పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు! స్టార్‌ ప్లేయర్‌పై పీసీబీ సీరియస్‌ | PCB planning to take legal action against Zimbabwe pacer Blessing Muzarabani | Sakshi
Sakshi News home page

IPL 2026: పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు! స్టార్‌ ప్లేయర్‌పై పీసీబీ సీరియస్‌

Mar 14 2026 11:09 AM | Updated on Mar 14 2026 11:18 AM

PCB planning to take legal action against Zimbabwe pacer Blessing Muzarabani

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకొన్న జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీపై పాక్ క్రికెట్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ముజారబానీ వాస్తవానికి ఈ ఏడాది పీఎస్‌ఎల్ సీజన్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది.

వెస్టిండీస్ పేసర్  షమీర్ జోసెఫ్ స్థానంలో ముజారబానీతో ఇస్లామాబాద్ పీకేఆర్ 1.1 కోట్లకు  ఒప్పందం కుదుర్చుకుంది. కానీ చివరి నిమిషంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ఆఫర్ రావడంతో ముజారబానీ తన మనసు మార్చుకున్నాడు.

పీఎస్‌ఎల్ బదులుగా ఐపీఎల్‌లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. రాజకీయ ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన ముస్తాఫిజుర్ రెహ్మన్ స్ధానంలో ముజారబానీని కేకేఆర్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలో ముజారబానీపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు సమాచారం.

ఏడాది పాటు పీఎస్ఎల్ ఆడకుండా అతడిపై నిషేధం విధించాలని పీసీబీ భావిస్తోందంట. కాగా పీఎస్ఎల్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్ వైపు ఆటగాళ్లు వెళ్లడం ఇది రెండోసారి. గతేడాది కూడా దక్షిణాఫ్రికా పేసర్ కోర్బిన్ బాష్ ఇలాగే పెషావర్ జల్మీని వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరారు.

దీంతో పీసీబీ అతడిపై ఏడాది నిషేధం విధించింది. ఈ రెండు టోర్నీలు ఒకే సమయంలో జరగనుండడంతో ఈ సమస్య తలెత్తుంది. పీఎస్‌ఎల్ 11వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. అక్కడికి రెండు రోజులకే ఐపీఎల్ షురూ కానుంది.
చదవండి: BAN vs PAK: 'క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ'.. బంగ్లా కెప్టెన్‌పై కైఫ్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement