YSR
-
నిత్యపూజకోనలో శాశ్వత హుండీలు మాయం
సిద్దవటం: నిత్యపూజకోనలోని శాశ్వత హుండీలు మాయమైనట్లు భక్తులు తెలిపారు.ఆదివారం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వారంలో ఒక్కరోజు మాత్రమే శాశ్వత హుండీలు దర్శనమిస్తున్నాయన్నారు. వీటిని తాత్కాలిక హుండీలుగా ఎండోమెంట్ అధికారులు మార్చేశారని వారు ఆరోపించారు. సిద్దవటం మండలం లేదా వంతాటిపల్లి గ్రామంలో ఉండాల్సిన నిత్యపూజకోన ఈఓ కార్యాలయం కడపలో ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం శాశ్వత హుండీలు 24/7 ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉండాలన్నారు. ఇక్కడ నాలుగు శాశ్వత హుండీలు ఉండాలని,అవి ఎక్కడికి వెళ్లాయో అని వాపోతున్నారు. ఆదివారం భక్తులు హుండీలో డబ్బులు వేయాలని వెళ్లారు. అయితే హుండీలు లేవు. ఎక్కడ ఉన్నాయని అడగ్గా లేవని అక్కడ ఉన్న ఓ వ్యక్తి తెలిపారన్నారు. రూ.45 లక్షలు వార్షిక ఆదాయం ఉన్న ఆలయంలో మహిళలు వస్త్రాలు మార్చుకోవడానికి తాత్కాలిక డ్రెస్సింగ్ కేంద్రాలు కూడా లేవన్నారు. ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఎండోమెంట్ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు పేర్కొన్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ కొండారెడ్డిని వివరణ కోరగా ఆలయ ఆవరణలో నాలుగు శాశ్వత హుండీలు ఉన్నాయన్నారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. -
డ్రైవరూ.. జాగ్రత్త టైరు
● వాహనాల టైర్లు పేలి వరుస ప్రమాదాలు ● వేసవిలో అప్రమత్తత అవసరంకడప వైఎస్ఆర్ సర్కిల్ : వాహనాలు కండిషన్లోనే ఉన్నాయి. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేస్తున్నాం. అని ధీమాలో ఉంటే సరిపోదు. టైర్లలో గాలి తరచూ సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాహనం బయలుదేరడానికి ముందే ఒకటికి రెండు సార్లు టైర్లు ఎలా ఉన్నాయి. వాటిలో సరిపడినంత గాలి ఉందా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో టైర్లు పేలిపోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో ఈ తరహా చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.రబ్బర్ గట్టి పడటంతో అందులో పరిమితికి మించి గాలి పట్టినప్పుడు.. గుంతల్లో పడినప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో అరిగిపోయిన టైర్లతో వాహనాల్లో ప్రయాణం చేయడం ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ఆ అక్షరమే.. భద్రత కీలకం టైర్లు కొనుగోలు చేసే సమయంలో దాని తయారీ సంవత్సరం చూసుకోవాలి. రీ బటన్ వేసిన వాటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు బైకులు, కార్లు, బస్సులు, లారీల టైర్లు నాణ్యత, స్వీట్ రేటింగ్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. టైర్ స్వీట్ రేటింగ్ అక్షరాల్లో ఉంటుంది. ప్రతి టైర్‌పై దాని సామర్థ్యం తెలియజేసే ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. అందులో చివరి ఆల్ఫాబెటికల్ అక్షరం చాలా కీలకమైంది. దాని టైర్ స్పీడ్ రేటింగ్ అంటారు. వాహన కంపెనీలు ఆ మోడల్‌కు తగిన స్పీడ్ రేటింగ్ నిర్ణయిస్తాయి. డ్రైవర్ డోర్ వద్ద ఉండే స్టిక్కర్ లేదా వాహన మాన్యువల్‌లో ఇది స్పష్టంగా ఉంటుంది. హైవేలపై డ్రైవ్ చేసే వారు హెచ్వీ రేటింగ్ టైర్లు వినియోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా టైర్లు మన్నిక కాలం ఐదారు ఏళ్లు ఉంటుంది. కొత్త టైర్ తీసుకునే సమయంలో అది ఎప్పుడు తయారైంది అనేది తప్పనిసరిగా పరిశీలించాలి. ఉదాహరణకు 1226 అని ఉంటే 2026వ సంవత్సరం 12వ వారంలో తయారైనట్లు అర్థం. -
భక్తులకు శుభవార్త
రాజంపేట: ఉమ్మడి జిల్లా కేంద్రం కడప మీదుగా తమిళనాడులోని కావేరీ నది తీరాన వెలసిన భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథస్వామి ఆలయానికి భక్తులు వెళ్లే అవకాశం కలిగింది. అరుణాచలం, వేలూరు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు త్వరలో రైలు అందుబాటులోకి రానుంది. అదే గుంటూరు(1726/ 17262)–తిరుపతి మధ్య నడిచే రైలు. ఈ రైలును తిరుచిరాపల్లె వరకు పొడిగించడం వల్ల భఽక్తులకు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు.. భక్తులు గుంటూరు–తిరుపతి రైలులో వెళ్లి తమిళనాడులోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. వేలూరులో గోల్డెన్ టెంపుల్(శ్రీపురం మహాలక్ష్మీ ఆలయం), తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. కాణిపాకంకు వెళ్లేందుకు ఈ రైలు దోహదపడుతుంది. హాల్టింగ్స్ ఇవే.. నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్ఐ, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఎర్రగుంట్ల, కమలాపురం, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి.. అక్కడి నుంచి పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు, అరణిరోడ్డు, పోలూరు, తిరవణ్ణామలై(అరుణచాలం), తిరుక్కోవైలూరు, విల్లుపురం, అరియాలూరు, శ్రీరంగం మీదుగా తిరుచ్చి(తిరుచిరాపల్లె)కు చేరుకుంటుంది. మూడేళ్లుగా... మూడేళ్లుగా వైఎస్సార్ కడప,నంద్యాల, తిరుపతి జిల్లా పరిధిలోని భక్తులకు నేరుగా అరుణాచలం వెళ్లేందుకు రైలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు–తిరుపతి ౖరైలును తిరుచిరాపల్లెకు వరకు పొడిగించేందుకు రైల్వేబోర్డు ఆమోదం లభించిందని రైల్వేవర్గాలు స్పష్టీకరించాయి. ఎంపీ మిథున్‌రెడ్డి కృషి ఫలితం... ఉభయ జిల్లాల వారు అరుణాచలం, శ్రీరంగం, వేలూరు వెళ్లేందుకు రైలు నడపాలని రైల్వేమంత్రిని ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. భక్తులు తిరుపతి, రేణిగుంటకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోందని దీంతో ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. ఎంపీ వినతి మేరకు రైల్వేమంత్రిత్త్వశాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో తిరుపతి–గుంటూరు మధ్య నడుస్తున్న గుంటూరు ఎక్స్‌ప్రెస్ రైలును తిరుచిరాపల్లె వరకు పొడిగించారు. అయితే ఈ రైలు వెళ్లే సమయం కడప, రాజంపేట,నందలూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు , రైల్వేకోడూరు వాసులకు ఉపయోగకరంగా లేదు. ఉదాహరణకు రాజంపేటకు రాత్రి 8.50గంటలకు వచ్చే గుంటూరు–తిరుపతి రైలు ఇప్పుడు తెల్లవారుజామున 2 గంటలకు వస్తుంది. ఉదయం 11.20 నిమిషాలకు గుంటూరుకు చేరుకుంటుంది. దీనివల్ల అమరావతికి నేరుగా వెళ్లే సౌకర్యం ప్రయాణికులు కోల్పోయారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించి, సమయాల్లో మార్పులకు ప్రయత్నించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. గుంటూరు–తిరుపతి మధ్య నడిచే రైలు కడప మీదుగా.. శ్రీరంగం, అరుణాచలం, వేలూరుకు రైలు! గుంటూరు–తిరుపతి రైలు పొడిగింపు గుంటూరు(17261)లో..సాయంత్రం 4గంటలకు బయలుదేరుతుంది.మరుసటి రోజు మధ్యాహ్నాం 2గంటలకు చేరుకుంటుంది. తిరుచిరాపల్లె(17262)లో సాయంత్రం 4గంటలకు బయలుదేరుతుంది. తిరుపతికి రాత్రి 11.40 గంటలకు, కడపకు 2.45కు, గుంటూరుకు మరుసటి రోజు 11.20గంటలకు చేరుకుంటుంది. -
బైక్ అదుపు తప్పి.. కాలువలో పడి..
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిన్నదండ్లూరు గ్రామం పరిధిలో గోపులాపురం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి ఎన్.నరేంద్రకుమార్‌రెడ్డి(37) అనే వ్యక్తి కాలువలో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కలమల్ల ఎస్ఐ సునీల్ కుమార్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గార్లదిన్నె గ్రామానికి చెందిన నరేంద్రకుమార్‌రెడ్డి తాడిపత్రిలో మెడికల్ స్టోర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాలోని చాపాడు మండల పరిధిలో ఉన్న తమ చిన్నమ్మ వద్దకు వచ్చి తిరిగి స్వగ్రామానికి పయనమయ్యాడు. చాపాడు నుంచి ప్రొద్దుటూరు ఆర్టీపీపీ మీదుగా తాడిపత్రికి పోవడానికి స్కూటర్లో బయలు దేరాడు. అయితే ఆర్టీపీపీ రోడ్డున గోపులాపురం గ్రామ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే స్కూటర్ అదుపు తప్పి కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో కాలువలోనే నీటిలోనే ఉండిపోయాడు. కొంత సేపటి తర్వాత అటుపోతున్న స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామని వారు వచ్చిన తర్వాత వారి ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
కలలు.. కల్లలు
● బిల్లులు రాక...పనులు సాగక... ● బుగ్గవంక అప్రోచ్‌రోడ్ల పరిస్థితి అగమ్య గోచరం ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం నిలిచిపోయిన బుగ్గవంక అప్రోచ్‌రోడ్డు పనులు కడప సిటీ: కడపలోని బుగ్గవంక అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపులా తారురోడ్డు వేయాలని సంకల్పించడమే గాక పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే బుగ్గవంకు ఇరువైపుల తారురోడ్డు వేసి ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నిధులు మంజూరు చేశారు. పనులు 50 శాతానికి పైగా జరిగాయి.కల సాకారమవుతుందన్న వేళ ఎన్నికలు రావడం, కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ప్రజల కలలు కల్లలుగా మారాయి. కూటమి ప్రభుత్వం ఈ రోడ్ల గురించి పట్టించుకోకపోవడం, సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధంతరంగా పనులు ఆగిపోయాయి. ట్రాఫిక్ సమస్య తీరుతుందని.. ప్రధానంగా బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపుల రోడ్డు నిర్మా ణం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే ప్రారంభించారు. అంతేకాకుండా బుగ్గవంక ఆధునీకరణలో భాగంగా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు. 1.2 కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉన్న ప్రొటెక్షన్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. బుగ్గవంకకు ఇరువైపులా కడపలోని రైల్వే వంతెన నుంచి అల్మాస్‌పేట వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరం తారు రోడ్డు నిర్మాణానికి పనులు జరిగాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రొటెక్షన్ వాల్‌కు ఇరువైపులా 40 అడుగుల మేర వెడల్పుతో 6.4 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యా యి. వాహనదారులు నేరుగా రైల్వే వంతెన వద్దకు, అల్మాస్పేటకు వెళ్లాలన్నా ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావించి పనులు చేపట్టారు. అంతేకాకుండా ఈ రోడ్ల వెంబడి వాహనాలు పోవడం వల్ల నగరంలో రద్దీ తగ్గుతుందని భావించా రు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పెండింగ్ పనులను పూర్తి చేయకపోవడంపై కూట మి నేతలకు కడప అభివృద్ధిపై చిత్తశుద్ది లేదన్నట్లు తెలుస్తోంది. కడప నడిబొడ్డున ఉన్న బుగ్గవంక అభివృద్ధి పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే జరిగాయి. కడపలో బుగ్గవంక కష్టాలు ప్రజలకు తీరని వ్యథగా ఉండేది. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో తాను ముఖ్యమంత్రి అయితే బుగ్గవంక సుందరీకరణ పనులు చేపడతామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే పనులు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బుగ్గవంక వరద ఉధృతితో రవీంద్రనగర్, కాగితాలపెంటతోపాటు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రాణనష్టం జరిగింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 49 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020లో పెండింగ్ పనులకు శ్రీకారం చుట్టారు.కూటమి ప్రభుత్వ ఈ రెండేళ్ల పాలనలో బుగ్గవంక ఇరువైపులా ఉన్న రోడ్ల నిర్మాణం పూర్తిగా తారుమారైంది. నోటీసులు ఇచ్చాం బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపులా రోడ్ల నిర్మాణ పనులు కొంతమేర చేయాల్సి ఉంది. కానీ సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపివేశారు. కాంట్రాక్టర్‌కు పనులు ప్రారంభించాలని నోటీసులు ఇచ్చాం. త్వరలో పనులు ప్రారంభించి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. –చెంగల్రాయుడు, ఈఈ, నీటిపారుదలశాఖ, కడప -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
రామసముద్రం : మండలంలోని పెద్దకురప్పల్లి పంచాయతీ బసవన్నకట్టలో ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ హృషికేశవరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బసవన్నకట్టకు చెందిన విజయ్ కుమారుడు తేజకు 2021లో శివయ్య కుమార్తె రమ్యను(22) ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలంగా సంసార జీవితంలో కుటుంబ కలహాలు రావడంతో.. మనస్తాపానికి గురైన రమ్య శనివారం ఇంట్లో ఎలుకల నివారణ మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రమ్యను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పిడుగుపాటుకు వృద్ధుడు మృతి సదుం : పిడుగు పాటుకు వృద్ధుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గొంగివారిపల్లె పంచాయతీ పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య (90), సుశీలమ్మ దంపతులు గ్రామ సమీపంలోని పొలం వద్దకు వెళ్లారు. ఐదు గంటల ప్రాతంలో వర్షం పడటంతో చింతచెట్టు కిందికి చేరారు. పిడుగుపాటుకు గురై మల్లయ్య అక్కడే మృతి చెందాడు. సుశీలమ్మ స్వల్పంగా గాయపడగా, తాళిబొట్టు ముక్కలు కావడంతోపాటు, ఫోన్ పగిలిపోయింది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.కర్ణాటక యువకుడిపై దాడిమదనపల్లె టౌన్ : కర్ణాటక యువకుడిపై మదనపల్లెలో దాడి జరిగిన సంఘటన ఆదివారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు చీకటివారిపల్లికి చెందిన రాజేంద్ర(33) పిన తల్లి జ్యోతి కురబలకోట మండలంలోని అంగళ్ళులో ఉంటోంది. ఆమె కుటుంబీకులతో గొడవ పడి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో.. పినతల్లిని చూడటానికి రాజేంద్ర కర్ణాటక నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న జ్యోతిని పలకరించి కారణాలు అడగి తెలుసుకున్నాడు. అనంతరం జ్యోతి భర్త నరేష్‌ను రాజేంద్ర నిలదీయడంతో ఆగ్రహించి నరేష్ బండరాయితో రాజేంద్ర తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నాడు. స్థానిక రెండవ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. -
బస్సులో ప్రయాణిస్తూ యువకుడి మృతి
జమ్మలమడుగు రూరల్ : పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్(32) అనే యువకుడు ఆదివారం తిరుపతి– జమ్మలమడుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్ స్వగ్రామం వదలి కొన్నేళ్లుగా తాడిపత్రిలోని కొండెపల్లి గ్రామంలో ఉన్నాడు. కాగా ఆర్థిక సమస్యలతో 8 నెలల క్రితం స్వగ్రామమైన పెద్దపసుపలకు చేరుకున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం కదిరికి వెళ్లాడు. ఆదివారం తిరిగి తిరుపతి నుంచి జమ్మలమడుగు వస్తున్న ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. బస్సు జమ్మలమడుగు పాతబస్టాండ్‌కు వచ్చినా.. సీటులో నుంచి లేవకపోవడంతో సిబ్బంది భాస్కర్‌ను లేపారు. కానీ లేవకపోవడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఆ మేరకు తండ్రి స్వామిదాసు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హార్సిలీహిల్స్‌లో పర్యాటకుల ఆటో బోల్తా మదనపల్లె టౌన్ : ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న పర్యాటకుల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం హార్సిలీ హిల్స్ మూడవ మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పి.కార్తీక్(19)తో పాటు మరో ఆరుగురు స్నేహితులు హార్సిలీహిల్స్‌కు పర్యటనకు వచ్చారు. పర్యటన ముగించుకుని సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణ మయ్యారు. మార్గంమధ్యలోని హర్సీలీ హిల్స్ 3వ మలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటికి తీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆళ్లగడ్డ ప్రమాదంలో సదుం వాసి మృతి సదుం : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సదుం మండల వాసి ఆదివారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం మేరకు.. కంభంవారిపల్లె పంచాయతీ కురవపల్లెకు చెందిన సుబ్రమణ్యం(59 వ్యక్తిగత పనుల నిమిత్తం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హైదరాబాదుకు బయలుదేరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. -
టీడీపీలో ఇరు వర్గాల ఘర్షణ
● కుందూ మట్టి తరలింపుపై వివాదం ● దారి కోసం వాగ్వాదం ● ఒకరిపై ఇద్దరు దాడి ● బాధితుడికి తీవ్ర గాయాలుప్రొద్దుటూరు : కుందూనది నుంచి మట్టిని తొలుకునే క్రమంలో దారి కోసం టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణ కారణంగా జరిగిన సంఘటనకు సంబంధించి టీడీపీకి చెందిన కల్లుట్ల మౌళాలిపై మరోవర్గం వారు దాడి చేశారు. వివరాలిలా వున్నాయి. రాజుపాళెం మండలంలోని వెలవలి గ్రామ సమీపంలోని కుందూనదిలో మట్టిని తరలిస్తున్నారు. అక్కడ నదిలో దారి కోసం టీడీపీలోని ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఆ పార్టీకి చెందిన వారు అదే పార్టీకి చెందిన వ్యక్తిపై కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెలవలి–తొండలదిన్నె గ్రామాల మధ్యలో ఉన్న వంతెన సమీపంలో నదిలో నుంచి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరుకు మట్టిని నింపేందుకు రూ.200 వసూలు చేస్తున్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు హిటాచీ సాయంతో మట్టిని ట్రాక్టర్లలో నింపుతున్నారు. టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణ హిటాచీ వద్ద నుంచి దాటే సమయంలో నదిలో దారి కోసం టీడీపీలోని ఇరువర్గాలు ఆదివారం తగాదా పడ్డారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని వెలవలి గ్రామంలో టీడీపీ నాయకులు మౌళాలిపై కట్టెతో దాడి చేయడంతో తలకు, కంటి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి నేపథ్యంలో రాజుపాళెం పోలీసులు విచారణ చేపట్టారు. మండలంలోని తొండలదిన్నె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెలవలి గ్రామ సమీపంలో కుందూనదిలో హిటాచీ సహాయంతో నదిలోని మట్టిని గత కొన్ని రోజులుగా ట్రాక్టర్ల ద్వారా తరలించడం జరుగుతుంది. అయితే వెలవలి గ్రామానికి చెందిన కల్లుట్ల మౌళాలి మరో హిటాచీ సహాయంతో నదిలోని మట్టిని తరలించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నదిలో మందుగా ఉన్న దారి కోసం ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సార్ కాపాడు... సీఎం సార్ కాపాడు కుందూనది వద్ద తీవ్ర గాయాలపాలైన మౌళాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, తనను ఎమ్మెల్యే బతికించు, సీఎం బతికించు అంటూ వేడుకోవడం జరిగింది. ఈ సంఘటన జిల్లా స్థాయిలో చర్చినీయాంశంగా మారింది. మౌళాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు బంధువులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వెలవలి గ్రామంలో ఉద్రిక్తత కుందూలో మట్టిని తరలించే క్రమంలో నదిలో దారికోసం జరిగిన సంఘటన నేపథ్యంలో వెలవలి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమంగా కుందూనదిలో మట్టిని తరలిస్తున్నారని టీడీపీలో ఒక వర్గం ఆరోపిస్తోంది. ఈ మట్టి కుమ్ములాటలో కొట్టుకునేంత వరకు పరిణామాలు దారితీశాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో మట్టిని తవ్వుతున్న హిటాచీలను నిర్వాహకులు మరో చోటికి తరలించారు. మళ్లీ ఎటువంటి గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాడికి పాల్పడిన వారు పరారీ కావడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మౌళాలిని సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు రాజుపాళెం : దారి కోసం టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణ పడిన కేసులో టీడీపీలో ఓ వర్గానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం రాత్రి తెలిపారు. అందులో వెలవలి గ్రామానికి చెందిన మౌలాలిపై దాడి చేసినట్లు.. అదే గ్రామానికి చెందిన కమ్ముసాబ్ గారి రసూల్, ఖాజావల్లిపై కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కడప కార్పొరేషన్లో వార్డుల పునర్విభజన పూర్తి
కడప కార్పొరేషన్: కడప మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యిందని కమిషనర్ హెచ్ఎస్ భావన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇదివరకు 50 వార్డులు ఉండగా, ప్రస్తుతం వాటిని 66కు పెంచినట్లు తెలిపారు. వార్డుల సరిహద్దులు, ఇతర వివరాలను ప్రకటించినట్ల చెప్పారు. దీనిపై అభ్యంతరాలుంటే రాతమూలకంగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కడప సెవెన్‌రోడ్స్: చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున అన్నారు. ఆదివారం కడపలోని తమ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మల్లెల నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో అన్ని కార్మిక విభాగాలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా అవ్వారు మల్లికార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కడప నగర అధ్యక్షుడు జయరాములు, 14వ డివిజన్ అధ్యక్షుడు గంగులు, వివిధ సంఘాల నాయకులు నరసింహులు, వెంకట రమణ, మహబూబున్నీసా, ఓబులేశు, షేక్ ఇస్మాయిల్, చౌడూరు ఖాసిం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కడప అర్బన్: ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 198 కేసులు నమోదు చేసి, రూ. 57,445 జరిమానా విధించినట్లు తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల వచ్చారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు విరాళాలను అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన సోమశెట్టి వెంకటేశ్వర్లు రూ.25 వేలు, ఇదే గ్రామానికి చెందిన సోమశెట్టి రెడ్డెయ్య, రెడ్డిమణిచందన, వరుణ్‌కుమార్‌లు రూ. 25 వేలు అందజేశారు. ఆదివారం ఆలయానికి చేరుకొన్న దాతలకు, వారి కుటుంబసభ్యులకు అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజలు చేయించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దాతలు రూ. 50వేలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజన్న నాయుడు, ఈవో మంజులకు అందజేశారు. ఈమొత్తాన్ని వాల్మీకీపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంకు నందు జమ చేయనున్నట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బాల కృష్ణ, మహేష్, వెంకటరమణ పాల్గొన్నారు. -
ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏమిటి?
● అధికారులు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహణ, గ్రామ పంచాయతీలో నిధులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో.. వాటిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం అందించాలని కోరితే ఆ వ్యక్తిపై భౌతిక దాడులకు దిగడం ఏమిటని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదని అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పవన్‌కుమార్ నాయుడు గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన వివరాలను అడితే దానికి అధికారులు సమాచారం ఇవ్వకుండా.. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ విషయం తెలిపి.. వారు దౌర్జన్యం చేసే విధంగా చేయడం దారుణం అన్నారు. అధికారం శాశ్వతం కాదని, రేపు వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోవాలన్నారు. సుబ్బరామిరెడ్డి, శంకర్‌రెడ్డి ట్రస్టుల పేరుతో ప్రజలకు మంచి చేస్తున్నామంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ నుంచి నీరు సరఫరా అవుతుంటే వాటికే కనెక్షన్లు తీసుకుని కరెంటు బిల్లులు పంచాయతీ చేత కట్టించుకుంటున్నారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఆదాయం మాత్రం కూటమికి సంబంధించిన కార్యకర్తలు తీసుకుంటున్నారన్నారు. ఈ దుర్మార్గానికి అధికారులు కూడా సహకరించడం సరైంది కాదన్నారు. నియోజకవర్గంలో కూటమి నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతోపాటు వారికి వత్తాసు పలికితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కూటమి నాయకులు అవినీతికి పాల్పడుతూ, సహజ వనరులను దోచుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. కొండాపురంలోని పెన్నానది, చిత్రావతి, పట్టణంలోని పెన్నానదిలోని ఇసుక అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాయడం మాని నిజాయితీగా పని చేస్తే.. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, బీసీ నాయకుడు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ప్రొద్దుటూరు అభివృద్ధి
ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాగునీరు, రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, మార్కెట్ నిర్మాణ పనులను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాదరెడ్డి అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సహకారంతో మంజూరు చేయించారన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే సరిపోతుందన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా బస్టాండ్‌ను నిర్మించారని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా దానిని ప్రారంభించలేకపోతోందన్నారు. రోడ్లు విస్తరణ చేపట్టి డివైడర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూ.50 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం పవర్ కట్ లేకుండా నియంత్రించే పరిస్థితి లేదన్నారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాచమల్లు శివప్రసాదరెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. ఒక్క మారు ప్రభుత్వం అధికారంలో ఉండటంతోనే నియోజకవర్గాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబు మాటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల పట్ల రాష్ట్రంలోని తల్లిదండ్రులందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ మూడో సంతానం కంటే రూ.30 వేలు, నాలుగో సంతానం కంటే రూ.40 వేలు, ఐదో సంతానం కంటే రూ.50 వేలు ఇస్తానని ప్రకటించారన్నారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఇచ్చినా రూ.30 వేలు కేవలం కాన్పునకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. సంతానం పుట్టిన తర్వాత వారి పోషణ బాధ్యతను ఎవరు తీసుకుంటారని, భవిష్యత్తులో వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు గ్యారెంటీ ఉందా అని అన్నారు. ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక భారంతో సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు అదనపు సంతానం కలిగితే వారి పరిస్థితి ఏమిటని అన్నారు. సరైన భవిష్యత్తును కల్పించకపోతే పుట్టే సంతానం అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సమావేశంలో టీటీడీ పాకలమండలి మాజీ సభ్యులు చిప్పగిరి ప్రసాద్, టంగుటూరు మారుతిప్రసాద్, వైఎస్సార్సీపీ ఆర్యవైశ్య విభాగం రాష్ట్ర నాయకుడు కరుణాకర్ పాల్గొన్నారు.మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ -
కత్తితో దాడి.. హత్యాయత్నం కేసు నమోదు
ముద్దనూరు : మండలంలోని ఉప్పలూరు గ్రామంలో పాలగిరి బాలవీరయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన వీరబోయిన లక్ష్మీనరసయ్య ఆదివారం మచ్చుకత్తితో దాడి చేశాడు. దీంతో లక్ష్మీనరసయ్యపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీఐ నగేష్‌బాబు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలవీరయ్య, లక్ష్మీనరసయ్య మధ్య కొంత కాలం నుంచి మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు ఇరువురు హాజరయ్యారు. భోజన సమయంలో వీరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో వీరయ్యను నరసయ్య బెదిరించాడు. అనంతరం వీరయ్య ఇంటి వద్దకు వెళ్లి అతనిని బయటికి పిలిచి మచ్చుకత్తితో దాడి చేశాడు. దీంతో వీరయ్య ముఖం మీద, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో తండ్రిని కాపాడడానికి వచ్చిన వీరయ్య కుమారుడు వినోద్‌ను కూడా నరసయ్య కత్తితో నరికినట్లు అతని ఎడమ చేతి వేలికి గాయమైనట్లు, వినోద్ ఫిర్యాదు మేరకు నరసయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. తీవ్ర గాయాల పాలైన వీరయ్యను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు. -
భక్తులకు సౌకర్యం
అరుణచాలం వెళ్లేందుకు ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు సౌకర్యంగా ఉంటుంది. అరుణాచలానికి డైరెక్ట్ కనెక్టివిటీ రైలు కోసం రైల్వేమంత్రిని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ చేసిన ప్రయత్నం ఫలించింది. – తల్లెంభరత్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌యుసీసీ, తిరుపతి జిల్లా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు దోహదపడుతుంది. రైళ్లు మారకుండా నేరుగా కాణిపాకం, వేలూరు, అరుణచాలం, శ్రీరంగం వెళ్లేందుకు వీలవుతుంది. అయితే మరోవైపు రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు రైలు దోహదపడదనే భావన ఉంది. రైల్వేశాఖ విజయవాడకు కడప మీదుగా వెళ్లేలా రైలు తీసుకురావాలి. –దాసరి నరసింహులు, సీనియర్న్యాయవాది, నందలూరు -
AP: రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి తమ నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. చెన్నూరు మండలం ముండ్లపల్లెకు చెందిన సుధీర్‌బాబు(35), పెంచలమ్మ(35) కొన్ని సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె వున్నారు. సు«దీర్‌బాబు కూలీ పనులకు వెళుతూ వుండేవాడు.అతని భార్య పెంచలమ్మ కొప్పర్తి ప్రాంతంలో ఓ సంస్థలో విధులు నిర్వహిస్తుండేది. గత నాలుగు రోజులుగా ఇద్దరికి వివాహేతర సంబంధాలపై ఒకరినొకరు గొడవపడ్డారు. శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కడప– రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో సుధీర్‌బాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనకు తట్టుకోలేక అతని భార్య పెంచలమ్మ కడప– కనుమలోపల్లె మధ్యలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి. కడప రైల్వే పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓట్లు మనవి.. పోట్లు పాలకులవి
పోరుమామిళ్ల: కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజల్, వంటగ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శనివారం పోరుమామిళ్లలో సీపీఐ నాయకులు అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చొని, గ్యాస్ సిలెండర్లు నెత్తిన పెట్టుకుని ఆంధోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మోడీ ప్రభుత్వం పెట్రో ధరల భారం కానుకగా ఇచ్చిందన్నారు. తక్షణమే పెంచిన ధరలు ఉపసంహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కేశవ, జాకోబ్, ప్రసాద్, సఫా, పీరయ్య, నరసింహులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
చమురు బాదుడుపై ధర్నా..
కడప వైఎస్ఆర్ సర్కిల్: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణము తగ్గించాలని వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య పేర్కొన్నారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ కడప రెవిన్యూ డివిజినల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పెట్రోల్, డీజిల్, రేటును పెంచారని తెలిపారు. పార్లమెంటులో తగినంత బలం లేకపోయినా అనేక బిల్లులను దొడ్డిదారిన చెయ్యగలిగిన చరిత్ర వున్న బిజెపి ఆర్థిక మాంద్యం పేరుతో ప్రజల పైన భారాలు మోపడం సరైనది కాదు అని అన్నారు. -
ఆటోలాగి.. చమురు వదిల్చారు!
కడప వైఎస్ఆర్ సర్కిల్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై మూడు రూపాయలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వెయ్యడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. నపెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద ఆటోను తాడుతో లాగుతూ 7 రోడ్ల కూడలి వరకు నిరసన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అన్వేష్, దస్తగిరిరెడ్డి, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, శివకుమార్, నారాయణరెడ్డి, తిమ్మయ్య, అన్వర్, విజయ్, రఘు, విశ్వనాధ్, పెద్దన్న, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఎద్దులబండ్లు వాడాల్సిందేనా
ప్రొద్దుటూరు : పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని స్థానిక పాత బస్టాండ్ వద్ద శనివారం ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని విమర్శించారు. ప్రధాని మోదీ పెట్రోలు, డీజిల్ కొరత ఉందని, సైకిల్, ఎద్దుల బండ్లపై, నడుచుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుని ప్రయాణం చేయండి అని ఉచిత సలహా ఇవ్వడం ఎంత వరకు సమంజమన్నారు. సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు పక్కీరయ్య, సర్వేశ్వరి, బాలసుబ్బయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. -
బస్సు కింద పడి బాలుడికి గాయాలు
సిద్దవటం : మండలంలోని భాకరాపేట వద్ద శనివారం బద్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు కింద పడి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరులోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన కామాక్షి తన బంధుమిత్రులతో కలిసి తిరుపతి సమీపాన ఉన్న నారాయణవనం నుంచి రైలులో ప్రయాణిస్తూ భాకరాపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి బ్రహ్మంగారిమఠానికి వెళ్లేందుకు బద్వేల్ వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దెబస్సును వినీత్(10) తన తల్లి కామాక్షితో కలిసి ఎక్కుతుండగా.. కండక్టర్ గమనించకుండా ఉండటంతో డ్రైవర్ మోహన్ కృష్ణ బస్సు కదిలించాడు. ఆ బాలుడు కిందపడి బస్సు వెనక టైరు అతని కాలిమీద వెళ్లడంతో ఎడమకాలు పూర్తిగా దెబ్బతినింది. ఆ రక్తగాయాలు చూసిన తల్లి స్పృహ తప్పి పడిపోయింది. గాయపడిన బాలుడిని చికిత్స కోసం స్థానికులు 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. జరిగిన సంఘటనపై మండల ఎస్ఐ హారిక విచారణ చేస్తున్నారు. ఆగని కేబుల్ వైరు చోరీలురామసముద్రం : మండలంలో కేబుల్ వైర్ల చోరీలు వరుసగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఊలపాడులో రైతుల బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ కాగా.. శుక్రవారం రాత్రి ఆర్.నడింపల్లి పంచాయతీ బొంపల్లి గ్రామంలో పంచాయతీ తాగునీటి బోరు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. రాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు వైర్లు అపహరించడంతో గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జేసీబీని ఢీకొన్న బైక్ పుంగనూరు : మండలంలోని సింగిరిగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు సంతోష్(18) అనే యువకుడు శనివారం ద్విచక్రవాహనంలో వెళ్తూ ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంతోష్‌కు తీవ్ర గాయాలై, ఎడమకాలు విరిగింది. అటుగా వెళ్తున్న హెల్పింగ్ లయన్స్ సభ్యుడు బషీర్ అలీ గమనించి బాధితున్ని తన ఆటోలో ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. -
ఎమ్మెల్యే కుమారుడి ఇసుక దోపిడీ అరికట్టాలి
● రూ.150 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలి ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డికడప సెవెన్‌రోడ్స్ : ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామం వద్ద ఉన్న పెన్నా నదిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే కుమారుడు నంద్యాల కొండారెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, జెడ్పీ ఉపాధ్యక్షులు జేష్టాది శారదతో కలిసి కలెక్టర్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాచమల్లు విలేకరులతో మాట్లాడుతూ 50 ఏళ్లుగా కొంతమంది పేద రైతులు పెన్నానది పరీవాహక ప్రాంతంలో భూమిని చదును చేసుకుని వ్యవసాయం సాగిస్తున్నారని తెలిపారు. అయితే, ఇటీవల కూటమి ప్రభుత్వం వీరికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా భూములను స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆ భూములు చదును చేసి రోడ్లు, కాలువలు నిర్మించి ప్రభుత్వానికి అప్పగించే కాంట్రాక్టు పనిని నంద్యాల కొండారెడ్డి ఏపీఐఐసీ ద్వారా పొందారని పేర్కొన్నారు. ఆ భూముల్లో వెంచర్లు వేసి పారిశ్రామికవేత్తలకు విక్రయించడం ద్వారా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతోందని విమర్శించారు. పగలు కాంట్రాక్టు పనులు చేసే ఎమ్మెల్యే కుమారుడు రాత్రి ఇసుకను అక్రమంగా చాగలమర్రి, మదనపల్లె ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇందువల్ల భవిష్యత్తులో రంగసాయిపురం, శంకరాపురం, కాకిరేనిపల్లె, చౌడూరు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదముందని తెలిపారు. అలాగే శంకరాపురం, చౌడూరు గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇంత జరుగుతున్నా తహసీల్దార్, మైనింగ్ అధికారులు, పోలీసులు, ఏపీఐఐసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం చదును చేసే సమయంలో తొలగించిన ఇసుకను ఒకచోట డంప్ చేయాలే తప్ప తరలించరాదన్నారు. స్టేటస్ కో అమలు చేయాలి తాను హైకోర్టుకు వెళ్లగా, స్టేటస్ కో ఇచ్చారని పేర్కొన్నారు. అయితే అందుకు కూడా మెలిక పెట్టారన్నారు. తాము సర్వే నెంబరు 699/1, /3లో పనులు చేస్తున్నామంటూ నమ్మబలుకుతున్నారన్నారు. కానీ, 657 పూరా సర్వే నంబరులో 354 ఎకరాలు ఉన్నాయని, సబ్ డివిజన్ చేశాక 699/1, 699/3 ఏర్పడ్డాయని వివరించారు. ప్రభుత్వం వేస్తున్న వెంచర్ల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని, స్టేటస్ కో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు పట్టణం 1వ వార్డుకు చెందిన బొల్లవరంలో రూ.150 కోట్ల విలువజేసే భూమిని కాజేసి రియల్ ఎస్టేట్ ద్వారా రూ.200 కోట్లు దోచుకోవాలని పథకం పన్నారన్నారు. ఆ భూమిని కాపాడాలని కోరారు. -
లింకు దొరికింది.. డొంక కదిలింది
ప్రొద్దుటూరు క్రైం : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి. మ్యాచ్ ప్రారంభంలో ప్రొద్దుటూరు పోలీసులు ఇక్కడి బుకీలకు పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసుల ఆదేశాలు హెచ్చరికలు, ఆదేశాలను ఖాతరు చేయని బుకీలు క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కాగానే మెల్లగా ఒక్కొక్కరు జారుకున్నారు. ప్రొద్దుటూరులో ఉంటే కదా పోలీసులు మమ్మల్ని పట్టుకునేది అని భావించిన బడా బుకీలు, చోటామోటా పందెం రాయుళ్లందరూ ఇతర రాష్ట్రాలు, బయటి దేశాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి యాప్‌ల ద్వారా నిరభ్యంతరంగా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా చిన్నా, చితక పందెం రాయుళ్లు తప్ప ప్రధాన బుకీలు ఎవ్వరూ పోలీసులకు దొరకలేదు. ఏం చేయాలో పాలుపోక పోలీసు అధికారులు తల బాదుకోసాగారు. ఇలాంటి సమయంలో ఓ లింకు పోలీసు అధికారులకు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇటీవల లేపాక్షిలో అక్కడి పోలీసులు దాడి చేసి పలువురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వారితో ప్రొద్దుటూరు బుకీలతో సంబంధాలు ఉండటంతో ప్రొద్దుటూరు పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గాంధీరోడ్డులోని ప్రధాన బుకీ ఇంట్లో దాడులు నిర్వహించగా.. అతను తప్పించుకున్నాడు. ప్రొద్దుటూరులో కోవెలకుంట్ల బుకీ పాగా కోవెలకుంట్ల ప్రాంతంలో పేరు మోసిన ఒక క్రికెట్ బుకీ ప్రొద్దుటూరులో పాగా వేసినట్లు కనిపిస్తోంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో బెట్టింగ్ డాన్‌గా పేరు పొందిన ఆ బుకీకి ప్రొద్దుటూరులోని ప్రధాన బుకీలతో పరిచయం ఏర్పడింది. దీంతో అతను ఇక్కడ కూడా కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. సమయం దొరికినప్పుడల్లా అతను ఇక్కడికి వచ్చి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటాడు. ప్రొద్దుటూరు బుకీలకు కోవెలకుంట్ల బెట్టింగ్ డానే యాప్‌లకు సంబంధించిన ఐడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన యాప్‌ల ద్వారానే ఇక్కడి బుకీలు అనేక మంది క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రొద్దుటూరులోని కాల్వకట్టకు చెందిన ఒక క్రికెట్ బుకీ పట్టుపడగా.. అతని మొబైల్లోని యాప్‌లను పరిశీలిస్తే కోవెలకుంట్ల బుకీ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి సహకరిస్తున్న ప్రొద్దుటూరు బుకీల లిస్టు ఒకటి పోలీసులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోవెలకుంట్ల వాసి అయిన ఆ బుకీ ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చాడు. కొందరు బుకీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దాడులకు సమాయత్తం అవుతున్నారు. కోవెలకుంట్ల బుకీతోపాటు అతనితో సంబంధాలున్న ప్రొద్దుటూరు బుకీలు ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుకున్నారు.. వదిలేశారు కాగా మూడు రోజుల క్రితం ప్రొద్దుటూరు పోలీసులు క్రికెట్ బుకీ కారులో నుంచి రూ.20 లక్షలుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ముగ్గురిని ఇంటికి పంపించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును కూడా వాళ్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాళ్ల ఒత్తిడి మేరకే స్వాఽధీనం చేసుకున్న డబ్బును ఇచ్చిపంపినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. పోలీసు అధికారులు మాత్రం ఈ కేసును విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్న పోలీసులు పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రధాన బుకీ అకౌంట్లను పోలీసు అధికారులు లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన సెకండ్ హ్యాండ్ కార్ల షెడ్లో రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో వాళ్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. క్రికెట్ బెట్టింగ్ డబ్బులతో సెకండ్‌హ్యాండ్ కార్ల బిజినెస్ సాగిస్తున్నారా అనే కోణంలో దర్యాపు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు బెట్టింగ్ కేసులు లేక ఖాళీగా ఉన్న ప్రొద్దుటూరు పోలీసులకు ఇప్పుడు చేతి నిండా పని దొరికింది. ఒక్క లింకుతో బుకీల డొంక కదిలినట్లు అయింది. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేస్తే దొరికిన లింకుల ఆధారంగా ప్రొద్దుటూరులో ఉన్న ప్రధాన బుకీలందరి ఆట కట్టించవచ్చు. చూడాలి మరి పోలీసు అధికారులు ఎంత వరకు వెళ్తారో.. ఎందరిని అరెస్ట్ చేస్తారో. కోవెలకుంట్ల క్రికెట్ బుకీకి ప్రొద్దుటూరు బుకీలతో సంబంధాలు రెండు రోజుల క్రితం జరిగిన పోలీసుల దాడుల్లో బహిర్గతం ప్రొద్దుటూరు ప్రధాన బుకీల కోసం పోలీసుల వేట -
ప్రకృతి వ్యవసాయ అభివృద్ధిలో బీఆర్సీలు కీలకం
కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయ అభివృద్ధిలో బీఆర్సీల పాత్ర కీలకం అని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణ్యేశ్వరావు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కడపలోని ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో మండల స్థాయి నోడల్ బయో రిసోర్స్ సెంటర్ల యజమానులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కషాయాలు, జీవ ద్రావణాల తయారీ విధానాలు ప్రత్యక్షంగా చేసి చూపించారు. వాటి తయారీ, వినియోగం, పంటలపై కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు. బీఆర్సీ యజమానులు క్షేత్ర స్థాయిలో శాసీ్త్రయ దృక్పథంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వసంత కుమారి, యంగ్ ప్రొఫెషనల్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య
కడప కోటిరెడ్డి సర్కిల్ : భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి తమ నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. చెన్నూరు మండలం ముండ్లపల్లెకు చెందిన సుధీర్‌బాబు(35), పెంచలమ్మ(35) కొన్ని సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె వున్నారు. సుధీర్‌బాబు కూలీ పనులకు వెళుతూ వుండేవాడు. అతని భార్య పెంచలమ్మ కొప్పర్తి ప్రాంతంలో ఓ సంస్థలో విధులు నిర్వహిస్తుండేది. గత నాలుగు రోజులుగా ఇద్దరికి వివాహేతర సంబంధాలపై ఒకరినొకరు గొడవపడ్డారు. శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కడప– రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో సుధీర్‌బాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు తట్టుకోలేక అతని భార్య పెంచలమ్మ కడప– కనుమలోపల్లె మధ్యలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి. కడప రైల్వే పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లికి చిన్నారి అప్పగింత
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం నాగరాజుపేటలో శుక్రవారం తప్పిపోయిన చిన్నారిని అధికారులు తల్లికి అప్పగించారు. గాయత్రి అనే మూడేళ్ల చిన్నారి తప్పిపోవడంతో అధికారులు బాలల సంక్షేమ సమితిలో అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి బాలల సంక్షేమ సమితి వారిని కలిసి చిన్నారిని అక్కున చేర్చుకుంది. ఈ సందర్భంగా బాలిక తల్లి మాట్లాడుతూ తమది అన్నమయ్య జిల్లా ములకలచెరువు కాగా, భర్త కూలీ పనుల కోసం కడపకు రావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో భోజనం తీసుకు వచ్చేందుకు హోటల్‌కు వెళ్లగా చిన్నారి తప్పిపోయిందన్నారు. తన చిన్నారిని అప్పగించినందుకు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. కవల పిల్లల అదృశ్యంమదనపల్లె టౌన్ : పట్టణంలోని అనపగుట్టకు చెందిన మోహన్, రాణి దంపతుల కవల పిల్లలు సందీప్ (14), సుశాంత్ (14) అదృశ్యమయ్యారు. గత నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరు తిరిగి రాలేదు. బంధువులు, పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో శనివారం రాత్రి తల్లి రాణి పోలీసులను ఆశ్రయించారు. -
విషద్రావణం తాగి మహిళ ఆత్మహత్య
అట్లూరు : భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో భార్య విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అట్లూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగకీర్త శనివారం తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన గోపాలయ్య, గోపాలమ్మల కుమార్తె దేవిని 8 ఏళ్ల క్రితం బద్వేలు మండలం కోనసముద్రానికి చెందిన కమలకూరు భాస్కర్‌కు ఇచ్చి వివాహం చేశారు. భాస్కర్ అట్లూరుకు వచ్చి అత్తగారింటిలో ఉంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 14న రాత్రి భార్యాభర్తలు సెల్‌ఫోన్ విషయమై గొడవపడి కమలకూరు దేవి విషద్రావణం తాగగా హుటాహుటీన బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవి మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతురాలి తల్లి గోపాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎస్ఐ దూషించి.. తీవ్రంగా కొట్టి..
జమ్మలమడుగు : ఓ మహిళకు అప్పు ఉన్నానంటూ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి డబ్బు కట్టాలంటూ తనపై వత్తిడి తీసుకురావడంతోపాటు బెల్టుతో ఇష్టారాజ్యంగా ఎస్ఐ కొట్టారని బాధితుడు, వైఎస్సార్సీపీ కార్యకర్త తానిషా వలి వాపోయాడు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వెళ్లాడు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను మహిళ వద్ద 80 వేల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దానికి వడ్డీ కింద 64 వేల రూపాయలు చెల్లించానని పేర్కొన్నారు. అయితే తన పరిస్థితి బాగలేకపోవడంతో అప్పు చెల్లించడంలో జాప్యం జరిగిందన్నారు. గతంలో ఆ మహిళ అనేక చోట్ల పంచాయితీలు పెట్టించిందని, తాను రూ.50 వేలు ఇస్తానని చెప్పానని తెలిపారు. అయితే శుక్రవారం ఆమె స్టేషన్‌కు వెళ్లి డబ్బులపై పంచాయితీ పెట్టిందన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పిలవడంతో తాను స్టేషన్‌కు వెళ్లడం జరిగిందన్నారు. ఎస్ఐ జోక్యం చేసుకుని డబ్బులు చెల్లించాలని వత్తిడి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. తాను 50 వేల రూపాయలు ఇస్తానని పెద్దల సమక్షంలో ఒప్పుకొన్నానని తెలిపారు. అయినా ఎస్ఐ వినకుండా.. చెప్పడానికి కూడా వీలులేని తిట్లను తిడుతూ కాళ్లను తిప్పి బెల్టుతో తీవ్రంగా కొట్టడం జరిగిందన్నారు. తనకు షుగర్ వ్యాధి ఉందని, ఆరోగ్యం సక్రమంగా లేదని చెబుతున్నా ఇష్టారాజ్యంగా కొట్టడంతోపాటు సెల్ ఫోన్ లాక్కున్నారన్నారు. శుక్రవారం రాత్రి అంతా విపరీతమైన నొప్పులు ఉండటంతో ప్రభుత్వాసుపత్రిలో వచ్చి చేరడం జరిగిందన్నారు. పోలీసులు సివిల్ పంచాయితీలు చేయకూడదని ఉన్నాతాధికారులు చెబుతున్నా.. ఇక్కడ మాత్రం సివిల్ పంచాయితీలు చేస్తూ తీవ్రంగా కొట్టడం జరిగిందన్నారు. తనకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఆసుపత్రిలో చేరిన బాధితుడు -
శ్మశానం ఆక్రమిస్తున్నారని దళితుల ఆగ్రహం
చాపాడు : శ్మశాన వాటిక స్థలం ఆక్రమిస్తున్నారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చియ్యపాడు గ్రామ సమీపంలోని గేటురాళ్ల వంక దగ్గర పడమర వైపు ఎకరా పైగా స్థలంలో చియ్యపాడు గ్రామం పుట్టినప్పటి నుంచి దళితులు (మాల) శ్మశాన వాటిక స్థలం ఏర్పాటు చేసుకున్నారు. అనాది నుంచి నేటి తరం వరకు చనిపోయిన వారిని అక్కడే పూడ్చుకుంటున్నారు. అయితే సర్వే నంబర్లు 909, 910, 911లో 9.03 ఎకరాల పొలం ప్రొద్దుటూరుకు చెందిన పద్మనాభరెడ్డికి చెందినదని, దీనిని తాను కొన్నానని చియ్యపాడుకు చెందిన వీరేంద్రనాథ్రెడ్డి నాలుగు రోజుల క్రితం నుంచి పొలాలను చదును చేస్తున్నాడని, ఇదే క్రమంలో తమ శ్మశాన వాటిక కూడా తనదేనని అంటున్నాడని దళితులు చెబుతున్నారు. ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్న శ్మశానం తమకు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ శ్మశానం ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని దళితులు కోరుతున్నారు. ఈ క్రమంలో శనివారం దళితులు గ్రామ పెద్దలు బాల నరసింహారెడ్డి, శివారెడ్డిలతో కలసి తహసీల్దార్ రమాకుమారికి వినతి పత్రం అందజేశారు. శ్మశానం అన్యాక్రాంతం కాకుండా దళితులకే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపినట్లు వారు పేర్కొన్నారు. తెలిపారు. -
పరిసరాల పరిశుభ్రత.. ఆరోగ్య భద్రత
కడప అర్బన్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చని ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. పోలీస్ సిబ్బంది ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వరద ఫొటో మార్ఫింగ్ కేసులో ఒకరి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో టీడీపీ ప్రొద్దుటూరు మాజీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడు పైడాల మహేష్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్ వర్గీయులైన పైడాల మహేష్, అజయ్కుమార్లపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం మహేష్‌ను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ జూదరులు అరెస్టు మైదుకూరు : క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు జూదరులను శుక్రవారం మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరుకు చెందిన సింగనమల నాగరాజు, ఇందిరమ్మ కాలనీకి చెందిన రాయలగొల్ల రాజు అనే వారు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా స్థానిక వనిపెంట రోడ్డులోని జగన్ డాబా సమీపంలో అర్బన్ ఎస్ఐలు చిరంజీవి, వెంకరటమణ ఆధ్వర్యంలో దాడి చేశారు. నాగరాజు వద్ద రూ.3,500, రాజు వద్ద రూ.4,500 నగదును స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. రాజుపాళెం : మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాల శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వాముల ఆలయాలకు సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర దేవాదాయ ఖాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ఆలయాలకు సంబంధించి ధర్మకర్త మండలి సభ్యులుగా లక్ష్మినారాయణ రెడ్డి, లక్ష్మి నరసింహా రెడ్డి, మధుసూదర్‌రెడ్డి, దాసరి రామారావు, శంకుసాయి రామారావు, విజయలక్ష్మి, సావిత్రి, అచ్చమ్మ, ఇమాంబి, వెంకటసుబ్బమ్మ, కృష్ణవేణి, ఎక్స్ అఫిషియో మెంబర్‌గా వీణా శేషాచార్యులను నియమించారు. మొత్తం 12 మంది ధర్మకర్తలి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున ట్రస్ట్ బోర్డు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ప్రొద్దుటూరు కల్చరల్ : కర్నూలులోని పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఈ నెల 25న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా సూపరింటెండెంట్ కిరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు పోస్టల్ శాఖకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే దీనిలో పాల్గొని ఉన్నతాధికారులదృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాతపాలెం గ్రామంలో అమ్మమ్మగారింటికి వచ్చిన దండుబోయిన వర్ధన్‌కుమార్ అనే 15 ఏళ్ల బాలుడు అదృశ్యమైనట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. ఖాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ఈ బాలుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మగారింటికి వచ్చాడని, గురువారం ఉదయం 11 గంటలకు ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పేర్కొన్నారు. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు సీఐ వివరించారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు అర్బన్ సీఐ 9121100618, ఎస్ఐ 9121100619 నంబర్లకు తెలియజేయాలని కోరారు. కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని స్థానిక నాగరాజు పేటలో అమ్మాయి తప్పిపోయిందని ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి తెలిపారు. శుక్రవారం ఆమె తెలుపుతూ కడప వన్ టౌన్ పోలీసులు ఆ పాపను జిల్లా బాలల సంక్షేమ సమితిలో హాజరు పరచగా, ఆ పాపను ప్రత్యేక దత్తత సంస్థలో ఆశ్రయం కల్పించామన్నారు. ఆ పాప తల్లిదండ్రులు గానీ, బంధువులు కానీ తగిన ఆధారాలతో బాలల సంక్షేమ సమితి కార్యాలయానికి చేరుకుని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 8919171503 అనే నెంబర్‌కు సంప్రదించాలన్నారు. ప్రొద్దుటూరు కల్చరల్ : హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాయలసీమ వర్కింగ్ కమిటీ చైర్మన్‌గా డాక్టర్ అరికొండ ప్రతాప్‌కుమార్‌ను సంస్థ జాతీయ చైర్మన్ తాల్లూరి ప్రసన్న కుమార్ నియమించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్న తనకు రాయలసీమ వర్కింగ్ కమిటీ చైర్మన్‌గా పదోన్నతి కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవాలి కడప అగ్రికల్చర్: జిల్లాలో ప్రస్తుత ఎన్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. వైఎస్సార్ కడపజిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా డీపీఎం కార్యాలయంలో జిల్లా స్థాయిలో బయో రిసోర్సు సెంటర్ యజమానులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఎల్‌నినో ప్రభావం దాని వల్ల వ్యవసాయంపై కలిగే మార్పులు వాటిని తట్టుకునే పద్ధతులపై వివరించారు. అదనపు ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి, బయో రిసోర్సు సెంటర్ యజమానులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
నిత్యానందరెడ్డిని అన్యాయంగా హత్య కేసులో ఇరికించారు
కడప అర్బన్: కడప నగరంలోని మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని పెద్ద దస్తగిరి హత్య కేసులో అన్యాయంగా ఇరికించారనీ, ఆయన రాజకీయ ఎదుగుదల చూడలేకనే కూటమి ప్రభుత్వం పెద్దలు కుట్ర పన్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ ధ్వజమెత్తారు. ఈనెల 12 వ తేదీన పోలీసులు బండి నిత్యానందరెడ్డిని కడప కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో వున్న నిత్యానందరెడ్డిని శుక్రవారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప నగర మాజీ మేయర్ పాకా సురేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం వారు కడప కేంద్ర కారాగారం బయట విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్న క్రమంలోనే నిత్యానందరెడ్డిని పెద్దదస్తగిరి హత్య కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఆయన న్యాయపోరాటం చేసేందుకు పార్టీ నేతలు అండగా ఉంటామన్నారు. నిజానిజాలను తెలుసుకోకుండా ఈ విధంగా వేధింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా నిత్యానందరెడ్డి సతీమణి దీప్తిరెడ్డి తన భర్తతో ములాఖత్ అయి వెళ్లారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ మేయర్ పాకాసురేష్ -
మిషన్‌లో పడి తెగిపోయిన కాలు
జమ్మలమడుగు: పొలంలో మొక్కజొన్న కోసే యంత్రంలో కాలు పడి అరవ భాస్కర అనే రైతు కాలు సగం వరకు తెగిపోయింది. శుక్రవారం ఉదయం పెద్దముడియం మండల కేంద్రంలో రైతు, వైఎస్సార్సీపీ కార్యకర్త అయిన అరవ భాస్కర్ తన పొలంలో మొక్కజొన్న పంట మిషన్‌తో కోయిస్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తు మిషన్‌లో పడి సగానికి కాలు తెగి పోయింది. వెంటనే స్థానికులు అరవ భాస్కర్‌ను నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ,ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డిలు వెంటనే నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం అరవ భాస్కర్‌కు ధైర్యం చెప్పి అక్కడి వైద్యులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్సీ -
అయ్యా... ఇదెక్కడి న్యాయం..?
● తూ తూ మంత్రంగా ఎన్‌హెచ్ అధికారుల విచారణ ● అర్హులైన రైతులను పిలవకుండానే విచారణ ● స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చినా కూడా రైతులకు అన్యాయం ● విందు భోజనాలతో సరిపెట్టుకున్న విచారణ సాక్షి టాస్క్‌ఫోర్స్ : కడప – ముద్దనూరు, బి.కొత్తపల్లె నేషనల్ హైవే ఎన్‌హెచ్ 716 రహదారి పరిహారం విచారణను ఎన్‌హెచ్ అధికారులు తూ తూ మంత్రంగా చేపట్టారు. శుక్రవారం సాక్షిలో ‘కోల్పోయింది కొంత.. కొట్టేసింది కొండంత’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతిని జిల్లా ఉన్నతాధికారులు విచారణాధికారిగా నియమించారు. దీంతో శుక్రవారం ఆయన తొండూరు మండలంలోని మల్లేల, తొండూరు, ఇనగలూరు, సైదాపురం, క్రిష్ణంగారిపల్లె తదితర గ్రామాలకు సంబంధించిన రైతులకు ఎవరైతే పైపులైన్లు కానీ, పండ్ల తోటలు కానీ, బోరు బావులు నష్టపోయారో అలాంటి రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా కొంతమంది అనుకూలమైన రైతులను మాత్రమే పిలిపించుకుని విచారణ జరిపినట్లు పలువురు రైతులు వాపోతున్నారు. అర్హులైన రైతుల ఆవేదన .. మల్లేల గ్రామంలోని గుజ్జుల మల్లికార్జున, బూ చుపాటి దాసి, బూచుపాటి సుధాకర్, శ్రీరామరత్నం, ఓబులేసు, శ్రీరాములు, నాగయ్య, గోపాల్‌రెడ్డి, వెంకటరమణ, నాగేశ్వరరెడ్డిలతోపాటు మరికొంతమంది రైతులు 2014–15 సంవత్సరంలో చీనీ పంటలకు నీటి తడులు అందించేందుకు బోరుబావులలో నీరు లేకపోవడంతో సమీపంలో ఉన్న మల్లేల చెరువు నుంచి దాదాపు కిలోమీటర్ల మేర లక్షలాది రూపాయలు వెచ్చించి పైపులైన్లు వేసుకున్నారు. అప్పటినుంచి తమ చీనీ పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. అలాంటి తరుణంలో ఎన్‌హెచ్ హైవేలో భాగంగా తమ పైపులైన్లు పూర్తిగా ధ్వంసమైనప్పటికి అధికారులు తమకు పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చినా రైతులకు అన్యాయం.. ఎన్‌హెచ్ 716 హైవే రహదారికి తొండూరు మండలంలోని మల్లేల, తొండూరు, ఇనగలూరు, క్రిష్ణంగారిపల్లె తదితర గ్రామాలకు సంబంధించిన రైతులు పైపులైన్లు, బోరుబావులు నష్టపోయినా అధికారులు వారికి అన్యాయం చేశారు. శుక్రవారం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి వచ్చి అర్హులై నష్టపోయిన రైతులను విచారణ జరపకుండా కొంతమంది రైతులను మొక్కుబడిగా పిలిపించుకుని విచారణ చేపట్టి మమ అనిపించుకున్నారు. అధికారులు వచ్చారని రైతులు అక్కడికి వెళ్లి మాకు న్యాయం చేయాలని అడిగినా కూడా మేం హైవే రోడ్డు పనులు చూడటానికి వచ్చామని రైతులతో అన్నట్లు పలువురు వాపోతున్నారు. విచారణ అనంతరం తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో విచారణకు వచ్చిన అధికారులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని విచారణ ముగించుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఎన్‌హెచ్ ఏఈ విశ్వనాథరెడ్డిని సాక్షి వివరణ కోరగా.. విచారణ పూర్తి చేశామని, అర్హులైన రైతులెవరైనా ఉంటే తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీల ద్వారా తెలియజేయాలన్నారు. తొండూరులో తూ తూ మంత్రంగా విచారణ జరుపుతున్న ఎన్‌హెచ్ అధికారులు, మల్లేలలో విచారణ జరుపుతున్న ఎన్‌హెచ్ అధికారులు -
నష్టపరిహారం అందించండి..
మల్లేల చెరువు నుంచి నా పొలం వద్దకు దాదాపు 4కి.మీ మేర చీనీ చెట్లకు నీటితడులు అందించేందుకు పైపులైన్ వేశాను. దాదాపు 600లకుపైగా పైపులు అమర్చాను. దీంతో నాకు రూ.8లక్షల మేర నష్టం జరిగింది. నాకు నష్టపరిహారం అందించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. నష్టపోయిన మాకు పరిహారం అందించకుండా ఏ నష్టం జరగని రైతులకు లక్షలు అధికారులు మంజూరు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నా. – గట్టు నాగయ్య, చీనీ రైతు, మల్లేల -
రెగ్యులర్ కోసం ఎదురుచూపు
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపీహెచ్ఏ ( మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ )గా విధులు చేపట్టాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హతతో శానిటరీ ఇన్స్పెక్టర్గా శిక్షణ పొందాలి. మొదట్లో ఈ శిక్షణలను కేవలం ప్రభుత్వ పరిధిలోని ట్రైనింగ్ కేంద్రాల్లో మాత్రమే 18 నెలలపాటు శిక్షణ ఇచ్చేవారు. తర్వాత కాలంలో పలు ప్రైవేటు సంస్థలు కూడా శిక్షణ ఇచ్చాయి. కాగా 2002–2003వ సంవత్సరంలో డీఎస్సీ ద్వారా కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ శిక్షణ సంస్థల్లో ట్రైనింగ్ పొందిన వారు కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు పొందారు. 2024లో ఎన్నికల కోడ్ కారణంగా.. 2024వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. ఆ ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 89 మంది కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు. మరో 32 మందికి రెగ్యులర్ కావాల్సి ఉండగా అంతలోపే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తమను కూడా రెగ్యులర్ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. ఆదుకోవాలి ఈ ఉద్యోగాన్నే నమ్ము కుని జీవిస్తున్నాం. 2003వ సంవత్సరం నుంచి విధులు చేపడుతున్నాం. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసి ఆదుకోవాలి. – డి శివరాం, పీహెచ్సీ ఆకేపాడు న్యాయం చేయండి నేను 2003 నుంచి విధుల్లో ఉన్నా. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలి. –ఎం చాంద్ బాషా, పీహెచ్సీ, వనిపెంట అర్హులకు న్యాయం చేయండి ఈ శాఖను నమ్ముకుని ఏళ్ల తరబడి విధులు చేపడుతున్నాం. మా సహచర ఉద్యోగులకు చాలామందికి రెగ్యులర్ అయింది. మేము అన్ని విధాల అర్హులం. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసి ఆదుకోవాలి. – జి నరసయ్య, కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ, పీహెచ్సీ, చెన్నూరు ఇతని పేరు వీఎన్ ముని రెడ్డి. చెన్నూరు ప్రాథమి క ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఎంపీహెచ్‌ఏగా పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రభుత్వ శిక్షణా కేంద్రంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా శిక్షణ పొందారు. 2006 నుంచి కాంట్రాక్ట్ ఎంపీహెచ్‌ఏగా విధులు చేపడుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగిగా 2027 ఏప్రిల్ 30వ తేదీన రిటైర్మెంట్ అవుతారు. అదే రెగ్యులర్ అయితే 2029 ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ చెందుతారు. తనలాంటి వారికి చాలా మందికి ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి. అన్ని అర్హతలు ఉండి తామెందుకు రెగ్యులర్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ కోసం పలువురు ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఎంపీహెచ్ఏలు రెగ్యులర్ చేసిఆదుకోవాలని వేడుకోలు -
‘బక్రీద్’కు పటిష్ట భద్రతా చర్యలు
● ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 27న బక్రీద్ పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో అస త్య, చట్టవ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో,మత సామరస్యంతో జరుపుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్.పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, రాజంపేట ఏ.ఎస్.పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, స్పెషల్ బ్రాంచ్ డీ.ఎస్.పీ ఎన్ . సుధాకర్, డీఎస్పీలు పాల్గొన్నారు. -
ఇకపై ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లు
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో ఉన్న ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చాలని ఆ సంస్థ నిర్ణయించింది. జూన్ 1వ తేది నుంచి వీటిని అమల్లోకి తేవాలని చూస్తోంది. అంటే మొబైల్‌కు రీచార్జి ఎలా చేసుకుంటామో గడువు తీరిన తర్వాత విద్యుత్‌కు కూడా అలాగే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. గృహాలకు ఏర్పాటు చేసే ముందు ప్రభుత్వ సర్వీసులకు అమర్చి ఫలితాలు చూడాలని ఏపీఎస్పీడీసీఎల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.మెరుగైన నిరంతరాయ విద్యుత్‌ను అందించడంలో భాగంగా మొదట ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపా లు తదితర సర్వీసులకు ఇప్పటికే స్మార్టు మీటర్లు అమర్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల విద్యుత్ వినియోగం,బిల్లింగ్‌లో పారదర్శకతను పెంపొందించేందుకు వీలుగా స్మార్ట్ మీటర్లను కాస్తా ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లుగా మార్చాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల బకాయిల ఉపశమనంతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంస్థ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు సంబంధించి వైఎస్సార్ కడప జిల్లాలో 16,261 కనెక్షన్లు ఉన్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాలలో 1.17 లక్షల సర్వీసుల్లో సింగిల్ ఫేజ్ సర్వీసులు 91,306, త్రీఫేజ్ సర్వీసులు 26,507 వున్నాయి. ఈ సర్వీసులన్నింటినీ కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసి, ఈ–వాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించడం జరుగుతోంది. తొలుత ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు! జూన్ 1 నుంచి అమలులోకి జిల్లాలో 16,261ల ప్రీ–పెయిడ్ మీటర్లు జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకే.... వినియోగదారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకే ప్రీ పెయిడ్/ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం. సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు, వాటర్ వర్క్స్ విద్యుత్ సర్వీసుల నుంచి రూ.9,507 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు, భవిష్యత్తులో విద్యుత్తు వినియోగంలో పారదర్శకతను పెంపొందించడం, విద్యుత్ బిల్లును ఆదా చేయడంతోపాటు విద్యు త్ వినియోగాన్ని నియంత్రించుకునేందుకు ప్రీ–పెయిడ్ మీటర్లు ఉపయోగపడుతాయి. – శివశంకర్ లోతేటి, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్ -
మతపరంగా రెచ్చగొట్టే వార్తలు వ్యాప్తి చేస్తే చర్యలు
కడప అర్బన్: మత పరంగా రెచ్చగొట్టే వార్తలు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. కొంతమంది దుండగులు, బాధ్యతారహిత వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా పుకార్లు, తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన వీడియోలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులను ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్‌ను సృష్టించడం, పోస్టు చేయడం, ఫార్వర్డ్ చేయడం లేదా షేర్ చేయడం చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రెచ్చగొట్టే పోస్టులు ఉంటే కడప పోలీస్ కంట్రోల్ రూమ్‌కు, 112 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌న్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. సోదరభావం, శాంతియుత జీవనానికి ప్రతీకగా కడపకు గొప్ప చరిత్ర ఉందన్నారు. అన్ని వర్గాలవారు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. -
అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు
కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మైదుకూరు: జిల్లాలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మండలంలోని ముదిరెడ్డిపల్లె, మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె చెరువులకు ‘జలధార – సాగునీటి సంరక్షణ’ కింద నీరందించే పనులను శుక్రవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యారత్నాలు పదో తరగతి ఫలితాల్లో శెట్టివారిపల్లె హైస్కూల్ విద్యార్థిని వీర ఉదయశ్రీ జిల్లాలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని కలెక్టర్ తెలిపారు. సభలో వీర ఉదయశ్రీని అభినందించారు. సత్కారం: కడపలోని మాధవి కన్వెన్షన్ హాల్లో కాగా శుక్రవారం రాత్రి ‘విద్యా రత్నాలు’ అవార్డుల కార్య క్రమం జరిగింది. పదో తరగతి ఫలితాల్లో రాణించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సత్కరించారు. -
అధికారులు అన్యాయం చేశారు..
ఎన్‌హెచ్ 716 రహదారి నిర్మాణంవల్ల అధికారులు అర్హులైన రైతులకు అన్యాయం చేశారు. మల్లేల చెరువు నుంచి మా భూమి వద్దకు దాదాపు 3కి.మీ మేర పైపులైన్లు వేసి రూ.6లక్షల మేర ఖర్చు చేసి చీనీ చెట్లకు నీటి తడులు అందించేవారం. రోడ్డు నిర్మాణంలో భాగంగా పైపులైన్ పూర్తిగా దెబ్బతిని నష్టం జరిగింది. నష్టపరిహారం అందించాలని అధికారులను కోరినా మా గ్రామానికి విచారణకు వచ్చిన అధికారులు మాతో మాట్లాడకుండా మమ్ములను విచారించకుండా వెళ్లిపోయారు. – ఇసుకపల్లె రంగారెడ్డి, చీనీ రైతు, మల్లేల -
నేడు శాప్ డైరెక్టర్ రాక
కడప వైఎస్ఆర్ సర్కిల్: శాప్ డైరెక్టర్ రజిని శనివారం కడపకు రానున్నట్లు డీఎస్డీఓ గౌస్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరిగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన కడపతో పాటు పలు ప్రాంతాల్లో జరిగే క్రీడా శిక్షణ శిబిరాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: శాప్ లీగ్ ఆధ్వర్యంలో ఈ నెల 20,21న వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ క్రీడాంశాలలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ గౌస్‌బాషా తెలిపారు. ఈ నెల 20న డీఎస్ఏ క్రీడా మైదానంలో యూత్–17, జూనియర్ విభాగంలో అండర్–20 బాలబాలికలకు వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. 21న అఽథ్లెటిక్స్ ఎంపికలు జూనియర్ విభాగంలో అండర్–16, అండర్–20 విభాగాల్లో ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. పుంగనూరు: టమాటా పండించిన రైతులకు ధరలు ఊరటనిస్తున్నాయి. 10 కిలోల టమోట రూ.300లు కాగా, మూడో రకం రూ.260లు పలికింది. మార్కెట్ కమిటీకి 84 మెట్రిక్ టన్నుల టమాటాను రైతులు తరలించారు. టమాటాను చైన్నె, విజయవాడ, హైదరాబాద్‌కు వ్యాపారులు తరలించారు. రైతులు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే అప్పుల ఊబిలో నుంచి బయట పడుతా మని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప కోటిరెడ్డి సర్కిల్: చర్లపల్లె – తిరుచానూరు మధ్య వారాంతపు రెగ్యులర్ రైలును ఈనెల 17వ తేదీ నుంచి నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి ఆదివారం చర్లపల్లెలో (17059) రాత్రి 9.30గంటలకు బయలుదేరి మల్కాజ్గిరి, కాచిగూడ, షాద్ నగర్, మహబూబ్ నగర్, కర్నూలు, తాడిపత్రి, కడప, రేణిగుంట మీదుగా తిరుచానూరుకు మరుసటి రోజు మధ్యాహ్నం 12.30గంటలకు చేరుకుంటుందని వివరించారు. ప్రతి సోమవారం (17060) తిరుచానూరులో సాయంత్రం 4గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు ఇదే మార్గంలో చర్లపల్లెకు చేరుకుంటుందన్నారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
● చిన్న కారణాలకే జీవితాలు బుగ్గిపాలు
ప్రొద్దుటూరు: పిల్లల ఎదుగుదలలో, వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర, ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. కన్నబిడ్డల కోసం కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తమ రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమించేవారే అమ్మానాన్నలు. అయితే, ఇటీవల కాలంలో కొందరు తల్లిదండ్రులు తమ పసిబిడ్డల భవిష్యత్తు గురించి ఇసుమంతైనా ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలతో హఠాత్తుగా జీవితాలను ముగించేస్తున్నారు. ఈ బలవన్మరణాల కారణంగా ఎన్నో కుటుంబాలు నిలువునా ఛిన్నాభిన్నం అవుతుండగా, కన్నవారి నీడను కోల్పోయి ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. సెల్ఫీ వీడియోతో డ్రైవర్ ఆత్మహత్య ప్రొద్దుటూరులో ఇటీవల ఓ డ్రైవర్ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో తన ఆవేదననంతా సెల్ఫీ వీడియోగా రికార్డ్ చేసి, ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ఆయనకున్న ఒకే ఒక్క కుమార్తె భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికురాలి యాసిడ్ మరణం అప్పుల బాధ తాళలేక ప్రొద్దుటూరులో మరో చేనేత కార్మికురాలు దారుణ స్థితిలో తనువు చాలించింది. అప్పు ఇచ్చిన వారు తీర్చాలంటూ నిరంతరం మానసిక ఒత్తిడికి గురిచేయడంతో, తట్టుకోలేక ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆమెకున్న ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథలుగా మారి రోడ్డున పడ్డారు. సోషల్ మీడియా మాయ.. ఆర్థిక క్రమశిక్షణ లోపం: ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు పెరగడానికి సోషల్ మీడియా ప్రభావం ఒక ప్రధాన కారణంగా మారుతోందని విశ్లేషణలు చెప్తున్నాయి. స్మార్ట్ఫోన్లలో నిరంతరం రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూడటం వల్ల తెలియని కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొందరి ఆలోచనా విధానాలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పక్కవారితో అనవసరమైన ఆర్థిక పోటీలు పెట్టుకోవడం, కుటుంబాలలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవడం వంటివి సంసారాలలో చిచ్చులు పెడుతున్నాయి. ఫలితంగా భర్తలపై ఉన్న కోపంతో, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనే కనీస బాధ్యతను కూడా మరచి కొందరు మహిళలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే తల్లిదండ్రుల బలవన్మరణాలు ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు పసివాళ్ల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్న వైనం.. జిల్లాలోపెరుగుతున్న ఆత్మహత్యల ఘటనలు అమ్మానాన్నలు దూరమై అనాథలుగా మారుతున్న చిన్నారులు ఖాళీగా ఉండకండి.. ఏదో ఒక పనిపై దృష్టి పెట్టండి! ‘ప్రస్తుత రోజుల్లో మనుషులలో సహనం నశిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఇళ్లలో కరెంట్ డిజిటల్ పరికరాల ప్రభావంతో ఖాళీగా ఉండటం వల్ల అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిళ్లు తలెత్తుతున్నాయి. మహిళలు ఇంట్లో ఒంటరిగా, ఖాళీగా ఉండకుండా తమకు నచ్చిన ఏదో ఒక పని లేదా ఉపాధి మార్గంపై దృష్టి సారించాలి.జీవితంలో సమస్యలు సహజం, అంత మాత్రానికే ఆత్మహత్యలు శరణ్యం కాదు. పసిపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కౌన్సిలింగ్ కేంద్రాలను ఆశ్రయించాలి. –డాక్టర్ కవితా ప్రసన్న, మానసిక వైద్యనిపుణురాలు, జిల్లా ఆస్పత్రిఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జిల్లాలోనూ చిన్న చిన్న కారణాలకే, తాత్కాలిక సమస్యలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ప్రసార మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ గుండెలు పగిలే ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోంది. ఇటీవల కడప జిల్లాతో పాటు ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో చోటు చేసుకున్న ఆత్మహత్య ఘటనలు ఇందుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు వంటి సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటూ చనిపోతున్న వారు.. తమ వెనుక ఉన్న పసిపిల్లల ఆక్రందనలను విస్మరిస్తున్నారు. -
సర్ షెడ్యూల్ విడుదల
కడప సెవెన్‌రోడ్స్: ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్/సర్)–2026 కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2026 జులై 1 అర్హత తేదీగా నిర్ణయించారు. ఆ తేది నాటికి వయస్సు 18 సంవత్సరాలు నిండే వారంతా ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులు. సెన్సెస్ మొదటి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన కార్యక్రమం ఈనెల 20వ తేది నాటికి పూర్తి కానుంది. జిల్లాలో ఎన్యుమరేటర్లుగా పనిచేస్తున్న 3529 మందిని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సైతం వినియోగించనున్నారు. అధికారులు, సిబ్బందికి జూన్ 5 నుంచి 14వ తేది వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బూత్ లెవెల్ అధికారులు జూన్ 15 నుంచి జులై 14వ తేది వరకు ఇంటింటి పరిశీలన నిర్వహిస్తారు. అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తా రు. చుట్టుపక్కల ఉన్న ఓటర్ల ద్వారా బీఎల్ఓలు ఈ సమాచారాన్ని సేకరిస్తారు. ముసాయిదా జాబితాలో చేర్చబడని వీరి పేర్లను ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. ఎన్యూమరేషన్ సమయంలో ఓటర్ల నుంచి ఎలాంటి పత్రాలను సేకరించరు. ఎవరైనా తన పేరును లేదా తమ బంధువుల పేర్లను గత ఇంటెన్సివ్ రివిజన్లో ఉన్న ప్రకారం ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవచ్చు. గత ఓటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉండి ప్రస్తుత ఎన్యుమరేషన్ సమయంలో కనిపించని వ్యక్తులకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ముసాయిదా జాబితా విడుదల తర్వాత నోటీసులు జారీ చేస్తారు. అలా ఎవరికై తే నోటీసులు జారీ చేయబడతాయో వారి జాబితాలు ఈఆర్ఓ రికార్డు నిర్వహిస్తారు. ఇంటింటి సర్వే సమయంలో ప్రతి బీఎల్ఓ వద్ద కనీసం 30 ఫారం–6లు అందుబాటులో ఉంటాయి. ఓటర్లుగా నమోదు కావాలనుకునే వారికి బీఎల్ఓలు ఫారం–6ను అందజేస్తారు. హెల్ప్‌లైన్ నెంబరు 1950 ఏర్పాటు అర్హులైన వారు ప్రత్యేకించి దివ్యాంగులు, వలస వచ్చిన వారు, వృద్దులు, ఓటర్లు తమ పేర్లను జాబితాల్లో నమోదు చేసుకోవడానికి వీలుగా జిల్లా స్థాయి లో 1950 హెల్ప్‌లైన్ నెంబరును అందుబాటులోకి తీసుకు రానున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2251 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జులై 14నాటికి పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ప్రారంభించి ఆగస్టు 20వ తేది వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సెప్టెంబరు 18 నాటికి పరిష్కరించి అదేనెల 22వ తేది ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. జూన్ 5 నుంచి 14 వరకుసిబ్బందికి శిక్షణ జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే -
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలంలోని బి.చెర్లోపల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన అంకె రామచంద్రుడు (55) అనే కౌలు రైతు కూలీ పనులకు వెళ్తూ గ్రామ సమీపంలోని బిదినంచర్ల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన 7ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని గత ఏడాది అప్పులు తెచ్చి అరటి సాగు చేశాడు. అయితే అరటిలో దిగుబడులు బాగా రాగా.. గాలి రూపంలో కౌలు రైతు ఆశలు అడియాశలయ్యాయి. ధైర్యం కోల్పోకుండా ఈ ఏడాది కూడా మళ్లీ అప్పులు చేసి అరటిని సాగు చేశాడు. అయితే ఈ ఏడాది కూడా దిగుబడి ఉన్న అరటి ధర పతనం కావడంతో విధి లేని పరిస్థితుల్లో టన్ను అరటిని రూ.2వేల నుంచి రూ.3వేలకు విక్రయించాడు. అరటి సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతోపాటు అప్పులు పెరిగిపోయి దాదాపు రూ.20లక్షల దాకా అప్పు ఉండటంతో రైతు చేసేదేమి లేక దిక్కుతోచని స్థితిలో గురువారం రాత్రి విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుమారులు తండ్రిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు జలంధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా – యువకుడి మృతి
బి.కోడూరు : మండలంలోని మాధవరాయునిపల్లె గ్రామానికి చెందిన బి.నాగభూషణం (35) ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన నాగభూషణం మండలంలోని మాధవరాయునిపల్లె గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మని వివాహం చేసుకుని అత్తగారింట్లో ఉంటూ కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రామసముద్రం చెరువు నుండి పొలాలకు మట్టి తోలే క్రమంలో అధిక లోడుతో వెళుతూ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగభూషణం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బి.కోడూరు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బ్యాంక్ రుణాలను వినియోగించుకోవాలి చాపాడు : రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకులు అందించే వ్యవసాయ, ఇతర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ లక్ష్మీ తులసి తెలిపారు. మండల కేంద్రమైన చాపాడులో శుక్రవారం మెగా అగ్రి అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా రైతులకు, డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.11కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. తిరుపతి జోనల్ ఏజీఎం సనల్ కుమార్ , మైదుకూరు డివిజన్ అగ్రికల్చర్ ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ దేవీపద్మలత, ఎల్డీఎం జనార్ధ న్, డీపీఎం ధనుంజయ, చాపాడు బ్రాంచ్ మేనేజర్ కేవీ రమణ పాల్గొన్నారు. ఆటో బోల్తా – డ్రైవర్ మృతి చక్రాయపేట: మండలంలోని సురభి గ్రామం మహబూబ్‌నగర్ వద్ద శుక్రవారం రాత్రి పాల ఆటో బోల్తాపడి డ్రైవర్ మహబూబ్ షరీఫ్(28) అక్కడి కక్కడే మృతి చెందాడు.చక్రాయపేట వైపు నుంచి లక్కిరెడ్డిపల్లె వైపు పాలు తీసు కెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు మహబూబ్ షరీఫ్ చక్రాయపేట గ్రామం ఉప్పలవాండ్లపల్లె వాసి. మృతుడికి భార్యతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. చక్రాయపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలి ప్రొద్దుటూరు క్రైం : మంత్రి బండి సంజయ్‌ని వెంటనే మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడంతోపాటు ఆయన కమారుడు బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక శివాలయం సెంటర్లో బండి భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోక్సో చట్టం కింద బండి భగీరథ్‌ను అరెస్టు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరస్తున్ని కాపాడుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో రా యలసీమ మహిళా శక్తి కన్వీనర్ లక్ష్మీదేవి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయ కుడు శ్రీనివాసులు, విరసం నాయకురాలు వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
పేదల స్థలాలపై టీడీపీ నేత కన్ను
● పదేళ్ల నాటి ఇంటి పునాదుల కూల్చివేత ● ఆర్డీఓకు కార్యాలయానికి వెళ్లిన బాధితులు, వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యం పులివెందుల : పులివెందులలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వం పదేళ్ల క్రితం కేటాయించిన ఇంటి స్థలాల్లో పేదలు నిర్మించుకున్న పునాదులను టీడీపీ నాయకులు కూల్చివేస్తున్నారు. బాధితుల కథనం మేరకు.. 2014లో పులివెందుల పట్టణంలోని చిన్నరంగాపురం రోడ్డు రాజీవ్ కాలనీ పక్కన ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఉన్న డీకేటీ స్థలంలో 50 కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేసింది. అప్పట్లో వారు పునాదులు నిర్మించుకున్నారు. ప్రస్తుతం టీడీపీ మైనార్టీ నాయకుడి కన్ను పేదల స్థలాలపై పడింది. ఆ స్థలం తనదంటూ రెండు రోజుల క్రితం పేదలు నిర్మించుకున్న ఇళ్ల పునాదులను కూల్చివేశాడు. గురువారం ఈ విషయాన్ని బాధితులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లాలని కార్యాలయానికి చేరుకున్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ నాయకులు బాసటగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అక్కడే ఉన్న బాధితుల చేతుల్లో ఉన్న పట్టా కాగితాలను, జిరాక్స్ కాఫీలను లాక్కొని దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యం చేశారు. దీనికి వైఎస్సార్సీపీ నాయకులు కూడా దీటుగా సమాధానం ఇచ్చారు. ఇంతలో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసి ఆర్డీఓతో పోలీసుల మాట్లాడారు. దీనికి ఆర్డీఓ ఆ స్థలాలపై సర్వే చేపడతామని, సర్వే చేసిన తర్వాత విషయం తెలియజేస్తామని చెప్పడంతో ఇరు వర్గాల వారు అక్కడి నుంచి వెళ్లారు. -
హౌసింగ్ ఇన్చార్జి డీఈఈ సస్పెన్షన్
ప్రొద్దుటూరు : హౌసింగ్ డిపార్ట్మెంట్లో ప్రొద్దుటూరు రూరల్ ఏఈతోపాటు ఇన్చార్జి డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేశారు. హౌసింగ్ నిర్మాణానికి సంబంధించిన గోడౌన్‌లోని ఐరన్ మాయం కావడంతో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రాజారత్నం ఈయనను గురువారం సస్పెండ్ చేశారు. రూ.1.70 కోట్ల విలువైన ఐరన్ మాయమైన విషయం తెలిసిందే. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు డీఈఈ ప్రొద్దుటూరు విడిచి వెళ్లకూడదని పీడీ ఆదేశించారు. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న మరో ట్రాక్టర్ జమ్మలమడుగు: పట్టణంలోని మద్దనూరు రహదారిలో టైరుకు పంచర్ వేయించుకోవటానికి రోడ్డు ప క్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి మ రో ట్రాక్టర్ ఢీకొంది. ఈ ట్రాక్టర్ బైక్‌ను ఢీకొని కాలువ పైకి ఎక్కి నిలబడిపోయింది.ఈ సంఘటన గురువా ర ం ముద్దనూరు రహదారిలో జరిగింది.ఎవరికీ గాయా లు కాక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
ఏపీ ఈఏపీ సెట్‌కు 92.99 శాతం హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి గురువారం రెండు సెషన్స్‌లో నిర్వహించిన ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 92.99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలలో కలిసి 9 పరీక్షా కేంద్రాలకుగాను ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌కు సంబంధించి 1569 మంది అభ్యర్థులకుగాను 1459 మంది హాజరుకాగా 110 మంది గైర్హాజరయ్యారు. ఒంటిమిట్ట (సిద్దవటం): మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి హుండీ ఆదాయాన్ని గురువారం టీటీడీ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా నెల రోజులకుగాను భక్తులు వేసిన కానుకలను లెక్కించగా రూ.7,72,930ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో భక్తులు సమర్పించుకున్న హుండీల సొమ్మును గురువారం లెక్కించారు. ఇందులో బ్రహ్మంగారిమఠంలో హుండీల ద్వారా రూ. 37,55,769 , పోలేరమ్మ గుడి దగ్గర గల హుండీ ద్వారా రూ. 2,74,699 లక్షలు. నాలుగు గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వచ్చినట్లు మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ అధికారి శంకర్ బాలాజీ, మఠాధిపతి వీర ధర్మజ వెంకటాద్రి స్వామి, మఠం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కడప రూరల్: ఫార్మసీ రంగంలో నియంత్రణ లేని కార్యకలాపాలకు నిరసనగా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకుపైగా కెమిస్టులు, నియంత్రణ లేని ఆన్లైన్ కార్యకలాపాలతో పాటు, అన్యాయంగా డిస్కౌంట్ విధానాల కారణంగా కమ్యూనిటీ ఫార్మసీ వ్యవస్థ ప్రమాదంలో పడిందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 20న చేపట్టే దేశవ్యాప్త బంద్ కు సహకరించి, మద్దతు తెలపాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ట్రెజరీ సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కేశవరెడ్డి, ప్రొద్దుటూరు జోన్ సెక్రటరీ సుబ్బారావు, పులివెందుల జోన్ సెక్రెటరీ దినేష్ కుమార్, కడప జోన్ సెక్రెటరీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగర శివార్లలోని వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అండర్ –16, 14 క్రికెట్ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ.రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఈ ఎంపికలకు అండర్ 16 బాలుర విభాగంలో సుమారు 290 మంది, అండర్ 14 విభాగంలో 300 మంది క్రీడాకారు లు పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో ఎంపిక చేసిన వారితో సెలక్షన్ మ్యాచులు నిర్వహిస్తా మని పేర్కొన్నారు. అనంతరం జిల్లా జట్టును ఎంపిక చేస్తామని వివరించారు. ఈ ఎంపికలను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు ఎల్.మణికుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. సభ్యులు బి.ఈశ్వర్ రెడ్డి,ఎం మహేంద్ర రెడ్డి, కే విష్ణు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్: కడప అల్ట్రా మెగా సోలార్ పార్కు (1000 మెగా వాట్లు) పరిధిలో ఎల్ఏడీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నాల్గవ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్ పార్క్ పరిధిలో ప్రభావిత గ్రామాలు, ప్రభావితం కాని గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు విడుదల చేసిన నిధులకు సంబంధించి పనుల పురోగతి, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంజూరైన నిధులతో గ్రామ సచివాలయ సముదాయాల అభివృద్ధి, సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, కాంపౌండ్ వాల్, పార్కింగ్ టైల్స్, ప్లేగ్రౌండ్ లెవలింగ్, వెటర్నరీ భవనాల అభివద్ధి వంటి పనులను చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సోలార్ పార్క్ పరిధిలోని గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా నిధులను వినియోగిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సోలార్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్ఈ ఎం. శివశంకర్ నాయుడు, సీనియర్ ఇంజనీర్/సివిల్ అశోక్ కుమార్, సీపీవో హజరతయ్య పాల్గొన్నారు. జూన్ 12 నాటికి గురుకుల విద్యాలయాన్ని సిద్ధం చేయాలి జిల్లాలో అధునాతన వసతులతో నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాన్ని జూన్ 12 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో నూతనంగా రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన భవనంలో సదుపాయాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే నిందలు
● కులమతాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అగత్యం వైఎస్సార్సీపీకి పట్టలేదు ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష కడప కార్పొరేషన్: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమపై నిందలు వేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష విమర్శించారు. కడపలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప నగరం మతసామరస్యానికి ప్రతీక అని, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఏ చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. తిరుమల తొలిగడప దేవునికడప, పెద్దదర్గా, మరియపురం చర్చిలు ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచాయని, సుదూర ప్రాంతాల నుంచి కులమతాలకు అతీతంగా భక్తులు వీటిని సందర్శిస్తుంటారన్నారు. ఇలాంటి శాంతియుత నగరంలో అల్లర్లు జరగడం పట్ల తాము చాలా చింతిస్తున్నామన్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఘర్షణ ఘటనను తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పత్రికలు, మీడియా, రాజకీయ పార్టీలపై ఉందన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి కొన్ని పచ్చ పత్రికల్లో అల్మాస్‌పేటలో జరిగిన ఘటనకు వైఎస్సార్సీపీ నాయకులే కారణమని కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. జర్నలిజం విలువలు ఇవేనా అని ఆయన ప్రశ్నించారు. సున్నితమైన అంశంపై ఎలా రాయాలో జర్నలిజం నేర్పలేదా అని నిలదీశారు. రెచ్చగొట్టే కథనాలు రాసి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. అల్మాస్ పేట ఘటనను కొన్ని దుష్ట శక్తులు ప్రేరేపించాయని.. టీడీపీ నగర అధ్యక్షుడు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇరువర్గాలకు ప్రాతినిధ్యం వహించారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైఎస్సార్సీపీకి అంటగట్టే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిదాన్నీ రాజకీయం చేస్తున్నారని, పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్సార్సీపీకి అంటగడుతున్నారన్నారు. పెద్ద దస్తగిరి హత్య విషయంలో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. రెండు గంజాయి బ్యాచ్‌లకు మధ్య జరిగిన ఘర్షణను వైఎస్సార్సీపీ నాయకులకు అంటగట్టారని గుర్తు చేశారు. శవరాజకీయాలు, కలమతాల మధ్య చిచ్చురేపడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్న పచ్చ పత్రికల ద్వారా కథనాలు రాయించి, టీడీపీ నాయకులతో ప్రెస్మీట్లు పెట్టించి అవే నిజం అనేలా ప్రజలను మభ్యపెడతారన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు షరీఫ్ వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు నుంచి వచ్చిన స్క్రిప్టును ఆయన బాగా చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. స్తానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో లబ్ధి పొందేందుకు ఈ కుట్రలు చేయించారని షరీఫ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కడపలో వైఎస్సార్సీపీకి ఇంకా ఆ దుస్థితి పట్టలేదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని స్థానాలు కై వసం చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం టీడీపీకి మొదటి నుంచి అలవాటని, వారి చరిత్ర అదేనన్నారు. ఎందుకంటే టీడీపీకి చాలా డివిజన్లలో సరైన అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎవరైనా బాత్రూమ్లో కాలు జారిపడినా, ఆవు ఈనిందన్నా వైఎస్సార్సీపీ వల్లే జరిగిందని చెప్పే స్థితికి టీడీపీ నాయకులు దిగజారారన్నారు. కడప నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏమేం అభివృద్ధి చేశామో కళ్లకు కట్టినట్లు చూపుతామన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు వారి విశ్వరూపం చూపుతారని అంజద్‌బాషా హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, బంగారు నాగయ్య, తోటక్రిష్ణ, బీహెచ్ ఇలియాస్, దాసరి శివప్రసాద్, బసవరాజు, రాయల్‌బాబు, అక్బర్ అలీ, త్యాగరాజు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో క్రికెట్ బుకీలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో క్రికెట్ బుకీల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకోగా గాంధీరోడ్డులోని ప్రధాన క్రికెట్ బుకీ తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిందూపురంలో క్రికెట్ నిర్వహిస్తూ అక్కడి బుకీలు కొందరు రెండు రోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన క్రికెట్ బుకీలకు ప్రొద్దుటూరులోని ఇద్దరు బుకీలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరి ద్వారా గాంధీరోడ్డులోని ఒక ప్రధాన బుకీకి లింక్ ఉన్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. దీంతో రూరల్ పోలీసులు బుధవారం అర్దరాత్రి సమయంలో ఏక కాలంలో బుకీల ఇళ్లపై దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల రాకను పసిగట్టిన గాంధీరోడ్డులోని క్రికెట్ బుకీ తప్పించుకున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో డబ్బు కూడా దొరికినట్లు తెలుస్తోంది. పట్టుబడిన బుకీలను పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. బుకీల మధ్య ఉన్న లింకులను గుర్తిస్తూ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 5 మేకలు చోరీ బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీ అబ్బుసాహెబ్‌పేట గ్రామంలో 5 మేకలు చోరీకి గురైనట్లు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు..పట్టణంలోని విద్యానగర్‌లో బోవిళ్ళఎరికలరెడ్డి, సుజాత దంపతులు నివసిస్తుంటారు. ఎరికలరెడ్డి అబ్బుసాహెబ్‌పేట గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలం వద్దనే గేదెలను, మేకలను కూడా పోషించుకుంటుండేవాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 5 మేకలు చోరీ చేసినట్లు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంగారావు తెలిపారు. పీజీ ఈసెట్‌లో ఒంటిమిట్ట విద్యార్థి ప్రతిభ ఒంటిమిట్ట (సిద్దవటం): ఇటీవల జరిగిన పీజీ ఈసెట్ పరీక్షల్లో ఒంటిమిట్ట లోని నాగేటి తిప్పపై నివాసం ఉంటు న్న కె.నరసింహులు, కె.లక్ష్మీదేవి దంపతుల కుమారుడు కె.శంకరయ్య ప్రతిభ కనబరిచాడ. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు కుటుంబసభ్యులు గురువారం తెలిపారు. విద్యార్థి కె.శంకరయ్య రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్‌ను కూడా పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన పీజీ ఈసెట్ పరీక్ష ఫలితాల్లో కె.శంకరయ్య 120 మార్కులకు 90 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు.కుటుంబసభ్యులు, గ్రామస్తులు శంకరయ్యను అభినందించారు. బాధ్యతలు అప్పగింత కడప ఎడ్యుకేషన్: నూతన డీఎస్‌ఓగా నియమితులైన లేబాక బాలాజీకి మాజీ డీఎస్ఓ వేపరాల ఎబినేజర్ గురువారం బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన బాలాజీని సర్ సీవీ రామన్ సైన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు డా. గునిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కలిశారు. పూలమాలతో సన్మానించారు.కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్ రావు, సైన్స్ మ్యూజియం కురేటర్ రెహమా న్, మాజీ డీఎస్ఓలు ఎబినేజర్, నిత్యానంద రెడ్డి, క్లబ్ సభ్యులు గంగాధర్, మఽ దుసూదన్, క్రిష్ణ కిషోర్, బాలకష్ణ, ఎన్జీసీ కన్వీనర్ విజయ ప్రసాద్ పాల్గొన్నారు. గంజాయి కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు కడప అర్బన్: కడప పాత బస్టాండు సమీపంలో గురువారం గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. సీఐ వివరాల మేరకు కడప వక్కల పేట గూడూరు హరిజనవాడకు చెందిన ఖాజా ఆరిఫ్ అహ్మద్ అల్యూమినియం పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కడప అల్మాస్పేటకు చెందిన షేక్ గౌస్ పీర్ అలియాస్ కచ్చా ఐడిల్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కడప నకాష్ చెందిన షేక్ రియాజ్ పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కడప అగాడివీధికి చెందిన పఠాన్ మహమ్మద్ గౌస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కడప చిలకల బావి లో ఉన్న సవైపుర స్ట్రీట్ కి చెందిన పఠాన్ అబ్దుల్లా అలియాస్ ఆతుల్లా ఖాన్లు బ్యాచ్ గా తయారై, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడి వారికి పొట్లాలు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆదేశాల మేరకు ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, రూ.1500 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు. మహిళపై దుర్భాషలాడిన ఆర్టీసీ కండక్టర్ కడప అర్బన్: కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకానికి తూట్లు పొడిచేలా ఆర్టీసీ సిబ్బంది అసహనానికి గురవుతూ మహిళలపై దుర్భాషలాడుతున్నారు. తాజాగా కడప నగరంలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళను కండక్టర్ దుర్భాషలడటం, కొట్టడానికి ప్రయత్నించడం లాంటి సంఘటన ఇందుకు నిదర్శనం. బాధితురాలు తిరుపపులి వాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా పేర్కొంది. కడపలోని రామాంజనేయ పురం జర్నలిస్ట్ కాలనీకి చెందిన వాణి తన కుమార్తెకు సంబంధించిన అప్లికేషన్ తీసుకొచ్చేందుకు గురువారం మధ్యాహ్నం కడపకు వచ్చింది. నారాజుపేటలోని సన్‌రైజ్ హాస్పిటల్ ఎదురుగా పాత బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆ మార్గంలో వెళుతున్న ఆర్టీసీ బస్సును నిలిపి ఎక్కడానికి ప్రయత్నించింది. బస్సు ఎక్కగానే కండక్టర్ దుర్భాషలాడుతూ.. మహిళా అని చూడకుండా కొట్టడానికి ప్రయత్నించాడు. బస్సులో నుంచి బయటకు తోసేసి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో పాత బస్టాండ్ లో ఉన్న డ్యూటీలో ఉన్న పోలీసులకు తెలియజేసింది. పోలీసుల సమక్షంలోనే కండక్టర్, తనపైనే ఫిర్యాదు చేస్తావా? అంటూ మహిళను కొట్ట బోయాడు. పోలీసులు అడ్డుకున్నారు. తనపై దాడికి ప్రయత్నించిన కండక్టర్ పై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కడప వన్ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
● అర్హులైన రైతులకు అన్యాయం
సాక్షి ప్రతినిధి, కడప: ముద్దనూరు–బి.కొత్తపల్లె నేషనల్ హైవే (ఎన్‌హెచ్–716) రహదారి పరిహారం కొల్లగొట్టేందుకు తెలుగుతమ్ముళ్లు మాస్టర్ ప్లాన్ రచించారు. స్వల్పంగా భూమి కోల్పోతే సర్వం పోయినట్లు రికార్డుల్ని తారుమారు చేశారు. పైపులైన్ కోల్పోయినట్లు, బోరుబావులు గల్లంతవుతున్నట్లు రికార్డులు రూపొందారు. అంతేకాదు భవనాలు, పండ్లు, కూరగాయాల తోటలు కోల్పోయినట్లు పక్కాగా కథలల్లి ప్రజాధనం కాజేసే కుట్ర పన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే లేనిది ఉన్నట్లు రికార్డులు పుట్టించారు. ఆపై లక్షలాది రూపాయాలు కొల్లగొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ● ముద్దనూరు–బి.కొత్తపల్లె రహదారిలో భూసేకరణలో అనేక వైఫల్యాలు వెలుగుచూశాయి. అక్రమాల నేపధ్యంలో ఇదివరకే తొండూరు విలేజ్ రెవెన్యూ అధికారి నరహరి సస్పెండ్ ఉదంతం వెలుగు చూసింది. నరహరి అవినీతి తీగలాగితే అధికార పార్టీ నేతల అక్రమాల డొంకంతా కదిలింది. తొండూరు, మల్లేల గ్రామాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.కోటి పరిహారం తెలుగుతమ్ముళ్లకు భోజ్యంగా మారింది. రికార్డులు తారుమారు చేసి .. మల్లేల గ్రామంలో ఓ రైతుకు చెందిన కొంత భూమి ఎన్‌హెచ్ హైవే రోడ్డుకు కోల్పోయారు. ఆ కొద్ది భూమిలోనే వ్యవసాయబోర్లు, పైపులైన్లు, పండ్ల తోటలు ఉన్నట్లు రికార్డులు సృష్టించి దాదాపు రూ.10లక్షలకుపైగా పరిహారం అధికారులు మంజూరు చేసినట్లు సమాచారం. అలాగే తొండూరు గ్రామానికి చెందిన పచ్చనేతలు కోల్పోతున్న భూముల్లో బోర్లు, బావులు, పండ్లతోటలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. అయినప్పటికీ హైవే రోడ్డు ఏర్పాటు కారణంగా విద్యుత్ కనెక్షన్లు, పైపులైన్లు, బోర్లు, పండ్ల మొక్కలు కోల్పోతున్నట్లు రికార్డులు సృష్టించారు. జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగం రైతులతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయగా వీఆర్ఓ నరహరి మాత్రమే సమాధానాలు ఇవ్వసాగారు. రైతులు లేకుండా వారి అభ్యర్థన తెలుసుకోకుండా మొత్తం వ్యవహారం నరహరి నడిపారనే అంచనాకు వచ్చిన అధికారులు ఈనెల 9న సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. నరహరి సస్పెండ్‌తో మొత్తం బాగోతం బహిర్గతమైంది. ఎన్‌హెచ్ పరిహారంలో అధికార పార్టీకి వారికే లక్షలకు లక్షలు పరిహారం మంజూరైనట్లు తెలిసింది. ఆమేరకు ఆయా రైతుల అకౌంట్లకు డబ్బులు జమ చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్‌హెచ్–716 రహదారి భూసేకరణలో అక్రమాలు అధికార పార్టీ నేతల అక్రమాలకు అండగా నిలుస్తోన్న యంత్రాంగం తొండూరు మండలంలో రెవెన్యూ అధికారుల చేతివాటం వీఆర్ఓ నరహరి సస్పెండ్‌తో బయటపడ్డ భాగోతం ప్రభుత్వ పరిహారాన్ని బొక్కేస్తున్న తెలుగుతమ్ముళ్లు అర్హులకు మొండిచేయి చూపడంతోనే అసలు సమస్య ఉత్పన్నమైంది. తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోతున్నారు. కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి పండ్ల తోటలు పండించుకుంటున్నారు. అలాంటి రైతులకు నష్టపరిహారం మంజూరు చేయడంలో వివక్ష ప్రదర్శించారు. లేనిది ఉన్నట్లు రికార్డులు పొందుపర్చిన రెవెన్యూ యంత్రాంగం ఉన్నది ఉన్నట్లుగా రికార్డులు రాసేందుకు మనసొప్ప లేదు. అర్హులైన సామాన్య రైతులకు అన్యాయం చేసేందుకే సిద్ధమయ్యారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులకు ఒక న్యాయం, సామాన్య రైతులకు మరొక న్యాయం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలుండిపోయాయి. ఇప్పటికై నా జిల్లా రెవెన్యూ అధికారులు ఎన్‌హెచ్ హైవే రోడ్డు పరిహారం అవకతవకలపై పునః పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తూనే, అనర్హులను కట్టడి చేసి ప్రజాధనాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
వలపు వల విసిరి.. పోలీసులకు చిక్కి !
బద్వేలు అర్బన్ : బద్వేలు సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు వలపు వల విసిరి లక్షలు కొల్లగొట్టిన ఓ యువకుడు, యువతిని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్బన్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ బి.రామకృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన ఊరిబిండిఅశోక్ చైన్నెలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా జీవనం సాగిస్తున్నాడు. సుమారు రెండేళ్ళ క్రితం అశోక్ ఇన్స్ట్రా ఐడీకి పూజితరెడ్డి0707 అనే ఇన్స్ట్రా ఐడీ నుండి హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన అతని సమీప బంధువు ఆదూరిరామలింగారెడ్డి అశోక్‌తో చర్చించి ముందస్తు పథకం ప్రకారం అతనితో పరిచయమున్న మానక అలియాస్ పూజితరెడ్డితో పరిచయం పెంచుకోమని అశోక్‌కు సూచించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పూజిత తన ఆర్థిక ఇబ్బందులను చెప్పి బాధపడుతూ మెల్లగా అశోక్ వద్ద డబ్బులు గుంజడం మొదలుపెట్టింది. ఇలా అనేక దఫాలుగా వివిధ అకౌంట్లకు సుమారు రూ.81.67 లక్షలు స్వాహా చేశారు. పూజితరెడ్డి వ్యవహారశైలిలో అనుమానం వచ్చిన అశోక్ పూర్తిస్థాయిలో విచారించుకుని తనను ఉద్దేశ్యపూర్వకంగా రామలింగారెడ్డి, మానసలు మోసం చేశారని గుర్తించి గత నెల 29న అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గురువారం చెన్నంపల్లె ప్లైఓవర్ వద్ద రామలింగారెడ్డి, మానసలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్లే99ఎక్ఛేంజ్, స్కైఎక్ఛేంజ్, పేట్రస్ట్ యాప్‌లను వాడినట్లు విచారణలో తేలింది. అలాగే నిందితులు మోసం చేసి తీసుకున్న డబ్బులు మొత్తం క్రికెట్ బెట్టింగ్‌లలో వాడినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐ ఆర్.వి.కొండారెడ్డి, కానిస్టేబుళ్ళు వెంకటేష్, వీణ తదితరులు పాల్గొన్నారు. హనీట్రాప్‌కు పాల్పడిన యువతి, యువకుడు అరెస్టు -
కాలేజీ అభివృద్ధి కోసమే భూమిని విక్రయించాం
కడప కార్పొరేషన్: కళాశాల అభివృద్ధి కోసమే కాలేజీకి ఉన్న భూమిని విక్రయించామని తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీ ఛైర్మెన్ ఎస్.ఖాదర్‌బాష అన్నారు. కడప బిల్టప్ సమీపంలోని తయ్యుబ్ కళాశాలలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన సొసైటీ 1989లో మొదలైందని, 2003 నుంచి తాను కాలేజీకి చైర్మన్‌గా ఉన్నానన్నారు. కాలేజీకి సంబంధించి రెండు సొసైటీలు ఉన్నాయని పత్రికల్లో వచ్చిందని, అది వాస్తవం కాదన్నారు. ఆ సొసైటీ తమదని వాదిస్తున్న షేక్ నసీర్ హుస్సేన్‌కు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని.. అతను కనీసం సభ్యుడు కూడా కాదన్నారు. సొసైటీకి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, 1999 నుంచి రికార్డులు పక్కాగా ఉన్నాయన్నారు. 1994లో కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి వచ్చిందని, కాలేజీ కూడా బాగా నడిచేదన్నారు. ఎక్కువ మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లడం వల్ల నష్టాలు వచ్చాయన్నారు. ఈ క్రమంలో చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురంలో కాలేజీకి సంబంధించిన 25 ఎకరాల భూమిని విక్రయించాలని సొసైటీ సభ్యులందరం నిర్ణయించామన్నారు. ఈ మేరకు 2018లో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుండి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కాలేజ్ డెవెలప్మెంట్ కోసం భూమిని న్యాయపద్ధతిలో అమ్మామని చెప్పారు. భూమి విక్రయించే అంశాన్ని జనరల్ బాడీ సమావేశంలో పెట్టి 19 మంది సభ్యులు ఆమోదించి, తీర్మానించిన తర్వాతే విక్రయించామన్నారు. మొదట టింబర్ డిపో సుధీర్‌కు విక్రయించామని, ఆయన అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తిరిగి దానిని అమ్మకానికి పెట్టామన్నారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మి పద్మావతి కన్స్ట్రక్షన్స్ వారు దానిని కొనుగోలు చేశారని, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అందులో వాటాదారు మాత్రమేనన్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, ఎవరు డబ్బు ఇస్తే వారికి విక్రయించామన్నారు. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో కాలేజీని అభివృద్ధి చేశామని, తరగతి గదులు, ప్రహరీ గోడ, స్పోర్ట్స్ రూమ్ వంటివి నిర్మించామన్నారు. పేద ముస్లిం విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలని నర్సింగ్ కాలేజీ, బీఈడీ కాలేజీల అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది సొసైటీకి ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాలను గ్రహించాలని, అనవసరమైన ఆరోపణలు చేయవద్దని తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీ ఛైర్మెన్ ఎస్.ఖాదర్‌బాష కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎండీ ఆజమ్ తదితరులు పాల్గొన్నారు. 2003 నుంచి తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీకి చైర్మన్‌గా ఉన్నా షేక్ నసీర్ హుస్సేన్‌కు, కాలేజీకి ఎలాంటి సంబఽంధం లేదు ఎస్. ఖాదర్‌బాష -
హాకీ మైదానం పరిశీలన
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప మున్సిపల్ మైదానంలోని హాకీ గ్రౌండ్ (టర్ఫ్ పిచ్)ను నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర గురువారం పరిశీలించారు. మున్సిపల్ మైదానంలో క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలను తనిఖీ చేశారు. మైదాన శుభ్రత, తాగునీరు వంటి అంశాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన హాకీ గ్రౌండ్‌ను త్వరలో ప్రారంభించే విధంగా చర్య లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా హాకీ మైదానం అందుబాటులోకి రాక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారనే విషయంపై సాక్షి లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. డీఎస్డీఓ గౌస్ బాషా పాల్గొన్నారు. -
● జగనన్న పాలనలో గండి ‘మహా వైభవం’
2019ÌZ OÐðlG‹Ü fVýS-¯Œl Ððl*çßæ-¯Œl Æð‡yìlz Ð]l¬QÅ-Ð]l$…{† AĶæ*ÅMýS VýS…yìl „óS{™é-°MìS çÜ$Ð]lÆý‡~ अध-्य-ाय… Ððl¬§ýl-OÌñæ…¨. MýSyýlç³ G…ï³ OÐðlG‹Ü AÑ-¯é‹-ÙÆð‡yìlz, Ð]l$…yýlÌS C¯ŒS^éÆŠ‡j OÐðlG‹Ü Mö…yé-Æð‡-yìlzË$ {ç³™ólÅMýS ^öÆý‡Ð]l ^èl*í³ BÌSĶæ*°² A…™èl-Æ>j¡Ä¶æ$ Ýë¦Æ‡$$ÌZ AÀ-Ð]l–¨® ^ólõÜ…-§ýl$MýS$ MýS…MýS׿… MýSr$t-MýS$-¯é²Æý‡$. M>Ð]l$-¯Œl VýS$yŠæ 眅yŠæ (CGF) నిధులతో ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఇందులో భాగంగా రూ.20 కోట్లతో ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు, రూ.6.10 కోట్లతో పడమర రాజగోపురం, ఆలయ ప్రాకారం, సుందరమైన బండ చప్పట పనులు చేయించారు. రూ.1.95 కోట్లతో ఆలయ సొంత నిధుల నుంచి అద్భుతమైన దక్షిణ రాజగోపురం నిర్మించారు. అద్దాల మర్రి క్రాస్ వద్ద ఆలయానికి సంబంధించి 4 ఎకరాల భూమిని గోశాలకు మంజూరు చేయించి, రూ.40 లక్షలతో దానికి ప్రహారీ గోడ నిర్మించారు. భక్తుల తాగునీటి అవసరాల కోసం రూ.9 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్, రూ.6 లక్షలతో ఫిల్టర్ పాయింట్లు, ప్రధాన కాలువ పూడికతీత పనులు మరియు పోలీస్ అవుట్‌పోస్ట్ భవనాన్ని నిర్మించారు. -
‘నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా’
కడప: తనపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు వైఎస్సార్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డి. ఎల్లో మీడియా చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. ఏ తప్పు చేయని తనపై బురదజల్లారని విమర్శించారు. తాము అధికారంలో లేకపోయినా తమ జపమే చేస్తున్నారని, తాను ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోలేదన్నారు. తాను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మరి నిరూపించలేకపోతే మీరు రాజకీయాల నుంచి విరమిస్తారా? అని సవాల్ చేశారు. టీడీపీ నేతలు ఎకరాలు ఆక్రమించుకుంటున్నా ఎల్లో మీడియా మాత్రం వాటిపై స్పందించదని ఈ సందర్భంగా చురకలంటించారు రవీంద్రనాథ్‌రెడ్డి. ‘టీడీపీ వారు వందల ఎకరాలు ఆక్రమించుకుంటే దాని గురించి రాయరు. ఏ తప్పు చేయని మాపై మాత్రం బురద జల్లుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దోచుకుంటుంటే దాని గురించి పచ్చ పత్రికలు రాయడం లేదు. నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేకపోతే మీరు రాజకీయాలకు స్వస్తి పలుకుతారా?’ అని సవాల్ చేశారు. -
వైఎస్ జగన్ ప్రభంజనానికి 15 ఏళ్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతదేశ ఎన్నికల చరిత్రలో 5.45 లక్షల భారీ మెజార్టీతో ప్రభంజనం సృష్టించి బుధవారంతో 15 ఏళ్లు పూర్తయింది. 2011లో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి, కడప ఎంపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ స్థాపించిన రెండు నెలల్లోనే నిర్వహించిన ఉప ఎన్నికల్లో భారీ విజయంతో చరిత్ర సృష్టించారు. దేశ రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు. ఆ ఎన్నికల ఫలితాలు 2011 మే 13న వెలువడ్డాయి. కడప పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కనీవినీ ఎరుగని రీతిలో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో వైఎస్ జగన్ విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించారు. 2011 నాటికి లోక్‌సభ చరిత్రలో భారీ మెజార్టీ సాధించిన రెండో నాయకుడిగా దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించారు. 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు 5.8 లక్షల ఓట్ల మెజార్టీతో మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో వైఎస్ జగన్ నిలిచారు. ఆ తర్వాత ఎదురైన రాజకీయ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల్లోనే ఉన్నారు. 2014–19 మధ్య రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల పట్ల నిరంతర పోరు సాగించారు. 2019 ఎన్నికలకు ముందు 3,648 కిలోమీటర్ల మేర ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’చేపట్టి నాటి చంద్రబాబు రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించేలా ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి మరోమారు దేశ రాజకీయాలను షేక్ చేశారు. 2019–24 మధ్య నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుతో పాటు, నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో వైఎస్ జగన్ సంచలన గెలుపునకు 15 ఏళ్లు పూర్తవ్వడంతో బుధవారం సోషల్ మీడియా మారుమోగిపోయింది. వైఎస్ జగన్ అభిమానులు రికార్డు విజయాన్ని గుర్తు చేసుకుంటూ పోస్టులు హోరెత్తించారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. -
పేద ప్రజల ఆకలి తీర్చే సేవా కార్యక్రమాలపై విషపు రాతలు
కడప కార్పొరేషన్ : పేద ప్రజల ఆకలి తీర్చే సేవా కార్యక్రమాలపై ఈనాడు పత్రిక విషపు రాతలు రాయడం తీవ్ర అభ్యంతరకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, వైద్య విభాగం సభ్యులు పెంచలయ్యలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ రిమ్స్ ఆసుపత్రిని నెలకొల్పారన్నారు. జిల్లా వ్యాప్తంగా మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో 2007వ సంవత్సరం నుంచి పోచంరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కోట్ల రూపాయలు వెచ్చించి రోగులు, వారి సహాయకుల ఆకలి తీరుస్తున్నారన్నారు. రోజుకు 700 నుంచి 800 పేద ప్రజలకు మెరుగైన భోజన వసతులు కల్పించి, 19 ఏళ్లుగా ప్రతినెలా రూ.7లక్షల చొప్పున ఇప్పటి వరకూ రూ.1.33 కోట్లు సొంత నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. 2007లో అప్పటి కలెక్టర్ రిమ్స్ బయట ట్రస్ట్‌కు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తామని తెలిపినా సున్నితంగా తిరస్కరించి, సొంత నిధులతో బిల్డింగ్ నిర్మించి సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు. ఈ మధ్య అక్కడున్న మేనేజర్, వంటవారు పొరపాట్లు చేస్తూ రోగులకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని పచ్చ మీడియా రోత రాతలతో అసత్యమైన ఆరోపణలతో ఎటువంటి వివరణ తీసుకోకుండా వార్తలు రాయడం దుర్మార్గమన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిశోర్ బూసిపాటి -
కొత్త సీసాలో పాత సారా
పీజీఆర్ఎస్, వాట్సాప్ గవర్నెన్స్, రెవెన్యూ క్లినిక్ ఇలా పలు పేర్లతో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ని పేర్లు పెట్టినా సమస్యలు యథాతథంగా ఉన్నాయి. దీంతో అనేక వ్యయ ప్రయా సలు కోర్చి ప్రజలు పీజీఆర్ఎస్కు వస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాలి. అర్జీలను గడువులోపు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించకుండా వన్‌మంత్...వన్ విలేజ్...అనే కొత్త పేరుతో రావడం వల్ల ఉపయోగం లేదు. – ఎ.రామ్మోహన్‌రెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి, కడప -
కడప దెబ్బ.. ఢిల్లీ అబ్బా అనేలా చేసిన జగన్
కడప కార్పొరేషన్ : పదిహేనేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప దెబ్బ అంటే ఢిల్లీ అబ్బ అనేలా చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారందరినీ పరామర్శించేందుకు వై.ఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపడితే, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ దానిని అడ్డుకుని, సీబీఐ కేసులు పెట్టి వైఎస్ కుటుంబాన్ని బలహీన పర్చాలని కుట్ర చేసిందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ లోక్ సభ (పార్లమెంట్) సభ్యత్వానికి రాజీనామా చేసి... రికార్డు మెజారిటీతో తాను గెలవడమే కాకుండా, తన తల్లి వై.ఎస్ విజయమ్మను రికార్డు మెజారిటీతో గెలిపించి కడప జిల్లా చరిత్రను దేశానికి చాటిన దమ్మున్నోడు వైఎస్ జగన్ అని కొనియాడారు. సోనియా గాంధీని, ఢిల్లీ సింహాసనాన్ని గడగడలాడించి లోక్ సభ సభ్యుడిగా వై.ఎస్ జగన్ 5,45,672 ఓట్లు రికార్డు మెజారిటీతో గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వైఎస్ విజయమ్మపై తన బాబాయ్ వివేకానంద రెడ్డిని పోటీ చేయించినా కాంగ్రెస్, టీడీపీలను ఓడించి పులివెందుల ఎమ్మెల్యేగా 81,373 ఓట్లతో తన తల్లి వై.ఎస్ విజయమ్మ ను గెలిపించుకుని కడప పౌరుషాన్ని చూపించారన్నారు.ఆ చారిత్రాత్మక ఘట్టానికి 13 మే 2026 నాటికి అంటే బుధవారానికి 15 ఏళ్లు పూర్తి కావడం సంతోషదాయకమన్నారు. వై.ఎస్ కుటుంబానికి చేసిన నమ్మకద్రోహానికి, నాడు వై.ఎస్ జగన్‌ను 16 నెలలు అన్యాయంగా, అక్రమ కేసులు పెట్టిన పాపానికి నేటికీ కాంగ్రెస్ కోలుకోలేని స్థితికి చేరి భారీ మూల్యం చెల్లించుకుందన్నారు. ఇది వై.ఎస్ జగన్ చరిస్మాకు,ధైర్య సాహసాలకు, నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మొదలు కూటమి నేతలంతా వై.ఎస్ జగన్ పేరు, నామస్మరణ లేకుండా ప్రసంగాలు చేయలేక ఉన్నారని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో జగన్ పేరు లేకుండా కథనాలు ఉండటం లేదన్నారు. ఇది వై.ఎస్ జగన్ అంటే వారందరికీ ఉన్న భయానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. సమావేశంలో వైయస్సార్సీపీ నాయకుడు ఆర్. శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట సుబ్బారెడ్డి -
ఏపీఈఏపీ సెట్‌కు 93.59 శాతం హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి మంగళవారం రెండు సెషన్స్‌లో నిర్వహించిన ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 93.59 శాతం మంది విద్యార్థుల హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలలో కలిసి 9 పరీక్షా కేంద్రాలకుగాను రెండు సెషన్స్‌కు సంబంధించి 1668 మంది అభ్యర్థులకుగాను 1561 మంది హాజరయ్యారు.కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్, కడప, ప్రొద్దుటూరు మునిసిపాలిటి పరిధిలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తత్సమాన కేటగిరిల పాఠశాలల సహాయకులు తుది సీనియారిటి జాబితా( టీచర్ ఇన్ఫర్మెషన్ సిస్టమ్ ఆధారంగా) సబ్జెక్టుల వారిగా డీఈఓ వెబ్సైట్లో పొందు పరిచినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. తుది సీనియారిటి జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో సంప్రదించాలని పేర్కొన్నారు. పులివెందుల రూరల్: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో దాతల సాయంతో విమానం ఎక్కారు. పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తామని, గతంలో ఇచ్చిన హామీని నల్లపురెడ్డిపల్లెకు చెందిన దాతలు నిలబెట్టుకున్నారు. పాఠశాలకు చెందిన 12మంది విద్యార్థులను అమరావతికి తీసుకెళ్లినట్లు పాఠశాల హెచ్ఎం రవీంద్రారెడ్డి తెలిపారు. విమాన ప్రయాణం చేయడం తమ జీవితంలో మరుపురాని అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సైన్సు కార్యకలాపాలను విస్తృతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధి కారి షేక్ షంషుద్దీన్ సూచించారు. పెండ్లిమర్రి మండలం వెల్లటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న లేబాక బాలాజీని జిల్లా సైన్సు అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ నియమించారు. ఈ మేరకు బుధవారం డీఈఓ కార్యాలయంలో బాలాజీకి నియామక ఉత్తర్వులను అందచేశారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా సైన్సు అధికారిగా నియమించినందుకు లేబాక బాలాజీ డీఈఓకు కృతజ్ఞతలు తెలియ చేశారు. మాజీ జిల్లా సైన్సు అధికారి నిత్యానందరెడ్డి, సైన్సు ఉపాధ్యాయుడు గంగాధర్‌తోపాటు పలువురు సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేంపల్లె/చక్రాయపేట/పెండ్లిమర్రి: పాఠశాలలో పునః ప్రారంభమయ్యే నాటికే స్మార్ట్ కిచెన్ షెడ్లను పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన వేంపల్లె, చక్రాయపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మాణంలోని స్మార్ట్ కిచెన్ షెడ్ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 తేదీలోగా ఈ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. సెంట్రలైజ్డ్ మోడల్ కిచెన్ నిర్మాణంలో అవసరమైన మార్పులు, చేర్పులపై ఇంజనీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి మండలంలో నెలకొన్న తాగునీటి సమస్య, ఉద్యాన పంటల సాగు చేసిన రైతుల కష్టాలు, తదితర వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మల్లికార్జునుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం కోర్సులకు సంబంధించి మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మొదటి సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 వరకు, రెండవ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయాలనీ పోలీస్, రెవిన్యూ అధికారులకు సూచించారు. విద్యార్థులు సహాయం కొరకు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08562 244171 కు ఫోన్ చేయవచ్చన్నారు. డీఆర్వో మల్లికార్జునుడు -
ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం
చక్రాయపేట: పవిత్ర పుణ్య క్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. సుమారు ఆరు రోజులపాటు నిర్విఘ్నంగా పలు హోమాలు నిర్వహించి వేడుకలను ముగించారు. చివరి రోజు శ్రీమద్రామాయణ పట్టాభిషేకం,మహపూర్ణాహుతి,దక్షిన రాజగోపుర విమా ణ కలిశాలు, దీపస్తంభ కలశం తదితర కార్యక్ర మాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించారు, అహోబిల పీఠం నుంచి ప్రధాన అర్చకుడు రమేష్ చేతుల మీదుగా శ్రీకార్యం, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామిలచే విమాన కలశ స్థాపన, భూమానందాశ్రమ పీఠాధిపతి మాతాజి ప్రతిభానందగిరి ఉత్తరాధికారి ప్రణవానంద స్వామి చేతుల మీదుగా ఈకార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో టీటీడీ ఆగమ శాస్త్ర సలహాదారులు రాజేష్ స్వామి, విజయ్ స్వామిల శిష్య బృందం ఆలయ అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రామమోహన్శర్మ పర్యవేక్షణలో ఈకార్యక్రమాలు జరిగాయి. చాలా రోజుల తర్వాత.. వీరాంజనేయ స్వామి మూల విరాట్ దర్శనం భక్తులకు సరిగ్గా నాలుగేండ్ల,ఆరు మాసాల ,పదిహేడు రోజులకు లభించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయ పునర్నిర్మాణానికి రూ.28.5 కోట్లు మంజూరు కావడంతో 2021లో పలు యజ్ఙ యాగాదులు నిర్వహించి బాలాలయంలో దారువుతో చేసిన స్వామి వారి ఽప్రతిమకు జీవం పోసి అక్కడ భక్తులకు దర్శన వసతిని కల్పించి ప్రధాన ఆలయాన్ని మూసి పగులగొట్టారు. అప్పటి నుంచి భక్తులకు మూల విరాట్ దర్శనం కరువైంది. తిరిగి బుధవారంతో భక్తులకు స్వామి మూలవిరాట్ దర్శనం లభించింది. హాజరైన కలెక్టర్,కమిషనర్ మహాకుంభాభి వేడుకలకు కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ హాజరయ్యారు. ఈసందర్భగా ఆలయ అర్చకులు వారికి పూర్ణఫలంతో స్వాగతించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ,డ్వామా పీడీలు రాజ్యలక్ష్మి,ఆదిశేషారెడ్డి,ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ ఏడుకొండలు.ఈఈ శ్రీనివాసులు,ఏఈ రమేష్‌రెడ్డి,దేవదాయశాఖ ఎస్ఈ సతీష్ జిల్లా సహాయ కమీషనర్ శంకర్ పాల్గొన్నారు. నాలుగేండ్ల ఆరు మాసాలపదిహేడు రోజుల తర్వాత భక్తులకు మూల విరాట్ దర్శనం తన్మయత్వంతో పరవశించిన భక్తులు హాజరైన పీఠాధిపతులు. కలెక్టర్ తదితరులు -
రెండు కార్లను ఢీకొన్న కారు
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లె – కేశ లింగాయపల్లె గ్రామాల మధ్యలో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారిపై బుధవారం సాయంత్రం ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఓ కారు ఢీకొన్న సంఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డకు చెదిన పోతులూరు ఆచారి తన కుమారుడు వేత విఖ్యాత్ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు బ్రహ్మంగారిమఠానికి బంధుమిత్రులతో కలిసి ఓ కారు, లారీలో వెళ్లారు. కార్యక్రమం ముగియాగానే పోతులూరు ఆచారి, బంధువులైన ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, గోవిందయ్య, కుమారుడు వేద విఖ్యాత్ కారులో బయల్దేరారు. బంధువులు ఉన్న లారీ వెనుక అనుసరించింది. గిద్దలూరుకు చెందిన పల్లెపాల్ ప్రతాప్ అనే వ్యక్తి కడపలో ఉన్న తన కుమార్తె బ్యూలా గర్భిణిగా ఉండటంతో రెస్ట్ తీసుకునేందుకు తన బంధువు సుధీర్ బాబుతో కలిసి కడప నుంచి కారులో పిలుచుకొస్తున్నాడు. మైదుకూరు మండలం గంజికుంటకు చెందిన సునీల్, సునీత అనే భార్యాభర్తలు మల్లేపల్లెలో ఉన్న తన కుమార్తె వద్దకు కడప నుంచి కారులో బయలుదేరారు. ఈ మూడు కార్లు మైదుకూరు మున్సిపాలిటీలోని భూమాయపల్లె – కేశలింగాయపల్లె గ్రామాల మధ్యకు రాగానే ఆళ్లగడ్డకు చెందిన కారును డ్రైవింగ్ చేస్తున్న పోతులూరు ఆచారి తన ముందున్న ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఒకదాని తర్వాత ఒక దానిని ఢీకొట్టాడు. సంఘటనలో గంజికుంటకు చెందిన సునీల్, సునీత, గిద్దలూరుకు చెందిన పాల్ ప్రతాప్, ఆళ్లగడ్డ కారును డ్రైవింగ్ చేస్తున్న పోతులూరు ఆచారికి తీవ్ర గాయాలయ్యాయి. పాల్ ప్రతాప్ కారు డ్రైవర్.. ఓనర్ అయిన సుదర్శన్, వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ, గోవిందయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందగానే మైదుకూరు ఖాజీపేట 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాను గర్భిణిగా ఉండటంతో తాము ప్రయాణిస్తున్న కారును నెమ్మదిగా పోనిస్తున్నామని, బ్రహ్మంగారిమఠం నుంచి వస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసి తమ కారును, మరో కారును ఢీకొట్టినట్టు గిద్దలూరుకు చెందిన బ్యూలా తెలిపారు. మైదుకూరు పోలీసులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని సంఘటన వివరాలను నమోదు చేసుకున్నారు.8 మందికి గాయాలు -
అడ్మిషన్.. టెన్షన్
సాక్షి అన్నమయ్య: ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ల అగ చాట్లు తప్పడం లేదు. అసలే మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే.. అడ్మిషన్ల టార్గెట్లు వారిలో మరింత వేడి పుట్టిస్తోంది. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి వీధుల్లో పరుగెత్తిస్తుంటే... మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల్లో టీచర్లకు పల్లెలకు తీసుకెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతోపాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిళ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు రెన్యూవల్ ఉండదని భయపెట్టిస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో విహార యాత్రలకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఎంజాయ్ చేయాల్సిన సమయంలో... పల్లెలు, పట్టణాల్లో తిరగాల్సి వస్తోందని ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులపై టార్గెట్లు విధిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 10–15 అడ్మిషన్లు చేయించాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఇది తగునా! సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. అలాంటి ఉపాధ్యాయులను వీధుల్లోకి పంపి అడ్మిషన్లకోసం ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీతత్వం పెరగడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఎవరివారు తాపత్రయ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడ్మిషన్లు చేయకపోతే ఉద్యోగం రెన్యూవల్ ఉండదన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో వెంటాడుతోంది. ప్రైవేటు పాఠశాలల టీచర్లకు టార్గెట్ల తిప్పలు ఒక్కొక్కరికి 10–15 అడ్మిషన్లు అంటూ ఒత్తిడి రెన్యూవల్ ఉండదేమోనన్న భయంతో టీచర్ల పరుగులు -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణ పరిధిలో బుధవారం గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో డానియేలు (65) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం గరిశలూరు గ్రామానికి చెందిన డానియేలు బ్యాంక్ పని నిమిత్తం జమ్మలమడుగు పట్టణానికి ద్విచక్రవాహనంలో వచ్చాడు. పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెలుతుండగా రామిరెడ్డిపల్లె శివార్లలో వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో డానియేలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య వసంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఆరోగ్యానికి కుండంత అండ!
పులివెందుల రూరల్: బయట ఎండకు తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు కుండలోని గ్లాసు నీరు తాగితే దప్పిక తీరడమే కాదు.. ప్రాణమూ కుదుటపడుతుంది.. అవును.. ప్రిడ్జ్లోని ఐస్ నీరు కంటే మట్టి కుండలోని నీరు ఆరోగ్యానికి శ్రేష్టమంటున్నారు వైద్య నిపుణులు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలే కాదు.. డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లు ఉన్న వారు సైతం మట్టి కుండలను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఎండ తీవ్రత నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మట్టి కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని ఆయా పట్టణాల్లో మట్టి కుండల విక్రయాలు రోజుకు వందల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఒక్కో కుండ సైజును బట్టి రూ.150ల నుంచి రూ.200ల వరకు విక్రయిస్తున్నారు. కుళాయి అమర్చిన కుండలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి కుండల దిగుమతి గుజరాత్ రాష్ట్రం నుంచి జామ్ అనే కొత్త కుండలను దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు. వేసవి కాలంలో ఈ కుండలకు మంచి డిమాండ్ ఉంది. గుజరాత్‌కు చెందిన జాబ్ కుండలు ఒక్కొక్కటి రూ.200ల నుంచి రూ.300ల వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. అలాగే కర్నూలు, కడప, కమలాపురం, మదనపల్లె తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని స్థానికంగా విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుండనీళ్లు ఆరోగ్యానికి శ్రేష్టమంటున్న వైద్య నిపుణులు వేసవికాలంలోనే కుండలకు గిరాకీ -
ఇద్దరు బాలురు అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఇద్దరు బాలురు అదృశ్యం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ప్రకాశం వీధికి చెందిన నల్లమియ్య అర్హాన్, మౌలానా ఆజాద్ వీధికి చెందిన షేక్ రిహాన్లు స్నేహితులు. వీళ్లిద్దరూ సోమవారం ఆడుకోవడానికి బయటికి వెళ్లారు. అయితే ఆ రోజు ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు తిరిగి రాలేదు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోనూ. బంధువుల ఊళ్లలో గాలించినా బాలు ర ఆచూకీ తెలియలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు బుధవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలుఅరెస్టు చూపుతున్న డీఎస్పీ మురళీ నాయక్, పోలీసులు పులివెందుల రూరల్ : చైన్ స్నాచింగ్, బంగారు షాపుల్లో దొంగతనాలు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడిన 13 మంది దొంగలను అరెస్టు చేసినట్లు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. బుధవారం సీఐ, ఎస్ఐలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 19 ద్విచక్రవాహనాలు, రూ.2.79 లక్షల నగదు, కేజీ వెండి, 194గ్రాముల బంగారు వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలోని కదిరి రోడ్డులో మున్సిపాలిటీ డంపింగ్ యార్డు వద్ద, కడప రింగురోడ్డు వద్ద ద్విచక్రవాహనాల దొంగలను, పార్నపల్లె బస్టాఫ్ వద్ద గోల్డ్ షాపులో బంగారు దొంగతనం చేసిన దొంగలను, ఉలిమెల్ల రింగ్ రోడ్డు వద్ద చైన్ స్నాచింగ్ పాల్పడే దొంగలు 13 మందిని 22 కేసుల్లో అరెస్టు చేసినట్లు చెప్పారు.ద్విచక్రవాహనాల దొంగల నుంచి రూ.2.79లక్షల నగదు, రూ.80వేలు విలువ చేసే కేజీ వెండి వస్తువులు, రూ.18.15లక్షల విలువ గల 19 బైక్‌లు, రూ.50వేలు విలువ చేసే రెండు సెల్ ఫోన్లు, చైన్‌స్నాచింగ్ దొంగల నుంచి రూ.13.52లక్షలు విలువ చేసే 91 గ్రాముల బంగారు వస్తువులు, బంగారు షాపుల్లో చోరీకి పాల్పడే దొంగల నుంచి రూ.15లక్షలు విలువ చేసే 103 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం రూ.53.00,700ల విలువ గల బంగారు, వెండి, నగదు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో నాగబాష. బూస్పాటి కుమార్, గంగయ్య, హుస్సేన్, మలికి విజయ్‌లను, అలాగే బీహార్ రాష్ట్రం భగల్పూర్ జిల్లాకు చెందిన చోటు కుమార్, నారాయణమ్మ, ఉమాదేవిలను అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిలో త్వరలో ఆరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీరామ్, ఎస్ఐలు తిమోతి, మధుసూదన్‌రెడ్డి, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.బంగారం, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులో గంజికుంట ప్రశాంత్(27) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వల్లూరుకు చెందిన ప్రశాంత్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం కడపలోని రాజారెడ్డి వీధికి చెందిన సునీతతో ఇతనికి వివాహం జరిగింది. మంగళవారం సాయంత్రం తన భార్యను ఆటోలో కడపలోని ఆమె పుట్టింట్లో వదిలి రేపు వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పి వచ్చాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో బుదవారం వల్లూరులోని తన ఇంటిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇతనికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
జగనన్న హయాంలోనే ‘గండి’ అభివృద్ధి
చక్రాయపేట: వైఎస్ జగన్ హయాంలోనే గండి క్షేత్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆలయ మహాకుంభాభిషేకం, హనుమజ్జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు.అనంతరం కుంబాభిషేకంలో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించే పలు పూజా కార్యక్రమాల్లో, గర్భాలయం పైభాగాన కలశ ప్రతిష్ట కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో రూ.28.5 కోట్లతో గండి ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆలయం రెండేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రారంభోత్సవానికి నోచుకోలేదన్నారు. ఆలయంతో పాటు రాజగోపురాలు కూడా అత్యంత సుందరంగా తయారయ్యాయని చెప్పారు. పూర్ణాహుతి అనంతరం బుధవారం నుంచి భక్తులకు ఆంజనేయస్వామి మూలవిరాట్ దర్శనం ఉంటుందని చెప్పారు.ఈ సందర్భంగా గంగాధర్ అనే భక్తుడు తనకు అనుమతులు ఇప్పిస్తే గండిలో తన సొంత నిధులతో 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మిస్తానని కోరగా, దీనికి స్పందించిన ఆయన కలెక్టర్, కమిషనర్‌తో మాట్లాడతానని చెప్పారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి భక్తులందరికీ ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు. చక్రాయపేటలోని శ్రీవేంకటేశ్వర రాచరాయస్వామి ఆలయాలకు అనుసంధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన టూరిజం భవనానికి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా
ప్రస్తుతం రాసిన నీట్ పరీక్షలో మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నాను. నీట్ రద్దు కావడం చాలా బాధగా ఉంది. ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈసారైనా పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టాలి. – జె.కీర్తన, కమలాపురం గుణపాఠాలు నేర్వకపోవడం శోచనీయం మా పాప ఫిర్దోస్‌కు ఇంటర్లో 922 మార్కులు వచ్చాయి. నీట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాం. దేశవ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్షను ఇంత అధ్వానంగా నిర్వహించడం దారుణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో జరిగిన సంఘటనల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నీట్ పరీక్షను నిర్వహించాలి. – షేక్ బాషు, విద్యార్థిని తండ్రి, కమలాపురం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే వైద్య వృత్తిపై ఎన్నో ఆఽశలు పెట్టుకుని నీట్ పరీక్ష రాస్తే ఎక్కడో పేపర్ లీక్ అయిందని దేశ వ్యాప్తంగా పరీక్షను రద్దు చేయడం బాధాకరం. నా కుమారుడు గురు ప్రవీణ్‌రెడ్డి పరీక్ష బాగా రాశాడు. ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పరీక్ష రద్దు అయిందని తెలియగానే తేగా ఆందోళన చెందుతున్నాడు. పకడ్బందీగా పరీక్షను నిర్వహించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. –కంకర అపర్ణ, విద్యార్థి తల్లి, చిన్నవెంతుర్లగ్రామం, మైలవరం మండలం -
వైద్యరంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం
కడప అర్బన్ : వైద్యరంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రాముడు తెలిపారు. కడప నగర శివారులోని రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ మానసిక వైద్యశాల(ఐఎంహెచ్)లో మంగళవారం నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ మానసిక వైద్యశాల స్థాపించి రెండేళ్లు అయిందని, అప్పటి నుంచి ఈ వైద్యశాలలో డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది బాగా పని చేసి వైద్యశాలకు రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని నిలబెట్టారని తెలిపారు. ఇదే విధంగా వైద్య సేవలు స్ఫూర్తిదాయకంగా కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్సులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏవో, డైటీషియన్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మైదుకూరు : బతుకు దెరువు కోసం డ్రిల్లింగ్ పని చేస్తూ విద్యాదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నంద్యాల రోడ్డులోని ఎంపీపీ మెయిన్ స్కూల్ సమీపంలో మంగళవారం ఉదయం దెబ్బతిన్న ఓ ఇంటి మెట్లను తొలగించేందుకు డ్రిల్లింగ్ చేస్తూ కై పు రాజేష్ అలియాస్ ఘని (37) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. డ్రిల్లర్కు ఉన్న వైర్లు షార్టేజ్ కావడంతో రాజేష్ విద్యుదాఘాతానికి గురైనట్టు తెలుస్తోంది. ఇంటి యజమాని, మరికొందరు అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పట్టణంలో గాంధీనగర్‌కు చెందిన రాజేష్‌కు జోసెఫ్ పేటకు చెందిన కవితతో 15 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతి గురించి తెలియగానే అతని భార్య కవిత, తల్లిదండ్రులు మైఖేల్, సంతోషమ్మ ఆస్పత్రి వద్దకు చేరుకొని బోరున విలపించారు. మైదుకూరు పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యం: ఎస్పీ
కడప కోటిరెడ్డిసర్కిల్: మనుషులంతా ఒక్కటేనని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చాటిచెప్పి శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని నిరూపించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం కడప నగరంలో జరిగిన శోభా యాత్రలో ముస్లిం సోదరులు హిందు సోదరులను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. యాత్రలో పాల్గొన్న హిందూ సోదరులకు ఒకరికొకరు ఆప్యాయంగా మజ్జిగ, నీరు, పానీయాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తదితరులు మాట్లాడుతూ ఇది హిందూ– ముస్లిం ఐక్యతను ప్రతిబింబిస్తుందన్నారు. హిందూ ముస్లిం అంతా ఒక్కటేనని అందరు కలిసి ముందుకు పోవాలన్నా రు. కడప నగరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లు అందరు కలిసి మెలిసి ఉన్నారన్నారు. నగరంలో అందరూ కలిసి, మెలిసి ఉండాలనే భావనలో ఉన్నారని, కడపలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, హిందూ ముస్లిం సోదరులలోని అమాయకులను జిల్లా పోలీస్ శాఖ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తుందని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, మాధవిరెడ్డి, నేతలు అమీర్‌బాబు, అఫ్జల్ఖాన్, శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, హిందూ, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ షెల్కే సచికేత్ విశ్వనాథ్, చిత్రంలో హిందూ, ముస్లిం నేతలు శోభాయాత్రలో స్వామి వారు -
ఆశావహులకు నిరాశే..
నీట్ ప్రవేశ పరీక్ష బాగా రాశామనే ధీమాతో ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇది నిరాశజనక వార్తే. పరీక్ష రద్దుకు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే లక్షల మంది మానసికక్షోభకు గురిచేసిన వారికి ఇంక మళ్లీ ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయాలంటే భయం కలిగేలాగా శిక్ష ఉండాలి. అలాగే మళ్లీ పరీక్ష రాయనున్న విద్యార్థులు ఎలాంటి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా రెట్టించిన ఉత్సాహంతో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. – డాక్టర్ ఓ వెంకటేశ్వర రెడ్డి, సైకాలజిస్ట్ -
విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
మదనపల్లె సిటీ: విద్యార్థి దశ నుంచే క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని డీఎస్డీఓ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక బెంగుళూరు రోడ్డులోని గురు హాకీ క్లబ్ వేసవి శిబిరాన్ని సందర్శించారు. వేసవి శిబిరంలో శిక్షణలో మెళుకువలు నేర్చుకోవాలన్నారు. హాకీ క్రీడకు మదనపల్లెలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఎంతో మంది జాతీయ,రాష్ట్ర స్థాయిలో రాణించారన్నారు. హాకీ పితామహుడు ధ్యాన్‌చంద్ మదనపల్లెలో హాకీ క్రీడను క్రీడాకారులను నేర్పించారన్నారు. కార్యక్రమంలో సీనియర్ కోచ్ గురుభాస్కర్,పి.ప్రసాదరెడ్డి, కోచ్‌లు నౌషాద్,గౌస్, విష్ణు, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ‘రైతు పండుగ‘ను విజయవంతం చేయాలి
కలెక్టర్ శ్రీధర్ కడప సెవెన్‌రోడ్స్: రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ఉద్యానవన పంటలలో నూతన ఆవిష్కరణలు, మార్కెట్ అవకాశాలను ఒకే వేదికపై పరిచయం చేసే ‘రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ అండ్ హార్టికల్చర్ ఎక్స్పో 2026’ను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో ఈనెల 22–24వ తేదీ వరకు కడపలో నిర్వహించనున్న ‘రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ అండ్ హార్టికల్చర్ ఎక్స్పో 2026’ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, స్టార్టప్ సంస్థలు, వ్యాపార వేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే అతిపెద్ద అగ్రి – హార్టికల్చర్ ఎక్స్పోగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటవుతున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను జూన్ 1వ తేదీలోపు పూర్తి చేసి పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ డాక్టర్ నిధి మీనా, కేఎంసీ కమిషనర్ హెచ్ఎస్ భావనతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా అందించేందుకు వినూత్నంగా అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారంతో పాటు, ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిస్తోందన్నారు. ఈ నెల 28 లోపు అన్ని రకాల నిర్మాణ పనులను పూర్తి చేసి.. రెండు రోజులు ట్రయల్ రన్ కూడా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలోసీపీఓ హజరతయ్య, స్మార్ట్ కిచెన్ల పర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్ఈ మద్దన్న, డిఎవో శంశుద్దీన్, నేచురల్ ఫార్మింగ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, హౌసింగ్ పీడి రాజరత్నం, ఏపీఎస్పీడిసిఎల్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలతో కడప స్ఫూర్తి పరిశ్రమలు, మౌలిక వసతులు, రోడ్లు, ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, పెట్టుబడులు వంటి అంశాలతో పాటు వినూత్న ఆవిష్కరణలతో వైఎస్ఆర్ కడప జిల్లా రాష్ట్రానికి స్ఫూర్తినిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు – వాణిజ్యం (గనులు) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర– 2047 విజన్‌కు అనుగుణంగా వైఎస్సార్ కడప జిల్లాను అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి వివరించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ప్రాజెక్టులు, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల అభివద్ధి, వ్యవసాయ పురోగతి తదితర అంశాలపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు సమర్పించారు. -
ఇప్పటికే 11 లక్షలు ఖర్చయింది
మా పాప నందినిని విజయవాడలోని గోశాల శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌తోపాటు రెండు సార్లు లాంగ్‌టర్మ్ నీట్ కోసం రూ. 11 లక్షలు ఖర్చు పెట్టాను. ఈసారి నీట్ పరీక్ష బాగా రాసింది. ఫలితాలకు సంబంధించి విడుదలైన ప్రాథమిక కీలో 720 మార్కులకు 590 మార్కులు వచ్చాయి. కోచింగ్ సెంటర్ వాళ్లు కూడా మంచి కళాశాలలో సీటు వస్తుందని చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలపైన నీళ్లు చల్లారు. మళ్లీ కోచింగ్‌కు పంపాలంటే ఆర్థికభారమే. – పోలిరెడ్డి, చిన్నాయపల్లె, బి. మఠం మండలం మళ్లీ కోచింగ్‌కు పంపాలి నీట్ రద్దు కావడంతో మళ్లీ మా పాప వర్షిణిని కోచింగ్‌కు పంపాలి. ఇది ఆర్థికబారం కానుంది. ఈ సారి మా పాప నీట్ పరీక్ష బాగా రాసింది. ప్రాథమిక కీ లో కూడా 589 మార్కులు వచ్చాయి. సీటు ఖచ్చితంగా వస్తుందని నిపుణులు కూడా తెలిపారు. ఇంతలో నీట్ రద్దని ప్రకటించారు. ఈ ప్రభావం పిల్లలపైన ఎలా చూపుతుందో తెలియని పరిస్థితి. 2024లో కూడా నీట్ నిర్వహణలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రద్దు చేయలే. కానీ ఇప్పుడు రద్దు చేశారు. – ఆనందరెడ్డి, కడప. నీట్ పరీక్ష రద్దు వల్ల విద్యార్థుల్లో ఆందోళన విద్యార్థులు రాత్రింబవళ్లు శ్రమించి నీట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –షేక్ అమీర్‌బాషా, విద్యార్థిని తండ్రి, దువ్వూరు -
ఘనంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు
చక్రాయపేట : గండి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు దేవదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆయన తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం పలు పూజల్లో పాల్గొని గత ప్రభుత్వంలో గండి అభివృద్ధికి మంజూరు చేసిన రూ.28.5 కోట్ల పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, బీటెక్ రవి, రితేష్రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆలయాలకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, పాలకమండలి సభ్యులు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సహజత్వం లేకుండా గోపురాలపై ఈ రంగులేంటి? సంస్కృతి సంప్రదాయాలతోపాటు సహజత్వం ఉట్టిపడేలా రాతితో నిర్మించిన ఆలయంలో గోపురాలకు ఈ రంగులేంటని రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని ఆయన మంగళవారం గండికి విచ్చేశారు. ఈ సందర్భంగా కుంభాభిషేక ఏర్పాట్లపై పరిశీలించారు. స్వామి వాహనమైన ఒంటె, బలిపీఠాలకు వేసిన రంగులపై కూడా ఆయన పెదవి విరిచారు. వెంటనే వాటికి రంగులను తొలగించి సహజత్వం కనిపించేలా చేయాలన్నారు. పారిశుధ్య చర్యలు కూడా అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహించారు. ఈ సందర్భంగా పలువురు గండిలో జరుగుతున్న అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏమైనా ఉంటే తనకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి అని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, కడప దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ తదితరులు ఉన్నారు. -
అట్లూరు మండల వాసి ఎన్వీహెచ్ కంపెనీలో మృతి
అట్లూరు : అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు(24) అనంతపురంలోని ఎన్వీహెచ్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందాడు. అతను శుక్రవారం మిషనరీలో పడి మృత్యువాత పడ్డాడు. అయితే అతను కియా కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందినట్లు సోమవారం వార్త వచ్చింది. అది కియా కంపెనీ కాదు.. కియాకు సప్లైర్ కంపెనీ అయిన ఎన్వీహెచ్ కంపెనీగా గమనించగలరు. ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చింతకొమ్మదిన్నె : మండల పరిధి సీఎంఆర్ పల్లె సమీపంలోని అంగడి వీధిలో నివసించే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గోపాలక్రిష్ణ భార్య రేణుకాదేవి(54) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. ఆమె గత నెలలో కూడా రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుడి చేతికి గాయాలు కాగా చికిత్స పొందినట్లు వారు పేర్కొన్నారు. మృతురాలి భర్త గోపాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. నియామకం కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానానికి గవర్నమెంట్ ప్లీడర్‌గా సీనియర్ న్యాయవాది ఎం.సురేష్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను జిల్లా కోర్టులో వాదించనున్నారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ జీపీగా ఆదినారాయణరావు వ్యవహరించారు. అల్మాస్‌పేట ఘటనలో ముగ్గురి అరెస్ట్కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్మాస్‌పేట ఘటనలో ఒకవైపున నిందితులుగా వున్న వారిలో బాబుభాయ్, షబ్బీర్ హుసేన్, జాకీర్‌లను పోలీసు అధికారులు, సిబ్బంది మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని కడపలోని కోర్టులో హాజరుపరిచారు. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి పుంగనూరు : వేసవి తీవ్రంగా ఉండటంతో చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని పట్రపల్లె తండాకు చెందిన గణేష్‌నాయక్ కుమారుడు వరుణ్‌నాయక్(14), మణి నాయక్ కుమారుడు నిలేష్‌నాయక్(8) కలసి బడిగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఇద్దరూ మునిగిపోయారు. సమీపంలో బాతులు మేపుతున్న యువకులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. అందరూ కలసి హుటాహుటిన వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. వారి మృతదేహాలకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. -
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
పులివెందుల రూరల్ : మండల పరిధిలో కొంత మంది యథేచ్ఛగా కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ఇలా ట్రాక్టర్లలో కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆ తల్లికి ఎంత కష్టం వచ్చింది!
జమ్మలమడుగు(ఎర్రగుంట్ల) : ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన సుగుణమ్మ అనే వృద్ధురాలు తన కుమారులు తనకు అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ విశ్వనాథ్‌రెడ్డి సుగుణమ్మ బాధ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ సుగుణమ్మ కుమారులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. తల్లిదండ్రులను పొషించే బాధ్యత పిల్లలపైనే ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అనంతరం సుగుణమ్మ కోరిక మేరకు తిప్పలూరులో ఉన్న ఎద్దుల పెద్ద శేషయ్య అనాథాశ్రమానికి చెందిన నిర్వాహకుడు నాగేంద్రకు స్టేషన్‌కు పిలపించుకుని.. ఆమెను బాగా చూసుకోవాలంటూ సూచించారు. ఆమెను ప్రత్యేక ఆటోలో తిప్పలూరు అనాథశ్రమానికి తరలించి సీఐ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళి, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఉండి అనాథగా మిగిలిన అమ్మ కుమారులు అన్నం పెట్టడం లేదంటూ ఆవేదన పోలీసులను ఆశ్రయించిన వైనం‘అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు’ అనేది సామెత. అది అక్షర సత్యమవుతున్న సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎర్రగుంట్ల పట్టణంలో జరిగింది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లికి కనీసం అన్నం పెట్టలేదు కన్న కొడుకులు. వృద్ధురాలైన అమ్మను, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. పట్టించుకోవడం మానేశారు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించి.. అనాథాశ్రమానికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. -
‘పచ్చ’పైత్యంతో పిచ్చి రాతలు
సాక్షి ప్రతినిధి కడప: పచ్చ కామెర్లకు వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఎల్లో మీడియా తన పైత్యాన్ని అనునిత్యం ప్రదర్శిస్తుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రి కడప నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో రోగుల సహాయకులు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే పోచంరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.1.2 కోట్లు సొంత నిధులు వెచ్చించి భవనం, వసతి, డైనింగ్ ఏర్పాటు చేశామన్నారు. 2019 నుంచి ఆరేళ్లుగా నిరాటంకంగా రోగుల సహా యకులకు భోజన వసతి కల్పించామన్నారు. ప్రతిరోజు ఉదయం 350–450 మంది వరకు, సాయంత్రం 220–250 మంది వరకు భోజనం చేసేవారన్నారు. తమ సిబ్బంది ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరితో వసూలు చేయకుండా, ముందస్తు టోకన్లు జారీ చేసి ఉచిత భోజనం కొనసాగించామని వివరించారు. ఆరేళ్లుగా నిరాంటకంగా ప్రతిరోజు భోజన వసతి దాదాపు 700 మందికి కల్పిస్తుంటే, ఒక్కరోజుగా గుర్తించని ఈనాడు పత్రిక ఎల్లో పైత్యాన్ని ఎక్కించుకుని అడ్డగోలు రాతలు రాసిందని మండిపడ్డా రు. అక్కడ నియమించిన మేనేజర్ భోజన, వసతిలో తప్పిదాలు చేయడం వల్ల తొలగించామన్నా రు. సిబ్బంది సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిపి వేశామన్నారు. దానిని పట్టుకుని ఈనాడు తన పైత్యాన్ని ప్రదర్శించిందని ధ్వజమెత్తారు. ఛారిటబుల్ ట్రస్టుపై ఈనాడు పిచ్చి రాతలు ఆరేళ్లుగా నిరాటంకంగా రెండు పూటల భోజనం డైలీ 700 మందికి భోజన ఏర్పాట్లు ఈనాడు రాతలపై మండిపడ్డ పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి -
మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి రిమాండ్
కడప అర్బన్ : కడప నగరంలోని రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 6వ తేదీన హత్యకు గురైన కల్లమల్ల పెద్ద దస్తగిరి (53) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కడపలోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ మంగళవారం ఆదేశించారు. నిత్యానందరెడ్డి ఈ నెల 11వ తేదీన కడపలోని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఎదుట న్యాయవాది నాగిరెడ్డి ద్వారా లొంగిపోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిత్యానందరెడ్డిని హత్య కేసు విచారణాధికారి ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మంగళవారం నిత్యానందరెడ్డిని పోలీసులు కడప రిమ్స్‌కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకునివెళ్లారు. తరువాత కడపలోని కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. చిన్నచౌక్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి, రిమ్స్ పీఎస్ సీఐ రాజగోపాల్, ఎస్ఐ చంద్రమోహన్ తమ సిబ్బందితో కలిసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. -
తడ‘బడి’తే తప్పదు మూల్యం
కడప ఎడ్యుకేషన్ : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల పేర్లతో నూతన బ్రాంచ్‌లు ఎక్కువయ్యాయి. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదో లేనిదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. ఆమోదం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవే టు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అను మతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులింటేనే పాఠశాలలను నిర్వహించాలి. వీటిపై ఆరా తీయండి.. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి రికగ్నైజేషన్ పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి రికగ్నైజేషన్ తీసుకోవడం తప్పనిసరి. రికగ్నైజేషన్ పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచ్‌ల పేరుతో పాఠశాలలు, కళాశాలలు నడుపుతూ ఎక్క డో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు విచారణ చేసి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ● తొలుత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ● ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి. ● మౌలిక వసతులతోపాటు బాత్రూములు, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి. విద్యార్థుల మానసిక, శారీకోల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా ఆరా తీయాలి. ● అర్హత గల ఉపాధ్యాయులు బోధనలు చేస్తున్నారా లేదా పరిశీలించాలి. ● ప్రాఽథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాలలు అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి. ● సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణాశాఖ జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాన్ని పరిశీలించాలి. సుశిక్షితుడైన డ్రైవరు తప్పనిసరి. ● జీ–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, ఆ స్థాయి దాటితే మంటలు అర్పే పూర్థి స్థాయి వ్యవస్థ ఉండాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి ఉండాలి. ● ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్న వారిగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యలు ఏర్పడుతాయి. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త ముందస్తు అడ్మిషన్లతో అప్రమత్తత అవసరం ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోస పోకండి పాఠశాలల గురించి తెలుసుకున్నాకే చేర్పించాలినిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అదే విధంగా విద్యా సంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్‌తోపాటు ప్రభుత్వ రికగ్నైజేషన్ పొంది ఉండాలి. తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థలను ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. అన్ని జాగ్రత్తలు పాటించి పిల్లలను చేర్పించాలి. – షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్‌కడపజిల్లా -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్ ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)–2026 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పరీక్షా కేంద్రాలలో ఆన్లైన్ విధానంలో 9 పరీక్షా కేంద్రాలలో ఏపీ ఈఏపీ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఉదయం, సాయంత్ర రెండు సెషన్స్‌కు సంబంధించి 1668 మందికిగాను 1567 మంది హాజరుకాగా 101 మంది గైర్హాజరయ్యారు. -
24 మంది విద్యార్థులు డిబార్
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ పరీక్షల్లో 24 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. మంగళవారం అన్నమయ్య జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.సుభోష్ చంద్ర విస్తృతంగా తనిఖీ చేశారు. గాలివీడు ఆర్.ఆర్.జి.ఆర్ డిగ్రీ కాలేజీలో 20 మంది, రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నలుగురు విద్యార్థులు కాపీలు రాస్తుండగా గుర్తించి డిబార్ చేశారు. చిన్న మండెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేశామన్నారు. ప్రొద్దుటూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోడౌన్లో నిల్వ ఉన్న రూ.కోటి 71 లక్షల విలువైన ఇనుపకడ్డీలు మాయమైనట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గోడౌన్లో 270 టన్నుల ఇనుప కడ్డీలను నిల్వ ఉంచగా ప్రస్తుతం 2.3 టన్నులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రకారం రూ.1.71 కోట్ల విలువైన 268.56 టన్నుల ఇనుప కడ్డీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం హౌసింగ్ డిపార్ట్మెంట్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వి.రాజారత్నంతోపాటు ప్రొద్దుటూరు ఇన్చార్జి ఈఈ రాజశేఖర్, రాజంపేట ఈఈ ఎం.మురళి గోడౌన్‌ను పరిశీలించారు. వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లాలోని ఎండోమెంట్ పరిధిలో ఉన్న 316 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకంను వర్తింపజేస్తున్నట్లు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం స్థానిక నిమ్మనపల్లి రోడ్డు లోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఆలయాలను పరిరక్షిస్తూ నిత్య పూజలు, కైంకర్యాల కోసం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల్లో అర్చకులు నిర్లక్ష్యం వహిస్తే నిధులను రద్దు చేస్తామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రామసముద్రం: రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో లక్ష్మీ నరసయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం రక్త పరీక్షల గది, ఫార్మసీ, వాక్సిన్ రూమ్, లేబర్ రూమ్, వార్డులను పరిశీలించారు. రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనేసి అక్కడున్న రోగులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. సాక్షి, మదనపల్లె: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా విస్తత స్థాయి సమావేశం ఈనెల 15న నిర్వహించనున్నట్లు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణ మంగళవారం తెలిపారు. స్థానిక బైపాస్ రోడ్డులోని జీనత్ కళ్యాణ మండపంలో జరిగే ఈ సమావేశానికి ఎస్సీ విభాగం జిల్లా కమిటీ, ఎస్సీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీకి చెందిన వివిధ భాగాలకు చెందిన ఎస్సీ నాయకులు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి ఎస్సీ విభాగాల కమిటీలు, నాయకులు హాజరుకావాలని కోరారు. సమావేశానికి రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గడి కోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు తెలిపారు. -
లారీ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
కురబలకోట : మండలంలోని కంటేవారిపల్లి హైవేలో సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. నడి రోడ్డుపై వెళుతున్న లారీ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడి స్థానికులు, ప్రయాణికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో లారీ మంటల్లో తగలబడిపోయింది. డ్రైవర్ సురేష్ గమనించి లారీ నుంచి వెంటనే దిగేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి బెల్గాంకు సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో ఆ లారీ వెళ్తుండేది. లారీ కంటేవారిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా వెనుక టైరు పగిలిన శబ్దం వచ్చింది. అనుమానం వచ్చి డ్రైవర్ సురేష్ బండి దిగి చూడగా అప్పటికే లారీ నుంచి మంటలు చెలరేగాయి. వెనుక టైరు పగిలి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంకు దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు లారీని కమ్ముకున్నాయి. చూస్తుండగానే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. మంటలు నిలువునా ఎగసి పడుతుండడంతో ఆర్పడానికి ఎవరూ సాహసించలేకపోయారు. వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ రావడానికి ఆలస్యం అయ్యింది. అందరూ చూస్తుండగానే లారీ కాలిపోయింది. లారీతోపాటు సిమెంటు బస్తాలు పూర్తిగా కాలిపోవడంతో రూ. 50 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా. తర్వాత ఫైరింజన్ రావడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. -
ఘనంగా ఫోరెన్సిక్ మెడిసిన్ దినోత్సవం
కడప అర్బన్ : కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఫోరెన్సిక్ మెడిసిన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ టి.జమున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్య రంగంలో అత్యంత బాధ్యతాయుతమైన విభాగమన్నారు. ఈ వృత్తిలో నైతిక విలువలు, వృత్తిధర్మాలు, నిజాయితీ, సేవాభావం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎం.బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎం.శాంతి, డాక్టర్ అబ్దుల్ ఖాలిద్, డాక్టర్ జి.దినేష్, డాక్టర్ కె.అనుదీప్, డాక్టర్ జి.మౌనిక, డాక్టర్ ఎన్.నవీన్వర్ధన్, డాక్టర్ బి.జోనాథన్, డాక్టర్ వై.అరవింద్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
చాపాడు : చాపాడులోని పాత అల్లాడుపల్లె రైతు సేవా సహకార సంఘం బ్యాంక్ ఆవరణలో మంగళవారం మద్యం అధికంగా తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కుచ్చుపాప గ్రామానికి చెందిన సంబటూరు నాగసుబ్బయ్య(40) ఇంటి నుంచి ఉదయాన్నే చాపాడుకు వచ్చి సొసైటీ బ్యాంక్ వద్ద అధికంగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మద్యం మత్తులో కిందపడి ఎంతసేపటికీ లేవకపోవడంతో సమీపంలోని హోటల్లో ఉన్న మహిళలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఆధారాలను వెతికి చూడగా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కుచ్చుపాప గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. నాగసుబ్బయ్య మద్యానికి బానిస అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
బాగా రాశాను, మరోమారు పరీక్షించుకోవాలి..
చైన్నె వేలామ్మల్ విద్యాలయంలో చదివాను. నీట్–యాజీ పరీక్ష కోసం బాగా కష్టపడ్డాను. అంతే ధీమాగా పరీక్ష రాశాను. కీ పరిశీలిస్తే దాదాపు 661 మార్కులు రానున్నాయని అంచనా దక్కింది. పరీక్ష అయిపోయింది. కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వచ్చాం. దాదాపు 10రోజులుగా పుస్తకాలు పట్టలేదు. తిరిగి పరీక్షించుకోవాల్సి రావడం దురదృష్టకరం. పేపర్ లీక్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టచర్యలు చేపట్టాలి. – మనీష్, విద్యార్థి, చైన్నె. -
మండే ఎండ.. జాగ్రత్తలే అండ!
రాజంపేట టౌన్ : భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. పొద్దు పొడిచింది మొదలు పొద్దుపోయేదాకా ఎండలు మండిపోతున్నాయి. మనిషి ఎండ నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో వాహనాలను కాపాడుకునేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వాహనాలు ఎండలో గంటల కొద్ది ఉండటం వల్ల ముఖ్యంగా పెట్రోల్ ఆవిరి అయిపోతుంది, అలాగే వాహనం రంగు వెలిసిపోతుందని మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. వాహనాలకు ట్యాంకు నిండా పెట్రోల్ పట్టిస్తే ఒక్కోసారి వాహనం పేలి దగ్దం అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వేసవి కాలంలో వాహనాలపై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. ● వాహనాలు ఎక్కువసేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టునీడన, షెడ్లలో పెట్టుకోవాలి. ● దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాహనాల వేగానికి ఉష్ణోగ్రతల వేడికి ఇంజిన్ రెండింతలు ఎక్కువ వేడెక్కే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత ఇంజిన్‌ను కాసేపు నీడలో నిలిపితే మంచిది. లేకుంటే ఒకొక్క మారు ఇంజిన్‌లో మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉంటుంది. ● అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గుతూ ఉంటుంది. కనీసం వారానికి ఒకమారైనా వాహనాల్లో గాలిని తనిఖీ చేయించుకోవాలి ● వేసవి కాలంలో వాహనాలకు గాలి తగిన మోతాదులో మాత్రమే పట్టించాలి. ఎక్కువ మోతాదులో పట్టిస్తే టైర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది. ● పెట్రోల్‌ను పగలు కంటే సాయంత్రం వేళల్లో పట్టించడం మంచిది పెద్ద వాహనాలకు ఇలా చేయాలి.. ● కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి ● నీళ్లకంటే కూలెంట్ ఆయిల్ వాడటం మంచిది. ● వేడికి ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా ఎప్పటిప్పుడు పరిశీలిస్తుండాలి. ● గ్యాస్ ద్వారా వాహనాలను నడిపేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు అలాంటి వారు గ్యాస్‌కిట్‌ను ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం ● ఏసీ నిల్వవుండాలంటే అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకోవాలి ● వేసవి పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు కొత్త టైర్లను వాడితేనే మేలు లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గి పేలిపోయే ప్రమాదముంది. -
బైక్ డివైడర్‌ను ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి..
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని జమ్మలమడుగు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెప్పలి నాగమల్లేష్ (22) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన నాగమల్లేష్ బీటెక్ చదివాడు. సోమవారం పరీక్ష రాసి వచ్చిన అతను తన స్నేహితుడు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన మహేష్‌ను బస్సు ఎక్కించేందుకు బైక్‌లో బయలుదేరాడు. ఈ క్రమంలో బుడ్డాయపల్లె సమీపంలోకి రాగానే బైక్ డివైడర్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో నాగమల్లేష్ అక్కడిక్కడే మృతి చెందగా మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. నాగమల్లేష్ తండ్రి చిన్న వెంకటేష్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కుమారుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించసాగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
కన్నీటి మడుగు
గాలివీడు : మండలం పరిధి గండిమడుగులో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మతి చెందాడు.పోలీసుల కథనం మేరకు.. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం టీ కుంట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ నాసిర్ (25) వేసవి సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి గండిమడుగు వద్ద ఉన్న వెలుగల్లు పార్కును సందర్శించేందుకు వచ్చాడు. అనంతరం గండిమడుగులో ఈత కొట్టేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి మునిగి పోయాడు. యువకుడు నీటిలో కనిపించక పోవడంతో అక్కడున్న వారు ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే గాలివీడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులు, ఫైర్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మతదేహాన్ని వెలికితీయించారు. -
ఎండ మండే వేళలో... మంచు కురిసేనెందుకో!
చౌడేపల్లెలో కాలం తిరగబడింది.. వేసవిలోనూ దట్టంగా కురిసిన పొగమంచుచౌడేపల్లె:అసలే మే నెల.. భానుడి భగభగలకు జనం విలవిలలాడాల్సిన సమయం. కానీ చౌడేపల్లె పరిసరాల్లో కాలం ఒక్కసారిగా తిరగబడింది. ఎండల తీవ్రతతో సెమటలు పట్టాల్సిన వేళ, చలికాలంలా మంచు తెరలు అలుముకోవడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు.మంగళవారం ఉద యం 8 గంటలైనా దట్టమైన పొగమంచు వీడకపోవడంతో చౌడేపల్లె వాసులు ఆశ్చర్యపోయారు. అసలే ఎండలు మండే మే నెలలో ఈ మంచు ముచ్చట్లు ఏమిటబ్బా అంటూ కాఫీ షాపుల వద్ద చర్చలు సాగాయి. మంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో కూడా వాహనాలకు లైట్లు వేసుకుని మంచు మబ్బుల్లో నెమ్మదిగా ప్రయాణిస్తున్న చిత్రాలు ‘సాక్షి’ కెమెరా కంటపడ్డాయి. ప్రకృతిలో వస్తున్న ఈ వింత మార్పులను చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. –ఫొటో: రసూల్, చౌడేపల్లి -
ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉత్పన్నం
ప్రతి రైలుల్లో నీటి సమస్య ఉందనేది నిత్యసత్యం. నేను హరిప్రియలో ఇటీవల ప్రయాణిస్తే నీళ్లులేవు. లాంగ్ ట్రైన్స్ అయితే నీళ్లు అయిపోతే, అడిగే నాథుడే లేకుండా పోతున్నాడు. తిరుమల, ఇంటర్సిటీ, హరిప్రియ, చైన్నె–ముంబై రైళ్లలో నీటి నిల్వలు ఎప్పుడో అయిపోయింటాయి. నీటి వాడకం లేకపోవడంతో దుర్గంధపూరితంగా మారిపోతున్నాయి. గుత్తి–రేణిగుంట మధ్య అటు చైన్నె, ఇటు ముంబై రైళ్లకు సెంటర్‌పాయింట్‌గా నందలూరులో వాటరింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రయాణికులకు నీటి సమస్య తీరుతుంది. –వేపగుంట శ్యామ్‌రాజ్, సంఘసేవకుడు, నందలూరు రైల్వేకేంద్రం -
సౌతాఫ్రికాలో కలిచెర్ల వాసి మృతి
పెద్దమండ్యం : మండలంలోని కలిచెర్లకు చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వివరాలలోకి వెళితే.. పెద్దమండ్యం మాజీ ఎంపీపీ పి. ప్రసాద్‌రెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బీటెక్ పూర్తి చేసిన కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా డు. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అక్కడే కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడి, అలసటగా ఉందని చెప్పి కుప్పకూలినట్లు అతని స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, గుండెపోటుకు గురి కావడంతో మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపినట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మాజీ ఎంపీపీ తనయుని ఆకస్మిక మరణంతో కలిచెర్ల, యర్రగుట్టపల్లెలో విషాదం నెలకొంది. భార్య ఇటీవల స్వగ్రామానికి వచ్చి సౌతాఫ్రికాకు వెళ్లి 20 రోజులు అవుతోంది. మృతుని భార్య, బిడ్డను తిరిగి కలిచెర్లకు పంపించేందుకు అక్కడి కంపెనీ ప్రతినిధులు చొరవ తీసుకున్నట్లు సమాచారం. మాజీ ఎంపీపీ తనయుని అకస్మిక మృతిపట్ల తంబళ్లపల్లె ఎమ్యెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కలిచెర్ల సింగిల్‌విండో మాజీ ఛైర్మన్ కలిచెర్ల సుధాహరరెడ్డి, ఎంపీపీ గుర్రం పూర్ణచంద్రిక, మాజీ ఎంపీపీ టి రెడ్డిశేఖరరెడ్డిలు దిగ్బాంతి వ్యక్తం చేశారు. రుణాల పేరిట మోసం సాక్షి, మదనపల్లె : రుణాలు ఇప్పిస్తామని, అందుకు సంఘాలు ఏర్పాటు చేయాలని నమ్మించిన ఇద్దరు మహిళలు అందిన కాడికి దండుకున్నారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు వివరాలు. ఫరీదా అనే మహిళ, ఆమె కూతురు నస్రిన్ బి.కొత్తకోట పట్టణం, మండలానికి చెందిన మహిళలతో పరిచయాలు పెంచుకున్నారు. వారికి వివిధ పథకాలు మంజూరు చేస్తామంటూ నమ్మించారు. 13 నుంచి 15 మంది మహిళలను కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేసి 38 సంఘాలను ఏర్పరిచారు. వీరికి రూ.ఐదు లక్షల దాకా రుణాలు ఇప్పిస్తామని అందుకు రూ.3 వేల దాకా ఖర్చవుతుందని చెప్పి వసూలు చేశారు. తర్వాత కుట్టు మిషన్లు కూడా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1,200 వసూలు చేశారు. వారిని నమ్మి డబ్బు చెల్లించిన మహిళలకు రుణాలు అందక, కుట్టు మిషన్లు మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చింది. ఈ విషయమై వారిని నిలదీయగా సమాధానం లేదు. తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులు ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై స్టేషన్‌కు వచ్చిన మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించి న్యాయం చేయాలని కోరారు. -
14న జిల్లా రైతు సంఘం మహాసభలు
చింతకొమ్మదిన్నె : ఏపీ రైతు సంఘం కడప జిల్లా 6వ మహాసభ ఈనెల 14న సీకే దిన్నె మండలం గంగమ్మ తోపు ఆంజనేయస్వామిగుడి దగ్గర జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, దస్తగిరిరెడ్డి తెలిపారు. సోమవారం మహాసభకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 86 శాతం రైతులు చిన్న సన్నకారు రైతులే అని, సరైన మద్దతు ధర లేక, రుణాలందక అప్పుల బారిన పడుతున్నారని ఆయన తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని , డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ మహాసభలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి సమీక్షించి భవిష్యత్ పోరాటాలకు ప్రణాళిక రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి మహాజభకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులురెడ్డి,చిన్న సిద్దయ్య,నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాయకులు, కార్యకర్తలను పట్టించుకోని కూటమి సర్కార్
పులివెందుల రూరల్ : టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లెలో ఉన్న తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల ఇళ్లకు వెళ్లి వారిని కూడా ఆప్యాయంగా పలకరించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి గుర్తింపు లేదన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్థాయి వ్యక్తులను కలుస్తున్నారే తప్పా.. టీడీపీ సీనియర్ నాయకులను కలవడంలేదని అన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు (చంద్రబాబు) ఇక్కడ నుంచి 34మంది కార్యకర్తలను పిలిపించి మాతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఆ సంతోషంగా ఎంతోకాలం నిలబడలేదని, అధికారం వచ్చిన తర్వాత మాకు గౌరవ మర్యాదలు, కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని భావించామన్నారు. కానీ రెండేళ్లవుతున్నా టీడీసీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను పిలిపించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. అధికారంలో ఉండేది ఐదేళ్లు కాబట్టి.. ఐదేళ్ల తర్వాత మా అవసరం వస్తుందని, దయచేసి మమ్ములను ఎన్నికలప్పుడు ఉపయోగపడే యంత్రాలుగా కాకుండా, మేం మనుషులమని, మీరు పిలిపించి మాట్లాడితే గౌరవం పెరుగుతుందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబునాయుడు ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలను ముఖ్యమంత్రి హోదాలో కలుస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.టీడీపీ సీనియర్ నాయకులు వెంకట్రామిరెడ్డి -
ఈ–ఆఫీసు వినియోగం తప్పనిసరి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు తప్పనిసరి అని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ–ఆఫీసు ద్వారా ఫైళ్లు పంపాలని గత ఆరునెలలుగా ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని కార్యాలయాల్లో భౌతికంగానే ఫైళ్లు నడుపుతున్నారని తెలిపారు. ఇది క్రమశిక్షణా రాహిత్యమే కాకుండా చట్టవిరుద్ధమని తెలిపారు. ప్రతి అధికారి తన లాగిన్‌కు వచ్చిన ఫైళ్లను రెండు రోజుల్లో పరిష్కరించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఫైళ్ల పరిష్కారానికి 6–11 రోజుల సమయం తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్లో రీఓపెన్ అయిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఏలో లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, డీఆర్వో మల్లికార్జునుడు, జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తొలగించిన వెంకటేశ్ అనే కార్మికుడిని విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్ కోరారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ నిబంధనలు పాటించని ఈగల్ హంటర్ సెక్యూరిటీ సర్వీసు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ● తనభూమికి పాసు పుస్తకం మంజూరు చేయాలని కడపకు చెందిన వెంకట సుబ్బయ్య కోరారు. ● వేముల మండలానికి చెందిన చెంగల్‌రెడ్డి తనకు ప్రభుత్వ పెన్షన్ మంజూరు చేయాలని, కొండాపురం మండలానికి చెందిన కుమారి రేషన్‌కార్డు మంజూరు చేయాలని కోరారు. ● తన గ్రామ పొలం సర్వే నెంబరు 262/ఎలోని 19 సెంట్ల స్థలంలో తాను రేకుల ఇళ్లు, మరుగుదొడ్డి నిర్మించుకున్నానని కలసపాడుకు చెందిన నాగశేషయ్య తెలిపారు. ఆ స్థలం తాను శ్రీనివాసులు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానన్నారు. కాగా ఆ స్థలంలో బంగారు ఉందని చెబుతూ కొందరు తనను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
అదుపు తప్పి కూలీల ఆటో బోల్తా
వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీల ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్‌తోపాటు 15మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం వేంపల్లె పట్టణంలోని గౌరీ నగర్, సంఘం వీధి, కరణంవీధి తదితర ప్రాంతాల నుంచి నందిపల్లె గ్రామ పొలాల్లోకి వ్యవసాయ కూలీ పనికి ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆటో డ్రైవర్ వేరే వాహనాన్ని తప్పించబోయి మట్టి కుప్పను ఎక్కించాడు. అధిక లోడు ఉండడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 8మందికి తీవ్రంగా, మిగిలిన వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ నిత్యానంద, వీరమ్మ, మహబూబ్ బీ, పద్మావతి, అమరావతి, అంజనమ్మ లక్ష్మీదేవిలను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. మిగిలిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.15మంది కూలీలకు తీవ్ర గాయాలు -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
కలకడ : ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ ముజీర్ కథనంమేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, ఎర్రకోటపల్లెపంచాయతీ, మల్లవరంవాండ్లపల్లె గ్రామానికి చెందిన మల్లూరి.రవీంద్రరెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి (22) స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంలో బొంతలవారిపల్లెలో జరిగే జాతరకు బయలుదేరాడు.మార్గమధ్యలో బైక్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సూచికబోర్డును ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇతన్ని చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ ముజీర్ తెలిపారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కడప ఎడ్యుకేషన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (ఏపీఈఏపీసెట్)–2026 నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్)విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 14846 మంది ఇంజనీరింగ్‌కు, 3985 మంది మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను రాయనున్నారు. ఇందులో ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, అలాగే మధ్యాహ్న సెషన్‌కు 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో పరీక్షా కేంద్ర వివరాలు ఇలా... ఏపీ ఈపీపీ సెట్ పరీక్ష కోసం జిల్లాలో 9 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కడపలో ఆరు, ప్రొద్దుటూరులో రెండు, రాజంపేటలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని సిద్ధం చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషయంలో హాడావుడి పడకుండా చూసుకోవాలి. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
లైంగిక వేధింపులపై కేసు
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో పారిశుధ్య కార్మికురాలైన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైంగిక వేధింపులు చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఏడాది కాలం నుంచి లైంగికంగా, మానసికంగా వేదిస్తున్నాడని బాధితురాలు పిర్యాదు చేసింది.ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నియామకంకడప వైఎస్ఆర్ సర్కిల్ : కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షునిగా దాసరి శ్రీనివాసులు నియమించినట్లు డీసీసీ అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి పేర్కొన్నారు. సోమవారం కడపలోని ఇందిరాభవన్‌లో శ్రీనివాసులుకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప అసెంబ్లీ కోఆర్డినేటర్ బండి జకరయ్య, ఏఐసీసీ కోఆర్డినేటర్ అబ్దుల్ సత్తార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూరతోటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంజమ్మలమడుగు : నిరుపేద రజక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు, అందుకోసం దరఖాస్తులు చేసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కారదర్శి లక్షుమయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31వ తేదీన నిరుపేదలైన రజక విద్యార్థులకు ఆర్థికం సాయం చేయడంకోసం రజక వేల్పేర్ ఆసోషియేషన్ తరపున తీర్మానం చేసినట్లు చెప్పారు. పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు 500కంటే ఎక్కువ మార్కులు, అలాగే ఇంటర్మీడియట్ ప్రభుత్వ, ప్రైవేట్కాలేజీల్లో చదువుకుని అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అత్యధిక మార్కులు సాధించిన వారిని డ్రా తీసి వైఎస్సార్సీపీ రజకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు లోగిడి జయన్నతో కలిసి తమ సొంత నిధులు వెచ్చించి ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల రజక విద్యార్థులు దరఖాస్తులను చేసుకోవాలన్నారు. వివరాలకు 9949669637,9505502212 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఈనెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హత్యకేసులో నిందితులు అరెస్టులక్కిరెడ్డిపల్లి : మండలంలోని పందిళ్లపల్లి గ్రామం, బీసీ కాలనీకి చెందిన చిన్నక్క హత్యకేసులో తల్లీ, కొడుకులైన సావిత్రి, వేణులను సోమవారం అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. పందిళ్లపల్లి కస్సాలోని పసుపులేటి చిన్నక్క (65) ఒకే బజారులో ఉన్న సావిత్రి, వేణులు ఏప్రిల్ 25న ఇంటిముందర గొడవపడ్డారు. తల్లీ కొడుకులు చిన్నక్కను గోడకేసి కొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఆమెను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా ఫిట్స్ రావడంతో తిరుపతికి తరలించారు.అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లమని చెపారు. దీంతో ఆమెను ఈనెల 7న పందెళ్లపల్లికు తీసుకువచ్చారు.అదేరోజు రాత్రి మృతి చెందింది. సావిత్రి, వేణులు కొట్టిన దెబ్బలకు మా అత్త మృతి చెందినట్లు చిన్నక్క కోడలు రామాంజనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
మైనర్లు, అమాయకులను వదిలేయండి
కడప కార్పొరేషన్: కడప నగరం అల్మాస్‌పేటలో ఇటీవల జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, పార్టీ సీఈసీ సభ్యులు కె. సురేష్‌బాబులతో కలిసి ఆయన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు కడపలో ఏనాడూ జరగలేదన్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన మైనర్లు, అమాయకులు, సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి, వివిధ జైళ్లకు పంపించారన్నారు. మరో మారు విచారించి సంబంధం లేని వారిని విడుదల చేయాలన్నారు. అల్మాస్‌పేట నాలుగు రోడ్ల కూడలి కావడంతో అటు, ఇటు వెళ్లే వారంతా అక్కడకు చేరుకుని గుమికూడారని, వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఘటనతో సంబంధం ఉన్నవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, సంబంధం లేనివారు, అమాయకులు, మైనర్లపై బెయిలబుల్ సెక్షన్లు పెట్టి విడుదల చేయాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా కడప మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి కడపను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, తోటక్రిష్ణ, షఫీ, షఫీవుల్లా, శ్రీరంజన్‌రెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఘటనతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసుకోండి ఎస్పీతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుపి. రవీంద్రనాథ్‌రెడ్డి,మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు -
14న అండర్–14, 16 క్రికెట్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 14న అండర్ 14 16, బాలుర క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు . ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కాపీ,బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), లాస్ట్ 3 సంవత్సరాల మార్కులిస్ట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. అండర్– 16 ఎంపికలకు 2010 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. అండర్ –14కి 2012 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులని వివరించారు. ప్రొద్దుటూరు కల్చరల్: భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రచారార్థం జయహో బీమా సంకల్ప్ మెగా మేళాను ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు ప్రొద్దుటూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జి.కిరణ్ సోమవారం తెలిపారు. ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని అన్ని పోస్టాఫీసులలో జయ హో బీమా సంకల్ప్ నిర్వహించనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ప్రీమియంతో అధిక బోనస్ రేట్లు అందిస్తూ, ఇతర బీమా సంస్థలతో పోలిస్తే ప్రజ లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రతి గ్రామస్తుడు తమ సమీపంలోని పోస్టా ఫీసు ద్వారా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకంలో చేరవచ్చని పేర్కొన్నారు. కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సోమవారం రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్స్‌గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తం 24 మందికి గాను 21 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: గతంలో ఓకా–మధురై–ఓకా మధ్య స్పెషల్ రైలు నడిచేదని, దాని స్థానంలో ఓకా–తిరుపతి (19560), తిరుపతి–ఓకా (19559) వీక్లీ రెగ్యులర్ రైలుగా నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి సోమవారం ఓకాలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరి ద్వారక, కంబాలియా, జామ్‌నగర్, రాజ్‌కోట్, సురేంద్రానగర్, అహ్మదాబాద్, వడోదర, సూరత్, అకోల, నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్, కాచిగూడ, మహబూబ్‌నగర్, కర్నూలు, డోన్, తాడిపత్రి మీదుగా కడపకు మరుసటిరోజు సాయంత్రం 5.55 గంటలకు చేరుకుని, అక్కడి నుంచి రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి రాత్రి 11.30 గంటలకు చేరుతుందన్నారు. ప్రతి గురువారం తిరుపతిలో ఉదయం 8.15గంటలకుబయలుదేరి ఇదే మార్గంలో శనివారం రాత్రి 11.50 గంటలకు ఓకా చేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కడప కార్పొరేషన్: జిల్లాలో ఇటీవల అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, జిల్లాలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఏపీ ట్రాన్స్ కో కీలకమైన అభివృద్ధి పనులను చేపడుతోందని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా యరగ్రుంట్ల 220/132 కేవీ సబ్‌స్టేషన్‌లో ఒక 160కేవీఏ, 220/132 కేవీ వోల్టేజ్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తయిన తర్వాత, జిల్లాలో విద్యుత్ సరఫరా సామర్థ్యం గణనీయంగా పెరిగి, భవిష్యత్ లోడ్ అవసరాలను సులభంగా తీర్చగలుగుతామన్నారు. ఈ అత్యవసర పనులను సురక్షితంగా నిర్వహించడానికి ఈనెల 11 నుంచి 24వ తేది వరకూ జిల్లా లోని కొన్ని ప్రాంతాల్లో పగటి పూట స్వల్ప కాలి క, తాత్కాలిక అంతరాయాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అభివృద్ధి పనులకు ప్రజల సహకారం అవసరమన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులోని ఎస్సీఎస్ఆర్ కల్యాణ మండపం సమీపంలో సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు భరత్ (20) ద్విచక్ర వాహనంలో పులివెందులకు వెళ్లి పనులు ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. కదిరి రోడ్డులో వస్తుండగా.. కదిరి నుంచి పులివెందుల వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్‌కు తీవ్ర గాయాల య్యాయి. యువకుడిని చికిత్స కోసం 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భూకబ్జాలు ఆపాలని ధర్నా
గోపవరం : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం ప్రాంతంలో జరుగుతున్న భూకబ్జాలను వెంటనే ఆపాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణ కార్యదర్శి బాలు, రూరల్ కార్యదర్శి ఇమ్మానియేల్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారికి అండగా నిలుస్తున్నారని వారు ఆరోపించారు. మున్సిపాలిటీ పరిధిలోని రూపరాంపేటలో గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క పేదవాడికి కూడా స్థలం ఇవ్వకపోగా కనీసం ఇళ్లు కూడా మంజూరు చేయలేని దుస్థితిలో ఉందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు కేటాయించాలన్నారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి నాగరాజు, మహిళా సంఘం నాయకురాలు విజయమ్మ, ఏఐవైఎఫ్ నాయకులు మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఉదయమే ‘ములాఖత్’
కడప అర్బన్: రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్‌కు అవకాశం ఉంటుందని కడప కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండుటెండల నుంచి రక్షణ పొందడానికి వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ములాఖత్‌కు వచ్చే వారు మారిన సమయాన్ని గుర్తించి, అధికారులకు సహకరించాలని కోరారు. చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా నాలుగోరోజు సోమవారం పలు కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు.ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ మహాయజ్ఙం, తుంబూర వేషాలంకారంతో పాటు నాగవళ్లి దళాలతో(తమలపాకులతో) సహస్ర నామార్చన నిర్వహించారు.అనంతరం శాత్తమొరై జరిపారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతలకు కార్పొరేషన్ అధికారులు బందీగా మారారు. నిబంధనలకు పాతరేస్తూ.. పాలకుల అడుగులకు మడుగులొత్తుతూ పాలన గాలికొదిలేశారు.. కూటమినేతలు చెప్పిందానికల్లా తలాడిస్తూ.. చట్టాన్ని వారి చుట్టంగా మార్చేశారు.. ఫలితంగా వ్యవస్థ గాడితప్పింది.. సమాజంలో శాంతిభ
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా అధికార యంత్రాంగం మొద్దునిద్ర పోతోంది. ఏదైనా సంఘటన జరిగేదాకా కళ్లు తెరవనంటోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడపలో కార్పొరేషన్ అధికారుల అడ్డగోలు నిర్ణయాలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి పనిచేయాల్సిన వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. అధి కార పక్షం అభిమానం దక్కితే చాలన్నట్లుగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టాల్సిన జిల్లా సర్వోన్నతాధికారి చూస్తుండిపోతున్నారు. ఫలితంగా జిల్లా కేంద్రమైన కడపలో ఘర్షణలకు ఆస్కారం ఏర్పడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇలాగే వ్యవహరిస్తే సమాజానికి భారీ కీడు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ● కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా పనిచేస్తోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా అధికారపార్టీని మెప్పిస్తే చాలన్నట్లు వ్యవహరిస్తోంది. అధికారపక్షం ఏం చేసినా వత్తాసుగా నిలవడం మినహా, నిబంధనలకు వ్యతిరేకమని చెప్పే సాహసం కూడా చేయలేని దుస్థితి నెలకొంది. చలానా స్వీకరణలో నిర్లక్ష్యం... కార్పొరేషన్ పరిధిలో ప్లెక్సీలను చలానా చెల్లించి ఏర్పా టు చేసుకోవాలి. ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టానుసారం ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. 3రోజులకు 10/15 ప్లెక్సీకు రూ.15వందలు చలానా చెల్లించాలి. ఇతరులను రెచ్చగొట్టే ధోరణిలో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కంటెంట్ ఉందా లేదా పరిశీలించి అనుమతించాల్సిన బాధ్యత కూడా కేఎంసీదే. ఇవేవీ గత కొంతకాలంగా కేఎంసీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలాంటి ధోరణిలోనే తగిన చలానాలు స్వీకరించకుండా.. కంటెంట్‌ను పట్టించుకోకుండా అల్మాస్‌పేట సర్కిల్లో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలకు అవకాశమిచ్చారు. వెరసి రెండు వర్గాలు విడిపోయి ఘర్షణలు దిశగా అడుగులు పడ్డాయని పరిశీలకులు వివరిస్తున్నారు. ఇన్చార్జి కమిషనర్‌పై చర్యలు... అల్మాస్‌పేటలో శనివారం చోటుచేసుకున్న ఉద్రికత్తలు, ఘర్షణలకు ప్రధాన కారణం ప్లెక్సీలు అనుమతేనని ఓ నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం కడప ఇన్చార్జ్ కమిషనర్ రాకేష్చంద్రను బదిలీ చేసింది. ఆస్థానంలో రాజంపేట సబ్‌కలెక్టర్ హెచ్ఎస్ భావనాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మున్సిపల్ కార్పొరేషన్ గాడి తప్పుతున్నప్పుడే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టి సారించింటే ఇలాంటి విపత్కర పరిస్థితి చోటుచేసుకునేది కాదని పలువురు వాపోతున్నారు. జిల్లాలో అధికారులు ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గిస్తూ, ఏకపక్ష చర్యలకు మొగ్గుచూపుతున్నప్పుడు కలెక్టర్ కర్రపెత్తనం చలాయించాల్సి ఉంది. అలా కాకుండా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలు అమలు చేయడంలోఅధికారయంత్రాంగం విఫలం అధికార పక్షానికి చుట్టంగామున్సిపల్ కార్పొరేషన్ అడ్డగోలు వ్యవహారమేఇరువర్గాల ఘర్షణలకు కారణం కడప కార్పొరేషన్ యంత్రాంగం నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారు. ముందే చేసిన పనులు టెండర్లు పిలిచి కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు. లెస్‌కు కోట్ చేసినా పనులు ఇవ్వకపోవడం.. అధికార పార్టీ నేతలు చెప్పిన వారికే టెండర్లు దక్కేలా ప్రణాళిక రచించడం వంటివి చేస్తున్నారు. దీనికి 4వ డివిజన్లో చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివర వరకూ రోడ్డు నిర్మాణానికి(టెండర్ ఐడీ 903811) పిలిచిన టెండరే ఉదాహరణ. ఇలా కేఎంసీలో అన్నీ విభాగాల అధికారులు అధికార పక్షం మెప్పుకోసమే తాపత్రయం చూపుతున్నారని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ఇక వైరిపక్షం ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద పుట్‌పాత్‌లు తొలగించడం కూడా కేఎంసీ చేస్తూ వచ్చింది. నగరమంతా అవే నిబంధనలు పాటించారా?అంటే అలాంటిదేమి లేదు. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నట్లుగా కేఎంసీ చర్యలుండిపోయాయి. కేఎంసీ చర్యలే ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
ద్వారకకు రైలు!
రాజంపేట: జిల్లా మీదుగా నేరుగా గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు వెళ్లే వీక్లీ ట్రైన్‌కు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. జిల్లాలో ఓకా–తిరుపతి మధ్య 19560/19559 నెంబర్లతో ఈ రైలు నడవనుంది. ఈ నెల 19న ఓకా స్టేష్టన్లో అక్కడ ఎంపీ పూరంభీన్, ఎమ్మెల్యే పభూభా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ రైలుకు రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించారు. దేశంలో ప్రసిద్ధి చెందిన రెండు పుణ్యక్షేత్రాలను అనుసంధానంగా నడుస్తున్న ఈ రైలుకు భక్తుల నుంచి పెద్ద ఆదరణ వస్తుందని రైల్వే శాఖ భావిస్తుంది. ఓకా–తిరుపతి రైలు ఇలా ఓకా–తిరుపతి మధ్య (19560) వారంలో ఓకా నుంచి సోమవారం బయలుదేరుతుంది. 19550 నెంబర్‌తో వారంలో ప్రతి గురువారం తిరుపతి నుంచి బయలుదేరుతుంది. కోచ్ పొజిషన్: ఓకా–తిరుపతి మధ్య నడిచే రైలుకు సెకెండ్ ఏసీ రెండు, థర్డ్ ఏసీ 3, స్లీపర్ల కోచ్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు రాష్ట్రంలోకి ప్రవేశించిన అనంతరం కర్నూల్ టౌన్, డోన్, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతి స్టేషన్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో... ఇప్పటికే జిల్లా మీదుగా ద్వారకా వరకు దక్షిణ రైల్వే జోన్ వారు రామేశ్వరం నుంచి ఓఖా వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నడుపుతున్నారు. కానీ ఈ రైలుకు రాజంపేట రైల్వే స్టేషన్లో సదుపాయం లేకపోవడంతో కడప లేదా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడి నుంచి ద్వారకా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మొట్ట మొదటి సారి రాజంపేట రైల్వే స్టేషన్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్, రాజ్ కోట్, ద్వారకా లాంటి పట్టణాలతో ఈ నూతన రైలు ద్వారా అనుసంధానం ఏర్పడింది. ద్వారక ఆలయం జిల్లా మీదుగా పయనం కడప, రాజంపేటలో హోల్డింగ్ -
‘సీమ’ఎత్తిపోతలకు నీళ్లొదిలారు!
కడప సెవెన్‌రోడ్స్: సీమ ఎత్తిపోతల పథకంపై కూటమి సర్కార్ కుట్రలు పన్నుతోందన్న అనుమానం నిజమైంది. ఇరిగేషన్ క్యాలెండర్ సాక్షిగా సీమ ఎత్తిపోతల పథకానికి బాబు సర్కారు నీళ్లొదిలింది. రాయలసీమ వాసులకు మరోసారి మోసం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ల సమావేశ సందర్భంగా ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని 25 సాగునీటి ప్రాజెక్టులను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారో, ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తారో గడువును నిర్ణయిస్తూ రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు. ఇందులో రాయలసీమకు ప్రాణప్రదమైన ఎత్తిపోతల పథకం ఊసే లేదు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించే గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, వెలిగొండలతోపాటు చైన్నెకి తాగునీరు అందించడంలో అత్యంత కీలకమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రస్తావన లేకపోవడంపై జిల్లాకు చెందిన పలువురు రైతు నాయకులు, వామపక్షాల నేతలు తప్పుబడుతున్నారు. ‘సీమ’ ప్రాజెక్టుల జీవనాడిగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని ఇరిగేషన్ క్యాలెండర్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా అధికార టీడీపీ నేతలు పెదవి విప్పకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎత్తిపోతలు ఎందుకంటే.... శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటే తప్ప సీమ ప్రాజెక్టులకు అవసరమైన సాగునీరు అందే వీలుండదు. ఇక 841 బెడ్లెవెల్లో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇక చెప్పాల్సిన పనే ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఫోర్ షోర్లో 800 అడుగుల నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని డ్రా చేసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారు. సంగమేశ్వరం వద్ద నుంచి నీటిని తీసుకొచ్చి లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడుకు దిగువన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎస్ఆర్ఎంసీలో కలుపుతారు. ఈ పథకానికి సంబంధించి 2020 మే 5వ తేది ప్రభుత్వం జీఓఆర్టీ నెంబరు 203 విడుదల చేసింది. ఈ పథకాన్ని రూ. 3825 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చారు. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి నీటిని తీసుకొచ్చే ఇన్లెట్ కెనాల్ నిర్మించారు. అలాగే పంపుహౌస్, ఇతర నిర్మాణాలు దాదాపు 80 శాతం జగన్మోహన్రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. ఈలోపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాయలసీమకు జీవనాడి అయిన ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేశారు. ‘సీమ’ ప్రాజెక్టులకు ప్రాణప్రదం రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించడంలో ఎత్తిపోతల పథకం ప్రాణప్రదమైనది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు ఒక్కటే రాయలసీమ అవసరాలు తీర్చలేదు. శ్రీశైలం ఫోర్‌షోర్‌లో 800 అడుగుల నుంచి నీటిని తీసుకొచ్చే ఈ పథకం ద్వారానే సీమ ప్రాజెక్టులకు నీళ్లందుతాయి. అలాంటి ప్రాజెక్టులు విస్మరించడం తగదు. ఈ విషయంలో అధికార టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. లేదంటే చరిత్ర క్షమించదు. – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప ‘సీమ’ ద్రోహి చంద్రబాబు అననుకూల పరిస్థితుల్లో కూడా రాయలసీమ దాహార్తి తీర్చడంలో ఎత్తిపోతల పథ కం జీవనాడిగా ఉంటుంది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంపై ఆయనకున్న వివక్ష వల్ల ఎత్తిపోతల పథకానికి మరణశాసనం వినిపించారు. దీంతో సీమ ద్రోహిగా నిరూపించుకున్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ క్యాలెండర్లో సీమ ఎత్తిపోతల పథకానికి చోటు కల్పించకపోవడం ఈ ప్రాంతాన్ని శాశ్వత ఎడారిగా మార్చడమే. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి -
ఆధునిక ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి..ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు..అదే పెద్దతరం వారు వింటే పులకరించిపోతారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. కాలానికి పరిమితమైన వారు కాదు..తరతరాలకు గుర్తుండిపోయే మానవతావాది. గొప్ప దార్శనికుడిగా,రచయితగా అంతకు మించి విద్యావేత్తగా,ధార్మికుడిగా, తత్వవేత్తగా ఆయన ఫిలాసిపీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ,రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించాడు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టి మద్రాస్ అడయార్‌లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్‌గా ఎదిగిన ఆయన 60 ఏళ్లకు పైగా ప్రపంచ దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించాడు. ప్రదానంగా సత్యాన్ని తెలుసుకోడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలరన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్రాలోచన కల్గించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్దాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి..టీచర్ విద్యార్థి లోని సృజనాత్మకతను తట్టి మేల్కొపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమ ఉన్న వారు మంచి తప్ప చెడు చేయలేరని చెప్పారు. మనిషి సంపూర్డుడిగా ఎదగాలని పదేపదే చెప్పారు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. ఇప్పటితరం వారు చిన్న పదవులు లభిస్తే వదలమన్నా వదలరు. అనిబిసెంట్ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్దురువును చేయాలని ఆర్డర్ ఆఫ్‌ది స్టార్ అనే సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. వందల కోట్ల ఆస్తిని కూడా వదులుకున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయంపై అప్పట్లో యావత్ ప్రపంచమే విస్తుపోయింది. ఇది అపూర్వ ఘట్టంగా చరిత్రలో నిలచిపోయింది.మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎవరికి వారు మార్పు చెందాలన్నారు. మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశాడు. మూడ నమ్మకాల నుంచి విముక్తి పొందాలనేవారు. జిడ్డు కృష్ణమూర్తికి చదువు సంధ్యల పట్ల పెద్దగా ఆసక్తిలేకపోయినా 15 ఏళ్లవయస్సులో అట్ ది ఫీట్ ఆఫ్‌ది మాస్టర్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశారు. మదనపల్లె పట్టణంలో 1895 మే 11న తల్లితండ్రులు సంజీవమ్మ, నారాయణయ్యకు ఎనిమిదో సంతానంగా జన్మించిన ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కృష్ణమూర్తి ఫౌండేషన్ పేరిట దేశ విదేశాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. వీటన్నింటి కన్నా దేశంలోని మదనపల్లె దగ్గరున్న రిషివ్యాలీ స్కూల్ ప్రత్యేకతను సంతరించుకుంది. 1925లో సోదరుడు నిత్యానంద ఆకస్మిక మరణం ఆయనలో ఎనలేని మార్పునకు దారితీసింది. జిడ్డు కృష్ణమూర్తి బోధనలు సామాజిక అవసరాలను గుర్తించి మనిషిలో జ్ఞాన తృష్ణను రగిలిస్తాయి.ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. ఆధునిక తత్వవేత్తలలో ఆద్యుడిగా, ప్రపంచ జ్ఞానిగా పేరు గడించాడు. ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప మహోన్నతుడిగా, విశ్వ మానవుడిగా జిడ్డు కృష్ణమూర్తి గురించి యావత్ ప్రపంచం కొనియాడుతోంది.నేడు జయంతి -
భక్తిలో మునిగారు
ఆలయం లేదు..మూలవిరాట్టులు లేరు..ఆలయం సోమశిల వెనుక జలాల్లో మునిగింది..అయినా గ్రామస్తులు ఏటా ఉత్సవ విగ్రహాలతో కల్యాణం చేయించి.. భక్తిపారవశ్యంతో పరమానందం పొందుతున్నారు.. అదెక్కడో కాదు..సోమశిల బ్యాక్‌వాటర్ పరీవాహక గ్రామం యల్లంపేట. దీనిపై ప్రత్యేక కథనం.. రాజంపేట: అది సోమిశిల వెనుకజలాలల్లో మునిగి పోయిన గ్రామం..యల్లంపేట .. చుట్టూ పచ్చటి పొలాలు..ఆహ్లాదకరమైన వాతవరణం. ఏరు ఉంటుంది. ఈ గ్రామంలో అప్పట్లో 300 కుటుంబాలకుపైగా నివాసం ఉండేవారు. యల్లంపేట, ఓబులంపేట రెండు గ్రామాలు ఉండేవి.ఈ గ్రామానికి చెందిన ఆలయం మునకలోకి వెళ్లిపోయింది. గ్రామస్తులకు పునరావాసం లేదు..ఆలయం నిర్మించలేకపోయారు. గ్రామంలో రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీమంత్రి బండారు రత్నసభాపతి(ఓబులంపేట), ఎమ్మెల్యే లేని రోజుల్లో జిల్లా డిస్ట్రిక్బోర్డు మాజీ సభ్యుడు తాండ్ర పేరమనాయుడు (యల్లంపేట) పెద్ద కుటుంబాలు ఉండేవి. ● సోమశిల బ్యాక్‌వాటర్‌లో ఇప్పటికీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయి, గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం కనిపించగానే అధ్యాత్మికభావన మనుసులో పుట్టుకొస్తుంది. ప్రతి ఇంటిలో ఒకరికి స్వామిపేరు.. శ్రీ రుక్మిణి, సత్యభామ శ్రీ వేణుగోపాలస్వామిపై అపారమైన భక్తి భావం, ప్రగాఢ విశ్వాసం పెంచుకున్నారు. ఈ క్రమంలోని యల్లంపేటలో ప్రతి ఇంటిలో ఒకరికి స్వామి పేరుపెట్టుకోవడం గమనార్హం. ఏటా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గ్రామస్తులు ఒక్కటిగా స్వామి వారి ఎదుట కలుసుకొని పరస్పరం సంతోషాలతో గడుపుతారు. భక్తులకు అన్నప్రసాదాలను అందచేస్తారు. సోమశిల బ్యాక్‌వాటర్ మునిగిన యల్లంపేట రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, యేటా గ్రామస్తులు నిర్వహించే కల్యాణంలో ఉత్సవమూర్తులు వేణుగోపాలస్వామిపై తరగని భక్తి గ్రామం మునిగిపోయి నాలుగుదశాబ్దాలు దాటుతున్నా యల్లంపేట వేణుగోపాలస్వామిపై భక్తిభావం తరగలేదు. ఆలయం మునిగిపోయింది, గ్రామం ఖాళీ అయింది. యల్లంపేటకు పునరావాసం లేదు. ప్రభుత్వాలు ఆలయం నిర్మాణంతోపాటు పునరావసం కల్పిస్తే, మళ్లీ గ్రామస్తులు ఒక్కచోట కలిసి ఉండేందుకు మార్గం సుగమమవుతుంది. –తాండ్ర రమేష్‌నాయుడు, యల్లంపేట, నందలూరు ● సోమశిల బ్యాక్‌వాటర్‌లో యల్లంపేట గ్రామంతోపాటు ఆలయం మునకకు గురైంది. ● గ్రామానికి 1986 ప్రాంతంలో నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియను చేపట్టారు. 1990 నుంచి గ్రామాన్ని దశలవారీగా ముంపువాసులు వదలివెళ్లారు. తమకు అనుకూలమైన ప్రాంతాలకు, రాష్ట్రంలో నలుమూలలకు వెళ్లి స్థిరపడ్డారు. ● గ్రామం ఖాళీ అవుతున్న క్రమంలో, మరోవైపు నీళ్లు గ్రామానికి చేరువలో రావడంతో మానవసమాజం ఆలయానికి దూరమైంది. ఈ నేపథ్యంలో గుప్తనిధుల ముఠా ఆలయాన్ని తమ స్వార్థం కోసం ధ్వంసం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని ఊరేగించే వాహనాలు, పంచలోహ విగ్రహాలు మాత్రం మిగిలాయి. ● దొరల కాలంలో యల్లంపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మితం చేశారు. ఆలయంలో రాతి విగ్రహామూర్తులు ఉండేవి. అయితే ఇక్కడ ఎక్కడాలేని విధంగా చెక్క విగ్రహాలే మూలవిరాట్టులు చేసి, పూజలు నిర్వహించేవారు. పంచలోహవిగ్రహాలే ఉత్సవ మూర్తులుగా నిర్వహించేవారు. ఏటా పెద్దఎత్తున యల్లంపేట తిరునాల జరిగేది. 8రోజుల పాటు తిరునాల నిర్వహించేవారు. ● ఆలయానికి సోమశిల నష్టపరిహారం చెల్లించారు. రెవెన్యూ డిపాజిట్ చేశారు. అప్పట్లో రూ.80లక్షలు ఉన్నట్లు సమాచారం. ● గ్రామాన్ని వదలివెళ్లినప్పటికి గ్రామస్తులు ఏటా శ్రీ రుక్మిణ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం రోజున అందరూ ఏకమవుతారు. గ్రామంలేకున్నా స్వామిని మాత్రం భక్తులు మరవేలదనడానికి ఇదే నిదర్శనం. మొన్నటి వరకు ఒంటిమిట్ట రామాలయంలో..ఇప్పుడు సౌమ్యనాథాలయం(నందలూరు)లో పంచలోహ విగ్రహాలు భద్రపరిచారు. ఈ విగ్రహాలతో స్వామివారి కల్యాణం నిర్వహించుకునేవారు. వాహన సేవలకు సంబంధించిన వాహనాలు కూడా ఉన్నాయి. ● రాజంపేట మండలంలో యల్లంపేట వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి కేటాయించిన స్థలం వివాదంలో ఉందని భక్తులు చెపుతున్నారు. బ్యాక్‌వాటర్‌లో వేణుగోపాలస్వామి ఆలయం మునక అయినా యల్లంపేట గ్రామస్తుల్లో తరగని భక్తిభావం ఏటా ‘వేణు గోపాలస్వామి కల్యాణం -
కడప కమిషనర్‌గా హెచ్ఎస్ భావన
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ కమి షనర్‌గా రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనను నియమిస్తూ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. కడప కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలతో పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రను రిలీవ్ చేశారు. కడప కమిషనర్‌గా భావన వెంటనే బాధ్యతలు స్వీకరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జమ్మలమడుగు: నారాపుర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. రకరకాల పూలు ఒక్కచోటకు చేరి స్వామి సన్నిధి లో కొలువుదీరాయి. వేదపండితులు నారాపురస్వామికి ప్రత్యేక అలంకారం నిర్వహించారు. పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కడప సెవెన్‌రోడ్స్: జిల్లా యువతకు నైపుణ్య నిధిగా, రాష్ట్రానికే స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటున్న ‘స్టార్ట్ అప్ కడప‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ అతి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని ిపీ4 విధానం ద్వారా ఇన్నోవేటీవ్ గా నిర్మిస్తున్న ‘స్టార్ట్ అప్ కడప‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని కడప నగర నూతన కమిషనర్ భావనతో కలిసి పరిశీలించారు. బాహ్య నిర్మాణ పనులను పూర్తిగా వారంలోగా కంప్లీట్ చేయాలన్నారు. స్టార్టప్ కడప’’కేవలం ఒక భవనం మాత్రమే కాదని.. ఇది యువత కలలకు రూపురేఖలు ఇచ్చే వేదిక అన్నారు. ఆవిష్కరణ, ఆధునికత, అభివృద్ధికి దిక్సూచిగా నిలవనుందన్నారు. -
ప్రజలు సంయమనం పాటించాలి
కడప కారొపరేషన్/చింతకొమ్మదిన్నె : కడప నగరం అల్మాస్‌పేట ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ సంయమనం పాటించాలని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా కోరారు. సీకే దిన్నె, రిమ్స్, చిన్నచౌక్, వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఉన్న యువతను, వారి కుటుంబాలను అంజద్‌బాష పరామర్శించారు. పోలీసులు సంఘటనకు సంబంధం లేని వారిని కూడా అదుపులోకి తీసుకున్నారని, మరోసారి విచారించి సంబంధం లేని వారిని విడుదల చేయాలని ఆయన కోరారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసే జీవించే సంప్రదాయం కడపలో ఉందని, ఎప్పటికీ కడపలో సామరస్యపు జెండానే ఎగురుతుందన్నారు. ఉన్నతాధికారులతో, మత పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. అల్మాస్‌పేటలో జిల్లా అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగా శనివారం దురదృష్టకర సంఘటన జరిగిందని, ఇది చాలా బాధాకరమని అన్నారు.ఆదివారం చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్లో నిర్భందించిన ఇరువర్గాల వారిని అయన పీస్ కమిటీ మెంబర్, వైఎస్సార్ సీపీ నాయకుడు సుభాన్బాషాతో కలిసి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ కడప నగరం మత సామరస్యానికి ప్రతీక అన్నారు. అలాంటి కడపలో జరిగిన దురదష్టకరమైన సంఘటనను ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా పరామర్శ -
భక్తుల వాహనాన్ని ఢీకొన్న లారీ
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆదివారం వేకువజామున ముంబై టు చైన్నె జాతీయ రహదారిలో ఉన్న రాయల్ వుడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి, తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా, పుట్లూరు మండలం, కడవకల్లు గ్రామానికి చెందిన 60మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో వెళ్లే క్రమంలో మదనపల్లె బైపాస్ లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గరకు ఐషర్ లారీ రాగానే వెనకనే వచ్చిన మరో లారీ ఐషర్ను ఢీకొంది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు అయ్యాయి, మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారు రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి (25), లక్ష్మీనారాయణ (42)లకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర (13), అశ్వని (28), లక్ష్మీదేవి (52), రమాశ్రీ (38), అరుణ (36), పుల్లమ్మ (35), గంగాధర్ (16), వెంకటరాయుడు (55), కుల్లాయమ్మ (42), శివశంకర్ (32), లక్ష్మి (31), రాజా (15), లక్ష్మీదేవి (32), భవ్యశ్రీ (13) మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి, ఎస్ఐ నాగేశ్వర్ రావు తెలిపారు.16మందికి గాయాలు -
వైఎస్సార్సీపీ సోషియల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసు
లక్కిరెడ్డిపల్లి : అన్నమయ్య జిల్లా అప్పకొండయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సోషియల్ మీడియా కార్యకర్త లక్ష్మీరెడ్డిపై గిద్దలూరు పోలీసు స్టేషన్లో అక్రమంగా కేసు బనాయించి విచారణ నిమిత్తం విశాఖపట్నం నుంచి గిద్దలూరుకు తీసుకొచ్చి రాత్రంతా పోలీసు స్టేషన్లో పెట్టినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో లక్కిరెడ్డిపల్లి మండలంలోని అప్పకొండయ్యగారిపల్లికు వచ్చిన గిద్దలూరు పోలీసులు విచారణ నిమిత్తం లక్ష్మీరెడ్డి సోదరుడుని విచారించి విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకుంటున్న లక్ష్మీరెడ్డిని శనివారం అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం గిద్దలూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు కాకునూరి హిమశేఖర్ రెడ్డి ఆదివారం బాధిత వ్యక్తులకు బెయిల్ ఇప్పించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
వాల్మీకిపురం : గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో పోస్టల్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలోని చింతలవారిపల్లి సమీపంలోని నేషనల్ హైవేపై చోటు చేసుకొంది. వివరాలు.. సోమల మండలం, కందూరుకు చెందిన ప్రభాకర్ ఇదే పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లిలో పోస్ట్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సొంత పనుల నిమిత్తం గుర్రంకొండ మండలం, రామాపురంలోని తన మేనమామ ఇంటికి ద్విచక్రవాహనంపై వచ్చి, తిరిగి ప్రయాణమయ్యాడు. మండలంలోని చింతలవారిపల్లి హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఢీకొన్న వాహనం లారీగా గుర్తించి, తిరుపతిలో సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొని.. రామాపురం : మండలంలోని బండపల్లి టోల్గేట్ సమీపంలో శనివారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని బైక్ ఢీకొనడంతో తీగల భార్గవాచారి(41) అక్కడిక్కడికే దుర్మరణం చెందినట్లు రామాపురం ఎస్సె శివకుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు రాయచోటి నుంచి కడప వెళుతున్న లారీకి పంచర్ కావడంతో బండపల్లి టోల్గేట్ సమీపంలో నిలిపి మరమతులు చేపడుతున్నారు. ఇదే సమయంలో రాత్రి 11 గంటలకు రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న స్కూటీ ఆగి ఉన్న లారీ వెనుక భాగంలో బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న తీగల భార్గవాచారి(41)తలకు బలమైన గాయమై అక్కడిక్కడికే మృతి చెందాడు.మృతుడు రామాపురం మండలం సుద్దమల్ల గ్రామంలోని ఎర్రంరెడ్డిపల్లికి చెందిన వాడు కాగా, ప్రస్తుతం రాయచోటి పట్టణం కొత్తపేటలోని చౌడేశ్వరీ దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.గుండెపోటుకు గురై యువకుడు..చౌడేపల్లె : గుండెపోటుకు గురై యువకుడు వెంకటేష్(29)మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి.. పరికిదొన పంచాయతీ ఎగువమల్లెలవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు వెంకటేష్ సహచర స్నేహితులతో కలిసి ఉదయంనుంచి 11 గంటల వరకు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు.అనంతరం ఇంటికివచ్చిన వెంకటేష్ స్నానం చేసి విశ్రాంతి తీసుకొన్నాడు.అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చౌడేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే వెంకటేష్ మృతిచెందినట్లు నిర్ధారించడంతో వెనుతిరిగారు.వెంకటేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకొన్నాయి. మృతుడి భార్య నాలుగునెలల గర్ణిణీ.భర్త మృతితో ఆమె, కన్న బిడ్డ మృతితో తల్లిదండ్రుల రోధన పలువురిని కలచివేసింది. -
సుందరయ్య కుటుంబానికి న్యాయం చేయాలి
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీలో 75 ఏళ్ల వృద్ధ రైతు భూమిని ఆక్రమించేందుకు యత్నించి, కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రత్యర్థులు దాడి చేయడంతో బాధితులు ఆదివారం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. వారిని పరామర్శించిన సీపీఐ నాయకులు కష్ణప్ప, సాంబశివ, శ్రావణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, దేలకుప్పానికి చెందిన సుందరయ్యకు సర్వే నంబర్ 32/12లో 1.9 సెంట్ల పట్టా భూమి ఉందన్నారు. ఆదివారం ఉప్పరపల్లి పంచాయతీ నాగిళ్లవారిపల్లికి చెందిన యదుశేఖర్ నాయుడు, కోటినాయుడు తమ అనుచరులతో వచ్చి సుందరయ్య భూమిని జేసీబీతో ఆక్రమించేందుకు యత్నించారు. అడ్డు వెళ్లిన సుందరయ్య, ఆయన కుమారుడు, కోడలిని కొట్టి సెల్ ఫోన్లు లాక్కొని దుర్భాషలాడుతూ ‘‘అడ్డొస్తే జేసీబీతో తొక్కిస్తాం’’ అంటూ బెదిరించారన్నారు. భూమిలో ఉన్న మామిడి చెట్లు, ఫారం పాండ్ ట్యాంక్, రాతి కూసాలు, కంచె ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో సుమారు రూ.10 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గాయపడతాము చేసేదిలేక మదనపల్లి ప్రభుత్వాసుపత్రుల చేరి చికిత్స పొందుతున్నామని వాపోయారు. -
13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
కాశినాయన : మండలంలోని ఆనంవారిపల్లె గ్రామంలో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈనెల 13న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మొదటి బహుమతి హోండా యూనికాన్ బైక్, రెండో బహుమతి హోండా షైన్, మూడో బహుమతిగా రూ.80వేలు గెలుపొందిన ఎడ్ల యజమానులకు అందిస్తామని వారు వివరించారు. పోటీల్లో పాల్గొనదలచిన రైతులు 13న మధ్యాహ్నం తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441337657 నంబర్లో సంప్రదించాలని కోరారు. బంగారు, వెండి నగల చోరీ పెద్దతిప్పసముద్రం : మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ ఉప్పరవాండ్లపల్లిలో మావిళ్ల చెన్నకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. చెన్నకృష్ణ సోదరుడు లక్ష్మినారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా.. చెన్నకృష్ణ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ 15 రోజులకోసారి కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఆయన ఎప్పటి లాగానే భార్యా, పిల్లలను వెంట బెట్టుకుని ఉద్యోగరీత్యా తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయాడు. ఈ తరుణంలో ఈ నెల 8న గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు, సుమారు 200ల గ్రాముల బంగారంతో పాటు వెండి నగలు అపహరించుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న ములకలచెరువు సీఐ దస్తగిరి, ఎస్ఐ పరమేశ్ నాయక్‌లు సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చోరీకి పాల్పడింది స్థానికులా, బయట వ్యక్తులా, అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.రైలు కింద పడి వ్యక్తి మృతిపీలేరు రూరల్ : రైలు కింద పడి గుర్తతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలోని రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో జరిగింది. వివరాలిలావున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ముంబై నుంచి నాగర్‌కోయిల్ వెళుతున్న రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి రైల్వేపోలీసుల కు సమాచారం ఇచ్చారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఒంటికి నిప్పు అంటించుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. బి. కొత్తకోటకు చెందిన వై. వెంకటరమణారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి (30) కొంతకాలం క్రితం ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండేళ్ల తర్వాత ఇంటికి రావడంతో కుటుంబీకులు మహేందర్‌రెడ్డి తీరు మార్చుకొని బుద్ధిగా ఇంటివద్దే ఉండాలని మందలించారు. దీంతో అతను తీవ్ర మనస్థాపం చెంది, ఇంట్లో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితుడుని చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. దీంతో మహేందర్ రెడ్డిని ఓ ప్రైవేట్ వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాముకాటుతో మహిళ మృతి
వాల్మీకిపురం : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని ఫత్తేపురంలో ఆదివారం చోటు చేసుకొంది. వివరాలు.. వాల్మీకిపురం పంచాయతీ ఫత్తేపురానికి చెందిన అంజి భార్య యమున (38) ఆదివారం ఉదయం ఇంటి ముందు చెత్త ఊడుస్తుండగా పాము కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ నుంచి మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయాకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. యమున భర్త అంజి గతంలో మృతి చెందగా.. ఇద్దరి పిల్లల ఆలనాపాలనా చూసుకుంటుండగా యమున మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాము కాటేసి వ్యక్తికి అస్వస్థతమదనపల్లె టౌన్ : పొలంలో దోస కాయలు కోస్తుండగా విష సర్పం కాటేసి కూలి పనులకు వచ్చిన సత్యసాయి జిల్లా వాసి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై వివరాలు.. సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, కొక్కంటి క్రాస్ లో నివాసం ఉంటున్న గోపాల్ కుమారుడు రవి (48) ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు సాగుచేసిన దోసకాయ పంటను వడపడానికి ఓ టెంపోలో కూలీలను తీసుకొని చిత్తూరు జిల్లా, చౌడేపల్లి సమీపంలోని బోయకొండకు ఆదివారం ఉదయం వచ్చాడు. కూలీలతో దోస కాయలు కోయిస్తుండగా చెట్ల మధ్యన ఉన్న విష సర్పం రవి కాలిపై కాటేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని సహచరులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. దీంతో రవి ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నాడు. -
ప్రాణం తీసిన ఈత సరదా
బద్వేలు అర్బన్ : ఈత నేర్చుకునేందుకు స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ బాలుడు మృతిచెందిన ఘటన ఆదివారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామానికి చెందిన దాసరినారాయణ, రమాదేవి దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వ్యాపార నిమిత్తం గత కొన్నేళ్లుగా వీరు పట్టణంలోని మార్తోమానగర్లో నివసిస్తున్నారు. వీరి కుమారుడైన దాసరిఅర్జున్ (10) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేశాడు. ఈత నేర్చుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం పోరుమామిళ్ల బైపాస్‌రోడ్డులోని స్విమ్మింగ్‌పూల్‌కు అర్జున్ తన సోదరితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. నడుముకు ట్యూబ్ వేసుకుని నీటిలోకి దిగిన అర్జున్ కొద్దిసేపటికి ట్యూబ్ తీసేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వారించి మళ్లీ ట్యూబ్ వేసుకుని స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగమని సూచించారు. అయితే కొద్దిసేపటికి మళ్లీ ట్యూబ్ తీసేసిన అర్జున్ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి దిగడంతో నీటిలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు అర్జున్ను స్విమ్మింగ్‌పూల్ నుంచి బయటికి తీసుకువచ్చి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సరదాగా ఈతకు వెళ్ళి ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృ తిచెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని తల్లిదండ్రులు దమ్మనపల్లె గ్రామానికి తీసుకెళ్లారు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతి -
మతసామరస్యాన్ని కాపాడేందుకు కృషి
● 13 వరకు టూ టౌన్, వన్ టౌన్ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ● కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్కడప : కడపలోని అల్మాస్‌పేట సర్కిల్లో ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన సంఘటన దురదృష్టకరం, మతసామరస్యం కలిగిన దేశంగా మన దేశాన్ని పిలుస్తారని ఇందుకు ప్రతి వర్గం వారు కట్టుబడి ఉండాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ తెలియజేశారు. కడప అల్మాస్‌పేట వద్ద హనుమాన్ సర్కిల్ అని ఒక వర్గం వారు, టిప్పు సుల్తాన్ సర్కిల్ అని ఒక వర్గం వారు పరస్పరం రాళ్లు రువ్వుకునేందుకు ప్రేరేపించారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే నిందితులను గుర్తించామని కొందరు అదుపులో ఉన్నారని, కొందరు పరారీలో ఉన్నారన్నారు. 144 సెక్షన్ కడప టూ టౌన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈనెల 13వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. తరువాత పరిస్థితిని బట్టి 144 సెక్షన్‌ను సడలింపు చేస్తామన్నారు. ఈ క్రమంలోనే పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, కడప ఇన్ఛార్జ్ డిఎస్పీ బాలస్వామిరెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా కడప అల్మాస్‌పేట సర్కిల్ ఈనెల 9న ఉద్రిక్తతల మధ్య అట్టుడికిపోయింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆదివారం నిర్మానుష్యంగా మారింది. అల్మాస్‌పేట ఘటనలో 60మందిపై కేసుకడప అర్బన్ : కడపలోని అల్మాస్‌పేట సర్కిల్లో ఈనెల 9వ తేదీన రాళ్లు రువ్వుకున్న సంఘటనలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు దాదాపు 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులలో కొందరు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం. -
కియా కంపెనీలో అట్లూరు మండలవాసి మృతి
అట్లూరు : విధి నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లా కియా కంపెనీలో అట్లూరు మండలం జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు (24) కియా కంపెనీలో విధులు నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. మృతుని తల్లి, తమ్ముడు, చెల్లెలు ఇదివరకే మృతి చెందారు. తండ్రి లక్షుమయ్య ఉన్న ఒక్క కొడుకు రామాంజనేయులను కూలి పనులు చేసుకుంటూ బీటెక్ చదివించాడు. రామాంజనేయులు ఆరు నెలల కిందట కియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు రామాంజనేయులు మిషనరీలో పడి మృతి చెందాడు. విషయాన్ని కియా కంపెనీ యాజమాన్యం బంధువులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆదివారం జొన్నవరం ఎస్సీ కాలనీకి రామాజంనేయులు మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి
శాంతిసౌభ్రాతృత్వాలతో మెలగాలి మతసామరస్యానికి, స్నేహభావానికి ప్రతీక కడప అని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా శతాబ్దాల చరిత్ర కలిగిన కడపలో విద్వేషాలకు తావు లేదన్నారు. ఎవరికి వారు సమన్వయం ప్రదర్శించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా మతసామరస్యాన్ని, సోదర భావాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తూ ఆదర్శవంతమైన కడపను కొనసాగించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. సోదర భావానికి ప్రతీక వైఎస్సార్ కడప జిల్లాతో పాటు కడప నగరం సోదర భావానికి ప్రతీక అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. నగరంలో కొన్ని దుష్ట శక్తుల స్వార్థపూరిత ప్రేరేపణల కారణంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం దురదుష్టకరమన్నారు. దుష్టశక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విజ్ఞులైన కడప ప్రజలు దుష్టశక్తుల ప్రయత్నాలను విఫలం చేసి దేశానికి ఆదర్శవంతంగా నిలవాలని కోరారు. మత సామరస్యానికి నిలయం కడప కడప నగరం మతసామరస్యానికి నిలయమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాష అన్నారు. కడప చరిత్రలో ఎన్నడూ జరగని దురదృష్ట సంఘటన అల్మాస్‌పేట సర్కిల్లో చోటుచేసుకుందన్నారు. అన్ని మతాల పండుగలు, ప్రార్థనలకు నిలయమైన కడపలో ఎప్పుడూ పరమత ద్వేషాలకు తావులేదన్నారు. పెద్దలు చూపించిన ప్రేమ, పరస్పర గౌరవం, ఐక్యత కడప సంస్కృతికి మూలస్తంభాలని, కొంతమంది చేసే ప్రేరేపిత చర్యల వల్ల శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆజాద్‌నగర్‌కు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ మహబూబ్‌బాషా(20), అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన బాబావలి కుమారుడు ఖాసీంవలీ(18) బంధువులు. రెండు రోజుల క్రితం మహబూబ్ బాషా అనంతపురానికి వచ్చాడు. శుక్రవారం ఖాసీంవలీతో కలిసి విద్యుత్‌నగర్ సర్కిల్ నుంచి సంఘమేష్ సర్కిల్ వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ.. రమణ రమేష్ థియేటర్ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖాసీంవలీని కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. అనంతపురం ఆస్పత్రిలోనే మహబూబ్‌బాషాకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. ఘటనపై అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చక్కగా అమలు చేస్తోందన్నారు. జిల్లాలో రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ.300 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రాంతంలో రూ.90 కోట్లతో రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. పొట్టిపాడు రోడ్డులో 220 కేవీ సబ్‌స్టేషన్‌ను మంజూరు చేయించామన్నారు. కార్యక్రమంలో టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, నాయకులు నంద్యాల కొండారెడ్డి, రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, సీఎం సురేష్‌నాయుడు, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీఎస్ ముక్తియార్, ఆసం రఘురామిరెడ్డి, మహేశ్వరరెడ్డి, టీడీపీ పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, వక్ఫ్‌బోర్డు స్టేట్ డైరెక్టర్ జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. యువకుడు ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : ఎలుకల నివారణ మందు తాగి ఓ డ్రైవర్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చౌడేపల్లి మండలంలోని ఆమనకుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు చందు(27) ప్రైవేట్ వాహనాలకు డ్రైవర్‌గా పని చేస్తూ, తల్లిదండ్రులతోపాటు భార్య, పిల్లలను పోషించుకుంటూ ఉన్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
పోరుమామిళ్ల : చిన్న యరసాల సమీపంలోని అప్పన్నబావి దగ్గర ఈనెల 5న మానేపాటి సురేష్(30)ను చంపి, కాల్చివేసిన ఘటనలో నిందితులు షేక్ జాఫర్‌వల్లి, అతని భార్య హాసీనాలను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ హేమసుందరరావు, ఎస్ఐ హనుమంతు తెలిపారు. ప్రొద్దుటూరుటౌన్ ఆర్ట్స్‌కాలేజీ రోడ్డు గురవయ్యతోటకు చెందిన జాఫర్‌వల్లి దంపతులు కోతులు పట్టుకునే వృత్తిలో ఉన్నారన్నారు. సురేష్ భార్య వెంకటేశ్వరితో శారీరక సంబంధం పెట్టుకున్న జాఫర్ వల్లి ఆమెను వివాహం చేసుకునేందుకు.. సురేష్ అడ్డుగా ఉన్నాడని భావించి హత్యకు ప్లాన్ చేశాడన్నారు. 5వ తేది రాత్రి రాయితో ముఖంపై కొట్టి, కిందపడ్డ సురేష్‌ను జాఫర్‌వలి, హసీనాలు చంపి, అప్పన్నబావిలో వేసి చెత్తలో కాల్చి వేశారన్నారు. ఈ విషయం వెంకటేశ్వరికి చెప్పి, బయటికి చెపితే చంపుతామని బెదిరించారన్నారు. వెంకటేశ్వరి వారి నుంచి తప్పించుకొని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. శనివారం మధ్యాహ్నం నిందితులను సీతారామపురం క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజుల్లోనే విశ్వసనీయ సమాచారంతో నిందితులను అరెస్టు చేశామన్నారు. దీనిపై మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పోరుమామిళ్ల సిబ్బందిని అభినందించారన్నారు. -
కోట అందం.. చూసొద్దాం
● రాజరికానికి దర్పణం గుర్రంకొండ కోట ● అన్నమయ్య జిల్లాకు మణిహారం ● నిత్యం పర్యాటకుల సందడిగుర్రంకొండ : వేసవి సెలవుల్లో పిల్లలు, పెద్దలు చూడదగిన ప్రదేశం చారిత్రాత్మాక గుర్రంకొండ కోట. అన్నమయ్య జిల్లాలో రాచరికానికి, నవాబులు, రాజులు, బ్రిటీషు వారి పాలనకు నిలువుటద్దం ఈ కోట. జిల్లాకు నడిబొడ్డున ఒక మణిహారంలా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. 14 వ శతాబ్దం నుంచి ఈ కోటను పలు వంశాలకు చెందిన రాజులు, నవాబులు పరిపాలించారు. ముఖ్యంగా కడప నవాబు పరిపాలనలో ఇది పేరుగాంచింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దేవాలయాలు, ఎన్నో చెరువులు ఉన్నాయి. మైసూర్ రాజు టిప్పు సూల్తాన్ బాల్యం, విద్యాభాస్యం ఇక్కడే గడిచింది. చివరగా బ్రిటీషు వారితో ఇక్కడ రాజరిక పాలనకు తెరపడింది. ఘన చరిత్ర కలిగిన ఈ కోటలో ఎన్నో విశేషాలు, చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో ఇక్కడి విశేషాలను తిలకించడానికి మన రాష్ట్రం నుంచే కాక కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. మనం కూడా ఒకసారి చూసొద్దాం రండీ. రంగిణీ మహల్ గుర్రంకొంట కోటలో చూడదగిన ముఖ్య ప్రదేశం రంగిణీమహల్. పురాతన రాజభవనం. ముందువైపు నుంచి రెండు అంతస్తులుగానూ, వెనకవైపు నుంచి మూడు అంతస్తులు నూ కనిపించడం దీని ప్రత్యేకత. ఎన్నో గదులు, ఓ గదిలో భవనం లోపలి నుంచి సొరంగ మార్గం ఉంది. శత్రురాజులు దండెత్తినప్పుడు ఈ మార్గం గుండా కోట బయటికి వెళ్లేందుకు ఆస్కారం ఉండేది. పురాతన మెట్లు, సమావేశపు గదులు రాజరికానికి నిలుటద్దంగా నిలుస్తాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గుర్రంకొండ కోటను విజయనగర రాజులు పాలించే కాలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని.. అప్పటి పాలకులు శ్రీకృష్ణ దేవరాయులు కోటలోని కొండపైభాగంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. శిల్పకళాసౌందర్యంతో ఈ దేవాలయ స్తంభాలు ఇట్టే ఆకట్టుకొంటాయి. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా నిర్మిస్తే.. దీన్ని పశ్చిమముఖంగా నిర్మించడం విశేషం. ఇక్కడి నుంచి చూస్తే గుర్రంకొండ పట్టణంతోపాటు పరిసర గ్రామాల పచ్చటి పొలాలు, రాయల కాలం నాటి చెరువులు కనిపిస్తాయి. కోట ముఖద్వారం గుర్రంకొండను రాజులు పరిపాలించే కాలంలో కొండ చుట్టూ కోటగోడలను నిర్మించారు. కోటగోడల చుట్టూ కందకాలు తవ్వారు. ఈ కందకాల్లో నీటిని నింపేవారు. శత్రువులు కోటగోడలు ఎక్కకుండా ఆ నీటిలో మొసళ్లను వదిలేవారు. అలాంటి కోటకు ముఖద్వారాన్ని నిర్మించారు. ఈ ద్వారం నుంచే ఎవరైనా కోటలోకి ప్రవేశించే వారు. పురాతన కట్టడంగా ఇది నిలుస్తోంది. మగ్బీరా కోట పక్కనే మగ్బీరా ఉంది. పురాతన మహమ్మదీయుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కట్టడం ఇది. మగ్బీరా అంటే సమాధి. గుర్రంకొండ కోటను టిప్పుసుల్తాన్ మేనమామ మీర్రజాఆలీఖాన్ పాలించే వారు. అతను మృతి చెందిన తరువాత సమాధిని మగ్బీరాగా నిర్మించారు. డూమ్‌లో చేసే శబ్దాలు ప్రతి ధ్వనించడం(రీసౌండ్) ఇక్కడి ప్రత్యేకత. షాహజాదీ మసీదు టిప్పు సుల్తాన్ కాలంలో రాజవంశీయుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన మసీదు ఇది. పూర్తిగా రాతితోనే నిర్మించారు. ప్రస్తుతం దీన్ని పూర్తి స్థాయిలో ఆధునికరించారు. ఇలాంటివి కోట పరిసరాల్లో మరో రెండు ఉన్నాయి. షాకమాల్ దర్గా మైసూర్ పాలకులు, అప్పటి గుర్రంకొండ కోట పాలకులు అయిన టిప్పు సుల్తాన్ ఆస్థాన గురువు షాకమాల్ దువ్వమ్. ఆయన ఈజిప్టు దేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన గొప్పతనం విన్న అప్పటి మైసూర్ పాలకులు హైదరాలీ తన కుమారుడు టిప్పుసుల్తాన్ను గుర్రంకొండలోని అతని మేనమామ మీర్రజా ఆలీఖాన్ వద్ద ఉంచి షాకమాల్ దగ్గర విద్యాబుద్ధులు నేర్పించారు. తదనంతర కాలంలో షాకమాల్ దువ్వమ్ టిప్పుసుల్తాన్ గురువుగా నియమింపబడ్డాడు. ఇతని సమాధినే ఇక్కడ గొప్ప దర్గాగా ప్రజలు కొలుస్తారు. ఇంకా చూడదగిన విశేషాలు ● కొండపైన కోట బురుజులు, పురాతన కట్టడాలు, పురాతన ఇళ్లు ఉన్నాయి. అక్కడికి చేరుకోవడానికి మెట్లమార్గం కూడా ఉంది. ● కోటలో శిథిలావస్థకు చేరుకొన్న అలనాటి ఆస్పత్రి భవనం ఉంది. ● శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయాలు, టిప్పుసుల్తాన్ కాలం నాటి ఈద్గాలు ఉన్నాయి. ● గుర్రంకొండ పట్టణంలో శ్రీ షాకమాల్ దర్గా దగ్గర టిప్పుసుల్తాన్ చదువుకొన్న పాఠశాల యూసూఫ్ సాహేబ్ తకియా ఉంది.ముందువైపు నుంచి రెండు అంతస్తులుగా కనిపిస్తున్న రంగిణీమహల్వెనుకవైపు నుంచి మూడు అంతస్తులుగా కనిపిస్తున్న రంగిణీ మహల్ -
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు
– కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి భద్రతా, రక్షణ చర్యలను పటిష్టం చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ లు సంయుక్తంగా పేర్కొన్నారు. కడపలోని అల్మాస్ పేట సర్కిల్లో శనివారం ఉదయం చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో రాత్రి కలెక్టర్, ఎస్పీలతోపాటు జేసీ డాక్టర్ నిధి మీనా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది అసాంఘిక దుష్టశక్తుల ప్రభావం వల్లనే అల్మాన్ పేటలో అల్లర్లు చోటు చేసుకున్నాయని, మత సామరస్యానికి ప్రతీక అయిన కడప నగరాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం యాధృచ్ఛికమే అన్నారు. ప్రజలను వెంటనే ప్రభావితం చేసే సోషల్ మీడియా ద్వారా కొంత అవాస్తవ ప్రచారం ప్రజల్లోకి వెళుతోందని, వాస్తవాలను అందించేలా సామాజిక మాధ్యమాలు ఉండాలి తప్ప ప్రజలను భయగోలిపేలా, రెచ్చగొట్టేలా ఉండకూడదన్నారు. అల్లర్లకు కారణమైన వాటిపై చర్యలు తీసుకుని భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు తావులేకుండా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేసి అల్లర్ల ప్రభావం, ఉనికి ఎక్కడా కనిపించకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజలు సమైఖ్య భావంతో నడిచేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. జిల్లా, నగర ప్రజలకు ఎలాంటి శాంతికి విగాధం లేకుండా జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. కడప మత సామరస్యాన్ని కాపాడాలి కడప నగరం ఎప్పటి నుంచో మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, అలాంటి ప్రాంతంలో విద్వేషాలకు, అల్లర్లకు తావిచ్చే దుష్టశక్తులను ఏమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. కడపలోని అల్మాస్‌పేట సర్కిల్ వద్ద చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో శనివారం రాత్రి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి.. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌తో కలిసి.. జిల్లాలోని అన్ని మతాల సంఘ పెద్దలతో జిల్లా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మతాల పండుగలు, ప్రార్థనలకు నిలయమైన కడప నగరంలో పరమత ద్వేషాలకు ఎప్పుడూ తావులేదని స్పష్టం చేశారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ. రాజకీయ ప్రయోజనాల కోసం మత ఘర్షణలను ప్రేరేపించడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఐక్యతకు ప్రతీక అయిన కడపలో విద్వేషాలకు స్థానం లేదని, అల్లర్లకు పాల్పడిన వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ సంయమనంతో వ్యవహరించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు అల్మాస్ పేట సర్కిల్ కు సంబంధించి.. పేరు మార్పును ఆకాంక్షించే వారి తరపు అభిప్రాయాలను, సలహాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ లకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, జిల్లాలోని హిందు, ముస్లిం మత పెద్దలు సామాజిక సంఘాల పెద్దలైన శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అల్మాస్‌పేటలో పర్యటిస్తున్న కలెక్టర్, ఎస్పీ, జేసీ తదితరులు, శాంతికమిటీ సమావేశంలో పాల్గొన్న అధికారులు, మత పెద్దలు, నగర ప్రముఖులు -
ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల చేతివాటం
మైదుకూరు : మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఉదయం ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ బ్యాగ్ నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. మైదుకూరు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లెకు చెందిన కంసల సుభాన్బీకి ప్రొద్దుటూరు ఈశ్వర్‌రెడ్డి నగర్‌కు చెందిన అబ్దుల్ ఖాదర్‌తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వరుసకు తమ్ముడైన యువకుని పెళ్లి కోసం ప్రొద్దుటూరు నుంచి సుభాన్ బీ 7వ తేదీ శెట్టివారిపల్లెకు వచ్చింది. వివాహం అనంతరం 9వ తేదీ (శనివారం) ప్రొద్దుటూరుకు వెళ్లేందుకు మైదుకూరు బస్టాండ్‌కు వచ్చింది. మైదుకూరు బస్టాండ్‌లో ఉదయం 8.45 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కి టికెట్ కోసం ఆధార్‌కార్డు తీసేందుకు బ్యాగ్‌లో ఉన్న పర్సు తీయబోయింది. అప్పటికే పర్సు జిప్ తెరిచి ఉండటంతో కంగారుపడి పర్సులో వెతకగా.. అందులో ఉంచిన నల్లపూసల దండ, లాంగ్ చైన్, హారం తదితర 10 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంటనే బస్సు దిగిన ఆమె భర్తకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వారంతా మైదుకూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. పీఎండీఎస్‌తో ప్రధాన పంటకు రక్షణమైదుకూరు : ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసే పీఎండీఎస్ (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్)తో ప్రధాన పంటకు రక్షణ కలుగుతుందని మైదుకూరు మండలం వనిపెంటలోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. శనివారం మండలంలోని ఆదిరెడ్డిపల్లె, తిప్పిరెడ్డిపల్లెలో రైతులు సాగు చేసిన అరటి పంటలో పీఎండీఎస్ కింద 20 ఎకరాల విత్తనాలను వెదజల్లారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీవిద్యారాణి, డాక్టర్ కాంతిశ్రీ, డాక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ అరటి పంటలో పీఎండీఎస్‌తో ఏర్పడే పచ్చదనంతో అరటి పంటకు వేడి నుంచి రక్షణ కలుగుతుందన్నారు. అదే విధంగా 45–50 రోజుల పాటు కలుపును నివారించవచ్చని పేర్కొన్నారు. అనంతరం 20 రకాల విత్తనాలతో మొలిచిన పంటలతో ఆదాయం పొందడమే కాక పశువుల మేతకు వాడుకోవచ్చని తెలిపారు. ఇంకా మిగిలిన దానిని కలియదున్నితే ప్రధాన పంటకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పసుపు పంటపై మహిళా రైతులతో చర్చించారు. సమతుల్యత ఎరువులను వినియోగించాలని సూచించారు. పసుపు పంటను ఎత్తు మడులలో సాగు చేయాలని తెలిపారు. హక్కుల సాధనకు దళిత క్రైస్తవులు పోరాడాలికడప రూరల్ : హక్కుల సాధన కోసం దళిత క్రైస్తవులు నడుం బిగించాలని అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పాత రిమ్స్‌లో గల బీసీ భవన్లో దళిత క్రైసవ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కుల కోసం మాల, మాదిగ వర్గానికి చెందిన సోదరులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఈ అంశానికి సంబంధించి క్రైసవ సంఘాలన్నీ ఏకం కావాలన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ, అనుబంధ సంస్థలకు చెందిన వారు ప్రమాదకంగా మారారన్నారు. ఆ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో గాలి చంద్ర, డేనియల్, రమేష్ బాబు, సంగటి మనోహర్, మల్లెం భాస్కర్, జయరాజు, పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. అదనపు రైల్వేబోర్డు సభ్యుడిగా కె.వి.రెడ్డిపీలేరు రూరల్ : భారతీయ రైల్వే బోర్డులో అత్యుతన్నత గ్రేడ్ 16 అదనపు రైల్వే బోర్డు సభ్యుడిగా పీలేరు ప్రాంతానికి చెందిన కె.వి.రెడ్డి (కె.వెంకటరమణారెడ్డి)కి పదోన్నతి లభించింది. కె.వి.రెడ్డి గుంతకల్లు డీఆర్ఎంగా, దక్షిణ మధ్య రైల్వేలో పీసీఎస్వోగా, ఐఆర్ఐఎస్ఈటీలో ప్రొఫెసర్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పీలేరు రైల్వే స్టేషన్‌ను అమృత్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేయడంలో, అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు పీలేరులో స్టాపేజీలకు విశేష కృషి చేశారు. ఆయన 1990 ఐఈఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.మహిళ బ్యాగ్ నుంచి బంగారు చోరీ -
● మాతృత్వానికే వన్నె తెచ్చిన నిర్ణయం
ప్రొద్దుటూరు క్రైం: తల్లి ప్రేమ వెలకట్టలేనిది.. త్యాగానికి మరో రూపం అమ్మ. కన్నబిడ్డ కోసం తన జీవితాన్నే ధారపోస్తున్న ఓ మాతృమూర్తి పోరాటం ప్రొద్దుటూరులో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒకవైపు ప్రాణాంతక వ్యాధితో క్షీణిస్తున్న కొడుకు.. మరోవైపు అతడిని కాపాడుకోవాలని తాపత్రయపడే తల్లి.. విధి ఆడిన ఈ వింత నాటకంలో ఆ తల్లి ప్రేమ ‘మందు’ లేని మహమ్మారిపై నిరంతర యుద్ధం చేస్తోంది. కలలు కన్న వేళ.. కీడు శంకించిన విధి ప్రొద్దుటూరు కొవ్వూరు గ్యారేజి సమీపంలో నివసించే పతంగె గిరిధర్‌రావుకు, 2013లో గుంతకల్లుకు చెందిన శిల్పతో వివాహమైంది. ఎంఏ హెచ్‌పీటీ చదివిన శిల్ప, వివాహానికి ముందు టీచర్‌గా పనిచేశారు. కుమారుడు శ్రీనివాసరావు పుట్టినప్పుడు ఆ దంపతులు ఎన్నో కలలు కన్నారు. అయితే, నాలుగేళ్ల వయసులో ఆ పసివాడికి ‘డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ’ (DMD) అనే అరుదైన కండరాల క్షీణత వ్యాధి సోకినట్లు తెలియడంతో వారి ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది. దేశమంతా తిరిగినా దొరకని మోక్షం బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్, కేరళలోని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా.. ‘ఈ వ్యాధికి మందు లేదు, కేవలం సేవ మాత్రమే శరణ్యం‘ అని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ తల్లి గుండె పగి లింది. అప్పటి నుంచి ఏడేళ్లుగా శిల్ప తన కొడు కు కోసం నిరంతర పోరాటం చేస్తూనే ఉంది. త్యాగమే తోడుగా.. శ్రీనివాసరావుకు ఇప్పుడు పదకొండేళ్లు. కానీ కనీసం నడవలేడు.. కూర్చోలేడు. సోఫాలో కూర్చోబెట్టినా ఎక్కడ కింద పడిపోతాడోనని శిల్ప క్షణం కూడా పక్క నుంచి తప్పుకోదు. అన్నం తినిపించడం దగ్గర నుంచి కాలకృత్యాల వరకు అన్నీ తానై చూసుకుంటోంది. ఇందుకోసం ఆమె తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ‘క్లౌడ్ కిచెన్’ వ్యాపారాన్ని, టీచర్ వృత్తిని వదులుకుంది. కొడుకుకు తోడుగా తానూ మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తింటూ, బాబుకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. కొడుకును కంటికి రెప్పలా గుండెలకు హత్తుకున్న అమ్మ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నచిన్నారి శ్రీనివాసరావు మరో మగ సంతానం కలిగినా ఇదే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఒక వేళ వారికి ఆడపిల్ల జన్మిస్తే ఆమెకు డీఎండీ వ్యాధి వచ్చే అవకాశం ఉండదని, అయితే భవిష్యత్తులో ఆ అమ్మాయికి పెళ్లై మగపిల్లాడు జన్మిస్తే మాత్రం బాలుడికి డీఎండీ వ్యాధి వస్తుందని వారన్నారు. ఈ కారణంగా శిల్ప మాతృత్వాన్ని త్యాగం చేసింది. శిల్ప తన మాతృత్వాన్నే త్యజించింది. ఉన్న ఒక్కగానొక్క కొడు కును సంతోషంగా ఉంచడమే తన జీవితాశయమని నిర్ణయించుకుంది. లోపల కట్టలు తెంచుకుంటున్న బాధ ఉన్నా, కొడుకు ముందు మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటుంది. ‘నేను ఏడిస్తే వాడు తట్టుకోలేడు‘ అంటూ కన్నీటిని దిగమింగుకుంటున్న ఆ తల్లి ప్రేమకు సాటి ఏది? వంద మంది దేవుళ్లు దిగి వచ్చినా అమ్మ చూపే అనురాగం ముందు తక్కువే అని శిల్ప నిరూపిస్తోంది. -
విద్యార్థి మృతిపై అన్నీ అనుమానాలే!
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మిద్దె పై నుంచి పడి మృతి చెందడం పాఠకులకు విదితమే. ఎంబీఏ విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసిన మదనపల్లె రెండవ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ.. పుంగనూరు మండలం కుక్కలపల్లికి చెందిన గంగరాజు(24) కురబలకోట మండలం అంగళ్ళులోని మిట్స్ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడని తెలిపారు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు గోవర్ధన్ నాయక్ మదనపల్లె ఇందిరా నగర్లో బాడుగకు ఉంటూ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీస్ సబార్డినేట్‌గా పని చేస్తున్నాడు. గంగరాజు ఇంటికి వచ్చిన సమయంలో గోవర్ధన్ నాయక్ ఇంట్లో లేకుండా పోవడంతో.. అతని భార్యతో గంగ రాజు మాట్లాడుతుండగా సడన్‌గా వచ్చినట్లు సమాచారం. దీంతో గోవర్ధన్ నాయక్ భార్య దొంగా దొంగా అని కేకలు పెట్టడంతో.. భవనం మూడవ అంతస్తు పై నుంచి గంగరాజు తప్పించుకునే క్రమంలో కిందికి దూకి తీవ్రంగా గాయపడ్డాడని సీఐ తెలిపారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న లాప్టాప్, సెల్‌ఫోన్ కూడా పగిలిపోయాయన్నారు. తీవ్రంగా గాయపడ్డ గంగరాజును విష్ణు నాయక్ వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి భార్యతో కలిసి తీసుకువెళ్లి ప్రథమ చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అతని పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడని, దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా గంగరాజు మృతి మిస్టరీని తేల్చునున్నామని చెప్పారు. -
గంగమ్మ ఆలయంలో చోరీ
పులివెందుల రూరల్ : మండల పరిధి ఆర్.తుమ్మలపల్లె గ్రామ సమీపంలోని గంగమ్మ చింతల ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్‌లు, తలకు టోపీలు ధరించి తలువులు పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారికి అలంకరించి ఉన్న సుమారు 3.750 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని, వీటి విలువ రూ.3.90 లక్షలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని సీసీ కెమెరాలలో గుర్తు తెలియని వ్యక్తులు వెండి ఆభరణాలు అపహరించిన దృశ్యాలు రికార్డు అయ్యాయన్నారు. ఇప్పటికై నా సంబంధిత పోలీసు అధికారులు స్పందించి ఆలయాల వద్ద గస్తీ ఏర్పాటు చేసి చోరీలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కడపలో ఇరువర్గాల ఘర్షణ
సాక్షి ప్రతినిధి, కడప: కడప నగరం అల్మాస్‌పేటలో ఓ ఘటన ఇరువర్గాల మధ్య చిచ్చు రేపింది. ఒకరిపై మరొకరు రాళ్ల దాడులకు దిగారు. ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నంలో సీఐ నరసింహరాజు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, మరో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. శనివారం మధ్యా హ్నం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అల్మాస్‌పేట సర్కిల్లో ఓ వర్గం బ్యానర్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. బ్యానర్ల ఏర్పాటుపై అభ్యంతరం చెబుతూ మరోవర్గం నిరసనకు దిగింది. ఇందుకు అనుగుణంగా అప్పటికప్పుడు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.దీంతో ఇరువర్గాలూ బ్యానర్లు తీసేసి, శాంతియుత వాతా వరణం కల్పించేందుకు సహకరించాలని పోలీసు లు అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ వినిపించుకోకుండా ఇరువర్గాలు రాళ్ల దాడులకు పాల్పడ్డాయి. ఈ క్రమంలో పోలీసులూ గాయాలపాలవడంతో ఇరు వర్గాలపై లాఠీ ఝుళిపించారు. అల్లరి మూకలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పరస్పర కవ్వింపు చర్యలకు పాల్పడడంతోనే ఘర్షణ ఉత్ప న్నమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. -
● ఎస్ఈ కార్యాలయంలో తన్నుకున్న పచ్చ నేతలు
సాక్షి ప్రతినిధి, కడప: కడప మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం ఇష్టారాజ్యంగా నడుచుకుంటోంది. నిబంధనలతో నిమిత్తం లేకుండా దోపిడీదారులకు అండగా నిలుస్తోంది. టెండర్ బిడ్‌ను అడ్డగోలుగా రద్దు చేస్తూ అయినా వారికి కట్టబెట్టే చర్యలను ఎంచుకుంది. నిబంధనల మేరకు తక్కువ రేట్లకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సిందిపోయి, ఏకంగా టెండర్ బిడ్‌నే రద్దు చేశా రు. అదే పనికి తిరిగి టెండర్‌కు పిలవడం, అయిన వారికి కట్ట బెట్టడం ఇదే వరుసను కొనసాగిస్తున్నారు. తెలుగుతమ్ముళ్లుతో పనులు చేయించడం తర్వాత టెండర్లు తంతు ప్రక్రియను పూర్తి చేయిస్తున్నారు. ● కడప నగర పరిధిలోని పుష్పగిరి స్కూల్ రోడ్డు వెళ్లే రహదారిపై చంద్రవర్దిని నగర్ ఆర్చి నుంచి చివరి వరకు రోడ్డు వేసేందుకు (టెండర్ ఐడీ 903811) రూ.16.15లక్షలకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న టెండర్లు పిలిచి 24వ తేది తుది గడువు నిర్ణయించారు. ఆ టెండర్లను ఓపెన్ చేయగా ఇద్దరు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అందులో ఎస్వీఎస్ఎస్ కన్స్ట్రక్షన్ 1.17శాతం తక్కువకు కోట్ చేయగా, ఎస్.యల్లారెడ్డి 10.08శాతం తక్కువకు కోట్ చేశారు. 10శాతం తక్కువకు కోట్ చేసిన కాంట్రాక్టర్ యల్లారెడ్డి పనులు చేసేందుకు సుముఖంగా ఉన్నానని తనకు పనిని అప్పగించాలని కమిషనర్‌కు లేఖ కూడా ఇచ్చారు. అధికారులు తిరిగి అదే పనిని రీ టెండర్లకు ఆహ్వానించారు. 8వతేది శుక్రవారం సాయంత్రం 3వ కాల్‌గా టెండర్ కొనసాగించారు. ఇలా కార్పొరేషన్లో నిబంధనలు విరుద్ధంగా తెలుగుతమ్ముళ్లుకు వంతపాడుతున్నారు. దీన్నిబట్టి కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎంత నీతివంతంగా పనిచేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వింతపోకడలో ఇంజనీరింగ్ సెక్షన్... కార్పొరేషన్లో ఇంజనీరింగ్ సెక్షన్ వింత పోకడలో ఉండిపోయింది. టెండర్లు బిడ్‌లో కాంట్రాక్టర్లు పాల్గొంటే బెదిరింపులకు దిగుతోందనే ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయినప్పటికీ ఎవరైనా కాంట్రాక్టర్లు పాల్గొంటే విత్‌డ్రా చేయించడం లేదంటే టెండర్లు రద్దు చేయించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలా కుదరకపోతే అనుకున్న వ్యక్తులతో పనులు ముందే చేయించి తర్వాత టెండర్లకు పోతున్నారు. ప్రస్తుతం చంద్రవర్ధిని నగర్ 3వ కాల్‌గా పిలిచిన 7921/జీఎఫ్/24–25/ఏటీఓ/ఎంసీకే బిడ్ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ పనికి టీడీపీ నేతలతో ముందే చేయించారు. తర్వాత టెండర్లు పక్రియను కొనసాగించారు. ఇదే పక్రియ పరిపాటిగా ఇంజనీరింగ్ విభాగం కొనసాగిస్తోంది. రోడ్డు ముందే వేయించి ఆపై టెండర్లు 10శాతం లెస్‌కు టెండర్ దాఖలు చేసినా బిడ్ రద్దు తెలుగుతమ్ముళ్ల అక్రమార్జనకు అండగా యంత్రాంగం ఇంజనీరింగ్ విభాగం అడ్డగోలు వ్యవహారం కారణంగా ఇటీవల తెలుగుతమ్ముళ్లు పరస్పరం తన్నుకున్నారు. అడ్డగోలు పనుల పందేరాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో పనుల కోసం ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోసాగారు. ఈ నేపధ్యంలో బుచ్చంపల్లెలో చేపట్టిన పనుల కోసం తెలుగుతమ్ముళ్లు ఇంజనీరింగ్ కార్యాయ లంలో పరస్పరం దాడులు చేసుకొని కార్యాలయం ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇలాంటి అడ్డగోలు వ్యవహారాలకు మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం వేదికగా నిలుస్తోంది. ఇంతటి దుశ్చర్యలు కేఎంసీలో చోటుచేసుకుంటున్నా ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ శ్రీధర్‌లో కనీస స్పందన లేకపోవడంతోనే ఇంజనీరింగ్ విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహహారిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
స్కూల్ బస్.. ఫిట్ లెస్
కడప వైఎస్ఆర్ సర్కిల్: స్కూల్ బస్సులు ఫిట్నెస్ సాధించడంలో ఫెయిలవుతున్నాయి. తనిఖీ చేసిన ప్రతీసారి లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా రవాణాశాఖ అధికారులు పలు స్కూల్, కాలేజీ బస్సులు తనిఖీ చేయగా అనేక లోపాలు వెలుగుచూశాయి. లోపాలను గుర్తించిన అధికారులు వాటిని సరిచేయాలంటూ ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లో ఆ లోపాలను సరి చేస్తేనే మళ్లీ తనిఖీ చేసి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 680 పాఠశాల కళాశాల బస్సులు ఉండగా ఇప్పటివరకు 270 బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. గుర్తిస్తున్న లోపాలు ఇవీ...... రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్టీడీ డివైజ్ లు లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయటకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పనిచేయకపోవడం, అత్యవసర ద్వారా వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించారు. వాటితోపాటు అత్యవసర పరిస్థితులలో ఉపయోగించాల్సిన హ్యమర్లు బస్సులో అందుబాటులో లేకపోవడం, మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్ మెంట్, ఎక్స్‌పైరి డేట్ తో ఉండడం వెలుగుచూశాయి. వీటి పైనే దృష్టి..... రవాణాశాఖ అధికారులు వారి తనిఖీల్లో ముఖ్యంగా టైర్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎక్కే డోర్ మెట్లు సక్రమంగా ఉన్నాయా, గ్రిల్స్, సీట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ కిట్, వైపర్స్, ఇండికేటర్స్, హెడ్ లైట్స్, గ్లాస్, బండి కండిషన్, రూప్ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విద్యార్థులు బయటకు ఎమర్జెన్సీ సరిగ్గా ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నారు. నిబంధన పాటించని స్కూల్ బస్సులు రవాణా శాఖ తనిఖీల్లో వెల్లడవుతున్న వాస్తవాలు -
గండిలో ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నూతన ఆలయ జీర్ణోద్ధరణ,మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శుక్రవారం సాయంత్రం నుంచి సాంప్రదాయబద్ధంగా పాపాఘ్ని నదీ జలాలను తెచ్చి స్వామి వారికి సమర్పించిన అనంతరం వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భగవత్ విజ్ఞాపనం, విశ్వక్షేన ఆరాధన,రక్షాబంధనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవదాయశాఖ డిప్యూటి కమిషనర్ ఆలయ సహాయకమిషనర్ గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన ఉపప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి,రాజారమేష్,రాజగోపాలాచార్యులపర్యవేక్షణలో టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారులు రాజేష్‌స్వామి, విజయ్ స్వామి శిష్య బృందం వేద మంత్రాలతో ప్రారంభించారు. గండి భూమానందాశ్రమ పీఠాధిపతి మాతాజీ, వేదపారాయణదారు రామమోహన్ శర్మ,గండి ఆలయ మాజీ సహాయకమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి,మాజీ చైర్మన్ వీరభాస్కర్ తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
కారు, బైక్ ఢీకొని..
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని దేవుని కడప ఆర్చి– మహేంద్ర షోరూం మార్గమధ్యంలో శుక్రవారం కారు, బైక్ నుఢీకొనడంతో డీ. చౌడయ్య (40) అనే బేల్దారి దుర్మరణం చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్, మృతుని భార్య అమృతమ్మ, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కడపలోని చిన్న చౌక్ వడ్డే కాలనీ లో నివాసం ఉంటున్న దండే చౌడయ్య బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య అమృతమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమృతమ్మ కొన్ని రోజుల క్రితం తన పిల్లలతో కలిసి ఖాజీపేటలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. వారిని పిలుచుకుని రావడానికి బైక్‌లో ఇంటి నుంచి బయలుదేరాడు. సంఘటన స్థలానికి చేరుకునే సరికి ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఎగిరి పడ్డాడు. బైక్, కారుపై పడటంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. చౌడయ్య శరీరమంతా ఛిద్రమైపోయింది. కాసేపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. స్థానికుల సమాచారంతో బంధువులు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. కడప ట్రాఫిక్ సిఐ తులసి రామ్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు. -
దౌర్జన్యకారుల నుంచి కాపాడి న్యాయం చేయాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఇంటి కొనుగోలుకు సంబంధించి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వారి బారి నుంచి తమను కాపాడి న్యాయం చేయాలని వేంపల్లెకు చెందిన నాగిశెట్టి రాజేశ్వరి, శ్రీనివాసులు కోరారు. శుక్రవారం వారు మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. వేంపల్లె ప్రాంతానికి చెందిన తమకు కరీముల్లా, అమానుల్లాలు 32 లక్షలకు నాలుగురోడ్ల కూడలిలో ఓ ఇంటిని అగ్రిమెంట్ రాసిచ్చారన్నారు. అనంతరం పలుమార్లు అగ్రిమెంట్ చేయించాలని కోరుతున్నా తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. కరీముల్లా 33 లక్షలు తీసుకుని పారిపోయి 8 సంవత్సరాలు తర్వాత వచ్చి మా పట్ల దౌర్జన్యం చేయాలని చూస్తున్నారన్నారు. ఇంటికి సంబంధించి అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ రౌడీలను తీసుకొచ్చి ఇంటిని ఆక్రమించాలని చూస్తున్నారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేసినా నేడు, రేపు అంటూ కేసు నమోదుకు కాలయాపన చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకుని తమకు తగిన న్యాయం చేయాలని, దౌర్జన్యపరుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. -
పోలీసులే దౌర్జన్యం చేయడం తగునా.!
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలం చవ్వారిపల్లె గ్రామంలో గురువారం పోలీసులు, టీడీపీ నాయకులు కలసి హైడ్రామా నడిపి రాత్రి సమయంలో ఫిర్యాదుదారుడు వెంకటసుబ్బయ్యతో కలిసి దౌర్జన్యంగా మా ఇంటి వద్ద ఉన్న ట్రాక్టర్లు తీసుకెళ్లడం ఎంతవరకు సబబు.. ఇది న్యాయమేనా అని మహిళలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం చవ్వారిపల్లె గ్రామంలో మహిళలు మాట్లాడుతూ గ్రామంలో దేవాలయానికి సంబంధించి 8ఎకరాల దేవుని మాన్యం భూమి ఉందని, గతంలో గ్రామస్తులంతా కలిసి మూడేళ్లకొకసారి ఆ భూమికి వేలంపాట నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆ వేలంపాటలో ఎక్కువ పాడిన వారు ఆ రోజే రెండేళ్లకు సంబంధించి డబ్బు కట్టి భూమి పనులు చేస్తున్న సమయంలో మరొక సంవత్సరం డబ్బు కట్టాల్సి ఉందని, కానీ ఇది ఏమి చేయకుండా టీడీపీ వారు దౌర్జన్యంగా కట్టుబడి వెంకటసుబ్బయ్య కలసి ట్రాక్టర్ సహాయంతో దేవునిమాన్యం భూమిలో దున్నడానికి వెళ్లారన్నారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు ఇది మంచి పద్ధతి కాదని, గ్రామ కట్టుబాటు ప్రకారం జరగాల్సిందేనని, దున్నే ట్రాక్టర్‌ను అడ్డుకోవడం జరిగిందన్నారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన 12మందిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఒక ట్రాక్టర్‌ను పోలీసులచేత సీజ్ చేయించారన్నారు. అయితే బుధవారం టీడీపీ నాయకులు పోలీసులను వెంట పెట్టుకుని దౌర్జన్యంగా ఆ భూమిని దున్ని చదును చేసుకున్నారని, అయితే ఎండోమెంట్ వారు దేవాలయానికి సంబంధించిన భూమి వేలం పాట నిర్వహించడానికి ఒక తేదీని ఖరారు చేసి ప్రకటించాలని నివేదిక పంపారన్నారు. ఇదేమి పట్టించుకోని పోలీసులు మళ్లీ గురువారం రెండు ట్రాక్టర్లపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నాయక్ పోలీసులు, ఫిర్యాదుదారుడు వెంకటసుబ్బయ్యతో వచ్చి ఒక ట్రాక్టర్‌ను వెంకటసుబ్బయ్య, మరొక టాక్టర్ను పోలీస్ సిబ్బంది తీసుకెళ్లారన్నారు. పోలీసులు న్యాయపరంగా వ్యవహరించాలి తప్ప.. టీడీపీ నాయకులు ఏది చెబితే అది చేయడం, దొంగ కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. ఫ్రెండ్లీ పోలీసులంటే టీడీపీ కార్యకర్తలుగా వ్యవవరించడమేనా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరును ఎండగట్టడానికి న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మహిళలు పేర్కొన్నారు.న్యాయ పోరాటానికి సిద్ధమైన చవ్వారిపల్లె మహిళలు -
చౌక దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
మైదుకూరు : పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో ఓ చౌక దుకాణంలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీలోని 10వ వార్డు పరిధిలో కొన్ని గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే 34వ దుకాణంలో అధికారులు తనిఖీలు చేశారు. బియ్యం, జొన్నలు, అంగన్వాడీలకు వచ్చే సన్నబియ్యం నిల్వలు పంపిణీపై ఆరా తీశారు. వాసంతి అనే మహిళ పేరుతో ఉన్న చౌకదుకాణాన్ని ఆమె బంధువు సుబ్బారెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిత్యావసర సరుకుల పంపిణీలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు కడప అర్బన్ : కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గోపాల్‌రెడ్డి కాలనీలో నివాసం వుంటున్న బావమరిది అజయ్‌కుమార్ (19)పై బావ మహమ్మద్ అజీజ్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ సంఘటనలో నిందితుడైన, రౌడీషీటర్‌గా పేరొందిన మహమ్మద్ అజీజ్ అనే యువకుడిని చిన్నచౌక్ సీఐ బి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి తమ సిబ్బందితో అరెస్ట్ చేశారు. అతనిన కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు తరలించారు. వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కీలకం రాజంపేట : వైద్యసేవల్లో అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ పాత్ర అత్యంత కీలకమని, అందువల్లనే ఆ కోర్సులకు డిమాండ్ పెరిగిందని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్‌లర్ చొప్పాగంగిరెడ్డి అన్నారు. శుక్రవారం హెల్త్‌సైన్సెస్ ప్రెషర్స్డేలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో హెల్త్కోర్సులకు అధిక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ప్రముఖ జనరల్ సర్జన్ డా.శ్రీకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో హెల్త్ సైన్సెస్ తీసుకొచ్చిన ఘనత ఏయూ అధినేత చొప్పాగంగిరెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, గెస్ట్ హాఫ్ ఆనర్ డా.రామ్నిఖి చక్రవర్తి, ఎఐటీఎస్ వైస్‌చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అలైడ్ హైల్త్ ప్రొఫెషనల్స్ ఇన్చార్జి ద్వారకనాథరెడ్డిలతో పాటు అధ్యాపకులు, విద్యార్ధులు, తల్లితండ్రులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సన్మానించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలిఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ ఽథర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లోని 600 మెగావాట్ల ప్లాంట్‌లోని 4వ దశలో పనిచేస్తున్న ఏఎంసీ (యాన్యువల్ మెయింటెన్స్ కాంట్రాక్ట్) కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీపీపీలోని 600 మెగావాట్ల ప్లాంట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు ఆదినారాయణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఎంసీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నాయకులు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గెలిచిన తర్వాత కార్మికులను ఆవేదనను ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదన్నారు. మా న్యాయమైన డిమాండ్లను నెల రోజుల్లోగా పరిష్కంచకపోతే భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
నీడ.. జాడే కరువు
నీడ.. జాడ కరువు కడప సిటీ: మండుటెండల్లో కాసింత నీడ కరువైంది. చెట్టు నీడే వారికి ఆసరాగా మారింది. ఇక వేసవి అలవెన్సు రాక.. తాగను గుక్కెడు నీళ్లు లేక.. వారి అవస్థ వర్ణణాతీతంగా మారింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీల దుస్థితి ఇది. మండు వేసవిలో సౌకర్యాలు కరువై .. పని పథకం బరువైంది. ఇప్పటికే వడదెబ్బతో ఓ శ్రామికుడు మృత్యువాత చెందడంతో కార్మికుల్లో కలవరం మొదలైంది. నిప్పుల కుంపటిలా.... రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏకంగా 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. దీంతో ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పని ప్రదేశంలో గుడారాలు (షెడ్స్) నిర్మించాల్సి ఉంటుంది. భోజన విరామంలో షెడ్ల నీడనే కూర్చొని భోంచేయడంతో పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆ గూటినీడలోనే ప్రాథమిక చికిత్స అందించడం, ఆ తర్వాత ఆస్పత్రికి తరలించడం చేస్తుంటారు. కానీ నీడ లేకపోవడంతో ఈ పరిస్థితి లేదు. బడ్జెట్ లేనందువల్ల గుడారాలను ఏర్పాటు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే ఒంటిమిట్ట మండలంలో ఓ శ్రామికుడికి వడదెబ్బ తగిలింది. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఈ పరిస్థితిని చూసి మిగతా వారు బెంబేలెత్తుతున్నారు. పని ప్రదేశంలో చాలా చోట్ల కనీసం తాగునీరు కూడా పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్స కిట్లు ఉన్నప్పటికీ వాటి జాడ కనిపించడం లేదు. గతంలో వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ ఇచ్చే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. వసతులు అంతంత మాత్రమే ఉపాధి హామీపథకంలో సాధారణంగా వేసవి కాలంలో వేసవి అలవెన్సు కింద అదనంగా వేతనంతో కలిపి ఇస్తారు. ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్‌లో ఈ అలవెన్సు శ్రామికులకు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ వేసవి అలవెన్సును తీసి వేశారు. గతంలో వేసవిలో సైతం లక్షకుపైగా రోజుకు నమోదు కావా ల్సి ఉండగా, ప్రస్తుతం వేలల్లో మాత్రమే హాజరవుతుండడం గమనార్హం. 21 మంది ఎంపీడీఓలకు నోటీసులు ఇటీవల కలెక్టర్ శ్రీధర్ జిల్లాలోని 21 మంది ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పనుల పర్యవేక్షణ సరిగా లేదని, కూలీల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఆయన ఆరా తీసి షోకాజ్ నోటీసులు అందజేశారంటే అధికారులు క్షేత్ర స్థాయిలో ఎలా పరిశీలన చేస్తున్నారో అర్థమవుతుంది. గుడారాలు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధి కూలీలు చెట్టు నీడలోనే కాలంవెళ్లదీస్తున్న శ్రామికులు బడ్జెట్ లేదంటున్న అధికారులు ఇప్పటికే ఒంటిమిట్టలో వడదెబ్బతో ఓ శ్రామికుడు మృతి -
కార్పొరేషన్లో ఒకరి సస్పెన్షన్
కడప కార్పొరేషన్: జన గణన మొదటి దశ నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఒక ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ నగరపాలక కమిషనర్ రాకేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మరో ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం, అధికారుల ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం వంటి కారణాలతో ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశామని, అలాగే జనగణన ప్రారంభమై ఏడు రోజులు పూర్తయినా ఇప్పటి వరకూ విధులు ప్రారంభించని ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జనగణనలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం కార్యనిర్వాహక మండలి తీర్మానం, ప్రభుత్వ జీఓ నెం. 70 ప్రకారం గతంలో ఇచ్చిన 138 అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను రద్దు చేశామని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, పొఫెసర్ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు రుసుమును తిరిగి పొందేందుకు సంబంధిత సమాచారం కోసం విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని పేర్కొన్నారు. కొత్త నోటిఫికేషన్ల తేదీలు, ఇతర వివరాలు విడిగా ప్రకటిస్తామని వివరించారు. జమ్మలమడుగు: నారాపురస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దేవదేవుడు సూర్యప్రభ వాహనంపై ఽభక్తులకు దర్శనం ఇచ్చారు. కల్యాణోత్సవం, రథోత్సవం పూర్తయిన తర్వాత శుక్రవారం ఉదయం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.భక్తులు స్వామివారిన దర్శించుకుని తరించారు. పులివెందుల టౌన్: ఈసెట్ ఎంట్రెన్స్ ఫలితాలలో పులివెందుల లయోలా పాల్టెక్నిక్ (వైఎస్‌ఆర్‌ఆర్) కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కళాశాలకు చెందిన విద్యార్థిని ఎం.గీతిక రాష్ట్రస్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ బ్రిట్టో హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలుపుతూ తమ కళాశాలకు చెందిన ఎన్.పద్మప్రియ స్టేట్ 3వ ర్యాంకు, జి.లోకేష్ స్టేట్ 25వ ర్యాంకులు సాధించి మంచి ప్రతిభ కనబరిచారన్నారు. రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతిక తండ్రి శివశంకర్‌రెడ్డి పులివెందులలో సాధారణ రైతు కాగా.. తల్లి ఎం.కేశవి గృహిణిగా ఉంటూ కుమార్తెను బాగా చదివించడంపట్ల స్థానిక ప్రజలు, కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుని జయంత్యుత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో చివరిరోజు తాళ్లపాక ధ్యానమందిరంలో మోహన్, గోపికృష్ణ బృందం సంకీరన్తలు ఆలపించారు. బోయనపల్లె గ్రామానికి చెందిన శ్రీ కోదండరామ కళానాట్యమండలి మహేంద్రస్వామి ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జీవిత ఘట్టాల ప్రదర్శన కన్నులపండువగా సాగింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ సీ.లత, తాళ్లపాక దేవాలయాల ఇన్స్పెక్టర్ బాలాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాలను ధర్మాచార్యులు గంగనపల్లె వెంకటరమణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
గంగమ్మా.. దీవించమ్మా
రాజంపేట టౌన్: పట్టణంలోని బలిజపల్లె గ్రామంలో గత రెండు రోజులుగా జరిగిన గంగమ్మ జాతర ముగిసింది.శుక్రవారం ఉదయం అమ్మవారి ప్రతిమను ఊరేగింపుగా పొలిమేర్లకు సాగనంపడంతో ఈ ఏడాదికి జాతర ఘట్టం ఘనంగా పరిసమాప్తమైంది. గంగమ్మను పొలిమేర్లకు తరలించే ఊరేగింపు కార్యక్రమం వేకువ జామున ప్రారంభమై ఉదయం 8 గంటల వరకు సాగింది.ఈసందర్భంగా పలువురు భక్తులు గంగమ్మకు ఎదురుగుంభంగా ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. ఆసాదులు దారిపొడవునా కథ చెబుతూ.. దీవెనలిస్తూ సాగారు. ఈ ఏడాది జాతరలో దాదాపు లక్షమందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకుల అంచనా. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు గురువారం పొద్దుపోయే వరకు దారివెంబడి నీళ్లు,, మజ్జిగ పాకెట్లు, అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. జాతర నిర్వాహకులు, పోలీసు అధికారుల సమష్టి కృషి ఫలితంగా బలిజపల్లె గంగమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్‌హెగ్డే ఆధ్వర్యంలో రాజంపేట అర్బన్, మన్నూరు సీఐలు, ఎస్ఐలు, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు సిబ్బంది, ముఖ్యంగా మహిళా పోలీసులు రాత్రి వేళలో సైతం భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించడంలో, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాతర ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు కృషి చేశారు. కోటి రూపాయలకు పైగా వ్యాపారం బలిజపల్లె గంగమ్మ జాతరను పురస్కరించుకొని వివిధ రకాల వ్యాపారాలు జోరుగా సాగాయి. వందలాది మంది భక్తులు గంగమ్మకు నైవేద్యాలుగా పొట్టేళ్లు, మేకపోతులు, కోడిపుంజులు వంటివి సమర్పించారు. అలాగే బలిజపల్లె గ్రామంలోనే కాక పరిసర ప్రాంతాల్లో వ్యాపారులు వివిధ రకాల దుకాణాలు ఏర్పాటు చేశారు.ఈ ఏడాది దాదాపు కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరిగి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ముగిసిన జాతర ఘట్టం పొలిమేర్లకు తరలిన అమ్మవారు -
రక్తమోడిన రహదారులు
రాజంపేట : రాజంపేటలోని తిరుపతి, కడప బైపాస్ రోడ్లో శుక్రవారం వేర్వేరు రోడ్డుప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఓబులవారిపల్ల మండల గాడివారిపల్లెకుచెందిన కోటకొండ సుబ్బమ్మ (56), తిరుపతి ఆటోనగర్‌కు చెందిన పూర్ణచంద్రరాజు మృతి చెందారు.పోలీసులు స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నీళ్లు చల్లించేందుకు వచ్చి కాటికి... తిరుపతి ఆటోనగర్‌కు చెందిన పూర్ణచంద్రరాజు , బత్తలబాలాజీ, కృష్ణమనేని శశిధర్లు గురువారం రాత్రి కడపకు కారులో బయలుదేరారు. రాజంపేట బైపాస్‌లో ఉస్మాన్‌నగర్ వద్దకు రాగానే ప్రైవేటుబస్సు, కారు ఢీ కొన్నాయి. ముందుసీటులో ఉన్న పూర్ణచంద్రరాజు అక్కడక్కడే మృతి చెందాడు. కారు నడుపుతున్న బత్తలబాలాజీ, వెనక సీట్లో కూర్చున్న కృష్ణమనేని శశిథర్ గాయపడ్డారు.బత్తల బాలాజీ పెద్దనాన్న ఇటీవల మృతి చెందారు. పెద్దకర్మలో భాగంగా వీరు నీళ్లు చల్లించేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. విషాదం నింపింది.వైఎస్సార్ కడప జిల్లాలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
పెళ్లికి బయలుదేరి..
ఓబులవారిపల్లె మండలానికి చెందిన కోటకొండ సుబ్బమ్మ (56) రాజంపేటలో జరిగే పెళ్లికి శుక్రవారం బయలుదేరింది. తిరుపతి నుంచి తాడిపత్రికి వెళుతున్న కారులో ఓబులవారిపల్లె మండలం వడ్డెపల్లెకు చెందిన మహాలక్ష్మీ ,జీ.ప్రసాద్, శివయ్య, వెంకటసుబ్బమ్మ, ఏరుకులమ్మలు కారులో ఉన్నారని పోలీసులు తెలిపారు. రాజంపేట మండలం వెంకటరాజంపేట వద్ద కారును ఎదురుగా కడప నుంచి ఓబులవారిపల్లెకు వెళుతున్న సిమెంట్‌లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో కోటకొండ సుబ్బమ్మ మృతి చెందింది. స్ధానికులు కారులో ఉన్నవారిని బయటికి తీశారు. స్ధానికులు 108కు ఫోన్ సమాచారం ఇచ్చారు. గంటసేపటి వరకు రాలేదని ఆ గ్రామానికి చెందిన పూలభాస్కర్ విమర్శించారు. -
అధికార బలంతో అక్రమ నిర్మాణం
ప్రొద్దుటూరు : మున్సిపాలిటీ పరిధిలోని బుడ్డాయపల్లెలో అధికార పార్టీ బలంతో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అక్రమ నిర్మాణం చేపడుతోంది. యధేచ్ఛగా నిర్మాణ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. బుడ్డాయపల్లెలోని సర్వే నంబర్ 344/2లో 77 సెంట్ల మున్సిపాలిటీ స్థలం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీ స్థలాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో మున్సిపల్ స్థలం పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలాన్ని గీతాంజలి స్కూల్ యాజమాన్యం కొనుగోలు చేసింది. 15 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి స్కూల్ నిర్మించారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం స్కూల్ ముందు ఉన్న 7 సెంట్ల మున్సిపల్ స్థలంలో అదనపు భవనాలను నిర్మిస్తున్నారు. ఈ 7 సెంట్ల స్థలం విలువ రూ.కోటికిపైగా అవుతుంది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ మాత్రం పట్టించుకోని స్కూల్ కరస్పాండెంట్ తనకు అధికార పార్టీ నేతల అండ ఉందని, సమస్య రాకుండా తాను చూసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా యధావిధిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు కళ్లు తెరవకపోతే మిగతా స్థలం కూడా ఆక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై పాఠశాల కరస్పాండెంట్ శివరామిరెడ్డిని వివరణ కోరగా మున్సిపల్ స్థలంలో కేవలం ప్రహరీ గోడను మాత్రమే నిర్మిస్తున్నామని తెలిపారు. పిల్లల రక్షణ కోసమే నిర్మిస్తున్నామని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రహరీని తొలగిస్తామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.7 సెంట్ల మున్సిపల్ స్థలంలో ప్రైవేట్ స్కూల్ నిర్మాణం -
నీటి ఎద్దడి లేకుండా చూడండి
కడప సెవెన్‌రోడ్స్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశంలో ఆయన నీటి ఎద్దడిపై ఆరా తీశారు. ఇందుకు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు బదులిస్తూ రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చక్రాయపేట, చెన్నూరు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందని తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ తమకు నిధులు కావాలంటూ తరచూ జెడ్పీటీసీలు అడుగుతుంటారని చెప్పారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే నిధులు సమకూరుతాయని తెలిపారు. గ్రామీణ రహదారుల గురించి జెడ్పీ చైర్మన్ సమీక్షించారు. ఇందుకు పంచాయతీరాజ్ ఎస్ఈ బదులిస్తూ జిల్లాలో 20 బీటీ రోడ్ల మరమ్మతులకు రూ. 65 కోట్లు మంజూరయ్యాయని, ఈ పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ జరుగుతోందన్నారు. 74 బీటీ రోడ్ల పనులు రూ. 35 కోట్ల తో, 79 మెటల్ రోడ్ల పనులు రూ. 17 కోట్లతో పూర్తి చేశామని వివరించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లించాలని జెడ్పీ చైర్మన్ కోరారు. ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య మాట్లాడుతూ జువారి సిమెంటు కర్మాగారం నిర్వహిస్తున్న బ్లాస్టింగ్ కారణంగా నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ము ధూళి వద్ద ఇప్పటికే 10 మంది క్యాన్సర్ వ్యాధి బారిన పడి మృతి చెందారన్నారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ తమ మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లారని, ఇందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెనగలూరు జెడ్పీటీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి


