శాంతిసౌభ్రాతృత్వాలతో మెలగాలి
మతసామరస్యానికి, స్నేహభావానికి ప్రతీక కడప అని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా శతాబ్దాల చరిత్ర కలిగిన కడపలో విద్వేషాలకు తావు లేదన్నారు. ఎవరికి వారు సమన్వయం ప్రదర్శించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా మతసామరస్యాన్ని, సోదర భావాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తూ ఆదర్శవంతమైన కడపను కొనసాగించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు.
సోదర భావానికి ప్రతీక
వైఎస్సార్ కడప జిల్లాతో పాటు కడప నగరం సోదర భావానికి ప్రతీక అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. నగరంలో కొన్ని దుష్ట శక్తుల స్వార్థపూరిత ప్రేరేపణల కారణంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం దురదుష్టకరమన్నారు. దుష్టశక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విజ్ఞులైన కడప ప్రజలు దుష్టశక్తుల ప్రయత్నాలను విఫలం చేసి దేశానికి ఆదర్శవంతంగా నిలవాలని కోరారు.
మత సామరస్యానికి నిలయం కడప
కడప నగరం మతసామరస్యానికి నిలయమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాష అన్నారు. కడప చరిత్రలో ఎన్నడూ జరగని దురదృష్ట సంఘటన అల్మాస్‌పేట సర్కిల్‌లో చోటుచేసుకుందన్నారు. అన్ని మతాల పండుగలు, ప్రార్థనలకు నిలయమైన కడపలో ఎప్పుడూ పరమత ద్వేషాలకు తావులేదన్నారు. పెద్దలు చూపించిన ప్రేమ, పరస్పర గౌరవం, ఐక్యత కడప సంస్కృతికి మూలస్తంభాలని, కొంతమంది చేసే ప్రేరేపిత చర్యల వల్ల శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష


