వరల్డ్‌ మ్యాప్‌లో ఉండరు.. పాక్‌కు ఆర్మీ చీఫ్‌ వార్నింగ్‌ | Indian Army Chief Upendra Dwivedi Serious Warning To Pakistan | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ మ్యాప్‌లో ఉండరు.. పాక్‌కు ఆర్మీ చీఫ్‌ వార్నింగ్‌

May 16 2026 1:26 PM | Updated on May 16 2026 1:57 PM

Indian Army Chief Upendra Dwivedi Serious Warning To Pakistan

ఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత్‌పై పాకిస్తాన్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్‌తో తలపడేందుకు సిద్ధమని సంకేతాలు సైతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రపంచ చరిత్రలో, ప్రపంచపటంలో ఉండాలనుకుంటున్నారో, లేదో తేల్చుకోవాలని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై తాజాగా భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పందించారు. ఈ సందర్బంగా ద్వివేది మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ చుక్కలు చూసింది. భారత్‌ దాడులకు బెంబేలెత్తిపోయింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలు అందించాం. పాకిస్తాన్‌ తన తీరును మార్చుకోకుంటే ఆ ఆపరేషన్‌కు సంబంధించిన రెండో వెర్షన్‌ తీవ్రస్థాయిలో ఉంటుంది. ఇదే మా హెచ్చరిక.

భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపైనే దృష్టిపెడుతుంది. భారత్‌కు తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, దీటుగా స్పందిస్తుంది. ఉగ్రవాదులకు ఇలాగే ఆశ్రయం కల్పిస్తూ.. భారత్‌పై ప్రయోగించాలని చూస్తే ప్రపంచపటంలో పాక్‌ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. చరిత్రలో ఉండాలనుకుంటున్నారో, లేదో తేల్చుకోవాలి. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్‌ ఒకే విధంగా పరిగణిస్తుంది.  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement