చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే | T20 WC 2026: Zimbabwe beat Oman by 8 wickets | Sakshi
Sakshi News home page

చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే

Feb 9 2026 6:14 PM | Updated on Feb 9 2026 6:30 PM

T20 WC 2026: Zimbabwe beat Oman by 8 wickets

టీ20 ప్రపంచకప్‌ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్‌ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్‌ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్‌ ఈవాన్స్‌ (3.5-0-18-3), సికందర్‌ రజా (4-0-17-1) ధాటి​కి ఒమన్‌ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.

ఒమన్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్‌ మెహమూద్‌ 25, వినాయక్‌ శుక్లా 28, నదీద్‌ ఖాన్‌ 20 పరుగులు చేయడంతో ఒమన్‌ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్‌ కలీమ్‌, కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌, షా ఫైసల్‌ తలో 5 పరుగులు, షకీల్‌ అహ్మద్‌ 4, జితెన్‌ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్‌ మీర్జా, కరన్‌ సోనావలే డకౌట్లయ్యారు.

అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్‌ బెన్నెట్‌ (48 నాటౌట్‌), బ్రెండన్‌ టేలర్‌ (31 రిటైర్డ్‌ హర్ట్‌) రాణించారు. మరుమని 21, సికందర్‌ రజా 5 (నాటౌట్‌) పరుగులు చేయగా.. డియాన్‌ మైర్స్‌ డకౌటయ్యాడు. ఒమన్‌ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్‌ ముజరబానీకి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement