breaking news
Blessing Muzarabani
-
పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు! స్టార్ ప్లేయర్‌పై పీసీబీ సీరియస్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీపై పాక్ క్రికెట్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ముజారబానీ వాస్తవానికి ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది.వెస్టిండీస్ పేసర్ షమీర్ జోసెఫ్ స్థానంలో ముజారబానీతో ఇస్లామాబాద్ పీకేఆర్ 1.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ చివరి నిమిషంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ఆఫర్ రావడంతో ముజారబానీ తన మనసు మార్చుకున్నాడు.పీఎస్ఎల్ బదులుగా ఐపీఎల్లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో ముజారబానీని కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ముజారబానీపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు సమాచారం.ఏడాది పాటు పీఎస్ఎల్ ఆడకుండా అతడిపై నిషేధం విధించాలని పీసీబీ భావిస్తోందంట. కాగా పీఎస్ఎల్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్ వైపు ఆటగాళ్లు వెళ్లడం ఇది రెండోసారి. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కోర్బిన్ బాష్ ఇలాగే పెషావర్ జల్మీని వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరారు.దీంతో పీసీబీ అతడిపై ఏడాది నిషేధం విధించింది. ఈ రెండు టోర్నీలు ఒకే సమయంలో జరగనుండడంతో ఈ సమస్య తలెత్తుంది. పీఎస్ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అక్కడికి రెండు రోజులకే ఐపీఎల్ షురూ కానుంది.చదవండి: BAN vs PAK: 'క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ'.. బంగ్లా కెప్టెన్‌పై కైఫ్ ఫైర్ -
కేకేఆర్ జట్టులోకి డేంజరస్ బౌలర్
జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్లింగ్ ముజరబాని మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అవకాశం దక్కించుకున్నాడు. 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు ముజరబానిని ఎంచుకుంది. గత డిసెంబరులో తమ జట్టు నుంచి తప్పించిన ముస్తఫిజుర్ రహమాన్ స్థానంలో కేకేఆర్ ముజరాబానికి అవకాశం కల్పించింది. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న ముజరబాని తమ పేస్ బౌలింగ్ బృందంలో కీలకంగా మారతాడని కేకేఆర్ ఆశిస్తోంది. 89 అంతర్జాతీయ టి20ల్లో అతను 7.24 ఎకానమీతో 106 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల టి20 వరల్డ్ కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న 29 ఏళ్ల ముజరబాని మొత్తం 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్ ఎయిట్స్ దశకు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2025లో లుంగీ ఎన్గిడి స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముజరబానిని తమ టీమ్‌లోకి తీసుకుంది. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకున్నా... విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టులో అతను భాగమయ్యాడు.చదవండి: IPL 2026: కేకేఆర్‌కు మరో భారీ షాక్ -
IPL 2026: జింబాబ్వే బౌలర్‌కు బంపరాఫర్?
ఐపీఎల్-2026 సీజన్ మరో రెండు వారాల్లో షురూ కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానాన్ని భర్తీ చేసే పనిలో పడింది. అతడి స్దానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకోవాలని కేకేఆర్ భావిస్తున్నట్లు సమాచారం.ముజరబానీ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జింబాబ్వే సూపర్-8 స్టేజ్‌కు చేరుకోవడంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు వికెట్లు పడగొట్టి జింబాబ్వేకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.అతడికి పవర్‌ప్లేతో డెత్ ఓవర్లలో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్ సిద్దమైనట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ముజరబానీ ఇప్పటివరకు ఐపీఎల్లో అరంగేట్రం చేయలేదు. గత సీజన్ ఆఖరిలో ఆర్సీబీ జట్టులోకి వచ్చినప్పటికి.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు.ముస్తాఫిజుర్‌పై వేటు..కాగా గతేడాది జరిగిన మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను రూ.9.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. కానీ వేలం అనంతరం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోవడంతో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిని జట్టు నుంచి రిలీజ్ చేయాలని కేకేఆర్ సూచింది.బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ విడుదల చేసింది. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే కేకేఆర్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.18 కోట్ల భారీ ధర వెచ్చించి మరి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీషా పతిరానా, భారత ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా గాయాలతో పోరాడుతున్నారు. వీరిద్దరి అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు.కేకేఆర్ పూర్తి జట్టు:అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ (కీపర్), అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కామెరాన్ గ్రీన్, మతీషా పతిరానా, తేజస్వి సింగ్, ఫిన్ అలెన్ (కీపర్), కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, సార్థక్ రంజన్.చదవండి: భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్ ఆటగాళ్ల లిస్టు -
IND vs ZIM: హార్దిక్, తిలక్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్లు రాణించింది. బ్యాటర్లు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8లో తొలి మ్యాచ్‌లోనే బోల్తా పడింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. దీంతో జింబాబ్వే, వెస్టిండీస్‌లపై తప్పక గెలవాల్సిన పరిస్థితి.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీఇలాంటి దశలో గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (24) నిరాశపరచగా.. అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55) చాన్నాళ్ల తర్వాత బ్యాట్ ఝులిపించాడు. అభి అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) 24 బంతుల్లో 38 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.హార్దిక్, తిలక్ విధ్వంసంకెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు (13 బంతుల్లో 33) మెరిపించగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya), తిలక్ వర్మ దంచికొట్టారు. హార్దిక్ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 50 పరుగులతో అజేయంగా నిలవగా.. తిలక్ వర్మ 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టి 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించగా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 256 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గర్వ, బ్లెసింగ్ ముజర్బానీ, టినోటెండా మపోసా, కెప్టెన్ సికందర్ రజా తలా ఒక వికెట్ పడగొట్టారు.రికార్డు స్కోరుకాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతేకాదు టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగానూ భారత్ నిలిచింది. తాజాగా భారత్ జింబాబ్వేతో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 2007లో శ్రీలంక కెన్యా మీద ఆరు వికెట్ల నష్టానికి 260 రన్స్ రాబట్టింది.చదవండి: T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8— Star Sports (@StarSportsIndia) February 26, 2026 -
ఆసీస్‌కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్!
ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జింబాబ్వే బౌలర్ బ్లెసింగ్ ముజరబానీకి బంపరాఫర్ వచ్చింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో వెస్టిండీస్ స్టార్ పేసర్ షమార్ జోసెఫ్ స్థానాన్ని ముజరబానీ భర్తీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. షమార్ జోసెఫ్‌పై వేటుకాగా మార్చి 26న పాక్ సూపర్ లీగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. రూ. 1.1 కోట్లకు (పాక్ కరెన్సీలో) కొనుగోలు చేసి షమార్ జోసెఫ్‌పై వేటు వేసింది. ఈ విండీస్ పేసర్ స్థానంలో జింబాబ్వే స్టార్ ముజరబానీని చేర్చుకుంది. అయితే, టెక్నికల్ కమిటీ నుంచి ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది.ఇదిలా ఉంటే.. షమార్ జోసెఫ్‌ను జట్టు నుంచి తొలగించడం పట్ల ఇస్లామాబాద్ యునైటెడ్ నోరు విప్పలేదు. అటు జోసెఫ్ సైతం మౌనంగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర అంగీకారంతోనే అతడు తప్పుకొన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది.కారణం అదేనా?కాగా 2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసి.. సత్తా చాటిన షమార్ జోసెఫ్ వ్యక్తిగత ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డాడు. అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు షమార్ ఆడటాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ అతడితో బంధం తెంచుకోవడం గమనార్హం.ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన ముజరబానీఇక జింబాబ్వే రైటార్మ్ పేసర్ బ్లెసింగ్ ముజరబానీకి పాకిస్తాన్ సూపర్ లీగ్ కొత్తేమీ కాదు. 2021లో టైటిల్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. అయితే, గత కొంతకాలంగా అతడు పేలవ ప్రదర్శనతో సతమతమయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో ముజరబానీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి.. నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్ ఇంగ్లిస్ (8), టిమ్ డేవిడ్ (0), మ్యాట్ రెన్షా (65), ఆడం జంపా (2) వికెట్లు తన ఖాతాలో వేసుకుని జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలిచిన జింబాబ్వే.. 2007 తర్వాత టీ20 వరల్డ్‌కప్ తర్వాత రెండోసారి కంగారూ జట్టును ఓడించింది.చదవండి: IND vs PAK: ‘వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ -
వారెవ్వా జింబాబ్వే
ఆ్రస్టేలియా సొంతగడ్డపై ఆడినా... గడప దాటినా... ఫార్మాట్ ఏదైనా... చాంపియన్ జట్టు. ప్రొఫెషనలిజానికిమారుపేరు. అలాంటి జట్టు జింబాబ్వేలాంటి చిన్న జట్టుతో ఓడటం ఎవరి అంచనాలకూ అందని సంచలనమే! ఓ దుర్బేధ్యమైన జట్టు మళ్లీ అదే ప్రత్యర్థి చేతిలో రెండోసారి ఓడితే సంచలనానికి సీక్వెలే కదా! అవును... దాదాపు రెండు దశాబ్దాల తర్వాత టి20 ప్రపంచకప్‌లో జింబాబ్వే... ఆస్ట్రేలియాపై సీక్వెల్ బొమ్మ చూపించింది. 2007లో మొదలైన టి20 వరల్డ్‌కప్‌లో అప్పటి వన్డే వరల్డ్ చాంపియన్‌ను కంగుతినిపించి ఔరా అనిపించిన జింబాబ్వే... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రస్తుత వన్డే విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టికరిపించి తాజా టి20 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. కొలంబో: జింబాబ్వే జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టి20 ప్రపంచకప్‌లో ఆ్రస్టేలియాను మరోసారి ‘0’ను చేసింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జింబాబ్వే తమ ఆధిక్యాన్ని ‘2’తో రెట్టింపు చేసుకుంది. 2007 టి20 ప్రపంచకప్‌లో కంగారూ జట్టుపై సాధించిన సంచలన విజయాన్ని 19 ఏళ్ల తర్వాత జింబాబ్వే తాజాగా రిపీట్ చేసింది. అప్పుడు మొదటి ప్రపంచకప్ అయితే ఇది పదోది. మధ్యలో 8 మెగా ఈవెంట్లు జరిగినా... ఇరుజట్లు తలపడలేదు. శుక్రవారం గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. టాస్ నెగ్గిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (56 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. క్రీజులోకి వచ్చిన ముగ్గురు బ్యాటర్లు తదివనషె మరుమని (21 బంతుల్లో 35; 7 ఫోర్లు), రియాన్ బర్ల్ (30 బంతుల్లో 35; 4 ఫోర్లు), కెప్టెన్ సికందర్ రజా (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు. ఆసీస్ ఈ 120 బంతులు ఆడలేదా? జింబాబ్వే లాంటి కూన జట్టు బ్యాటర్లు 120 బంతులెదుర్కొని ఇద్దరే అవుటైతే... జగజ్జేత కంగారు పడటమేంటి? పది మంది బ్యాటర్లు 117 బంతులకే అవుట్ కావడమేంటి? హెడ్ బృందానికి 170 లక్ష్యఛేదన ఏమాత్రం కష్టమైంది కాదు. కఠినమైంది కాదు. కానీ 19.3 ఓవర్లలోనే 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్లెసింగ్ ముజరబాని (4/19), బ్రాడ్ ఇవాన్స్ (3/23) ధాటికి ఓపెనర్లు ఇన్‌గ్లిస్ (8), కెప్టెన్ హెడ్ (17) గ్రీన్ (0), టిమ్ డేవిడ్ (0)... ఇలా టాప్–4 స్పెషలిస్టు బ్యాటర్లంతా పవర్‌ప్లేలో 29 పరుగులకే పెవిలియన్‌కు వెళ్లి ప్రేక్షకులైపోయారు.ఒకే ఒక్కడు మ్యాట్ రెన్షా (44 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించడంతో 100 పైచిలుకు స్కోరు చేయగలిగింది. లేదంటే తర్వాతి బ్యాటర్లు స్టొయినిస్ (6), డ్వార్షుయిస్ (6), ఎలిస్ (7 నాటౌట్), జంపా (2), కునెమన్ (0)ల స్కోర్లు చూస్తే ఏ అత్యల్ప స్కోరుకో పరిమితమయ్యేదేమో! ఔరా మన్యొంగా... జింబాబ్వే ఫీల్డర్ మన్యొంగా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇవాన్స్ వేసిన 18వ ఓవర్లో డ్వార్షుయిస్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. మున్యొంగా దూరంగానే ఉన్నప్పటికీ డీప్ మిడ్‌వికెట్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదే వేగంతో డైవ్ చేసి అందుకున్న క్యాచ్ ఔరా అనిపించింది. టేలర్ స్థానంలో బెన్ కరన్... జింబాబ్వే సీనియర్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ గాయం కారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో గాయపడిన అతను ఆసీస్‌తో పోరులో బరిలోకి దిగలేదు. టేలర్ స్థానంలో ఐసీసీ అనుమతితో బెన్ కరన్‌కు జింబాబ్వే చోటు కల్పించింది. బెన్ కరన్ తమ్ముడు స్యామ్ కరన్ ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తరఫున ఆడుతున్నాడు.2 ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జట్టుతో జింబాబ్వే నాలుగు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. ఆసీస్‌పై జింబాబ్వే సాధించిన రెండు విజయాలు ప్రపంచకప్‌లోనే రావడం విశేషం.టి20 ప్రపంచకప్‌లో నేడుఐర్లాండ్ X ఒమన్‌వేదిక: కొలంబో; ఉ.గం. 11 నుంచి ఇంగ్లండ్ X స్కాట్లాండ్వేదిక: కోల్‌కతా; మ.గం. 3 నుంచి దక్షిణాఫ్రికా X న్యూజిలాండ్ వేదిక: అహ్మదాబాద్; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆసీస్‌పై సంచలన విజయం.. జింబాబ్వే బౌలర్ సెంచరీ
టీ20 ప్రపంచకప్ 2026లో పెను సంచనలం నమోదైంది. పసికూన జింబాబ్వే చేతిలో 2021 ఎడిషన్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 23 పరుగుల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో మాజీ జగజ్జేతను మట్టికరిపించింది. ఈ విజయం జింబాబ్వే క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయంలో పేస్ బౌలర్ బ్లెసింగ్ ముజరబానీ అత్యంత కీలకపాత్ర పోషించాడు. 170 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కీలక ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మ్యాట్ రెన్షా, ఆడమ్ జంపా వికెట్లు తీశాడు. అద్భుతమైన పేస్ వేరియేషన్స్‌తో పట్టిష్టమైన ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకుగానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ఈ చారిత్రక ప్రదర్శన చేసే క్రమంలో ముజరబానీ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఈ మ్యాచ్‌లో తన చివరి వికెట్‌తో (జంపా) అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా జింబాబ్వే తరఫున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా, ఓవరాల్‌గా 35 బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముజరబానీ ఈ ఘనతను కేవలం 85 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అతని సగటు 21.08గా.. ఎకానమీ 7.10గా ఉంది. జింబాబ్వే తరఫన టీ20ల్లో సెంచరీ కొట్టిన మరో ఇద్దరు బౌలర్లు రిచర్డ్ నగరవ (111 వికెట్లు), సికందర్ రజా (103 వికెట్లు). మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కష్టమైన పిచ్‌పై బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్), మరుమణి (35), ర్యాన్ బర్ల్ (35), సికందర్ రజా (25 నాటౌట్) నిలకడగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ అందించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. ముజరబానీ (4-0-17-4) సహా బ్రాడ్ ఈవాన్స్ (3.3-0-23-3), మసకద్జ (4-0-36-1), ర్యాన్ బర్ల్ (1-0-9-1), గ్రేమీ క్రీమర్ (4-0-33-0) సత్తా చాటారు. ఫలితంగా ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ను గట్టెక్కించేందుకు మ్యాట్ రెన్షా (65), మ్యాక్స్‌వెల్ (31) విఫలయత్నం చేశారు. -
T20 WC: ఆసీస్‌కు షాకిచ్చిన పసికూన.. సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు ‘పసికూన’ జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. గ్రూప్-‘బి’లో భాగంగా కొలంబో వేదికగా ఆసీస్- జింబాబ్వే జట్లు శుక్రవారం నాటి ఉదయం మ్యాచ్‌లో తలపడ్డాయి.ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ అజేయ అర్ధ శకతం (56 బంతుల్లో 64) సాధించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తాడివనాషే మరుమణి 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.రజా మెరుపు ఇన్నింగ్స్వన్డౌన్లో వచ్చిన ర్యాన్ బర్ల్ (30 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టొయినిస్, కామెరాన్ గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.చెలరేగిన ముజర్బానీఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ జట్టుకు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. బ్లెసింగ్ ముజర్బానీ జోష్ ఇంగ్లిస్ (8)ను.. బ్రాడ్ ఎవాన్స్ కెప్టెన్ ట్రవిస్ హెడ్ (17)ను వెనక్కి పంపించారు.వన్‌డౌన్‌లో వచ్చిన గ్రీన్‌ను ఎవాన్స్ డకౌట్ చేయగా.. ముజర్బానీ సైతం టిమ్ డేవిడ్‌ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. పవర్ హిట్టర్లు ఇద్దరూ డకౌట్ కావడంతో ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, గ్లెన్ మాక్స్వెల్ (31)తో కలిసి మ్యాచ్ రెన్షా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.HISTORY MADE IN COLOMBO! 🤯🔥Composure. Belief. Zimbabwe have beaten Australia! 👏💥ICC Men’s #T20WorldCup | #CANvUAE | LIVE NOW 👉 https://t.co/xRf3Nc9OQ0 pic.twitter.com/1BXNa0ftxS— Star Sports (@StarSportsIndia) February 13, 2026ఈ క్రమంలో 34 బంతుల్లో రెన్షా అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 19వ ఓవర్లో ముజర్బానీ బౌలింగ్‌లో రెన్షా (44 బంతుల్లో 65) అవుట్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే ఓవర్లో ఆఖరి బంతికి ముజర్బానీ ఆడం జంపా (2)ను కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్ విజయ సమీకరణం ఆరు బంతుల్లో 29 పరుగులుగా మారింది.146 పరుగులకే ఆలౌట్అయితే, ఆఖరి ఓవర్లో ఎవాన్స్ బౌలింగ్‌లో తొలి బంతికే నాథన్ ఎల్లిస్ ఫోర్ బాదాడు. కానీ ఆ తర్వాత ఎవాన్స్ ఆసీస్‌ను కోలుకోనివ్వలేదు. మూడో బంతికి మాథ్యూ కుహ్నెమన్ రనౌట్ (0) కావడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. జింబాబ్వే విధించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా జింబాబ్వే 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎవాన్స్ మూడు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. మసకజ్ద, ర్యాన్ బర్ల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తొలి ఎడిషన్ 2007లో ఆసీస్‌ను తొలిసారి ఓడించిన జింబాబ్వే.. మళ్లీ ఆసీస్‌పై గెలుపొందడం ఇదే మొదటిసారి.చదవండి: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. నేపాల్‌పై ఇటలీ గెలుపుAND ANOTHER ONE GONE! 🔥Head pushes at it and chops it back onto his stumps! 🎯💥The SIUUU celebration is out in Colombo as Zimbabwe tighten their grip early! 🙌 Is there an upset on the cards?ICC Men’s #T20WorldCup | #AUSvZIM | LIVE NOW 👉 https://t.co/WBa4qbbxs0 pic.twitter.com/kzJ8M8j5ut— Star Sports (@StarSportsIndia) February 13, 2026 -
చెలరేగిన బౌలర్లు.. మరో పసికూనను వణికించిన జింబాబ్వే
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే ఘనంగా బోణీ కొట్టింది. ఒమన్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరిగిన మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు చెలరేగిపోయారు. రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) ధాటికి ఒమన్ 103 పరుగులకే (19.5 ఓవర్లలో) కుప్పకూలింది.ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది. మిగతా ఆటగాళ్లలో ఆమిర్ కలీమ్, కెప్టెన్ జతిందర్ సింగ్, షా ఫైసల్ తలో 5 పరుగులు, షకీల్ అహ్మద్ 4, జితెన్ రామనంది 1, వసీం అలీ 3 పరుగులు చేయగా.. హమ్మద్ మీర్జా, కరన్ సోనావలే డకౌట్లయ్యారు.అనంతరం 104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆడుతూపాడుతూ ఛేదించింది. 13.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రియాన్ బెన్నెట్ (48 నాటౌట్), బ్రెండన్ టేలర్ (31 రిటైర్డ్ హర్ట్) రాణించారు. మరుమని 21, సికందర్ రజా 5 (నాటౌట్) పరుగులు చేయగా.. డియాన్ మైర్స్ డకౌటయ్యాడు. ఒమన్ బౌలర్లలో సఫ్యాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. బ్లెస్సింగ్ ముజరబానీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు జింబాబ్వే తమ జట్టును ప్రకటించింది. సికందర్ రజా సారథ్యంలోని ఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటు దక్కింది. అయితే, అనూహ్య రీతిలో మాజీ సారథి గ్రేమ్ క్రెమర్పై సెలక్టర్లు ఈసారి నమ్మకం ఉంచడం విశేషం.ఏడేళ్ల విరామం తర్వాత దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత 39 ఏళ్ల క్రెమర్ గతేడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. క్లబ్ క్రికెట్లో సత్తా చాటి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ లెగ్ స్పిన్నర్.. అఫ్గనిస్తాన్‌తో అక్టోబరులో జరిగిన సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. గోల్ఫ్‌లో రాణించేందుకు, భార్య మెర్నా కెరీర్ (పైలట్) కోసం యూఏఈకి వెళ్లిపోయిన క్రెమర్.. 2018 తర్వాత తొలిసారి జింబాబ్వే తరఫున మళ్లీ గతేడాది క్రికెట్ ఆడాడు.ఈ క్రమంలో పాకిస్తాన్- శ్రీలంకతో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లోనూ ఆడిన క్రెమర్ రెండు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులు చేయడంతో పాటు.. రెండు వికెట్లు తీశాడు. ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్ జట్టులో ఫ్రంట్‌లైన్ స్పిన్నర్‌గా క్రెమర్ ఎంపికయ్యాడు. అతడికి తోడుగా స్పిన్ విభాగంలో వెల్లింగ్టన్ మసకజ్ద, కెప్టెణ్ రజా ఉన్నారు.మరో సంచలన ఎంపికఇక ఈ జట్టులో మరో వెటరన్ ప్లేయర్, టీ20 ప్రపంచకప్ ఆరంభానికి (ఫిబ్రవరి 7) ఒకరోజు ముందే 40వ పడిలో అడుగుపెట్టనున్న బ్రెండన్ టేలర్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. పేస్ దళంలోకి బ్లెస్సింగ్ ముజర్బానీ తిరిగి వచ్చాడు. అదే విధంగా వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ రిచర్డ్ ఎంగరవకు కూడా ఈ జట్టులో స్థానం దక్కింది. వీరితో పాటు బ్రాడ్లీ ఎవాన్స్, టినోటెండా మపోసా కూడా జట్టులో ఉన్నారు.కాగా 2024 వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించలేకపోయిన జింబాబ్వే.. ఈసారి ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంకతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఇక ఈ మెగా టోర్నీకి భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఒమన్‌తో ఫిబ్రవరి 9న జింబాబ్వే ఈ టోర్నీలో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి జింబాబ్వే జట్టుసికిందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెనెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రెమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, టాడివనాషీ మరుమాని, వెల్లింగ్టన్ మసకజ్ద, టోనీ మున్యోంగా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్ ముజర్బాని, డియోన్ మేయర్స్, రిచర్ట్ ఎంగరవ, బ్రెండన్ టేలర్. చదవండి: Usman Khawaja:పడి లేచిన ప్రయాణం... -
పాకిస్తాన్ ట్రై సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
నవంబర్ 17 నుంచి పాకిస్తాన్లో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి జింబాబ్వే స్టార్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ వైదొలిగాడు. వెన్ను గాయం కారణంగా ముజరబానీ ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ముజరబానీ స్థానాన్ని న్యూమన్ న్యామ్హురితో భర్తీ చేస్తున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ టోర్నీలో జింబాబ్వే, ఆతిథ్య పాక్‌తో పాటు శ్రీలంక జట్టు పాల్గొంటుంది.ఈ టోర్నీలో జింబాబ్వే జట్టుకు సికందర్ రజా నాయకత్వం వహిస్తున్నాడు. టోర్నీలో ఓపెనర్‌లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడతాయి. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 19న జరిగే రెండో మ్యాచ్‌లో శ్రీలంక, జింబాబ్వే పోటీపడతాయి. ఈ మ్యాచ్‌కు కూడా రావాల్పిండేనే ఆతిథ్యమివ్వనుంది.అనంతరం నవంబర్ 22వ తేదీ పాకిస్తాన్-శ్రీలంక, 23న జింబాబ్వే-పాకిస్తాన్, 27న పాకిస్తాన్-శ్రీలంక పోటీపడతాయి. 29న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.పాకిస్తాన్ ట్రై సిరీస్ కోసం జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, వెల్లింగ్టన్ మసకద్జా, తడివానాషే మారుమణి, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, డియాన్ మేయర్స్, రిచర్డ్ నగరవ, న్యూమన్ న్యామ్హురి, బ్రెండన్ టేలర్చదవండి: వర్షార్పణం.. ఆధిక్యంలో న్యూజిలాండ్ -
సిరాజ్‌ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్
టెస్ట్ క్రికెట్లో ఈ ఏడాది టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 26.91 సగటున 37 వికెట్లు తీసి, లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండేవాడు. తాజాగా జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzarabani) సిరాజ్‌ను వెనక్కు నెట్టి, అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ముజరబానీ తన వికెట్ల సంఖ్యను 39కి (10 మ్యాచ్‌ల్లో) పెంచుకున్నాడు. ముజరబానీ, సిరాజ్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ స్టార్క్ (7 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు), నౌమన్ అలీ (26), నాథన్ లియోన్ (24) ఉన్నారు.ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో ముజరబానీతో పాటు (11-1-47-3), బ్రాడ్ ఈవాన్స్ (9.3-2-22-5), తనక చివంగ (6-0-29-1) చెలరేగడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే.. మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ (6) ఔట్ కాగా.. బెన్ కర్రన్ (34), నిక్ వెల్చ్ (40) క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి.చదవండి: PAK VS SA 2nd Test: బాబర్ విఫలమైనా, ఆదుకున్న కెప్టెన్ -
ఆఫ్ఘనిస్తాన్ భరతం పట్టిన జింబాబ్వే బౌలర్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో (Zimbabwe Vs Afghanistan) జింబాబ్వే యువ పేసర్ బ్రాడ్ ఈవాన్స్ (Brad Evans) చెలరేగిపోయాడు. 9.3 ఓవర్లలో 22 పరుగుల మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈవాన్స్కు బ్లెస్సింగ్ ముజరబానీ (11-1-4-3), తనక చివంగ (6-0-29-1) కూడా తోడవ్వడంతో జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్‌ను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.ఇవాళే మొదలైన (అక్టోబర్ 20) ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆదిలో ఆఫ్ఘనిస్తాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే బ్రాడ్ ఈవాన్స్ ఒక్కసారిగా చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్ స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. ఈవాన్స్ తన కెరీర్లో రెండో టెస్ట్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్భాజ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్ మాలిక్ (30), ఇబ్రహీం జద్రాన్ (19), బషీర్ షా (12), అహ్మద్జాయ్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కూడా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులకే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను జియా ఉర్ రెహ్మాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. బెన్ కర్రన్ (2), నిక్ వెల్చ్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.కాగా, ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టెస్ట్ మ్యాచ్ అనంతరం హరారే వేదికగా మూడు టీ20లు (అక్టోబర్ 29, 21, నవంబర్ 2) జరుగనున్నాయి. చదవండి: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత -
శ్రీలంకకు జింబాబ్వే షాక్.. 80 పరుగులకే ఆలౌట్
హరారే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. జింబాబ్వే బౌలర్ల దాటికి 17.4 ఓవర్లలో కేవలం 80 పరుగులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే శ్రీలంక బ్యాటర్లకు కష్టాలు ఎదురయ్యాయి. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్లో తన వేసిన తొలి బంతికే ముజారబానీ.. స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్(1) ఔట్ చేసి పర్యాటక జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాత శ్రీలంక వికెట్లు పతనం కొనసాగింది. టాపర్డర్, మిడిలార్డర్, లోయార్డర్ అన్న తేడా లేకుండా లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కమిల్ మిశ్రా 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ఏడు మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవెన్స్, కెప్టెన్ సికిందర్ రజా తలా మూడు వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు ముజారబానీ రెండు, విలియమ్స్ ఒక్క వికెట్ సాధించారు. కాగా టీ20ల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇంతకుముందు టీ20 వరల్డ్‌కప్-2024లో సౌతాఫ్రికాపై శ్రీలంక కేవలం 77 పరుగులకే ఆలౌటైంది.అదేవిధంగా జింబాబ్వే గడ్డపై టీ20ల్లో అత్యల్ప టోటల్‌ను నమోదు చేసిన మూడో జట్టుగా లంక చెత్త రికార్డును మూట కట్టకుంది. ఈ జాబితాలో జింబాబ్వే అగ్రస్ధానంలో ఉంది. 2024లో బులవాయో వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 57 పరుగులకే ఆలౌటైంది.చదవండి: Anshul Kamboj: మరో జహీర్ అన్నారు.. కట్ చేస్తే! ఒక మ్యాచ్‌కే ఖేల్ ఖతం -
IPL 2025: ఆర్సీబీ జట్టులోకి జింబాబ్వే ప్లేయర్.. అతడికి ప్రత్యామ్నాయంగా ఎంపిక
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 8 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇది పదోసారి. ఆ జట్టు 2009, 2010, 2011, 2015, 2016, 2020, 2021, 2022, 2024, 2025 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ గెలిచి మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో లీగ్ దశను ముగించాలని భావిస్తుంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ (మే 23), లక్నోతో (మే 27) తలపడాల్సి ఉంది.గుజరాత్, పంజాబ్ కూడా..!నిన్న (మే 18) రాత్రి ఢిల్లీపై విజయం సాధించడంతో గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఒకేసారి ఖరారయ్యాయి. నాలుగో బెర్త్ కోసం ఢిల్లీ, ముంబై, లక్నో పోటీ పడనున్నాయి. ఇవాళ (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో ఓడితే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు ఢిల్లీ, ముంబై మాత్రమే రేసులో ఉంటాయి. అంతకుముందు సీఎస్కే, రాజస్థాన్, సన్‌రైజర్స్, కేకేఆర్ వరుసగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.ఎంగిడికి ప్రత్యామ్నాయంగా ముజరబానీవచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతని స్థానాన్ని ఆర్సీబీ యాజమాన్యం జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీతో భర్తీ చేసింది. ముజరబానీ.. ఆర్సీబీ లక్నోతో ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు. ఈ సీజన్లో ఒకే ఒక మ్యాచ్ (సీఎస్కే) ఆడిన ఎంగిడి అందులో మూడు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.🚨 BLESSING MUZARABANI WILL PLAY FOR RCB IN PLAYOFFS 🚨- He replaces Lungi Ngidi. pic.twitter.com/kzZ1rLrGgl— Johns. (@CricCrazyJohns) May 19, 2025ముజరబానీ విషయానికొస్తే.. కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన 28 ఏళ్ల ముజరబానీ.. జింబాబ్వే తరఫున 12 టెస్ట్‌లు, 55 వన్డేలు, 70 టీ20లు ఆడి 198 వికెట్లు పడగొట్టాడు. గత కొంతకాలంగా ముజరబానీ టీ20ల్లో విశేషంగా రాణిస్తున్నాడు. అందుకే ఆర్సీబీ ఈ ఆఫ్రికా ఆణిముత్యాన్ని వెతికి పట్టుకుంది. ముజరబానీ.. సికందర్ రజా తర్వాత ఐపీఎల్ ఆడనున్న రెండో జింబాబ్వే క్రికెటర్. -
ఐర్లాండ్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఘనత
ఐర్లాండ్ క్రికెట్ జట్టు(Ireland Cricket Team) సరికొత్త చరిత్ర లిఖించింది. టెస్టు(Test Format)ల్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాలతో 119 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జింబాబ్వే(Zimbabwe)తో జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేసింది.రాణించిన ఆండీ మెక్‌బ్రిన్ కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడే నిమిత్తం ఐర్లాండ్ జట్టు.. జింబాబ్వే పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో బులవాయో వేదికగా ఇరుజట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐరిష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది.అయితే, జింబాబ్వే బౌలర్ల ధాటికి ఐర్లాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్రమంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండీ మెక్‌బ్రిన్ 90 పరుగులు(నాటౌట్), టెయిలెండర్ మార్క్ అడెర్ 78 పరుగులతో రాణించారు. ఫలితంగా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 260 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగగా.. ఎంగరవ రెండు, ట్రెవర్ గ్వాండు ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక జింబాబ్వే తమ మొదటి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు ఆలౌట్ అయి.. ఏడు పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. నిక్ వెల్చ్ 90, ముజర్బాని 47 పరుగులతో రాణించారు.292 పరుగుల లక్ష్యం.. జింబాబ్వే బ్యాటర్ల వైఫ ల్యంఅనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్ 298 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా జింబాబ్వే ముందు 292 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఐరిష్ స్పిన్నర్ మాథ్యూ హంప్రెస్ ఆరు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరోవైపు బ్యారీ మెకార్తీ రెండు, మార్క్ అడెర్, ఆండీ మెక్‌బ్రిన్ ఒక్కో వికెట్ తీశారు.జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (195 బంతుల్లో 84; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్రియాన్ బెనెట్ (72 బంతుల్లో 45; 3 ఫోర్లు), జొనాథన్ క్యాంప్‌బెల్ (62 బంతుల్లో 33; 3 ఫోర్లు) రాణించినా ఫలితం లేకపోయింది. 228 పరుగులకే జింబాబ్వే కుప్పకూలగా.. ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. వరుసగా మూడో టెస్టు విజయంతద్వారా టెస్టుల్లో వరుసగా మూడో విజయాన్ని(‘హ్యాట్రిక్’) నమోదు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఐర్లాండ్ ప్లేయర్ ఆండీ మెక్‌బ్రిన్ (90 పరుగులు; 4 వికెట్లు)కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.కాగా ఎనిమిదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి టెస్టు హోదా పొందిన ఐర్లాండ్ జట్టు ఆడిన తొలి ఏడు టెస్టుల్లోనూ ఓడిపోయింది. అయితే, గత ఏడాది మార్చిలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఎనిమిదో టెస్టులో గెలిచి ఈ ఫార్మాట్లో తొలి విజయం నమోదు చేసుకుంది. అనంతరం జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన తొమ్మిదో టెస్టులో నెగ్గి వరుసగా రెండో గెలుపు రుచి చూసింది.తాజాగా జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో ఐర్లాండ్ 63 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫార్మాట్లో ఈ మేర ‘హ్యాట్రిక్’ సాధించింది. ఇప్పటి వరకు కేవలం పది టెస్టులే ఆడిన ఐర్లాండ్.. వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలుపొందడం ద్వారా.. అత్యంత తక్కువ టెస్టుల్లో ‘హ్యాట్రిక్’ విజయాలు అందుకున్న తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. అంతకు ముందు సౌతాఫ్రికా 1906లో పద్నాలుగు మ్యాచ్‌ల తర్వాత హ్యాట్రిక్ కొట్టింది.తక్కువ మ్యాచ్‌ల వ్యవధిలోనే టెస్టుల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్లు👉ఐర్లాండ్- 10 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2025👉సౌతాఫ్రికా- 14 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1906👉ఇంగ్లండ్- 23 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1886👉పాకిస్తాన్- 25 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1959👉వెస్టిండీస్- 35 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1950👉ఆస్ట్రేలియా- 50 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1898👉శ్రీలంక- 87 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998👉బంగ్లాదేశ్- 88 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 2014👉ఇండియా- 109 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1969👉న్యూజిలాండ్- 260 మ్యాచ్‌లలో హ్యాట్రిక్- 1998.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
ముచ్చటగా 3 మ్యాచ్‌లు ఆడి ఇంటికొచ్చేసిన అంబటి రాయుడు
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రయాణం మూన్నాళ్ల ముచ్చటగా సాగింది. వ్యక్తిగత కారణాల చేత రాయుడు సీపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ లీగ్ ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కిన రాయుడు.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఓ మ్యాచ్‌లో (తొలి మ్యాచ్) డకౌట్ కాగా.. మిగతా రెండిటిలో 32, 15 పరుగులు చేశాడు. 3 మ్యాచ్‌ల్లో రాయుడు 15.66 సగటున 117.50 స్ట్రయిక్‌రేట్‌తో 47 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఐపీఎల్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు, భారత దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 37 ఏళ్ల రాయుడు ఐపీఎల్ 2023 ఎడిషన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో సభ్యుడిగా ఉండిన విషయం తెలిసిందే. మరోవైపు అంబటి రాయుడుతో పాటు జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ కూడా కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కే ప్రాతినిథ్యం వహిస్తున్న ముజరబానీ కూడా వ్యక్తిగత కారణాలచే సీపీఎల్‌ను మధ్యలోనే వీడాడు. ఇతను కూడా రాయుడు లాగే మూడంటే మూడే మ్యాచ్‌లు ఆడాడు. ఈ 3 మ్యాచ్‌ల్లో అతను కేవలం ఒకే వికెట్ పడగొట్టి దారుణంగా విఫలమయ్యాడు. రాయుడు, ముజరబానీ జట్టును వీడటంతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ వీరికి రీప్లేస్‌మెంట్‌గా ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ స్మీడ్, బెన్నీ హోవెల్లను తమ పంచన చేర్చుకుంది. వీరిలో స్మీడ్ విధ్వంసకర బ్యాటర్ కాగా.. హోవెల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఇదిలా ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలి 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఎవిన్ లెవిస్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతుంది. -
8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే!
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు జింబాబ్వే తమ జట్టును మంగళవారం ప్రకటించింది. స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌తో జరిగిన సిరీస్‌లకు దూరమైన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ తిరిగి జట్టులోకి వచ్చాడు. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు జింబాబ్వే వెళ్లనుంది. చివరగా 2003-2004లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. అదే విధంగా ఇరు జట్లు ముఖాముఖి తలపడి కూడా దాదాపు 8 ఏళ్ల కావస్తోంది. చివగా 2014లో ఆసీస్-దక్షిణాఫ్రికా జట్లతో ట్రై సిరీస్‌లో జింబాబ్వే తలపడింది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. కాగా ఈ సిరీస్ 2020 ఆగస్టులో జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా రేండేళ్ల పాటు వాయిదా పడింది. టౌన్‌విల్లే వేదికగా ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగానే జరగనుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ జట్టును ప్రకటించింది. జింబాబ్వే జట్టు: రెగిస్ చకబ్వా (కెప్టెన్,), ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఎవాన్స్, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, కైటానో, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమాని, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యౌచి సికందర్ రజా, సీన్ విలియమ్స్ ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా చదవండి: IND vs PAK: 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించేది అతడే' -
జింబాబ్వే స్టార్ బౌలర్‌కు బంపర్ ఆఫర్.. తొలిసారి ఐపీఎల్లో!
ఐపీఎల్-2022 సీజన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్ వుడ్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్ వుడ్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఫ్రాంచైజీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో వుడ్ స్ధానాన్ని జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీతో భర్తీ చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు అతడు ఐపీఎల్లో పాల్గోవడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ముజారబానీ భారత్‌కు బయలుదేరినట్లు జింబాబ్వేలోని భారత రాయబారి కార్యాలయం ద్రువీకరించింది. అయితే ముజారబానీని వుడ్ స్ధానంలో భర్తీ చేస్తారా లేదా నెట్ బౌలర్‌గా ఎంపిక చేస్తారా అన్నది వేచి చూడాలి. కాగా అంతకుముందు వుడ్ స్ధానాన్ని బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్‌తో భర్తీ చేయాలని భావించింది. అయితే అతడు దక్షిణాప్రికా పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టులో భాగమై ఉన్నాడు. దీంతో అతడికి ఐపీఎల్లో ఆడేందుకు అనుమతిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. దీంతో అతడి స్థానంలో ముజారబానీని జట్టులో తీసుకోనున్నారు. ఇక మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తన తొలి మ్యాచ్‌లో మార్చి 28 మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. చదవండి: IPL 2022: ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్‌కు లక్కీ ఛాన్స్.. ఏకంగా ఆర్సీబీ తరపున!


