‘ఎ’ గ్రేడ్‌లో గిల్, బుమ్రా, జడేజా | Virat Kohli And Rohit Sharma Demoted To Grade B In BCCI Central Contract List For 2025-26, Check More Details Inside | Sakshi
Sakshi News home page

‘ఎ’ గ్రేడ్‌లో గిల్, బుమ్రా, జడేజా

Feb 9 2026 9:08 PM | Updated on Feb 10 2026 11:00 AM

Virat Kohli, Rohit Sharma Demoted To Grade B In BCCI Central Contract List For 2025-26

బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన  

‘బి’ గ్రేడ్‌కు కోహ్లి, రోహిత్‌  

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్‌ జట్టు ఆటగాళ్లకు సంబంధించి 2025–26కు గాను వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గత సీజన్‌ వరకు ఉన్న ‘ఎ ప్లస్‌’ గ్రేడ్‌ను తొలగించిన బోర్డు... ఈ సారి ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్‌లతోనే జాబితాను ఖరారు చేసింది. భారత టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో పాటు ఆల్‌ ఫార్మాట్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ‘ఎ’ గ్రేడ్‌లో స్థానం లభించగా...భారత టెస్టు జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవజు్ఞడైన రవీంద్ర జడేజాకు కూడా ‘ఎ’ గ్రేడ్‌ దక్కడం విశేషం.

 ఇప్పుడు కేవలం వన్డేలకే పరిమితమైన రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిను ‘బి’ గ్రేడ్‌లో చేర్చగా, టి20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా ‘బి’లోనే ఉన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌కు ‘సి’ నుంచి ‘బి’కు ప్రమోషన్‌ లభించగా...వన్డే, టి20ల్లో రెగ్యులర్‌ సభ్యుడైన అక్షర్‌ పటేల్‌ స్థాయిని తగ్గించి ‘సి’లోకి చేర్చారు. 2024–25 కాంట్రాక్ట్‌తో పోలిస్తే ఎవరినీ అదనంగా చేర్చలేదు. నాడు 34 మందితో జాబితా ఉండగా...ఇప్పుడు నలుగురు ఆటగాళ్లు షమీ, సర్ఫరాజ్, రజత్‌ పాటీదార్, ముకేశ్‌ కుమార్‌లను కాంట్రాక్ట్‌నుంచి తప్పించి 30 మందికి పరిమితం చేశారు.  

అక్టోబర్‌ 1, 2025 నుంచి 26 సెప్టెంబర్, 2026 మధ్య కాలానికి కొత్త కాంట్రాక్ట్‌లు వర్తిస్తాయి. 

గ్రేడ్‌ ‘ఎ’ – శుబ్‌మన్‌ గిల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా  
గ్రేడ్‌ ‘బి’ – రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, వాషింగ్టన్‌ సుందర్, కేఎల్‌ రాహుల్, సిరాజ్, హార్దిక్‌ పాండ్యా, రిషభ్‌ పంత్, కుల్దీప్‌ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్‌ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్‌.  
గ్రేడ్‌ ‘సి’ – అక్షర్‌ పటేల్, తిలక్‌ వర్మ, రింకూ సింగ్, శివమ్‌ దూబే, సంజు సామ్సన్, అర్‌‡్షదీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్, ధ్రువ్‌ జురేల్, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అభిõÙక్‌ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్‌ గైక్వాడ్‌.  

‘ఆ నలుగురు’ టాప్‌ గ్రేడ్‌లో...
భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌ కప్‌ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్లేయర్లకు ‘ఎ’ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ లభిం
చింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ‘ఎ’ జాబితాలో ఉన్నారు. గ్రేడ్‌ ‘బి’లో నలుగురు ప్లేయర్లు ఉండగా, గ్రేడ్‌ ‘సి’లో 13 మంది కలిపి మొత్తం 21 మంది సీనియర్‌ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్‌ ఇచి్చంది.  

గ్రేడ్‌ ‘ఎ’ – హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌  
గ్రేడ్‌ ‘బి’ – రేణుకా ఠాకూర్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్‌ రాణా 
గ్రేడ్‌ ‘సి’ – రాధ యాదవ్, అమన్‌జోత్‌ కౌర్, ప్రతీక రావల్, క్రాంతి గౌండ్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, యస్తిక భాటియా, హర్లీన్‌ డియోల్, కాశ్వీ గౌతమ్, కమలిని, వైష్ణవి శర్మ, తేజల్‌ హసబ్నిస్‌. 
 

ఆయా కాంట్రాక్ట్‌ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్‌ల్లో ఏ ప్లస్‌ గ్రేడ్‌లో ఉండిన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్‌-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్‌-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్‌-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement