పోరుమామిళ్ల : చిన్న యరసాల సమీపంలోని అప్పన్నబావి దగ్గర ఈనెల 5న మానేపాటి సురేష్(30)ను చంపి, కాల్చివేసిన ఘటనలో నిందితులు షేక్ జాఫర్‌వల్లి, అతని భార్య హాసీనాలను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ హేమసుందరరావు, ఎస్‌ఐ హనుమంతు తెలిపారు. ప్రొద్దుటూరుటౌన్ ఆర్ట్స్‌కాలేజీ రోడ్డు గురవయ్యతోటకు చెందిన జాఫర్‌వల్లి దంపతులు కోతులు పట్టుకునే వృత్తిలో ఉన్నారన్నారు. సురేష్ భార్య వెంకటేశ్వరితో శారీరక సంబంధం పెట్టుకున్న జాఫర్ వల్లి ఆమెను వివాహం చేసుకునేందుకు.. సురేష్ అడ్డుగా ఉన్నాడని భావించి హత్యకు ప్లాన్ చేశాడన్నారు. 5వ తేది రాత్రి రాయితో ముఖంపై కొట్టి, కిందపడ్డ సురేష్‌ను జాఫర్‌వలి, హసీనాలు చంపి, అప్పన్నబావిలో వేసి చెత్తలో కాల్చి వేశారన్నారు. ఈ విషయం వెంకటేశ్వరికి చెప్పి, బయటికి చెపితే చంపుతామని బెదిరించారన్నారు. వెంకటేశ్వరి వారి నుంచి తప్పించుకొని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. శనివారం మధ్యాహ్నం నిందితులను సీతారామపురం క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజుల్లోనే విశ్వసనీయ సమాచారంతో నిందితులను అరెస్టు చేశామన్నారు. దీనిపై మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పోరుమామిళ్ల సిబ్బందిని అభినందించారన్నారు.


