యథేచ్ఛగా కలప అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా కలప అక్రమ రవాణా

May 13 2026 1:32 AM | Updated on May 13 2026 1:32 AM

పులివెందుల రూరల్‌ : మండల పరిధిలో కొంత మంది యథేచ్ఛగా కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ఇలా ట్రాక్టర్లలో కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement