కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయ అభివృద్ధిలో బీఆర్‌సీల పాత్ర కీలకం అని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణ్యేశ్వరావు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కడపలోని ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో మండల స్థాయి నోడల్ బయో రిసోర్స్ సెంటర్ల యజమానులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కషాయాలు, జీవ ద్రావణాల తయారీ విధానాలు ప్రత్యక్షంగా చేసి చూపించారు. వాటి తయారీ, వినియోగం, పంటలపై కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు. బీఆర్‌సీ యజమానులు క్షేత్ర స్థాయిలో శాసీ్త్రయ దృక్పథంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వసంత కుమారి, యంగ్ ప్రొఫెషనల్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


