ఐదు టీ20లు, మూడు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (నవంబర్ 5) తొలి టీ20 జరుగుతుంది. అక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. విండీస్ బ్యాటింగ్‌కు దిగింది.
రాణించిన హోప్
విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్‌లో బ్రాండన్ కింగ్ (3), ఐదో ఓవర్‌లో అలిక్ అథనాజ్ (16), ఎనిమిదో ఓవర్‌లో అకీమ్ అగస్టీ (2) ఔటయ్యారు.
ఈ దశలో కెప్టెన్ షాయ్ హోప్ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (28), రోవ్‌మన్ పావెల్ (33) సాయంతో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగలిగింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు రొమారియో షెపర్డ్ బౌండరీలు బాదాడు.
సత్తా చాటిన బౌలర్లు
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు సత్తా చాటారు. సాంట్నర్ మినహా అందరూ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, జకరీ ఫౌల్క్స్ తలో 2 వికెట్లు తీయగా.. జేమీసన్, నీషమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
తుది జట్లు..
వెస్టిండీస్: షాయ్ హోప్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్, అకీమ్ అగస్టీ, రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొసేన్, జేడన్ సీల్స్
న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ


