హౌసింగ్‌ ఇన్‌చార్జి డీఈఈ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ ఇన్‌చార్జి డీఈఈ సస్పెన్షన్‌

May 15 2026 10:14 AM | Updated on May 15 2026 10:14 AM

ప్రొద్దుటూరు : హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొద్దుటూరు రూరల్‌ ఏఈతోపాటు ఇన్‌చార్జి డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంను సస్పెండ్‌ చేశారు. హౌసింగ్‌ నిర్మాణానికి సంబంధించిన గోడౌన్‌లోని ఐరన్‌ మాయం కావడంతో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ రాజారత్నం ఈయనను గురువారం సస్పెండ్‌ చేశారు. రూ.1.70 కోట్ల విలువైన ఐరన్‌ మాయమైన విషయం తెలిసిందే. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు డీఈఈ ప్రొద్దుటూరు విడిచి వెళ్లకూడదని పీడీ ఆదేశించారు.

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న మరో ట్రాక్టర్‌

జమ్మలమడుగు: పట్టణంలోని మద్దనూరు రహదారిలో టైరుకు పంచర్‌ వేయించుకోవటానికి రోడ్డు ప క్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి మ రో ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొని కాలువ పైకి ఎక్కి నిలబడిపోయింది.ఈ సంఘటన గురువా ర ం ముద్దనూరు రహదారిలో జరిగింది.ఎవరికీ గాయా లు కాక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement