ఇప్పటికే 11 లక్షలు ఖర్చయింది | - | Sakshi
Sakshi News home page

ఇప్పటికే 11 లక్షలు ఖర్చయింది

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

మా పాప నందినిని విజయవాడలోని గోశాల శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌తోపాటు రెండు సార్లు లాంగ్‌టర్మ్‌ నీట్‌ కోసం రూ. 11 లక్షలు ఖర్చు పెట్టాను. ఈసారి నీట్‌ పరీక్ష బాగా రాసింది. ఫలితాలకు సంబంధించి విడుదలైన ప్రాథమిక కీలో 720 మార్కులకు 590 మార్కులు వచ్చాయి. కోచింగ్‌ సెంటర్‌ వాళ్లు కూడా మంచి కళాశాలలో సీటు వస్తుందని చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలపైన నీళ్లు చల్లారు. మళ్లీ కోచింగ్‌కు పంపాలంటే ఆర్థికభారమే.

– పోలిరెడ్డి, చిన్నాయపల్లె,

బి. మఠం మండలం

మళ్లీ కోచింగ్‌కు పంపాలి

నీట్‌ రద్దు కావడంతో మళ్లీ మా పాప వర్షిణిని కోచింగ్‌కు పంపాలి. ఇది ఆర్థికబారం కానుంది. ఈ సారి మా పాప నీట్‌ పరీక్ష బాగా రాసింది. ప్రాథమిక కీ లో కూడా 589 మార్కులు వచ్చాయి. సీటు ఖచ్చితంగా వస్తుందని నిపుణులు కూడా తెలిపారు. ఇంతలో నీట్‌ రద్దని ప్రకటించారు. ఈ ప్రభావం పిల్లలపైన ఎలా చూపుతుందో తెలియని పరిస్థితి. 2024లో కూడా నీట్‌ నిర్వహణలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రద్దు చేయలే. కానీ ఇప్పుడు రద్దు చేశారు.

– ఆనందరెడ్డి, కడప.

నీట్‌ పరీక్ష రద్దు వల్ల

విద్యార్థుల్లో ఆందోళన

విద్యార్థులు రాత్రింబవళ్లు శ్రమించి నీట్‌ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పేపర్‌ లీక్‌ కారణంగా పరీక్షను రద్దు చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

–షేక్‌ అమీర్‌బాషా, విద్యార్థిని తండ్రి, దువ్వూరు

Advertisement
 
Advertisement
Advertisement