'క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ'.. బంగ్లా కెప్టెన్‌పై కైఫ్‌ ఫైర్‌ | Mohammad Kaif Fumes At Salman Agha Run Out By Bangladesh Captain | Sakshi
Sakshi News home page

BAN vs PAK: 'క్రీడా స్ఫూర్తికే మాయని మచ్చ'.. బంగ్లా కెప్టెన్‌పై కైఫ్‌ ఫైర్‌

Mar 14 2026 10:15 AM | Updated on Mar 14 2026 10:44 AM

Mohammad Kaif Fumes At Salman Agha Run Out By Bangladesh Captain

ఢాకా వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వ‌న్డేలో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా అవుట్ అయిన విధానం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో స‌ల్మాన్ ఊహించ‌ని విధంగా ర‌నౌట‌య్యాడు. పాక్ ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన మెహదీ హ‌స‌న్ మిరాజ్ బౌలింగ్‌లో  నాలుగో బంతిని మ‌హ్మ‌ద్ రిజ్వాన్ స్ట్రైట్ షాట్ ఆడాడు.

అయితే రిజ్వాట్ కొట్టిన‌ బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆఘా ప్యాడ్లకు తగిలింది. ఆ సమయంలో బౌలర్ మిరాజ్, సల్మాన్ ఒకరినొకరు ఢీకొన్నారు. అయితే బంతి 'డెడ్' అయిందని భావించిన సల్మాన్, దానిని చేత్తో తీసి ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతిని అందుకున్న మిరాజ్‌ క్రీజు వెలుపల ఉన్న ఆఘాను చూసి వెంటనే వికెట్లను పడగొట్టి రన్-అవుట్ కోసం అప్పీల్ చేశాడు.

ఫీల్డ్ అంపైర్‌లు థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశాడు. అఘా క్రీజు బ‌య‌ట ఉండ‌డంతో థ‌ర్డ్ అంపైర్ రూల్స్ ప్ర‌కారం ఔట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో బంగ్లా ప్లేయ‌ర్ల‌పై స‌ల్మాన్ తీవ్ర అగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. చాలా మంది మాజీలు కూడా మెహ‌ది హ‌స‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మెహ‌ది హ‌స‌న్ క్రీడా స్పూర్తిగా  విరుద్దంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని మండిపడుతున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి భార‌త మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ చేరాడు. బంగ్లా కెప్టెన్ తీరును కైఫ్ త‌ప్పుబ‌ట్టాడు. "ఇది ఎంత‌మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. వికెట్ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నప్ప‌టికి.. ఇలాంటి ర‌న్-అవుట్ చేయ‌డం స‌రికాదు. అది కూడా ఒక కెప్టెన్ ఇలా చేయ‌డం బాధాక‌రం.

యువ ఆట‌గాళ్ల‌కు ఒక్క విష‌యం చెప్పాల‌నుకుంటున్నాను. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచే అవకాశం ఉన్నా సరే, బంగ్లా కెప్టెన్ చేసిన పనిని మాత్రం ఎప్పుడూ చేయకండి. ఇదిక్రీడా స్పూర్తికి విరుద్దం. ఏదైనా న్యాయంగా ఆడి గెలవాలి" ఎక్స్‌లో కైఫ్ పోస్ట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాపై 128 ప‌రుగుల భారీ తేడాతో పాకిస్తాన్ విజ‌యం సాధించింది.
చదవండి: ఇది కాదు.. గంభీర్‌కు ముందుంది అసలైన సవాల్‌: గంగూలీ


 

 

Advertisement
 
Advertisement
Advertisement