● ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 27న బక్రీద్ పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో అస త్య, చట్టవ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో,మత సామరస్యంతో జరుపుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్.పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, రాజంపేట ఏ.ఎస్.పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, స్పెషల్ బ్రాంచ్ డీ.ఎస్.పీ ఎన్ . సుధాకర్, డీఎస్పీలు పాల్గొన్నారు.


