వన్డే ప్రపంచకప్ గెలిచాక భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సిరీస్ ఆడుతుంది. ఇవాల్టి నుంచి (డిసెంబర్ 21) స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. విశాఖ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. మంచు ప్రభావం కారణంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలవగానే సంకోచించకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో వైష్ణవి శర్మ అరంగేట్రం చేయనుంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది.
మరోవైపు టాస్ ఓడిన శ్రీలంక కూడా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఆ జట్టు కెప్టెన్ చమరి అతపత్తు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. 17 ఏళ్ల శశిని గిమ్హనై అందరి దృష్టిని ఆకర్శిస్తుందని తెలిపింది.
తుది జట్లు..
శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్‌కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనై
టీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి


