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో సాంట్నర్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సాంట్నర్‌కు భారత్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ విభాగం మిగతా విభాగాల కంటే అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిన మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ తుది జట్టులో ఉంటారు. వీరికి మరో ఇన్ ఫామ్ పేసర్ కైల్ జేమీసన్ జత కలుస్తాడు. ఈ ముగ్గురితో కివీస్ పేస్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.ఐష్ సోది డౌటే..!భారత్‌పై ఐష్ సోధికి అద్భుత రికార్డు (20 మ్యాచ్‌లు, 25 వికెట్లు, ఎకానమీ 7.54) ఉన్నా, జట్టు కాంబినేషన్ కారణంగా తొలి మ్యాచ్‌లో అతనికి ఆడే అవకాశం రాకపోవచ్చు. సాంట్నర్‌తో పాటు రవీంద్ర, బ్రేస్‌వెల్, చాప్మన్, ఫిలిప్స్ స్పిన్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు.భారత్‌తో తొలి టీ20కి న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్. -
రేపటి నుంచి భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్
భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.షెడ్యూల్..తొలి టీ20- నాగ్పూర్రెండో టీ20- రాయ్పూర్మూడో టీ20- గౌహతినాలుగో టీ20- విశాఖపట్నంఐదో టీ20- తిరువనంతపురంఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకే, పైన పేర్కొన్న మాధ్యమాల ద్వారానే ప్రత్యక్ష ప్రసారమవుతాయి.జట్లు..భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జకరీ ఫౌల్క్స్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్, ఐష్ సోది, క్రిస్టియన్ క్లార్క్ఈ సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు, వాటి ఫలితాలు, అందులోని విశేషాలపై ఓ లుక్కేద్దాం.భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 8 ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ మూడు, భారత్ ఐదింట విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య 2008-09లో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఆతర్వాత 2012లో న్యూజిలాండ్ తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. 2 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను కూడా న్యూజిలాండే కైవసం చేసుకుంది (1-0).అనంతరం 2017-18లో న్యూజిలాండ్ మరోసారి భారత్‌లో పర్యటించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌కు భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని, తొలిసారి న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది.ఆ మరుసటి ఏడాది (2018-19) భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను ఆతిథ్య జట్టే 2-1 తేడాతో చేజిక్కించుకుంది.2019-20లో భారత్ మరోసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఈ పర్యటన భారత టీ20 క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసి, ఆతిథ్య జట్టుకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. విరాట్ కోహ్లి టీ20 కెరీర్లోనూ ఈ సిరీస్ చిరస్మరణీయంగా మిగిలిపోయింది.అనంతరం 2021-22లో న్యూజిలాండ్ 3 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను కూడా భారత్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది.2022-23లో ఇరు జట్ల మధ్య రెండు సార్లు ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. రెండు సిరీస్‌లను టీమిండియానే కైవసం చేసుకుంది. తొలుత పర్యాటక జట్టుగా 1-0తో.. ఆతర్వాత ఆతిథ్య జట్టుగా 2-1తో సిరీస్‌లను కైవసం చేసుకుంది.శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్‌లో ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 126 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను 168 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
భారత్ నెత్తిన మిచెల్ పిడుగు
130, 134, 17, 63, 84, 131 నాటౌట్, 137... భారత్‌పై గత 7 వన్డేల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డరైల్ మిచెల్ స్కోర్లు ఇవి. టీమిండియాపై మ్యాచ్ అనగానే చెలరేగిపోయే అతి తక్కువ మంది ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతను కూడా చేరాడు. మొత్తంగా భారత్‌పై ఆడిన 11 వన్డే ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా ఏకంగా 74.10 సగటుతో అతను 741 పరుగులు సాధించాడు. ఏబీ డివిలియర్స్ ఒక్కడే భారత్‌లో భారత్‌పై ఇంతకంటే ఎక్కువ (5) సెంచరీలు నమోదు చేయగలిగాడంటే మిచెల్ ప్రదర్శన విలువను చెప్పవచ్చు. ఒంటిచేత్తో అతను తన టీమ్‌కు తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ అందించి కివీస్ హీరోగా మారాడు. భారత్‌లో భారత్‌పై మిచెల్ చెలరేగిపోవడం వెనక తీవ్ర సాధన, పట్టుదల ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ లీగ్ మ్యాచ్, సెమీఫైనల్‌లలో రెండుసార్లూ వందకు పైగా స్ట్రయిక్ రేట్‌తో అతను శతకాలు బాదాడు. కానీ ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా అలవోక విజయాలు సాధించింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో కూడా లీగ్ మ్యాచ్‌లో విఫలమైన తర్వాత ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి అతను హాఫ్ సెంచరీ చేశాడు. అయితే పరిస్థితిని బట్టి బాగా నెమ్మదిగా ఆడిన మిచెల్ మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డాడు. తన ఇన్నింగ్స్‌లోని 101 బంతుల్లో అతను 96 బంతులు స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఆడాడు! అయితే నలుగురు భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక 52 పరుగులే చేయగలిగాడు. ఈ మ్యాచ్‌లో కూడా కివీస్ ఓడింది. సిరీస్‌కు సిద్ధమై... భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు మిచెల్ అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఈసారి తాను వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన కనబర్చడమే కాదు. టీమ్‌ను కూడా గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. భారత్ తరహాలో నెమ్మదైన పిచ్‌లు ఉండే లింకన్, మౌంట్ మాంగనీలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి చాలా మంది స్టార్ బ్యాటర్లు వాడే ఆయుధం ‘స్వీప్ షాట్’ను గంటలకొద్దీ ఆడాడు. రివర్స్ స్వీప్‌ల సాధన దీనికి అదనం. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే మరో పద్ధతి ముందుకు దూసుకొచ్చి బౌలర్ మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడటం. రాజ్‌కోట్ వన్డేలో ఇది చాలా బాగా కనిపించింది. జడేజా, కుల్దీప్లను అతను అలవోకగా ఎదుర్కోవడంతో భారత్ సమస్య పెరిగింది. కుల్దీప్ తొలి ఓవర్లోనే సిక్స్‌తో మొదలు పెట్టిన మిచెల్ ...అతని బౌలింగ్‌లో ఆడిన 32 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం విశేషం. కివీస్ ఇంత అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడం దిగ్గజం సునీల్ గావస్కర్‌ను కూడా ఆశ్చర్యపర్చింది. వన్డేల్లో కుల్దీప్ ఒక సిరీస్‌లో ఇంత చెత్త ప్రదర్శన (60.66 సగటు) తొలిసారి నమోదు చేశాడంటే అందుకు మిచెల్ కారణం. అన్ని ఫార్మాట్లలో... న్యూజిలాండ్ జట్టులో మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ఆటగాళ్లలో మిచెల్ కూడా ఒకడు. ఏడాదిన్నర క్రితం భారత్‌పై 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన టెస్టు టీమ్‌లో అతను కూడా ఉన్నాడు. అదే స్ఫూర్తితో తాము వన్డే సిరీస్ కూడా గెలవడం సంతోషానిచి్చందని మిచెల్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఆరంభంలో స్పిన్ ప్రదర్శనను అతను గుర్తు చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో పాటు జూనియర్ స్థాయిలో పెర్త్‌లో ఎక్కువగా క్రికెట్ ఆడిన మిచెల్‌కు స్పిన్ అంటే మొదటి నుంచీ సమస్యే. ఎప్పుడో 2013లో అండర్–19 జట్టు సభ్యుడిగా భారత్, శ్రీలంక పర్యటలకు వచ్చి ఘోరంగా విఫలమైన అనంతరం అతను మళ్లీ పోటీలోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. దాదాపు ఏడేళ్ల కెరీర్లో ఇప్పటికి 184 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్‌లో ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఎదిగిన మిచెల్... ఐపీఎల్లో ఒక సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు, మరో ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఆడటం మాత్రమే కాదు, భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్యలో ఆడిన అనుభవం తన ఆటను రాటుదేలి్చందని చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
భారత్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌ను రద్దు చేసుకొని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 21 నుంచి 31 వరకు భారత్‌లో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టులో ఎంపికైన నీషమ్, చివరి నిమిషంలో జాతీయ విధులను వద్దనుకొని, ఫ్రాంచైజీ లీగ్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్‌షాహీ వారియర్స్ (నీషమ్ బీపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హన్నన్ సర్కార్ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. కాగా, భారత్‌తో సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు ప్రపంచకప్‌కు ముందు రిహార్సల్‌గా భావించబడుతోంది. ఈ సిరీస్‌కు ఎంపికైన వారే దాదాపుగా ప్రపంచకప్ జట్టులోనూ ఉంటారు. నీషమ్ కూడా న్యూజిలాండ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేశ ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీషమ్‌ను ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా నీషమ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ జట్టులో లేకపోవడం న్యూజిలాండ్‌కు పెద్ద లోటుగా పరిగణించబడుతుంది. అది భారత్‌తో సిరీస్ అయినా, ప్రపంచకప్ అయినా నీషబ్ లేని లోటు న్యూజిలాండ్ జట్టులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్ 2025-26 ఎడిషన్‌లో నీషమ్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో 30 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. నీషమ్ సత్తా చాటలేకపోయినప్పటికీ అతని జట్టు రాజ్‌షాహీ వారియర్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో (10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు) నిలిచింది. రాజ్‌షాహీ వారియర్స్ జనవరి 20న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో చట్టోగ్రామ్ రాయల్స్‌తో (తొలి క్వాలిఫయర్) తలపడనుంది. ఇదిలా ఉంటే, జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జరుగనుంది. 35 ఏళ్ల నీషమ్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం తప్పక ఉండేది.భారత్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, జేడన్ లెన్నాక్స్, మైఖేల్ రే -
నితీశ్ రెడ్డి సెంచరీ.. అయ్యో పాపం!
ఐసీసీ అండర్–19 వన్డే ప్రపంచకప్‌లో సుదిని నితీశ్ రెడ్డి (133 బంతుల్లో 117 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ తెలుగు సంతతి కుర్రాడు... అండర్–19లో అమెరికా తరఫున సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జింబాబ్వేలోని బులవాయో వేదికగా వరల్డ్‌కప్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నితీశ్ సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. నితీశ్ ఒంటరి పోరాటంతో జట్టుకు మంచి స్కోరు అందించగా... శివ్ శని (33), అదిత్ (40) ఫర్వాలేదనిపించారు. అంతా మనోళ్లే అమెరికా జట్టులోని పదకొండు మంది ప్లేయర్లు భారత సంతతి ఆటగాళ్లే కాగా... కెప్టెన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ (0), సాహిల్ గార్గ్ (9), అమరిందర్ గిల్ (10), అదిత్ (6), అమోఘ్ రెడ్డి ఆరెపల్లి (0) విఫలమయ్యారు. మ్యాచ్ రద్దున్యూజిలాండ్ బౌలర్లలో ఫ్లిన్ మోరె 4, మాసన్ క్లార్క్ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు ఎంతకూ శాంతించకపోవడంతో పలుమార్లు పరిశీలించిన అనంతరం అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్ కృష్ణ స్థానంలో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలుపొందాయి. మూడో మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
సిరీస్ విజయంపై గురి
దాదాపు ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి సారి టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ అలాంటి ఘనత సాధించని కివీస్ అనూహ్యంగా భారత్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు వన్డేల్లో చరిత్ర చూస్తే భారత్‌లో న్యూజిలాండ్ ఎప్పుడూ వన్డే సిరీస్ నెగ్గలేదు. కానీ గత మ్యాచ్‌లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే అలాంటి అవకాశం ఇక్కడా కనిపిస్తోంది. గతంలో మూడు సార్లు ఆ జట్టు సిరీస్ గెలిచేందుకు చేరువగా వచ్చినా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సవాల్ మధ్య స్వదేశంలో తమ రికార్డును నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2019 మార్చి తర్వాత సొంతగడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోని రికార్డును భారత్ కొనసాగిస్తుందా లేక సంచలనం నమోదవుతుందా చూడాలి. ఇండోర్: భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. హోల్కర్ స్టేడియంలో నేడు జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేలో భారత్ ఆధిపత్యం సాగగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ అలవోక విజయాన్ని అందుకుంది. ప్రత్యరి్థతో పోలిస్తే సొంతగడ్డపై భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా...పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో ఇక్కడ అడుగు పెట్టిన కివీస్ కూడా తమ ఆటతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆఖరి ఆట ఆసక్తికరంగా సాగవచ్చు. అర్ష్ దీప్‌కు చాన్స్! భారత బ్యాటింగ్ టాప్–5 విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రోహిత్, గిల్ జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందిస్తున్నారు. అయితే రోహిత్ తన జోరును భారీ స్కోరుగా మార్చాల్సి ఉంది. గత మ్యాచ్‌లో తక్కువ పరుగులే చేసినా...కోహ్లి ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థాయిలో రాణిస్తుండగా... రాహుల్ రాజ్‌కోట్‌లో సెంచరీతో తానేమిటో చూపించాడు. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం. ఆరో స్థానంలో నితీశ్ రెడ్డిని కొనసాగిస్తారా లేక స్పిన్నర్ ఆయుశ్ బదోనికి అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా చూడాలి. నితీశ్‌ను పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా జట్టు ఉపయోగించుకోవడం లేదు. స్పిన్నర్‌గా కుల్దీప్ ప్రదర్శన కీలకం కానుంది. జడేజా బౌలింగ్ ప్రదర్శనను చూస్తూ అతని బ్యాటింగ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. సుదీర్ఘ కాలంగా అతను వన్డేల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఓవరాల్‌గా భారత్‌లోనైతే 2013 తర్వాత అతను కనీసం హాఫ్ సెంచరీ సాధించలేదు. పేసర్లుగా సిరాజ్, హర్షిత్ ఖాయం. మూడో పేసర్‌గా వైవిధ్యం కోసం ప్రసిధ్ స్థానంలో అర్ష్ దీప్‌ను ప్రయతి్నంచవచ్చు. తొలి రెండు వన్డేల్లో ప్రసిధ్ పెద్దగా ఆకట్టుకోలేదు. కుర్రాళ్లు సమష్టిగా... ‘న్యూజిలాండ్ ఇంత సులువుగా విజయం సాధించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది’...అంటూ రెండో వన్డే తర్వాత దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్య భారత్ వైఫల్యాన్ని స్పష్టంగా చూపించింది. మిచెల్, యంగ్‌లను నిలువరించడంలో మన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కాన్వే, నికోల్స్ కూడా ఓపెనర్లుగా రాణిస్తే కివీస్ కూడా మంచి స్కోరుపై దృష్టి పెట్టవచ్చు. ఫిలిప్స్‌లాంటి హిట్టర్తో పాటు మంచి బ్యాటింగ్ పదును ఉన్న కెప్టెన్ బ్రేస్‌వెల్ మిడిలార్డర్లో కీలకం కానున్నారు. పేసర్ జేమీసన్ మొదటినుంచీ భారత్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. క్లార్క్, ఫోక్స్‌లతో జట్టు బౌలింగ్ ఆధారపడి ఉంది. ఆఫ్ స్పిన్నర్‌గా బ్రేస్‌వెల్ ఉన్నాడు కాబట్టి తొలి వన్డే తరహాలోనే లెనాక్స్ స్థానంలో లెగ్‌స్పిన్నర్ ఆదిత్య అశోక్‌కు చోటు దక్కవచ్చు. ఎనిమిది మంది తొలిసారి భారత గడ్డపై ఆడుతున్న ఆటగాళ్లతో పర్యటనకు వచ్చి వన్డే సిరీస్ గెలవగలిగితే న్యూజిలాండ్‌కు ఇది పెద్ద ఘనత అవుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, అయ్యర్, రాహుల్, నితీశ్/బదోని, జడేజా, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, సిరాజ్. న్యూజిలాండ్: బ్రేస్‌వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జేమీసన్, ఫోక్స్, ఆదిత్య. -
ఫిన్ అలెన్ విధ్వంసకర శతకం.. జోష్‌లో కేకేఆర్ ఫ్యాన్స్
బిగ్‌బాష్ లీగ్ 2025-26లో పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేకేఆర్ ఆటగాడు ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఫలితంగా స్కార్చర్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్లో అలెన్‌కు ఇది ఐదో శతకం. బీబీఎల్‌లో మొదటిది. ఈ సెంచరీ స్కార్చర్స్ అభిమానులతో పాటు కేకేఆర్ ఫ్యాన్స్‌లోనూ జోష్ నింపింది. అలెన్‌కు కేకేఆర్ 2026 సీజన్ వేలంలో రూ. 2 కోట్లకు దక్కించుకుంది. రెనెగేడ్స్‌తో మ్యాచ్‌లో తొలుత నిదానంగా ఆడిన అలెన్.. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. కేవలం 17 బంతుల్లోనే రెండో అర్ద సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. గురిందర్ సంధు వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అలెన్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం మ్యాచ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది.ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అలెన్ ఊచకోత కోయడంతో స్కార్చర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్.. అలెన్ శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో అలెన్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మిచెల్ మార్ష్ 20, కూపర్ కన్నోలీ 18, ఆరోన్ హార్డీ 22, ఆస్టన్ టర్నర్ 13, లారీ ఈవాన్స్ 21, నిక్ హాబ్సన్ 3 పరుగులకు ఔటయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో సామ్ ఇలియట్ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ తడబడింది. టిమ్ సీఫర్ట్ (66), జేక్ ఫ్రేజర్ (42) మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా ఔటైపోయారు. స్కార్చర్స్ బౌలర్లు కన్నోలీ, బియర్డ్‌మన్ తలో 2, లూక్ హాల్ట్, ఆరోన్ హార్డీ చెరో వికెట్ తీసి రెనెగేడ్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. వీరి ధాటికి రెనెగేడ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. -
అందుకు మూల్యం చెల్లించుకున్నాం.. రెండో వన్డేలో ఓటమిపై గిల్ కామెంట్స్
రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్‌వెల్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్‌కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్‌ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం తమ బౌలింగ్ ప్రదర్శనపై పెదవి విరిచాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వల్ల మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. అదనంగా 15-20 పరుగులు చేసినా ఫలితం ఇలాగే ఉండేదని అభిప్రాయపడ్డాడు. బోర్డుపై మంచి స్కోర్ ఉంచినా, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే మ్యాచ్‌ను తమ చేతి నుంచి లాగేసుకుందని తెలిపాడు.మరిన్ని విషయాలు గిల్ మాటల్లో.. 10–15 ఓవర్లలో బంతి కాస్త కదిలి బౌలర్లకు సహకరించింది. కానీ 20–25 ఓవర్ల తర్వాత పిచ్ స్థిరపడింది. మధ్య ఓవర్లలో మేము మరింత ధైర్యంగా బౌలింగ్ చేసి, రిస్క్ తీసుకొని ఉండాల్సింది. అలా చేసుంటే ఫలితం వేరుగా ఉండేది.ఫీల్డింగ్ లోపాలు కూడా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి. గత మ్యాచ్‌లో కూడా కొన్ని అవకాశాలు వదిలేశాం. ఫీల్డింగ్‌లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తాం. అవకాశాలు వదిలేస్తే మాత్రం ఈ ఫార్మాట్లో ఓటమి తప్పదని గిల్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా గిల్ బౌలింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. తాజాగా న్యూజిలాండ్ రెండో వన్డే గెలిచింది. ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది. -
న్యూజిలాండ్‌తో రెండో వన్డే.. టీమిండియా బ్యాటింగ్
రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 14) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగుతుంది. తొలి వన్డే సందర్భంగా గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పు చేసింది. ఆ జట్టు తరఫున జేడన్ లెన్నాక్స్ (ఆదిత్య అశోక్ స్థానంలో) అరంగేట్రం చేయనున్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెన్నాక్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
సిరీస్ సొంతం చేసుకోవాలని...
రాజ్‌కోట్: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత క్రికెట్ జట్టు... నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతున్నా... విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ జట్టుకు కలిసి రానుంది. సిరీస్ ప్రారంభానికి ముందే రిషభ్ పంత్ గాయపడగా... తొలి మ్యాచ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్‌కు పక్కటెముకల గాయమైంది. దీంతో ఈ ఇద్దరూ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.సుందర్ స్థానంలో ఆయుశ్ బదోనీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో స్థానం కోసం అతడు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పోటీ పడాల్సి ఉంది. స్టార్ పేసర్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... గత మ్యాచ్‌లో మన పేసర్లు ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్లే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరి ఈ మ్యాచ్‌లో మన స్పిన్ బలగం ఆ లోటును పూడుస్తుందా చూడాలి. మరోవైపు తొలి వన్డేలో కొన్నిసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ దాన్ని చివరి వరకు కొనసాగించడంలో విఫలమైన న్యూజిలాండ్ జట్టు... తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పిచ్ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించనుంది. ఆ ఇద్దరే అసలు బలం... టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్ శర్మ, కోహ్లినే టీమిండియాకు ప్రధాన బలం. గత మ్యాచ్‌లో విరాట్ త్రుటిలో శతకం చేజార్చుకోగా... రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు తన షాట్లతో మెరిపించాడు. ఈ జోడీ మరోసారి చెలరేగితే... కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తొలి వన్డేలో చక్కటి ఇన్నింగ్స్‌లతో కదంతొక్కారు.టీమిండియా ఆడిన గత సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన గిల్... హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడగల శ్రేయస్ ఒక పరుగుతో అర్ధశతకానికి దూరమయ్యాడు. ఐదో స్థానంలో కుదురైన బ్యాటర్ కనిపించడం లేదు. సుందర్ స్థానంలో బదోనీ, నితీశ్‌లో ఒకరికి స్థానం దక్కుతుందా లేక ధ్రువ్ జురేల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడిస్తారా చూడాలి. హైదరాబాదీ సిరాజ్‌తో కలిసి అర్‡్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ భారాన్ని మోయనుండగా... రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. సమం చేయాలని... గత మ్యాచ్‌లో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ... ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించడంలో కివీస్ విఫలమైంది. కాన్వే, నికోల్స్ జట్టుకు శుభారంభాన్ని అందించినా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. మిచెల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, హే, బ్రేస్‌వెల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఆరున్నర అడుగుల పొడగరి జేమీసన్ సత్తా చాటుతుండగా... ఫోల్‌్క్స, క్లార్క్ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత సంతతి లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్ రెడ్డి/ఆయుశ్ బదోనీ, జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్, అర్‡్షదీప్, సిరాజ్. న్యూజిలాండ్: బ్రేస్‌వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జెమీసన్, ఫోల్‌్క్స, ఆదిత్య అశోక్.1. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది (2020లో ఆ్రస్టేలియాపై). మూడింటిలో (2013లో ఇంగ్లండ్ చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2023లో ఆస్ట్రేలియా చేతిలో) ఓడిపోయింది. -
యూకీ బాంబ్రీ జోడీ శుభారంభం
ఆక్లాండ్: కొత్త ఏడాదిలో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ తొలి విజయాన్ని అందుకున్నాడు. న్యూజిలాండ్‌లో సోమవారం మొదలైన ఏఎస్‌బీ క్లాసిక్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) జోడీ శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ యూకీ–గొరాన్సన్ ద్వయం 6–3, 6–2తో అజీత్ రాయ్ (న్యూజిలాండ్)–జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–స్వీడిష్ జోడీ మూడు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తొలి సరీ్వస్‌లో 32 పాయింట్లకుగాను 27 పాయింట్లు... రెండో సరీ్వస్‌లో 16 పాయింట్లకుగాను 8 పాయింట్లు స్కోరు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. యూకీ–గొరాన్సన్ ద్వయం బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నతో కొత్త సీజన్‌ను ప్రారంభించింది. ఆ టోరీ్నలో తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ఈ జంట 5–7, 4–6తో ఒర్లాండో లుజ్–మటోస్ (బ్రెజిల్) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
ప్రపంచ నంబర్ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం: న్యూజిలాండ్ కెప్టెన్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా టీమిండియాతో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ సిరీస్‌కు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా, తొలి మ్యాచ్‌లోనే అద్భుతం చేసింది. ఫీల్డింగ్ మినహా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియాను భయపెట్టింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసి, ఆతర్వాత బౌలింగ్‌లో అద్వితియమైన పోరాటపటిమ కనబర్చింది. సునాయాసంగా గెలుపు దిశగా సాగుతున్న భారత జట్టుకు ఓ దశలో గెలుపు భయం చూపించింది. బౌలింగ్ విభాగంలో ఏకైక అనుభవజ్ఞుడు కైల్ జేమీసన్తో భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చింది.మ్యాచ్ అనంతరం కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. 4 వికెట్లు తీసి టీమిండియాను ఇబ్బంది పెట్టిన జేమీసన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌కు జీవం పోసిన డారిల్ మిచెల్‌ను కొనియాడాడు. తమ జట్టు పోరాటపటిమను ఆకాశానికెత్తాడు.బ్రేస్‌వెల్ మాటల్లో.. ఓడినా, గర్వంగా ఉంది. ప్రపంచ నంబర్ 1 జట్టును ఒత్తిడిలోకి నెట్టాం. మరో 20-30 పరుగులు చేసుంటే ఫలితం వేరేలా ఉండేది. గాయం నుంచి తిరిగొచ్చిన జేమీసన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బ్యాటర్లు.. ముఖ్యంగా డారిల్ మిచెల్ తన అనుభవాన్నంతా రంగరించి మంచి స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. అయినా మరో 20-30 పరుగులు చేసుండాల్సింది. మ్యాచ్ గతి మార్చే క్షణాలను సృష్టించుకోవడం గురించి మేమెప్పుడూ మాట్లాడుకుంటాం. ఈ రోజు కొన్ని విషయాల్లో బాగా పని చేశాం. కొన్ని కీలక అవకాశాలు కోల్పోయాం. భారత్‌లో లైట్ల వెలుతురులో ఆడటం సులభం కాదని మరోసారి నిరూపితమైంది. ఓడినా మా జట్టు ఎల్లప్పుడూ ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు కృషి చేస్తుంది. బ్రేస్‌వెల్ చేసిన ఈ వ్యాఖ్యలు వారి జట్టు పోరాట స్పూర్తిని సూచిస్తున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.అనంతరం విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), ఆఖర్లో ఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) రాణించడంతో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
Ind vs NZ 1st ODI: 27 ఏళ్ల రికార్డు బద్దలు
వడోదర వేదికగా భారత్‌తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డెవాన్ కాన్వే (56) చెలరేగిపోయారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 27 ఏళ్ల కిందటి రికార్డు బద్దలు కొట్టారు. భారత్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ల అత్యధిక భాగస్వామ్యం విభాగంలో నికోల్స్-కాన్వే తాజా భాగస్వామ్యం రెండో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు నాథన్ ఆస్టల్-క్రెయిగ్ స్పియర్‌మన్ పేరిట ఉండేది. 1999లో రాజ్‌కోట్‌లో ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ భారత్‌పై 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ విభాగంలో టాప్ ప్లేస్‌లో ఆండ్రూ జోన్స్-జాన్ రైట్ జోడీ ఉంది. 1988లో ఈ కివీ ఓపెనింగ్ పెయిర్ ఇదే వడోదరలో తొలి వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ 43.3 ఓవర్ల అనంతరం 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి శుభారంభం అందించినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో కివీస్ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా ఉంది. డారిల్ మిచెల్ (56 నాటౌట్) గౌరవప్రదమైన స్కోర్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా క్రిస్టియన్ క్లార్క్ (1) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్ తలో 2.. ప్రసిద్ద్, కుల్దీప్ చెరో వికెట్ తీసి న్యూజిలాండ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (12), గ్లెన్ ఫిలిప్ (12), మిచెల్ హే (18), కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ (16) మంచి ఆరంభాలు లభించినా, పెద్ద స్కోర్లుగా మలచలేకపోయారు. జకరీ ఫౌల్క్స్ 1 పరుగుకే ఔటయ్యాడు.కాగా, న్యూజిలాండ్ జట్టు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ తొలి వన్డే జరుగుతుంది.తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
టీమిండియాతో తొలి వన్డే.. న్యూజిలాండ్ జట్టులో భారత మూలాలున్న ఆటగాడు
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్, జడేజా, కుల్దీప్.. పేసర్లుగా సిరాజ్, ప్రసిద్ద్, హర్షిత్ బరిలో దిగుతున్నారు.న్యూజిలాండ్ తరఫున క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్రధాన బౌలర్‌గా బరిలో దిగనున్నాడు. అశోక్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్. గూగ్లీలు వేయడంలో దిట్ట.ఎవరీ ఆదిత్య అశోక్..?ఆదిత్య అశోక్ తమిళనాడులోని వేలూర్‌లో 2002 సెప్టెంబర్ 5న జన్మించాడు. అతనికి నాలుగేళ్ల వయసు ఉండగా అతని న్యూజిలాండ్‌కు వలస వెళ్లి ఆక్లాండ్‌లో స్థిరపడింది. అశోక్ ఆక్లాండ్‌లోని మౌంట్ ఆల్బర్ట్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు.అశోక్ 2020 అండర్-19 వరల్డ్ కప్‌తో న్యూజిలాండ్ తరఫున జూనియర్ విభాగంలో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్లో ఆక్లాండ్ తరఫున మెరిసాడు. - 2021 డిసెంబర్లో Super Smash టోర్నీతో టీ20 అరంగేట్రం చేశాడు. - 2022 జనవరిలో Ford Trophyతో లిస్ట్ A అరంగేట్రం చేశాడు. - 2022–23 Plunket Shieldతో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు. అశోక్‌కు న్యూజిలాండ్ సీనియర్ జట్టు నుంచి 2023 మార్చిలో తొలిసారి పిలుపు వచ్చింది. తొలుత అతను ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2023 ఆగస్టులో UAEపై అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. 2023 డిసెంబర్లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. అశోక్ న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు 2 వన్డేలు, ఓ టీ20 మాత్రమే ఆడాడు. అతన్ని న్యూజిలాండ్ స్పిన్ భవిష్యత్తుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇప్పటివరకు భారత మూలాలున్న చాలామంది క్రికెటర్లు న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరిలో టామ్ పునా ప్రథముడు కాగా.. దీపక్ పటేల్, జీత్ రావల్, ఐష్ సోధి, ఎజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర వంటి వారు బాగా పాపులయ్యారు. తాజాగా ఆదిత్య అశోక్ కూడా వీరి బాటలోనే పయనించేందుకు కృషి చేస్తున్నాడు. -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. వడోదర వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ ప్రయోగం చేస్తుంది. రొటీన్‌కు భిన్నంగా ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్లుగా సుందర్, జడేజా, కుల్దీప్.. పేసర్లుగా సిరాజ్, ప్రసిద్ద్, హర్షిత్ బరిలో దిగుతున్నారు. న్యూజిలాండ్ తరఫున క్రిస్టియన్ క్లార్క్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. భారత మూలాలున్న ఆదిత్య అశోక్ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్రధాన స్పిన్నర్‌గా బరిలో దిగనున్నాడు. అశోక్ కుటుంబం అతని చిన్నప్పుడే తమిళనాడులోని వేలూర్ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడింది. తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
ఇవాల్టి నుంచి భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్
స్వదేశంలో ఇవాల్టి నుంచి (జనవరి 11) భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వడోదర వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం. భారత్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 17 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ 6, భారత్ 9 సిరీస్‌ల్లో విజయాలు సాధించాయి. 2 సిరీస్‌లు డ్రా అయ్యాయి.వీటిలో భారత్‌లో జరిగిన సిరీస్‌లను ప్రత్యేకంగా తీసుకుంటే.. భారత్ ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఏడు వన్డే సిరీస్‌లు అడగా ఒక్కదాంట్లో కూడా ఓడిపోలేదు. ఏడు సిరీస్‌ల్లోనూ జయకేతనం ఎగురవేసి, స్వదేశంలో తిరుగులేని రికార్డు కలిగి ఉంది. చివరి సారిగా (2022-23) స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టీమిండియా 3-0తో కివీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.భారత్-న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లు..న్యూజిలాండ్‌లో జరిగినవి.. 1975/76- 2-0 (న్యూజిలాండ్)1980-81- 2-0 (న్యూజిలాండ్)1993-94- 2-2 (డ్రా)1998-99- 2-2 (డ్రా)2002-03- 5-2 (న్యూజిలాండ్)2008-09- 3-1 (5) (భారత్)2013-14- 4-0 (5) (న్యూజిలాండ్)2018-19- 4-1 (భారత్)2019-20- 3-0 (న్యూజిలాండ్)2022-23- 1-0 (3) (న్యూజిలాండ్)భారత్‌లో జరిగిన సిరీస్‌లు..1988/89- 4-01995-96- 3-21999-00- 3-22010-11- 5-02016-17- 3-22017-18- 2-12022-23- 3-0* అన్నింటిలో భారత్‌దే విజయంహెడ్ టు హెడ్ రికార్డులుభారత్-న్యూజిలాండ్ ఇప్పటివరకు 120 వన్డేల్లో ఎదురెదురుపడ్డాయి. ఇందులో భారత్ 62, న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. 7 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఓ మ్యాచ్ టై అయ్యింది. వీటిలో భారత్ స్వదేశంలో గెలిచిన మ్యాచ్‌లు 31 కాగా.. న్యూజిలాండ్ వారి స్వదేశంలో గెలిచిన మ్యాచ్‌లు 26.చివరిగా తలపడిన మ్యాచ్‌లోనూ పరాభవమేభారత్-న్యూజిలాండ్ చివరిగా వన్డే ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్) భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు..డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జాకరీ ఫౌల్క్స్, నిక్ కెల్లీ, జోష్ క్లార్క్సన్, మైఖేల్ రే, కైల్ జేమీసన్, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెనాక్స్ -
భారత్ X న్యూజిలాండ్
వడోదర: అంతర్జాతీయ క్రికెట్లో ఒక వైపు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సాగుతుండగా...మరో వైపు కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం వన్డే సిరీస్‌లకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేదు. కానీ కేవలం ఇద్దరు బ్యాటర్లు భారత వన్డే మ్యాచ్‌లను ఆసక్తికరంగా మారుస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇటీవలి ప్రదర్శన అభిమానులకు ఆనందం పంచింది. ఆ్రస్టేలియాలో రోహిత్ చెలరేగిపోగా, దక్షిణాఫ్రికాపై కోహ్లి సత్తా చాటాడు. కెపె్టన్‌గా శుబ్‌మన్ గిల్ మళ్లీ వన్డే సిరీస్‌లో జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచి టీమిండియా ఫామ్‌లో ఉండగా... న్యూజిలాండ్ టీమ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. కొటాంబి స్టేడియంలో ఇదే తొలి పురుషుల క్రికెట్ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ మైదానంలో రెండు మహిళల వన్డేలు జరగ్గా, రెండు సార్లూ పేస్ బౌలింగ్‌కు పిచ్ అనుకూలించింది. ఈ సారి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమంగా అనుకూలించే చక్కటి పిచ్ కనిపిస్తోంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. అయ్యర్ పునరాగమనం... దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు గాయంతో దూరమైన గిల్ మళ్లీ సారథిగా బరిలోకి దిగుతుండటంతో జైస్వాల్‌కు తుది జట్టులో చోటు లేదు. ఆ్రస్టేలియా గడ్డపై ఫీల్డింగ్‌లో గాయపడి కోలుకున్న అనంతరం శ్రేయస్ అయ్యర్ ఇప్పుడే మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక విజయ్ హజారే టోర్నీలో రెండేసి వన్డేలు ఆడిన కోహ్లి, రోహిత్ దూకుడు మీదున్నారు. మరో సారి సిరీస్‌కు వీరిద్దరే ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఆల్రౌండర్లుగా జడేజా, సుందర్ ఖాయం కాగా...ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్‌దే బాధ్యత. రాహుల్ కీపర్‌గా ఉంటాడు కాబట్టి మరోసారి పంత్‌కు నిరాశే. సిరాజ్ జట్టులోకి రావడంతో ప్రసిధ్ స్థానంలో అతను ఆడటం లాంఛనమే. మొత్తంగా ఎప్పటిలాగే మన జట్టు అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. అనుభవలేమితో... న్యూజిలాండ్ జట్టులోని 15 మంది సభ్యుల బృందంలో 8 మంది ఇప్పటి వరకు భారత గడ్డపై ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు! ఇద్దరు అసలు అంతర్జాతీయ మ్యాచ్‌లే ఆడలేదు. ఒకరు కేవలం టి20ల్లోనే ఆడగా, ఐదుగురు పది లోపు వన్డేలే ఆడారు. వేర్వేరు కారణాలతో అనుభవజు్ఞలైన శాంట్నర్, హెన్రీ, చాప్మన్, రూరీ్క, లాథమ్, విలియమ్సన్ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి టీమ్ భారత్‌కు ఏమాత్రం పోటీనిస్తుందనేది సందేహమే. టీమ్ కెపె్టన్‌గా ఉన్న బ్రేస్‌వెల్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో 350 పరుగుల ఛేదనలో 78 బంతుల్లో 140 పరుగులు చేసి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. నాటి ఇన్నింగ్స్నుంచి అతనితో పాటు జట్టు ఏమైనా స్ఫూర్తి పొందుతుందేమో చూడాలి. 2024లో టెస్టుల్లో భారత్ కోట బద్దలు కొట్టిన న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఇక్కడ వన్డే సిరీస్ గెలవలేదు. నాకు ఏం రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. నేను ప్రస్తుతం ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా. నేను వర్తమానంలో జీవించేవాడిని. అప్పుడు అంతా బాగానే అనిపిస్తుంది. ఏ ఆటగాడైనా దేశం తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే భావిస్తాడు. సెలక్టర్లు వారి నిర్ణయం వారు తీసుకున్నారు.టి20 వరల్డ్ కప్‌లో చోటు కోల్పోవడంపై గిల్ వ్యాఖ్య -
ప్రాక్టీస్‌లో టీమిండియా
వడోదర: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్లో కోహ్లి, రోహిత్ మంచి టచ్‌లో కనిపించారు. నెట్స్‌లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులను ప్రాక్టీస్ చేశారు. టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఫామ్ చాటుకున్నారు. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ కూడా నెట్స్‌లో చమటోడ్చాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. -
టీ20 ప్రపంచకప్ 2026కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 7) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. ఉపఖండపు పరిస్థితుల దృష్ట్యా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు స్పిన్ హెవీ టీమ్‌ను ఎంపిక చేసింది. జట్టులో నలుగురు స్పిన్నర్లకు (సాంట్నర్, బ్రేస్‌వెల్, ఫిలిప్స్, రచిన్) అవకాశం కల్పించింది.ఆర్సీబీ స్టార్ బౌలర్, గతేడాది లీడింగ్ వికెట్ టేకర్ జేకబ్ డఫీ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కైల్ జేమీసన్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ పితృత్వ సెలవుల కారణంగా కొన్ని మ్యాచ్‌లు మిస్ అవుతారు. వీరిద్దరు గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.ఈ జట్టుకు ఎంపికైన మరో ముగ్గురు (ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, సాంట్నర్) కూడా గాయాల నుంచి కోలుకునే క్రమంలో ఉన్నారు. కాగా, ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ గ్రూప్-డిలో ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది.దీనికి ముందు న్యూజిలాండ్ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌ల్లో భాగంగా జనవరి 11 నుంచి మూడు వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే వడోదరలో.. రెండో వన్డే రాజ్‌కోట్‌లో (జనవరి 14), మూడో వన్డే ఇండోర్‌లో (జనవరి 18) జరుగనున్నాయి. అనంతరం జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్, రాయ్‌పూర్, గౌహతి, వైజాగ్, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో నలుగురిని మార్చి ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసింది.టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు- మిచెల్ సాంట్నర్ (కెప్టెన్) - ఫిన్ అలెన్ - మైఖేల్ బ్రేస్‌వెల్ - మార్క్ చాప్మన్ - డెవాన్ కాన్వే - జేకబ్ డఫీ - లాకీ ఫెర్గుసన్ - మ్యాట్ హెన్రీ - డారిల్ మిచెల్ - ఆడమ్ మిల్నే - జేమ్స్ నీషమ్ - గ్లెన్ ఫిలిప్స్ - చిన్ రవీంద్ర - టిమ్ సీఫర్ట్ - ఇష్ సోధీ ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ జేమిసన్ -
న్యూజీలాండ్ తో వన్డేలకు నేడు భారత్ జట్టు ఎంపిక
-
న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెబుతూ..
సంవత్సరపు చివరి క్షణాలు మనసులో జ్ఞాపకాల ముత్యాలు చల్లుతూ.. కొత్త ఆశలతో నిండిన ఉదయం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. పాతది మసకబారుతుంటే, కొత్తది వెలుగులు విరజిమ్ముతోంది. న్యూ ఇయర్‌కు కొత్త ఉదయం తలుపులు తడుతుంటే.. ఇప్పటి వరకూ మనం ఆస్వాదించిన ఇయర్-2025 ముగింపునకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి. అలాగే న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో కొత్త ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడి జనవరి 1 వచ్చేసింది కాబట్టి వారు కొత్త సంవత్సరం వేడుకల్లోకి ప్రవేశించారు.కిరిబాటి.. చిన్న ద్వీప దేశంభూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉంది. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్‌లో డిసెంబర్ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్‌కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.భారత్‌లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..కిరిబాటి(8.30 am on Jan 1)సమోవా, టోంగా((7.30 am on Jan 1)న్యూజిలాండ్((7.30 am on January 1)రష్యా, ఫిజి((6.30 am on January 1)ఆస్ట్రేలియా((5.30 am on January 1)పాపువా న్యూగినియా((4.30 am on January 1)ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)చైనా, మలేషియా, సింగపూర్(2.30 am on January 1)వియాత్నాం, థాయ్‌లాండ్( 1.30 am on January 1)మయన్మార్(1 am on January 1)బంగ్లాదేశ్, కజికిస్తాన్, భూటాన్( 12.30 am on January 1)నేపాల్(12.15 am on January 1)Kiribati Island First to celebrate the New Year 2026 #Happynewyear #2026 Celebration to Kiribati as other countries in the world catches up to celebrate The New Year 🎊 🎊🕺💃I TOLD THEMMan U Academy Verse of the day DO NOT#FundsRecovery pic.twitter.com/QQ4Y18av3s— Brass ENt ✴️🔸🔶 (@jakeOttario) December 31, 2025 It's offically 2026 in Auckland, New Zealand pic.twitter.com/uADbsKxZeu— Maurice (@maurice_lippy) December 31, 2025 -
న్యూజిలాండ్ ఎఫ్టీఏతో ఎగుమతులకు దన్ను
భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఎగుమతుల మార్కెట్లపరంగా వైవిధ్యం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే వ్యవసాయం తదితర రంగాల్లో పెట్టుబడులు పెరిగేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. ఎఫ్‌టీఏపై డిసెంబర్ 22న చర్చలు ముగియగా, వచ్చే ఏడాదిలో ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. దీని ప్రకారం భారత్‌లోకి న్యూజిలాండ్ నుంచి వచ్చే 15 ఏళ్లలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానుండగా, ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వచ్చే అయిదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ఈ ఒప్పందంతో రెడీమేడ్ దుస్తులు, ఫ్యాషన్ దుస్తులు మొదలైన వాటి ఎగుమతులు పెరిగేందుకు మరింతగా ఊతం లభిస్తుందని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ తెలిపారు. భారత్ నుంచి అన్ని ఎగుమతులపై టారిఫ్‌లను తొలగించడం వల్ల న్యూజిలాండ్ మార్కెట్లో మిగతా ఉత్పత్తులతో దీటుగా మన ఉత్పత్తులు పోటీపడేందుకు వీలవుతుందని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. ఇక వ్యవసాయం, డెయిరీ, మౌలిక సదుపాయాల రంగాల్లో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుండటం దేశీయంగా సాగు రంగం ఉత్పాదకత పెరగడానికి తోడ్పడుతుందని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు, హై–టెక్ గేర్స్ చైర్మన్ దీప్ కపూరియా చెప్పారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాలు పూర్తి స్థాయిలో బలోపేతం కావడానికి ఎఫ్‌టీఏ దోహదపడుతుందని జీటీఆర్ఐ పేర్కొంది.ఇదీ చదవండి: జీమెయిల్ ఐడీని మార్చుకోవచ్చు -
రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెటర్ బ్రేస్‌వెల్
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డౌగ్ బ్రేస్‌వెల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 18 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌కు ముగింపు పలుకుతన్నట్లు స్పష్టం చేశాడు. 35 ఏళ్ల బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 2011-23 మధ్యలో 28 టెస్ట్‌లు, 21 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. కుడి చేతి వాటం బ్యాటర్, మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన బ్రేస్‌వెల్ బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో మెరుగ్గా రాణించాడు. టెస్ట్‌ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 26, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో బ్రేస్‌వెల్ ఒకే ఒక హాఫ్ సెంచరీ (వన్డేల్లో) చేశాడు.2008లో అండర్-19 విభాగం నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రేస్‌వెల్.. అన్ని విభాగాల్లో ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రేస్‌వెల్ ఐపీఎల్‌లోనూ ఆడాడు. 2012 డ్రాఫ్ట్‌లో అతన్ని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్ కెరీర్ మొత్తంలో ఒకే ఒక మ్యాచ్ ఆడిన బ్రేస్‌వెల్ 3 వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినా అతనికి ఎందుకో అవకాశాలు రాలేదు.డౌగ్ బ్రేస్‌వెల్ కుటుంబంలో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. అతని తండ్రి (బ్రెండన్ బ్రేస్‌వెల్), అంకుల్ (జాన్ బ్రేస్‌వెల్) కూడా న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం డౌగ్ బ్రేస్‌వెల్ కజిన్స్ మైఖేల్ బ్రేస్‌వెల్, మెలానీ బ్రేస్‌వెల్ న్యూజిలాండ్ సీనియర్ పురుష, మహిళల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.డౌగ్ బ్రేస్‌వెల్ కెరీర్లో గుర్తుండిపోయే ఘట్టం: 2011లో హోబార్ట్‌లో ఆస్ట్రేలియాపై టెస్టులో ఆరు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగా ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏడు పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. చదవండి: పొట్టి క్రికెట్లో పెను సంచలనం -
ఆస్ట్రేలియా బ్యాటర్ విధ్వంసం.. టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ!
మహిళల టీ20 క్రికెట్లో మరో వేగవంతమైన అర్ధసెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన లౌరా హారిస్ న్యూజిలాండ్‌లో జరుగుతున్న టి20 లీగ్‌లో ఈ ఘనత సాధించింది. కేవలం 15 బంతుల్లో ఆమె ఫిఫ్టీ బాదింది. కివీస్ లీగ్ టోర్నీ ఉమెన్ సూపర్ స్మాష్ (డబ్ల్యూఎస్ఎస్)లో ఒటాగో జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఆదివారం కాంటర్‌బరీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగింది.అలెగ్జాండ్రాలోని మోలినెక్స్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లౌరా (15 బంతుల్లో 52; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) దంచేసింది. తద్వారా 2022లో వారి్వక్షైర్ తరఫున మేరి కెల్లీ చేసిన (15 బంతుల్లో ఫిఫ్టీ) రికార్డును సమం చేసింది. లౌరా వీరబాదుడుతో 146 పరుగుల లక్ష్యాన్ని 15వ ఓవర్లోనే ఛేదించిన ఒటాగో ఈ మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో గెలిచింది.ఈ సీజన్ మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో నిరాశపరిచిన లౌరా.. న్యూజిలాండ్‌లో మెరుపులు మెరిపించింది. అయితే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఆమెకిదే మొదటిది కాదు. ఓవరాల్ టి20 లీగ్‌లలోనే ఆరుసార్లు 50 పైచిలుకు (ఫిఫ్టీలు) పరుగులు చకచకా చేసిన ఘనత ఆమెకు ఒక్కరికే దక్కుతుంది.మూడుసార్లు 18 బంతుల్లో, ఒకసారి 19 బంతుల్లో, ఇంకోసారి 17 బంతుల్లో, ఇప్పుడేమో 15 బంతుల్లో ధనాధన్ అర్ధశతకాల్ని బాదింది. ప్రత్యేకించి మహిళల టి20 క్రికెట్, లీగ్‌లలో ఆమె తప్ప ఇంకెవరూ ఒకసారి మించి వేగవంతమైన అర్ధసెంచరీల్ని బాదలేకపోయారు. చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ ప్రధాని ‘ముందడుగు’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో న్యూజిలాండ్ మద్దతుతో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. సుదీర్ఘ చర్చల అనంతరం న్యూజిలాండ్‌తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వ విజయమని, భవిష్యత్ అభివృద్ధికి ఇది పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ ఒప్పందంపై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రధాని లక్సన్ భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.‘హిందుస్థాన్ టైమ్స్’ తెలిపిన వివరాల ఈ ఒప్పందం కేవలం రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలను మరింతగా పెంపొందించనుంది. భారత్‌లోని 140 కోట్ల మంది వినియోగదారుల మార్కెట్‌ను న్యూజిలాండ్‌కు చేరువ చేయనుంది. ప్రధాని మోదీ- లక్సన్ మధ్య జరిగిన చర్చల సారాంశం ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావడమే కాకుండా, వచ్చే 15 ఏళ్లలో భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడనుంది. భారత్ నుండి ఔషధ ఉత్పత్తులు, న్యూజిలాండ్ నుండి అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రధానంగా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఇరు దేశాలు భావిస్తున్నాయి.కాగా న్యూజిలాండ్ అధికార సంకీర్ణ ప్రభుత్వంలో ఈ భారత్‌తో ఒప్పందం చిచ్చు రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ ఈ డీల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది అశాస్త్రీయమైనదని విమర్శించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ పాడి పరిశ్రమ (డైరీ సెక్టార్) ప్రయోజనాలను ఈ ఒప్పందంలో తాకట్టు పెట్టారన్నారు. పాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించలేదని పీటర్స్ ఆరోపిస్తున్నారు. అలాగే భారతీయులకు ఉపాధి వీసాల విషయంలో సులభతర నిబంధనలు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీని కారణంగా స్థానిక న్యూజిలాండ్ ప్రజల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై తమ దేశంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని లక్సన్ దీని అమలుకు మొగ్గుచూపారు. కాగా 2024 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం 2.07 బిలియన్ డాలర్లుగా ఉండగా, అందులో భారత్ ఎగుమతులే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో భారత్‌కు న్యూజిలాండ్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.ఇది కూడా చదవండి: Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు.. -
విలియమ్సన్ లేకుండానే...
వెల్లింగ్టన్: విదేశీ లీగ్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్... భారత్‌తో వన్డేసిరీస్‌కు దూరమయ్యాడు. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించనున్న న్యూజిలాండ్ జట్టు.. ఈ టూర్లో భాగంగా మూడు వన్డేలు, 5 టి20లు ఆడనుంది. దీని కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. దక్షిణాఫ్రికా (ఎస్ఏ)20 లీగ్‌లో ఆడేందుకు గానూ విలియమ్సన్ ఈ సిరీస్‌కు దూరం కాగా... యువ ఆటగాళ్లకు న్యూజిలాండ్ బోర్డు పెద్దపీట వేసింది. వన్డేల్లో మైకేల్ బ్రేస్‌వెల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. పేసర్ కైల్ జేమీసన్ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఎడంచేతి వాటం స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన సాంట్నర్ టి20ల్లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రిస్టియన్ క్లార్క్, ఆదిత్య అశోక్, జోష్ క్లార్క్సన్, నిక్ కెల్లీ, మిచెల్ రే వంటి పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది. జేడెన్ లెనాక్స్పై ఆ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ‘న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు తరఫున లెనాక్స్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దానివల్లే అతడికి ఈ అవకాశం దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో గత కొన్నాళ్లుగా అతడు నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. దేశవాళీల్లో కనబర్చిన దూకుడే... అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిస్తాడనే నమ్మకముంది’ అని న్యూజిలాండ్ కోచ్ రోబ్ వాల్టర్ అన్నాడు. త్వరలో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న టామ్ లాథమ్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన బెవాన్ జాక్స్, టిమ్ రాబిన్సన్ టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి కూడా జట్టుకు ఎంపికయ్యారు. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నెర్, మార్క్ చాప్‌మన్‌లను వన్డే జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టులో మాత్రం చాప్‌మన్‌కు చోటు దక్కింది. న్యూజిలాండ్ వన్డే జట్టు: బ్రేస్‌వెల్ (కెప్టెన్ ), ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రే, విల్ యంగ్. న్యూజిలాండ్ టి20 జట్టు: సాంట్నర్ (కెప్టెన్), బ్రేస్‌వెల్, చాప్మన్, కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, హెన్రీ, జేమీసన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి. -
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెల్లింగ్టన్: తమ నుంచి తమ ఐదేళ్ల కుమారుడిని దూరం చేయొద్దని న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని ఓ భారతీయ కుటుంబం అభ్యర్థిస్తోంది. ‘ మా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కానీ అతన్ని మా నుంచి దూరం చేస్తే మా కుటుంబం చిద్రమవుతుంది’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి వీసా విషయంలో ప్రభుత్వం మానవతా దృష్టితో చూడాలని వారు కోరుతున్నారు.న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. భారత్‌కు చెందిన నితిన్ మాంకీల్, ఆయన భార్య అపర్ణ జయంధన్ గీత ఆక్లాండ్‌లో నివసిస్తున్నారు. ఇద్దరు వైద్య రంగంలో విధులు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు ఐదేళ్ల ఐదన్ నితిన్ (Aidhan Nithin). ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అతనికి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే అతన్ని భారత్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే ఐధాన్ వీసా విషయంపై న్యూజిలాండ్ అసోసియేట్ ఇమ్మిగ్రేషన్ మంత్రి హాన్ క్రిస్ పెంక్కు రెండుసార్లు అప్పీలు చేశారు. కానీ ప్రభుత్వం వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐధాన్ ఆరోగ్య పరిస్థితి దేశంలోని ఆరోగ్య, విద్యా సేవలపై అధిక భారం అవుతుందని అధికారులు భావించారు. తల్లిదండ్రులకు పర్మినెంట్ రెసిడెన్సీ ఉన్నప్పటికీ బాలుడికి వీసాను తిరస్కరించింది. వీసా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదన్ నితిన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థిక సహాయం కోరడం లేదని, ఆటిజం సమస్యతో బాధపడుతున్న తమ కుమారుడి పట్ల మానవతా కోణంలో వీసా మంజూరు చేయాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.ఈ ఘటన న్యూజిలాండ్‌లో వలస విధానాలపై మానవతా కోణం ఎంత ముఖ్యమో మరోసారి బయటపెట్టింది. ఆటిజం బాధిత బాలుడిని డిపోర్ట్ చేయాలన్న నిర్ణయం స్థానికులు, భారతీయ వలసదారులు, మానవ హక్కుల సంఘాలను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు న్యూజిలాండ్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది. -
న్యూజిలాండ్‌తో ఎఫ్‌టీఏ
ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ) యుగం. మన దేశం ఈ ఏడాది ఇంతవరకూ బ్రిటన్, ఒమన్ దేశాలతో ఎఫ్‌టీఏలపై సంతకం చేసింది. తాజాగా న్యూజిలాండ్‌తో ఎఫ్‌టీఏపై అవగాహన కుదిరింది. మరో మూడు నెలల్లో సంతకాలు కాబోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వాణిజ్య, వాణిజ్యేతర కారణాలతో మన దేశంపై ఎడాపెడా సుంకాలు విధించి తన షరతులకు తలొగ్గటమో, ఆర్థికంగా నష్టపోవటమో తేల్చుకోమని సవాలు విసురుతున్నారు. ఆ నష్టాలను వీలైనంత తగ్గించుకోవటానికి ప్రత్యామ్నాయాలు వెదుక్కునే క్రమంలోనే మన దేశం వివిధ దేశాలతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. సరుకులు, సేవల్లో ఇరు దేశాల మధ్యా 130 కోట్ల డాలర్ల విలువైన వర్తమాన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాగల అయిదేళ్లలో 500 కోట్ల డాలర్లకు తీసుకెళ్లటం, వచ్చే పదిహేనేళ్లలో భిన్న రంగాల్లో న్యూజిలాండ్ 2,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడం భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ సారాంశం. దీని ప్రకారం మన సరుకులన్నిటిపైనా దాదాపు సుంకాలు విధించకుండా ఉండేందుకు న్యూజిలాండ్ అంగీ కరిస్తే, అక్కడినుంచి యాపిల్స్, కివీ పండ్లు, చెర్రీలు, నూలు ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు మన దేశం సుముఖత వ్యక్తం చేసింది. కార్మికుల అవసరం ఎక్కువున్న జౌళి, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్, మెరైన్, హస్త కళలు వగైరా ఉత్పత్తులకు న్యూజిలాండ్ తక్కువ సుంకాలు విధిస్తుంది. కొన్నింటి విషయంలో అసలు సుంకాలే ఉండవు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) పట్టభద్రులకు న్యూజిలాండ్‌లో ఉద్యోగావకాశాలుంటాయి. అక్కడి వర్సిటీల్లో చదువుకొనేందుకూ, పరిశోధనలు సాగించేందుకూ మన విద్యార్థులకు వీలుంటుంది. మరో విశేషమేమంటే మన తరఫున ఈ ఒప్పందం సాకారానికి కృషి చేసింది మొత్తంగా మహిళా అధికారుల బృందమే.ఎఫ్‌టీఏలపై ఆరోపణలూ, విమర్శలూ కూడా లేకపోలేదు. ఆహారం, ఆరోగ్యం, కార్మిక వర్గం, పర్యావరణం తదితర అంశాలపై ఇవి తీవ్రంగా ప్రభావం చూపే అవకాశమున్నా అధిక శాతం ఎఫ్‌టీఏల చుట్టూ గోప్యత అలుముకుని ఉంటుందనీ, ఆచరణ మొదలయ్యాకే వాటి అసలు పర్యవసానాలేమిటో ప్రజలకు తెలుస్తుందనీ సామాజిక కార్యకర్తల ఆరోపణ. తొలి ఆధునిక సమగ్ర ఎఫ్‌టీఏ ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్తా) 1994లో కుదరగా, మన దేశం తొలిసారి 1999లో శ్రీలంకతో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంది. అటుతర్వాత జపాన్, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్ వగైరాలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. వర్తమాన యుగంలో ఏ దేశమూ ఒంటరిగా మనుగడ సాగించలేదు. ఆత్మ నిర్భర భారత్, మేకిన్ ఇండియా వంటివి స్వావలంబనకు కొంతమేర తోడ్పడవచ్చుగానీ, వాటినే సర్వస్వంగా భావించటం సాధ్యం కాదు. చిత్రమేమంటే భారత్–న్యూజిలాండ్ ఎఫ్‌టీఏపై సామాజిక రంగాల కార్యకర్తలకన్నా ముందు న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ చిర్రుబుర్రులాడుతున్నారు. న్యూజిలాండ్ డెయిరీ ఉత్పత్తులకు మన మార్కెట్‌ను బార్లా తెరవకపోవటం ఆయనగారికున్న అభ్యంతరం. పార్లమెంటులో ధ్రువీకరణకొచ్చినప్పుడు ఒప్పందాన్ని ప్రతిఘటిస్తామని కూడా ప్రకటించారు. న్యూజిలాండ్ అధికార కూటమి ప్రభుత్వంలో ఆయన పార్టీ భాగస్వామి. ఈ ఏడాది ఇంతవరకూ 2,400 కోట్ల డాలర్ల డెయిరీ ఉత్పత్తులు పాలు, వెన్న, జున్ను వగైరాలు తాము ఎగుమతి చేయగా, ఒక్క భారత్ మాత్రమే అందుకు సమ్మతించటం లేదన్నది ఆయన అభ్యంతరం. అయితే కుదరబోయే ఈ ఒప్పందం ఒక వెసులుబాటునిస్తోంది. ముడి పదార్థాలు తీసుకొచ్చి ఉత్పత్తులు చేసి వంద శాతం ఎగుమతులు చేసుకునేందుకు న్యూజిలాండ్‌కు అవకాశం ఉంటుంది. డెయిరీ, సాగు ఉత్పత్తులకు అనుమతులిస్తే మన సాగు, పాడి రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలోనే అమెరికా ప్రధానంగా పట్టుబడుతోంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో కుదిరిన అవగాహన చూశాక ట్రంప్ ఏమంటారో చూడాలి. మొత్తానికి మన ప్రయోజనాలు దెబ్బతినకుండా, లబ్ధి చేకూరేలా కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా స్వాగతించదగిందే! -
న్యూజిలాండ్ భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు స్థాయికి చేర్చే లక్ష్యంతో భారత్, న్యూజిలాండ్ చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారుచేసుకున్నాయి. సంబంధిత చర్చలు విజయవంతంగా ముగిశాయని ఇరుదేశాలు సోమవారం ప్రకటించాయి. భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్లు ఫోన్లో సంభాషించి ఒప్పందాన్ని ఖరారుచేశారని భారత విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముంది. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చే లక్ష్యంతో ఇరుదేశాలు ఉమ్మడిగా ముందుకుసాగనున్నాయి. న్యూజిలాండ్ నుంచి ఉన్ని, బొగ్గు, కలప మొదలు వైన్, అవకాడో, బ్లూబెర్రీల దాకా పలు రకాల ఉత్పత్తులపై 95 శాతం టారిఫ్‌ను భారత్ తొలగించనుంది. దీంతో ఇవన్నీ సరసమైన ధరలకు భారతీయులకు అందుబాటులోకి వచ్చే వీలుంది. భారతీయ ఎగుమతిదారుల నుంచి పాల ఉత్పత్తులు, ఉల్లి, చక్కెర, మసాలా దినుసులు, వంటనూనెలు, రబ్బర్దాకా పలు రకాల ఉత్పత్తులను న్యూజిలాండ్ మార్కెట్లోకి ఎగుమతిచేసి లాభాలను కళ్లజూడనున్నారు. తయారీ, మౌలికరంగం, సేవలు, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనా రంగాల్లో వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఆపిల్ ఎగుమతులపై టారిఫ్ ప్రయోజనాలు పొందనుంది. ఇరుదేశాల మధ్య పటిష్టమైన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలతోపాటు రెండు దేశాల మార్కెట్లలోకి సరు కుల అనుమతి, నూతన పెట్టుబడుల ప్రోత్సాహం, వ్యూహాత్మక భాగస్వామాన్ని బలపర్చుకోవడం, ఆవిష్కర్తలు, నూతన పరిశ్రమల స్థాపన సహా రైతులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, విద్యార్థులు, యువత ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారతీయ పాడిరైతుల ప్రయోజనాలను కాపాడుతూ న్యూజిలాండ్ పాలు, పెరుగు, వెన్న, చీజ్ తదితర ఉత్పత్తులపై టారిఫ్‌లను యథాతథంగా కొనసాగించనున్నారు. కృత్రిమ తేనె, ఆయుధాలు, మొక్కజొన్న, బాదం, వజ్రా భరణాలు, కాపర్, అల్యూమినియం ఉత్పత్తులపై గతంలో మాదిరే భారత్ టారిఫ్ విధించనుంది.వేల మంది భారతీయులకు ప్రయోజనంన్యూజిలాండ్లోని నైపుణ్య ఉద్యోగాల్లోకి ఏటా 5,000 మంది భారతీయ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ వర్క్ వీసాలను ఇచ్చేందుకు న్యూజిలాండ్ అంగీకారం తెలిపింది. దీంతో ఆయుష్ వైద్యులు, యోగా నిపుణులు, పాకశాస్త్ర ప్రవీణులు, సంగీతం, ఐటీ, ఇంజనీరింగ్, ఆరోగ్యసంరక్షణ, విద్య, నిర్మాణ రంగాల్లో భారతీయులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. భారతీయ విద్యార్థులు న్యూజిలాండ్‌లో చదువుకునేకాలంలో గరిష్టంగా వారానికి 20 గంటలపాటు పనిచేసుకునేందుకు అనుమతిస్తారు. డిగ్రీ కోర్సు అయితే రెండేళ్ల వర్క్ వీసా, బ్యాచిలర్స్ డిగ్రీ(ఆనర్స్) లేదా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మెడిసిన్(స్టెమ్) గ్రాడ్యుయేట్ అయితే మూడేళ్ల వర్క్ వీసా, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అయితే నాలుగేళ్ల వర్క్ వీసా ఇస్తారు. ఈ ఏడాది మార్చినెలలో భారత్‌లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ పర్యటించిన కాలంలోనే ఈ ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయని భారత వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. భారత్‌లో కివీపండు, ఆపిల్, తేనె దిగుబడి పెంపే లక్ష్యంగా ఈ మూడింటి కోసం ప్రత్యేకంగా సాగు–సాంకేతికత చర్యా ప్రణాళికను రూపొందించనుంది. భారతీయ వైన్స్, స్పిరిట్లను న్యూజిలాండ్‌లోనూ రిజిస్ట్రేషన్ చేసే అక్కడి భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ సంబంధ చట్టాలకు సవరణలు చేయనుంది. ఆయుష్, సంస్కృతి, మత్స్య, శ్రవణ దృశ్య పర్యాటకం, అటవీ, ఉద్యానవనాలతోపాటు వైద్యం, వ్యవసాయం వంటి సంప్రదాయ జ్ఞానపరంపరలోనూ సహకార దృక్పథంతో ముందుకుసాగుతాం’’ అని మంత్రి గోయల్ చెప్పారు. ‘‘చర్చలు కేవలం 9 నెలల్లోనే ఒప్పందం ఖరారు స్థాయికి చేరుకోవడం విశేషం. ఇది ఇరుదేశాల ప్రభుత్వాల పరిపాలనా సంకల్పానికి ప్రతీక’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త ముప్పు
ప్రపంచ బ్యాటర్లకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. అతడి పేరు జేకబ్ డఫీ. ఈ 31 ఏళ్ల కివీ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ప్రపంచ బ్యాటర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. డఫీ పేరు తలచుకుంటేనే అగ్రశ్రేణి బ్యాటర్లు సైతం బెంబేలెత్తిపోతున్నారు. డఫీ ప్రదర్శనలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చడంతో పాటు లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన డఫీ అంతర్జాతీయ క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. విమర్శకులు, విశ్లేషకులు, మాజీలు డఫీ ప్రదర్శనలు చూపి ఔరా అంటున్నారు. బ్యాటింగ్ ప్రపంచానికి సరికొత్త ముప్పు ముంచుకొచ్చిందని అభిప్రాయపడుతున్నారు.డఫీకి పేస్‌తో పాటు స్వింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉన్నందున మంచినీళ్ల ప్రాయంగా వికెట్లు తీయగలుగుతున్నాడు. విండీస్‌తో తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇది నిరూపితమైంది. ఈ సిరీస్‌లో డఫీని ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. డఫీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసి ఏకంగా 23 వికెట్లు పడగొట్టాడు. డఫీ విజృంభణతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.విండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో డఫీ ప్రదర్శనలు..తొలి టెస్ట్: 5-34 & 3-122రెండో టెస్ట్: 1-33 & 5-38మూడో టెస్ట్: 4-86 & 5-42టెస్ట్‌ల్లో విశ్వరూపం2020లో టీ20 అరంగేట్రం, 2022లో వన్డే అరంగేట్రం చేసిన డఫీ.. ఈ ఏడాదే టెస్ట్ అరంగేట్రం చేశాడు. టెస్ట్‌ల్లోకి వచ్చీ రాగానే డఫీ విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటిదాకా కొనసాగిన స్టార్క్, బుమ్రా, సిరాజ్, కమిన్స్ లాంటి ఫాస్ట్ బౌలర్ల హవాకు గండికొట్టాడు. డఫీ ప్రదర్శనల ముందు పై నలుగురు ప్రదర్శనలు చిన్నబోయాయి. స్టార్క్ కొద్దోగొప్పో పోటీ ఇవ్వగలిగాడు కానీ, మిగతా ముగ్గురు డఫీ ముందు తేలిపోయారు.లీడింగ్ వికెట్టేకర్టెస్ట్ల్లో పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోయిన డఫీ.. ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ తన మార్కు చూపించాడు. టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి, వన్డేల్లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ ఏడాది లీడింగ్ వికెట్ టేకర్‌గా (మూడు ఫార్మాట్లలో) అవతరించాడు. డఫీ ఈ ఏడాది మొత్తం 81 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండో స్థానంలో ఉన్న జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీకి (65), న్యూజిలాండ్‌కే చెందిన మ్యాట్ హెన్రీకి (65) డఫీకి మధ్య 16 వికెట్ల తేడాతో ఉంది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ బౌలర్‌గానూ డఫీ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79 వికెట్లు) ఉండేది.ఫార్మాట్లవారీగా ఈ ఏడాది డఫీ ప్రదర్శనలు..టీ20లు- 35 వికెట్లుటెస్ట్లు- 25 వికెట్లువన్డేలు- 21 వికెట్లుఓ క్యాలెండర్ ఇయర్లో న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు..జేకబ్ డఫీ (2025లో 81 వికెట్లు)రిచర్డ్ హ్యాడ్లీ (1985లో 79)డేనియల్ వెటోరి (2008లో 76)ట్రెంట్ బౌల్ట్ (2015లో 72)ఈ ఏడాది డఫీ ప్రదర్శనలకు చాలామంది మాజీల లాగే టీమిండియా మాజీ రవిచంద్రన్ అశ్విన్ కూడా ముగ్దుడయ్యాడు. ఆశ్విన్ తాజాగా ఓ ట్వీట్ చేస్తూ డఫీ ప్రదర్శనలను ఆకాశానికెత్తాడు. టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్‌లో ఉన్న డఫీ, ప్రస్తుతం టీ20ల్లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. డఫీని ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆర్సీబీ రూ. 2 కోట్ల బేస్ ధరకు సొంతం చేసుకుంది. డఫీ ఇప్పటివరకు 4 టెస్ట్‌లు, 19 వన్డేలు, 38 టీ20లు ఆడి వరుసగా 25, 35, 53 వికెట్లు తీశాడు. -
అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అక్కడి పార్టీ కన్వీనర్ బుజ్జి బాబు నెల్లూరి నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో.. గోవర్ధన్ మల్లెల, NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కసుంగాటి, సైంటిస్ట్ బాల బీరమ్, లింక్ టు గ్రూప్ సర్వీసెస్‌కు చెందిన ఇందిరా సిరిగిరి, ఎస్జి కన్సల్టెన్సీ వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, యూనివర్సల్ గ్రానైట్స్ శివ కిలారి, NZTA అధ్యక్షుడు జనక్, NZTA మాజీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, TANZ అధ్యక్షుడు చంద్రశేఖర్ కొడూరి , నిధి చిట్స్ మురళి, ట్రాన్స్ఫసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రోహిత్‌రెడ్డి, రామ్ మోహన్ దంతాల, లుక్స్ స్మార్ట్ డైరెక్టర్ పండు, ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రదీప్, మ్యాంగో బైట్ డైరెక్టర్ నిర్మల్ పాండే, కృష్టా రెడ్డి, శ్రీనివాస్ పనుగంటి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. -
న్యూజిలాండ్ ఓపెనర్ల ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఈ ఘతన సాధించారు. టెస్ట్ క్రికెట్లోనే కాదు, యావత్ ఫస్ట్‌క్లాస్ చరిత్రలోనే ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఓపెనింగ్ జోడీగా కాన్వే, లాథమ్ చరిత్ర సృష్టించారు.ఈ మ్యాచ్‌లో లాథమ్ తొలి ఇన్నింగ్స్‌లో 137, రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేయగా.. కాన్వే తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (227), రెండో ఇన్నింగ్స్‌లో 100 పరుగులు చేశాడు. వ్యక్తిగతంగా కాన్వే మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ద్విశతకం, శతకం సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచవాప్తంగా ఈ ఫీట్‌ను మరో తొమ్మిది మంది మాత్రమే సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే.. మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. 462 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ 37, జాన్ క్యాంప్‌బెల్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విండీస్ గెలవాలంటే మరో 419 పరుగులు చేయాలి.అంతకుముందు కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌ను 306/2 వద్ద డిక్లేర్ చేసింది. కాన్వే, లాథమ్ శతక్కొట్టారు. దీనికి ముందు విండీస్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్‌బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 575 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాన్వే డబుల్ సెంచరీ, లాథమ్ సెంచరీ చేయగా.. రచిన్ రవీంద్ర (72 నాటౌట్) రాణించాడు. -
పోరాడుతున్న వెస్టిండీస్
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా... చివరిదైన ఈ పోరులో పరుగుల వరద పారుతోంది. మొదట న్యూజిలాండ్ 575/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... ఓవర్‌నైట్ స్కోరు 110/0తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కవెమ్ హడ్జ్ (254 బంతుల్లో 109 బ్యాటింగ్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. బ్రాండన్ కింగ్ (104 బంతుల్లో 63; 10 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేయగా... జాన్ క్యాంప్‌బెల్ (67 బంతుల్లో 45; 7 ఫోర్లు), అలిక్ అథనాజె (57 బంతుల్లో 45; 8 ఫోర్లు), జస్టిన్ గ్రేవ్స్ (69 బంతుల్లో 43; 6 ఫోర్లు) రాణించారు. క్రితం రోజు స్కోరుకు ఒక్క పరుగు మాత్రమే జోడించి క్యాంప్‌బెల్ అవుట్ కాగా... కాసేపటికే బ్రాండన్ కింగ్ వెనుదిరిగాడు. వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ (67 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో హడ్జ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇక గాడినపడ్డట్లే అనుకుంటున్న సమయంలో ఇమ్లాచ్ అవుట్ కాగా... అలిక్ అథనజె, జస్టిన్ గ్రేవ్స్ సాయంతో హడ్జ్ చక్కటి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు ఫాలోఆన్ ప్రమాదాన్ని అధిగమించి మెరుగైన స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో హడ్జ్ 224 బంతుల్లో టెస్టుల్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏమాత్రం తొందరపాటుకు పోని హడ్జ్ నింపాదిగా అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీ అనంతరం కూడా అతడు పూర్తి సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. కెపె్టన్ రోస్టన్ చేజ్ (2) విఫలం కాగా... హడ్జ్తో పాటు అండర్సన్ ఫిలిప్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. చేతిలో 4 వికెట్లు ఉన్న విండీస్ జట్టు ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ షై హోప్... మూడో రోజు కూడా మైదానంలోకి దిగలేదు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, ఎజాజ్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో విండీస్ మరెన్ని పరుగులు జోడిస్తుందనేది ఆసక్తికరం. -
న్యూజిలాండ్‌కు ఆధిక్యం
వెల్లింగ్టన్: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 24/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 74.4 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కేన్ విలియమ్సన్ (37; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (25; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్ల ధాటికి కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా... మిచెల్ హే చివరి వరకు పోరాడి జట్టుకు 73 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ బ్లెయిర్ టిక్నెర్ బ్యాటింగ్‌కు రాలేదు. కరీబియన్ బౌలర్లలో అండర్సన్ ఫిలిప్ 3, రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. జాన్ క్యాంప్‌బెల్ (14), అండర్సన్ ఫిలిప్ (0) అవుట్ కాగా... బ్రాండన్ కింగ్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు), కవెమ్ హడ్జ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విండీస్ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, మిచెల్ రే చెరో వికెట్ పడగొట్టారు. -
15 ఏళ్ల తర్వాత మాట నిలబెట్టుకున్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన అరంగేట్రానికి దోహదపడిన సహచర ఆటగాడికి ఓ మాట ఇచ్చానని.. పదిహేనేళ్ల తర్వాత ప్రామిస్ నిలబెట్టుకున్నానని తెలిపాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు?.. అతడికి సచిన్ ఇచ్చిన మాట ఏంటి?!ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగాటీమిండియా తరఫున 1989 నవంబరులో సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్‌తో టెస్టుల సందర్భంగా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అంతకంటే కొద్ది రోజుల ముందు ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తరఫున సచిన్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించి టీమిండియాలో అడుగుపెట్టాడు.అతడి త్యాగంతో సెంచరీఈ విషయాన్ని సచిన్ టెండుల్కర్ ఇటీవలే స్వయంగా వెల్లడించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా (Rest Of India) తొమ్మిది వికెట్లు కోల్పోయిన వేళ.. సచిన్ సెంచరీకి చేరువగా ఉన్నాడు. అలాంటి సమయంలో గురుశరణ్ సింగ్ (Gursharan Singh) విరిగిన చేతితోనే బ్యాటింగ్‌కు వచ్చి.. సచిన్‌కు సహకారం అందించాడు. ఫలితంగా సచిన్ శతకం పూర్తి చేసుకోవడం.. తద్వారా టీమిండియా అరంగేట్రానికి బాటలు వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో గురుశరణ్ సింగ్ త్యాగానికి ప్రతిగా.. సచిన్ అతడికి ఓ మాట ఇచ్చాడు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావుఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘రిటైర్ అయిన క్రికెటర్ల కోసం అప్పట్లో బెన్ఫిట్ మ్యాచ్‌లు నిర్వహించేవారు. ఆరోజు (1990) న్యూజిలాండ్‌లో గురుశరణ్‌కు నేను ఓ మాట ఇచ్చాను.‘గుశీ.. జీవితాంతం ఎవరూ ఆడుతూనే ఉండలేరు కదా! ఏదో ఒకరోజు నువ్వు కూడా రిటైర్ అవుతావు. అలా నువ్వు రిటైర్ అయ్యి బెన్ఫిట్ మ్యాచ్ కోసం ఆటగాళ్లు కావాల్సినపుడు నేను నీకోసం వచ్చి ఆడతాను’ అని చెప్పాను. అన్నట్లుగానే అతడి కోసం బెన్ఫిట్ మ్యాచ్ ఆడాను.పదిహేనేళ్ల తర్వాత‘గుశీ.. న్యూజిలాండ్‌లో నీకు ఓ మాట ఇచ్చాను కదా! పదిహేనేళ్ల తర్వాత (2005) దానిని నిలబెట్టుకుంటున్నా’ అని చెప్పాను. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ మదిలో నిల్చిపోతాయి. ‘ఆరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అని ఈరోజు సగర్వంగా నేను చెప్పగలను’’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే! -
న్యూజిలాండ్‌కు 'ట్రిపుల్' షాక్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్‌కు ట్రిపుల్ షాక్ తగిలింది. డిసెంబర్ 10 నుంచి వెల్లింగ్టన్ వేదికగా జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు ఏకంగా ముగ్గురు స్టార్ బౌలర్లు గాయపడ్డారు. మ్యాట్ హెన్రీ కాఫ్ ఇంజ్యూరితో, నాథన్ స్మిత్ సైడ్ స్ట్రెయిన్‌తో, మిచెల్ సాంట్నర్ గ్రోయిన్ ఇంజ్యూరితో మిగతా రెండు టెస్ట్‌లకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్ క్రిస్టియన్ క్లార్క్, ఫాస్ట్ బౌలర్ మైఖేల్ రే, గ్లెన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. స్మిత్, హెన్రీ తొలి టెస్ట్ సందర్భంగా గాయపడగా.. సాంట్నర్ ఇదే గాయం కారణంగా తొలి టెస్ట్‌కు కూడా దూరంగా ఉన్నాడు. పై ముగ్గురితో పాటు కొత్తగా మరో ఎంపిక కూడా జరిగింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన టామ్ బ్లండెల్‌కు కవర్‌గా మిచ్ హేను కూడా జట్టులోకి తీసుకున్నారు.కాగా, క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. విండీస్ బ్యాటర్లు అసమాన పోరాటపటిమతో 531 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.షాయ్ హోప్ సూపర్ సెంచరీ (140).. జస్టిన్ గ్రీవ్స్ అజేయ డబుల్ సెంచరీ (202).. కీమర్ రోచ్ (233 బంతుల్లో 58 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో విండీస్‌ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు.72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి గెలుపు అంచులకు వెళ్లిందంటే, ఈ విండీస్ యోధుల పోరాటం ఎలా సాగిందో అర్దం చేసుకోవచ్చు. అంత భారీ లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఏకంగా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం అంటే సామాన్యమైన విషయం కాదు.చేతిలో 4 వికెట్లు ఉండి, గెలుపుకు 74 పరుగుల దూరంలో ఉన్న సమయంలో (457/6), ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా పరోక్షంగా విండీస్ గెలిచినట్లే. విండీస్ యెధుల పోరాటాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం కీర్తించింది. -
ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలుత విండీస్ బౌలర్లు రెచ్చిపోయి కివీస్‌ను 231 పరుగులకే కట్టడి చేయగా.. ఆతర్వాత కివీస్ బౌలర్లు విండీస్‌ను 167 పరుగులకే కుప్పకూల్చి ప్రతీకారం తీర్చుకున్నారు. జేకబ్ డఫీ ఐదు వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బేశాడు. మ్యాట్ హెన్రీ 3, ఫౌల్క్స్ 2 వికెట్లతో మిగతా పని కానిచ్చేశారు.తేజ్‌నరైన్ చంద్రపాల్ (52), షాయ్ హోప్ (56) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరు కాకుండా ఇమ్లాచ్ (14), రోచ్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు ఖాతా కూడా తెరవలేకపోయారు.అంతకుముందు విండీస్ బౌలర్లు తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. కేన్ విలియమ్సన్ (52), బ్రేస్‌వెల్ (47) ఓ మోస్తరుగా రాణించడంతో ఆ జట్టు గౌరవప్రమైన స్కోర్ చేయగలిగింది.64 పరుగుల కీలక ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ 10, డెవాన్ కాన్వే 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. -
కివీస్‌పై విండీస్ ఆధిపత్యం
క్రైస్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ బౌలర్లు చెలరేగిపోయారు. తలో చేయి వేసి కివీస్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. కీమర్ రోచ్, సీల్స్, షీల్డ్స్, గ్రీవ్స్ తలో 2.. లేన్, ఛేజ్ చెరో వికెట్ తీసి కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 231 పరుగులకే కుప్పకూల్చారు.కివీస్ ఇన్నింగ్స్‌లో కేన్ విలియమ్సన్ (52) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. బ్రేస్‌వెల్ (47), బ్లండల్ (29), లాథమ్ (24), నాథన్ స్మిత్ (23), యంగ్ (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాన్వే (0), రచిన్ (3), ఫౌల్క్స్ (4), హెన్రీ (8) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో కివీస్‌పై విండీస్ స్పష్టమై ఆధిపత్యం చలాయించింది.అనంతరం బరిలోకి దిగిన విండీస్ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపిస్తుంది. 44 ఓవర్ల తర్వాత ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. షాయ్ హోప్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ 38, కెప్టెన్ ఛేజ్ 0 పరుగుల వద్ద క్రీజ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 126 పరుగులు వెనుకపడి ఉంది. ప్రస్తుతం రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ ఇది. -
న్యూజిలాండ్ ట్రిప్‌లో నభా నటేశ్ (ఫొటోలు)
-
ఫైనల్‌పై భారత్ గురి
ఇపో (మలేసియా): అందివచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్న భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నీలో ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో సంజయ్ సారథ్యంలోని టీమిండియా 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది మూడో విజయం. భారత్ తరఫున అమిత్ రోహిదాస్ (4వ నిమిషంలో), సంజయ్ (32వ నిమిషంలో), సెల్వం కార్తీ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు జార్జి బాకెర్ (42వ, 48వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్ తొమ్మిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బెల్జియం జట్టు పది పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... న్యూజిలాండ్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి దినం. శనివారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్; బెల్జియంతో న్యూజిలాండ్; మలేసియాతో దక్షిణ కొరియా ఆడతాయి. కెనడాపై భారత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుకుంటుంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను బెల్జియం ‘డ్రా’ చేసుకున్నా భారత్‌తో కలిసి ఫైనల్లోకి అడుగు పెడుతుంది. బెల్జియంపై 13 గోల్స్ తేడాతో గెలిస్తేనే న్యూజిలాండ్‌కు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. -
న్యూజిలాండ్ ‘క్లీన్ స్వీప్’
హామిల్టన్ (న్యూజిలాండ్): ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. టి20 సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకున్న కివీస్... వన్డే సిరీస్‌ను 3–0తో చేజిక్కించుకుంది. ఆఖరి పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 36.2 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. రోస్టన్ ఛేజ్ (51 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జాన్ క్యాంప్‌బెల్ (26; 3 ఫోర్లు, 1 సిక్స్), ఖారీ పియర్ (22 నాటౌట్; 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. కెపె్టన్ షై హోప్ (16), అకీమ్ అగస్ట్ (17), కార్టీ (0), రూథర్‌ఫోర్డ్ (19), జస్టిన్ గ్రేవ్స్ (1) విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. మ్యాట్ హెన్రీ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జాకబ్ డఫీ, మిచెల్ సాంట్నర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 30.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. మార్క్ చాప్మన్ (63 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చక్కటి హాఫ్‌సెంచరీతో సత్తాచాటగా... మిచెల్ బ్రాస్‌వెల్ (31 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) రాణించాడు. ఓపెనర్లు డెవాన్ కాన్వే (11), రచిన్ రవీంద్ర (14)తో పాటు విల్ యంగ్ (3), టామ్ లాథమ్ (10) విఫలమవడంతో ఒక దశలో 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కివీస్ జట్టును చాప్మన్ ఆదుకున్నాడు. బ్రాస్‌వెల్‌తో కలిసి జట్టును విజయానికి చేరువ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జైడెన్ సీల్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ప్లేయర్లు మ్యాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కైల్ జెమీసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 2 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. -
నిప్పులు చెరిగిన డఫీ.. న్యూజిలాండ్‌దే టీ20 సిరీస్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. డునెడిన్ వేదికగా ఇవాళ (నవంబర్ 13) జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ విండీస్‌ను 140 పరుగులకే ఆలౌట్ (18.4 ఓవర్లలో) చేసింది. జేకబ్ డఫీ (Jacob Duffy) 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. మరో పేసర్ జిమ్మీ నీషమ్ 2, జేమీసన్, బ్రేస్‌వెల్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (36) బ్యాట్ ఝులిపించకపోయుంటే విండీస్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. వీరితో పాటు జేసన్ హోల్డర్ (20), రోవ్‌మన్ పావెల్ (11), షాయ్ హోప్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (45), డెవాన్ కాన్వే (47 నాటౌట్) రాణించడంతో 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ గెలుపులో రచిన్ రవీంద్ర (2), చాప్మన్ (21 నాటౌట్) కూడా తలో చేయి వేశారు. షెపర్డ్, స్ప్రింగర్‌కు తలో వికెట్ దక్కింది.ఈ సిరీస్‌లో విండీస్ తొలి మ్యాచ్‌లో గెలువగా.. న్యూజిలాండ్ 2, 3, 5 టీ20లు గెలిచింది. వర్షం కారణంగా నాలుగో టీ20 రద్దైంది. నవంబర్ 16 నుంచి ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుంది. చదవండి: ఐపీఎల్లో జరిగిన ట్రేడ్ డీల్స్ ఇవే..! -
వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్
న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరగాల్సిన నాలుగో టీ20 వర్షార్పణమైంది. నెల్సన్‌లోని సాక్స్ట్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ సమయానికి విండీస్ స్కోర్ వికెట్ నష్టానికి 38 పరుగులుగా ఉంది. అలిక్ అథనాజ్ (21) ఔట్ కాగా.. ఆమిర్ జాంగూ (12), కెప్టెన్ షాయ్ హోప్ (3) క్రీజ్‌లో ఉన్నారు. అథనాజ్ వికెట్ నీషమ్‌కు దక్కింది.ఆధిక్యంలో న్యూజిలాండ్ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్‌లో విండీస్ గెలువగా.. న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్, ఆతర్వాత టెస్ట్ సిరీస్ జరుగుతాయి. నవంబర్ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్ 2, 10, 18 తేదీల్లో టెస్ట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. చదవండి: ఐదేసిన ములానీ.. మావి ఆల్‌రౌండ్ షో -
చాప్మన్ ఊచకోత.. న్యూజిలాండ్ భారీ స్కోర్
ఆక్లాండ్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (నవంబర్ 6) జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్ చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. చాప్మన్ ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో చాప్మన్తో పాటు టిమ్ రాబిన్సన్ (39 బంతుల్లో 25; 5 ఫోర్లు, సిక్స్) రాణించాడు. ఆఖర్లో డారిల్ మిచెల్ (14 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), మిచెల్ సాంట్నర్ (8 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. మిగతా ఆటగాళ్లలో డెవాన్ కాన్వే 16, రచిన్ రవీంద్ర 11, బ్రేస్‌వెల్ 5 పరుగులు చేశారు.విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీశారు. జేడన్ సీల్స్ (4-0-61-0), అకీల్ హొసేన్‌కు (1-0-23-0) చాప్మన్ చుక్కలు చూపించాడు. ఫోర్డ్ (4-0-17-1), ఛేజ్ (4-0-33-2), హోల్డర్ (4-0-34-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్ననే జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ పోరాటం వృధా అయ్యింది. 165 పరుగుల ఛేదనలో సాంట్నర్ చెలరేగి ఆడినా (28 బంతుల్లో 55 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. అంతకుముందు విండీస్ ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్ (53) అర్ద సెంచరీతో రాణించాడు.చదవండి: వేర్వేరు క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు వీరే..! -
చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్
వెస్టిండీస్‌తో నిన్న (నవంబర్ 5) జరిగిన టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) చారిత్రక ఇన్నింగ్స్ ఆడాడు. 165 పరుగుల లక్ష్య ఛేదనలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. వీరోచిత పోరాటాన్ని (28 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు) ప్రదర్శించాడు. సాంట్నర్ చెలరేగినా న్యూజిలాండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తద్వారా స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకపడిపోయింది.ఈ ఇన్నింగ్స్‌తో సాంట్నర్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్‌లలో ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ విభాగంలో అత్యధిక స్కోర్ సాంట్నర్ సహచరుడు టిమ్ సౌథీ (39), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (39) రషీద్ ఖాన్ పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ మ్యాచ్‌లో 107/9 స్కోర్ వద్ద జేకబ్ డఫీతో (1 నాటౌట్) సాంట్నర్ పదో వికెట్‌కు అజేయమైన 50 పరుగులు జోడించాడు. తద్వారా ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్‌లలో పదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం జోడించిన రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు జోష్ లిటిల్-బ్యారీ మెక్‌కార్తీ (44*) పేరిట ఉండేది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. షాయ్ హోప్ (53) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్‌ను సాంట్నర్ (55 నాటౌట్) గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో 3 వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఆక్లాండ్ వేదికగా నవంబర్ 6న జరుగనుంది. చదవండి: నరాలు తెగే ఉత్కంఠ: సాంట్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్ వృథా -
రాణించిన హోప్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ఐదు టీ20లు, మూడు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 5) తొలి టీ20 జరుగుతుంది. అక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్‌కు దిగింది.రాణించిన హోప్విండీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లో బ్రాండన్ కింగ్ (3), ఐదో ఓవర్లో అలిక్ అథనాజ్ (16), ఎనిమిదో ఓవర్లో అకీమ్ అగస్టీ (2) ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ షాయ్ హోప్ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (28), రోవ్‌మన్ పావెల్ (33) సాయంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు రొమారియో షెపర్డ్ బౌండరీలు బాదాడు.సత్తా చాటిన బౌలర్లుఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. సాంట్నర్ మినహా అందరూ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్ తలో 2 వికెట్లు తీయగా.. జేమీసన్, నీషమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తుది జట్లు..వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీమ్ అగస్టీ, రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొసేన్, జేడన్ సీల్స్న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీచదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా దేశవాలీ స్టార్ -
కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.ఇదే సరైన సమయం‘‘నాకు.. జట్టుకు ఈ నిర్ణయం ఎంతో ముఖ్యమైనది. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం. వచ్చే టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి జట్టును సంసిద్ధం చేసే విషయంలో వారికి ఇప్పుడు ఒక స్పష్టత వస్తుంది.జట్టులో టీ20 ప్రతిభకు కొదవలేదు. ప్రపంచకప్ టోర్నీకి వారిని ఇప్పటి నుంచి సిద్ధం చేయాల్సి ఉంది. మిచ్ (మిచెల్ సాంట్నర్) అద్భుతమైన సారథి. జట్టుకు నా వంత సహకారం ఉంటుంది. సుదీర్ఘ కెరీర్లో నాకెన్నో అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయి’’ అంటూ కేన్ విలియమ్సన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. టెస్టులకు మాత్రం కొనసాగుతాకాగా వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగబోయే టీ20 సిరీస్‌కు ముందు విలియమ్సన్ ఈ విషయం వెల్లడించాడు. అదే విధంగా.. విండీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలిపాడు.అయితే, వెస్టిండీస్‌తో డిసెంబరులో జరుగబోయే మూడు టెస్టులకు మాత్రం తాను అందుబాటులో ఉంటానని విలియమ్సన్ స్పష్టం చేశాడు. కాగా విలియమ్సన్ టీ20 రిటైర్మెంట్పై న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వీనింక్ స్పందించాడు.కేన్ కెరీర్ అద్భుతంగా సాగిందని.. తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు తమ మద్దతు ఉంటుందని స్కాట్ తెలిపాడు. ఏదేమైనా కేన్ చాన్నాళ్లపాటు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నామని.. అయితే, ఆటకు వీడ్కోలు పలికే విషయంలో అతడికి పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. కేన్ న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజంగా చరిత్రలో గుర్తుండిపోతాడని ప్రశంసించాడు.సెంట్రల్ కాంట్రాక్డు నుంచి వైదొలిగి..కాగా మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో కెప్టెన్ హోదాలో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు కేన్ విలియమ్సన్. ఆ తర్వాత టెస్టు, వన్డే, టీ20 జట్ల కెప్టెన్సీ వదులుకున్న కేన్ మామ.. న్యూజిలాండ్ క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్డు నుంచి వైదొలిగాడు.కుటుంబానికి సమయం కేటాయించడం, ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడే క్రమంలో ఈ మేరకు స్వేచ్ఛను కోరుకున్న 35 ఏళ్ల కేన్.. క్యాజువల్ కాంట్రాక్టు కుదుర్చుకోవడం ద్వారా తనకు వీలైనపుడు దేశం తరఫున ఆడుతున్నాడు.సెకండ్ హయ్యస్ట్ రన్ స్కోరర్గాఇక కివీస్ జట్టు తరఫున ఎన్నో రికార్డులు సాధించిన కేన్ మామ.. అంతర్జాతీయ టీ20లలో 93 మ్యాచ్‌లు ఆడి.. 2575 పరుగులు సాధించాడు. ఇందులో 18 అర్ధ శతకాలు ఉన్నాయి. 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో కివీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్.. ఆస్ట్రేలియాతో ఫైనల్లో 85 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.ఇక 2016, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ కేన్ కివీస్ జట్టుకు సారథ్యం వహించాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా 2011లో కివీస్ తరఫున టీ20లలో అరంగేట్రం చేసిన కేన్.. గతేడాది జూన్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు.చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!.. బీసీసీఐ బంపరాఫర్ -
న్యూజిలాండ్ ‘క్లీన్ స్వీప్’
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో పేలవ ఆటతీరు కొనసాగించిన ఇంగ్లండ్... మూడో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న ఇంగ్లండ్... శనివారం కివీస్‌తో జరిగిన ఆఖరి పోరులో 2 వికెట్ల తేడాతో ఓడింది. ఫలితంగా సొంతగడ్డపై టి20 సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్... వన్డే సిరీస్‌ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్... 40.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ పూర్తి ఓవర్లు ఆడకుండానే ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ (62 బంతుల్లో 68; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా... జోస్ బట్లర్ (56 బంతుల్లో 38; 7 ఫోర్లు), బ్రైడన్ కార్స్ (30 బంతుల్లో 36; 1 ఫోర్, 4 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో బ్లెయిర్ టిక్నెర్ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (46; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (44; 4 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. టిక్నెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, డారిల్ మిచెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. -
న్యూజిలాండ్‌దే వన్డే సిరీస్
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను (New Zealand vs England) న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 29) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) ధాటికి 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్‌వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను మట్టుబెట్టడంలో తమవంతు పాత్ర పోషించారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ 33.1 ఓవర్లలోనే ముగించింది. అయితే లక్ష్యాన్ని చేరుకునేందుకు సగం వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర (54), డారిల్ మిచెల్ (56 నాటౌట్) రాణించారు. కేన్ విలియమ్స్ (21) మంచి ఆరంభం లభించినా పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు.ఆఖర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (17 బంతుల్లో 34 నాటౌట్) బ్యాట్ ఝులిపించి మ్యాచ్‌ను వేగంగా ముగించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ (10-4-23-3) ప్రమాదకరంగా బౌలింగ్ చేశాడు. ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో (2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి) కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే ఖాతాలో వేసేసుకుంది. చదవండి: శతక్కొట్టిన స్టీవ్ స్మిత్.. యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు వార్నింగ్ -
రెచ్చిపోయిన న్యూజిలాండ్ బౌలర్లు
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 29) జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. బ్లెయిర్ టిక్నర్ (8-1-34-4), నాథన్ స్మిత్ (5-0-27-2) చెలరేగడంతో 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్, మిచెల్ సాంట్నర్, బ్రేస్‌వెల్ కూడా తలో వికెట్ తీసి ఇంగ్లండ్‌ను మట్టుబెట్టడంలో పాలుపంచుకున్నారు.జేమీ ఓవర్టన్ (42), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఇంగ్లండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో ఓవర్టన్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. వీరితో పాటు జేమీ స్మిత్ (13), జో రూట్ (25), జేకబ్ బేతెల్ (18), సామ్ కర్రన్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. బట్లర్ (9) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దైన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0 తేడాతో కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన న్యూజిలాండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's WC 2025) ఇవాళ (అక్టోబర్ 26) ఉదయం మొదలైన నామమాత్రపు మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు (England vs New Zealand) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 38.2 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది.ఇంగ్లండ్ బౌలర్లలో లిండ్సే స్మిత్ 3, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్, అలైస్ క్యాప్సీ తలో 2, ఛార్లీ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్ (43) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అమేలియా కెర్ (35), కెప్టెన్ సోఫీ డివైన్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.సూజీ బేట్స్ 10, బ్రూక్ హ్యాలీడే 4, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గేజ్, జెస్ కెర్ 10, రోస్‌మేరీ మైర్ డకౌట్, లియా తహుహు 2 పరుగులకు ఔటయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ త్వరగా మ్యాచ్ ముగించే దిశగా సాగుతోంది. 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకు మరో 119 పరుగులు కావాలి. యామీ జోన్స్ (20), ట్యామీ బేమౌంట్ (26) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది.చదవండి: హ్యారీ బ్రూక్ ఐకానిక్ శతకం వృధా -
సిరీస్ ఇంగ్లండ్ వశం.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా బ్రూక్
న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (New Zealand vs England) మరో మ్యాచ్ వర్షార్పణమైంది. ఆక్లాండ్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 23) జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు క్రైస్ట్‌చర్చ్‌లో జరగాల్సిన తొలి టీ20 కూడా వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది.మధ్యలో రెండో టీ20లో 65 పరుగుల తేడాతో గెలవడంతో సిరీస్ ఇంగ్లండ్ (England) వశమైంది (1-0). ఆ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హ్యారీ బ్రూక్‌కు (Harry Brookk) (35 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.అక్టోబర్ 26 (మౌంట్ మాంగనూయ్), 29 (హ్యామిల్టన్), నవంబర్ 1 (వెల్లింగ్టన్) తేదీల్లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.3.4 ఓవర్ల పాటు సాగిన ఆటమూడో టీ20 3.4 ఓవర్ల పాటు సాగింది. టాస్ ఓడి ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ వర్షం ప్రారంభమయ్యే సమయానికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (2) ఔట్ కాగా.. టిమ్ సీఫర్ట్ (23), రచిన్ రవీంద్ర (10) క్రీజ్‌లో ఉన్నారు.వన్డే సిరీస్‌కు ఇరు జట్లు..ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, లియామ్ డాసన్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, సోన్నీ బేకర్, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, లూక్ వుడ్న్యూజిలాండ్: మార్క్ చాప్మన్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీచదవండి: Virat Kohli: చెరగని మరక.. 17 ఏళ్ల కెరీర్లో తొలిసారి..! -
సెమీఫైనల్లో స్థానం కోసం...
సొంతగడ్డపై మహిళల వరల్డ్ కప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా బరిలోకి దిగిన భారత్ ఐదు మ్యాచ్‌ల తర్వాత కూడా ఇంకా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోలేకపోయింది. వరుసగా మూడు ఓటములతో దెబ్బతిన్న టీమిండియా ముంగిట ఇప్పుడు మరో అవకాశం నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే హర్మన్‌ప్రీత్ బృందానికి అధికారికంగా సెమీఫైనల్లో చోటు ఖాయమవుతుంది. మరోవైపు బలహీన జట్లతో గెలిచే అవకాశం ఉన్న రెండు వరుస మ్యాచ్‌లు వానబారిన పడటంతో వెనుకబడిన న్యూజిలాండ్ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో నిలిచింది. నవీ ముంబై: వన్డే వరల్డ్ కప్‌లో కీలక పోరుకు భారత మహిళల బృందం సిద్ధమైంది. లీగ్ దశలో భాగంగా నేడు జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి ఉత్సాహంతో కనిపించిన భారత్ ఆ తర్వాత అనూహ్యంగా మూడు ఓటములను ఎదుర్కొంది. మూడు సందర్భాల్లోనూ మెరుగ్గానే ఆడి మ్యాచ్‌ను నియంత్రణలోనే ఉంచుకున్నా... చివరికొచ్చేసరికి చేతులెత్తేసింది. అయితే పరిస్థితి ఇంకా భారత్ చేయిదాటిపోలేదు. కివీస్‌పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా భారత్ సెమీస్ చేరుతుంది. అయితే పటిష్ట ప్రత్యర్థి, మాజీ చాంపియన్‌తో పోరు అంత సులువు కాదు. ఓడితే సెమీస్ అవకాశాలు కోల్పోనున్న కివీస్ పట్టుదలగా పోరాడుతుందనడంలో సందేహం లేదు. 2022 నుంచి కివీస్‌తో 9 వన్డేలు ఆడిన భారత్ 6 మ్యాచ్‌లలో ఓడింది. మార్పు చేస్తారా! వరుసగా నాలుగు మ్యాచ్‌ల తర్వాత గత పోరులో భారత్ ఒక కీలక మార్పు చేసింది. ఆరో బౌలర్‌తో బౌలింగ్‌ను పటిష్ట పర్చుకోవడంలో భాగంగా రేణుకా సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌పై వేటు పడింది. అయితే ఇంగ్లండ్‌పై అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. రేణుక ఒక్క వికెట్ కూడా తీయకపోగా, విజయానికి చేరువగా వచి్చన జట్టు చివర్లో బ్యాటింగ్ తడబాటుతో చేజేతులా ఓడింది. స్మృతి కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. ఈ నేపథ్యంలో మళ్లీ జెమీమాకు అవకాశం కల్పిస్తారా చూడాలి. గత పోరులో ప్రధాన బ్యాటర్లు స్మృతి, కెప్టెన్ హర్మన్‌లతో పాటు మరో సీనియర్ దీప్తి శర్మ కూడా అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. ఇలాంటి తడబాటును అధిగమించి టాప్ ప్లేయర్లు మరింత బాధ్యతగా ఆడాల్సి ఉంది. ఇతర బ్యాటర్లలో ప్రతీక, హర్లీన్ మినహా మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా జట్టు వద్ద లేదు. రిచా ఘోష్ తనదైన శైలిలో దూకుడుగా ఆడితే జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. టోర్నీ ఆరంభంలో ఆకట్టుకున్న పేసర్ క్రాంతి గౌడ్ పదును మ్యాచ్ మ్యాచ్‌కూ తగ్గుతూ వచ్చింది. అమన్‌జోత్ మీడియం పేస్ కూడా అంతగా ప్రభావం చూపడం లేదు. గత మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లూ విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో మన స్పిన్నర్లు ప్రత్యర్థిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. సోఫీ డివైన్ మినహా... మహిళల క్రికెట్లో పటిష్టమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్ ఈసారి ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన కివీస్ ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచింది. పాక్, శ్రీలంకలతో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. టోరీ్నలో ఒక సెంచరీ, 2 అర్ధ సెంచరీలు సాధించిన కెపె్టన్ సోఫీ డివైన్‌పైనే జట్టు బ్యాటింగ్ ఆధారపడుతోంది. ఓపెనర్లు సుజీ బేట్స్, ప్లిమ్మర్ పూర్తిగా విఫలమయ్యారు. ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌తోపాటు స్పిన్నర్ కార్సన్ కూడా ఎలాంటి ప్రభావం చూపించడం లేదు. గత మ్యాచ్ ఆడని ప్రధాన పేసర్ తహుహు ఈ మ్యాచ్‌లో మళ్లీ బరిలోకి దిగుతోంది. మిడిలార్డర్లో హ్యాలిడే, గ్రీన్, ఇసాబెల్లా బ్యాటింగ్‌లో రాణిస్తేనే కివీస్ చెప్పుకోదగ్గ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. పిచ్, వాతావరణం నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానం పిచ్ ప్రధానంగా బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోరుకు అవకాశం ఉంది. భారత జట్టు సభ్యులందరికీ ఇక్కడ ఎక్కువగా ఆడిన అనుభవం ఉండటం సానుకూలాంశం. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు.సెమీస్ సమీకరణం ఇదీ... → న్యూజిలాండ్‌పై గెలిస్తే భారత్ 6 పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుతుంది. → ఒకవేళ భారత్ ఓడితే తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాల్సి ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్‌పై నెగ్గితే మనకు సెమీస్ స్థానం ఖాయమవుతుంది. → ఇంగ్లండ్‌పై కివీస్ నెగ్గి 6 పాయింట్లతో సమమైనా... అది కివీస్‌కు 2వ విజయం అవుతుంది. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచినందుకు భారత్ (3) ముందంజ వేస్తుంది. → కివీస్‌తో మ్యాచ్ రద్దయితే బంగ్లాదేశ్‌ను భారత్ ఓడిస్తే చాలు. ఒకవేళ మనం బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైనా...న్యూజిలాండ్, శ్రీలంక తమ తర్వాతి మ్యాచ్‌లు ఓడిపోవాల్సి ఉంటుంది. → భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లూ రద్దయినా... కివీస్‌ను ఇంగ్లండ్ ఓడిస్తే సరిపోతుంది. -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కేన్ మామ వచ్చేశాడు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత విలియమ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సెలక్టర్లు అతడికి అవకాశమిచ్చారు. అతడితో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్ కూడా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ వ్యవహరించాడు. అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ గాయం కారణంగా దూరమయ్యాడు.లాథమ్‌తో పాటు మొహమ్మద్ అబ్బాస్ ఫిన్ అల్లెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే , గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. టీ20ల్లో సత్తాచాటుతున్న జాక్ ఫాల్క్స్కు కివీస్ సెలక్టర్లు వన్డేలకు పిలుపునిచ్చారు.ప్రస్తుతం కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. తొలి టీ20 వర్షర్పాణం కాగా.. రెండో టీ20 సోమవారం జరగనుంది. అక్టోబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?
మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అనుహ్యంగా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన హర్మన్ సేన.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు సెమీస్‌కు ఆర్హత సాధించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌లో అడుగు పెట్టగా.. మూడో జట్టుగా ఇంగ్లండ్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. మిగిలిన ఒక్క స్ధానం కోసం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ నెలకొంది.భారత్ సెమీస్ చేరాలంటే?ఇక ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం 4లో కొనసాగుతున్నప్పటికి.. సెమీస్ చేరాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.మన అమ్మాయిల జట్టు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్ వద్ద కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే కివీస్(-0.245) కంటే భారత్(+0.526) రన్ రేటు మెరుగ్గా ఉండడంతో మూడో స్ధానంలో నిలిచింది. కాగా వరుసగా కివీస్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.శ్రీలంక, పాకిస్తాన్‌లపై న్యూజిలాండ్ గెలవడం అంత కష్టమేమి కాదు. ఒకవేళ అదే జరిగింటే భారత్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యి ఉండేవి. భారత్‌కు, న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 23న ముంబై వేదికగా కివీస్‌తో హర్మన్ సారథ్యంలోని భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా సెమీస్ భవితవ్యం దాదాపు తేలిపోతుంది. కివీస్‌పై భారత్ విజయం సాధిస్తే 6 పాయింట్లతో మెరుగైన స్థితికి చేరుకుంటుంది. అప్పుడు టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాపై భారత్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువ. కాబట్టి ఎటువంటి సమీకరణాలు లేకుండా మన జట్టు సెమీస్ చేరుతుంది. ఇక న్యూజిలాండ్ జట్టుకు కూడా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ కివీస్ చేతిలో భారత్ ఓటమి పాలైనప్పటికి నకౌట్కు అర్హత సాధించే అవకాశముంది. ఎలా అంటే న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ప్రస్తత పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించడం అంత సులువు కాదు. అదే సమయంలో భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించాలి. అప్పుడు ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. బంగ్లాపై మనం ఘన విజయం సాధిస్తే పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ కివీస్ రెండు మ్యాచ్‌లు గెలిచిందంటే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించిక తప్పదు.చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
పాక్, కివీస్ మ్యాచ్ వర్షార్పణం.. సెమీఫైనల్లో సౌతాఫ్రికా
మహిళల వన్డే ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లను వరుణుడు వీడటం లేదు. వాన కారణంగా ఇప్పటికే ఇక్కడ మూడు మ్యాచ్‌లు రద్దు కాగా... ఇప్పుడు ఆ జాబితాలో మరో మ్యాచ్ చేరింది. శనివారం కొలంబో వేదికగా పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన పోరు భారీ వర్షం కారణంగా రద్దు అయింది.దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే ఆ్రస్టేలియా సెమీస్ చేరగా... ఇప్పడు సఫారీ జట్టు రెండో బెర్త్ దక్కించుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాలు తేలాల్సి ఉంది. శనివారం పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు 25 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఆలియా రియాజ్ (52 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), మునీబా అలీ (22; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. లీ తహూహు 2 వికెట్లు పడగొట్టింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించగా... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వర్షం కాస్త తెరిపినివ్వగా... మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. అయితే మరోసారి వర్షం ముంచెత్తడంతో... మ్యాచ్‌ను నిలిపి వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్ -
పేరాయణం!
ఈ పెద్దమనిషి పేరు చెప్పాలంటే 20 నిమిషాలు కావాలి. అంటే, ఓ సినిమా ఇంటర్వెల్ అయ్యేంత సేపు! అదండీ విషయం! మామూలుగా అయితే ఎవరినైనా పరిచయం చేసుకుంటే ‘హాయ్, నా పేరు ఫలానా’ అని సెకన్లలో చెప్పేస్తాం. కానీ, లారెన్స్ వాట్కిన్స్ అనే న్యూజిలాండ్ మాజీ సెక్యూరిటీ గార్డ్‌కి మాత్రం ఆ విధానం అస్సలు నచ్చలేదు! పేరు కాదది.. అష్టాదశ పురాణం!ఆయన పేరంటే పేరు కాదు, అదొక అష్టాదశ పురాణం! మొత్తం 2,253 పదాలు ఉంటాయిట! గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ‘ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తిగత పేరు’.. అని అధికారికంగా ప్రకటించింది. అంటే.. ఆయన తన పూర్తి పేరు చెప్పడం మొదలుపెడితే.. మీరు ఒక కాఫీ తాగి రావచ్చు. ఓ రెండు చిన్న కవితలు రాసి ముగించవచ్చు. పక్కన ఉన్న స్నేహితుడితో ఓ దేశ రాజకీయాల గురించి చర్చ మొదలెట్టి ముగించవచ్చు కూడాను.. మీరు టిఫిన్ చేయడం పూర్తయ్యేలోపు కూడా ఆయన పేరు సగం కూడా పూర్తి కాదు మరి! పెళ్లి మండపంలోనూ అదే హంగామా!1991లో లారెన్స్ వాట్కిన్స్ మొదటి పెళ్లప్పుడు జరిగింది మరింత కామెడీ. ఆ పెళ్లి తంతు జరిపించే వ్యక్తి తెలివైన వాడు. రిస్క్ తీసుకోకుండా, లారెన్స్ గారి ఆ 2,253 పేర్ల లిస్ట్‌ను ముందుగానే రికార్డ్ చేశాడట!. మండపంలో మంగళవాయిద్యాల బదులు ఆ రికార్డింగ్ అర్ధగంట పాటు మోగుతూనే ఉందట!. అక్కడికి వచ్చిన అతిథులు షాంపైన్ తాగుతూ, ఆ అనంతమైన నామస్మరణను వింటూ హాయిగా తిరిగారట!. ఎట్టకేలకు 20 నిమిషాల తర్వాత, నామకరణ ఘట్టం ముగిశాక, ‘ఐ డూ’ అనే ముఖ్యమైన మాట చెప్పడానికి లారెన్స్ గారికి అవకాశం దొరికింది! ఆయన చిన్నప్పుడు ’రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ షో చూసి, గిన్నిస్ రికార్డ్స్ పుస్తకాలు చదివి, ‘నాలాంటి సాధారణ మనిషికి ఏ ప్రత్యేక ప్రతిభ లేదు’ అని బాధపడిపోయాడట. అప్పుడు, తనకున్న ఏకైక అవకాశం.. ప్రపంచంలోనే అతి పొడవైన పేరు పెట్టుకోవడమే అని డిసైడ్ అయ్యారు!సంతకం సంగతేంటి?రోజువారీ అవసరాల కోసం, ఆయన తన పేరును కేవలం ’లారెన్స్ అలోన్ అలోయ్ వాట్కిన్స్’ అని కుదించుకుని, సంతకాన్ని వాట్కిన్స్–5 (అయిదో తరం) అని పెడతారట. ఆయన పూర్తి పేరుతో ఉన్న పాత పాస్‌పోర్ట్‌కి ఏకంగా ఆరు అదనపు పేజీలు అవసరమయ్యాయట! ఇదే లారెన్స్ గారి పూర్తి పేరులారెన్స్ అలోన్ అలాయిస్ అలోయిసియస్ ఆల్ఫెజ్ అలున్ అలురెడ్ ఆల్విన్ అల్యాసాండిర్ ఆంబీ ఆంబ్రోస్ ఆంబ్రోసియస్ అమియాస్ అమియోట్ అమియాస్ అండర్స్ ఆండ్రీ ఆండ్రియా ఆండ్రియాస్ ఆండ్రూ ఆండీ అనైరిన్ ఆంగ్విష్ ఆన్లెయిఫర్ ఆంథిన్... (ఓస్.. ఇంతేనా అనుకున్నారు కదూ.. అయిపో లేదు.. ఇంకా ఉంది..)– సాక్షి, నేషనల్ డెస్క్ -
CWC 2025: శ్రీలంకతో మ్యాచ్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 14) శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు (Sri Lanka vs New Zealand) తలపడుతున్నాయి. కొలొంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిలాక్షి డిసిల్వ (55 నాటౌట్), కెప్టెన్ చమారీ ఆటపట్టు (53), హసిని పెరీరా (44), విష్మి గౌతమ్ (42) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. మిగతా లంక బ్యాటర్లలో హర్షిత 26, కవిష దిల్హరి 4, పియుమి వత్సల బడల్జే 7 పరుగులకు ఔటయ్యారు. అనుష్క సంజీవని 6 పరుగులతో అజేయంగా నిలిచింది.లంక స్కోర్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో అదనంగా 21 పరుగులు యాడ్ అయ్యాయి. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ సోఫీ డివైన్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రీ ఇల్లింగ్ 2, రోస్మేరి మైర్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, భారత్‌తో కలిసి ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక ఈ టోర్నీ ఇప్పటివరకు బోణీ కొట్టలేదు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకోవడంతో ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్ చేరింది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక.. ఆతర్వాత ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆ జట్టు 3 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో కేవలం ఒకే ఒక పాయింట్ ఖాతాలో కలిగి ఉండి పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.న్యూజిలాండ్ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రదర్శన కూడా ఇప్పటివరకు ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు 3 మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలు, ఓ విజయంతో రెండు పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి, పట్టికలో ఐదో స్థానంలో ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడిన న్యూజిలాండ్.. మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.ఇతర జట్ల విషయానికొస్తే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన పాకిస్తాన్ చిట్టచివరి స్థానంలో ఉంది.చదవండి: పాక్‌పై 11 వికెట్లు.. సౌతాఫ్రికా బౌలర్ అరుదైన ఘనత -
యువ భారత్ జోరు
జొహర్ (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్‌లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. తొలి పోరులో బ్రిటన్ను చిత్తు చేసిన యువభారత్... రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 4–2 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున అర్ష్ దీప్ సింగ్ (2వ నిమిషంలో), పీబీ సునీల్ (15వ నిమిషంలో), అరిజిత్సింగ్ హుండల్ (26వ నిమిషంలో), రోషన్ కుజుర్ (47వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గస్ నెల్సన్ (41వ నిమిషంలో), ఎయిడెన్ మ్యాక్స్ (52వ నిమిషంలో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే ప్రత్యర్థి డిఫెన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ అర్‡్షదీప్ గోల్ సాధించడంతో యువ భారత జట్టు ఖాతా తెరిచింది. న్యూజిలాండ్ కీపర్ బంతిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా... రెండోసారి అవకాశం దక్కించుకున్న అర్‡్షదీప్ విజయవంతంగా బంతిని నెట్లోకి పంపాడు. తొలి క్వార్టర్ ఆఖర్లో వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సునీల్ సది్వనియోగం చేసుకోవడంతో భారత జట్టు 2–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో క్వార్టర్లో అరైజీత్ సింగ్ హుండల్ గోల్‌తో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. ఎట్టకేలకు 41వ నిమిషంలో న్యూజిలాండ్ తొలి గోల్ నమోదు చేసుకుంది. ఇక చివరి క్వార్టర్లో మరో పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని రోషన్ కుజుర్ గోల్‌గా మలచగా... ఆఖర్లో న్యూజిలాండ్ మరో గోల్ చేసినా లాభం లేకపోయింది. టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత జట్టు... తదుపరి మ్యాచ్‌లో మంగళవారం దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. -
'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..
ఎవ్వరికైనా పేరు మహా అయితే ఓ నాలుగైదు పేర్లతో పెట్టుకుంటారేమో. అది కూడా అప్లికేషన్స్‌లో రాయడం అంత ఈజీ కాదు కూడా. అలాంటిది ఈ వ్యక్తి ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడో వింటే విస్తుపోతారు. అందులో ఎన్ని పదాలు ఉన్నాయో చూస్తే మతిపోతుంది. ఇలా కూడా పేరు పెట్టుకుంటారా అన్నంత వెరైటీగా పేరు పెట్టుకుని రికార్డు క్రియేట్ చేశాడు. అందరూ రకరకాల ఫీట్లతో కష్టపడి రికార్డు బద్దులు కొడితే..ఈ వ్యక్తి మాత్రం తన పేరుతోనే రికార్డులు ఎక్కాడు. వాటే క్రియేటివిటీ అనాలా..లేక అతని ఆలోచనకు సలాం కొట్టాలో తెలియదు గానీ..ప్రస్తుతం ఇతడి పేరు మాత్రం అత్యంత హాట్‌టాపిక్‌గా మారి వార్తల్లో నిలిచింది. అతడే న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్. మాములుగా కొందరికి వంశపారంపర్య పేర్లే, ప్లస్ సెంటిమెంట్లు, ఆచారాలో కొందిరి పేర్లు ఎంత పొడవుగా ఉంటాయో తెలిసిందే. కానీ లారెన్స్ వాళ్లందర్నీ వెనక్కి నెట్టేలా ఎంత పెద్ద పేరు పెట్టుకున్నాడంటే..అధికారులే అభ్యంతరం చెప్పే రేంజ్లో పెట్టుకున్నాడు. చట్టబద్ధంగా ఆ పేరు మార్పుని పొంది వార్తల్లో నిలవడమే కాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు( Guinness World Records)లకెక్కాడు. ఇంతకీ ఈ వ్యక్తి పేరులో ఎన్న పదాలు ఉంటాయో తెలుసా..ఏకంగా 2,253 ప్రత్యేక పదాలు ఉన్నాయి. నిజానికి ఇంత పెద్ద పేర్లు ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఉపయోగించడం చాలా కష్టం. ఎందుకంటే..రాతపూర్వకంగా కాకుండా ఆన్లైన్లోనే దేనికైనా దరఖాస్తూ చేయాల్సిన పరిస్థితి. అందులోనూ ఇంత పెద్ద పేరుని టైప్ చేయడం ఇంకా కష్టం. పైగా అక్కడ అంత స్పేస్ కూడా ఉండదు. అలాగే పలకాలన్నా కూడా 20 నిమిషాలు పడుతుందట.అయితే లారెన్స్ ఎక్కడ తగ్గలేదు అంత పెద్ద పేరు టైప్ చేసేలా వందల డాలర్ల ఖర్చు చేశాడు. అంతేగాదు జిల్లా కోర్టు ఇంత పెద్ద పేరుని పెట్టుకోవడాన్ని తిరస్కరిస్తే..హైకోర్టుకి అప్పీల్ చేసుకుని మరి న్యాయం పోరాటం చేశాడు. చివరికి కోర్టు అతడికి అనూకూలంగా తీర్పు ఇవ్వడమే కాదు..ఏకంగా చట్టంలోనే సంస్కరణలు చేసి.. రెండు చట్టాలను మార్చింది కూడా. పేరు మార్పు చేసుకోవడమే కాదు చట్ట బద్ధం చేసుకునేలా పోరాడటం అంటే మాటలు కాదు కదా..!.(చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
న్యూజిలాండ్ బోణీ
గువాహటి: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ ఆలస్యంగా బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన కివీస్ జట్టు శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు సుజీ బేట్స్ (29; 6 సిక్స్‌లు), ప్లిమర్ (4), అమెలియా కెర్ (1) విఫలమవడంతో 38 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. ఈ దశలో కెప్టెన్ సోఫీ డివైన్ (85 బంతుల్లో 63; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రూక్ హాలిడే (104 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించడంతో కివీస్ కుదురుకుంది. అయితే 29 పరుగుల వ్యవధిలో వీళ్లిద్దరు అవుటయ్యాక న్యూజిలాండ్ మళ్లీ తడబడింది. ఆఖరి ఓవర్లలో మ్యాడీ గ్రీన్ (25; 3 ఫోర్లు), జెస్ కెర్ (0), రోజ్మేరీ (2), ఇసాబెల్లా గేజ్ (12) వికెట్లను కోల్పోయింది. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3 వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫాహిమా ఖాతూన్ (34; 2 ఫోర్లు), రబియా ఖాన్ (25; 2 ఫోర్లు) రాణించారు. జెస్ కెర్, లీ తహుహు చెరో 3 వికెట్లు తీయగా, రోజ్మేరీకి 2 వికెట్లు దక్కాయి. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుతో శ్రీలంక తలపడుతుంది. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్
సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో ఐదు సెంచరీలు బాదిన తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 6) జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఈ ఘనత సాధించింది.తజ్మిన్కు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) ఖాతాలో ఉండిది. మంధన 2024, 2025 క్యాలెండర్ ఇయర్స్‌లో నాలుగు సెంచరీలు బాదింది. తాజాగా తజ్మిన్ మంధన రికార్డును బద్దలు కొట్టి, సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగనుండటంతో మంధన తిరిగి తన రికార్డును తజ్మిన్ నుంచి చేజిక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలికాలంలో మంధన కూడా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. అయితే ఈ ప్రపంచకప్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైంది.తజ్మిన్ ఖాతాలో మరో భారీ రికార్డుతాజా సెంచరీతో తజ్మిన్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ రికార్డును బ్రేక్ చేసింది. వన్డేల్లో 7 సెంచరీలు పూర్తి చేసేందుకు లాన్నింగ్‌కు 44 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. తజ్మిన్ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రపంచంలో తజ్మిన్, లాన్నింగ్ మినహా ఏ ఒక్క మహిళా ప్లేయర్ కూడా కనీసం 50 ఇన్నింగ్స్‌ల్లో 7 వన్డే సెంచరీలు పూర్తి చేయలేకపోయారు.మ్యాచ్ విషయానికొస్తే.. తజ్మిన్ మెరుపు సెంచరీతో (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తజ్మిన్కు సూన్ లస్ (83 నాటౌట్) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా సునాయాస విజయాన్ని సాధించింది. అంతకుముందు సోఫీ డివైన్ (85) రాణించడంతో న్యూజిలాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్ తజ్మిన్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ సూజీ బేట్స్, సోఫీ డివైన్‌కు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే బేట్స్ మహిళ క్రికెట్లో 350 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సోఫీ డివైన్‌కు కూడా ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్. అతి తక్కువ మంది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.వైరలవుతున్న తజ్మిన్ సంబరాలుఈ మ్యాచ్‌లో తజ్మిన్ సెంచరీ తర్వాత చేసుకున్న 'బౌ అండ్ యారో' సంబరాలు వైరలవుతున్నాయి. తజ్మిన్ సెలబ్రేషన్స్‌కు భారత క్రికెట్ అభిమానులు సైతం ముగ్దులవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25 pic.twitter.com/NfSYRjCsOY— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025తజ్మిన్ ఇంతకుముందు కూడా ఇలాంటి వినూత్న సంబరాలు చేసుకొని వార్తల్లో నిలిచింది. ఒంటికాలిపై యోగాసనం లాంటివి చేసి బాగా పాపులరైంది.యాదృచ్చికంతజ్మిన్ ఓ క్యాలెండర్ ఇయర్లో 5 సెంచరీలు చేసిన రోజే (అక్టోబర్ 6), సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పురుషుల క్రికెట్లో కిర్‌స్టన్ 1996 క్యాలెండర్ ఇయర్లో ఇదే రోజు తన ఐదో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సౌతాఫ్రికన్‌గా చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు ఇద్దరు సౌతాఫ్రికన్లు ఒకే ఫీట్‌ను సాధించడం యాదృచ్చికంగా జరిగింది.5 ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాలుతజ్మిన్ తన వన్డే కెరీర్లో చేసిన 7 సెంచరీల్లో నాలుగింటిని గత 5 ఇన్నింగ్స్‌ల్లోనే చేయడం విశేషం. ఈ సెంచరీకి ముందు ఇంగ్లండ్‌తో వన్డేలో (5) విఫలమైన ఆమె.. అంతకుముందు మూడు వన్డేల్లో పాక్‌పై 2, వెస్టిండీస్‌పై ఓ సెంచరీ సాధించింది.గత 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో తజ్మిన్ స్కోర్లు- 101(91) Vs వెస్టిండీస్- 101*(121) Vs పాక్- 171*(141) Vs పాక్- 5(13) Vs ఇంగ్లండ్- 101(89) Vs న్యూజిలాండ్ (WC)తజ్మిన్ గురించి ఆసక్తికర విషయాలు..ప్రస్తుతం స్టార్ క్రికెటర్‌గా చలామణి అవుతున్న తజ్మిన్ తన కెరీర్‌ను అథ్లెట్‌గా మొదలుపెట్టింది. 2007లో ఆమె వరల్డ్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. 2012 ఒలింపిక్స్‌కు ఎంపిక కావాల్సిన సమయంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురై, రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్‌గా ఆమె కెరీర్ అక్కడితో ముగిసింది. ఆతర్వాత 2018లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన తజ్మిన్ అప్పటి నుంచి కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తుంది. తజ్మిన్ తన తొలి 40 వన్డేల్లో ఒక్క డకౌట్ కూడా కాకుండా ఆడి అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచింది. చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..! -
మెరిసిన దక్షిణాఫ్రికా
వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో అనూహ్యంగా 69 పరుగులకే కుప్పకూలి తీవ్ర విమర్శలపాలైన సఫారీ టీమ్ వెంటనే కోలుకుంది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ జట్టును ఓడించి టోరీ్నలో గెలుపు బోణీ చేసింది. బౌలింగ్‌లో ఎంలాబా ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో తజీ్మన్ బ్రిట్స్ సెంచరీ, సూన్ లూస్ కీలక ఇన్నింగ్స్ కలిపి జట్టుకు విజయాన్ని అందించాయి. ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా కీలక విజయాన్ని అందుకుంది. బలమైన జట్లలో ఒకటైన న్యూజిలాండ్... సఫారీ సమష్టి ప్రదర్శన ముందు తలవంచింది. సోమవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. అనంతరం దక్షిణాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు సాధించి గెలిచింది. ఈ టోరీ్నలో న్యూజిలాండ్‌కిది వరుసగా రెండో ఓటమి. దక్షిణాఫ్రికా తమ తర్వాతి మ్యాచ్‌లో గురువారం విశాఖపట్నంలో భారత్‌తో తలపడుతుంది. అంతర్జాతీయ కెరీర్లో 350వ మ్యాచ్ ఆడిన కివీస్ ఓపెనర్ సుజీ బేట్స్ ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ మైలురాయి మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే (0) వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత మూడు భాగస్వామ్యాలతో కివీస్ జట్టు కోలుకుంది. జార్జియా ప్లిమ్మర్ (68 బంతుల్లో 31; 4 ఫోర్లు), అమేలియా కెర్ (42 బంతుల్లో 23; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ సోఫీ డివైన్ (98 బంతుల్లో 85; 9 ఫోర్లు) ముందుండి ఇన్నింగ్స్‌ను నడిపించింది. డివైన్ మూడో వికెట్‌కు అమేలియాతో 57 పరుగులు, నాలుగో వికెట్‌కు బ్రూక్ హాలిడే (37 బంతుల్లో 45; 6 ఫోర్లు)తో 86 పరుగులు జత చేసింది. అయితే తర్వాతి బ్యాటర్లంతా విఫలం కావడంతో కివీస్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. 44 పరుగుల తేడాతో కివీస్ జట్టు చివరి 7 వికెట్లు చేజార్చుకుంది. దక్షిణాఫ్రికా లెఫ్టార్మ్ స్పిన్నర్ నాన్కులులెకో ఎంలాబా (4/40) ప్రత్యరి్థని దెబ్బ తీసింది. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా కెపె్టన్ లారా వోల్వార్ట్ (14) ఆరంభంలోనే అవుటైంది. అయితే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తజీ్మన్ బ్రిట్స్ (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు వేసింది. బ్రిట్స్, సూన్ లూస్ (114 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 170 బంతుల్లో 159 పరుగులు జోడించి జట్టును గెలుపునకు చేరువగా తీసుకొచ్చారు. ఆ తర్వాత బ్రిట్స్‌తో పాటు మరిజాన్ కాప్ (14), అనెక్ బాష్ (0) తక్కువ వ్యవధిలో అవుటైనా... లూస్ అజేయంగా నిలిచి విజయం పూర్తి చేసింది. 350: న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్‌కు ఇది 350వ అంతర్జాతీయ మ్యాచ్. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జాబితాలో బేట్స్ అగ్ర స్థానంలో ఉండగా... ఆ తర్వాత వరుసగా హర్మన్‌ప్రీత్ కౌర్ (342), ఎలైస్ పెరీ (341), మిథాలీ రాజ్ (333), చార్లెట్ ఎడ్వర్డ్స్ (309) ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకొని ఈ జాబితాలో డానీ వ్యాట్ (300)తో సమంగా ఆరో స్థానంలో నిలిచింది. -
వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. న్యూజిలాండ్ చిత్తు
మహిళలవన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా శుభారంభం చేసింది. బుధవారం ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 89 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లే గార్డ్నర్ (83 బంతుల్లో 115; 16 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి సెంచరీ సాధించింది. ఆమెతో పాటు ఫోబ్ లిచ్‌ఫీల్డ్(45), పెర్రీ(33), కిమ్ గార్త్(38) రాణించారు. స్టార్ ప్లేయర్లు బెత్ మూనీ(5), సదర్లాండ్(5), హీలీ(19) నిరాశపరిచారు.న్యూజిలాండ్ బౌలర్లలో లీ తహుహు, జెస్ కెర్ 3 వికెట్ల చొప్పున... బ్రీ ఇలింగ్, అమెలియా కెర్ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 43.2 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ సోఫీ డివైన్ (112 బంతుల్లో 111; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరోచిత సెంచరీ సాధించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో సోఫీ, అనాబెల్ 3 వికెట్ల చొప్పున తీశారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడుతుంది.చదవండి: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి -
మిచెల్ మార్ష్ మెరుపులు
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): కెప్టెన్ మిచెల్ మార్ష్(43 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించడంతో... న్యూజిలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో ఆ్రస్టేలియా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల చాపెల్–హ్యాడ్లీ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (66 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగగా... డారిల్ మిచెల్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), బెవాన్ జాకబ్స్ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టిమ్ సీఫెర్ట్ (4), డెవాన్ కాన్వే (1), మార్క్ చాప్మన్ (0) విఫలమవడంతో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే న్యూజిలాండ్ జట్టు 6/3తో నిలిచింది. ఈ దశలో మిచెల్ అండగా... రాబిన్సన్ విజృంభించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అతడు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రాబిన్సన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం మందగించగా... నాలుగో వికెట్‌కు మిచెల్‌తో కలిసి రాబిన్సన్ 55 బంతుల్లో 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత జాకబ్స్‌తో ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 64 పరుగులు జతచేశాడు. చివరి ఓవర్లో సిక్స్‌తో రాబిన్సన్ తన కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్ష్ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన అతడు... ఆఖరి వరకు అదే ఊపు కొనసాగించాడు. మరో ఎండ్ నుంచి ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 31; 6 ఫోర్లు) కూడా ఎడెపెడా బౌండరీలు బాదడు. ఈ జంట తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 67 పరుగులు జోడించడంతో ఆసీస్‌కు శుభారంభం దక్కింది. హెడ్ అవుటైనా... మాథ్యూ షార్ట్ (18 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టడంతో ఆసీస్ వేగం కొనసాగింది. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మార్ష్రెండో వికెట్‌కు షార్ట్‌తో కలిసి 68 పరుగులు జోడించాడు. దీంతో ఛేదన సులువు కాగా... మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో 21 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టి20 జరగనుంది. -
రాబిన్సన్ మెరుపు శతకం వృధా.. న్యూజిలాండ్‌పై ఆసీస్ ఘన విజయం
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (New Zealand vs Australia) కోసం ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 1) తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ (New Zealand) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఈ స్కోర్ చేయడానికి యువ ఆటగాడు టిమ్ రాబిన్సన్ (Tim Robinson) ప్రధాన కారకుడు. 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో రాబిన్సన్ మెరుపు శతకంతో (66 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. అతనికి డారిల్ మిచెల్ (34), బెవాన్ జాకబ్స్ (20) కాసేపు సహకరించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టిమ్ సీఫర్ట్ (4), డెవాన్ కాన్వే (1),మార్క్ చాప్మన్ (0), మైఖేల్ బ్రేస్‌వెల్ (7) దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, హాజిల్‌వుడ్, మాథ్యూ షార్ట్ తలో వికెట్ తీశారు.అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ఓపెనర్లు ట్రివిస్ హెడ్ (18 బంతుల్లో 31; 6 ఫోర్లు), మిచెల్ మార్ష్ (43 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ షాట్లు ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 67 పరుగుల వద్ద హెడ్ ఔటైనా మార్ష్.. షార్ట్ (29) సాయంతో మెరుపులు కొనసాగించాడు. టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), స్టోయినిస్ (4 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ కేవలం 16.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 అక్టోబర్ 3న జరుగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సరికొత్త ప్రపంచ రికార్డు -
వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత మహిళల జట్టు విజయం
బెంగళూరు: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీమిండియా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. మొదట న్యూజిలాండ్ జట్టు 42 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించగా... ఆ తర్వాత మరో రెండు ఓవర్లు తగ్గించారు. కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ (54 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... మ్యాడీ గ్రీన్ (49 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అమేలియా కెర్ (40; 4 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఆంధ్ర స్పిన్నర్ శ్రీ చరణి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత లక్ష్యాన్ని 42 ఓవర్లలో 237 పరుగులుగా నిర్ణయించగా... హర్మన్ బృందం 40.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (79 బంతుల్లో 74; 10 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (86 బంతుల్లో 69; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. గువాహటి వేదికగా మంగళవారం జరగనున్న ప్రపంచకప్ తొలి పోరులో శ్రీలంకతో భారత్ తలపడనుంది. -
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తొలిసారి తమ జట్టుకు ఓ విదేశీయుడిని హెడ్ కోచ్‌గా నియమించింది. 2025-26 సీజన్‌కు పురుషుల సీనియర్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్యారీ స్టెడ్ ఎంపిక చేయబడ్డాడు. స్టెడ్ 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన న్యూజిలాండ్‌కు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించింది.53 ఏళ్ల స్టెడ్ తన కోచింగ్ ప్రయాణంలో న్యూజిలాండ్‌ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేర్చాడు. స్టెడ్ ఆథ్వర్యంలో న్యూజిలాండ్ గతేడాది భారత్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 268 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన స్టెడ్.. ఆంధ్ర క్రికెట్‌ను ఏమేరకు ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.ఏసీఏలో భాగం కావడంపై స్టెడ్ స్పందిస్తూ.. ఇక్కడి క్రికెట్ పట్ల ఉన్న అభిమానం అద్భుతంగా ఉంది. ACA అభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధత నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. ఆటగాళ్లతో కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు పని చేయనున్న తొలి విదేశీ కోచ్ స్టెడ్.గతంలో చాలామంది ఫారిన్ కోచ్‌లు భారత దేశవాలీ జట్టకు కోచ్‌లుగా వ్యవహరించారు. మైఖేల్ బెవాన్ ఒడిషాకు, లాన్స్ క్లూసెనర్ త్రిపురకు, డేవ్ వాట్మోర్ కేరళ, బరోడా జట్లకు.. ఇంతికాబ్ ఆలం పంజాబ్‌కు, డారెన్ హోల్డర్, షాన్ విలియమ్స్, డెర్మాట్ రీవ్ మహారాష్ట్ర జట్టుకు వేర్వేరే దఫాల్లో కోచ్‌లుగా పని చేశారు. -
విరాట్- అనుష్క.. మమ్మల్ని కూడా బయటకు పొమ్మన్నారు!
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట తీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ రన్‌మెషీన్.. వర్ధమాన క్రికెటర్లకు ఆదర్శప్రాయం. ఎంతో మంది యువ ఆటగాళ్లకు అతడొక రోల్‌మోడల్.కోహ్లిని నేరుగా కలిసి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకోవాలని తహతహలాడే వారెందరో!.. తాము కూడా ఆ కోవకే చెందుతామని చెబుతోంది భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues). అయితే, తాను, స్మృతి మంధాన (Smriti Mandhana) చేసిన పని వల్ల విరాట్ కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మ కాస్త అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందని తాజాగా వెల్లడించింది.ఒకే హోటల్లో బస.. అనుష్క కూడా అక్కడే‘‘అప్పుడు భారత పురుష, మహిళా క్రికెట్ జట్లు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాయి. ఇరుజట్లకు ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అప్పుడు స్మృతి, నేను కలిసి విరాట్‌ను కలవాలి అనుకున్నాం.మీతో మాట్లాడాలనుకుంటున్నాము అనగానే.. ‘ఓహ్.. ప్లీజ్.. మేము ఇక్కడే కేఫ్‌లో ఉన్నాము వచ్చేయండి’ అని కోహ్లి చెప్పాడు. అప్పుడు అనుష్క శర్మ కూడా అక్కడే ఉంది.మొదటి అర్ధగంట సేపు క్రికెట్ గురించి మాట్లాడాము. ఈ క్రమంలో .. నేను, స్మృతి భారత మహిళా క్రికెట్లో కీలక ప్లేయర్లుగా ఉండిపోతామని కోహ్లి అన్నాడు. మేమిద్దరం గొప్ప పేరు తెచ్చుకుంటామని అన్నాడు.ఇక చాలు.. బయటకు వెళ్లండిఆ తర్వాత బ్యాటింగ్ గురించి మాకు కొన్ని టిప్స్ ఇచ్చాడు. మా మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏదో.. పాత స్నేహితులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లుగా మా సంభాషణలు కొనసాగాయి.అప్పటికి నాలుగు గంటలు గడిచిపోయింది. అప్పుడు కేఫ్ నిర్వాహకులు వచ్చి.. ‘సమయం దాటిపోయింది.. ఇక వెళ్లండి’ అని చెప్పేంత వరకు అక్కడే కూర్చున్నాము. సుమారుగా రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మేము అక్కడి నుంచి వెళ్లిపోయాము’’ అని జెమీమా రోడ్రిగ్స్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.లండన్‌లోనే నివాసంకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన విరాట్ కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. లండన్‌లో అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క కోహ్లితో కలిసి అక్కడే ఎక్కువగా ఉంటోంది. మ్యాచ్‌లు ఉన్నపుడు మాత్రమే కోహ్లి భారత్‌కు వస్తున్నాడు. ఇక పెళ్లికి ముందు నుంచే కోహ్లితో పాటు అనుష్క కూడా టీమిండియా వెళ్లే పర్యటనల్లో భాగమయ్యేదన్న విషయం తెలిసిందే.చదవండి: 21 సార్లు డకౌట్ అయినా సరే.. జట్టులోనే.. అతడికి గంభీర్ చెప్పిందిదే.. -
వన్డే ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన..
మహిళల వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ప్రకటించింది. వెటరన్ ఆల్‌రౌండర్ సోఫీ డివైన్ కివీస్ జట్టుకు సారథ్యం వహించనుండగా... నలుగురు కొత్త ప్లేయర్లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. ఈ నెల 30 నుంచి భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ బోర్డు 15 మందితో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది.సుజీ బేట్స్, లీ తహుహు, సోఫీ డివైన్ ఐదోసారి ప్రపంచకప్ బరిలోకి దిగనుండగా... మ్యాడీ గ్రీన్, మెలియా కెర్‌కు ఇది మూడోది. 8 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన కివీస్ జట్టు అటు అనుభవజ్ఞులు, ఇటు యువ ప్లేయర్లతో సమతూకంగా ఉందని న్యూజిలాండ్ కోచ్ బెన్ సాయర్ అన్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా వచ్చే నెల 1న డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూకీ హాలిడే, బ్రీ ఇలింగ్, పాలీ ఇన్‌గ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, జార్జియా ప్లిమర్, లీ తహుహు. -
శివాలెత్తిన న్యూజిలాండ్ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025లో న్యూజిలాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్, సెయింట్ లూసియా కింగ్స్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ వీరంగం సృష్టించాడు. నిన్న (ఆగస్ట్ 31) ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి శతకం బాదాడు. సీఫర్ట్ విధ్వంసకర శతకం ధాటికి లూసియా కింగ్స్ 205 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది.40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్ మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ చేసిన సెంచరీ కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది. 2018 ఎడిషన్‌లో ఆండ్రీ రసెల్ జమైకా తలైవాస్‌కు ఆడుతూ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై 40 బంతుల్లోనే సెంచరీ చేశాడు.ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ చేసిన స్కోర్ (125 నాటౌట్) కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రెండో అత్యధికం. ఈ రికార్డు బ్రాండన్ కింగ్ పేరిట ఉంది. 2019 ఎడిషన్‌లో కింగ్ గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడుతూ బార్బడోస్ ట్రైడెంట్స్‌పై అజేయమైన 132 పరుగులు చేశాడు.ఈ ఇన్నింగ్స్‌తో సీఫర్ట్ ఖాతాలో మరో రెండు రికార్డులు కూడా చేరాయి. ఛేదనలో (కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో) అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా సీఫర్ట్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్ (121 నాటౌట్) పేరిట ఉండేది.ఈ సెంచరీతో సీఫర్ట్ సెయింట్ లూసియా కింగ్స్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉండేది. ఫాఫ్ 2021 సీజన్లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై అజేయమైన 120 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. ఆమిర్ జాంగూ (56), షకీబ్ అల్ హసన్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఫాల్కన్స్ ఇన్నింగ్స్‌లో ఫాబియన్ అలెన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లూసియా కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి 3 వికెట్లతో రాణించాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టిమ్ సీఫర్ట్ ఆది నుంచే చెలరేగడంతో లూసియా కింగ్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. లూసియా కింగ్స్‌ను సీఫర్ట్ ఒక్కడే విజయతీరాలు దాటించాడు. మిగతా బ్యాటర్లు కేవలం స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు మాత్రమే పనికొచ్చారు. సీఫర్ట్ తర్వాత అత్యధిక స్కోర్ 23 పరుగులుగా ఉంది. ఈ స్కోర్‌ను టిమ్ డేవిడ్ (16 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) చేశాడు. జాన్సన్ ఛార్లెస్ 17, అకీమ్ అగస్ట్ 19, రోస్టన్ ఛేజ్ 11 పరుగులకు పరిమితమయ్యారు. -
విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో జనరంజక పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతి సందర్భంగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.సంక్షేమాభివృద్ధిలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి, కృష్ణారెడ్డి, విజయ్ అల్లా, రాజారెడ్డి, బాలశౌర్య, గీతారెడ్డి, రమేష్ పానాటి, సంకీర్త్ రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, సుస్మిత, రేఖ, గౌతమి, సింధు, ప్రియాంక, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంఆ్రస్టేలియాలో రక్తదాన శిబిరం డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆడిలైడ్ నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాయకులు వంశీ బొంతు, రామ్మోహన్‌రెడ్డి మునగల తదితరులతో పాటు వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మెల్బోర్న్ నగరంలో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి తదితరులు పాల్గొన్నారు. -
అరివీర భయంకరమైన ఫామ్‌లో నైట్‌రైడర్స్ బ్యాటర్.. సెంచరీ, వరుస హాఫ్ సెంచరీలు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాడు కొలిన్ మున్రో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే విధ్వంసకర శతకం 120(57) సహా వరుసగా 44(18), 43(30), 9(10), 67(44) స్కోర్లు చేసిన అతడు.. తాజాగా మరో మెరుపు అర్ద శతకం బాదాడు.గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మున్రోతో పాటు మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (43 బంతుల్లో 74; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్ల పట్టకలో ఇప్పటికే అగ్రస్థానంలో (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఉన్న ఆ జట్టు.. తాజా విజయంతో పాయింట్లను మరింత మెరుగుపర్చుకుని టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంది.న్యూజిలాండ్‌కు చెందిన 38 ఏళ్ల కొలిన్ మున్రో ఈ సీజన్లో నైట్‌రైడర్స్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్లో నైడ్రైడర్స్ జట్టు కూడా అరివీర భయంకరంగా ఉంది. జట్టు నిండా విధ్వంసకర వీరులే ఉన్నారు. ఓపెనర్లుగా అలెక్స్ హేల్స్, కొలిన్ మున్రో.. వన్‌డౌన్‌లో కెప్టెన్ నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో కీరన్ పోలార్డ్, ఐదో ప్లేస్‌లో ఆండ్రీ రసెల్, లోయర్ మిడిలార్డర్లో సునీల్ నరైన్.. ఇలా జట్టు మొత్తం హేమాహేమీలతో నిండుకుని ఉంది. ఈ జట్టు బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా ఉంది. మొహమ్మద్ ఆమిర్, సునీల్ నరైన్, రసెల్, అకీల్ హొసేన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లతో కళకళలాడుతుంది. ఇలాంటి జట్టుతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్లనే కాదు, ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించవచ్చు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో హోప్ (39) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. ఆఖర్లో ప్రిటోరియస్ (21), సామ్పన్ (25) బ్యాట్ ఝులిపించడంతో వారియర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో అకీల్ హొసేన్ 3 వికెట్లతో చెలరేగగా.. టెర్రన్స్ హిండ్స్ 2, ఆమిర్, రసెల్, నరైన్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (74), కొలిన్ మున్రో (52) చెలరేగడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరుకుంది. హేల్స్, మున్రో తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించాక.. నైట్‌రైడర్స్‌ను వారియర్స్ కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ (4-0-27-4) కాస్త ఇబ్బంది పెట్టాడు. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీశాడు. అయితే అప్పటికే నైట్‌రైడర్స్ గెలుపు ఖరారైపోయింది. పోలార్డ్ (12 నాటౌట్), రసెల్ (27 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. -
న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధానం
ఆగస్టు 23 శనివారం నాడు సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించబడింది. మెల్బోర్న్ నగరవాసులు, తటవర్తి గురుకులం సంస్థాపకులు, అవధాన శారదామూర్తి శ్రీ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారిచే చేయబడిన ఈ అవధాన కార్యక్రమానికి సాహిత్యరత్న శ్రీ తూములూరి సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకులుగా నిర్వహించారు. సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో 3 గంటలకు పైగా ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం నాలుగు ఆవృత్తులతో (రౌండ్స్), 20 మంది పృచ్ఛకులతో, ఉన్నత సాహిత్యప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ పురపాలకమండలి సభ్యులు శ్రీమతి సంధ్యారెడ్డిగారు అవధాని గారిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించగలమని తెలిపారు. తదుపరి 11 వత్సరాల చిరంజీవి కృష్ణ సుహాస్ తటవర్తి అనర్గళంగా చెప్పిన గజేంద్రమోక్షం కథ సభా సదుల మనసుల రంజింప చేసినది. 30 ఆగస్టు శనివారం నాడు మెల్బోర్న్ నగరంలో కూడా శ్రీ కళ్యాణ చక్రవర్తి గారి చేతనే మరొక అష్టావధాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనరంజని కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీమతి స్వర్ణలత సీతంరాజు తెలిపారు. -
ఇంటర్నేషనల్ చదువుకు కొత్త అడ్రస్.. న్యూజిలాండ్
సాక్షి, అమరావతి: భారతీయ విద్యార్థుల విదేశీ విద్య గమ్యస్థానాల్లో న్యూజిలాండ్ సరికొత్త ఆశాకిరణంగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కఠినంగా మారుతున్న వీసా నిబంధనలు, విధాన అనిశ్చితుల నేపథ్యంలో విద్యకు న్యూజిలాండ్ కీలకమైన కేంద్రంగా అవతరిస్తోంది. ఇంగ్లిష్ మాట్లాడే వాతావరణం, పారదర్శక విధానాలతో పాటు ముఖ్యంగా భారత సంస్థలతో పెరుగుతున్న సంబంధాలతో న్యూజిలాండ్ ఆశాజనకంగా కనిపిస్తోంది.34% వృద్ధి నమోదుఎడ్యుకేషన్ న్యూజిలాండ్ డేటా ప్రకారం 2023లో న్యూజిలాండ్ విద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 7,930 కాగా, 2024లో కేవలం జనవరి–ఆగస్టు మధ్యే 34 శాతానికి పైగా వృద్ధితో 10,640కి పెరిగింది. వాస్తవానికి న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాల్లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా 11 శాతం. చైనా తర్వాత అతిపెద్ద విదేశీ విద్యా వనరుగా భారత్ నిలుస్తోంది. ఒక్క మహిళా విద్యార్థుల్లోనే 2023 నుంచి 2024కు 100 శాతం పెరుగుదల నమోదయ్యింది. 2030 నాటికి 40 వేల వరకూ భారతీయ విద్యార్థులను ఆకర్షించడమే లక్ష్యంగా న్యూజిలాండ్ అడుగులు వేస్తోంది. న్యూజిలాండ్‌లో వార్షిక ట్యూషన్ ఫీజులు భారతీయ కరెన్సీలో రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల లోపే ఉంటున్నాయి.ఈ నేపథ్యంలో ‘బిగ్ ఫోర్’ దేశాలైన యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ విద్యార్థుల దృష్టి న్యూజిలాండ్‌కు మారింది. న్యూజిలాండ్ ఇటీవల తమ దేశానికి విద్య, ఉద్యోగాల కోసం వచ్చే విదేశీ విద్యార్థులు, అభ్యర్థులకు విధించే నిబంధనల నుంచి భారత్‌కు మినహాయింపులు ఇచ్చింది. దీంతో వలస ప్రక్రియలో మినహాయింపులు పొందుతున్న ఎనిమిది దేశాల సరసన (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, స్వీడన్, స్విట్జర్లాండ్) భారత్ చేరింది. తద్వారా భారత విద్యార్థులకు అంతర్జాతీయ అర్హత అంచనా (ఐక్యూఏ) మినహాయింపులు లభించాయి.ఐక్యూఏ అనేది న్యూజిలాండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (ఎన్జెడ్క్యూఏ) నిర్వహించే ఒక అధికారిక బెంచ్ మార్కింగ్ ప్రక్రియ. ఒక విదేశీ విద్యార్హత.. ఆ దేశ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో ఈ ప్రక్రియ నిర్ధారిస్తుంది. దీనికి తోడు ప్రత్యేక స్కాలర్ షిప్ పథకం ద్వారా విద్యార్థికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తోంది.పని గంటల పెంపుపోస్టు స్టడీ వర్క్ (పీఎస్‌డబ్ల్యూ) పాలసీ కూడా న్యూజిలాండ్‌లో చదువుకునే విదేశీ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తోంది. కనీసం 30 వారాల మాస్టర్ లేదా డాక్టోరల్ లెవల్ స్టడీని పూర్తి చేసిన విద్యార్థులు ఆ దేశంలోనే ఉండి మూడేళ్ల వరకు పని చేసుకునే వెసులుబాటు ఉండటం విద్యార్థులకు కలిసివస్తోంది. ఇటీవల వారానికి పని గంటలను 20 నుంచి 25కు పెంచింది. నవంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. చదువుకుంటూ పని చేసుకుని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలనే విద్యార్థులకు ఎంతగానో ఉపకరించే అంశం ఇది. క్యూఎస్ ర్యాంకుల్లోనూ..న్యూజిలాండ్‌కు చెందిన ఎనిమిది విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026లో ఉత్తమ ర్యాంకులు పొందాయి. ఇవి ఇంజనీరింగ్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, హాస్పిటాలిటీ, నర్సింగ్ వంటి విద్య రంగాల్లో విస్తృత శ్రేణిలో ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి.భాగస్వామ్య ఒప్పందాలుఇటీవల భారత్–న్యూజిలాండ్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు పెరుగుతున్నాయి. గతేడాది న్యూజిలాండ్ ప్రభుత్వం ఐఐఎం–అహ్మదాబాద్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (జీఐఎఫ్‌టీ సిటీ), కర్ణాటక ఉన్నత విద్యా మండలిలో విద్యా సహకార ఒప్పందాలు చేసుకుంది. దేశంలో అభివృద్ధి చెందుతున్న విద్యా రంగానికి అనుగుణంగా విధాన మార్పిడి నిర్ణయాలను వేగంగా తీసుకుంటోంది. -
న్యూజిలాండ్ క్రికెట్‌కు ఊహించని షాక్
న్యూజిలాండ్ క్రికెట్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్ సామ్ వెల్స్ అనూహ్యంగా తన పదవి నుంచి తప్పుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ పరివర్తన దశలో (టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ సౌథీ రిటైర్మెంట్, లాంగ్ స్టాండింగ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తప్పుకున్న తర్వాత) ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టిన వెల్స్.. వ్యక్తిగత కారణాల చేత చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేశాడు. వెల్స్ గతేడాది గాల్లావే కుక్ అలన్ అనే డునెడిన్ లా ఫర్మ్ పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి జోడు పదవులను బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడ్డాడు. అందుకే న్యూజిలాండ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చాడు. వెల్స్ రెండేళ్ల కిందట న్యూజిలాండ్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.ఇప్పుడున్న న్యూజిలాండ్ జట్టును షేప్ చేయడంలో 41 ఏళ్ల వెల్స్ కీలకపాత్ర పోషించాడు. అతడు ఎంపిక చేసిన జట్టుతోనే న్యూజిలాండ్ భారత్‌ను వారి సొంతగడ్డపై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రన్నరప్‌గా నిలిచింది. వెల్స్ ఆకస్మికంగా తప్పుకోవడంతో న్యూజిలాండ్ క్రికెట్ కొత్త చీఫ్ సెలెక్టర్ అన్వేషణలో పడింది.ఆ జట్టు త్వరలో స్వదేశంలో చాలా ముఖ్యమైన సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లకు సమతూకమైన జట్టును ఎంపిక చేయడం కొత్త చీఫ్ సెలెక్టర్‌కు కత్తి మీద సామే అవుతుంది. ఇటీవలే జింబాబ్వేను వారి సొంతగడ్డపై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ జట్టు 5-6 వారాలు విశ్రాంతి తీసుకుంటుంది. అనంతరం అక్టోబర్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. దీని తర్వాత స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో 3 టీ20, 3 వన్డేలు ఆడాల్సి ఉంది. అనంతరం స్వదేశంలోనే విండీస్‌తో మరో సిరీస్‌లో పాల్గొంటుంది. -
న్యూజిలాండ్‌ను కాదని స్కాట్లాండ్కు వలస వెళ్లిన టీ20 క్రికెటర్
న్యూజిలాండ్ క్రికెటర్ టామ్ బ్రూస్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న స్కాట్లాండ్కు వలస వెళ్లాడు. న్యూజిలాండ్ తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరుగనున్న వరల్డ్‌కప్ లీగ్-2 మ్యాచ్‌ల కోసం బ్రూక్ స్కాట్లాండ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. బ్రూస్ తండ్రి స్వస్థలం స్కాట్లాండే కావడంతో అతనికి ఈ అవకాశం దక్కింది. బ్రూస్ న్యూజిలాండ్‌కు ఆడకముందు 2016లో స్కాట్లాండ్ డెవలెప్మెంట్ జట్టుకు ఆడాడు.2017లో బ్రూస్ న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బ్రూస్ న్యూజిలాండ్ తరఫున రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించి పర్వాలేదనిపించాడు. ఆతర్వాత అతను అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. తదుపరి 15 ఇన్నింగ్స్‌ల్లో మరో ఫిఫ్టి మాత్రమే చేయగలిగాడు. దీంతో జట్టులో స్థానం గల్లంతైంది.2020లో స్వదేశంలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతను చివరిసారిగా న్యూజిలాండ్‌కు ఆడాడు. ఆ సిరీస్‌లో వరుస డకౌట్ల కారణంగా అతనిపై వేటు పడింది. ఆ సిరీస్‌ను న్యూజిలాండ్ 0-5 తేడాతో భారత్‌కు కోల్పోయింది.భారత్‌తో సిరీస్ తర్వాత బ్రూస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా జట్టులోకి రాలేకపోయాడు. దీంతో కెరీర్‌ను కొనసాగించేందుకు తన తండ్రి స్వస్థలమైన స్కాట్లాండ్కు వలస వెళ్లాడు. అక్కడ దేశవాలీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2017-2020 మధ్యలో బ్రూస్ న్యూజిలాండ్ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 2 హాఫ్ సెంచరీల సాయంతో 122.44 స్ట్రయిక్‌రేట్‌తో 279 పరుగులు చేశాడు.స్కాట్లాండ్ వన్డే జట్టుకు ఎంపికైన అనంతరం బ్రూస్ ఇలా అన్నాడు. "మా కుటుంబానికి స్కాటిష్ చరిత్ర ఉంది. స్కాట్లాండ్కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై స్కాట్లాండ్ విజయానికి నా వంతు కృషి చేస్తాను". ఈ మార్పుతో బ్రూస్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.కాగా, వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా స్కాట్లాండ్ కెనడా, నమీబియా దేశాలతో ఆగస్ట్ 29-సెప్టెంబర్ 6 మధ్యలో నాలుగు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. -
చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. టెస్టుల్లో అతి పెద్ద విజయం!
జింబాబ్వే పర్యటనను న్యూజిలాండ్ అద్బుతమైన విజయంతో ముగించింది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జింబాబ్వేను ఇన్నింగ్స్ అండ్ 359 పరుగుల తేడాతో కివీస్ చిత్తు చేసింది. టెస్టుల్లో పరుగుల పరంగా న్యూజిలాండ్ ఇదే అతి పెద్ద విజయం. అంతేకాకుండా ఈ భారీ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ 2-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. నిప్పులు చెరిగిన హెన్రీఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్ మాట్ హెన్రి 5 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అతడితో పాటు జకారీ ఫౌల్క్స్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బ్రెండన్ టేలర్ (44), వికెట్ కీపర్ బ్యాటర్ టఫాజ్వ త్సింగా (33 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.ముగ్గురు మొనగాళ్లు..అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 601/3 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153) ,హెన్రీ నికోల్స్(150 నాటౌట్),రచిన్ రవీంద్ర(165 నాటౌట్) భారీ సెంచరీలతో చెలరేగారు. వీరి ముగ్గురుతో పాటు విల్ యంగ్(74) పరుగులతో రాణించాడు.దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు జింబాబ్వే కంటే 476 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జింబాబ్వే 117 పరుగులకే చాపచుట్టేసింది. కివీస్ బౌలర్లలో జకారీ ఫౌల్క్స్ 5 వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, డఫీ తలా రెండేసి వికెట్లు సాధించారు.మూడో జట్టుగా..కాగా ఈ విజయంతో న్యూజిలాండ్ మరో రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించిన మూడో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1958లో ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను 336 పరుగుల తేడాతో ఓడించింది. తాజా గెలుపుతో విండీస్‌ను కివీస్ అధిగమించింది. కాగా అరుదైన రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ అగ్రస్ధానంలో ఉంది. 1938లో 579 పరుగుల తేడాతో ఆసీస్‌ను ఇంగ్లీష్ జట్టు ఓడించింది.చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై బ్యాన్!? -
న్యూజిలాండ్ శతకాల మోత
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు వంతులు వేసుకున్నట్లు సెంచరీలతో విజృంభించారు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరు 174/1తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... చివరకు 130 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 601 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (245 బంతుల్లో 153; 18 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (245 బంతుల్లో 150 బ్యాటింగ్; 15 ఫోర్లు), రచిన్ రవీంద్ర (139 బంతుల్లో 165 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శతకాలతో కదంతొక్కారు. నైట్‌వాచ్‌మన్ జాకబ్ డఫీ (36; 6 ఫోర్లు) త్వరగానే అవుట్ కాగా... కాన్వే, నికోల్స్ మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కాన్వే 143 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రచిన్ రవీంద్ర క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు వరకు టెస్టు మ్యాచ్ తరహాలో సాగిన పోరును... రచిన్ వన్డేలాగా మార్చేశాడు. ధనాధన్ షాట్లతో రెచ్చిపోతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో నికోల్స్ కాస్త నిధానంగా ఆడగా... రచిన్ మాత్రం జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నాడు. నికోల్స్ 166 బంతుల్లో మూడంకెల స్కోరుకు చేరగా... రవీంద్ర చూస్తుండగానే 104 బంతుల్లో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన ఈ జంట ఆఖరి సెషన్ చివరి గంటలో చెలరేగిపోయింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. సెంచరీ నుంచి 150కి చేరేందుకు రవీంద్ర 29 బంతులు మాత్రమే తీసుకున్నాడంటే అతడి జోరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రచిన్, నికోల్స్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 256 పరుగులు జోడించారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, ట్రేవర్, మసెకెసా తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే ఆలౌట్ కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న న్యూజిలాండ్ 476 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
అరుదైన మైలురాయిని తాకిన డెవాన్ కాన్వే
న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ వెటరన్ బ్యాటర్ టెస్ట్‌ల్లో 2000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 72 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 2000 పరుగుల మార్కును తాకాడు. 79 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.ఇటీవలికాలంలో పేలవ ఫామ్‌లో ఉండిన కాన్వే.. ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్‌తోనే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో 88 పరుగులు చేశాడు. 2021లో ఇంగ్లండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన కాన్వే.. తన తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ బాదాడు. టెస్ట్ కెరీర్లో 29 మ్యాచ్‌లు ఆడిన కాన్వే 4 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. జింబాబ్వేను 125 పరుగులకు కుప్పకూల్చిన ఆ జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 174 పరుగులు చేసింది. కాన్వేతో (79) పాటు జేకబ్ డఫీ (8) క్రీజ్‌లో ఉన్నారు. విల్ యంగ్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు.అంతకుముందు మ్యాట్ హెన్రీ (15-3-40-5), జకరీ ఫోల్క్స్ (16-5-38-4) విజృంభించడంతో జింబాబ్వే 125 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మూడున్నరేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్ (44) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్ కీపర్ విన్సెంట్ మసేకెసా 33 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్ కొసం న్యూజిలాండ్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
జింబాబ్వే ప్లేయర్ వరల్డ్ రికార్డు..
జింబాబ్వే సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. బులవాయో వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో టేలర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో టేలర్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.21వ శతాబ్దంలో లాంగెస్ట్ టెస్టు క్రికెట్ ఆడిన ప్లేయర్‌గా టేలర్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 2004లో జింబాబ్వే తరపున అరంగేట్రం చేసిన బ్రెండన్.. ఇప్పటివరకు 21 ఏళ్ల 93 రోజుల పాటు టెస్టుల్లో కొనసాగాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేరిట ఉండేది. ఆండర్సన్ తన కెరీర్లో 21 ఏళ్ల 51 రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడాడు. తాజా మ్యాచ్‌తో ఆండర్సన్ ఆల్‌టైమ్ రికార్డును టేలర్ బ్రేక్ చేశాడు. కాగా 39 ఏళ్ల టేలర్‌పై 2022లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేదం విధించింది. ఓ వ్యాపారవేత్త నుండి బహుమతులు తీసుకోవడంతో అతడిపై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పుడు ఐసీసీ అతడిపై బ్యాన్ ఎత్తేయడంతో రీఎంట్రీ ఇచ్చాడు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. కివీస్ పేసర్ మాట్ హెన్రీ 6 వికెట్లు పడగొట్టి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. హెన్రీతో పాటు జకారీ ఫౌల్క్స్ 4 వికెట్లు సాధించాడు. ఇక జింబాబ్వే బ్యాటర్లలో బ్రెండన్ టేలర్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిసాగా(33) రాణించారు. -
చరిత్ర సృష్టించిన మాట్ హెన్రీ.. ఆల్‌టైమ్ రికార్డు సమం
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగాడు. అతడు బౌలింగ్ దాటికి పసికూన జింబాబ్వే విల్లవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్‌లో హెన్రీ 5 వికెట్లతో సత్తాచాటాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జింబాబ్వే కేవలం 125 పరుగులకే కుప్పకూలింది.కివీస్ బౌలర్లలో హెన్రీతో పాటు జకారీ ఫౌల్క్స్ 4 వికెట్లతో అదరగొట్టాడు. ఇక జింబాబ్వే బ్యాటర్లలో మూడేళ్ల తర్వాత జట్టులో ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిసాగా(33) రాణించారు. ఈ క్రమంలో మాట్ హెన్రీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.జింబాబ్వేపై టెస్టుల్లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ల హాల్ సాధించిన న్యూజిలాండ్ బౌలర్‌గా క్రిస్ కెయిర్న్స్ రికార్డును హెన్రీ సమం చేశాడు. కెయిర్న్స్ తన కెరీర్లో జింబాబ్వేపై 8 టెస్టులు ఆడి 39 వికెట్లు సాధించాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి. మాట్ హెన్రీ కెరీర్లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి.కాగా తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. 32 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 150 పరుగులు చేసింది. క్రీజులో విల్ యంగ్(69), కాన్వే(71) ఉన్నారు.చదవండి: Asia cup 2025: ఆసియాకప్ నుంచి తప్పుకొన్న పాకిస్తాన్..? -
న్యూజిలాండ్ జట్టుకు మరో బిగ్ షాక్
జింబాబ్వేతో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 7) ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు వరుస షాక్‌లు తగిలాయి. తొలుత పేసర్ విలియమ్ ఓరూర్కీ వెన్ను గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకోగా.. తాజాగా రెగ్యులర్ కెప్టెన్ టామ్ లాథమ్ ఫిట్నెస్ పరీక్షను క్లియర్ చేయలేక సిరీస్ నుంచి వైదొలిగాడు. ఓరూర్కీకి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బెన్ లిస్టర్‌ను ఎంపిక చేసిన న్యూజిలాండ్ సెలెక్టర్లు.. లాథమ్‌కు రీప్లేస్‌మెంట్‌గా 23 ఏళ్ల ఆక్లాండ్ బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌ను సెలెక్ట్ చేశారు.లిస్టర్ ఇదివరకే జట్టులో చేరిపోగా.. జొహనెస్‌బర్గ్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న జాకబ్స్‌ను హుటాహుటిన జట్టులో చేరాలని మేనేజ్మెంట్ ఆదేశించింది. లాథమ్ గైర్హాజరీలో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్ సారధిగా కొనసాగనున్నాడు. లాథమ్ భుజం గాయంతో బాధపడుతుండటంతో సాంట్నర్ తొలి టెస్ట్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో టెస్ట్ భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ ఉగ్రరూపం దాల్చి జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించాడు. హెన్రీ ధాటికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన హెన్రీ, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.ఆ మ్యాచ్‌లో ప్రస్తుతం గాయపడిన పేసర్ విలియమ్ ఓరూర్కీ కూడా పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయలేకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు డెవాన్ కాన్వే (88), డారిల్ మిచెల్ (80) కూడా రాణించారు. కాన్వే చాలాకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. -
చెలరేగిపోయిన మ్యాట్ హెన్రీ.. పసికూనపై ప్రతాపం చూపించిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ జట్టు పసికూన జింబాబ్వేపై తమ ప్రతాపాన్ని చూపించింది. బులవాయో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. మ్యాట్ హెన్రీ (15.3-3-39-6), నాథన్ స్మిత్ (14-8-20-3) ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (88), డారిల్ మిచెల్ (80) రాణించడంతో 307 పరుగులు చేసింది. బ్లెస్సింగ్ ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు.158 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఈ ఇన్నింగ్స్‌లో కూడా చేతులెత్తేసింది. మిచెల్ సాంట్నర్ (17.1-6-27-4), మ్యాట్ హెన్రీ (21-5-51-3), విలియమ్ ఓరూర్కీ (10-4-28-3) ధాటికి 165 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన సీన్ విలియమ్స్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం 8 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 2.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 7 నుంచి ప్రారంభం కానుంది. -
రాణించిన కాన్వే, మిచెల్.. న్యూజిలాండ్ 307 పరుగులకు ఆలౌట్
బులవాయో (జింబాబ్వే): బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మంచి స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 92/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 96.1 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.డెవాన్ కాన్వే (170 బంతుల్లో 88; 12 ఫోర్లు), డారిల్ మిచెల్ (119 బంతుల్లో 80; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించగా... విల్ యంగ్ (70 బంతుల్లో 41; 4 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (34; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రచిన్ రవీంద్ర (2), బ్లండెల్ (2), బ్రేస్‌వెల్ (9) విఫలమయ్యారు.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని 3, చివాంగ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.బెనెట్ (18), బెన్ కరన్ (11) పెవిలియన్ చేరగా... నిక్ వెల్చ్ (2 బ్యాటింగ్), మసెకెసా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ, రూర్కె చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న జింబాబ్వే... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్ -
నిప్పులు చెరిగిన మ్యాట్ హెన్రీ.. విలవిలలాడిపోయిన పసికూన
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (జులై 30) తొలి టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ధాటికి 149 పరుగులకే ఆలౌటైంది. హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో జింబాబ్వే ప్లేయర్ల భరతం పట్టాడు. 15.3 ఓవర్లలో కేవలం 39 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. అతనితో పాటు మరో పేసర్ నాథన్ స్మిత్ (14-8-20-3) కూడా చెలరేగడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వికెట్‌కీపర్ సిగా (30), నిక్ వెల్చ్ (27), బెన్ కర్రన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మ్యాట్ హెన్రీకి 30 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఇది ఐదో 5 వికెట్ల ప్రదర్శన. హెన్రీ ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుత పేసర్లలో బుమ్రా, హాజిల్‌వుడ్ మాత్రమే ఇది సాధ్యమవుతుంది. హెన్నీ 30 టెస్ట్‌ల్లో 126 వికెట్లు, 91 వన్డేల్లో 165 వికెట్లు, 25 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. హెన్రీ అడపాదడపా బ్యాట్‌తోనూ సత్తా చాటగలడు. ఇతని పేరిట టెస్ట్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇదిలా ఉంటే, ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జింబాబ్వేలోనే ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్ ఫైట్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది విజేతగా అవతరించింది. ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌ల్లో రాణించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి. -
వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న కేన్ విలియమ్సన్.. 45వ శతకం
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో చెలరేగిపోతున్నాడు. వరుస సెంచరీలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌తోనే మిడిల్సెక్స్తో జతకట్టిన కేన్.. అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసి, తాజాగా రెండో మ్యాచ్‌లోనూ శతకం నమోదు చేశాడు. కేన్ మామకు ఇది ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 45వ శతకం.గ్లోసెస్టర్‌షైర్‌తో నిన్న (జులై 29) మొదలైన మ్యాచ్‌లో కేన్ 112 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. ఇవాళ రెండో రోజు ఆట ప్రారంభం కావాల్సి ఉంది. కేన్ అరంగేట్రం మ్యాచ్‌లో నార్తంప్టన్‌షైర్‌పై 159 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో మిడిల్సెక్స్ ఇన్నింగ్స్ 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి మిడిల్సెక్స్ 3 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. కేన్‌తో పాటు కెప్టెన్ లూస్ డు ప్లూయ్ (42) క్రీజ్‌లో ఉన్నారు. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో జాషువ డి కెయిర్స్ 58, సామ్ రాబ్సన్ 4, మ్యాక్స్ హోల్డన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. గ్లోసెస్టర్‌షైర్ బౌలర్లలో మ్యాట్ టేలర్ 2, బెన్ చార్ల్స్వర్త్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, కేన్ ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు దూరంగా ఉన్నాడు. మిడిల్సెక్స్తో ఉన్న కమిట్మెంట్స్ కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేడు. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటస్తుంది. ఈ పర్యటనలో కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి కేన్ స్వచ్చందంగా తప్పుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. -
న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్
రేపటి నుంచి (జులై 30) జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. లాథమ్ గైర్హాజరీలో మిచెల్ సాంట్నర్ న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. సాంట్నర్ న్యూజిలాండ్ టెస్ట్ జట్టుకు 32వ కెప్టెన్ అవుతాడు.లాథమ్ ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన ఓ టీ20 మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. జింబాబ్వేతో తొలి టెస్ట్ సమయానికి లాథమ్ పూర్తిగా కోలుకోకపోవడంతో అతనికి ప్రత్యామ్నాయంగా సాంట్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.సాంట్నర్ ఇటీవల జింబాబ్వేలోనే జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను విజేతగా నిలిపాడు. ఈ టోర్నీ మొత్తంలో అజేయ జట్టుగా నిలిచిన న్యూజిలాండ్.. ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్ ఫైట్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌ల్లో రాణించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జులై 30 నుంచి ఆగస్ట్ 3- తొలి టెస్ట్ (బులవాయో)ఆగస్ట్ 7 నుంచి 11- రెండో టెస్ట్ (బులవాయో)జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, టామ్ బ్లండెల్, విలియమ్ ఓరూర్కీ, అజాజ్ పటేల్, జేకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్, మ్యాచ్ హెన్రీ -
కివీస్‌దే ముక్కోణపు టోర్నీ
ముక్కోణపు టి20 టోర్నమెంట్ ట్రోఫీ దక్కించుకోవాలంటే దక్షిణాఫ్రికా జట్టుకు 18 బంతుల్లో 37 పరుగులుకావాలి. అలాంటి దశలో... డెవాల్డ్ బ్రేవిస్ మూడు సిక్స్‌లతో విజృంభించడంతో సఫారీ సమీకరణం 6 బంతుల్లో 7 పరుగులకు చేరింది. ఇంకేముంది దక్షిణాఫ్రికా విజయం ఖాయమే అనుకుంటే... ఆఖర్లో కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ అద్భుతం చేశాడు. జోరుమీదున్న బ్రేవిస్, హెన్రీలను అవుట్ చేసి న్యూజిలాండ్‌కు ట్రోపీ కట్టబెట్టాడు. దీంతో సఫారీలకు నిరాశ తప్పలేదు. హరారే: ముక్కోణపు టి20 టోర్నమెంట్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శనివారం చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (31 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (27 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ సీఫెర్ట్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులకు పరిమితం అయింది. డ్రె ప్రిటోరియస్ (35 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశకతంతో రాణించగా... రీజా హెండ్రిక్స్ (37; 4 సిక్స్‌లు), డెవాల్డ్ బ్రేవిస్ (16 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. బంతి బంతికి సమీకరణాలు మారుతూ దక్షిణాఫ్రికా విజయం ఖాయమే అనుకుంటున్న సమయంలో హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అప్పటి వరకు ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు ఆఖర్లో ఒత్తిడికి చిత్తై ట్రోఫీని కివీస్‌కు కట్టబెట్టారు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ట్రోఫీ కైవసం చేసుకుంది. మ్యాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
పొట్టి క్రికెట్లో అరుదైన మైలురాయిని తాకిన న్యూజిలాండ్ ప్లేయర్
న్యూజిలాండ్ లెగ్ బ్రేక్ బౌలర్ ఐష్ సోధి అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకాడు. జింబాబ్వే ట్రై సిరీస్‌లో భాగంగా నిన్న (జులై 24) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన సోధి.. అంతర్జాతీయ టీ20ల్లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు (సోధితో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. సోధికి ముందు న్యూజిలాండ్‌కే చెందిన టిమ్ సౌథీ (164), ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ (161) ఈ మైలురాయిని తాకారు.సౌథీ 126 మ్యాచ్‌ల్లో 164 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ 96 మ్యాచ్‌ల్లో 161, సోధి 126 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు తీశారు. సోధి ఈ ఘనత సాధించే క్రమంలో ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా వేయకపోవడం విశేషం.భారత్ తరఫున టాప్‌లో అర్షదీప్అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అర్షదీప్ సింగ్ ఉన్నాడు. అర్షదీప్ 63 టీ20ల్లో 99 వికెట్లు తీశారు. అర్షదీప్ తర్వాత యుజ్వేంద్ర చహల్ (96), హార్దిక్ పాండ్యా (94) అత్యధిక టీ20 వికెట్లు తీసిన భారత బౌలర్లుగా ఉన్నారు.జింబాబ్వేతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆఖర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు. అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్‌వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.ఈ టోర్నీలో జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
పసికూనపై పరాక్రమం చూపించిన న్యూజిలాండ్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఇదివరకే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఫైనల్స్‌కు చేరిన ఆ జట్టు మరో విజయం సొంతం చేసుకుంది. పసికూన, ఆతిథ్య జింబాబ్వేతో ఇవాళ (జులై 24) జరిగిన నామామాత్రపు మ్యాచ్‌లో కివీస్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. టిమ్ సీఫర్ట్ (45 బంతుల్లో 75; 9 ఫోర్లు, సిక్స్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో టిమ్ రాబిన్సన్ 10, మార్క్ చాప్మన్ 0, బెవాన్ జాకబ్స్ 0, మిచెల్ సాంట్నర్ 7 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో మైఖేల్ బ్రేస్‌వెల్ (16 బంతుల్లో 26 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 4 వికెట్లు తీయగా.. మపోసా 2 వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు 18.5 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఐష్ సోధి (4-0-12-4) అద్భుతమైన బౌలింగ్ గణాంకాలతో జింబాబ్వేను మట్టికరిపించాడు. అతనికి మ్యాట్ హెన్రీ (3-0-34-2), జకరీ ఫౌల్క్స్ (3.5-0-14-1), విలియమ్ ఓరూర్కీ (3-0-19-1), మైఖేల్ బ్రేస్‌వెల్ (2-0-16-1) సహకరించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మున్యోంగా (40) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. డియాన్ మేయర్స్ (22), తషింగ ముసేకివా (21) రెండంకెల స్కోర్లు చేశారు.జింబాబ్వే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో మరో జట్టైన సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జులై 26న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
44వ శతకం నమోదు చేసిన కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్-2 పోటీల్లో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌తో మిడిల్సెక్స్ తరఫున అరంగేట్రం చేసిన కేన్.. తన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టి తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు. 147 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కేన్.. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో కేన్‌తో పాటు మ్యాక్స్ హోల్డన్ (151) కూడా సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న మిడిల్సెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు 129 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 546 పరుగులు చేసింది. కెప్టెన్ లూస్ డు ప్లూయ్ (69), జాక్ క్రాక్నెల్ (67) క్రీజ్‌లో ఉన్నారు. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో సామ్ రాబ్సన్ (57) కూడా అర్ద సెంచరీతో రాణించగా.. ర్యాన్ హిగ్గిన్స్ 35 పరుగులు చేశాడు. బెన్ గెడ్డెస్ డకౌటయ్యాడు.నార్తంప్టన్‌షైర్ బౌలర్లలో బెన్ సాండర్సన్, సైఫ్ జైబ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. లియామ్ గుథ్రీ ఓ వికెట్ దక్కించుకున్నాడు. నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్న భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. 36 ఓవర్లు వేసి ఏకంగా 144 పరుగులు సమర్పించుకున్నాడు. -
టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
జింబాబ్వే ట్రై సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరిగిన ఐదో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 134 పరుగులకే (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. జేకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ తలో 2, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో జార్జ్ లిండే (23 నాటౌట్) గౌరవప్రదమైన స్కోర్ కోసం పోరాడాడు. కెప్టెన్ డస్సెన్ 14, రూబిన్ హెర్మన్ 10, డెవాల్డ్ బ్రెవిస్ 13, డ్రి ప్రిటోరియస్ 1, సైమ్‌లేన్ 11, కొయెట్జీ 0, ముత్తుసామి 8, ఎన్ పీటర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (19), రచిన్ రవీంద్ర (3), మార్క్ చాప్మన్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. డారిల్ మిచెల్ (20 నాటౌట్) సహకారంతో సీఫర్ట్ న్యూజిలాండ్‌ను గెలిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సైమ్‌లేన్ ఓ వికెట్ పడగొట్టాడు.కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇదివరకే ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆతిథ్య జట్టు జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 24న జరుగబోయే నామమాత్రపు మ్యాచ్‌లో జింబాబ్వే న్యూజిలాండ్‌తో తలపడనుంది. జులై 26న హరారేలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటాయి. -
కాన్వే హాఫ్ సెంచరీ.. న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం
జింబాబ్వే వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. హరారే వేదికగా శుక్రవారం ఆతిథ్య జింబాబ్వే జట్టును 8 వికెట్ల తేడాతో కివీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసింది.జింబాబ్వే బ్యాటర్లలో మాధేవేరే(36) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెన్నట్(21) పర్వాలేదన్పించాడు. బ్లాక్‌క్యాప్స్ బౌలర్లలో మాట్ హెన్రీ మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీయగా.. మిల్నే, శాంట్నర్, బ్రెస్‌వేల్, రచిన్ రవీంద్ర తలా వికెట్ సాధించారు.కాన్వే హాఫ్ సెంచరీ.. అనంతరం 121 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(59 నాటౌట్) ఆర్ధశతకంలో మెరవగా.. రచిన్ రవీంద్ర(30), డార్లీ మిచెల్(26 నాటౌట్) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో మాపోసా, ముజర్బానీ తలా వికెట్ సాధించారు. ఈ సిరీస్‌లో భాగంగా జూలై 20న హరారే వేదికగా జింబాబ్వే, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్
జులై 14 నుంచి జింబాబ్వేలో జరుగబోయే ముక్కోణపు టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ ఫిన్ అలెన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలెన్ ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ సందర్భంగా శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు ఆడుతూ గాయపడ్డాడు (ఫుట్ ఇంజ్యూరి). అలెన్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరం క్లారిటీ వస్తుందని వైద్యులు తెలిపారు. అలెన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగాని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ముక్కోణపు టోర్నీలో జింబాబ్వే, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా పాల్గొంటుంది.భీకర ఫామ్‌లో అలెన్ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లో ఫిన్ అలెన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లోనే అతను సుడిగాలి శతకం (51 బంతుల్లో 151) విరుచుకుపడ్డాడు. అనంతరం జరిగిన మ్యాచ్‌ల్లో మరో రెండు మెరుపు అర్ద సెంచరీలు చేశాడు. ఈ లీగ్‌లో అలెన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 333 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అత్యధిక స్ట్రయిక్‌రేట్ (225) అలెన్‌దే.అలెన్ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ఈ సీజన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది. రేపు (భారతకాలమానం ప్రకారం) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూనికార్న్స్ ఎంఐ న్యూయార్క్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ముక్కోణపు టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్‌ను జులై 16న ఆడనుంది. ఆ మ్యాచ్‌లో కివీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అతిథ్య జింబాబ్వే, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ టోర్నీ ఫైనల్ జులై 26న జరుగనుంది. టోర్నీ మొత్తం హరారేలో జరుగనుంది. -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. తప్పుకొన్న కేన్ విలియమ్సన్
ఈ నెలాఖరులో జింబాబ్వేతో ప్రారంభం కాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జులై 8) ప్రకటించారు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ లేకుండానే న్యూజిలాండ్ ఈ సిరీస్ ఆడనుంది. ఇతరత్రా ప్లేయింగ్ కమిట్మెంట్స్ కారణంగా కేన్ ఈ టూర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. కేన్ ప్రస్తుతం విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీలో మిడిల్‌సెక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీ కోసమే కేన్ జింబాబ్వే సిరీస్‌ను వద్దనుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో కేన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకు కేన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జింబాబ్వే సిరీస్ నుంచి మరో స్టార్ ఆటగాడు కూడా తప్పుకొన్నాడు. ఫ్రాంచైజీ కమిట్మెంట్స్ కారణంగా మైఖేల్ బ్రేస్‌వెల్ జింబాబ్వే సిరీస్‌కు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. ఈ సిరీస్ సమయంలో బ్రేస్‌వెల్ హండ్రెడ్ లీగ్‌లో ఆడాల్సి ఉంది. స్టార్ పేసర్ కైల్ జేమీసన్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. అతని భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉన్నందున అతను ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ మార్పులు మినహా మిగతా జట్టు మొత్తం యధాతథంగా కొనసాగనుంది. కెప్టెన్‌గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. లెఫ్ట్మార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, బ్యాటర్ హెన్రీ నికోల్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. కొత్తగా యువ పేసర్ మ్యాట్ ఫిషర్ జట్టులోకి వచ్చాడు. ఫిషర్ దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించి జాతీయ జట్టు నుంచి పిలుపందుకున్నాడు. ఫిషర్ 14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 24.11 సగటున 51 వికెట్లు పడగొట్టాడు.రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జులై 30 నుంచి న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. తొలి టెస్ట్ జులై 30న, రెండో టెస్ట్ ఆగస్ట్ 7న ప్రారంభమవుతాయి. రెండు మ్యాచ్‌లు బులవాయో వేదికగా జరుగుతాయి. -
న్యూజిలాండ్‌లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
న్యూజిలాండ్‌లోని ప్రధాన నగరాల్లో కూడా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్‌లోని పిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో–కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, డేగపూడి సమంత్, సభ్యులు బాలశౌర్య, రాజారెడ్డి, పిళ్లా పార్థ, జిమ్మి, గీతారెడ్డి, ఆళ్ల విజయ్, రమేష్ పనటి, సంకీర్త్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.భారతదేశం నుండి గౌరవ అతిథులుగా అలూరు సంబ శివ రెడ్డి , ఆరే శ్యామల రెడ్డి, జి. శాంత మూర్తి , నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ ఉడ్ హాజయ్యారు. ఎన్నారైలు బీరం బాల, కళ్యాణ్‌రావు, కోడూరి చంద్రశేఖర్, అర్జున్‌రెడ్డి, మల్లెల గోవర్ధన్, జగదీష్ రెడ్డి, ఇందిర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా రక్తదానం చేసిన YSRCP న్యూజిలాండ్ బృందం
-
వైఎస్సార్ పేరుతో న్యూజిలాండ్‌లో రక్తదానం
సాక్షి,అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఆక్లాండ్‌లో వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ బృందం శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఆనంద్ ఎద్దుల మాట్లాడుతూ జూలై 8న డాక్టర్ వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ రక్తదానంలో ఆనంద్ ఎద్దుల, బుజ్జి బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, రమేశ్ పనాటి, విజయ్ అల్ల, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సిడ్నీలో ఘనంగా జయంతి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని సిడ్నీలో శుక్రవారం ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పాలనను స్మరించుకుంటూ ఆయన ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న ప్రేమను గుర్తుచేసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల నిర్మాణం, ఐటీ రంగ అభివృద్ధి, 108 అంబులెన్స్‌లు, నీటి ప్రాజెక్టులు వంటి ఎన్నో పథకాల ద్వారా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిడ్నీ కన్వీనర్ అమర్నాథ్ రెడ్డితో పాటు ఎన్ఆర్ఐలు రామనాథ్ రెడ్డి, రాజశేఖర్ లంకెల, మల్లికార్జున రెడ్డి, శ్రీనివాస్ బెతంశెట్టి, విష్ణువర్ధన్ రెడ్డి, పవన్ జవాజి, మను రెడ్డి, తిమ్మా రెడ్డి, రాజ్ బద్దం, చంద్ర మౌళి, పెద్దిరెడ్డి, ఉమేష్ కుర్బా, శ్రీనివాస్ గాయం, సురేశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మాట న్యూజీలాండ్ నూతన కార్యవర్గం ఏర్పాటు
మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ - మాట న్యూజీలాండ్ నూతన కార్యవర్గం కొలువుతీరింది. ఈ సందర్భంగా న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ లో నిర్వహించిన స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఇన్కార్పొరేటెడ్ యొక్క మేనేజ్మెంట్ కోర్ కమిటీని పరిచయం చేశారు. మన ఆంధ్ర తెలుగు సంఘం అధ్యక్షుడిగా బుజ్జే బాబు నెల్లూరి బాధ్యతలు స్వీకరించారు. రిలీజియస్ ఇంఛార్జి వి. నాగరాజు, స్పోర్ట్స్ వింగ్ ఇన్చార్జ్ బాల శౌరెడ్డి కాసు, ట్రెజరర్ దుర్గా ప్రసాద్, జనరల్ సెక్రటరీ సాయి సుశ్వంత్, జాయింట్ సెక్రటరీ కృష్ణ ముళ్లపూడి, మహిళా విభాగం కోఆర్డినేటర్ గీర్వాణి హారిక కామనూరు, మహిళా విభాగం కోఆర్డినేటర్ హారిక సుంకరి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి కూనపరెడ్డి, ఐటీ ఇన్చార్జ్ వెంకటరామయ్య కూనపరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. PRO రవి తుమ్మల, మహిళా విభాగం సమన్వయకర్త కళ్యాణి , ఇన్వెంటరీ స్పెషలిస్ట్ రాజారెడ్డి వూటుకూరుతో పాటు మరో ఇద్దరు కార్యనిర్వాహక సభ్యులు ఆన్లైన్లో హాజరయ్యారు. మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఘౌస్ మజీద్ తో పాటు పలువురు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఘౌస్ మజీద్ MATA NZ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. అసోసియేషన్‌కు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. నూతనంగా ఎన్నికైన కమిటీని మజీద్ హృదయపూర్వకంగా అభినందించారు. నూతన మేనేజ్మెంట్ కోర్ కమిటీకి అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. -
మంచు ఫ్యామిలీకి 7 వేల ఎకరాలు.. క్లారిటీ ఇచ్చిన బ్రహ్మాజీ
సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా అది వార్త అవుతుంది. అందుకే వాళ్లు ఆచి తూచి మాట్లాడుతుంటారు. అయితే కొన్ని సార్లు వాళ్లు జోక్ చేసినా..అది బెడిసి కొడుతుంది. వారి సరదా సంభాషణను వక్రీకరించి.. అదే నిజం అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ విషయంలో అదే జరిగింది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సరదాగా చెప్పిన ఓ విషయాన్ని.. సోషల్ మీడియా మరోలా ప్రచారం చేసింది. చివరకు ఆ వీడియో షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ(Brahmaji).. వివరణ ఇవ్వడంతో ఫేక్ ప్రచారానికి కాస్త బ్రేక్ పడింది. ఇంతకీ మంచు ఫ్యామిలీ చేసిన ఆ సరదా వీడియో ఏంటి? అసలు ఏం జరిగింది?700 ఎకరాలు మనదే..: మోహన్బాబుమంచు ఫ్యామిలీ ఇప్పుడు కన్నప్ప(Kannappa) ప్రమోషన్లో బిజీ అయిపోయింది. మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో కన్నప్ప టీం చిల్ అయిన వీడియోని నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో మోహన్ బాబు, విష్ణు సముద్రం పక్కన ఉన్న ఓ సువిశాలమైన మైదానంలో తిరుగుతూ.. ‘ఇదంతా నాదే.. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం. పక్కనే ఉన్న సముద్రం కూడా మంచు విష్ణుదే’ అని మోహన్ బాబు సరదాగా అంటాడు. మోహన్ బాబు కామెడీగా చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిజంగానే మంచు ఫ్యామిలీ న్యూజిలాండ్‌లో స్థలాలు కొన్నారు అన్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో చివరకు వీడియో షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ దీనిపై వివరణ ఇచ్చాడు.అరే భాయ్.. అంత ఈజీనా?సరదాగా చేసిన వీడియోపై నెగెటివ్‌గా వార్తలు రావడంతో బ్రహ్మాజీ సంబంధించాడు. జోక్‌గా చేసిన వ్యాఖ్యలను కూడా ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫన్ కోసమే ఆ వీడియోని షేర్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. ‘ సరదా కోసమే ఆ వీడియో చేశాం. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నామని మోహన్ బాబు సరదాగా అన్నారు. అక్కడి పర్వతాలు కూడా కొన్నామని జోక్ చేశాడు. కానీ సడెన్‌గా నిజంగానే అక్కడ 7 వేల ఎకరాలు కొన్నారని వార్తలు రాశారు. అరే భాయ్.. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొనడం అంత ఈజీనా? షూటింగ్ కోసం అక్కడి వెళ్లాం అంతే. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. . నాన్ సిటీజెన్స్లకు న్యూజిలాండ్‌లో స్థలాలు అమ్మరు. అక్కడి సిటిజన్స్‌కి మాత్రమే స్థలాలు కొనే హక్కు ఉంది. సరదా సంభాషణలను సీరియస్‌గా తీసుకోకండి. ఇప్పుడు నవ్వుకోండి. కానీ కామెడీని మరోలా మార్చి చెప్పకండి’ అని బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. -
వరల్డ్‌కప్ తర్వాత వన్డేలకు గుడ్‌బై చెప్పనున్న దిగ్గజ క్రికెటర్
న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, ఆ దేశ మహిళా క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సారధి సోఫీ డివైన్ త్వరలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనుంది. ఈ ఏడాది భారత్, శ్రీలంకల్లో జరిగే ప్రపంచకప్ తర్వాత డివైన్ 50 ఓవర్ల ఫార్మాట్‌కు దూరం కానుంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ అధికారికంగా ధృవీకరించింది.పేస్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన 35 ఏళ్ల డివైన్.. క్రమంగా బ్యాటర్‌గా పరిణితి చెంది న్యూజిలాండ్ తరఫున 2006 నుంచి 152 వన్డేలు ఆడింది. కెరీర్ తొలి నాళ్లలో డివైన్ 11వ నంబర్ ప్లేయర్‌గా బరిలోకి దిగేది. బ్యాటర్‌గా రాటుదేలాక డివైన్ 139 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు సాయంతో 3990 పరుగులు చేసింది.ఈ ఫార్మాట్లో ఆమె 107 వికెట్లు కూడా తీసింది. సూజీ బేట్స్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన మహిళా క్రికెటర్‌గా డివైన్ రికార్డు నెలకొల్పింది. అలాగే న్యూజిలాండ్ తరఫున సూజీ బేట్స్ తర్వాత రెండో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా.. న్యూజిలాండ్ తరఫున నాలుగో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా.. లియా తహుహు తర్వాత న్యూజిలాండ్ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పలు రికార్డులు సొంతం చేసుకుంది.2020లో న్యూజిలాండ్ పెర్మనెంట్ కెప్టెన్‌గా ఎంపికైన డివైన్.. 2024లో తన సారథ్యంలో న్యూజిలాండ్‌ను టీ20 వరల్డ్‌కప్ గెలిపించింది. అయితే వన్డేల్లో మాత్రం డివైన్ న్యూజిలాండ్‌ను గత రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో గ్రూప్ దశ దాటించలేకపోయింది. డివైన్ సారథ్యంలో న్యూజిలాండ్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కాబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ అక్టోబర్ 1న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇండోర్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియను ఢీకొంటుంది. అక్టోబర్ 23న న్యూజిలాండ్ టీమిండియాతో తలపడుతుంది. గౌహతిలో ఈ మ్యాచ్ జరుగనుంది.డివైన్ న్యూజిలాండ్ మహిళా క్రికెటర్‌గానే కాకుండా ఆ దేశ జాతీయ హాకీ టీమ్‌లోనూ సభ్యురాలిగా ఉండింది. కొంతకాలం తర్వాత ఆమె క్రికెట్‌నే ఫుల్‌టైమ్ కెరీర్‌గా ఎంచుకుంది. డివైన్ తన కెరీర్ మొత్తంలో బ్యాటింగ్ చేసే సమయంలో హెల్మెట్ లేకుండా బరిలోకి దిగేది. దీని వల్ల ఆమెకు విశేష ప్రచారం లభించింది. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా డివైన్ తన టీ20 కెరీర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డివైన్ న్యూజిలాండ్ తరఫున 146 టీ20లు ఆడి సెంచరీ, 21 హాఫ్ సెంచరీల సాయంతో 3431 పరుగులు చేసింది. బౌలింగ్‌లో 119 వికెట్లు పడగొట్టింది. -
వైజాగ్‌లో భారత్, కివీస్ టి20
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియాతో కివీస్ 3 వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. దీనికి సంబంధించిన వేదికలు, షెడ్యూల్‌ను అపెక్స్ కౌన్సిల్ శనివారం ఖరారు చేసింది. జనవరి 11న ప్రారంభం కానున్న ఈ పర్యటన 31 జనవరితో ముగియనుంది.11న బరోడాలో తొలి వన్డే, 14న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, 18న ఇండోర్‌లో మూడో వన్డే జరగనున్నాయి. ఇక నాగ్‌పూర్, రాయ్‌పూర్, గువాహటి, విశాఖపట్నం, త్రివేండ్రంలో టి20 సిరీస్ జరగనుంది. జనవరి 28న భారత్, న్యూజిలాండ్ నాలుగో టి20 మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒకటి హైదరాబాద్ వేదికగా జరగడం ఖాయమే అని అంతా భావించినా... అపెక్స్ కౌన్సిల్ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. రంజీ ట్రోఫీ షెడ్యూల్ విడుదల... దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2025–26వ సీజన్ ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు జరగనుంది. రెండు దశలుగా నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ ప్లేట్ గ్రూప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు... ఎలైట్ గ్రూప్‌నకు అర్హత సాధించనుంది. ఎలైట్‌లో పేవల ప్రదర్శన చేసిన ఒక జట్టు తదుపరి సీజన్లో ప్లేట్ గ్రూప్‌నకు పరిమితం కానుంది. ఈ మేరకు శనివారం నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయించారు. గతేడాది రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లో ఆడిన మేఘాలయ జట్టు ఏడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. దీంతో ఆట నాణ్యత దెబ్బతింటుందని భావించిన అపెక్స్ కౌన్సిల్... ఈశాన్య రాష్ట్రాల జట్ల నుంచి ఎలైట్ గ్రూప్‌నకు ప్రమోషన్ ఇచ్చే పద్ధతిని పక్కన పెట్టింది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 19 వరకు తొలి దశ రంజీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు రెండో దశ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 28 వరకు నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఆగస్టు 28 నుంచి జోనల్ ఫార్మాట్లో దులీప్ ట్రోఫీ జరగనుంది. అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఇరానీ కప్ నిర్వహించనున్నారు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఉన్న క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల తరహాలో కాకుండా... ఈ సీజన్ నుంచి ‘సూపర్ లీగ్’ నిర్వహించనున్నారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ ట్రోఫీ జరగనుంది. దేవజిత్ సైకియా నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో విజేతగా నిలిచిన అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నిర్వహించిన విజయోత్సవాల్లో తొక్కిసలాట జరగడంతో 11 మంది మృతించెందడంతో అపెక్స్ కౌన్సిల్ ఉత్సవాలకు సంబంధించి కొత్త విధివిధానాలు రూపొందించనుంది. ఇందు కోసం బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 15 రోజుల్లో ఈ కమిటీ మార్గదర్శకాలు రూపొందించనుంది. ‘ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని అపెక్స్ కౌన్సిల్ ఒక కొత్త కమిటీని నియమించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ కమిటీ విధివిధానాలు సిద్ధం చేయనుంది’ అని బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ మ్యాచ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఒక మ్యాచ్ జరిగే అవకాశాలున్నాయి. 2026 జనవరిలో టీమిండియాతో 3 వన్డేలు, 5 టి20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత్‌కు రానుంది. ఈ 8 మ్యాచ్‌ల కోసం జైపూర్, మొహాలీ, ఇండోర్, రాజ్‌కోట్, గువాహటి, హైదరాబాద్, త్రివేండ్రం, నాగ్‌పూర్ వేదికలను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ సిరీస్‌ల కోసం మరికొన్ని వేదికలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుండగా... రెండో మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు ఆడనుంది. 22 నుంచి గువాహటిలో రెండో టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్య సఫారీ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌లు వరుసగా రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నంలలో జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. రోస్టర్ విధానంలో అన్ని నగరాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం ఇవ్వడంలో భాగంగా... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే, టి20 సిరీస్‌ల కోసం హైదరాబాద్ వేదికను పరిశీలిస్తున్నారు. శనివారం జరగనున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ భేటీ అనంతరం కివీస్‌తో షెడ్యూల్ ప్రకటించనున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌ల అనంతరం ఫిబ్రవరి–మార్చిలో భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. -
దక్షిణాఫ్రికా పొమ్మంది.. న్యూజిలాండ్ రమ్మంది
న్యూజిలాండ్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికాకు చెందిన రాబ్ వాల్టర్ నియమితుడయ్యాడు. గత నెలలో ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్న గ్యారీ స్టెడ్ స్ధానాన్ని వాల్టర్ భర్తీ చేయనున్నాడు. 2028 టీ20 ప్రపంచకప్ వరకు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ న్యూజిలాండ్ క్రికెట్ (NZC) శుక్రవారం ధ్రువీకరించింది. ఈ ఏడాది జూలైలో జింబాబ్వేతో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లతో వాల్టర్ కివీస్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. కాగా కోచ్‌గా వాల్టర్‌కు అపారమైన అనుభవం ఉంది. మొన్నటివరకు సౌతాఫ్రికా వైట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్‌గా రాబ్ పనిచేశాడు. అతడి నేతృత్వంలోనే టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్‌కు ప్రోటీస్ జట్టు దూసుకెళ్లింది. అయినప్పటికి అతడి కాంట్రాక్ట్‌ను సౌతాఫ్రికా క్రికెట్ పొడిగించలేదు. అతడి స్ధానంలో ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా షుక్రి కాన్రాడ్‌ను సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. న్యూజిలాండ్ డిమాస్టిక్ క్రికెట్లో కూడా వాల్టర్ ఒటాగో వోల్ట్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. 2018-19, 2019-20లో వరుసగా ఫోర్డ్ ట్రోఫీ ఫైనల్స్లకు ఒటాగోనే వాల్టర్ చేర్చాడు. పూణే వారియర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా కూడా తన సేవలను అందించాడు.చదవండి: Shubman Gill: కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది -
ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.లారా మెక్‌క్లూర్.. న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్‌లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్‌లో అప్లోడ్ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.తద్వారా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘డీప్‌ఫేక్.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKESNew Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ యాప్‌లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం.


