breaking news
indian army
-
సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. హై అలర్ట్‌లో భారత సైన్యం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి గురువారం సాయంత్రం రెండు డ్రోన్లు (మానవరహిత విమానాలు) సంచరించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్ల కదలికలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, డ్రోన్ నిరోధక చర్యలను ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి.ఈ వారంలో సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం నమోదు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తొలుత సోమవారం నౌషెరా-రాజౌరీ సెక్టార్లో పలు డ్రోన్లు కనిపించడంతో భారత ఆర్మీ అప్రమత్తమై ప్రతిఘటన చర్యలు చేపట్టింది. ఆ తర్వాత మంగళవారం రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టార్‌లోనూ డ్రోన్ల కదలికలు కనిపించాయి. మొదటిసారి డ్రోన్లు కనిపించిన వెంటనే భారత్, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (DGMOs) మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ తన ఆందోళనను, అభ్యంతరాలను పాక్ అధికారులకు స్పష్టంగా తెలియజేసింది.వరుస డ్రోన్ ఘటనల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రతి కదలికను తాము నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇంకా కొనసాగుతోందని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, గురువారం రాజౌరీ జిల్లాలో భద్రతా దళాలు భారీ ముప్పును తప్పించాయి. అందిన కచ్చితమైన సమాచారం మేరకు కాకోరా గ్రామంలో నిర్వహించిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. -
జమ్మూ కశ్మీర్లో పాకిస్థాన్ డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు
జమ్మూ కశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్లో ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు జరిపింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. పలు డ్రోన్లు గగనతలంలో కనిపించాయి. డ్రోన్లు ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు వదిలి ఉండవచ్చన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో విస్తృతంగా శోధిస్తోంది. నిన్న కూడా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) వైపు నుంచి వచ్చిన ఒక డ్రోన్, సాంబా సెక్టార్లో ఆయుధాల సరుకును వదిలింది. డ్రోన్లను అడ్డుకోవడానికి సైన్యం మెషిన్ గన్స్‌ను వినియోగించింది. డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ఆయుధాలు, మత్తు పదార్థాలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మరింత కఠినతరమయ్యాయి. సైన్యం అప్రమత్తంగా ఉండి ప్రతి కదలికను గమనిస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
సోషల్ మీడియా వినియోగం.. ఇండియన్ ఆర్మీ కొత్త రూల్స్!
భారత సైన్యం.. తమ సిబ్బందికి సోషల్ మీడియా వినియోగంపై ఉన్న నిబంధనలను పాక్షికంగా సవరించింది. గతంలో ఉన్న కఠినమైన నిషేధాలను సడలిస్తూ, ఎంపిక చేసిన కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో నిష్క్రియాత్మక భాగస్వామ్యాన్ని(Passive Participation) అనుమతిస్తూ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ (డీజీఎంఐ) రూపొందించిన ఈ నూతన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.ఏమిటీ నిష్క్రియాత్మక భాగస్వామ్యం?కొత్త విధానం ప్రకారం.. సైనిక సిబ్బంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్‌లను సమాచారం తెలుసుకోవడానికి లేదా కంటెంట్‌ను చూడటానికి మాత్రమే ఉపయోగించవచ్చు. అయితే.. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ఎటువంటి యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉండకూడదు. అంటే..➤పోస్ట్‌లు పెట్టడం, ఫొటోలు అప్లోడ్ చేయడం చేయకూడదు.➤ఇతరుల పోస్టులపై వ్యాఖ్యానించడం (Commenting) నిషేధం.➤లైక్ చేయడం, షేర్ చేయడం లేదా పోస్టులకు రియాక్ట్ అవ్వడం వంటివి చేయకూడదు.➤డైరెక్ట్ మెసేజ్‌లు పంపడంపై కూడా నిషేధం కొనసాగుతుంది.ఇన్‌స్టాగ్రామ్‌కు అధికారిక అనుమతిఈ అప్డేట్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అధికారికంగా.. ‘పరిమిత వినియోగ’ సోషల్ మీడియా జాబితాలో చేర్చారు. కేవలం నిఘా, సమాచార సేకరణ ప్రయోజనాల కోసం మాత్రమే దీన్ని వాడాలని, వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోవడానికి వీల్లేదని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.కమ్యూనికేషన్, ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లువాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్కైప్ యాప్‌లను సాధారణ స్థాయి సమాచార మార్పిడికి ఉపయోగించవచ్చు. అయితే, గ్రహీత ఎవరో కచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే కమ్యూనికేట్ చేయాలి. దీనికి పూర్తి బాధ్యత సదరు సిబ్బందిదే. లింక్డ్ఇన్ వృత్తిపరమైన అవసరాల కోసం, అంటే రెజ్యూమ్‌లు అప్లోడ్ చేయడం లేదా ఉద్యోగ సమాచారం కోరడం వంటి పనులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. యూట్యూబ్, కోరా(YouTube, Quora) వీటిని కేవలం జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి మాత్రమే వాడాలి.కఠినమైన హెచ్చరికలుసౌలభ్యాలను కల్పిస్తూనే సైన్యం కొన్ని అంశాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. క్రాక్డ్ సాఫ్ట్వేర్లు, ఉచిత మూవీ పోర్టల్స్, టొరెంట్, వెబ్ ప్రాక్సీలు, వీపీఎన్ సర్వీలకు వాడకూడదు. చాట్ రూమ్‌లు, ఫైల్ షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ల జోలికి వెళ్లవద్దని సూచించింది. క్లౌడ్ ఆధారిత డేటా సేవల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.2020లో 89 యాప్‌లపై నిషేధంజులై 2020లో చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ భద్రతా ముప్పుల నేపథ్యంలో.. భారత సైన్యం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా 89 యాప్‌లను తక్షణమే తొలగించాలని తన సిబ్బందిని ఆదేశించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన 59 చైనా యాప్‌లు కూడా ఉన్నాయి. తాజా సవరణలు సైనిక భద్రతను కాపాడుతూనే మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. -
బంకర్లో దాక్కోమన్నారు
లాహోర్: ఈ ఏడాది మేలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో బంకర్లో దాక్కోవాలంటూ అధికారులు తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దార్ వెల్లడించారు. 2007లో హత్యకు గురైన తన భార్య, మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా సింధ్ ప్రావిన్స్‌లోని లార్కానాలో ఆదివారం ఏర్పాటైన కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం తెలిపారు. ‘సర్, యుద్ధం మొదలైంది. సురక్షితంగా ఉండటం కోసం బంకర్‌కు వెళ్దాం రండి అంటూ నా సెక్రటరీ వచ్చి నాతో అన్నారు. అందుకు నేను అంగీకరించలేను. మృత్యువు వస్తే ఇక్కడికే రానీయండి. నేతలు ప్రాణాలొదలాల్సింది యుద్ధ క్షేత్రంలోనే..బంకర్లలో కాదని చెప్పా. నేతలు బంకర్లలో కూర్చుని చనిపోవడం సరికాదని అతడికి తెలిపాను. వాస్తవానికి యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తమకు తెలుసు’అని అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే 10 ఎక్కువే అయినా, ఆ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదని వ్యాఖ్యానించారు. #BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj— upuknews (@upuknews1) December 28, 2025అదంతా అబద్ధం: ఆర్మీ రిటైర్డు అధికారి ఆసిఫ్ జర్దారీ చేసిన ప్రకటనపై భారత లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డు) కేజేఎస్ ధిల్లాన్ ఘాటుగా స్పందించారు. యుద్ధం మొదలవుతుందని నాలుగు రోజులు ముందుగానే తెలిస్తే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన భారత క్షిపణులను ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిం«ధూర్ వేళ ఆర్మీ చీఫ్ మునీర్ సహా రాజకీయ నేతలు, మిలటరీ కమాండర్లు బంకర్లోనే దాక్కున్నారన ధిల్లాన్ చెప్పారు. నూర్ ఖాన్ స్థావరంపై దాడి వాస్తవమేభారత్తో మేలో తలెత్తిన సంక్షోభం సమయంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దాడికి గురైందని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించడం ఇదే మొదటిసారి. ‘ఆ∙రోజు ఉదయం 8.15 గంటల వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసి..కాల్పుల విరమణకు భారత్ సిద్ధంగా ఉంది. మీరూ సిద్ధమా? అని నన్నడిగారు. పాక్ ఎల్లప్పు డూ శాంతినే కోరుకుంటుందని బదులిచ్చా’ అని తెలిపారు. -
పాక్ గుండెల్లో ‘సిందూర్ 2.0’ గుబులు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచి్చంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరో కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది. భారత సైన్యం దాడులకు దిగితే తిప్పికొట్టడానికి పీఓకేలోని మూడు సెక్టార్లలో కౌంటర్–అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్(సీ–యూఏఎస్)ను పాక్ సిద్ధం చేసినట్లు భారత నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. రావల్కోట్, కోట్లీ, భింబర్ సెక్టార్లలో వీటిని నెలకొల్పినట్లు పేర్కొన్నాయి. ఎల్ఓసీ వద్ద 30కిపైగా యాంటీ–డ్రోన్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచి్చనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గగనతల నిఘా వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎల్రక్టానిక్ యుద్ధ సామర్థ్యాలు పెంచుకోవడం పాక్ వ్యూహంగా కనిపిస్తోంది.శత్రు డ్రోన్లపై నజర్ భారత్‌లోని పూంచ్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న రావల్కోట్లో యాంటీ–డ్రోన్ల వ్యవస్థలను రెండో ఆజాద్ కశ్మీర్ బ్రిగేడ్ నిర్వహిస్తోంది. రాజౌరీ, నౌషెరా, సుందర్బనీ సెక్టార్లకు ఎదురుగా ఉండే కోట్లీలో వీటి నిర్వహణ బాధ్యతను మూడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు, భింబర్‌లో నిర్వహణను ఏడో ఆజాద్ కశ్మీరీ బ్రిగేడ్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఎల్ఓసీ వెంట ఎల్రక్టానిక్, కైనటిక్ కౌంటర్–యూఏఎస్‌లను పాక్ రంగంలోకి దించినట్లు సమాచారం. ఇందులో కీలకమైన స్పైడర్ వ్యవస్థ కూడా ఉంది. ఇది పది కిలోమీటర్ల దూరంలోని శత్రు డ్రోన్లను కూడా సరిగ్గా గుర్తించగలదు. అంతేకాకుండా పాక్ అమ్ముల పొదిలో సఫ్రా యాంటీ–యూఏవీ జామింగ్ గన్ కూడా ఉంది. దీనిని మనుషులు ఆపరేట్ చేస్తుంటారు. 1.5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను కూలి్చవేయొచ్చు. తక్కువ ఎత్తులో ఎగిరే శత్రు డ్రోన్లను కూల్చడానికి సంప్రదాయ గగనతల రక్షణ ఆయుధాలను కూడా పాక్ ఉపయోగిస్తోంది. జీడీఎఫ్ 35 ఎంఎం ట్విన్ బ్యారెల్ యాంటీ– ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్, అజ్నా ఎంకే–2, ఎంకే–3 మ్యాన్–పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ వద్ద ఉన్నాయి. తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో దూసుకొచ్చే డ్రోన్లను వీటితో కూల్చవచ్చు.తుర్కియే, చైనాలతో పాక్ చర్చలు ఇటీవలి కాలంలో పశ్చిమ సరిహద్దుల్లో భారత సైన్యం కదలికలు ముమ్మరమయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం తరచుగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు పాక్ సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరిస్తున్నారు. ఈ పరిణామాలతో పాక్ అప్రమత్తమైనట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు నూతన డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం తుర్కియే, చైనాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కౌంటర్–డ్రోన్ సామర్థ్యాల విషయంలో పాక్ సైన్యం చాలా బలహీనంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ విషయం నిరూపితమైంది. అందుకే డ్రోన్లతో జరిగే దాడిని తట్టుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు భారత నిఘా వర్గాలు కనిపెట్టాయి. -
విజయ్ దివస్ 2025: పాక్‌ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి..
1971 డిసెంబర్ 16.. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. సరిగ్గా 54 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత సైన్యం అద్భుతమైన వీరత్వాన్ని ప్రదర్శించి, 13 రోజుల ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పాక్‌పై చారిత్రక విజయాన్ని సాధించింది. ఈ మహత్తర విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏటా డిసెంబర్ 16న యావత్ భారతదేశం విజయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారత సైన్యం సాధించిన విజయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సాయుధ దళాల ధైర్యసాహసాలను దేశంలోని ప్రజలు ఈ రోజున గుర్తుచేసుకుంటారు.సైనిక అణచివేతపై పోరాటం..1971 యుద్ధానికి మూలం తూర్పు పాకిస్థాన్‌లో నెలకొన్న తీవ్ర సంక్షోభం. పశ్చిమ పాకిస్తానీ సైన్యం అక్కడ తీవ్రమైన సైనిక అణచివేతకు పాల్పడింది. తూర్పు పాకిస్తానీ పౌరులు హింసను ఎదుర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు భయంతో తమ ఇళ్లను విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, శరణార్థుల సంక్షోభం తీవ్రమవడంతో, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న తూర్పు పాకిస్థాన్ ప్రజలకు మద్దతుగా భారతదేశం రంగంలోకి దిగింది. ఈ జోక్యం 1971 డిసెంబర్ 3 నాటికి సైనిక సంఘర్షణగా మారింది.జనరల్ అమీర్ అబ్దుల్లా లొంగుబాటుభారత సాయుధ దళాలు.. తూర్పు పాకిస్తాన్‌లోని ముక్తి బాహిని (విముక్తి దళాలు) సహకారంతో, సమిష్టిగా పనిచేస్తూ, పాకిస్తానీ సైన్యాన్ని నిర్ణయాత్మకంగా ఓడించాయి. కేవలం 13 రోజుల్లోనే యుద్ధం ముగిసింది. 1971, డిసెంబర్ 16న పాకిస్తానీ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారత సైన్యం, ముక్తి బాహిని సంయుక్త దళాల ముందు లొంగిపోయారు. అలాగే సుమారు 93 వేల మంది పాకిస్తానీ సైనికులు తమ ఆయుధాలను వీడారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చూసిన అతిపెద్ద సైనిక లొంగుబాట్లలో ఒకటి. ఈ యుద్ధం తూర్పు పాకిస్థాన్‌కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.దేశం కోసం ప్రాణాలర్పించి..ఈ అద్భుతమైన విజయం ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. అయితే ఈ గెలుపునకు భారత్ భారీ మూల్యం చెల్లించింది. దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. మరెందరో గాయపడ్డారు. విజయ్ దివస్ అనేది కేవలం విజయాన్ని జరుపుకోవడానికి మాత్రమే కాదు.. నాటి యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు నివాళులు అర్పించే రోజు ఇది. భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం, సరిహద్దుల వద్ద మనలను రక్షించే సైనికులను గౌరవించాల్సిన అవసరాన్ని విజయ్ దివస్ గుర్తుచేస్తుంది. ఈ రోజును భారతదేశం అంతటా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో గల అమర్ జవాన్ జ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.నిరంతర స్ఫూర్తిదాయకంభారత్-బంగ్లాదేశ్ చారిత్రక సంబంధాలను ప్రతిబింబించేలా 20 మంది సభ్యుల బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం భారతదేశంలో జరిగే విజయ్ దివస్ వేడుకలకు హాజరుకానుంది. ఈ బృందంలో 1971 యుద్ధ సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎనిమిది మంది ముక్తిజోధాలు (విముక్తి యోధులు), బంగ్లాదేశ్ సైనిక అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశం యువ తరానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందించడం. స్వాతంత్ర్యం అనేది ఒక బహుమతి అని, దానిని నిరంతరం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని ఈ రోజు పునరుద్ఘాటిస్తుంది. ఇది కూడా చదవండి: విజయ్ దివస్: యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళులు -
ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్ జర్నీ
ఒక ప్రమాదంలో కంటి చూపు పూర్తిగా పోయింది. కానీ మనోధైర్యాన్ని ఏమాత్రం కోల్పో లేదు. విధికెదురొడ్డి తన జీవితాన్ని తానే అత్యంత దృఢంగా నిర్మించుకున్నారో సాహసి. పట్టుదల, దృఢ సంకల్పానికి తోడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో భారతదేశంలోని తొలి పూర్తి అంధుడైన అధికారిగా నిలిచారు. సైన్యంలో క్రియాశీల విధుల్లో పనిచేస్తున్నలెఫ్టినెంట్ కల్నల్ సి. ద్వారకేశ్ విజయగాథ ఏంటో తెలుసుకుందాం.లెఫ్టినెంట్ కల్నల్ సి ద్వారకేశ్ ప్రయాణం ప్రతికూలతకు లొంగని అసాధారణ సంకల్పానికి నిదర్శనం. 2014లో పని సంబంధిత ప్రమాదంలో కంటి చూపు కోల్పోయారు. దీంతో సైనికుడిగా అతడి జీవితం అక్కడితో ముగిసిపోతుందని చాలామంది భావించారు. కానీ అతను మాతరం ఫీనిక్స్‌లా తన చరిత్రను తిరగరాసి చరిత్ర సృష్టించాడు , పూర్తిగా కంటి చూపు కోల్పోయినప్పటికీ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నాడు. అత్యాధునిక AI సాధనాలు, ఇతర సాంకేతికత మద్దతుతో, ద్వారకేశ్ తన దృష్టిగల సహచరుల మాదిరిగానే నైపుణ్యంతో తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు.సియాచిన్ హిమానీనదం ఎక్కడం నుండి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ప్రపంచ రికార్డు సృష్టించడం, ఈత, షూటింగ్ , విద్యావేత్తలలో ఒకడిగా రాణించడం వరకు ప్రతీ సవాలును విజయంగా మార్చుకున్న వైనం స్ఫూర్తి దాయకం. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వికలాంగుల జాతీయ అవార్డును అందుకున్నారు. దేశానికి ఆయన చేసిన అసమానమైన కృషికి గుర్తింపుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగన్ విభాగంలో బుధవారం (డిసెంబర్ 3, 2025) ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల దినోత్సవం రోజున వికలాంగుల జాతీయ అవార్డు ను లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేశ్‌కు ప్రదానం చేశారు. రుజువు చేస్తుంది.ద్వారకేశ్ ఏమన్నారంటే.. విద్యా ,సాంకేతికత ద్వారానే నా వైకల్యాన్ని అధిగమించగలిగాను. అనేక పోటీ పరీక్షలను విజయవంతంగా ఉత్తీర్ణుడయ్యాను. నేను ఇప్పుడు పారా క్రీడలపై, ముఖ్యంగా అంధ క్రీడలపై పూర్తి పరిశోధన చేయగలనని గర్వంగా చెప్పగలను. వైకల్యాన్ని శక్తిగా మార్చుకున్నాను. సాధారణ స్థితికి తిరిగి రావడానికి మార్గాలను కనుగొన్నాను.’’అన్నారు. 2009లో,సైన్యంలో అధికారిని అయ్యాను, భారత రాష్ట్రపతిచే కమిషన్ పొందాను. ఇపుడురాష్ట్రపతి నుండి ఈరోజు అవార్డుతో ధన్యుడినయ్యాను అన్నారు.ఎవరీ ద్వారకేశ్ద్వారకేశ్ తమిళనాడుకు చెందినవారు. పాఠశాల రోజుల నుండి ఆర్మీలో చేరాలనేది అతని కల. అలా NCCలో చేరారు. 2004లో తమిళనాడు NCC డైరెక్టరేట్ ఉత్తమ NCC క్యాడెట్‌గా ఎంపిక చేసింది. UGC నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)కి కూడా అర్హత సాధించారు. పట్టుదలే జీవితం భారత సైన్యం సాంకేతిక ప్రవేశం క్యాడెట్ శిక్షణ విభాగం (CTW)లో చేరాడు. ఆ తర్వాత అతను 2009లో ఆర్మీ యొక్క కార్ప్స్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ను ఎంచుకున్నారు. 2014లో పూణేలో జరిగిన ప్రమాదంలో గాయం కారణంగా రెండు కళ్ళలో పూర్తిగా కంటి చూపు కోల్పోయారు. తన కెరీర్ ప్రారంభంలో ప్రమాదం అతని కళ్ళను కోల్పోయిన తర్వాత, 36 ఏళ్ల ద్వారకేశ్ 2023లో జాతీయ షూటింగ్ పోటీలో స్వర్ణ పతకం గెల్చుకున్నారు. తాను కంటి చూపును కోల్పోయాను, జీవిత దృష్టిని కాదున్న ఆత్మవిశ్వాసం ద్వారకేశ్ది. క్రీడా ప్రయాణం ప్రారంభం2018లో ఖడ్కీలో నియమితులైన ద్వారకేష్ బాంబే ఇంజనీరింగ్ గ్రూప్సెంటర్లో కొత్తగా స్థాపించబడిన పారాలింపిక్ నోడ్‌లో పారా-స్పోర్ట్స్‌ను అభ్యసించడం ప్రారంభించారు. 2021లో ఉదయపూర్‌లో జరిగిన జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలుచు కున్నారు. గాయం తర్వాత అది అతని తొలి పతకం. ఈ గెలుపు మనోధైర్యాన్ని పెంచే పంచ్ ఇచ్చింది. అప్పటినుంచి పతకాల వేట మొదలైంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాక్టీస్ సెషన్లు మరియు పోటీలలో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించారు. అక్టోబర్ 2025లో యుఎఇలో జరిగిన షూటింగ్ ప్రపంచ కప్‌లో ఆయన ఇటీవల సాధించిన 624.6 ప్రపంచ రికార్డు స్కోరు పట్టుదలకు నిదర్శనం. యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) కూడా అర్హత సాధించారు.ప్రస్తుతం భారత పారా షూటింగ్ జట్టులో భాగం. అలాగే మధ్యప్రదేశ్‌లోని మహౌలోని ఆర్మీ మార్క్స్‌మ్యాన్‌షిప్ యూనిట్లో అధునాతన శిక్షణ పొందుతున్నారు. పారాలింపిక్స్‌లో అసాధారణ విజయాన్ని సాధించడం ద్వారా దేశానికి , కార్ప్స్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు అనేక పురస్కారాలను తెచ్చిపెట్టడం విశేషం.ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్ -
తేజస్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇవే!
సాక్షి,న్యూఢిల్లీ: భారత సరిహద్దులను మరింత శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు.. భారత్ సర్కార్ తేజస్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో అస్త్రాలుగా మార్చింది. అయితే, ఈ తేజస్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. తేజస్ చరిత్రలో ముఖ్య ఘట్టాలు1980లలో ప్రారంభం: మిగ్-21లను భర్తీ చేయడానికి స్వదేశీ ఫైటర్ జెట్ అభివృద్ధి ప్రణాళిక మొదలైంది.1990లలో రూపకల్పన: ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కలిసి రూపకల్పన చేశారు.2001 జనవరి 4: టెక్నాలజీ డెమానిస్ట్రేట్ -1 మొదటి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది.2015 జనవరి 17: అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రవేశించింది.2021–2025: Mk1A వెర్షన్ అభివృద్ధి, అధునాతన ఎలక్ట్రానిక్స్, రాడార్, ఆయుధ వ్యవస్థలతో మరింత శక్తివంతంగా తయారు చేశారు.తేజస్ లక్షణాలుతరం: 4.5 జనరేషన్, మల్టీ-రోల్ ఫైటర్ జెట్.డిజైన్: డెల్టా-వింగ్, సింగిల్ ఇంజిన్.బరువు: గరిష్టంగా 13,300 కిలోలు టేకాఫ్ సమయంలో.లోడ్ సామర్థ్యం: 4,000 కిలోల వరకు ఆయుధాలు మోసే సామర్థ్యం.వేరియంట్లుసింగిల్ సీట్ (ఫైటర్ వెర్షన్)ట్విన్ సీట్ (ట్రైనర్ వెర్షన్) నేవీ కోసం ప్రత్యేక వెర్షన్ప్రాముఖ్యతస్వదేశీ అభివృద్ధి: భారతదేశం స్వయంగా రూపొందించిన తొలి ఫైటర్ జెట్.మిగ్-21లకు ప్రత్యామ్నాయం: పాత రష్యన్ విమానాలను భర్తీ చేస్తోంది.ఎగుమతి అవకాశాలు: భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంది.ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్: దీని ద్వారా భారతదేశం స్వదేశీ రక్షణ సాంకేతికతలో పెద్ద అడుగు వేసింది.తాజా పరిణామాలుదుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్ అయ్యింది. ఇది 24 ఏళ్ల చరిత్రలో రెండో ప్రమాదం. ఈ ఘటన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణ ప్రారంభించింది. -
సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు
భారత సరిహద్దుల్లో దేశం కోసం పని చేస్తున్న సైనికులకు అండగా ఇండియన్ ఆర్మీ మోనోరైలు వ్యవస్థను ఏర్పాటు చేసింది. 16,000 అడుగుల ఎత్తులో ఉన్న సైనికులకు ఆహారం, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ స్వదేశీ హై ఆల్టిట్యూడ్ మోనోరైల్ సిస్టమ్ ద్వారా గజరాజ్ కార్ప్స్(భారత సైన్యానికి చెందిన ఎత్తయిన ప్రాంతం)లోని సైనికులకు సర్వీసు అందిస్తున్నారు.కఠినమైన వాతావరణంలో..సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో కమెంగ్ హిమాలయాల్లో ఈ మోనోరైలును ఏర్పాటు చేసినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ ప్రాంతంలోని శిఖరాలు, అనూహ్య వాతావరణం, హిమపాతం కారణంగా సరఫరా మార్గాల్లో తరచుగా అంతరాయాలు ఏర్పడేవి. దాంతో సైనికులకు ఇబ్బందులు తలెత్తేవి. ఈ సమస్యను పరిష్కరించేలా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.గతంలో ఆహార రవాణా ఎలా జరిగేది?కొత్త మోనోరైల్ వ్యవస్థ రాకముందు కొండలపై ఉన్న సైనికులకు ఆహారం, ఇతర సామగ్రిని అందించడం అనేది అత్యంత కష్టతరమైన పనిగా ఉండేది. చాలా సందర్భాల్లో సైనికులు లేదా స్థానిక కూలీలు తమ వీపులపై భారీ సంచులను మోసుకుని మంచుకొండలపై నడుస్తూ ప్రయాణించేవారు. ఎత్తయిన ప్రాంతాల్లో వాహనాల రవాణా కష్టం అయ్యేది. అత్యంత కీలకమైన సామగ్రిని మాత్రమే హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేసేవారు. అయితే, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు హెలికాప్టర్లు ఎగరడం అసాధ్యం అవుతుంది. View this post on Instagram A post shared by Tube Indian (@tube.indian)మోనోరైల్ వ్యవస్థగజరాజ్ కార్ప్స్కు ఈ మోనోరైలు అవసరాన్ని గుర్తించి పరిష్కారాన్ని రూపొందించారు. ఈ రైలు 300 కిలోల బరువును మోయగలదు. మందుగుండు సామగ్రి, రేషన్ (ఆహారం), ఇంధనం, ఇంజినీరింగ్ పరికరాలు వంటి అవసరమైన సామగ్రి నిరంతరాయంగా, సురక్షితంగా మారుమూల పోస్టులకు చేరవేస్తున్నారు. దీన్ని పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళలా పనిచేయడానికి తయారు చేశారు. వడగండ్లు, తుపానులు వంటి వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుని ఇది పనిచేయగలదు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్.. -
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన సైనిక దళాల తాజా ర్యాంకింగ్స్‌ను గ్లోబల్ ఫైర్ పవర్ (Global Fire Power) వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో యునైటెడ్ స్టేట్స్ (USA) అగ్రస్థానంలో ఉండగా, భారత్ సైనిక బలం పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది.నివేదికల ప్రకారం గ్లోబల్ ఫైర్ పవర్ ఈ సంవత్సరం 145 దేశాల సాయుధ దళాలను వారి వనరులు, యుద్ధ పరికరాల ఆధారంగా అంచనా వేసింది. దళాల బలం, ఆర్థిక స్థితి, వనరులతో సహా 60కి పైగా ప్రమాణాలను లెక్చించి, ఆయా దేశాల మిలిటరీలను పోల్చి ర్యాంకింగ్‌ను కేటాయించింది. ఈ ర్యాంకింగ్‌లో దేశాల అణు సామర్థ్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.టాప్ 10 అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశాలు1. యునైటెడ్ స్టేట్స్ (USA)-1వ ర్యాంకుపవర్ ఇండెక్స్ స్కోరు: 0.0744ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా ర్యాంక్ పొందింది. 2024 లో 873 బిలియన్ డాలర్లు దాటిన ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్‌ను కలిగి ఉంది.2. రష్యా-2వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.0788విస్తారమైన అణ్వాయుధాలు కలిగి ఉంది. విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకుల పరంగా ఇది రెండో స్థానంలో ఉంది.3. చైనా: 3వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.0788పవర్ ఇండెక్స్‌లో రష్యాకు సమానంగా ఉంది.4. భారతదేశం: 4వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.1184సైనిక బలం పరంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది.5. దక్షిణ కొరియా: 5వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.16566. యునైటెడ్ కింగ్డమ్ (UK): 6వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.17857. ఫ్రాన్స్: 7వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.18788. జపాన్: 8వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.18399. టర్కీ: 9వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.1902ఫ్రిగేట్ నౌకాదళాలు, హెలికాప్టర్లు, నావికాదళ కార్వెట్లు, జలాంతర్గాములు వంటివి అధికంగా ఉన్నాయి.10. ఇటలీ: 10వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.2164ఇదీ చదవండి: ఓపెన్ఏఐతో ఫోన్ పే భాగస్వామ్యం -
పాక్ గుండెల్లో ‘త్రిశూల్’
న్యూఢిల్లీ: భారత సైన్యం ‘త్రిశూల్’ విన్యాసాలకు సిద్ధమవుతోంది. భారత్–పాకిస్తాన్ సరిహద్దులోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈ నెల 30 నుంచి నవంబర్ 10 దాకా త్రివిధ దళాలు ఈ విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సైన్యం, నావికాదళం, వైమానిక దళం కలిసికట్టుగా నిర్వహించే ఈ విన్యాసాల ద్వారా త్రివిధ దళాల ఉమ్మడి కార్యాచరణ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతోపాటు భారతదేశ ఆత్మనిర్భరతను చాటిచెప్పబోతున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఇవి అతిపెద్ద సైనిక విన్యాసాలుగా రికార్డుకెక్కబోతున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే అతిపెద్ద సైనిక కసరత్తు అని చెప్పొచ్చు. భారత సైన్యం తలపెట్టిన ‘త్రిశూల్’ పట్ల పొరుగుదేశం పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమానయాన సంస్థలకు నోటమ్(నోటీసు టు ఎయిర్‌మెన్) జారీ చేసింది. మధ్య, దక్షిణాది గగనతలంలోని పలు ఎయిర్ ట్రాఫిక్ మార్గాల్లో ఈ ఆంక్షలు విధించింది. ఆయా మార్గాల్లో విమానాల రాకపోకలపై నియంత్రణ విధిస్తారు. అయితే, ఇందుకు కారణాలు ఏమిటన్నది బహిర్గతం చేయలేదు. త్రిశూల్ విన్యాసాల నేపథ్యంలోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం సైనిక విన్యాసాల పట్ల పాక్ బెంబేలెత్తిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. త్రిశూల్‌కు అడ్డంకులు సృష్టించాలన్నదే పాక్ ప్రయత్నంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్ క్రీక్‌పై వివాదం త్రిశూల్ విన్యాసాల కోసం 28,000 అడుగుల ఎత్తువరకు గగనతలాన్ని రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషకుడు డామియన్ సైమన్ పంచుకున్నారు. త్రిశూల్ కోసం ఎంచుకున్న ప్రాంతం, అందుకోసం జరుగుతున్న సన్నద్ధత ‘అసాధారణం’ అని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో జరిగే ఈ విన్యాసాల్లో సదరన్ కమాండ్ కూడా చురుగ్గా పాల్గొనబోతుందని రక్షణ శాఖ తెలియజేసింది. ఎడారి, కొండలు, అడవులు, సముద్రం.. ఇలా విభిన్నమైన భౌగోళిక పరిస్థితుల్లో విన్యాసాలు జరగబోతున్నాయి. సర్ క్రీక్‌పై భారత్, పాక్ మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. సర్ క్రీక్ పూర్తిగా తమదేనని రెండు దేశాలు వాదిస్తున్నాయి. ఇది రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం. సర్ క్రీక్‌లో అవాంఛనీయ చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెప్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే పాకిస్తాన్‌ను హెచ్చరించారు. చరిత్రను, భౌగోళిక పరిస్థితులను మార్చేలా తమ ప్రతిస్పందన ఉంటుందని ఆయన తేలి్చచెప్పారు. సర్ క్రీక్ భారత్‌లోని గుజరాత్, పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్ మధ్యనున్న చిత్తడి నేలలతో కూడిన ప్రాంతం. ఇక్కడ మానవ ఆవాసాలు లేవు. దీని పొడవు 96 కిలోమీటర్లు. భద్రత, సైనిక పరంగా రెండు దేశాలకు ఇది కీలకమైనది. సర్ క్రీక్‌లో సైనిక మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. అందుకే పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో త్రిశూల్ విన్యాసాల కోసం భారత సైన్యం సర్ క్రీక్‌ను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
తుది శ్వాస వరకూ పోరాటమే
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేసింది. ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణ కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఎంతోమంది ముష్కరులు అంతమయ్యారు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు సైతం ధ్వంసమయ్యాయి. అంతిమంగా పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. అయితే, ఆపరేషన్ సిందూర్‌ను తిప్పికొట్టడానికి పాక్ సైన్యం ప్రయత్నించింది. డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. పాక్ దాడుల్లో భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఎస్ఐ మొహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాఖామ్ వీరమరణం పొందారు. మరణానంతరం వారికి వీర్ చక్ర పురస్కారం లభించింది. వారు చివరి వరకూ వీరోచిత పోరాటం సాగించారని, అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శించారని కేంద్రం ప్రభుత్వం ఈ నెల 4న ప్రచురించిన గెజిట్‌లో ప్రశంసించింది. ఈ ఏడాది మే 10న జమ్మూలోని ఖర్కోలాలో బోర్డర్ ఔట్‌పోస్టుపై పాక్ సైన్యం దాడికి దిగింది. డ్రోన్లు ప్రయోగించింది. ఎస్ఐ ఇంతియాజ్ అక్కడే విధుల్లో ఉన్నారు. తన బంకర్ నుంచి బయటకు వచ్చారు. లైట్‌మెషిన్ గన్‌తో ఒక పాక్ డ్రోన్‌ను కూల్చివేశారు. కానిస్టేబుల్ దీపక్ మరో డ్రోన్‌ను నేలమట్టం చేశారు. ఇంతలో పాక్ భూభాగం నుంచి ఫిరంగి గుండు దూసుకొచ్చింది. ఎస్ఐ ఇంతియాజ్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ లేక్కచేయకుండా తన దళాన్ని ముందుకు నడిపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తన సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వారికి ప్రేరణ కల్పించారు. జవానో.. ఆజ్ ఖతం కరో ఇన్కో(సైనికులారా.. పాకిస్తాన్ ముష్కరులను అంతం చేయండి) అంటూ బిగ్గరగా అరిచారు. విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. గాయపడిన కానిస్టేబుల్ దీపక్ సైతం ఆఖరి క్షణం వరకూ యుద్ధం సాగిస్తూనే మృతిచెందారు. ప్రభుత్వం వారిద్దరి ప్రాణత్యాగాన్ని గుర్తించింది. వీర్‌చక్రను ప్రదానం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న 16 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు పోలీస్ శౌర్య పతకాలు లభించాయి. -
రష్యా నుంచి అదనంగా ఎస్–400 సిస్టమ్స్
న్యూఢిల్లీ: రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ కీలకపాత్ర పోషించాయి. వీటి పనితీరు అద్భుతంగా ఉన్నట్లు తేలింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్‌ను సమకూర్చుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. రష్యా అధ్యక్షుడు ఈ ఏడాది డిసెంబర్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఎస్–400ల కొనుగోలు గురించి పుతిన్‌తో మోదీ చర్చించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదు ఎస్–400ల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం 2018 అక్టోబర్‌లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు. ఇందులో మూడు ఎస్–400లను భారత్‌కు రష్యా అప్పగించింది. మిగిలిన రెండు త్వరలో రానున్నాయి. ఇవి కాకుండా అదనపు వ్యవస్థల కొనుగోలుకు ప్రతిపాదన సిద్ధమైంది. -
QRSAM: ‘అనంత’ గర్జన!
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాయు రక్షణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పెంచేందుకు రక్షణ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో శత్రువుల కుట్రలను తిప్పికొట్టేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన ‘అనంత శస్త్ర’క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. సుమారు రూ.30 వేల కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను సైన్యం జారీ చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను గతంలో ‘క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్’(క్యూఆర్ఎస్ఏఎం)గా పిలిచేవారు. మొత్తం ఐదు నుంచి ఆరు రెజిమెంట్లకు సరిపడా ‘అనంత శస్త్ర’వ్యవస్థను సమకూర్చుకోనున్నారు. మే నెలలో ‘ఆపరేషన్ సిందూర్’పేరిట పాకిస్తాన్ డ్రోన్ల కుట్రను భగ్నం చేయడంలో ఈ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ‘అనంత శస్త్ర’అత్యంత అధునాతన, హై–మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీని ప్రత్యేకతలు ఇవే.. → కదులుతూనే శత్రు లక్ష్యాలను గుర్తించి, ట్రాక్ చేయగలదు. → చాలా తక్కువ సమయంలో ఆగి, వెంటనే క్షిపణులను ప్రయోగించగలదు. → దీని పరిధి సుమారు 30 కిలోమీటర్లు. రేయింబవళ్లూ పనిచేస్తుంది. → ఎంఆర్–ఎస్ఏఎం ఆకాశ్ వంటి వ్యవస్థలతో కలిసి పనిచేస్తూ వాయు రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాతే ఆమోదం ‘ఆపరేషన్ సిందూర్’సమయంలో పాకిస్తాన్‌కు చెందిన అనేక డ్రోన్లను భారత సైన్యం ఎల్–70, జేయూ–23 ఎయిర్ డిఫెన్స్ గన్లతో కూల్చివేసింది. అదే సమయంలో ఆకాశ్, ఎంఆర్–ఎస్ఏఎం వాయుసేనకు చెందిన స్పైడర్, సుదర్శన్ ఎస్–400 వ్యవస్థలు కూడా కీలక భూమిక పోషించాయి. ఈ ఆపరేషన్ విజయవంతం అయిన తర్వాతే ‘అనంత శస్త్ర’కొనుగోలుకు రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) పచ్చజెండా ఊపింది. ఈ కొత్త వ్యవస్థతో పాటు సైన్యానికి అత్యాధునిక రాడార్లు, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, జామర్లు, లేజర్ ఆధారిత ఆయుధాలు కూడా అందనున్నాయి. ముఖ్యంగా పాక్ సైన్యం వాడే తుర్కియే, చైనా డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేతృత్వంలో రక్షణ రంగంలో స్వదేశీకరణ శరవేగంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో ‘జోరావర్’తేలికపాటి ట్యాంకులు, మరిన్ని స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థలు సైన్యంలో చేరనున్నాయి. -
అక్టోబర్‌లో ఆర్మీ డ్రోన్ల విన్యాసాలు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ వేళ సరిహద్దు మీదుగా పాకిస్తాన్‌కు చెందిన వందల డ్రోన్ల దండు దండయాత్రకు దిగడంతో ప్రతిదాడి ఆవశ్యకతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం కొనుగోలుచేసిన, సొంతంగా అభివృద్ధిచేసిన పలు రకాల డ్రోన్ల శక్తిసామర్థ్యాలను మరోసారి పునర్‌సమీక్షించాల్సిన తరుణం ఆసన్నమైంది. వచ్చే నెలలో ఈ మేరకు డ్రోన్ల విన్యాసాల కార్యక్రమానికి హెడ్‌క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (హెచ్‌క్యూ ఐడీఎస్) శ్రీకారం చుట్టింది. డ్రోన్ల శక్తిసామర్థ్యాలు, శత్రు డ్రోన్లను ఎదుర్కోవడం, వాటిని నేలమట్టంచేయడం వంటి కీలక బాధ్యతలను అవి ఏమేరకు నెరవేర్చుతాయనే అంశాలను ఈ ఎక్సర్సైజ్లో పరిశీలించనున్నారు. కౌంటర్–డ్రోన్ వ్యవస్థల పనితీరునూ బేరేజువేయనున్నారు. అక్టోబర్ ఆరు నుంచి పదో తేదీ వరకు మధ్యప్రదేశ్‌లో ఆర్మీ అ«దీనంలోని సెంట్రల్ సెక్టార్లో ఈ డ్రోన్ల విన్యాస కార్యక్రమం జరగనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ విన్యాసాల కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల పాశవిక దాడి, తదనంతరం ఆపరేషన్ సిందూర్ జరిగిన ఐదు నెలల తర్వాత డ్రోన్ల ఎక్సర్సైజ్ ప్రక్రియ మొదలుకావడం గమనార్హం. సైనికపర ఆలోచన, ఆచరణలో దూకుడు.. ‘కోల్డ్ స్టార్ట్’ఎక్సర్సైజ్ విషయమై మంగళవారం ఢిల్లీలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సదస్సులో ఎయిర్ మార్షల్ రాకేశ్ సిన్హా, హెచ్క్యూఐడీఎస్లో డెప్యూటీ చీఫ్ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌తో యుద్ధప్రాంతం, యుద్ధంచేసే తీరులో మార్పు వచి్చందని స్పష్టమైంది. ఇకపై సైనికపర ఆలోచన, ఆచరణలో మరింత దూకుడు అవసరం. ‘‘మానవరహిత వాయు వ్యవస్థలుగా ఎదిగిన డ్రోన్లరంగంలో ఆధునిక పోకడలను అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకెళ్తాం. ఈ ఎక్సర్సైజ్లో డ్రోన్ పరిశ్రమ వర్గాలు, పరిశోధకులు, నవ్యావిష్కర్తలు, బోధనారంగ ప్రముఖులు పాల్గొంటారు. ఇన్నాళ్లూ డ్రోన్ల కేవలం సహాయకారులుగా భావించాం. ఇకపై ఘర్షణల్లో అవి కీలకభూమిక పోషించనున్నాయి. నిఘా సమాచార సేకరణ, తక్కువ శ్రేణి దాడుల్లో డ్రోన్ల సామర్థ్యం అపారం. శత్రువును డ్రోన్లతో ఏమార్చడం, మన స్థావరాలపై దాడులు చేయకుండా డ్రోన్లపై దాడి జరిగేలా చేసే శత్రు సామర్థ్యాలను వృథా చేయడం, మన స్థావరాలను సురక్షితంగా కాపాడుకోవడం వంటివెన్నో డ్రోన్లతో సాధ్యం’’అని ఎయిర్ మార్షల్ రాకేశ్ సిన్హా అన్నారు. ‘‘స్వల్ప పరిమాణంలో ఉన్న చిన్న డ్రోన్ల దండు దాడిచేయడం, ఆత్మాహుతి కామికాజి డ్రోన్లు దాడి చేయడం, నిఘా, పర్యవేక్షణ డ్రోన్లు చుట్టుముట్టడంతో ఇప్పుడు గగనతలం అనేది ఏమాత్రం క్షేమంకాదని అన్ని దేశాలకు తెలిసొచి్చంది. ఈ మేరకు సంక్లిష్ట విద్యుదయస్కాంత గగన క్షేత్రంలోనూ పైచేయి సాధించేందుకు ఆధునిక డ్రోన్లను అమ్ములపొదిలోకి చేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’’అని సిన్హా వ్యాఖ్యానించారు. -
ఆపరేషన్ సిందూర్ పార్ట్-2.. పార్ట్-3 కూడా ఉంటది!
ఆపరేషన్ సిందూర్ అనేది ఒక సైనిక చర్య కాదని.. అది మన దేశ రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పశక్తికి ప్రతీక అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాగని ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదని.. కేవలం తాత్కాలికంగా నిలిపివేశామని స్పష్టత ఇచ్చారు. ఆఫ్రికా దేశం మొరాకో పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. ‘‘ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశాం. ఆపరేషన్ సిందూర్ పార్ట్-2, 3 ఉంటుందా? అనేది పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశం ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. తగిన విధంగా బదులిస్తాం. ఇందుకోసం భారత సైన్యం సన్నద్ధంగా ఉంది. ప్రభుత్వం ఆదేశిస్తే తక్షణమే రంగంలోకి దిగుతుంది’’ రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనా ఆయన స్పందించారు. పీవోకేపై దాడి అవసరం లేదని.. అది స్వయంగా భారత్‌లో కలిసిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.2025 ఏప్రిల్ 22న.. జమ్ము కశ్మీర్ బైసరన్ లోయ వద్ద సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF) ప్రకటించుకుంది(తర్వాత తాము కాదంటూ ఫ్లేట్ ఫిరాయించింది కూడా). ఈలోపు.. మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పేరిట మెరుపు దాడులతో భారత సైన్యం పాక్‌లోకి దూసుకెళ్లి.. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే.. పాక్ బతిమాలి కాల్పుల విరమణకు అంగీకరించడంతో భారత్ ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. జూలై 28వ తేదీన శ్రీనగర్ దాచిగాం ప్రాంతంలో భారత సైన్యం, జమ్ము పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం సూత్రధారులు సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ(పహల్గాం దాడికి ప్రధాన సూత్రధారి), టీఆర్ఎఫ్ సభ్యులు హమ్జా అఫ్గానీ, జిబ్రాన్ మరణించారు. -
పాక్ సైన్యం కవ్వింపులు.. ఎల్వోసీలో భారత ఆర్మీ అలర్ట్
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్లో పాక్ సైన్యం కవ్వింపులకు దిగింది. దీంతో భారత సైన్యం ఎదురు కాల్పులు చేసి పాక్‌ను సమర్థంగా తిప్పికొట్టింది.వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ అనంతరం దాయాది దేశం పాకిస్తాన్ సైలెంట్ అయ్యింది. భారత్‌తో ఎలాంటి చర్యలకు పాల్పడలేదు. కానీ, తాజాగా సెప్టెంబర్ 20న సాయంత్రం 6.15 గంటల సమయంలో పాక్ ఆర్మీ.. మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ(Loc) వెంట కాల్పులకు తెగబడింది. దీంతో, అప్రమత్తమైన భారత సైన్యం.. ఎదురు కాల్పులు జరిపింది. సుమారు గంట పాటు కాల్పులు కొనసాగాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు.BIG BREAKING 🚨 🚨 Reports of Ceasefire violations by Pakistan along LoC. Indian Army has responded with heavy fire reportedly destroying Pak Army posts in Leepa valley. No damages on our side.Official confirmation awaited! pic.twitter.com/3Fbm9Cdrnw— Megh Updates 🚨™ (@MeghUpdates) September 20, 2025అయితే, తాజాగా కవ్వింపు చర్యల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే పాక్ సైన్యం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందనే అనుమానం కలుగుతోంది. -
‘లష్కరే’ కేంద్రం ధ్వంసం నిజమే!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీ కారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఉగ్రవాద సంస్థలు కకావికలమయ్యాయి. తమకు జరిగిన నష్టంపై నోరువిప్పుతున్నాయి. భారత సైన్యం దాడులతో జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం ముక్కలైందని ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ఇప్పటికే అంగీకరించాడు. వైమానిక దాడుల్లో బహవల్పూర్ స్థావరం దెబ్బతిన్నదని వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని మరో ముష్కర ముఠా లష్కరే తోయిబా కమాండర్ ఖాసిం కూడా తాజాగా స్పందించాడు. ఆపరేషన్ సిందూర్ కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లిందని, తమ ప్రధాన కేంద్రం ‘మర్కజ్ తయిబా’ ధ్వంసమైందని వెల్లడించాడు. మే 7న జరిగిన దాడుల్లో మురిద్కే పట్టణంలోని ఈ కేంద్రం నామరూపాల్లేకుండా పోవడంతో మళ్లీ నిర్మిస్తున్నట్లు చెప్పాడు. ధ్వంసమైన భవనం కంటే.. ఈసారి భగవంతుడి దయతో పెద్ద భవనం నిర్మిస్తున్నామని తెలియజేశాడు. మర్కజ్ తయిబా శిథిలాలపై నిలబడి ఖాసిం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మాణంలో ఉన్న భవనం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. పాక్ భూభాగంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని షేక్‌పురా జిల్లాలో మురిద్కే పట్టణం ఉంది. మర్కజ్ తయిబాలో ముజాహిదీన్లు(ఉగ్రవాదులు), తలాబాలకు(విద్యార్థులు) శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. దౌరా–ఇ–సుఫాలో చేరండి మర్కజ్ తయిబాలో దౌరా–ఇ–సుఫాలో చేరాలంటూ పాకిస్తాన్ యువతకు లష్కరే తోయిబా ఖాసిం పిలుపునిస్తున్న మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దౌరా–ఇ–సుఫా అనేది ఉగ్రవాద శిక్షణ కార్యక్రమం. ఇక్కడ జిహాదీ శిక్షణలో భాగంగా మత విద్య కూడా బోధిస్తారు. తమ స్థావరం పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం సహకరిస్తున్నాయని, నిధులు అందజేస్తున్నాయని లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ వెల్లడించడం గమనార్హం. లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాన్ని మళ్లీ నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు సైతం ధ్రువీకరించాయి. 2026 ఫిబ్రవరి 5న జరిగే ‘కశ్మీర్ సంఘీభావ దినం’ నాటికి కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, లాంఛనంగా ప్రారంభించాలని లష్కరే తోయిబా ముఠా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఖైబర్ పఖ్తూంక్వాకు పాక్ ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో కనీసం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంపై పాక్ ఉగ్రవాద సంస్థలు దృష్టిపెట్టాయి. తమ ప్రధాన కేంద్రాలను ఖైబర్ పఖ్తూంక్వా(పీకేపీ) ప్రావిన్స్‌కు తరలిస్తున్నారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఖైబర్ పఖ్తూంక్వా అనేది ఎత్తయిన కొండలతో నిండిన శత్రుదుర్భేద్య ప్రాంతం. అఫ్గానిస్తాన్‌కు సమీపంలో ఉండడం ఉగ్రవాదులకు అనుకూలించే అంశం. జిహాదీ శక్తులకు ఇది ప్రధాన అడ్డా. భారత సైన్యం వైమానిక, క్షిపణి దాడుల నుంచి తప్పించుకోవాలంటే ఖైబర్ పఖ్తూంక్వాకు తరలి వెళ్లడమే సరైన వ్యూహమని పాక్ ఉగ్రవాద సంస్థలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. -
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బ.. మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తునాతునకలైనట్లు పాకిస్తాన్ జైషే మహమ్మద్ కమాండర్ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.తాజాగా, పాకిస్తాన్లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉర్దూలో కాశ్మీరీ మాట్లాడుతూ.. ‘ఉగ్రవాదాన్ని స్వీకరించి, ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేము ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్పూర్లో భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ముక్కలు చేశాయి’ అని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు. జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో ఏప్రిల్ 22 మధ్యాహ్నం పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. లష్కరే తోయిబా, జైషే ఉగ్రముఠాలే లక్ష్యంగా వాటి స్థావరాలపై బాంబులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన మెరుపుదాడులతో ఈ ఉగ్రసంస్థలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రాన్ని నేలమట్టం చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని 10 మందితో పాటు అతడి మరో నలుగురు అనుచరులు మృతి చెందారు. వారితో పాటు జైషే నెంబర్-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బహవల్పూర్లోని జైషే ఉగ్రస్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. వాటిని పునర్నిర్మించుకునేందుకు పాక్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఎత్తున నిధులు కూడా కేటాయించింది.ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌లో భారత బలగాలు పీవోకే, పాకిస్తాన్లో ఎంతటి బీభత్సం సృష్టించాయో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వివరించడం చర్చాంశనీయంగా మారింది. 🚨 #Exclusive 🇵🇰👺Jaish-e-Mohamad top commander Masood ilyas kashmiri admits that On 7th May his leader Masood Azhar's family was torn into pieces in Bahawalpur attack by Indian forces. Look at the number of gun-wielding security personnel in the background. According to ISPR… pic.twitter.com/OLls70lpFy— OsintTV 📺 (@OsintTV) September 16, 2025 Markaz Subhan Allah, Bahawalpur (Punjab, Pakistan) was the headquarters of Jaish-e-Mohammad. This facility was a key hub for orchestrating terror operations, including the Pulwama attack on Feb 14, 2019. The perpetrators of the bombing were trained at this very site. Demolished. pic.twitter.com/zNhcMylVxW— Amit Malviya (@amitmalviya) May 7, 2025 4th Month Anniversary of Operation Sindoor. Enjoy Guys pic.twitter.com/fJAL3vQvsh— rae (@ChillamChilli) September 7, 2025 -
ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య
పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం పాక్ (IND vs PAK)తో తలపడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది. తద్వారా సూపర్-4 దశకు మార్గాన్ని సుగమం చేసుకుంది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై సాధించిన ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాదు.. తన పుట్టినరోజున టీమిండియా అభిమానులకు ఇలాంటి కానుక ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.పాక్‌పై టీమిండియా గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘స్టేడియంలోని ప్రేక్షకులు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సంతోషకరం. టీమిండియాకు నా తరఫున ఇదొక రిటర్న్ గిఫ్ట్ లాంటిది. ముందు నుంచి గెలుపుపై ఆత్మవిశ్వాసంగానే ఉన్నాము.స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినేఅన్ని మ్యాచ్‌లలాగే ఇదీ ఒకటి అని ముందుగానే అన్నింటికీ సిద్ధమయ్యాము. ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. కొన్ని నెలల క్రితమే ఇక్కడ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. ఇక్కడి పిచ్‌లపై స్పిన్నర్ల అవసరం ఎలాంటిదో నాకు తెలుసు. మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పగల స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినే’’ అని తెలిపాడు. భారత సైన్యానికి ఈ విజయం అంకితంఅదే విధంగా.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మరోసారి చెబుతున్నాను. ఉగ్రమూకలను ఏరివేయడంలో ధైర్యసాహసాలు చూపిన భారత సైన్యానికి ఈ విజయం అంకితం చేస్తున్నాము.వారు ఎల్లప్పుడూ ఇలాగే మనల్ని గర్వపడేలా చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని కోరుకుంటున్నా. వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకువచ్చేందుకు మైదానంలో మాకు వచ్చిన ఏ అవకాశాన్ని మేము వదులుకోము’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ ఉద్వేగానికి లోనయ్యాడు.భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాక్ స్కోరు: 127/9 (20)👉భారత్ స్కోరు: 131/3 (15.5)👉ఫలితం: పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్ (4 ఓవర్ల కోటాలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియోThis victory is for you, India 🇮🇳 Watch #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/KXXzoF9fIR— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
అయిదు తరాల అద్భుతం
‘మా ముత్తాత నాన్న... మిలిటరీ; మా ముత్తాత... మిలిటరీ. మా తాత... మిలిటరీ; మా నాన్న మిలిటరీ. మా అన్న మిలిటరీ. కట్... చేస్తే... ఇప్పుడు నేను కూడా మిలిటరీ. మా వంశవృక్షం... ట్రీ... మిలిటరీ’... ఇదేమీ సినిమా డైలాగ్ కాదు. లెఫ్టినెంట్ పారుల్ ధడ్వాల్ గురించి చెప్పే సగర్వ డైలాగ్.చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ గర్వించిన దగిన సందర్భం. ఈ పరేడ్‌లో 155 మంది ఆఫీసర్ క్యాడెట్స్ పాల్గొన్నారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరు భారత సైన్యంలో విధులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అసలు సిసలు విశేషం... పారుల్ ధడ్వాల్, తమ సైనిక కుటుంబంలో అయిదవ తరానికి చెందిన తొలి మహిళా ఉమెన్ ఆఫీసర్ పారుల్. అద్భుత ప్రతిభ, అంకితాభావంతో రాష్ట్రపతి చేతుల మీదుగా సువర్ణపతకం అందుకుంది.పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలోని జనౌరీ గ్రామానికి చెందిన పారుల్ అయిదో తరం మిలిటరీ వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. పారుల్ ముత్తాత, తాతలు హర్నామ్‌సింగ్ (సుబేదార్), ఎల్.ఎస్.ధడ్వాల్ (మేజర్), దల్జిత్‌సింగ్ ధడ్వాల్ (కల్నల్), నాన్న బ్రిగేడియర్ జగత్ జమ్వాల్ (బ్రిగేడియర్) మిలిటరీలో పనిచేశారు. సోదరుడు ధనుంజయ్ ధడ్వాల్ కెప్టెన్ హోదాలో పనిచేస్తున్నాడు. మిలిటరీలో చేరిన అయిదవ తరానికి చెందిన తొలి మహిళగా తన ప్రత్యేకతను నిలుపుకుంది పారుల్.‘ఇన్ఫినిటీ ప్రైడ్–ఏ లెగసీ ఆఫ్ ఫైవ్ జనరేషన్’ కాప్షన్‌తో ‘ఎక్స్’ వేదికగా పారుల్ ధడ్వాల్ కుటుంబానికి అభినందనలు తెలియజేసింది ఇండియన్ ఆర్మీ. -
ఆర్మీ ట్రెయినింగ్ కమాండ్‌తో ఐఐటీ-హైదరాబాద్ ఒప్పందం
భారత సైన్యం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్), ఇండియన్ ఆర్మీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ప్రారంభించనున్నాయి. ఈమేరకు ఐఐటీ హైదరాబాద్ సిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ (ఏఆర్టీఆర్ఏసీ), సిమ్యులేటర్ డెవలప్మెంట్ డివిజన్ (ఎస్డీడీ)తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. స్వదేశీ సాంకేతిక స్వావలంబనకు ఇది కీలకం కానుందని అధికారులు చెప్పారు.‘విగ్రహ’(వర్చువల్, ఇంటెలిజెంట్, గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ ఇన్ ఏఆర్/వీఆర్ అండ్ హైటెక్ అప్లికేషన్స్ ఫర్ ఇండియన్ ఆర్మీ) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ) భారత నైన్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇరు వర్గాలు తెలిపాయి.‘విగ్రహ’ లక్ష్యం ఏమిటి?భారత సైన్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణ, యుద్ధ సన్నద్ధతకు ఉపయోగించడం ద్వారా సైనిక సంసిద్ధతను నిర్ధారించాలని విగ్రాహ భావిస్తోంది.రియలిస్టిక్ మిలిటరీ ట్రైనింగ్ సిమ్యులేషన్స్ కోసం అడ్వాన్స్డ్ ఏఆర్/వీఆర్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగపడుతాయి.సంక్లిష్ట భూభాగాల్లో సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడం, స్వయంప్రతిపత్తి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏఐ, రోబోటిక్స్, మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఈ సెంటర్ తోడ్పడుతుంది.భారత సైన్యం ఆపరేషనల్ మెలకువలు, వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి బ్యాటిల్ ఫీల్డ్ సిమ్యులేషన్ టూల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ..‘ఈ కేంద్రం కేవలం టెక్ ల్యాబ్ మాత్రమే కాదు. ప్రపంచ స్థాయి ఆవిష్కరణలతో భారతదేశ రక్షణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయాలనే మా ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు. బ్రిగేడియర్ ఏకే చతుర్వేది మాట్లాడుతూ..‘ఈ సహకారం తదుపరి తరం సామర్థ్యాలను స్వీకరించడానికి, స్వదేశీ సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి సైన్యం నిబద్ధతకు హైలైట్ చేస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: భారత్ మూడంచెల ప్లాన్.. -
భారత్ తగ్గేదేలే.. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో మరో మైలురాయి
-
గౌరవ మిలిటరీ ర్యాంకులు పొందిన క్రికెటర్లు వీరే!.. సచిన్ ఒక్కడే ప్రత్యేకం
భారతదేశంలో క్రికెట్ కేవలం ఓ క్రీడ మాత్రమే కాదు.. ఇదొక మతం లాంటిది. క్రికెటర్లును దేవుళ్లుగా భావించే అభిమానులూ కోకొల్లలు. తరతరాలుగా తమ అద్భుత నైపుణ్యాలు, క్రమశిక్షణ, నాయకత్వ పటిమతో భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు.అయితే, వీరిలో కొందరు మాత్రం కేవలం ఆటకే పరిమితం కాకుండా.. తమ దేశభక్తిని చాటుకుంటూ.. సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగుతూ.. సానుకూల దృక్పథాన్ని పెంపొందించాడనికి నడుం బిగించారు. ఇలా సమాజంపై తమదైన ముద్ర వేసిన భారత క్రికెట్ దిగ్గజాలను భారత ఆర్మీ గౌరవ మిలిటరీ ర్యాంకులతో సమున్నంతగా గౌరవించింది. కేవలం ఆటల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. దేశ సేవలోనూ నేరుగా భాగమయ్యే భాగ్యం కల్పించింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్మీ నుంచి గౌరవ ర్యాంకులు అందుకున్న క్రికెటర్లు ఎవరో తెలుకుందామా!!సీకే నాయుడుటీమిండియా మొట్టమొదటి టెస్టు కెప్టెన్ సీకే నాయుడు. భారత క్రికెట్ చరిత్రలో ఆయన పేరు చిరస్మరణీయం. 1923లో హోల్కర్ స్టేట్ పాలకుడు సీకే నాయుడుని కల్నల్ హోదాలో నియమించారు. భారత జట్టు తమ మొట్టమొదటి అధికారిక టెస్టు ఆడే కంటే ముందే ఈ నియామకం జరిగింది.ఇక 1932లో టీమిండియా ఆడిన తొలి టెస్టుకు సీకే నాయుడు నాయకుడు. తన అద్భుత ఆట తీరు, దేశభక్తి ద్వారా స్ఫూర్తిదాయక వ్యక్తిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.హేము అధికారిసైన్యంలో పనిచేసిన అరుదైన క్రికెటర్ల జాబితాలో హేము అధికారి ముందు వరుసలో ఉంటారు. ఆటగాడిగా కొనసాగుతూనే మిలిటరీలోనూ సేవలు అందించిన ఘనత ఆయన సొంతం. తన ప్రతిభతో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చేరిన హేము అధికారి.. యువ క్రికెటర్లకు మెంటార్‌గా వ్యవహరిస్తూనే సైన్యంలో తన విధులు నిర్వర్తించారు.ఇక 1971లో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో విజయవంతం కావడంలో హేము అధికారిది కీలక పాత్ర. ఇటు క్రికెటర్‌గా రాణిస్తూనే.. అటు సైన్యంలోనూ హేము అధికారి తన భూమికను చక్కగా పోషించారు.కపిల్ దేవ్టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్. 1983లో ఆయన సారథ్యంలోని భారత్ తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి అద్భుతమే చేసి.. ప్రపంచ క్రికెట్లో తన ఆగమనాన్ని చాటింది.కాగా 2008లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో భారత సైన్యం కపిల్ దేవ్‌కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించింది. దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఈ హర్యానా హారికేన్‌ను ఈ విధంగా సత్కరించింది. మిలిటరీ సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ త్రివిధ దళాలకు కపిల్ మద్దతుగా నిలిచేవాడు.సచిన్ టెండుల్కర్‘క్రికెట్ దేవుడు’గా కీర్తింపబడుతున్న సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేశాడు. తన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అంతేకాదు.. వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పి దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు.ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పిన సచిన్.. క్రికెట్లో భారత్‌కు ఐకాన్‌గా మారాడు. ఈ క్రమంలో భారత ఆర్మీ సచిన్ సేవలకు గుర్తింపుగా.. 2010లో భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ హోదాతో సత్కరించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి ఈ గౌరవం పొందిన మొదటి ఆటగాడు సచిన్ కావడం గమనార్హం.మహేంద్ర సింగ్ ధోనిభారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. మైదానంలో కూల్‌గా ఉంటూనే.. తెలివైన వ్యూహాలతో ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో దిట్ట. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌తో పాటు .. 2011లో సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌నూ ధోని గెలిచాడు.ఆ తర్వాత 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్‌ను విజేతగా నిలిపాడు ధోని. ఈ క్రమంలో ఈ జార్ఖండ్ డైనమైట్‌కు 2011లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. మిలిటరీ శిక్షణ తీసుకోవడంతో పాటు కీలక సమయాల్లో సైన్యానికి మద్దతుగా నిలబడటంలో ధోని ముందే ఉంటాడు. వీరు కూడా..వీరితో పాటు సునిల్ గావస్కర్, వినూ మన్కడ్, విజయ్ హజారే, విజయ్ మర్చంట్, విజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రి , దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా గౌరవ మిలిటరీ ర్యాంకులు పొందారు.సైన్యంలో చేరిన తర్వాతే క్రికెటర్‌గా వినూ మన్కడ్?లెఫ్టినెంట్ కల్నల్‌గా గావస్కర్ గౌరవం పొందగా.. క్రికెట్లో అడుగుపెట్టే ముందే వినూ మన్కడ్ సైన్యంలో చేరాడు. ఇక విజయ్ హజారే, విజయ్ మర్చంట్, విజయ్ మంజ్రేకర్, రవిశాస్త్రి, దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందారు.చదవండి: న్యూజిలాండ్ క్రికెట్‌కు ఊహించని షాక్ -
శ్వాన్‌సింగ్ కోసం దిగొచ్చిన భారత ఆర్మీ.. పాక్ యుద్ధంలో ఏం చేశాడంటే?
సాయం చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా కలగొచ్చు. కానీ, తమ శక్తికి మించిన సాయం చేయడమనేది మామూలు విషయం కాదు. అది అసాధ్యమనే చెప్పాలి. అయితే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. సరిగ్గా ఆ మనసు కలిగినవాడే శ్వాన్ సింగ్. ఇంతకీ శ్వాస్ సింగ్ ఏం చేశాడంటే..ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎదురుదాడులకు పాల్పడగా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పదేళ్ల శ్వాస్ సింగ్ మన సైనికులకు బాసటగా నిలిచాడు. వారికి మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు. ఇప్పటికే ఆ బాలుడి సేవలను ప్రశంసించిన సైనికాధికారులు.. తాజాగా అతడి చదువుకయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఇతనికి ఉద్యోగం వచ్చే వరకు మొత్తం తన చదువు ఖర్చునంతా భరించబోతోంది.పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో మామ్ డోట్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ శ్వాన్ సింగ్. శ్వాన్ సింగ్ ఇంటికి సరిగ్గా పాతిక కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ ఉంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్.. పంజాబ్‌లోని మామ్ డోట్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న దాడులను మన సైన్యం విజయవంతంగా ఎదుర్కొంది. ఆ నేపధ్యంలో శ్వాన్ సింగ్ ఇంటి ప్రాంతంలో కొంతమంది ఇండియన్ ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు. చుట్టూ తుపాకులు, బాంబుల మోతతో అట్టుడికిపోతున్న ఆ ప్రాంతంలో చీమ కూడా బయటకు రాలేనంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి నుండి చల్లని లస్సీ తయారు చేసుకుని అలసిపోతున్న ఆర్మీ అధికారులకు అందించాడు మన శ్వాన్ సింగ్. అది కూడా ఏమాత్రం బెరుకు, భయం లేకుండా దాదాపు 10 రోజులు అలా ఇస్తూనే ఉన్నాడు. ఇండియన్ ఆర్మీ శ్వాన్‌సింగ్ చేసిన ఈ సాయానికి, తెగువకు ముచ్చటపడి తన చదువును స్పాన్సర్ చేస్తోంది.🇮🇳 The Indian Army will sponsor the education of 10-yr-old Shvan Singh from Ferozepur, Punjab — the youngest warrior of #OperationSindoor, who served soldiers with food day & night during the op.#IndianArmy #ShvanSingh #OperationSindoor #RealHero pic.twitter.com/Bqn1Vot8TD— Aman Dev Barman (@AmanDevBar67676) July 21, 2025ఇక, తాజాగా శ్వాన్సింగ్ను ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా పలకరించింది. సాక్షి అడిగిన పలు ప్రశ్నలకు శ్వాన్‌సింగ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అతడు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాడు.. అతడి పేరెంట్స్ ఏం చేస్తారు.. పది రోజుల పాటు తాను ఇండియన్ ఆర్మీతో గడిపిన క్షణాలను.. యుద్ధం నాటి పరిస్థితులను వివరించాడు.. ఈ వివరాల గురించి కింది వీడియోలో.. -
రకుల్ నుంచి మానుషి వరకు.. మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సెలబ్రిటీలు ఎవరంటే?
కాదేదీ సినిమాకు అనర్హం అన్నట్లుగా ప్రపంచంలో, సమాజంలో ఉన్న ప్రతీది ఓ కథా వస్తువే! కల్పితాలతో పాటు రియల్ స్టోరీలను కూడా వెండితెరపై చూపిస్తూ ఉంటారు. అలా దేశాన్ని సరిహద్దులో ఉండి కాపాడుతున్న సైనికుల పోరాటాలు, జీవన విధానాలు తెరపై ఎన్నోసార్లు ఆవిష్కృతమై బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించాయి. అయితే సినిమాలోనే కాకుండా నిజ జీవితంలోనూ కొందరు సైనికులుగా సేవ చేస్తే మరికొందరు సెలబ్రిటీలకేమో మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ ఇండస్ట్రీలో మిలటరీ నేపథ్యం ఉన్న తారలెవరో ఓసారి చూసేద్దాం..రకుల్, అనుష్క పేరెంట్స్..రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేంద్ర సింగ్ ఆర్మీ అధికారి. అక్షయ్ కుమార్ (Akshya Kumar) తండ్రి హరి ఓం భాటియా విశ్రాంత ఆర్మీ అధికారి. అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలోనూ భాగమయ్యారు. అనుష్క విద్యాభ్యాసమంతా బెంగళూరులోని ఆర్మీ స్కూల్లోనే జరిగింది. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు మధు - అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో వైద్యులుగా సేవలందించారు. నటి లారా దత్తా తండ్రి ఎల్కే దత్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్‌గా పని చేశారు. ఉగ్రదాడిలో వీరమరణంసుష్మితా సేన్ తండ్రి శుభీర్ సేన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో వింగ్ కమాండర్‌గా సేవలందించారు. నిమ్రత్ కౌర్ తండ్రి, ఆర్మీ అధికారి మజోర్ భూపిందర్ సింగ్.. 1994లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందారు. ప్రీతి జింటా తండ్రి దుర్గానంద్ కూడా ఓ జవానే! తెలుగు నటి గాయత్రి గుప్తా తాతయ్య సైతం ఆర్మీలో పని చేశాడు. బ్రిటీష్ వారి చేతిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శ్రద్ధా శ్రీనాథ్ తండ్రి కూడా ఆర్మీ అధికారే!దిశా పటానీ సోదరి కూడా..నేహా ధూపియా తండ్రి ప్రదీప్ సింగ్ ఇండియన్ నేవీలో కమాండర్‌గా పని చేశారు. మానుషి చిల్లర్ తండ్రి మిత్ర బసు చిల్లర్ డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఫిజీషియన్‌గా పని చేశారు. గుల్ పనగ్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ పనగ్.. మిలిటరీలో అందించిన సేవలకుగానూ పరమ విశిష్ట్ సేవా పురస్కారం అందుకున్నారు. దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా సేవలందిస్తున్నారు.చదవండి: బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు.. -
విమెన్ వారియర్స్ ఆర్మీ అధికారులతో ఫెమినా ఇండియా వీడియోవైరల్
ఫెమినా ఇండియా ( Femina India )అంటే అందాల పోటీలు మాత్రమే కాదు. అత్యంత ధైర్య సాహసాలతో అత్యంత క్లిష్టమైన సమయాల్లో దేశానికి సేవచేసే ధీర వనితలను గౌరవించుకోవడం కూడా. ఫెమినా ఇండియా ఆగస్టు 2025 కవర్ పది మంది భారత ఆర్మీ మహిళా అధికారులతో రూపొందించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. “ప్రతి వందనం వెనుక ఒక ప్రయాణం ఉంటుంది. దేశంలోని వివిధ మూలల నుండి విభిన్నమైన, అద్భుతమైన కథలు. వారి గ్లామర్ కోసం కాదు అత్యంత ధైర్యసాహసాలకోసం..అంటూ సాగే ఈవీడియోను విశేషంగా నిలుస్తోంది.వారియర్ ఉమెన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ శీర్షికతో 1997-బ్యాచ్ IRAS అధికారి అనంత్ రూపనగుడి షేర్ చేసిన శక్తివంతమైన వీడియోను ఫెమినా ఇండియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది కేవలం ఫ్యాషన్ షూట్ కాదు-యూనిఫాంలో అధికారులుగా దేశాన్ని రక్షించే మహిళలకు ఒక బోల్డ్ సెల్యూట్. ఇండియన్ ఆర్మీలో మహిళల ఇమేజ్ను ముఖ్యంగా, పది మంది విశిష్ట మహిళా అధికారులకు గొప్ప గౌరవ సూచకంగా దీన్ని రూపొందించింది. ఈ శక్తివంతమైన వీడియోలో, మ్యాగజైన్ కవర్ షూట్ దేశంలోని మహిళా యోధులకు సెల్యూట్ చేసింది. కల్నల్ల నుండి లాన్స్ నాయక్ వరకు పది మంది భారతీయ ఆర్మీ అధికారులు తమ ఆలివ్-గ్రీన్ యూనిఫామ్‌లలో సగర్వంగా ఇందులో కనిపిస్తారు. ప్రతీ ఫ్రేమ్‌లో వారి ధైర్య సాహసాలు, క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. ఎన్నో అడ్డంకులను ఛేదించి, ఈ స్థాయికి చేరి దేశానికి గౌరవంగా సేవ చేస్తూ అచంచలమైన దేశభక్తి నిదర్శనంగా ఉన్నారు. అంతేకాదు ఎంతోమంది మహిళలకు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రేరణనిచ్చేట్టుగా, దేశ సేవ ద్వారా తమ ధైర్యాన్ని పట్టుదలను నూరిపోసేట్టుగా ఉందీ వీడియో. View this post on Instagram A post shared by Femina (@feminaindia) ఈ వీడియోలో కల్నల్ సోఫియా ఖురేషి, కల్నల్ మేఘనా డేవ్, కల్నల్ పోనుంగ్ డోమింగ్, SM, కల్నల్ అన్షు జామ్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ కృతికా పాటిల్, మేజర్ ద్విపన్నిత కలిత, కెప్టెన్ ఓజస్విత శ్రీ, కెప్టెన్ శ్రద్ధా శివదావ్కర్, లాన్స్ నాయక్ ఆషిక, లాన్స్ నాయక్ మంజును చూడవచ్చు.కల్నల్ సోఫియా ఖురేషి: సోఫియా ఖురేషి భారత సైన్యంలో సీనియర్ అధికారి ఆపరేషన్ సిందూర్ సమయంలో అధికారిక ప్రెస్ బ్రీఫింగ్‌కు నాయకత్వం వహించి వార్తల్లోనిలిచిన ధీర.మేజర్ డాక్టర్ దీపన్విత (ద్విపన్నిత) కలిత: అస్సాం మొట్టమొదటి మహిళా పారాట్రూపర్, ఆగ్రాలో శిక్షణ పొంది 2023లో ధేకియాజులి నుండి ఫెమినా ఇండియా కవర్ వరకు ఆమె ప్రయాణం ప్రేరణ యొక్క స్మారక చిహ్నంగా మారింది. ల్నల్ పోనుంగ్ డోమింగ్: అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన మొదటి మహిళా కల్నల్. -
బాలీవుడ్ తారలు.. నిజ జీవితంలో సైనికులు..
పోరాటాలు, నిరసనలు, ప్రాణాత్యాగాలతోనే స్వాతంత్ర్యం వచ్చింది. భరతమాత తన సంకెళ్లు విదిలించుకుని స్వేచ్ఛను పొంది నేటి(ఆగస్టు 15)కి 79 ఏళ్లు. ఈ స్వాతంత్ర్య దినోత్సవంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. దేశభక్తిని చాటిచెప్పే పాటలెన్నో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం దేశాన్ని శత్రువుల బారి నుంచి కంటికిరెప్పలా కాపాడుతున్న ఆర్మీలో పని చేసిన సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్న తారలకు సెల్యూట్ చేద్దాం..కెప్టెన్ రాజు80's, 90'sలో విలన్‌గా రాణించిన కెప్టెన్ రాజు ఒకప్పుడు భారత ఆర్మీకి కెప్టెన్‌గా వ్యవహరించారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్నారు. ఐదేళ్లు సైన్యంలో ఉన్న రాజు తర్వాత ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లోకి వచ్చారు.సునీల్ శెట్టిసునీల్ శెట్టి సైన్యంలో పని చేయలేదు, కానీ అతడి తండ్రి వీరప్ప శెట్టి లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆర్మీలో సేవలందించారు.నానా పటేకర్నానాపటేకర్ మూడేళ్లపాటు ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో గౌరవ కెప్టెన్‌గా వ్యవహరించారు. కొంతకాలానికే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. 2013లో ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.సంజయ్ దత్1947లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాల్గొన్నాడు.అచ్యుత్ పోట్దార్నటుడు అచ్యుత్ చదువు పూర్తవగానే ఆర్మీలో చేరారు. ఆ తర్వాత సినిమాల్లో రంగప్రవేశం చేశారు.బిక్రంజీత్ కన్వర్పాల్బిక్రంజీత్ నటుడు కాకముందు ఒక జవాన్.. మేజర్‌గా ఉన్నప్పుడే ఆర్మీ నుంచి వైదొలిగారు.గుఫి పైంటల్మహాభారతం సీరియల్లో శకునిగా నటించిన గుఫి ఒకప్పుడు ఆర్మీలో పని చేసినవ్యక్తే.. భారత్-చైనా సరిహద్దులో జవాన్‌గా విధులు నిర్వర్తించారు.మహ్మద్ అలీ షాతండ్రి బాటలోనే నడుస్తూ అలీ షా కూడా సైన్యంలో చేరాడు. ఆర్మీలో మేజర్‌గా పని చేశారు. తర్వాత సినిమాల్లోకి వచ్చారు.రుద్రశిష్ ముజందార్చిచోరే, జెర్సీ ఫేమ్ రుద్రశిష్ ముజందార్ 2011లో సైన్యంలో చేరారు. 2018లో మేజర్‌గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ తీసుకున్నారు.మనోజ్ బాజ్పాయ్సత్య నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee)కు ఆర్మీలో పని చేయాలన్నది కల. జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష రాసి పాసయ్యాడు, కానీ ఇంటర్వ్యూలో ఫెయిలయ్యాడు. నిజ జీవితంలో ఆర్మీలో చేరలేకపోయాడు కానీ 1971 సినిమాలో జవాన్‌గా నటించాడు.చదవండి: ‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే? -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో ఆపరేషన్ అకాల్ తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాల ప్రయత్నించాయి. శుక్రవారం రాత్రి ఎదురుకాల్పుల్లో భాగంగా ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థలంలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.Operation AKHAL, Kulgam | Lance/Naik Pritpal Singh and Sepoy Harminder Singh made supreme sacrifice. Indian Army expresses deepest condolences and stands in solidarity with the bereaved families. Operation continues: Chinar Corps, Indian Army pic.twitter.com/WtabIZ6Mf0— ANI (@ANI) August 9, 2025 -
దేవభూమిలో విలయం.. గల్లంతైనవాళ్లు ఎందరో?
దేవభూమిని మరోమారు భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నాం కుంభవృష్టి ధాటికి వరద పోటెత్తి ఏకంగా రెండు గ్రామాలు సర్వనాశనం అయ్యాయి. నివాసాలు, హోటల్స్ బురద వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ విలయం ధాటికి ఇప్పటికే ఐదుగురు మరణించగా.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు, అదే సమయంలో చిక్కుకుపోయిన వాళ్లను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఉత్తరాఖండ్‌లో.. మంగళవారం ఉత్తరకాశీ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ కుంభవృష్టి పెను విషాదాన్ని మిగిల్చింది. హర్సిల్ సమీపంలోని ఖీర్ గధ్ వాగు నీటిమట్టం ఊహించని రీతిలో ప్రమాదస్థాయికి చేరుకుని ఒక్కసారిగా సమీప గ్రామాలపై విరుచుకుపడింది. స్వల్ప వ్యవధిలో ధరాలీ (Dharali), సుకీ(Sukhi) గ్రామాలను కొండకు చెరోవైపు నుంచి ఆకస్మిక వరద(Flash Floods) ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో.. గల్లైంతన వారి కోసం బుధవారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటిదాకా ఐదు మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీశాయి. మరో 130 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే భారీ వర్షం సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తోంది. అయినప్పటికీ సైన్యం ముందుకు వెళ్తోంది. శరణార్థులకు భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలను అందిస్తోంది. పోలీస్, అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), భారత సైన్యం.. విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. కనీసం 50 మంది గల్లంతై ఉండొచ్చని స్థానికుల సమాచారం ఆధారంగా అధికారులు ప్రకటన చేశారు. అయితే.. కేవలం కేరళ నుంచి 28 మందితో వచ్చిన ఓ బృందం ఆచూకీ లేకుండా పోవడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు వాతావరణ శాఖ మళ్లీ భారీవర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. పర్వత జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్ ఎంపీలు ఇవాళ ప్రధాని మోదీని కలిసి సహాయక చర్యలపై విజ్ఞప్తి చేశారు. కేంద్రం అన్నివిధాలా ఆదుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి పుష్పర్ ధామి ఉత్తర కాశీలో ఏరియల్ సర్వే నిర్వహించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 🚨 "𝗦𝘄𝗶𝗳𝘁 𝘁𝗼 𝗥𝗲𝘀𝗽𝗼𝗻𝗱, 𝗖𝗼𝗺𝗺𝗶𝘁𝘁𝗲𝗱 𝘁𝗼 𝗣𝗿𝗼𝘁𝗲𝗰𝘁." 🪖📍Kheer Gad, Dharali Village | Uttarkashi | 1345 Hrs, 05 Aug 2025A massive mudslide struck #Dharali village in the #KheerGad area near Harsil, triggering sudden flow of debris and water through the… pic.twitter.com/FwPPMrIpqu— SuryaCommand_IA (@suryacommand) August 5, 2025 -
ఆపరేషన్ మహాదేవ్: పహల్గాం నిందితుల ప్లాన్ బెడిసి కొట్టి.. చివరికి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రం ఆపరేషన్ మహాదేవ్‌తో పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకారంతో భారత్ ఆపరేషన్ మహాదేవ్ పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టింది.వాళ్లను హతమార్చింది. అయితే, తాజాగా భారత సైనికులు ఆపరేషన్ మహాదేవ్కు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది సులేమాన్, అఫ్గానీ, జిబ్రాన్ ముగ్గురూ పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT) సభ్యులు. ఉగ్రదాడి తర్వాత నిందితులు శ్రీనగర్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా నిందితుల కమ్యూనికేషన్ ట్రాక్ చేసింది.శ్రీనగర్ సమీపంలోని లిడ్వాస్ ప్రాంతంలో స్థావరాల్ని గుర్తించింది.అయితే, ఉగ్రవాదులు ఆపత్కాలకంలో స్థావరాల నుంచి పారిపోయేందుకు ఎనిమిది కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సొరంగాన్ని భారత సైన్యం గుర్తించింది. ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభం తర్వాత తప్పించుకునేందుకు వీలు లేకుండా ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న ఎనిమిది కిలోమీటర్ల మేర నీటితో నింపింది. ఆ తర్వాతే లిడ్వాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలపై ఆకస్మికంగా బుల్లెట్ల వర్షం కురిపించింది. నిద్రపోతున్న పహల్గాం నిందితుల్ని మట్టుబెట్టింది. అనంతరం వారివద్ద నుంచి ఆయుధాలు,బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఆ బుల్లెట్లను.. పహల్గాంలో దాడికి ఉపయోగించిన బుల్లెట్లతో సరిపోల్చారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద దొరికిన బుల్లెట్లు.. పహల్గాంలో మారణహోమం సృష్టించిన బుల్లెట్లతో 100శాతం సరిపోల్చినట్లు భారత సైన్యం నిర్ధారించింది. ఆపరేషన్ మహాదేవ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘ఈ ముగ్గురు ఉగ్రవాదులు పహల్గాం దాడికి బాధ్యులే అని శాస్త్రీయంగా నిర్ధారించాం. దేశం ముందు నిజాన్ని ఉంచేందుకు అన్ని ఆధారాలు సేకరించాం’అని స్పష్టం చేశారు. -
ఆపరేషన్ సిందూర్ అద్భుతం : వైఎస్ అవినాష్
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు వైఎస్సార్సీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో అపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ చర్యలకు జవాబు దారి చేయాలి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హకీమ్ స్వయంగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతిస్తున్నామని చెప్పాడు. వైఎస్సార్సీపీ జమ్మూ కాశ్మీర్ పౌరులకు సంఘీభావం ప్రకటిస్తోంది. అనేక సంవత్సరాల అస్థిర పరిస్థితుల మధ్య మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతోంది. పహల్గాం దాడితో ఈ ప్రయత్నాలకు కొంత దెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ అద్భుతంగా నిర్వహించిన భారత ఆర్మీని వైఎస్సార్సీపీ అభినందిస్తోంది. ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యానికి ఒక ప్రతీక. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. అత్యంత ఖచ్చితత్వంతో సైనిక బలగాలు పాకిస్తాన్‌లోని ఉగ్రస్తావరాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి జరిగింది. అరగంటలోపే మొత్తం ఆపరేషన్ పూర్తి చేశారు. డ్రోన్ సిస్టంలతో వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయవంతంగా పూర్తి చేసింది. సంఖ్యాత్మక బలం కంటే సాంకేతికత ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పింది. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తతతో సన్నద్ధంగా ఉండడం కీలకం. జాతీయ సార్వభౌమత్వాన్ని రక్షించడానికి రక్షణ బడ్జెట్‌ను పెంచడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ చర్చలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్పహల్గాం దాడి జరిగిన రోజు, కాల్పుల విరమణ జరిగిన రోజు ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను తోసి పుచ్చారు.ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. స్వయంగా పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణ చేయాలని అడిగారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను సృష్టించినది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలోనే చైనాకు కాశ్మీర్ భూభాగం ధారా దత్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పాకిస్తాన్ చైనా కారిడార్ ఒప్పందాలు జరిగాయి.ఎంపీ గౌరవ్ గొగోయ్ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌పై భారత్ కాల్పుల విమరణకు ఎందుకు అంగీకరించిందో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాకుండా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా ఇరు దేశాలపై తాను ఒత్తిడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26సార్లు పాకిస్తాన్లను కాల్పుల విరమణకు బలవంతం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు మాట్లాడారు. దీని వెనుక ఉన్న నిజం మాకు తెలుసుకోవాని అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సహాయం అందించకుండా భారత్ ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. పహల్గాం ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టకపోవడం,పాక్‌కు బుద్ధి చెప్పామంటూనే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయడం వంటి అంశాలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీటుగా బదులిచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం అంతే. పాక్, పాక్ ఆక్రమిత ఉగ్రవాదుల ఏరివేతే లక్క్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం మన కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ సైనికులు సింహాలు. దేశ రక్షణ సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసే విషయంలో జాగ్రతగా ఉండాలి’ అంటూ ప్రతిపక్షాలకు రాజ్‌నాథ్ సూచించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ప్రభుత్వానికి అడగడం ప్రతిపక్షం పని. కొన్నిసార్లు, మన విమానాలను ఎన్ని కూల్చివేసారని మన ప్రతిపక్ష సభ్యులు అడుగుతూనే ఉంటారు. కానీ మన దళాలు ఎన్ని పాకిస్తాన్ విమానాలను కూల్చివేశామని వారు ఎప్పుడూ అడగరు. మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే, ఈ ఆపరేషన్‌లో మన సైనికుల్లో ఎవరికైనా హాని జరిగిందా అని అడగండి? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా? లేదు’ అని అన్నారు.సోమవారం (జులై 28)లోక్‌సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య.ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం.ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చంపారు మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఊరుకునేది లేదు. పాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాం. భారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది. పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. 100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం.హిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాం.టెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాం.పాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం.పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసింది. పాక్‌లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాం.ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్.పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు.భారత నౌకా దళం కూడా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది.పాక్‌ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరింది.మన దాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..గ్యాప్ ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.బాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు. -
ఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉంది: సీడీఎస్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనేది ఇంకా ఆన్‌లోనే ఉందని సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్ సెమినార్‌కు హాజరైన అనిల్ చౌహాన్ మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్ సిందూర్‌ను భారత్ చేపట్టింది.మే 7వ తేదీన భారత్ చేపట్టిన ఈఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. భారత్ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్.. భారత్ ఆర్మీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్. -
అపాచీ ఆగయా
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మైలురాయి లాంటి ఘట్టం చోటుచేసుకుంది. 15 నెలల నిరీక్షణకు తెరపడింది. అత్యాధునిక ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో అడుగుపెట్టాయి. మొదటి బ్యాచ్‌లో భాగంగా మూడు హెలికాప్టర్లను అమెరికా మిలటరీ సరుకు రవాణా విమానంలో మంగళవారం ఇండియాకు చేర్చారు. ఒప్పందం ప్రకారం 2024 మార్చి నెలలోనే రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో పలుమార్లు జాప్యం చోటుచేసుకుంది. ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ రూపొందించింది. ఎడారిని భ్రమింపజేసే రంగులో ఉన్న ఈ చాపర్లను రాజస్తాన్‌లోని జైపూర్‌లో మోహరించబోతున్నారు. ఇవి ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ మలీ్టరోల్ కాంబాట్ హెలికాప్టర్లు. ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. ఒప్పందం ప్రకారం బోయింగ్ సంస్థ మొత్తం ఆరింటిని సరఫరా చేయాల్సి ఉండగా, మిగతా మూడు హెలికాప్టర్లను ఈ ఏడాది ఆఖరు కల్లా అందించనుంది. ఇప్పటికే 22 ఈ–మోడల్ అపాచీలను బోయింగ్ కంపెనీ భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) అందజేసింది. ఏహెచ్–64ఈ అపాచీలను సరఫరా చేయడం ఇదే మొదటిసారి. మొత్తం ఆరు హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం అమెరికా సర్కార్‌తోపాటు బోయింగ్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.4,168 కోట్లు. శత్రువులపై నిప్పుల వాన అపాచీ హెలికాప్టర్ల రాక పట్ల భారత సైన్యం హర్షం వ్యక్తంచేసింది. వీటితో సైనిక దళాల పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రధానంగా భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో కీలక సైనిక ఆపరేషన్ల కోసం ఏహెచ్–64ఈ అపాచీలను ఉపయోగించబోతున్నారు. ఉగ్రవాదుల కార్యకాలపాలను కట్టడి చేయడంతో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ముష్కరుల గుండెల్లో వణుకు పుట్టించడం తథ్యమని నిపుణులు అంటున్నారు. భూఉపరితలంతోపాటు ఆకాశంలో శత్రువుల ఉనికిని గుర్తించి, దాడి చేయడంలో అడ్వాన్స్డ్ టార్గెటింగ్ సిస్టమ్స్‌తో కూడిన ఈ హెలికాప్టర్లకు తిరుగులేదని చెబుతున్నారు. అమెరికా సైన్యంలో వీటి శక్తిసామర్థ్యాలు నిరూపితం కావడంతో కొనుగోలు చేసేందుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయని బోయింగ్ సంస్థ తెలియజేసింది. ⇒ ఏహెచ్–64ఈ అపాచీ అటాక్ హెలికాప్టర్లలో తుపాకులు, రాకెట్లు, క్షిపణుల వంటి బహుళ ఆయుధాలు అమర్చారు. 30 ఎంఎం ఎం230 చైన్ గన్, 70 ఎంఎం హైడ్రా రాకెట్లు ఇందులో అంతర్భాగమే. తక్కువ దూరం, ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడి చేయొచ్చు. ⇒ గంటకు 365 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 480 కిలోమీటర్ల పరిధిలో పనిచేయగలవు. ఆటోమేటిక్ చైన్ గన్ నిమిషానికి 625 రౌండ్లు పేల్చగలదు. ⇒ ఇక ఏజీఎం–114 హెల్ఫైర్ క్షిపణులతో భూమిపై ఆరు కిలోమీటర్ల దూరంలోని సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంక్‌లను సైతం ధ్వంసం చేయొచ్చు. ⇒ గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్ట్రింగర్ మిస్సైళ్లు మరో ప్రత్యేకత. గాలిలో ప్రయాణిస్తుండగానే శత్రుదేశాల హెలికాప్టర్లు, మానవ రహిత వాహనాలను కూల్చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే అపాచీలు శత్రువులపై నిప్పుల వర్షం కురిపించి, తుత్తునియలు చేయగలవు. ⇒ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం మరో ప్రత్యేకత. పగలు, రాత్రి, వర్షంలో, దుమ్ములో, ధూళిలో, పొగలో... భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నా ముందుకు దూసుకెళ్లి దాడి చేసేలా ఇందులో సెన్సార్లు, టార్గెటింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ⇒ సంక్లిష్టమైన యుద్ధ వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేస్తాయి. దృఢమైన నిర్మాణం కావడంతో శత్రువుల దాడిని తట్టుకుంటాయి. చిన్నపాటి ఆయుధాలు ప్రయోగించినా ఏమాత్రం చెక్కుచెదిరే ప్రసక్తే ఉండదు. అపాచీలో ఇద్దరు ప్రయాణించవచ్చు. ఒకరు పైలట్‌గా వ్యవహరిస్తారు. మరొకరు ఆయుధ వ్యవస్థను నియంత్రిస్తారు. ⇒ అపాచీ హెలికాప్టర్లు అమెరికా సైన్యంలో గత 40 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి. 1980వ దశకం తర్వాత కీలకమైన ఆపరేషన్లలో పాల్గొన్నాయి. విశ్వసనీయత, ప్రభావశీలతను నిరూపించుకున్నాయి. -
సైన్యానికి 7 వేల ఏకే–203 రైఫిల్స్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సాయుధంగా బలపడుతోంది. దశాబ్దాల కాలం నాటి రైఫిళ్ల వాడకాన్ని దశలవారీగా నిలిపేయనుంది. తాజాగా శిక్షణ పూర్తిచేసుకోబోతున్న సైనికుల బ్యాచ్‌కు మరో రెండు, మూడు వారాల్లో 7,000 దాకా కలాష్నికోవ్ ఏకే–203 రకం రైఫిళ్లను అందజేయనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి నగరంలో ఇండో–రష్యన్ భాగస్వామ్యంతో ఈ రైఫిళ్లను తయారుచేస్తున్న విషయం విదితమే. గత 18 నెలల్లో 48,000 రైఫిళ్లను తయారుచేసి సరఫరాచేశారు. 2023 జనవరిలో ఏకే203 రైఫిళ్ల ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. 2026 కల్లా 1,00,000 యూనిట్లను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఇండో–రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ గడువు ముగియనుంది. తర్వాత పూర్తిగా స్వదేశీ రైఫిల్‌గా ఇది అవతరించనుంది. ప్రస్తుతం రైఫిళ్లను 50 శాతం స్వదేశీ భాగాలతో ఉత్పత్తి చేస్తున్నారు. అమేథీలో ప్రతి నెలా 12,000 రైఫిళ్లు తయారవుతున్నాయి. ప్రతి వంద సెకన్లకు ఒక రైఫిల్ తయారవుతోంది. ఒక సంవత్సరంలో 1.5 లక్షల రైఫిళ్లను ఉత్పత్తి చేస్తారు. పూర్తి ఆర్డర్ అంటే.. 6 లక్షల రైఫిళ్ల తయారీ 2030నాటికి పూర్తి కానుంది. గడువు కంటే దాదాపు 22 నెలలు ముందుగానే అన్ని రైళ్ల తయారీ, సరఫరా పూర్తి చేయనున్నట్టు అంచనా. ఇక ఈ రైఫిల్స్‌కు ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయాలంటూ విజ్ఞప్తులు వచ్చాయి. భారత త్రివిధ బలగాల అవసరాలు తీరాక అనంతరం విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఏకే–203 ప్రత్యేకతలుపాత కలాష్నికోవ్ సిరీస్‌కు ఆధునిక రూపం అయిన ఏకే–203 ఖచ్చితత్వంలో పనిచేస్తుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలతోపాటు అధిక ఎత్తుల్లో రణక్షేత్రాల్లో సులువుగా ఉపయోగించేందుకు అనువుగా దీనిని రూపొందించారు. నిమిషానికి 700 తూటాలను దీని నుంచి ప్రయోగించవచ్చు. గరిష్టంగా 800 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఇది ఖచ్చితత్వంతో చేధించగలదు. -
ధ్వంసం చేస్తూ.. దిశ మార్చుకుంటూ
అహ్మద్‌నగర్: వేగంగా దూసుకెళ్తూ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటూ గురిచూసి లక్ష్యాలను ఛేదించే అధునాతన శతఘ్ని విభాగంలో భారత్ మరో ఘనత సాధించింది. తొలిసారిగా గరిష్టస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దేశవాళీ శతఘ్ని (మౌంటెడ్ గన్ సిస్టమ్–ఎంజీఎస్)ని తయారు చేసినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ప్రకటించింది.తద్వారా శతఘ్నుల్ని వేగంగా మోహరించే అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆరి్టలరీ గన్ సిస్టమ్(ఏటీఏజీఎస్)లో భారత్ మరో ముందడుగువేసింది. త్వరలో ఈ ఎంజీఎస్ను పూర్తిస్థాయి పరీక్షల కోసం భారత సై న్యానికి అప్పగించనున్నారు. దీర్ఘకాలంపాటు కొనసాగే ఈ పరీక్షల్లో ఎంజీఎస్ తన సత్తాను చాటితే ఆ తర్వాత దీనిని సైన్యంలో విలీనం చేస్తారు. బాలాసోర్, పోఖ్రాన్లో దీనిని విజయవంతంగా పరీక్షించి చూశా మని వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (వీఆర్డీఈ) చీఫ్ జి.రామమోహనరావు చెప్పారు. ఎన్నెన్నో ప్రత్యేకతలు⇒ 155ఎంఎం/52 కాలిబర్ మందుగుండును పేల్చే సామర్థ్యంతో ఈ అధునాతన శతఘ్నిని రూపొందించారు. డీఆర్డీవోకు చెందిన అహ్మద్‌నగర్‌లోని వీఆర్డీ దీనిని తయారు చేసింది. ⇒ 85 సెకన్ల వ్యవధిలోనే వేగంగా విచ్చుకుని మందుగుండును లోడ్ చేసుకోగలదు. ఒక నిమిషంలో ఆరుసార్లు బాంబులను ప్రయోగించగలదు. ⇒ మందుగుండును ప్రయోగించగానే తన జాడ శత్రువులకు తెలీకుండా ఉండేందుకు వేగంగా ముడుచుకుని వేరే చోటుకు ప్రయాణం సాగించగలదు. ఒక చోట ఉండి భిన్న దిశలో బాంబులను ప్రయోగించగలదు. ⇒ ఇందులోంచి మందుగుండును పేల్చే గన్ బరువే ఏకంగా 30 టన్నులు. ⇒ గరిష్టంగా 45 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం తుత్తునియలు చేయగలదు. దీని క్యాబిన్‌ను పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ కవచంతో నిర్మించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు సైనికులు ప్రయాణించవచ్చు. ⇒ ఈ శతఘ్నిలో దాదాపు 85 శాతం పరికరాలు భారత్‌లో తయారైనవే. ⇒ దిగ్గజ ఫ్రాన్స్ సీజర్, ఇజ్రాయెల్ అ ట్మోస్ 2000 సిస్టమ్‌ల తరహాలో ఈ శ తఘ్నిని రూపొందించారు. ఒక్కో యూనిట్ ధర తో పోలిస్తే దీని తయారీ ఖర్చు తక్కువ. -
రైల్వే స్టేషన్లో పురుడు!
ఝాన్సీ: భారత ఆర్మీ.. సేవకు, త్యాగానికి మారు పేరు. ఆ పేరును మరోసారి నిలుపుకొన్నారీ ఆర్మీ వైద్యుడు. ఝాన్సీ స్టేషన్లో మహిళకు ప్రసవం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. పన్వేల్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఓ గర్భిణీ భర్త, బిడ్డతో ప్రయాణిస్తోంది. మార్గమధ్యంలో ఆమెకు ప్రసవ వేదన మొదలైంది. భర్త వెంటనే రైల్ మదద్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్మీలో వైద్యుడైన 31 ఏళ్ల మేజర్ రోహిత్ బచ్వాలా ఝాన్సీ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్నారు. పన్వేల్–గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఝాన్సీకి చేరగానే ఆయనకు విషయం తెలిసింది. ఏమాత్రం ఆలోచించకుండా స్టేషన్ లోని ఫుట్ ఓవర్ వంతెనను తాత్కాలిక ప్రసూ తి వార్డుగా మార్చారు. చిన్న కత్తి, జుట్టుకు పెట్టుకునే క్లిప్పులు, ధోతీ ఉపయోగించి సురక్షితంగా ప్రసవం చేశారు. మహిళా రైల్వే సిబ్బంది సహకరించారు. ప్రసవం తర్వాత మహిళకు, పురిటి పాపాయికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అందుబాటులో ఉన్న అతి సాధారణ వనరులతోనే ప్రసవం చేసిన మేజర్‌ను సైనిధికారులు కొనియాడారు. సోషల్ మీడియాలోనూ ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. -
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా, తుర్కియే సాయం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు దాని మిత్రదేశం చైనా సహకరించిందా? ఇండియాకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసిందా? అంటే అవుననే చెబుతున్నారు భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్.సింగ్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. మే 7 నుంచి 10వ తేదీ దాకా నాలుగు రోజులపాటు ఆ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యం దాడిలో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, లాండ్ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరించిందని, ఇండియన్ ఆర్మీ కదలికలకు సంబంధించి రియల్ టైమ్ సమాచారం చేరవేసిందని రాహుల్ ఆర్.సింగ్ తెలియజేశారు. తుర్కియే సైతం పాక్‌కు అండదండలు అందించిందని, కొన్ని రకాల ఆయుధాలు సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ‘నూతన తరంలో సైనిక సాంకేతికతలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భా రత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకి స్తాన్‌కు చైనా, తుర్కియేలు చేతనైనంత సాయం చేశాయని పేర్కొన్నారు. ఆ మూడు దేశాల కుట్రను తాము ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. తెరపైన కనిపించింది పాకిస్తాన్ కాగా, తెరవెనుక చైనా, తుర్కియే ఉన్నాయని వెల్లడించారు. #WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm— ANI (@ANI) July 4, 2025అరువు తెచ్చుకున్న కత్తి చైనా తన ఆయుధాల సామర్థ్యం పరీక్షించుకోవడానికి పాకిస్తాన్‌ను ప్రయోగశాలగా వాడుకుంటోందని రాహుల్ ఆర్.సింగ్ స్పష్టంచేశారు. ఆ ఆయుధాలను చైనా గడ్డపై నుంచి ఇతర దేశాలపైకి ప్రయోగిస్తోందన్నారు. పాక్‌కు చైనా సహకరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే పాకిస్తాన్‌కు 81 శాతం మిలటరీ హార్డ్‌వేర్ చైనా నుంచే వచ్చినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. పాక్ భూభాగం చైనాకు లైవ్ ల్యాబ్‌గా మారినట్లు తేల్చిచెప్పారు. యుద్ధక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టకుండా ఇండియాపైకి పాకిస్తాన్‌ను ఉసిగొల్పడమే డ్రాగన్ వ్యూహమని రాహుల్ ఆర్.సింగ్ తెలిపారు. ‘అరువు తెచ్చుకున్న శక్తితో శత్రువును చంపడం’ చైనా ప్రాచీన యుద్ధతంత్రంలో భాగమని గుర్తుచేశారు. సరిహద్దుల్లో ఘర్షణ పడడం కంటే పాకిస్తాన్‌ను ముందుపెట్టి భారత్‌కు ఇబ్బందులు సృష్టించడం చైనా ధ్యేయంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చిన కొద్దిరోజులకే తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అప్పట్లో వారు నిర్ణయించుకున్నారు. తుర్కియే అందిస్తున్న సహకారానికి షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)
-
భారత్ కి అపాచీ యుద్ద హెలికాప్టర్లు వచ్చేస్తున్నాయ్ !
-
శత్రు భీకర అపాచీలొస్తున్నాయ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. ఐదేళ్ల క్రితంనాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలుపంచుకోనున్నాయి. దాదాపు రూ.5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్‌కు అమెరికా ఆరు అపాచీ ఏహెచ్–64ఇ రకం యుద్ధ హెలికాప్టర్లను అందచేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సిఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈనెలలోనే మూడింటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనున్నట్లు తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోనే కొన్ని హెలికాప్టర్లను అందుకున్నా యుద్ధ హెలికాప్టర్ల అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కు తొలుత గత మే–జూన్‌లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్‌కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్‌లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్‌కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా మూడు హెలికాప్టర్లను మరుసటి ఏడాదిలో అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనికదళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్య చేధనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ములపొది మరింత శక్తివంతంకానుంది. 2015నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన, ఎటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్–64ఇ కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది. మెరుపుదాడిలో దిట్ట→ 2012లో తయారుచేసిన ఏహెచ్–64డీ బ్లాక్–3ని మరింత ఆధునీకరించి ఏహెచ్–64ఈ గార్డియన్‌గా రూపాంతరీకరించారు.→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకధాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.→ గరిష్టంగా 16 హెల్ఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, వందల బుల్లెట్ల వర్షం కురిపించే 30 ఎంఎం బుల్లెట్ చైన్ ఇందులో అమర్చారు.→ గరిష్టంగా 10,543 కేజీల బరువులను మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు.→ గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు→ నూతన తరం హెలికాప్టర్లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్నరకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానమవుతుంది. అంటే క్షిపణిని ప్రయోగించి మిస్సైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది.→ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు.→ తాను సేకరించిన డేటాను, శత్రుజాడను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అప్రమత్తంచేస్తుంది. తనపై దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు, భూ స్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు.→ ఇన్ఫ్రారెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అననుకూల పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు→ టీ700– జనరల్ ఎలక్ట్రిక్701డీ రకం శక్తివంతమైన ఇంజిన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు. → అన్ని రకాల డ్రోన్ల నుంచి సీ, డీ, ఎల్, కేయూ బ్యాండ్ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్‌కు చేరవేయగలదు→ వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది. దీంతో ఎక్కువ సేపు శత్రువుతో పోరాడేందుకు ఇది ఎంతో అనువైంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్‌కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్‌బేస్‌లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్‌లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్‌బేస్‌లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్‌తో కవర్ చేశారని సోషల్‌మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్‌ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్‌ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్‌లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025 -
సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు
లక్నో: భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా కొన్ని సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. భారత సైన్యాన్ని గానీ, ఇతర వ్యక్తులను గానీ కించపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడే స్వేచ్ఛను భావ ప్రకటనా స్వేచ్ఛగా పరిగణించలేమని స్పష్టంచేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. 2022లో భారత్ జోడో యాత్ర సమయంలో భారత సైన్యాన్ని కించపర్చేలా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆరోపిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ డైరెక్టర్ ఉదయ్‌శంకర్ శ్రీవాస్తవ లక్నో కోర్టులో ఫిర్యాదు చేశారు. దాంతో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమన్లు కొట్టివేయాలని కోరుతూ రాహుల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) పౌరులకు వాక్ స్వాతంత్య్రపు హక్కు కల్పించినట్లు గుర్తుచేసింది. అయినప్పటికీ సైన్యాన్ని, వ్యక్తులను కించపర్చేలా మాట్లాడే హక్కుల ఎవరికీ లేదని పేర్కొంది. రాహుల్ గాంధీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. -
హద్దులు మీరొద్దు.. రాహుల్‌పై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం
అలహాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని.. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రానికి కూడా పరిమితులు ఉంటాయని.. సైన్యాన్ని కించపరచకూడదని పేర్కొంది. చైనాతో గాల్వాన్ ఘర్షణలపై రాహుల్ చేసిన కామెంట్స్‌ను అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది.2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లక్నో కోర్టు సమన్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుభాష్ విద్యార్థితో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది.రాహుల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం.. వాక్ స్వాతంత్య్రం హక్కులో ఏ వ్యక్తికైనా, సైన్యానికి అయినా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసే స్వేచ్చ లేదంటూ స్పష్టం చేసింది. భవిష్యత్ లో సైన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ గాంధీని హైకోర్టు మందలించింది.కాగా, 2022లో భారత్ జోడో యాత్రలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీపై దాడులు చేస్తున్నారని.. సైనికులను కొడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చైనా 2000 కిలో మీటర్ల భారత భూ భాగాన్ని ఆక్రమించి, 20 మంది భారత సైనికులను చంపేసిందని రాహల్ ఆరోపణలు చేశారు. ఆయన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు జారీ చేసింది. -
మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. నేరుగా పాక్ లో కి దూసుకుపోయి మరీ ఉగ్రస్థావరాలను, పలు పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను భారత్ నేలమట్టం చేసింది. దీన్ని తిప్పికొట్టాలని పాక్ ప్రయత్నించినా ఆపరేషన్ సిందూర్ విధ్వంసాన్ని ఆపడం వారి వల్ల కాలేదు. ఆపరేషన్ సిందూర్ తో పాక్ రక్షణ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయ్యిందనే నిజాన్ని కూడా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ధృవీకరించారు.ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దీన్ని లేవెనెత్తింది. భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయిందా.. లేదా చెప్పాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై కేంద్రం ఏమీ క్లారిటీ ఇవ్వకపోయినా, భారత బలగాల సీడీఎస్(చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్) అనిల్ చౌహాన్ ఎట్టకేలకు తొలిసారి స్పందిస్తూ.. ‘ అవును.. పాక్ తో జరిగిన యుద్ధంలో భారత్ ఫైటర్ జెట్స్ ను కోల్పోయిన మాట వాస్తవమే. యుద్ధం అన్నాక కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. మనం ఎన్ని కోల్పోయాం అనేది ప్రశ్న కాదు.. ఎందుకు కోల్పోయాం అనేది మాత్రమే సమీక్షించుకోవాలి. అయితే పాకిస్తాన్ చెప్పినట్లు ఆరు ఫైటర్ జెట్స్ ను మనం కోల్పోలేదు. అందులో వాస్తవం లేదు’ అని స్పష్టం చేశారు. సింగపూర్ లోని బ్లూమ్ బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అనిల్ చౌహాన్. అయితే కోల్పోయిన ఫైటర్ జెట్స్ ఏమిటనేది మాత్రం చెప్పలేదు. అదే సమయంలో ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయమనేది కూడా చెప్పలేదు. అది ప్రస్తుతం అప్రస్తుతం అన్న రీతిలోనే ఆయన సమాధానం చెప్పారు. ఇక్కడ సంఖ్య అనేది ముఖ్యం కాదంటూ బదులిచ్చారాయన. -
ఆపరేషన్ సిందూర్ వేళ భారత మహిళా జవాన్ల దెబ్బకు పాక్ ఆర్మీ పరుగులు
న్యూఢిల్లీ: మూడు రోజులు. రేయింబవళ్లు. రెండు పోస్టులు. ఏడుగురు మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించారు. భారత మహిళా బీఎస్ఎఫ్ జవాన్ల ధైర్య సాహసాలతో పాకిస్తాన్ సైన్యం జడుసుకుంది. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది. ప్రస్తుతం మహిళా బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆపరేషన్ సిందూర్ గురించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక ఆపరేషన్ సిందూర్‌లో క్రితం బీఎస్ఎఫ్లో చేరిన అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలో ఆరుగురు మహిళా బీఎస్ఎఫ్ జవానులు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) అఖ్నూర్ సెక్టార్ వద్ద పాక్ దళాలపై నేరుగా కాల్పుల్లో పాల్గొన్నారు. అఖ్నూర్‌లోని రెండు ఫార్వర్డ్ పోస్టులు, పాకిస్తాన్‌కు చెందిన సియోల్‌కోట్ ప్రాంతంలోని శత్రు పోస్టులపై మూడు రోజులు, మూడు రాత్రుల పాటు జరిపిన నిర్విరామంగా జరిపిన కాల్పులకు ఎదురొడ్డి ధైర్యసాహసాల్ని ప్రదర్శించారు. పాక్ సైన్యం చేస్తున్న కాల్పులకు ప్రతిఘటిస్తూ.. డ్రోన్లు, మోర్టార్ షెల్స్‌ను కూల్చేశారు. కాల్పుల ధాటికి కేవలం 150 మీటర్ల దూరంలో శత్రు దళాలు వెనక్కి తగ్గాయి. తమ స్థావరాల్ని వదిలి వెళ్లాయి. ఈ ఆరుగురిలో నలుగురు 2023లోనే బీఎస్ఎఫ్లో చేరారు. మంజీత్ కౌర్, మల్కీత్ కౌర్ వీళ్లద్దరు పంజాబ్‌కు చెందిన వారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఫార్వర్డ్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తించగా, బీఎస్ఎఫ్లో కొత్తగా చేరిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్న రాథ్, శాంపా బసాక్, ఝార్ఖండ్‌కు చెందిన సుమి జెక్స్, ఒడిశాకు చెందిన జ్యోతి బనియన్లు శత్రు దాడిని తిప్పికొట్టారు.ఈ సందర్భంగా నేహా భండారి మాట్లాడుతూ.. మాకు శిక్షణ పురుష జవాన్లతో సమానంగా ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో పురుష సైన్యానికి సమానంగా శత్రువులను ఎదుర్కొనేందుకు అవకాశంగా భావించాం. దాయాది సైన్యాన్ని నిలువరించాం. మా తాత, అమ్మా,నాన్నలు సైన్యంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకు దేశం కోసం పనిచేసేందుకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం వీరి ధైర్య సాహసాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
ఆపరేషన్ షీల్డ్ వాయిదా
న్యూఢిల్లీ: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ(మే 29న) సాయంత్రం చేపట్టాల్సిన ఆపరేషన్ షీల్డ్(Operation Shield) వాయిదా పడింది. గుజరాత్, రాజస్థాన్, ఛండీగఢ్, జమ్ము, హర్యానాలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే.. పాలనాపరమైన కారణాల వల్ల దానిని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.యుద్ధంలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాలి, మరీ ముఖ్యంగా పౌర రక్షణ నేపథ్యంతో మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రయత్నది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కంటే కొన్ని గంటల ముందు.. మే 7వ తేదీన తొలిసారి పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇవాళ మరోసారి సాయంత్రం 5గం.లకు గుజరాత్, రాజస్థాన్, ఛండీగఢ్, జమ్ము, హర్యానాలో రెండోసారి నిర్వహించాలనుకున్నాయి. అయితే..హర్యానా తప్పించి మిగతా రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్‌ను వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రానికే హోం శాఖ ప్రకటించింది. కానీ, హర్యానా కూడా వాయిదాకే మొగ్గు చూపించడంతో తాజా ప్రకటన చేశారు. అధికారిక కారణాల వల్ల మాక్ డ్రిల్స్ వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని కేంద్ర హోం శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. దీంతో సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర హోం శాఖ మాక్ డ్రిల్స్(Mock Drills) నిర్వహించింది. సైరన్ వినగానే ప్రజలు అప్రమత్తమైన చెవులు మూసుకుని కింద పడుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం.. భద్రతా బలగాలు వాళ్లను తరలించడం.. దాడుల్లో గాయపడిన వాళ్లను రెస్క్యూ చేయడం తరహా చర్యలు ఇందులో ఉంటాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. చివరిసారిగా.. 1971లో తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్‌లో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. అయితే.. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా.. అవి సరిహద్దు జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి.ఇదీ చదవండి: శాంతిని మేం బలంగా కోరుకుంటున్నాం-పాక్ ప్రధాని -
OP Sindoor: పాక్ ఎయిర్‌బేస్‌పై భారత్ గట్టి దెబ్బ
పహల్గాం దాడికి ప్రతీకారంగా.. ఉగ్ర శిబిరాల నాశనమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించి తాజాగా మరికొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో పాకిస్థాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి.తాజా శాటిలైట్ ఫొటోల ప్రకారం.. మురిద్ ఎయిర్‌బేస్(Murid Airbase) లోని ఒక కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై భారత వైమానిక దళం కచ్చితమైన దాడి జరిపింది. అందులో ఆ భవనం దెబ్బతిన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘భవనం పైకప్పులోని ఒక భాగం కూలిపోయింది. తద్వారా బిల్డింగ్ లోపల కూడా నష్టం జరిగే అవకాశం లేకపోలేదు’’ జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మే 23న తీసిన ఈ చిత్రాలను 'ది ఇంటెల్ ల్యాబ్'కు డామియన్ సైమన్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.This report spotlights damage at Pakistan’s Murid Airbase - the Indian Air Force strike has caused structural damage to a Command & Control building, a section of the roof has collapsed as well, likely causing internal damage @TheIntelLab #Skyfi pic.twitter.com/k7O4FO0tKS— Damien Symon (@detresfa_) May 26, 2025 ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో.. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు(Pahalgam Terror Attack). ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ‘‘ఆపరేషన్ సిందూర్’’ను భారత్ ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత దళాలు దాడులు చేసి నాశనం చేశాయి.మురిద్ కీలకమేఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత సాయుధ దళాలు పాక్ పంజాబ్‌లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, చునియన్‌తో పాటు సుక్కూర్‌లోని వైమానిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. ఇందులో మురిద్ వైమానిక స్థావరం, భారత్‌తో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు ఎంతో కీలకమైనది. ఇక్కడ అనేక అత్యాధునిక ఫైటర్ జెట్లు, డ్రోన్లు మోహరించి ఉన్నాయి. ఈ స్థావరంలో పాకిస్థాన్‌కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్తార్ టీబీ2ఎస్, బేరక్తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ దాడి పాకిస్థాన్ సైనిక సామర్థ్యానికి గట్టి దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.A review of Nur Khan Airbase, Pakistan reveals the entire complex near India's strike location has now been demolished, suggesting the strike’s effect went beyond the two special-purpose trucks - possibly presenting a broader footprint of the damage @TheIntelLab #SkyFi pic.twitter.com/gUhqG3nemL— Damien Symon (@detresfa_) May 25, 2025ఇక.. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భారత నగరాలపై పాకిస్థాన్ రెచ్చగొట్టే దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర స్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. మే 12న కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో.. భారత్ దౌత్య యుద్ధం ప్రారంభించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదంపై పోరును ప్రపంచదేశాలకు తెలియజేసేందుకు ప్రత్యేక బృందాలను విదేశాలకు పంపింది.మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లారు. అక్కడ దేశీయంగా రూపొందించిన మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించారు. శత్రు దేశాలు ప్రయోగించే మానవ రహిత వైమానిక వ్యవస్థను అడ్డుకోవడానికి సరికొత్త డ్రోన్లు, ఆయుధాలను భారత్ రూపొందించింది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ -
Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం
-
అమెరికా గోల్డెన్ డోమ్.. భారత్ ఐరన్ డోమ్ ఇదే
ఢిల్లీ: అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో అటు ఇరాన్, ఇటు హిజ్బొల్లాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ దాడిలో రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డంగించింది.రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేసి తన సామర్థ్యం ఏంటో ఇజ్రాయెల్ ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థపై ప్రపంచ దేశాలు కన్నేశాయి. మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్‌డోమ్‌తో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడీ ఐరన్ డోమ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాను బాలిస్టిక్,క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు 175 బిలియన్ డాలర్ల వ్యవస్థతో గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తోంది?వంటి వివరాలు చూద్దాం.గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి?గోల్డెన్ డోమ్ అనేది అమెరికా కోసం రూపొందించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి నిరోధక కవచం. శుత్రువులు ప్రయోగించిన రాకెట్లను భూమి మీదకు చేరుకునే లోపే అడ్డుకునేలా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు భూమి మీద ఉన్న ఇంటర్సెప్టర్లు (Interceptors) ఆధారంగా పనిచేస్తే, అమెరికా గోల్డ్ డోమ్ పూర్తిగా అంతరిక్షంలో శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. ఈ గోల్డెన్ డోమ్‌లో శాటిలైట్స్ ఉంటాయి. ఇవి క్షిపణులు ఎగురటం ప్రారంభమైన వెంటనే వాటిని గుర్తించి, ప్రారంభ దశలోనే వాటిని నిలువరించే సామర్ధ్యం సత్తా దీని సొంతం.ఈ సాంకేతికత అమెరికా భూమిపైకి మాత్రమే కాకుండా ఇతర ఖండాల నుండి లేదా అంతరిక్షం నుండి వచ్చే క్షిపణుల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇది చైనా, రష్యా, ఉత్తర కొరియా, భవిష్యత్తులో ఇరాన్ లాంటి దేశాలు తలపెట్టే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా రూపొందిస్తోంది.బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి దేశాన్ని రక్షిస్తోంది. గోల్డెన్ డోమ్‌లో అవుటర్ లేయర్ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ (SBIRS),గ్రౌండ్-బేస్డ్ రాడార్స్తో పాటు,మిసైల్ లాంఛర్లను అడ్డుకుంటుంది. భారత్‌కు ఆకాశ్ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా గోల్డెన్‌డోమ్.. భారత్‌కు ఆకాశ్. ఆకాశ్ భారత్ క్షిపణి రక్షక వ్యవస్థ. 30 కి.మీ. దూరంలో, 18,000 మీ. ఎత్తులో ఎగురుతున్న శత్రు విమానాల్ని కూల్చేస్తుంది. గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులనూ నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఇందులో ఒక రాజేంద్ర 3డీ పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎర్రే రాడార్ కూడా ఉంటుంది. ప్రతీ బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలను పరిశీలిస్తుంది. వాటిలో 12 లక్ష్యాలను ఛేదించగలదు.ఒక్కో క్షిపణిలో 60 కిలోగ్రాము శకలాలతో కూడుకున్న వార్‌హెడ్ ఉంటుంది.ఆకాశ్ వ్యవస్థ తేలిగ్గా ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు. -
‘నన్ను పెళ్లి చేసుకోవా’.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌తో జ్యోతి మల్హోత్రా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) ఐఎస్ఐ (isi)కు దేశానికి చెందిన రహస్య సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra) కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థలు జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నాయి. వీరి విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది.అంతేకాదు వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్ చాటింగ్‌ను గుర్తించారు. ఆ చాటింగ్‌లో ఐఏస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని (Get Me Married) జ్యోతి మల్హోత్రా కోరినట్లు తెలిపారు. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని,కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా, అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించివే అని నిర్ధారించారు.దుబాయ్ నుంచి డబ్బులువాట్సప్ చాట్‌తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్దిక లావాదేవీలపై కన్నేశారు. ఆమెకు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉండగా..అందులో ఒక అకౌంట్‌కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఖాతాలన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసుల అదుపులో పలువురుభారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత భద్రత వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. జ్యోతి మల్హోత్రా అరెస్టుతో భారత్‌కు చెందిన సైనిక రహస్యాల్ని పాక్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో దేశానికి చెందిన 10మందిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి.వీరు ప్రధానంగా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని తేలింది. -
‘మూడు నిముషాల్లో 13 శత్రు స్థావరాలు నేలమట్టం’
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ జరిపిన కాల్పులకు ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)లో సాధించిన విజయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా కేవలం మూడు నిమిషాల్లో 13 శత్రు స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఆర్మీకి చెందిన కల్నల్ ఒకరు మీడియాకు తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మే 6- 7 తేదీల మధ్య రాత్రి శత్రువులు రెండు మోర్టార్ బాంబులను(Mortar bombs) పేల్చారు. మేము ముందస్తు సమన్వయంతో కూడిన కాల్పుల ప్రణాళికతో శత్రువులకు చెందిన 13 పోస్టులను (బంకర్లు) నాశనం చేశాం. ఇందుకు మాకు కేవలం మూడు నిమిషాలు పట్టింది. ఆ సమయంలో ప్రతి జవాన్ సిద్ధంగా ఉన్నారని, కమాండర్, ఉన్నత ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు అందరికీ అందాయని అన్నారు. అలాగే శత్రువులపై ఏ ఆయుధాలను ప్రయోగించాలో, వారికి గరిష్ట నష్టం కలిగించడానికి ఎంత సమయం పడుతుందో తమకు ముందుగానే తెలుసన్నారు.మే 6-7 తేదీల మధ్య రాత్రి వేళ తాము సాగించిన ప్రతీకార దాడులను చూసిన శత్రు సైన్యం, మళ్లీ ఇలాంటి తప్పు చేసేందుకు వందసార్లు ఆలోచించేలా బదులిచ్చామని ఆ కల్నల్ పేర్కొన్నారు. పహల్గామ్లో పాక్ ఉగ్రవాదులు 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నందుకు ప్రతిస్పందనగా భారత్ ఈ సైనిక చర్య చేపట్టింది. లష్కరే తోయిబా శాఖ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ ఘటన భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఇది కూడా చదవండి: Rajiv death anniversary: ఆ రోజు ఏం జరిగింది? గంధపు దండే ప్రాణాలు తీసిందా? -
ఉగ్రవాదంపై ఉక్కుపాదాలై...
నేడు యాంటీ–టెర్రరిజం డేఉన్మాదం తలకెక్కిన ఉగ్రవాదానికి... ఆమె ధైర్యం... ఉక్కుపాదం. ఆమె సాహసం... రక్తం రుచి మరిగిన నరరూప రాక్షలసుల పాలిట వజ్రాయుధం. ఉగ్రవాదం పీచమణచడంలో వివిధ స్థాయులలో, విభాగాలలో ఎంతోమంది మహిళా సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నారు...‘ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యంలోని ఉమెన్ ఆఫీసర్లు మేల్ ఆఫీసర్లతో సరిసాటిగా కాల్పులు, మిస్సైల్ ప్రయోగాలలో తమ సత్తా చాటారు. శత్రువులకు దడ పుట్టించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో పాల్గొన్న సిగ్నల్స్ రెజిమెంట్‌కి చెందిన ఒక మహిళా అధికారి (పేరు వెల్లడి చేయలేదు) తన అనుభవాలను పంచుకున్నారు. ఆమె, ఆమె టీమ్ గ్రౌండ్‌లోనే కాకుండా ఎయిర్‌లో కూడా కమ్యూనికేషన్స్‌ని హ్యాండిల్ చేశారు.‘ఏ యుద్ధంలో అయినా కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. నేను ఈ ఆపరేషన్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. మా టాస్క్‌లన్నీ అంకితభావంతో పూర్తి చేశాం. గ్రౌండ్ మీద లేదా ఎయిర్‌లో కాన్ఫ్లిక్ట్ని వీడియో గ్రాఫ్ చేయడంలో కమ్యూనికేషన్‌కి సంబంధించిన అన్ని అంశాలనీ చూసుకున్నాం’ అన్నారు. ‘విధి నిర్వహణలో పురుష అధికారులకు, మహిళ ఆఫీసర్లకూ తేడా ఉంటుందా?’ అనే ప్రశ్నకు... ‘ఫ్రంట్లైన్లో స్త్రీలు, పురుషులకు ఒకేరకమైన విధి నిర్వహణ ఉంటుంది. అందరినీ ఒకేరకంగా చూస్తారు. మహిళలుగా మేము ప్రత్యేక సౌకర్యాలని కోరుకోలేదు. ఎందుకంటే మేము దేశం కోసం యుద్ధం చేస్తున్నాం’ అంటారు ఉమన్ ఆఫీసర్.ఆమె భర్త ఆర్మీలో సిగ్నల్స్ ఆఫీసర్‌గా పనిచేసేవారు ‘ఆపరేషన్ రైనో’ సమయంలో ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించారు. ఉల్ఫా ఉగ్రవాదుల ఏరివేతకు అస్సాం–అరుణాచల్‌ద్రేశ్ సరిహద్దులలోని దట్టమైన అడవుల్లో ‘ఆపరేషన్ రైనో’ మెరుపుదాడిలా మొదలైంది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఉగ్రవాదులతో పోరాడడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఏ మూల నుంచి అయినా మృత్యువు పొంచి ఉండవచ్చు. ‘ఆపరేషన్ రైనో’కి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు ఆ ఉమన్ ఆఫీసర్ మది నిండా ఉన్నాయి. అయితే ఏ జ్ఞాపకమూ ఆమెను వెనక్కి లాగలేదు. ‘సాధారణ జీవితమే మేలు’ అనుకునేలా చేయలేదు.భర్తకు సంబంధించిన ప్రతి జ్ఞాపకం... యుద్ధరంగంలో ముందడుగు వేయడానికి అవసరమై శక్తిని ఇచ్చాయి. ‘భారత సైన్యంలోకి రావడానికి స్ఫూర్తినిచ్చింది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబుగా ‘నా భర్త ఇండియన్ ఆర్మీలో సిగ్నల్స్ కార్ప్‌లో పనిచేసేవారు. నా భర్త చేసిన త్యాగమే నన్ను ఆర్మీలో చేరేలా చేసింది’ అని చెప్పారు. ఆర్మీలో చేరాలనే ఆకాంక్ష ఆమెతోనే ఆగిపోలేదు. ఆమె కొడుకు కూడా ఆర్మీలో చేరాలనుకుంటున్నాడు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు కనిపించరు. దేశం కనిపిస్తుంది... అలాంటి అరుదైన ఒక కుటుంబ ఈ ఉమెన్ ఆఫీసర్‌ది.ఆల్–ఉమెన్ కమాండో టీమ్కొత్త సెక్యూరిటీ బ్లూప్రింట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)లో తొలిసారిగా ఆల్–ఉమెన్ కమాండో టీమ్ ప్రారంభించారు. 36 మంది ఉమెన్ కమాండోలతో ఈ టీమ్ మొదలైంది. విధానసభ, రాజ్ భవన్, క్రికెట్ స్టేడియం, ముఖ్యమంత్రి నివాసంలాంటి ప్రాంతాల రక్షణకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అన్ని రకాల ఆయుధాలను హ్యాండిల్ చేయడంలో శిక్షణ ఇచ్చారు. ఇజ్రాయెల్ అన్ఆర్మ్డ్ కంబాట్ టెక్నిక్‌లో కూడా తర్ఫీదు ఇచ్చారు. ఆల్–ఉమెన్ కమాండో టీమ్‌కు ఎంపికైన వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిన్న పట్టణమైన బులంద్‌షహర్‌కు చెందిన చంచల్ తెవోటియా యాంటి–టెర్రరిస్ట్ స్క్వాడ్‌లో అత్యంత పిన్న వయస్కురాలు. తక్కువగా మాట్లాడే ఈ అమ్మాయి మాక్ డ్రిల్‌లో సత్తా చాటింది. గరుడ–యాంటీ టెర్రర్ ఫోర్స్‘గరుడ’ అనేది కర్ణాటక రాష్ట్ర యాంటీ–టెర్రర్ ఫోర్స్. ఈ స్పెషల్ ఆపరేషనల్ టీమ్‌లో కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదహారుమంది యువతులు ఉన్నారు. వీరికి ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో, ఆయుధాలు చేపట్టడంలో శిక్షణ ఇచ్చారు. పోలీసర్ ఆఫీసర్ మధుర వీణ ఆధ్వర్యంలో ఈ ఫోర్స్ పనిచేస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ ప్రధానంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారుల మాటల్లో చెప్పాలంటే... ఇది సాధారణమైన ట్రైనింగ్ కాదు. ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత ఒక ఉమెన్ కమాండో ఆయుధాలతో ఉన్న ముగ్గురు నలుగురితో పోరాడే శక్తిని కలిగి ఉంటారు. -
స్వర్ణదేవాలయంపైనే దాడికి తెగించిన పాక్
అమృత్సర్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశీ్మర్(పీఓకే)లోని ఉగ్రస్థావరాలపై భారత దాడులతో వెర్రెక్కిపోయిన పాకిస్తాన్ బలగాలు మే 8వ తేదీన పంజాబ్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని కూల్చేందుకు దుస్సాహసం చేశాయని తాజాగా వెల్లడైంది. గోల్డెన్టెంపుల్పై గగనతల దాడుల వివరాలను తాజాగా భారత ఆర్మీ మేజర్ జనరల్ కార్తీక్ సి.శేషాద్రి బహిర్గతంచేశారు. శేషాద్రి ఆర్మీలోని 15వ ఇన్ఫాంట్రీ డివిజన్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీఓసీ)గా సేవలందిస్తున్నారు. మే 8వ తేదీన పాక్ జరిపిన దాడులు, ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎలా తుత్తునియలు చేసిందో శేషాద్రి సోమవారం వివరించారు. ముందే అంచనా వేశాం ‘‘ఆపరేషన్ సిందూర్‌తో అనూహ్య దాడులను చవిచూసిన పాకిస్తాన్ వెంటనే భారత ఆర్మీ బేస్‌లతోపాటు జనావాసాలను లక్ష్యంగా చేసుకుంది. ఇవి చాలవన్నట్లు మత సంబంధ ప్రాంతాలపైనా విరుచుకుపడుతుందని మేం ముందే అంచనావేశాం. ఇందులో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంపై క్షిపణులు ప్రయోగించే వీలుందని ఊహించాం. వెంటనే గగనతల రక్షణ వ్యవస్థను స్వర్ణదేవాలయం వద్ద మొహరించాం. ఆ ప్రాంత గగనతల రక్షణ వ్యవస్థను శత్రు దుర్బేధ్యంగా మార్చేశాం. ఊహించినట్లే పాకిస్తాన్ మానవరహిత గగనతల ఆయుధాలతో పాక్ స్వర్ణదేవాలయంపైకి దాడులు మొదలెట్టింది. దూసుకొస్తున్న డ్రోన్లు, క్షిపణులు, చిన్నపాటి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(యూఏవీ)లను భారత ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ గురిచూసి నేలమట్టంచేశారు. స్వర్ణదేవాలయానికి ఒక్క గీత కూడా పడనివ్వలేదు’’అని శేషాద్రి వివరించారు. మరోవైపు స్వర్ణదేవాలయం సహా పంజాబ్‌లోని పలు ప్రాంతాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఎల్–70 డిఫెన్స్ గన్స్లతో తమ జవాన్లు ఎలా కాపాడారో భారత ఆర్మీ సోమవారం వివరించింది. సంబంధిత ఆయుధ వ్యవస్థల పనితీరును చూపే వీడియోను విడుదలచేసింది. -
ఆపరేషన్ సిందూర్ న్యూ వీడియో షేర్..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రమూకల్ని అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి మరో వీడియోను షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిన భారత ఆర్మీ.. పాక్ లోని పలు ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసింది. తొలుత ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపట్టింది. దీనికి బదులుగా పాక్ లో ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.దీనికి సంబంధించి ఒక్కో వీడియోను భారత ఆర్మీ షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో వీడియోను భారత ఆర్మీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది పహల్గామ్ లో సృష్టించిన మారణహోమానికి జరిగిన న్యాయం మాత్రమే ఇది.. ప్రతీకారం కాదు’ అని పేర్కొంది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ ను జోడించింది. ‘ప్రణాళిక.. శిక్షణ.. అమలు’ అంటూ ట్యాగ్ చేసింది భారత ఆర్మీ. #StrongAndCapable#OpSindoorPlanned, trained & executed.Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025 -
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
ఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ (Pakistan)శరణుగోరింది. పాక్ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025 -
ఆపరేషన్ సిందూర్ తడాఖా.. దేశ భక్తిపై భారత్‌లో నయా ట్రెండ్..
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపించాయి. పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత్ దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు సైతం దెబ్బతిన్నాయి. తీవ్ర నష్టం జరగడంతో పాక్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌పై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన టీషర్టులపై సైనిక నినాదాలు, వాయుసేన ఫొటోలు ముద్రించి దేశభక్తిని చాటుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక, ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక యువత సైతం ఆపరేషన్ సిందూర్ గొప్పతనాన్ని చాటేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆపరేషన్ సిందూర్, వాయుసేనకు సంబంధించిన ఫొటోలు ముద్రించిన టీషర్ట్స్‌ని ధరించి.. గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సైన్యానికి, భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు. కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా నినాదాలు, భారత వాయుసేనకు సంబంధించిన ఫైటర్ జెట్ ఫొటోలను ముద్రించిన టీషర్ట్స్ బయటకు వచ్చాయి. ఇవి యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి."Our job is to hit the target, not to count the body bags!"#OperationSindoor was conceptualised with a clear military aim — to punish the perpetrators and planners of terror, and to destroy their terror infrastructure. - Command pic.twitter.com/oEY3cBXwEP— Ramraje Shinde (@ramraje_shinde) May 12, 2025ఈ టీషర్ట్స్‌పై ‘లక్ష్యాలను ఛేదించడమే మా పని.. శవాల మూటలు ఎన్నో లెక్కజెప్పడం కాదు..’, ‘కినారా హిల్స్‌లో ఏముందో మాకు తెలియదు. తెలిసిందల్లా పని చేసుకుంటూ పోవడమే’ లాంటి నినాదాలు ఉన్నాయి. పలు కంపెనీలు ఇలాంటి టీషర్ట్స్‌ను విడుదల చేశాయి. దీంతో, ఇవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పలు కంపెనీల ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. దేశ భక్తిని చాటేలా.. మన సైనిక శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా టీషర్ట్స్ డిజైన్ చేస్తున్నారు. యువత వీటిని ధరించి.. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.@IAF_MCC Proud to wear this. 💕💘🥰😍---@major_madhan In your operation sindoor video, explaining the sequence of events, there was a special series on Airmarshal AK Bharti., in which you spoke of his statement being printed on T-shirt. I got one today. pic.twitter.com/tA8qAmWRCZ— pandurangavittal.vn (@vittal_vn) May 17, 2025 Overnight this statement has become a rage and T shirts are getting printed now.Think and brood over it … why..!~Air Marshal AK Bharati~architect behind #OperationSindoor pic.twitter.com/StLqSazaX9— Braj Mohan Singh (@brajjourno) May 12, 2025 New India. New rules. No mercy.This is Bharat’s new normal: Strike first, strike hard.#OperationSindoor pic.twitter.com/FadCVJVRil— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) May 11, 2025 -
ఉగ్రవాది కథ.. తల్లి ప్రేమ వద్దంది.. యమలోకం రమ్మంది!
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) తర్వాత జమ్మూకశ్మీర్ (jammu and kashmir)లో ఉగ్రవేట మళ్లీ జోరందుకుంది. రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మొన్న సోపియాన్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ముష్కరులను ఎన్కౌంటర్ చేసింది. తాజాగా పుల్వామాలో ముగ్గురు జైహే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్లో జరిగిన ఓ ఎన్ కౌంటర్లో డ్రోన్ చిత్రీకరించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, వీరిలో ఉగ్రవాది ఆమిర్ నజీర్ వని ఎన్‌కౌంటర్‌కు కొన్ని నిమిషాల ముందు తన తల్లి ఫోన్ చేశాడు. వారి మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.📞 ఆమీర్ నజీర్ వని,అతని తల్లికి మధ్య జరిగిన వీడియోకాల్ సంభాషణ:ఆమీర్: ఏకే 47 పట్టుకుని.. అమ్మా... నువ్వు ఎలా ఉన్నావు? తల్లి (ఎడుస్తూ): బేటా, నీవెక్కడ ఉన్నావు?"ఆమీర్: ఇక్కడ ఓ బిల్డింగ్ బేస్మెంట్లో దాక్కున్నాను. భద్రతా బలగాలు దగ్గరకు వస్తున్నాయి తల్లి: బేటా, వాళ్లకి లొంగిపో.. ప్రాణాలు కాపాడుకో.. నిన్ను చూడాలని ఉందిఆమీర్: తల్లి మాటలు పట్టించుకోలేదు. ‘ఆర్మీని ముందుకు రానివ్వండి… వారి సంగతి చూస్తా’ అంటూ ఫోన్ కట్ చేశాడు.అనంతరం,ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరికి వీడియో కాల్ చేశాడు. ఆమె తన సోదరుడు ఆసిఫ్ అహ్మద్ షేక్ గురించి ఆరా తీసింది. ఆసిఫ్ తన వద్దే ఉన్నాడని చెప్పాడు. అది విన్న ఆమె భయ్యా మీరంతా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పగా.. నవ్వాడు. తామే ఆర్మీ పని పడుతామంటూ వివరించాడు. వీడియో కాల్ చేసిన కొద్ది సేపటికే భారత భద్రతా బలగాలు డ్రోన్ సాయంతో బేస్మెంట్లో నక్కిన ఉగ్రవాదుల్ని హతమార్చాయి.Mother pleads son Amir Nazir Wani, a Jaish-e-Mohammed (#JeM) terrorist to surrender before the Tral encounter began. He spoke to his mother and sister. #encounter #tral #pulwama #jammuandkashmir pic.twitter.com/t18ZsqDs7f— Madhuri Adnal (@madhuriadnal) May 15, 2025 గురువారం ఉదయం త్రాల్ ప్రాంతంలో నదీర్ గ్రామంలో ముష్కరులు నక్కినట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అసిఫ్ అహ్మద్ షేక్,ఆమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్‌గా హతమయ్యారు. ఈ కాల్పులు జరిగే సమయంలో ఉగ్రవాది ఆమీర్ నజీర్ వని నిర్మాణంలో ఉన్న బేస్మెంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అయితే, అతడి ఆచూకీ కనుగొనేందుకు భద్రతా బలగాలు డ్రోన్ కెమెరాల్ని రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఒక పిల్లర్ చాటున నక్కినట్లుగా దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. డ్రోన్ విజువల్ సాయంతో దళాలు అతన్ని మట్టుపెట్టాయి. ఈ ముగ్గురు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే. -
మిలటరీ చేతలకు.. నేతల మాటలకు పొంతనేది?
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు.. సరదా అంతకంటే కాదు. భారత ఆర్మీ మాజీ ఛీఫ్ మనోజ్ నరవణే చేసిన అర్థవంతమైన వ్యాఖ్య ఇది. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. యుద్ధం ఎల్లప్పుడు ఆఖరి ఆస్త్రం మాత్రమే కావాలని అన్నారు. అయితే.. ఇక విశ్రాంత మిలటరీ అధికారిగా ఆయన వ్యాఖ్యలకు ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నేతల మాటలకు మధ్య తేడా ఉండటమే సమస్య అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన ప్రసంగంలో పాక్‌కు గట్టి హెచ్చరికలే చేసినప్పటికీ వివిధ వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు మాత్రం బదులిచ్చినట్లు కనిపించదు.👉ఆపరేషన్ సింధూర్ను హఠాత్తుగా ఎందుకు ఆపేశారు అన్నది వీటిల్లో ఒకటి. మిలటరీ అధికారుల స్థాయిలో పాక్ శరణు కోరినంత మాత్రాన అంగీకరించడం సబబేనా అన్నది కొందరి అనుమానం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం జరగాల్సిందేనని దేశ ప్రజలు వాంఛించిన మాట వాస్తవం. అలాగే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం సాగించిన అపరేషన్ సింధూర్‌పై కూడా ప్రశంసల వర్షం కురిసింది. కానీ యుద్ధం ఆకస్మిక నిలిపివేత.. పహల్గామ్ దాడికి దారితీసిన నిఘా వైఫల్యాల వంటివి మాత్రం ప్రశ్నలుగా మిగిలిపోయాయి.👉కశ్మీర్లో కాల్పులు కొత్త కాకపోవచ్చు. పాక్ సైన్యం జరిపే కవ్వింపు కాల్పులు, చొరబాట్ల కోసం ఉగ్రవాదులు అప్పుడప్పుడూ భారత సైన్యంపైకి కాల్పులు జరుపుతూనే ఉంటారు. అయితే పహల్గామ్ మాత్రం రాక్షస కృత్యం. అమాయకులైన టూరిస్టులను, అది కూడా పేర్లు అడిగి మరీ హిందువులను హత్య చేయడంపై దేశం యావత్తు ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను ఆకస్మికంగా విరమించుకుని వెనక్కు రావడం, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపడం వరకూ బాగానే ఉంది. కానీ.. ఆ వెంటనే బీహార్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం మాత్రం చాలామందికి ముఖ్యంగా ప్రతిపక్షాలకు రుచించలేదు. అయినా సరే.. పాక్‌పై మోడీ తీసుకునే చర్యలకు మద్దతిస్తామని స్పష్టం చేశాయి.👉ఈ తరుణంలో మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ పిమ్మట భారత సైన్యం ఉగ్ర శిబిరాలను విజయవంతగా ధ్వంసం చేసి వచ్చింది. సుమారు వంద మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ కూడా సరిహద్దులలో కాల్పులకు, ఇతరత్రా దాడులకు పాల్పడడానికి ప్రయత్నించగా భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అంతేకాక రావల్పిండి, తదితర పాక్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. నిజానికి భారత్ సైనిక శక్తి ముందు పాక్ ఎందుకు కొరగాదన్నది వాస్తవం. ఈ సమయంలో కేంద్రంలోని పెద్దలు కాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు కాని యుద్దం చేయబోతున్న సంకేతాలు ఇచ్చారు. మనం తలచుకుంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం కష్టం కాదని, అసలు పాక్ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని ప్రకటనలు చేశారు.👉వీటి ఆధారంగా చాలా మంది యుద్దం ఆరంభమైనట్లే భావించారు. సాంకేతికంగా భారత్ యుద్ధ ప్రకటన చేయకపోయినప్పటికీ ఇకపై పాక్ నుంచి ఎలాంటి చికాకు ఎదురుకాకుండా పీఓకే మన ఆధీనంలోకి వస్తుందని భావించారు. పాక్ నాలుగుగా చీలిపోయే అవకాశం ఉందని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. కానీ అలా జరగలేదు. కానీ ఆకస్మాత్తుగా పాక్ మిలటరీ శరణు కోరడంతో కాల్పుల నిలిపివేతకు అంగీకరించామని మోదీ చెప్పడంతో అప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలకు, జరిగిన పరిణామాలకు మధ్య తేడా రావడంతో కేంద్రంపై విమర్శలు వచ్చాయి. కాల్పుల విరమణతో మోదీ ప్రభుత్వం సాధించంది ఏమిటి? అని విపక్షాలు ప్రశ్నించాయి.👉ఈ లోగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలు పెట్టి ఇదంతా తన ఘనత అని చెప్పుకోవడం మరింత చికాకైంది. దానిని విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ, ప్రధాని బహుశా దౌత్యనీతి లేదా మరే కారణం వల్లనో తన ప్రసంగంలో ఆ ప్రస్తావన చేయలేదు. కశ్మీర్ విషయంలో మూడో పక్ష రాయబారానికి అంగీకరించబోమని భారత్ చెబుతుండగా, ట్రంప్ తాను మధ్యవర్తిత్వం చేస్తానని అనడం బాగోలేదు. అంతేకాక, అమెరికా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించి భారత్, పాక్‌లను ఒకే దృష్టితో చూడడం ఆశ్చర్యపరిచింది. భారత్ విదేశాంగ విధానంలో ఏమైనా లోపం ఉందా అన్న ప్రశ్నకు తావిచ్చింది. మరో వైపు పాకిస్తాన్ పహల్గామ్ దుశ్చర్యతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెప్పింది.👉ఆ ఉగ్ర ముష్కరులను భారత భద్రత దళాలు పట్టుకుని, వారి మూలాలు అన్నిటిని చెప్పగలిగి ఉంటే పాకిస్తాన్ ప్రపంచంలో ఒంటరై ఉండేది. వారికి పరోక్ష మద్దతు ఇస్తున్న చైనా కూడా బహిరంగంగా పాక్‌ను తప్పు పట్టవలసి వచ్చేది. అయితే పాకిస్తాన్ భారతదేశం వద్ద ఉన్న ఎస్.4 సుదర్శన రక్షణ కవచాన్ని ఏమీ చేయలేక పోయిందన్న విషయాన్ని మోదీ అన్ని దేశాలకు తెలిసేలా అదంపూర్ వెళ్లి ఆ బేస్ నుంచి ప్రసంగించడం బాగుందని చెప్పాలి. అలాగే భారత్‌కు ఉన్న స్వదేశీ పరిజ్ఞాన ఆయుధ సంపత్తి శక్తి సామర్థ్యాలు కూడా దేశ ప్రతిష్టను పెంచాయి. అయినప్పటికీ యుద్దం ఎందుకు ఆగిందన్నది సగటు భారతీయుడికి ఎదురయ్యే ప్రశ్న.👉దానికే మాజీ ఆర్మీ ఛీప్ నరవణే ఇచ్చిన ప్రకటన అర్థవంతమైన జవాబు అవుతుంది. యుద్ధం అంటే సినిమా కాదు..అది చివరి అస్త్రం కావాలన్న ఆయన మాటలు అక్షర సత్యం. పాక్‌కు భారీ నష్టం జరిగినా, మనకు కూడా ఎంతో కొంత నష్టం ఉంటుంది. భారత సైన్యం సాధించిన విజయానికి సెల్యూట్ చేద్దాం. యుద్ధం జరగాలని కోరుకునేవారు కొంత అసంతృప్తికి గురై ఉండవచ్చు.. మిలటరీ ఆపరేషన్స్ వరకు ప్రామాణికంగా తీసుకుంటే భారత్ గొప్ప విజయం సాదించిందని ఒక రిటైర్డ్ మేజర్ వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ పార్టీలు భావోద్వేగ అంశాలపై బాధ్యతతో మాట్లాడకపోతే అవి ఆత్మరక్షణలో పడతాయని కూడా ఈ అనుభవం తెలుపుతోందని అనుకోవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవేట
-
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జమ్ము కశ్మీర్‌లోని అవంతి పొరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లోని అవంతి పొరా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ దాడుల్లో ఒక ఉగ్రవాది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఇక, నాడర్, థ్రాల్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. గత 48 గంటల్లో కశ్మీర్లో ఇది రెండో ఎన్కౌంటర్ ఘటన అని వారు పేర్కొన్నారు.#WATCH | J&K | Encounter underway at Nader, Tral area of Awantipora. Police and security forces are carrying out the operation. Details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/sn92x3MfiN— ANI (@ANI) May 15, 2025 -
పాక్, చైనాకు చావు దెబ్బ.. భారత్ సూపర్ ప్లాన్
ఢిల్లీ: పహల్గాం దాడికి పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారంగా తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పీవోకేపై భారత దళాలు దాడులు చేశాయి. ఈ క్రమంలో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతరం, భారత్ దాడులపై పాక్ ప్రతి దాడులు చేసి బిత్తరపోయింది. భారత్ దాడులను అడ్డుకోలేకపోయింది. దాయాది పాకిస్తాన్‌కు డ్రాగన్ దేశం చైనా అండగా నిలిచినప్పటికీ.. భారత్‌ను ఎదుర్కోలేకపోయింది.ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ దాడులను అడ్డుకోవడానికి పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ వాడుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను, రాడార్లను భారత్ కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. మొదట వాటిని జామ్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా పని చేయకుండా ధ్వంసం చేసేసింది. కచ్చితమైన లక్ష్యాలతో విజయవంతంగా ఆపరేషన్‌ను పూర్తి చేశామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు.ఇందులో చైనాకు చెందిన పీఎల్-15 క్షిపణులు, టర్కీకు చెందిన యూఏవీలు, దీర్ఘ శ్రేణి రాకెట్లు, క్వాడ్ కాప్టర్లు, డ్రోన్లు లాంటి వాటిని భారత్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అధునాతన ఆయుధాలను ఉపయోగించినప్పటికీ, భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ఏమీ చేయలేకపోయిందని అధికారులు వెల్లడించారు.IAF jammed Pakistan's China made air defence system, completed Operation sindoor in just 23 mins ..😳🔥🙌🏻 Jai hind 🇮🇳 Jai hind ki sena ❤️ 🇮🇳 #BalochLiberationArmy #IndianAirForce #IndiaPakistanWar pic.twitter.com/pH5TXcETc1— NEHA (@Neha09857) May 14, 2025టార్గెట్ ఫినిష్..భారత వైమానిక దళం నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ వంటి కీలకమైన పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో పాటూ ఆత్మాహుతి డ్రోన్లను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా శత్రు రాడార్లు, క్షిపణి వ్యవస్థలు, అధిక-విలువ లక్ష్యాలను ధ్వంసం చేసింది. లాటరింగ్ మందుగుండు సామగ్రి అనేవి ఆయుధ వ్యవస్థలు, ఇవి లక్ష్య ప్రాంతంపై ప్రదక్షిణలు చేసి, తగిన లక్ష్యం కోసం వెతుకుతాయి, ఆపై దాడి చేస్తాయి. వీటినే భారత్ ఉపయోగించింది. భారత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేశామని చెప్పారు.సిందూర్ ఆపరేషన్‌లో ఇస్రో పాత్రభారత అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా కీలక పాత్ర పోషించిందని భారత ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మే 11 నుంచి దేశ పౌరుల భద్రత, వ్యూహాత్మక ప్రయోజనం కోసం కనీసం 10 ఉపగ్రహాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం వ్యూహాత్మక విజయం కాదు. ఇది భారతదేశ రక్షణ స్వదేశీకరణ విధానాలను ప్రపంచానికి చాటిచెప్పింది. వాయు రక్షణ వ్యవస్థల నుండి డ్రోన్ల వరకు భారత్ స్వదేశీ సాంకేతికతను అత్యంత ముఖ్యమైన సమయంలో అందించింది. భారత్ 21వ శతాబ్దంలో హైటెక్ సైనిక శక్తిగా తన పాత్రను విజయవంతం చేసిందని తెలిపారు. -
యుద్ధ విమానాలే నడిపిస్తుంటే... సైన్యంలో లీగల్ పోస్టులు మహిళలకు ఇవ్వరా: సుప్రీం
న్యూఢిల్లీ: భారత వాయుసేనలో మహిళలు యుద్ధ విమానాలు నడిపిస్తున్నారని, వారికి సైన్యంలోని లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సైన్యంలో న్యాయమూర్తి, అడ్వొకేట్ జనరల్, ఇతర లీగల్ బ్రాంచ్ పోస్టుల్లో మహిళలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని వెల్లడించింది. ఆయా పోస్టులకు స్త్రీ–పురుష నిష్పత్తి వర్తించదని, అయినప్పటికీ మహిళలను ఎందుకు నియమించడం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. సైన్యంలో లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో తాము నాలుగు, ఐదో ర్యాంకులు సాధించామని, అయినా తమను ఎంపిక చేయలేదంటూ ఇద్దరు మహిళా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తమకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన పురుష అధికారులను లీగల్ బ్రాంచ్‌లో నియమించారని వారు ఆక్షేపించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. సైన్యంలోని న్యాయ విభాగంలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లో చేర్చుకుంటే ఇబ్బందులేమిటో చెప్పాలని నిలదీసింది. పురుషులైనా, మహిళలైనా అర్హత ఉంటే అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. -
భారత జవాన్ ను విడిచిపెట్టిన పాకిస్థాన్
-
భారత సైన్యంపై రష్యన్ మహిళ ప్రశంసల జల్లు..!
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఒక రష్యన్ మహిళ భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ..ఓ వీడియోని నెటింట షేర్ చేసింది. ఆ వీడియో నెటిజన్ల మనసును గెలుచుకుంది. అంతేగాదు ఆ వీడియోలో భారత్‌ని సురక్షితమైన సొంత ఇంటిగా అభివర్ణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ సైతం మనసుకు హత్తుకునేలా ఉంది. ఇంతకీ ఎవరా ఆ రష్యన్ మహిళ అంటే..రష్యన్ బనియాగా పిలిచే పోలినా అగర్వాల్ ఇన్‌స్టా వీడియోలో భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ..హృదయపూర్వక సందశాన్ని షేర్ చేశారు. గురుగ్రామ్ నివాసిస్తున్న ఈ రష్యన్ మహిళ పోలినా అగర్వాల్ వీడియోలో తన అమ్మమ్మ భారత్‌లోని ఉద్రిక్త పరిస్థితులు గురించి విని తక్షణమే రష్యాకు వచ్చేయాలని ఆదేశించిందని అన్నారు. అందుకు తానే ఏమని బదులిచ్చిందో వివరించింది. పోలినా ఏం చెప్పారంటే..భారతదేశం అచ్చం మన సొంతిల్లు మాదిరిగా సురక్షితమైనదని చెప్పానని అన్నారు వీడియోలో. రష్యా అందించిన ఆయుధ సంపత్తి తోపాటు భారత్ మిలటరీకి ఉన్న సైన్యం తదితరాలు ఆ దేశానికి ఉన్న అతి బలమైన రక్షణ వ్యవస్థ అని కొనియాడింది. భారత్ మిలటరీ వద్ద అధునాత ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థలు, అన్ని రకలా డ్రోన్లు, విమానాలు ఉన్నాయి. దానికి తోడు అక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా పాటుపడే సైనికుల నిస్వార్థ సేవ , అంకితభావం తదతరాలు అంతకమించిన వజ్రాయుధాలని పేర్కొంది. వాళ్లంత తమ ప్రాణాలు పణంగా పట్టి ఆహర్నిశలు దేశాన్ని సంరక్షిస్తున్నారు. అందువల్ల మేమంతా ఇక్కడ హాయిగా మా జీవితాలను జీవించగలుగుతున్నాం. యుద్ధ జరుతుందన్న భయం కూడా మా దరి చేరదు. అంతలా రక్షణ అందిస్తారు ఆ వీరసైనికులు. అందుకు నేను వారికి ఎంతగానే కృతజ్ఞతతో ఉన్నాను. వారి రక్షణలో ఉన్న భారత్‌ని ప్రశాంతమైన ఇల్లుగా చెప్పగలనని పోలినా నమ్మకంగా చెప్పింది. అంతేగాదు ఆ వీడియోకి " ఇక్కడ రాత్రిపూట మేమంతా హాయిగా నిద్రపోతున్నాం అంటే అందుకు కారణం భారత సైనికులనే వారికి సదా రుణపడి ఉంటామని" క్యాప్షన్ కూడా ఇచ్చారామె. ఆ వీడియోకి ఏకంగా లక్షకు పైగా వ్యూస్, వేలల్లో లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు సైతం ప్రతిరోజూ మమ్మల్ని రక్షించే మా సైనికుల అంకితభావం, ధైర్యానికి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వారి త్యాగాన్ని విదేశీయురాలుగా మీరు కూడా గుర్తించినందుకు ధన్యవాదాలు అని పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Polina Agrawal (@pol.explorer) (చదవండి: Meghan Markle: నటి మేఘన్ మార్కెల్ పేరెంటింగ్ పాఠం..! పిల్లలకు అద్భుతమైన బహుమతి అదే..!) -
ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా...
కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. కాగాపాక్ కుట్రలను దీటుగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.తాజాగా హీరోయిన్ ఆలియా భట్ కూడా ఇండియన్ ఆర్మీపై, సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగమైనపోస్ట్ పెట్టారు. ‘‘గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. మనం ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు.ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా చేసుకున్నాం. ఆ సమయంలో దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. వారిది కేవలం ధైర్యం మాత్రమే కాదు... అంతులేని త్యాగం కూడా. ఈ ప్రతి యూనిఫామ్ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలచుకుని మనం దుఃఖిస్తున్నాము.అనిశ్చితి... ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ... ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం... ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించినదానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన రక్షకుల కోసం, భారతదేశం కోసం కలిసి నిలబడదాం.. ‘జైహింద్’’ అంటూపోస్ట్ చేశారు ఆలియా భట్. -
'మీ త్యాగం మరువలేనిది'.. ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ మన సైన్యం సేవలను గుర్తు చేసుకుంది. మదర్స్ డే సందర్భంగా దేశానికి సేవ చేస్తున్న సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించింది. తమ హీరోలను దేశానికి అందించి.. ప్రతి క్షణ నిశ్శబ్దంగా తమ బిడ్డకోసం కలవరపడుతూనే ఉంటారని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సైనికులు, వారి మాతృమూర్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులను తలచుకుని భావోద్వేగానికి గురైంది.ఆలియా భట్ తన నోట్లో రాస్తూ.. "గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఎక్కడా చూసినా నిశ్శబ్దమే వినిపించింది. గత కొన్ని రోజులుగా మేము ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దం, ఆందోళన చుట్టూ మోగుతున్న ఉద్రిక్తత.. ఎక్కడో, పర్వతాలలో మన సైనికులు మేల్కొని అప్రమత్తంగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారనే బాధను మేము అనుభవించాం. ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా జరుపుకున్నాం. అందుకే ఈ రోజు మన దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. అంతులేని త్యాగం, ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనక నిద్ర లేని రాత్రులు గడిపే ఆ వీరుడి తల్లి ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రి కూడా ప్రశాంతంగా ఉండదని ఆ అమ్మకు తెలుసు. ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలవ్వొచ్చు. కానీ సైనికుల తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది. కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మన ప్రేమను పంపండి. మీ బాధను పంటి బిగువున నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటాం. మీ కోసం మేమంతా కలిసి నిలబడతాము. మన రక్షకుల కోసం.. భారతదేశం కోసం.. జై హింద్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా సైతం పాకిస్తాన్‌పై దాడులు చేసింది. దాదాపు వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ సిందూర్‌కు ప్రముఖులు సైతం తమ మద్దతును ప్రకటించారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. షోపియాన్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదేనన్న అనుమానం నెలకొంది. మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ పోలీసులు జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లా అంతటా పోస్టర్లను అతికించారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల బహుమతి అందిస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్ జిల్లాలో మొహరించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఓ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేటని ముమ్మరం చేశాయి. #BREAKING: J&K Police has pasted Posters across Shopian district of Jammu & Kashmir urging people to provide information of those terrorists involved in Pahalgam terror attack.Rs 20 lakh reward to the person who will provide any information about these Pakistani terrorists. pic.twitter.com/zjV7VUWtFb— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 13, 2025 -
యుద్ధమంటే బాలీవుడ్ సినిమా కాదు
పుణె: యుద్ధం, పర్యవసానాలపై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధమంటే సరదా కాదు, బాలీవుడ్ సినిమా అంతకంటే కాదు’అని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం నిలిచిపోవడంపై కొందరు చేస్తున్న విమర్శలకు ఆయనీ మేరకు బదులిచ్చారు. ఆదివారం పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో నరవణె మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తోపాటు పీవోకేలోని ఉగ్ర శిబిరాలు, సైనిక మౌలిక వనరులపై భారత ఆర్మీ దాడులు, ఆ తర్వాత నాలుగు రోజులపాటు వైమానిక దాడులు, సరిహద్దుల్లో కాల్పులతో వారం పాటు దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సాగాయని ఆయన తెలిపారు. ‘అనంతరం సైనిక దాడులకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు రెండు దేశాలు ప్రకటనలు చేశాయి. ఇది మిలిటరీ ఆపరేషన్‌కు విరామమే తప్ప, కాల్పుల విరమణ వంటిది మాత్రం కాదని మరోసారి నేను చెప్పాలనుకుంటున్నా. వచ్చే మరికొన్ని రోజుల్లో పరిణామాలు ఎలా మలుపులు తిరుగాయో మీరే చూడండి’అని ఆయన పేర్కొన్నారు. సైనిక దాడులను నిలిపివేయడం మంచిది కాదంటూ కొందరు చేస్తున్న వాదనపై మాట్లాడుతూ ‘యుద్ధంతో కలిగే వ్యయం అంకెలు, గణాంకాలను పరిశీలించండి. ఈ నష్టం మరీ ఎక్కువ కాకముందే, పూడ్చలేనంతగా మారడానికి ముందే యుద్ధాన్ని ఆపేయాలని తెలివైన వారెవరైనా అనుకుంటారు’అని చెప్పారు. దాడుల ద్వారా పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను మాత్రమే కాదు, వైమానిక స్థావరాల్లోని మౌలిక సౌకర్యాలకు సైతం తీవ్రంగా నష్టం కలిగించాం. వైఖరి మారకుంటే నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని పాక్ గ్రహించేలా చేయగలిగామని భావిస్తున్నాను. అందుకే పాక్ ఆర్మీ చేసేదిలేక కాల్పుల విరమణ కోసం మన ఆర్మీతో సంప్రదింపుల బేరానికి వచి్చంది’అని ఆర్మీ మాజీ చీఫ్ వివరించారు. రక్షణ వ్యయం కూడా పెట్టుబడే ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి దేశాలు రక్షణ కోసం ఎంత ఖర్చు చేయగలవు? రోజూ టీవీల్లో చూసే సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాలా? విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, పారిశుధ్యం, ఇంకా ఇతర చాలా ముఖ్యమైన అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలా?అని ఆయన ప్రశ్నించారు. ‘మన బడ్జెట్లో రక్షణ రంగం వాటా 15 శాతం వరకు ఉంటోంది. ఇదీ ఒక రకమైన పెట్టుబడే. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇలాంటి బ్యాకప్ ప్లాన్ అవసరం. గతవారం ఆపరేషన్ సిందూర్‌తో అటువంటి ప్రణాళిక మనకు ఉందనే విషయం స్పష్టమైంది. రక్షణ బలగాలు సర్వ సన్నద్ధంగా, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటే మనపై దాడి చేయాలనుకునే వాళ్లు ఒకట్రెండు సార్లు ఆలోచిస్తారు’అని ఆర్మీ మాజీ చీఫ్ నరవణె వివరించారు.యుద్ధం చివరి అస్త్రం ఆదేశాలొస్తే వెంటనే కదనరంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నానన్న నరవణె..ఈ విషయంలో తన మొట్ట మొదటి ప్రాధాన్యం దౌత్యానికే ఉంటుందన్నారు. ‘ఇతర దేశాలతో సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలే తప్ప, యుద్ధానికి వెళ్లరాదు, హింస పరిష్కారం కాదు’అని కుండబద్దలు కొట్టారు. ‘యుద్ధం ఆషామాషీ కాదు. మన బాలీవుడ్ సినిమా కాదు. చాలా సీరియస్ వ్యవహారం. చిట్టచివరి అవకాశం లేక అస్త్రంగా మాత్రమే యుద్ధానికి దిగాల్సి ఉంటుంది. ఇది యుద్ధాల శకం కాదని మన ప్రధాని మోదీ చెప్పింది ఇందుకే. కొందరు మూర్ఖులు యుద్ధాన్ని మనపై రుద్దారు. యుద్ధంపై మనం ఉత్సాహం చూపరాదు’అని ఆయన అన్నారు.సామాజిక కోణం మరువరాదు యుద్ధంతో వాటిల్లే నష్టాల్లో సామాజికపరమైన కోణం కూడా ఉందన్న జనరల్ నరవణే..‘ఇతరత్రా నష్టాలతోపాటు యుద్ధంతో ప్రాణ నష్టం సైతం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులను కోల్పోయే చిన్నారులుంటారు. ఇటువంటి నష్టాన్ని ఎవరూ పట్టించుకోరు. సన్నిహితులను కోల్పోయిన వారిని ఆ ఆవేదన జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. యుద్ధ దృశ్యాలను దగ్గర్నుంచి చూసేవారు పీటీఎస్డీ అనే మానసిక రుగ్మత బారినపడతారు. దీన్నుంచి బయటపడేందుకు కనీసం 20 ఏళ్లపాటు వీరికి చికిత్స కొనసాగించాల్సి ఉంటుంది’అని వివరించారు. -
ఉగ్రవాదులతోనే మా పోరాటం
-
భారత సైన్యం వేతన వివరాలు ఇలా..
భారత్-పాకిస్థాన్ యుద్ధంలో విరోచితంగా పోరాడుతున్న భారత సైన్యం వేతన వివరాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేశాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసే త్యాగధనులకు ఎప్పటికీ ఈ వేతనాలు ప్రాధాన్యం కావు. పుట్టిన భూమి రక్షణ కోసం, తమ వంతు సాకారం చేస్తూ రణరంగంలో ప్రాణాలు వదిలిన సైనికుల కఠోర దీక్ష ముందు ఇవి ఏ మూలకూ సరిపోవు. చట్టపరంగా వారి సేవలకు గౌరవంగా ఇచ్చుకునే ఈ కొద్దిపాటి వేతన వివరాలు (2024 లెక్కల ప్రకారం సుమారుగా) కింది విధంగా ఉన్నాయి.హోదానెల వారీ వేతనంసిపాయిరూ.25,000ల్యాన్స్ నాయక్రూ.30,000నాయక్రూ.35,000హవల్దార్రూ.40,000నాయబ్ సుబేదార్‌రూ.45,000సుబేదార్‌రూ.50,000సుబేదార్ మేజర్‌రూ.65,000లెఫ్ట్నెంట్రూ.68,000కెప్టెన్రూ.75,000మేజర్‌రూ.1,00,000లెఫ్టెనెంట్ కల్నల్‌రూ.1,12,000కల్నల్‌రూ.1,30,000బ్రిగేడియర్రూ.1,39,000 నుంచి రూ.2,27,000 వరకుమేజర్ జనరల్రూ.1,44,000 నుంచి రూ.2,18,200లెఫ్టెనెంట్ జనరల్రూ.1,82,200 నుంచి రూ.2,24,100చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్రూ.2,50,000ఇదీ చదవండి: ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..అదనపు ప్రయోజనాలు, అలవెన్సులుడియర్నెస్ అలవెన్స్ (డీఏ)మిలిటరీ సర్వీస్ పే (ఎంఎస్పీ)ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)రవాణా భత్యంఫీల్డ్ ఏరియా అలవెన్స్హై ఆల్టిట్యూడ్ అలవెన్స్స్పెషల్ డ్యూటీ అలవెన్స్వైద్య సౌకర్యాలుపెన్షన్ & రిటైర్మెంట్ బెనిఫిట్స్ -
ఇండియన్ ఆర్మీ యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో భారత్ నాలుగు రోజుల పాటు పాక్‌ని గడగడలాడించింది. అంతేగాదు ఈ నాలుగు రోజుల ఘర్షణలో పాక్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు తదితరాలు భారత సైన్యం ధ్వంసం చేసింది. అలాగే పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది భారత్. గత శనివారమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతేగాదు భారత్ ఉగ్రమూకల్ని మట్టుబెట్టడంలో పూర్తి స్థాయిలో విజయం సాధించింది. అలాగే ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో దాయాది దేశానికి తెలిసి వచ్చేలా చేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వెంబడి గస్తీ కాస్తూ.. ఆహర్నిశలు దేశాన్ని రక్షిస్తున్నా మన సైనికులు యూనిఫాం వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకుందామా..!.ఎదురులేని ధైర్యసాహసాలకు గర్వకారణమైన మన భారత సైనికుల యూనిఫాం..చూడగానే ఎక్కడ లేని దేశభక్తి ఉప్పొంగుతుంది. ఒక్కసారిగా మన అటెన్షన్ కూడా గౌరవంతో కూడిన బాధ్యతగా వ్యవహరించేలా మారిపోతుంది. అలాటి ఆర్మీ యూనిఫాం వలస పాలన నుంచి ఎలా రూపుదిద్దుకుంటూ..సరికొత్త మార్పులతో వచ్చింది..?. పైగా సైనికులకు సౌకర్యంగా ఉండేలా ఫ్యాబ్రిక్ తీసుకురావడమే గాక ఆ రంగులనే ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటో చూద్దాం..!.75 ఏళ్ల క్రితం..భారతీయ సాయుధ దళాల యూనిఫాంల మూలం వలసరాజ్యాల వారసత్వంగా వచ్చింది. మొదట్లో బ్రిటిష్ సైనిక సంప్రదాయం కొనసాగించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్‌ను తన బలమైన కోటగా మార్చుకున్న తర్వాత దేశాన్ని మూడు ప్రెసిడెన్సీలుగా విభజించింది. అవి బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ. అప్పుడ మన భారతీయ సైనికులు బ్రిటిష్ సహచరుల మాదిరిగానే పాక్షికంగా ఎరుపు రంగు యూనిఫాంలు ధరించేవారు. అయితే ఈ ఎరుపు రంగు వల్ల యుద్ధభూమిలో చాలా స్పష్టంగా కనిపించేవారు. దాంతో విపరీతమైన ప్రాణనష్టం జరిగేదట. అప్పుడే యూనిఫాంలో మార్పు అవసరం అనేది గుర్తించారట. ఖాకీ ఎప్పుడు వచ్చిందంటే..1848లో, అధికారులు సర్ హ్యారీ బర్నెట్ లమ్స్‌డెన్, విలియం స్టీఫెన్ రైక్స్ హాడ్సన్ భారతదేశంలోని బ్రిటిష్ వలస దళాల కోసం ఖాకీ యూనిఫామ్‌లను ప్రవేశపెట్టారు. ఉర్దూలో దుమ్ము రంగు అని అర్థం వచ్చే "ఖాకీ",రంగు భారతీయ ప్రకృతి దృశ్యంతో బాగా కలిసిపోయింది. పైగా దీని కారణంగా ప్రాణ నష్టం తగ్గిందట కూడా. 1857 భారత తిరుగుబాటు సమయానికి, భారతదేశం అంతటా బ్రిటిష్ దళాలు ఖాకీని విస్తృతంగా స్వీకరించాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్యాలను ప్రభావితం చేసి..క్రమంగా వరల్డ్ ఫీల్డ్ యూనిఫామ్‌ల రంగుగా మారింది.స్వేచ్ఛకు సంకేతంగా మార్పు..1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని కాస్తా ఇండియన్ ఆర్మీగా పేరు మార్చారు. అలాగే పాక్ నుంచి వేరై..దేశభక్తిని సూచించేలా ఆలివ ఆకుపచ్చ రంగుని ఎంచుకుంది.అలాగే బ్రిటిష్ యూనిట్ చిహ్నాలు, ర్యాంక్ బ్యాడ్జ్‌లను తీసేసి జాతీయ చిహ్నాలతో భర్తీ చేశారు. ఇక పాక్ సైన్యం నెలవంకను ఎంచుకుంటే..భారత్ తమ సైన్యం కోసం అశోక చిహ్నాన్ని తీసుకుంది. సైనిక సవాళ్లను అధిగమించడం కోసం..1980లు–1990ల సమయంలో భారత సైన్యం చాలా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుండేది. ముఖ్యంగా ఈశాన్య జమ్యూ కశ్మీర్ వంటి క్లిష్ట భూభాగాలలో సైనికులు యూనిఫాం కనిపంచకుండా ఉండేలా చేయాలసి వచ్చేది. అందుకోసం 1980లలో ఆర్మీ మట్టితో కూడిన ఆకుపచ్చ రంగులను, గోధుమ రంగులను ప్రవేశ పెట్టింది. ఇవి సైనికులను అడవులు, కొండప్రాంతా ప్రకృతి దృశ్యాలలో కలిసిపోయేందు ఉపకరించింది. 2000ల ప్రారంభంలో మరింతగా మార్పులు చేశారు..2000ల ప్రారంభం నాటికి, భారత సైన్యం PC DPM (డిస్ట్రప్టివ్ ప్యాటర్న్ మెటీరియల్) యూనిఫామ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. ఫ్రెంచ్ సైన్యంలో ఉపయోగించిన నమూనాల నుంచి ప్రేరణ పొందింది. భారతీయ అవసరాలకు అనుగుణంగా, పిక్సెల్ లాంటి నమూనాతో ఆకర్షణీయమైన లుక్‌తో డిజైన్ చేశారు. బాలీవుడ్, టాలీవుడ్‌తో సహా సైనికుడు లుక్‌కి ఓ ప్రేరణగా నిలిచింది. అయితే ఇది అడవులు వంటి ఎత్తైన ప్రాంతాలలో బాగా పనిచేసినప్పటికీ..రాజస్థాన్ వంటి ఎడారి రాష్ట్రాల్లో ఇది సరైనది కాదని తేలింది. 2022: యూనిఫాంలో ఒక మైలురాయి మార్పుప్రస్తుతం భారత సైన్యం ధరిస్తున్న యూనిఫాం మార్పు 2022లో జరిగింది. ఆర్మీ దినోత్సవం నాడు భారత సైన్యం తన తాజా డిజిటల్ కామఫ్లాజ్ యూనిఫామ్‌ను ప్రారంభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ దీన్ని రూపొందించింది. తేలికగా, గాలిని పీల్చుకునేలా త్వరగా ఆరిపోయే కాటన్-పాలిస్టర్ మిశ్రమంతో తీసుకొచ్చింది. ఇది ఆధునిక సైనిక అవసరాలకు అనువగా ఉండటమే గాక అడవుల నుంచి ఎడారుల వరకు అన్ని భారతీయ భూభాగాలను అనుగుణంగా ఏకరీతిలో ఉండేలా డిజైన్ చేశారు.(చదవండి: '54 ఏళ్ల నాటి యుద్ధ ప్రసంగం'..! ఇప్పటికీ హృదయాన్ని తాకేలా..) -
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్ ఆర్మీ వార్నింగ్
ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశాంఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్ కసబ్,డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్ చేశాంలాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాం లాహోర్ నుంచి డ్రోన్,యూఏవీలతో భారత ఎయిర్ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్ చేసింది.గైడెడ్ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మృతి చెందారు మరోసారి కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్ డీజీఎంవో మాకు ఫోన్ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్ మెసేజ్ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్ అంతు చూస్తాంపాక్ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్ చేస్తున్నాం -
పీవోకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: మోదీ
ఢిల్లీ: పీవోకేపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో తమ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు.. పీవోకేను మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదన్నారు మోదీ. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియ లేదని, పాక్ కాల్పులు జరిపితే భారత్ దాడులు చేయడం ఖాయమన్నారు.. ‘వాళ్లు (పాక్) ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో దాడి చేయండి’ అంటూ త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. రేపు పాకిస్తాన్‌తో చర్చల వేళ భారత్ వైఖరి ఏమిటో ప్రధాని మోదీ ఒక్కరోజు ముందుగానే ప్రపంచానికి తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, దానిని పాక్ తమకు అప్పగించడం తప్పితే మరో మార్గం లేదని మోదీ వ్యాఖ్యానిండంతో ట్రంప్ దీనికి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదనే విషయాన్ని మోదీ సూటిగా చెప్పేశారు.ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్,సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాదిపతులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రధాని మోదీ పీవోకే విషయంలో ప్రపంచ దేశాలకు ఓ సందేశాన్ని పంపించారు. అదే సమయంలో పాక్‌కు గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాలకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది #WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్ కాదా?. అందుకు పహల్గామ్ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్. -
సైన్యం కోసం విజయ్ దేవరకొండ
-
26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులు.. నేలమట్టం చేసిన భారత సైన్యం
-
మురిద్కే దాడిలో అబు జుందాల్ హతం
-
భారత్ ఆర్మీ బయటపెట్టిన సంచలన వీడియో
-
పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్ (ఫొటోలు)
-
పాకిస్తాన్‌తో యుద్ధం.. ఆర్మీ అధికారుల మీడియా సమావేశం లైవ్
సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. భారత్‌లోని 26 ప్రదేశాల్లో పాక్ దాడులకు తెగబడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశంగా మీడియా సమావేశం నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్‌పై అధికారులు వివరాలను వెల్లడించారు. ఉద్రిక్తతలపై తాజా పరిస్థితులను కర్నల్ సోఫియా ఖురేషి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దాడులతో ఉద్రిక్తతలు పెంచుతోంది. వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. శ్రీనగర్, ఉధంపూర్, బటిండాలో దాడులు జరుపుతోంది. పలు చోట్ల పాఠశాలలు, వాయుసేన ఆసుపత్రులపై కూడా దాడులు చేస్తోంది. భుజ్, బటిండాలోని ఎయిర్‌స్టేషన్లలపై పాక్ దాడి చేసింది. లాంగ్ రేంజ్ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేస్తోంది. పాక్ దాడులను భారత్ ధీటుగా తిప్పి కొడుతోంది. పాకిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో క్షిపణులతో దాడికి దిగింది. యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.పాకిస్తాన్ మిస్సైల్స్‌ను భారత వాయుసేన తిప్పి కొట్టింది. పాక్ ఎయిర్‌బేస్‌లను గట్టిగా దెబ్బతీశాం. సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తోంది. పాక్ దాడులను పూర్తి స్థాయిలో తిప్పికొట్టాం. పాక్ దాడులు చేసిన ప్రతీచోటా భారత్ గట్టిగా ప్రతిఘటించింది. పాకిస్తాన్ హైస్పీడ్ మిస్సైల్ మోర్టార్లను ప్రయోగించిందన్నారు. వింగ్ కమాండర్ ఒమికా సింగ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది. డ్రోన్స్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఉపయోగిస్తుంది. పటాన్ కోట్ , ఉడంపూర్, బూజ్ ప్రాంతాలపై దాడికి దిగింది. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టాం. భారత్ కేవలం పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకు ఎలాంటి హాని జరగలేదు అని అన్నారు. #WATCH | Delhi | #OperationSindoor | Wing Commander Vyomika Singh says, "In a swift and calibrated response, Indian armed forces carried out a precision strike only at identified military targets... Pakistan has also attempted to execute a continued malicious misinformation… pic.twitter.com/8rnxPfK1IR— ANI (@ANI) May 10, 2025విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి మాట్లాడుతూ.. భారత్ ఎస్ 400 ధ్వంసం చేశారన్న వార్తలు అవాస్తవం. సిరాసా, సూరత్ ఘడ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. పాకిస్తాన్ సామాన్య ప్రజలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఒక అధికారి చనిపోయారు’ అని తెలిపారు. #WATCH | #OperationSindoor | Foreign Secretary Vikram Misri says, "We have also seen in some of the remarks that the Pakistani army spokesman seems to take great joy at the fact that the Indian public should criticise the government of India with various issues. It may be a… pic.twitter.com/EiEUNejOut— ANI (@ANI) May 10, 2025 -
పాకిస్తాన్ నగరాల్లో భారత్ ఎటాక్
-
మేమంతా మీ వెంటే...
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం దుశ్చర్యలను తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎదుర్కొంటున్న భారత త్రివిధ దళాలకు క్రీడా దిగ్గజాలు మద్దతు పలికారు. క్రికెట్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా చాంపియన్ అథ్లెట్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధులు దేశ ప్రజల సంరక్షణ కోసం పగలనక... రాత్రనక శ్రమిస్తున్న సాయుధ బలగాల ధైర్యానికి సెల్యూట్ చేశారు. ప్రాణాలొడ్డి పోరాడుతున్న భారత సేనల ధైర్య సాహసాల్ని స్టార్లంతా కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా తామంతా సైన్యం వెంటే అని స్థయిర్యం పెంచారు. దేశ రక్షణే లక్ష్యంగా శ్రమిస్తోన్న భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లను చూసి గర్వపడుతున్నా. త్రివిధ దళాలు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. ఈ పోరాటయోధుల వల్లే భారత్ తలెత్తుకొని నిలబడుతోంది. దేశం కోసం అహరి్నశలు శ్రమించే మీ వెంటే జాతి మొత్తం నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని విజ్ఞప్తి. –భారత కెప్టెన్ రోహిత్ శర్మసాయుధ బలగాలకు నా సలామ్. ఎలాంటి విపత్కర పరిస్థితులకైనా ఎదురునిలిచి దేశాన్ని కాపాడే మన వీరుల ధైర్యసాహసాలకు జేజేలు పలుకుతున్నాం. భారత్ కోసం మీరు, మీ కుటుంబసభ్యులు చేసే త్యాగాలకు మేమంతా రుణపడే ఉంటాం. –విరాట్ కోహ్లి ఉగ్రవాదులను హతమార్చితే మౌనంగా ఉండాల్సిన చోట పాక్ యుద్ధాన్ని ఎంచుకొని తమ వక్రబుద్ధిని మరోమారు చూపింది. దీనికి తగిన గుణపాఠం మా సైన్యం మీకు నేర్పుతుంది. ఆ పాఠమెలా ఉంటుందంటే జీవితంలో మీరెప్పుడు మర్చిపోరు. –వీరేంద్ర సెహ్వాగ్ టెర్రరిజంపై పోరాటం... దేశ రక్షణకోసం మీరు కనబరిచే సాహసాలు మాకెంతో గర్వకారణం. సరిహద్దుల్లో మీరున్నారనే ధైర్యమే దేశాన్ని ధీమాగా నడిపిస్తోంది.–నీరజ్ చోప్రాభారత దళాలు చూపే ధైర్యం, క్రమశిక్షణ, త్యాగాలే దేశానికి బలం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించి మన పతకాన్ని రెపరెపలాడించిన మీ నిస్వార్థసేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. జై హింద్. –పీవీ సింధు -
ఇండియా పవర్ఫుల్ వెపన్స్.. శత్రువులకు సింహస్వప్నం!
పాక్ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్–400, ఆకాశ్ ఎన్జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది సోవియట్ కాలంనాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ (ఎస్ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్ డిఫెన్స్ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. → ఐదు హై ఇంటర్‌సెప్టివ్ యాంటెన్నాలతో కూడిన 4ఆర్90 యత్నాగన్ రాడార్ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (సీఏయూఎస్). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్ డిటెక్షన్, సాఫ్ట్/హార్డ్ కిల్ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్ (ఎలక్ట్రో–ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్ కిల్ (డ్రోన్ల కమ్యూనికేషన్ సిగ్నల్స్ జామింగ్), హార్డ్ కిల్ (నేలకూల్చడం) చేస్తుంది.సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (సమర్). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్–1 వ్యవస్థ ఆర్–73ఈ, సమర్–2 ఆర్–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్–73ఈ మిసైళ్ల రేంజ్ 8 కి.మీ. ఆర్–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.→ ఎల్–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివాటి ద్వారా ఎల్–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్. షిల్కా అనేది వీటి రష్యన్ నిక్‌నేమ్. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్ ప్రొపెల్డ్ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుట్టినరోజు ప్రత్యేకం
హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు (మే 9) సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు డబుల్ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. విజయ్ నటించనున్న ‘వీడీ 14’, ‘ఎస్వీసీ 59’ సినిమాల కొత్తపోస్టర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ధ్యానముద్రలో ఉన్న విజయ్ దేవరకొండపోస్టర్ని రిలీజ్ చేశారు.‘‘బ్రిటిష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న చిత్రం ‘వీడీ 14’. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగాపాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉంటుంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ ఓ సినిమా నిర్మించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందనున్న 59వ చిత్రం ఇది. అందుకే ‘ఎస్వీసీ 59’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా ఓపోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో ఈపాన్ ఇండియా సినిమాని రూపొందించనున్నాం. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది.రౌడీ వేర్ లాభాల్లో సైన్యానికి విరాళం విజయ్ దేవరకొండకి క్లాత్ బ్రాండ్ ‘రౌడీ వేర్’ ఉన్న విషయం తెలిసిందే. ‘మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా’ అంటూ రాబోయే కొన్ని వారాలపాటు ఈ రౌడీ వేర్ అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో కొంత భారత సైన్యానికి విరాళంగా ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. -
భారత సైన్యానికి సెల్యూట్.. ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము: విరాట్ కోహ్లి
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ద వాతవారణం నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ రూపంలో భారత్ బదులు తీర్చుకుంది. భారత సైన్యం వరుసగా రెండు రోజుల పాటు పాకిస్తాన్, పాక్తిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేస్తూ వంది మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాకిస్తాన్ ప్రతిదాడులకు కూడా భారత సాయుద బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఈ క్రమంలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తమ దేశభక్తి చాటుకున్నారు."ఈ క్లిష్ట సమయాల్లో దేశాన్ని కాపాడుతున్న మన సాయుధ దళాలకు సెల్యూట్. సైన్యం ధైర్యసాహసాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు" కోహ్లి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. కోహ్లి ఈ పోస్ట్ చేసిన గంటలోనే 34 లక్షల మంది లైక్ చేస్తూ ఈ పోస్టును షేర్ చేయడం విశేషం.భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ తీసుకునే ప్రతీ నిర్ణయం మనల్ని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. మన యోధులు మన దేశ గౌరవానికి అండగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండాలి. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా, నమ్మకుండా ఉండాలి. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. -
భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)
-
భారత సైన్యానికి హీరో విజయ్ దేవరకొండ విరాళం
యంగ్ హీరో విజయ్ దేవరకొండ మంచి మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే భారత సైన్యానికి పలువురు విరాళాలు ఇస్తున్నారు. తన వంతు బాధ్యతగా ఇప్పుడు విజయ్ కూడా విరాళం ప్రకటించాడు.(ఇదీ చదవండి: మా సపోర్ట్ సైనికులకే.. లాభాల్లో కొంత భాగం వాళ్లకే) రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాని భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పాడు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రమోషన్ అసలు చేస్తారా లేదా? సినిమా విడుదల కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి) This year, @TheDeverakonda's birthday is more than a celebration - it’s about giving back.Spot the Deverakonda Birthday Truck in your city and grab a free ice cream!And for the next few weeks, a portion of all #RWDY proceeds will go to the Indian Armed Forces.Jai Hind.… pic.twitter.com/al65L0NWum— Suresh PRO (@SureshPRO_) May 9, 2025 -
LOC వెంట ఉన్న పాక్ పోస్టులను ధ్వంసం చేస్తున్న ఇండియన్ ఆర్మీ
-
జవాన్ మురళి నాయక్ మృతి పట్ల బండి సంజయ్ దిగ్భ్రాంతి
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత్ - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో మరణించిన మురళీ నాయక్ మృతి పట్ల కేంద్ర మంత్రి 'బండి సంజయ్' దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మురళి నాయక్ వీరమరణాన్ని యావత్ భారతదేశం గుర్తుంచుకుంటుంది. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం వెలకట్టలేనిది. మురళీనాయక్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని బండి సంజయ్ అన్నారు. మురళీ నాయక్ తండ్రితో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పిన సంజయ్.. వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు.శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరిన మురళీ నాయక్.. నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు.మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మీరు అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్లే: రాజమౌళి
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏం జరుగుతుందో భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుసు. కానీ సోషల్ మీడియాలో లెక్కకు మించి ఫేక్ వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. ప్రజలకు తనవంతు బాధ్యతగా ఓ సూచన చేశారు.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) 'పాజిటివ్, అప్రమత్తంగా ఉంటే విజయం మనదే. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ భారత సైనిక చర్యలని మీరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మీరు శత్రువలకు సాయం చేసినవాళ్లు అవుతారు. అనధికారిక ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి' అని రాజమౌళి చెప్పుకొచ్చారు.మొన్నటివరకు రాజమౌళి.. మహేశ్ బాబుతో సినిమా షూటింగ్ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. తిరిగి జూన్ లో ప్రారంభించనున్నారు. అప్పటిలోపు పరిస్థితులు సద్దుమణిగితే సరేసరి. లేదంటే సినిమాల షూటింగ్స్ కూడా వాయిదా పడొచ్చేమో? ఇకపోతే రాజమౌళి.. తన ట్విటర్ ప్రొఫైల్ పిక్ గా ఆపరేషన్ సిందూర్ అని రాసి ఉన్న ఫొటోని పెట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) If you see any movement of the Indian Army, don’t take pictures or videos.Don’t share them as you might be helping the enemy. Stop forwarding unverified news or claims. You’ll only create noise, which the enemy wants.Stay calm, alert and positive.Victory is ours. 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025Saluting our Brave Indian Armed Forces for their unwavering courage in protecting our nation from terrorism. Let’s stand together as a nation, inspired by their valor, to build a future of peace and unity. Jai Hind! 🇮🇳— rajamouli ss (@ssrajamouli) May 9, 2025 -
మరోసారి దాడికి పాక్ ప్లాన్.. మోదీ కీలక ఆదేశాలు
-
పాక్‌తో యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం
-
బెంగళూరులో సిద్ధమైన ఆర్మీ డ్రోన్లు!
సాక్షి, బెంగళూరు: భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’లో ఉపయోగించిన ఆత్మాహుతి డ్రోన్లను బెంగళూరులో తయారు చేశారు. స్వయం చాలితమైన ఈ డ్రోన్లు పాక్ ఆక్రమిత కశీ్మర్, పాకిస్తాన్లలోని 9 ఉగ్రవాద స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో నేలమట్టం చేశాయి. బాలాకోట్ దాడి తర్వాత వీటిని ఆర్మీలో చేర్చారు. పశి్చమ బెంగాల్‌కు చెందిన ఆల్ఫా డిజైన్, ఇజ్రాయెల్ ఎల్బిట్ సెక్యురిటీ సిస్టమ్స్ సంయుక్తంగా ఈ డ్రోన్లను తయారు చేసినట్లు తెలిసింది. ఈ కంపెనీల ప్రధాన కార్యాలయాలు బెంగళూరులోనే ఉండడం గమనార్హం. భారత ఆర్మీ ప్రత్యేకంగా 100 డ్రోన్ల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. ఎలాంటి శబ్దం లేకుండా, తక్కువ ఎత్తులో ఎగురుతూ 5–10 కిలోల బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల ఈ డ్రోన్లకు 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల సత్తా ఉంది. -
ఆర్మీలో చేరతా.. ఉగ్రవాదులను మట్టుబెడతా..
బాలాసోర్: ‘భారత సైన్యంలో చేరి పాక్ ఉగ్రవాదులను అంతమొందించాలనుకుంటున్నా’పహల్గాం దాడిలో తండ్రిని కోల్పోయిన ఓ బాలుని కోరిక ఇది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నానని తొమ్మిదేళ్ల తనూజ్ కుమార్ సత్పతి గురువారం వెల్లడించాడు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే.. తనలా ఏ బిడ్డా తండ్రిని కోల్పోకుండా చూడాలని చెబుతానన్నాడు. తనూజ్ తండ్రి ప్రశాంత్ సత్పతి పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం వారి కుటుంబాన్ని మీడియా కలవగా.. తనూజ్ మాట్లాడాడు. ‘‘నేనూ, అమ్మ బుధవారం ఉదయం నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాం. పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి మాకు చయాలా సంతృప్తినిచ్చింది. మన సైన్యాన్ని చూసి గరి్వస్తున్నా’’అని తెలిపాడు. అంతేకాదు.. సైన్యం మొదటి నుంచి తనకు, తన తల్లికి అండగా ఉందని తనూజ్ చెప్పారు. ‘‘కొండపై నుంచి కిందకు వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్పాడు. ‘‘నాన్న వెంటనే పడిపోయాడు. నేను, అమ్మ అతని దగ్గరికి పరిగెత్తాం. తల నుంచి రక్తస్రావం అవుతోంది. నీళ్లు కావాలా అని అమ్మ అడగ్గానే.. అవునన్నాడు. నీళ్లు ఇచ్చాను’’అని పహల్గాంలో జరిగిన భయానక పరిస్థితులను తనూజ్ గుర్తు చేసుకున్నాడు. తనూజ్ పెద్దరికంగా మాట్లాడుతుండటంపై అతని తల్లి ప్రియా దర్శిని ఆందోళన వ్యక్తం చేసింది.‘‘అతను అకస్మాత్తుగా తన బాల్యాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. పిల్లలు క్రమంగా పరిణితి చెందాలి. భగవంతుడు నా కొడుకును ఆశీర్వదించాలి’’అని ఆమె కోరుకున్నారు. -
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారీ పేలుళ్లు.. నివాసం నుంచి షరీఫ్ తరలింపు
పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత సైన్యం దాడితో భారీ పేలుళ్లు జరిగాయి. దాంతో ఇస్లామాబాద్‌లోని తన నివాసం నుంచి షెహబాజ్ షరీఫ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.పాక్ రాజధాని ఇస్లామాబాద్‌పై భారత సైన్యం దాడి చేసింది. ఇస్లామాబాద్ టార్గెట్‌గా భారత్ డ్రోన్లు, మిస్సైల్లతో దాడికి దిగింది. పాక్ మిస్సైల్లను గాల్లోనే కూల్చి వేసిన భారత సైన్యం. జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై 8 సూసైడ్ డ్రోన్లతో పాక్ దాడి చేయగా వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. జైసల్మేర్, అక్నూర్లో ఇద్దరు పాక్ పైలట్లను పట్టుకున్న భారత ఆర్మీ. మొత్తం 20కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం. లాహోర్ , సియాల్ కోర్టులో కౌంటర్ ఎటాక్‌కు దిగిన భారత్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 14 మంది పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం.S-400, L-17 సిస్టమ్‌ను యాక్టివేట్ చేసిన భారత్. జమ్మూ ఎయిర్‌పోర్టు టార్గెట్‌గా పాక్ దాడులు. ఈ దాడులతో ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను సమర్ధవంతగా తిప్పికొట్టామని భారత ఆర్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టులను హై అలర్ట్ చేసిన భారత్ సైన్యం. వరుస డ్రోన్ దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది. ఇదిలా ఉండగా అమెరికా, యూకే, యూఏఈలతో టచ్‌లో భారత్. రంగంలోకి SZU-23, శిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. తాజా పరినామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. త్రివిధ దళాధిపతులు, CDSతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అయ్యారు. రంగంలోకి భారత నౌకాధళం రంగంలోకి దిగిన భారత నౌకాధళం పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ సీ పోర్టుపై ప్రతీకార దాడి చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత నుంచి మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. ఈ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు. కరాచీ పోర్టులో మొత్తం 10 పాక్ కార్గో నౌకలను ద్వంసం చేసిన ఇండియన్ నేవీ. ఈ దాడుల్లో అనేక షిప్పులు ధ్వంసం అయ్యాయి. అరేబియా సముద్రంలో పాక్‌పై గురి పెట్టిన భారత నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలతో విరుచుకుపడుతూ పాక్‌ను వణికిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేతతాజా పరినామాలతో దేశంలో ఢిల్లీ నుంచి జమ్మూ,గుజరాత్, రాజస్థాన్ వెళ్లే రైళ్లన్నీ రద్దు చేశారు. ఢిల్లీలో హై అలర్ట్తాజా పరినామాలతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ధ భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశించింది. భారీగా NSG కమాండర్ల మోహరింపు.మరోవైపు పాకిస్తాన్‌పై బలూచిస్తాన్ దాడిఓవైపు భారత సైన్యం, ఇండియన్ నేవీ జరుపుతున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్‌కు మరోవైపు నుంచి బలూచిస్తాన్ దాడికి దిగింది. పాక్ చమురు క్షేత్రాలపనా బలూచిల దాడులు. ఇదిలా ఉండగా పాక్‌పై భారత్ దాడులను బలూచి రేడియో హైలెట్ చేస్తోంది.పాక్ రక్షణ వ్యవస్థల కూల్చివేతపాక్లోని 2 వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చేసిన భారత్. సర్గోదా, ఫైసలాబాద్‌లోని రక్షణ వ్యవస్థలను కూల్చినట్లు ప్రకటించిన భారత్. భారత్ దాడులతో దిక్కు తోచని పాక్ బలగాలు.15 భారత సైనిక స్థావరాలపై గురిన్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్లాయ్, భుజ్ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాక్ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది. గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ యూనిట్లను హర్పీ కామికాజ్ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్ కూడా ధ్రువీకరించింది. ‘‘లాహోర్ సమీపంలో ఒక డ్రోన్ నేలకూలింది. గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్–400తో పాటు ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్‌తో పాక్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. యుద్ధ వాతావరణం భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్కోట్, కరాచీ, లాహోర్ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది. పీఎంఓ భేటీ జరుగుతుండగానే!ఇస్లామాబాద్‌పై భారత్ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్లోకి తరలించినట్టు చెబుతున్నారు. పలుచోట్ల బ్లాకౌట్పాక్ దాడుల నేపథ్యంలో గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మోగింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్‌ల్లో పలుచోట్ల వైమానిక దాడుల హెచ్చరికలు జారీ అయ్యాయి. దాంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్, జలంధర్, అమృత్సర్, హోషియార్పూర్, మొహాలీ, చండీగఢ్ మొదలుకుని రాజస్తాన్‌లోని జైసల్మేర్ దాకా పలు నగరాల్లో కరెంటు సరఫరా నిలిపేశారు. ఆయాచోట్ల రాత్రిపూట పలు డ్రోన్లతో పాటు పేలుడు శబ్దాలను గమనించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి. ప్రజలు లైట్లన్నీ ఆర్పేసి ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నాయి. -
ఆపరేషన్ సిందూర్ కొనసాగించాలి
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇదే సరైన చర్య అని మాజీ ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే తాము కూడా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేన (Air Force) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌పై కంటోన్మెంట్‌లోని పలువురు ఆర్మీ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈసారి యుద్ధం వస్తే, అధికారుల నుంచి పిలుపు వస్తే పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నామని రిటైర్డ్ ఆర్మీ జవాన్లు తెలిపారు. దాడులు చేస్తే సహించేది లేదు ఆపరేషన్ సిందూర్ సమర్థనీయమే. శక్తివంతమైన మన త్రివిధ దళాల సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుసు. 1948 మొదలు 1965, 1975, 1999లో పాకిస్థాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పినా తీరు మార్చుకోలేదు. ఉగ్రవాదులు మనదేశంపై దాడులు చేయకుండా పాకిస్తాన్‌లోని వారి శిబిరాలపై దాడులు చేసేందుకు ఆపరేషన్ సిందూర్ కొనసాగించాలి. – ఆర్ఆర్ మహాపాత్రో, రిటైర్డ్ ఆర్మీ అధికారిమరోసారి యుద్ధానికి సిద్ధం ఒకవేళ పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే మనదేశం తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. గత కార్గిల్ యుద్ధంలో మద్రాస్ రెజిమెంట్ 27 తరఫున పూంచ్ సెక్టార్ నుంచి పాల్గొన్నాను. పాక్ ముష్కరులపై దాడులు చేశాం. 2006లో ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందాను. తాజాగా ఉగ్రవాదులు దాక్కున్న తొమ్మిది స్థావారాలపై మన దళాలు దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టి వారి స్థైర్యాన్ని దెబ్బతీశాయి. – పరమేశ్వర్ సింగ్ సిపాయి, రిటైర్డ్పాక్కు తట్టుకునేశక్తి లేదు..ఈసారి పాక్‌తో యుద్ధం వస్తే మరోసారి పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో యుద్ధ ట్యాంకర్ డ్రైవర్‌గా 21 మెకనైజ్డ్ ఎనిఫెంట్రి రెజిమెంట్ తరఫున పదకొండు రోజులపాటు జమ్ము, కశ్మీర్‌లోని మేరినాగ్ బటాపూర్ నుంచి పాల్గొన్నాను. పదకొండు మంది పాక్ సైనికులను అంతమొందించాం. మనదేశానికి చెందిన ఆర్మీ, నేవీ, వాయుసేనను తట్టుకునే శక్తి పాకిస్తాన్‌కు లేదు. – కామేశ్వర్ రావు, కార్గిల్ యుద్ధవీరుడుచదవండి: పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే పేల్చేసిన భారత్ -
'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం
పహల్గాం ఉగ్రవాద దాడికి భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టి తగిన రీతీలో బదులిచ్చింది. దీనిపై యావత్ దేశం హర్షాతీరేకాలు వ్యక్తం చేసింది. అన్నింటికంటే ఈ ఆపరేషన్ సిందూర్ గురించి మీడియా ముందు వెల్లండించిన ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది ఒకరకంగా భారత రక్షణదళం ఎవరి సారథ్యంలో కొనసాగుతోంది అనేది ప్రపంచానికి తెలిసేలా చేసింది. వారే కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లు. అయితే తాతా ముత్తాతల నుంచి ఆర్మీలో సేవలందిస్తున్న సోఫియా కుటుంబం తమ కుమార్తె చేసిన పనికి ఆనందపారవశ్యంలో మునిగితేలుతోంది. 'ఇది మాకెంతో గర్వం' అని భావోద్వేగంగా చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి సైతం ఇలాంటి గొప్ప అవకాశం తన కుమార్తెకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదన్నారు. ఆమె కారణంగా ఈ రోజు యావత్ దేశానికి తమ కుటుంబం గురించి తెలిసేలా వార్తల్లో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోఫియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఆమె కుటుంబసభ్యుల మాటల్లోనే చూద్దామా..!.తమ కుమార్తె భారత ఆర్మీ, నేవీ, వైమానిక బలగాలు సంయుక్తంగా నిర్వహించి ఈ సిందూర్ ఆపరేషన్ గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు కల్నల్ సోఫియా తల్లి హనిమా ఖురేషి. అంతేగాదు తమ కుమార్తె సోపియా కొడుకు(18) కూడా ఐఏఎఫ్(IAF)లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారామె. ఇక కల్నల్ సోషియా తండ్రి తాజ్ ఖురేషి మాట్లాడుతూ.."నా కుమార్తె పట్ల నాకు గర్వంగా ఉంది" నా కుటుంబం ఎల్లప్పుడూ 'వయం రాష్ట్రే జాగ్రయం ( జాతి మొత్తాన్ని సజీవంగా, జాగరూకతతో ఉండేలా చేస్తాం)' అనే సూత్రాన్ని పాటిస్తుంది. 'ముందు మేము భారతీయులం ఆ తర్వాతే ముస్లీంలం' అని సగర్వంగా అన్నారు తాజ్ మొహ్మద్ ఖురేషి. అంతేగాదు ఆమె తాతతో ప్రారంభమైన ఈ దేశ సేవను..సోపియా మూడవ తరం సైనిక అధికారిగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. Meet Taj Qureshi, the proud father of Colonel Sofiya Qureshi 🇮🇳“My grandfather, father & I were all in the #IndianArmy If I get a chance today, I will destroy Pakistan”Imagine RW & Godi Media question their patriotism everyday 💔Mad respect for the REAL HEROES OF INDIA 🫡🇮🇳 pic.twitter.com/CDHH2XoJkt— Ankit Mayank (@mr_mayank) May 7, 2025 ఇక సోఫియా తండ్రి తాజ్ ఖురేషి వడోదరలో ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ కార్ఫ్స్ పనిచేయడమే గాక 1971 యుద్ధంలో సేవలందించారు. అలాగే సోఫియా తండ్రి (తాజ్)గారి అమ్మమ్మ తాతయ్య బ్రిటిష్ సైన్యంలో పనిచేయడమే గాక 1857 స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఇక ఆమెకు ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన మొహమ్మద్ సంజయ్ ఖురేషి మాట్లాడుతూ..'దేశ భక్తి మా రక్తంలోనే ఉంది' అని సగర్వంగా చెప్పారు. ఎందుకంటే సోఫియా ప్రొఫెసర్ కావాలనుకుంని, అనివార్య కారణాలతో భారత ఆర్మీ యూనిఫాం ధరించిందని అన్నారు. అలా ఆమె కుటుంబ సంప్రదాయన్ని పుణికి పుచ్చుకుందని అన్నారు. ఇక ఆమె భర్త తాజుద్దీన్ ఆర్మీ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి కావడం విశేషం. చివరిగా కుటుంబ సభ్యులంతా.."ఆమె మాకు ఆదర్శం... ప్రతీకారం తీర్చుకోవడానికి మేము చాలా కాలంగా ఎదురుచూశామం కానీ, ఇలాంటి అద్భుత అవకాశం మా కుటుంబ సభ్యల్లో ఒకరికి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ పహల్గాం ఘటనలో భర్తలను కోల్పోయిన సోదరీమణులు, తల్లుల ఆక్రందనలకు సిందూరంతో ప్రతీకారం తీర్చుకున్నాం" అని అన్నారు. కాగా, సోఫియా పేరు మీద అనేక అవార్డులు కూడా ఉన్నాయట. అలాగే భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక కవాతులో పాల్గొన్న 18 కంటింజెంట్లలో ఏకైక మహిళా కమాండర్ సోఫియానే అట.విద్యా నేపథ్యం:కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ మీడియంలో పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత 1995లో బీఎస్సీ, 1997లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరేందుకు తన పీహెచ్డీ ప్రోగ్రామ్ని మధ్యలోనే విడిచిపెట్టినట్లు వివరించారు. ఇక సైన్యంలో చేరాక తన కెరీర్లో ఆరేళ్లు యూఎన్ శాంతి పరిరక్షక దళాలలో పని చేయడం, సంఘర్షణ ప్రాంతాలలో పనిచేయడం, మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వంటి ఎన్నో అద్భుత సేవలందించారామె.చదవండి: నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా.. -
భారత్ జవాన్లకు మద్దతుగా సీఎం రేవంత్ ర్యాలీ
-
'ఆపరేషన్ సిందూర్' పేరిట 25 నిమిషాలపాటు దాడి
-
ముష్కరులపై తిరుగులేని అస్త్రాలు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ముష్కరుల భరతం పట్టడానికి భారత సైన్యం అత్యాధునిక క్షిపణులు ప్రయోగించింది. స్కాల్ప్ క్రూయిజ్ మిస్సైళ్లు, హ్యామర్ క్షిపణులను రంగంలోకి దించింది. వీటిని రఫేల్ యుద్ధ విమానాల నుంచి ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేయడంలో స్కాల్ప్ క్షిపణులు పేరుగాంచాయి. వీటిని స్టార్మ్ షాడో అని కూడా అంటారు. పగటిపూట, రాత్రిపూట మాత్రమే కాకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయోగించేలా ఉండడం వీటి ప్రత్యేకత. సుదూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. స్కాల్ప్ మిస్సైల్స్ రేంజ్ 450 కిలోమీటర్లు. జీపీఎస్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్ వల్ల గురి తప్పదు. యూరోపియన్ కన్సార్టియం ఎంబీడీఏ ఈ క్షిపణులను తయారు చేసింది. దృఢమైన బంకర్లు, ఆయుధాగారాలను ధ్వంసం చేయడానికి ఇవి చక్కగా తోడ్పడతాయి. గత ఏడాది ఉక్రెయిన్ సైన్యం ఇలాంటి క్షిపణులనే తొలిసారిగా రష్యాపై ప్రయోగించింది. స్కాల్ప్ మిస్సైల్ 450 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. తక్కువ ఎత్తులో ప్రయోగించగల వీలుంది కాబట్టి శత్రువుల నిఘా వ్యవస్థలు వీటిని గుర్తించడం కష్టం. -
ప్రతిదాడులకు ఆస్కారం లేకుండా దాడి చేశాం
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు మరింతగా పెచ్చరిల్లకుండా చూసుకుంటూనే సరైన రీతిలో ప్రతీకార చర్యలు చేపట్టామని ప్రపంచ దేశాలకు భారత్ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో కలిసి ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో దాడి వివరాలను మీడియాకు వెల్లడించారు. తొలుత విక్రమ్ మిస్రీ మాట్లాడారు. ‘‘ ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందుకు ఈడ్చుకురావాల్సిన అత్యావశ్యక పరిస్థితుల్లో ఈ దాడులు చేయాల్సి వచ్చింది. తమ భూభాగంలో ఉగ్ర వ్యవస్థపై పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగా మేం ‘బాధ్యతాయుతమైన’ దాడులు చేశాం. పహల్గాం ఉదంతం తర్వాత సైతం మరోసారి భారత్‌లో దాడులతో తెగించేందుకు ఉగ్రసంస్థలు కుట్రలు పన్నినట్లు విశ్వసనీయ నిఘా సమాచారం అందటంతో ముందస్తుగా మెరుపుదాడులు చేశాం. పౌర, జనావాసాలకు ఏమాత్రం హాని కలగకుండా కేవలం ఉగ్రవాదుల మౌలికవసతులే లక్ష్యంగా దాడులు జరిపాం. సీమాంతర దాడులు, సీమాంతర చొరబాట్లను నిరోధించడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాడులు కొనసాగాయి. బైసారన్‌లో హేయమైన ఉగ్రదాడి జరిగింది. అమాయకులను తమ కుటుంబసభ్యుల కళ్లెదుటే తలపై గురిపెట్టి కాల్చిచంపారు. దీంతో కుటుంసభ్యుల్లో అంతులేని విషాదం, భయం అలుముకున్నాయి. భారత్ అదే స్థాయిలో ఉగ్రవాదులకు దీటైన సమాధానం చెప్పదల్చుకుంది’’ అని మిస్రీ స్పష్టంచేశారు. ‘‘జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఇష్టంలేకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కోట్ల మంది పర్యాటకులతో వృద్ధిబాటలో పయనిస్తున్న కశ్మీర్ ఆర్థికవ్యవస్థను ఉగ్రవాదులు కూలదోయాలనున్నారు. ప్రత్యేకంగా హిందువులను చంపేసి కశ్మీర్ లోయలో, దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూశారు. కానీ భారతీయులు వీళ్ల నమ్మకాన్ని వమ్ముచేశారు. ఈ విషయంలో మన ప్రజలను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే’’ అని మిస్రీ అన్నారు. నారీశక్తి.. నాయకత్వం ‘ఆపరేషన్ సిందూర్’ దాడి వివరాలను ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు మీడియాకు వివరించడం అక్కడి వారందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత్ ఏఏ ప్రాంతాలపై దాడి చేసిందనే పూర్తి వివరాలను భారత ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషి, భారత వాయుసేన తరఫున వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు మీడియాకు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే), పాకిస్తాన్‌లోని ఏఏ ప్రాంతాల్లో ఏ విధంగా భారత్ దాడులు చేసిందో ఈ అధికారిణులు ఇద్దరూ సవివరంగా చెప్పారు. ధైర్యసాహసాలతో దాడులు చేసిన వైనాన్ని వనితలతో చెప్పించడం వెనుక భారత సర్కార్ దౌత్య పాటవం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లింగవివక్షకు తావులేకుండా కీలక సమయాల్లోనూ భారత్ సమానత్వానికి, మహిళా సాధికారతకు జై కొడుతుందని ఈ మీడియా సమావేశంలో భారత్ మరోసారి చాటిచెప్పిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. సోఫియా ఖురేషి ప్రస్తుతం ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో కల్నల్‌గా ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా ప్రస్తుతం హెలికాప్టర్ పైలట్‌గా సేవలందిస్తున్నారు. ఖురేషీ హిందీలో, వ్యోమికా ఇంగ్లిష్ లో మాట్లాడారు. ‘‘ పహల్గాం దాడికి ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టాం. 9 ఉగ్రస్థావరాలపై దాడులు జరిపాం. గత మూడు దశాబ్దాల్లో పాకిస్తాన్లో ఎన్నో ఉగ్ర స్థావరాలు నెలకొల్పారు. ఇక్కడ రిక్రూట్మెంట్, భారత్‌పై విద్వేషాన్ని నూరిపోసేలా ప్రసంగాలు ఇవ్వడం, శిక్షణ కేంద్రాలున్నాయి’’ అని సోఫియా ఖురేషీ చెప్పారు. ‘‘ ఈ దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీ సంబంధ ప్రాంతాల జోలికి వెళ్లలేదు. అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడులు చేశాం. దాడి ప్రాంత పరిధికి తగ్గట్లుగా సరైన ఆయుధాలను, అనువైన సాంకేతకతను వినియోగించాం. దీని వల్ల లక్ష్యాలను మాత్రమే ధ్వంసంచేశాం. చుట్టుపక్కల ప్రాంతాలకు ఎలాంటి నష్టం జరగలేదు. ముందుగా నిర్ణయించుకున్న భవనాలను మాత్రమే నేలమట్టంచేశాం. ఆ శిబిరాల్లోని ఉగ్రవాదులను హతమార్చాం. లక్ష్యాల ఛేదనలో భారత సాయుధ బలగాల ప్రణాళికా రచన, దాడి, సామర్థ్యాలను ఈ దాడులు మరోసారి చాటిచెప్పాయి. ఇకమీదట పాకిస్తాన్ ఉద్రిక్తతలను పెంచుతూ దాడులు చేయాలని చూస్తే భారత్ కనీవినీ ఎరుగని రీతిలో దాడులతో విరుచుకుపడుతుందని మరోసారి స్పష్టంచేస్తున్నా. జై హింద్’’ అని వ్యోమికా సింగ్ తన మీడియా బ్రీఫింగ్ను ముగించారు. ఈ ఇద్దరు మహిళాధికారుల మధ్యలో కూర్చొని మీడియాకు వివరాలు వెల్లడించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక కశ్మీరీ పండిట్. కీలక ప్రెస్మీట్లో ఎవరెవరు వేదికపై ఆసీనులై భారతవాణిని ప్రపంచానికి వినిపించాలనే విషయంలో కేంద్రప్రభుత్వానికి అత్యంత స్పష్టత ఉందని ఈ ముగ్గురిని చూస్తే తెలుస్తోంది. -
Operation Sindoor: భారత్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైన ఉగ్రశిబిర శిథిలాలు
-
నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత మే 7 బుధవారం తెల్లవారుజామున భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి బదులిచ్చింది. నాడు ఆ విషాదకర ఘటనలో మోదీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కడతేర్చారు. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళ 'సిందూరం' పేరుతోనే ఆపరేషన్ చేపట్టి ఉలిక్కిపడేలా సమాధానమిచ్చింది భారత్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లు మిగిల్చితే..ఈ ఆపరేషన్ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పడం విశేషం. అంతేగాదు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది మీడియా ముందు వెల్లడించారు కూడా. మరీ ఆ ఆదిపరాశక్తులు ఎవరు? ఏవిధంగా ఈ ఆపరేషన్ని విజయవంతంగా ముగించారు తదితర విశేషాలు చూద్దామా..!వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ సిందూర్ ఆపరేషన్ వారి నేతృత్వంలోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. ఈ సిందూర్ ఆపరేషన్‌కి సంబంధించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించింది వీరిద్దరే. సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్‌గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్యంసం సృష్టించగా, వ్యోమికా సింగ్ ఆకాశం నుంచి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ ఇరువురి మహళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై మెరుపులు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలతో సహా పాక్‌లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లు, ట్రైనింగ్ సెంటర్లను కూడా మట్టుబెట్టింది. అంతేగాదు విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే గాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలెట్ చేసింది. సాహసాలకు కేరాఫ్ అడ్రస్ ఇరువురు..ఇక్కడ సోఫియా కుటుంబం మొత్తం సైనిక సేవలతో ముడిపడి ఉంది. అంతేగాదు సోఫియా ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.సోఫియా యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆరు సంవత్సరాలు సేవలందించారు.ఐక్యరాజ్యసమితి మిషన్‌లో (2006) గణనీయమైన సేవలు అందించారువ్యోమిక తన పేరుకు తగ్గట్టే పైలట్ కావాలనే రంగాన్ని ఎంచుకుని సైన్యంలో చేరారామె. అంతేగాదు తన కుటుంబంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తిగా వ్యోమిక పేరుగడించింది. డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. భారత్‌లో అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో చేతక్, చిరుత వంటి విమానాలను నడిపారామెఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు.2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలకమైన రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించింది2021లో త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారుహర్షం వ్యక్తం చేసిన పహల్గాం బాధితులు..ఆ ఆపరేషన్ గురించి వినగానే కళ్లల్లో నీళ్లు వచ్చేశాయన్నారు పహల్గామ్ బాధితులు. మా కుంకుమను నేలరాల్చిన వారికి అదే పేరుతో ఆపరేషన్ చేపట్టి మట్టికరిపించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని గద్గద స్వరంతో అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం అని ధీమాగా చెప్పారు.(చదవండి: Operation Sindoor: మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాం బాధితుల రియాక్షన్) -
భారత్ పై పాక్ అబద్ధపు ప్రచారం
-
4 డ్రోన్లు వచ్చాయి.. నేలమట్టం చేశాయి: పాక్ ప్రత్యక్ష సాక్షి
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాయాది దేశంలోని ఉగ్ర తండాలను నేలమట్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్ర మూకల ఆట కట్టించింది. ఇండియా దెబ్బకు పాకిస్థాన్‌తో పాటు పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలు నామరూపాల్లేకుండా పోయాయి. 80 మందికి పైగా ముష్కరులు మట్టికరిచారు. ఆపరేషన్ సిందూర్‌ను యావత్ భారత్ ముక్త కంఠంతో ప్రస్తుతిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పారంటూ ఇండియన్ ఆర్మీని కీరిస్తున్నారు.కేవలం 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా ముగించింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్‌లోని మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడిని చూసిన ఒక స్థానికుడు 'ఆపరేషన్ సిందూర్' గురించి రాయిటర్స్ వార్తా సంస్థకు వివరించాడు. తాను నాలుగు డ్రోన్లను చూశానని వెల్లడించాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద పేలుడు శబ్దం వినబడటంతో తాము నిద్ర నుంచి మేలుకున్నామని, అప్పుడే డ్రోన్ దాడులను (Drone Attack) ప్రత్యక్షంగా చూశామని చెప్పాడు."రాత్రి 12:45 గంటల ప్రాంతంలో మేము నిద్రపోతుండగా ముందుగా ఒక డ్రోన్ వచ్చింది. ఆ తర్వాత మరో మూడు డ్రోన్లు వచ్చాయి. అవి మసీదులపై దాడి చేశాయి. ప్రతిదీ ధ్వంసమైంది" అని మురిడ్కేకు చెందిన స్థానికుడు ఒకరు రాయిటర్స్‌తో అన్నారు. కాగా, భారత భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్లో 4, పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ (Indian Army) ధ్వంసం చేసింది.తగిన సమాధానం ఇస్తాం: పాక్ఆపరేషన్ సిందూర్‌ను "నిర్లక్ష్యమైన యుద్ధ చర్య"గా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. "తగిన సమాధానం" ఇవ్వడానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భారీగా కాల్పులు జరిపింది. దీనికి భారత భద్రతా దళాలు దీటుగా జవాబిచ్చాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కశ్మీర్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కోరారు.చదవండి: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్? -
Operation Sindoor: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం వంతంగా ముగి;సింది. పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మంగళవారం అర్ధ రాత్రి భారత భద్రతా దళాలు ఆర్మీ,నేవీలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి.ఆపరేషన్‌లో భాగంగా లక్షిత దాడుల్ని అరగంటలోపు నేలమట్టం చేసింది. 9స్థావరాల్లో ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేశాయి. అనంతరం ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం జరిగింది. ఈ ఆపరేషన్‌కు సారధ్యం వహించిన భారత సశస్త్ర దళాల్లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీ,విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రిలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కర్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది వెల్లడించారు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోల్ని బహిర్ఘతం చేశారు. దీంతో ప్రపంచ మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారులు గురించి చర్చ మొదలైంది. ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) ఇండియన్ ఆర్మీలోని త్రివిధ దళాలలైన ఆర్మీలోని సిగ్నల్‌కోర్‌కి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ. అనేక సాహసోపేతమైన విజయాలతో సైనిక చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచున్నారు. ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించారు. ఫోర్స్ 18కు నాయకత్వం 2016 మార్చిలో అప్పటి లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ భారత్ ఆతిథ్యమిచ్చిన ఫోర్స్ 18 అనే బహుళజాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసం మార్చి 2 నుండి 8 వరకు పుణేలో జరిగింది. ఇందులో ఆసియన్ దేశాలతో పాటు జపాన్, చైనా, రష్యా, యుఎస్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి 18 దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసంలో పాల్గొన్న దళాల్లో, లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషీ మాత్రమే మహిళా కమాండర్‌గా ఉండడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి నిదర్శనం.పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌లోనూఆమె నేతృత్వంలోని 40-సభ్యుల భారత దళం శాంతి భద్రతలను కాపాడేందుకు, సంఘర్షణ లేదా సంఘర్షణానంతర ప్రాంతాలకు సైనిక సిబ్బందిని మోహరించి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించే విభాగమే ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ (PKOs). ఈ పీకేవో ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. హ్యూమానిటేరియన్ మైన్ యాక్షన్ (HMA) వంటి కీలక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా అనుభవజ్ఞులైన పీస్ కీపింగ్ శిక్షణాదారులలోంచి ఆమెను ఎంపిక చేశారు.యుఎన్ శాంతి పరిరక్షణలో విశిష్ట అనుభవం2006లో, యుఎన్ శాంతి పరిరక్షణ మిషన్ (కాంగో) లో మిలిటరీ అబ్జర్వర్‌గా పనిచేశారు. 2010 నుంచి ఆమె పీకేవోలో కొనసాగుతూ వచ్చారు. అందులో ఆమె విశేష సేవలు అందిస్తున్నారు. సైనిక సేవ ఆమెకు వారసత్వంగా ఆమె తాత సైన్యంలో సేవలందించగా, ఆమె భర్త కూడా మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీకి చెందిన అధికారి. ఈ విధంగా ఆమె కుటుంబం సైనిక సేవలతో ముడిపడిందివింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh)వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత వైమానిక దళానికి చెందిన పైలట్. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు ఈమె నేతృత్వంలోనే జరిగాయి. వ్యోమికా సింగ్ విషయానికొస్తే.. వ్యోమిక అంటే ఆకాశపు కుమార్తె అని అర్ధం. ఆ పేరులో ఆమె చిన్ననాటి కల ప్రతిబింబిస్తుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు పైలట్ కావాలనే సంకల్పం ఉండేది. స్కూల్ రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరి, తరువాత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కుటుంబంలో మొదటిసారిగా సైన్యంలో చేరిన వ్యక్తిగా ఆమె పేరు గడించారు. 2019 డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.చల్లని గాలుల మధ్య నుండి మసక చీకట్ల వరకూ అన్నీ సాహసాలే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు. చేతక్, చీటాహ్ వంటి హెలికాప్టర్లను నడిపుతూ, జమ్మూ కాశ్మీర్ లోని ఎత్తయిన ప్రాంతాలు నుండి, ఈశాన్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల వరకూ సేవలందించారు. 2020లో అరుణాచల్ ప్రదేశ్‌లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో సామాన్యులను రక్షించేందుకు ఆమె ఒక కీలకమైన రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. 2021లో ఆమె మౌంట్ మనిరంగ్ (21,650 అడుగుల ఎత్తు) పైకి ప్రయాణించిన త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు.ఆపరేషన్ సిందూర్ తర్వాత పహల్గాంలో 26 మంది సాధారణ పౌరుల హత్యకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో, దేశానికి సమాచారం ఇవ్వడమే కాక, భారత సైన్యం ఇప్పుడు ఎవరిచేత ప్రాతినిధ్యం వహించబడుతోంది అన్న దానిలో స్పష్టమైన మార్పును వింగ్ కమాండర్ సింగ్ చూపించారు. -
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్.. లైవ్
ఢిల్లీ: పాక్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులపై భారత విదేశాంగ, రక్షణ శాఖ బుధవారం ఉదయం సంయుక్తంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందు భారత్‌పై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల తాలూకు వీడియోల్ని విడుదల చేసింది. అనంతరం, ప్రెస్ మీట్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ముందుగా విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందుపై మిస్రీ తర్వాత ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాల్ని వెల్లడించారు. #WATCH | Delhi | #OperationSindoor| Foreign Secretary Vikram Misri says, " A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a Front for UN proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba...Investigations into the Pahalgam… pic.twitter.com/JqpIbHrttN— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్..👉ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్ సిందూర్ 1.05 నిమిషాలకు ప్రారంభమై 1.30కి ముగిసింది9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్‌లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వసం చేశాం అప్జన్ కసబ్కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు.ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు చేశాం 👉విక్రమ్ మిస్రీఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారులష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ఏ ఈ దాడి చేసింది దాడిని సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. టీఆర్ఎఫ్కు పాకిస్తాన్ అండదండలున్నాయి.జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దాడులు చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందిఉగ్రవాదులను చట్టం ముందు శిక్షించాలిముంబై ఉగ్రదాడి తర్వాత దేశంలో పహల్గాం అతి పెద్ద ఉగ్రదాడిభారత్..పాక్‌కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది.ఉగ్రసంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ జరిగిందిగతేడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారుజమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని ,ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేందుకు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిపాక్లో ఉన్న ఉగ్ర సంస్థల గురించి 2023 లో భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్ళిందిపాకిస్తాన్పై దౌత్య పరమైన ఆంక్షలు విధించాంఅయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపలేదుఉగ్రదాడులు చేసిన వారికి పాక్ షెల్టర్ ఇస్తోందిసీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ 22, 2025న, పాకిస్తాన్,పాకిస్తాన్ శిక్షణ పొందిన లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో భారతీయ పర్యాటకులపై దారుణమైన దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది మరణించారు, వీరిలో ఒక నేపాల్ జాతీయుడు కూడా ఉన్నారు. 2008 నవంబర్ 26 ముంబై దాడుల తర్వాత ఇది అత్యధిక పౌర మరణాలతో కూడిన ఉగ్రదాడి. దాడి అత్యంత క్రూరంగా జరిగింది, బాధితులను సమీప నుండి తలపై కాల్చి చంపారు, వారి కుటుంబాల ముందే ఈ హత్యలు జరిగాయి. కుటుంబ సభ్యులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టేలా హత్యలు జరిగాయి, సందేశాన్ని తీసుకెళ్లమని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్లో తిరిగి వస్తున్న సాధారణ స్థితిని అడ్డుకోవడం ఈ దాడి లక్ష్యం. గత సంవత్సరం 23 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించిన ఈ ప్రాంతంలో పర్యాటక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం దీని ఉద్దేశం. ఈ దాడి యూనియన్ టెరిటరీలో వృద్ధిని అడ్డుకుని, పాకిస్తాన్ నుండి సరిహద్దు ఉగ్రవాదానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలనే లక్ష్యంతో జరిగింది. ఈ దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో మతపరమైన అసమ్మతిని రెచ్చగొట్టే ఉద్దేశంతో జరిగింది.భారత ప్రభుత్వం,ప్రజలు ఈ కుట్రలను విఫలం చేశారు. ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ” (TRF) అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. టీఆర్ఎఫ్ అనేది ఐక్యరాష్ట్ర సమితి నిషేధిత పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాకు ముసుగు. మే, నవంబర్ 2024లో ఐక్యరాష్ట్ర సమితి 1267 శిక్షణ కమిటీకి భారత్ TRF గురించి సమాచారం అందించింది, ఇది పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు కవర్‌గా పనిచేస్తుందని తెలిపింది. డిసెంబర్ 2023లో లష్కర్, జైష్-ఎ-మహమ్మద్ టీఆర్ఎఫ్ టి చిన్న ఉగ్రవాద సంస్థల ద్వారా పనిచేస్తున్నట్లు భారత్ తెలిపింది. ఏప్రిల్ 25, 2025 ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి పత్రికా ప్రకటనలో TRF ప్రస్తావనను తొలగించాలని పాకిస్తాన్ ఒత్తిడి చేసింది పహల్గాం దాడి దర్యాప్తులో ఉగ్రవాదులు పాకిస్తాన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. TRF చేసిన బాధ్యత ప్రకటనలు, లష్కర్-ఎ-తోయిబా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాటిని రీపోస్ట్ చేయడం దీనికి నిదర్శనం. సాక్షుల గుర్తింపు, చట్ట అమలు సంస్థలకు అందిన సమాచారం ఆధారంగా దాడి చేసినవారిని గుర్తించారు. ఈ దాడి ప్రణాళికకర్తలు, మద్దతుదారుల గురించి భారత ఇంటెలిజెన్స్ ఖచ్చితమైన సమాచారం సేకరించింది. భారత్‌లో సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంపొందించడంలో పాకిస్తాన్ చరిత్ర బాగా డాక్యుమెంట్ చేయబడింది. పాకిస్తాన్ అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరుగాంచింది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ తప్పుదారి పట్టిస్తుంది. సజిద్ మీర్ కేసు దీనికి ఉదాహరణ: ఈ ఉగ్రవాదిని మృతుడిగా ప్రకటించి, అంతర్జాతీయ ఒత్తిడి తర్వాత అతను బతికే ఉన్నాడని, అరెస్టు చేశామని తెలిపారు.పహల్గాం దాడి జమ్మూ కశ్మీర్‌తో పాటు భారతదేశంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఏప్రిల్ 23న పాకిస్తాన్‌తో సంబంధాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రాథమిక చర్యలను ప్రకటించింది. దాడి జరిగిన రెండు వారాలు గడిచినప్పటికీ, పాకిస్తాన్ తన భూభాగంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కేవలం ఆరోపణలు, తిరస్కరణలతో సరిపెట్టింది. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద గుండ్లు మరిన్ని దాడులకు ప్రణాళికలు వేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ గుర్తించింది.ఆపరేషన్ సిందూర్: ఈ ఉదయం భారత్ తన హక్కును వినియోగించుకుని, సరిహద్దు దాడులను నిరోధించడానికి, నివారించడానికి చర్యలు తీసుకుంది. ఈ చర్యలు నియంత్రిత, అనవసర ఉద్రిక్తత లేని, సమతూకమైన, బాధ్యతాయుతమైనవి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, భారత్‌కు పంపబడే ఉగ్రవాదులను అడ్డుకోవడంపై దృష్టి సారించారు. ఏప్రిల్ 25, 2025న ఐక్యరాష్ట్ర సమితి భద్రతా మండలి జారీ చేసిన పత్రికా ప్రకటనలో “ఈ దుర్మార్గపు ఉగ్రవాద చర్యకు కారకులు, నిర్వాహకులు, ఆర్థిక సహాయకులు, ప్రోత్సాహకులను జవాబుదారీగా చేసి న్యాయస్థానం ముందు తీసుకురావాలి’ అని నొక్కి చెప్పింది. కల్నల్ సోఫియా ఖురేషీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. కల్నల్ సోఫియా ఖురేషీవింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ #WATCH | #OperationSindoor | Terror site Markaz Subhan Allah, Bahawalpur, Pakistan, the headquarters of Jaish-e-Mohammed, targeted by Indian Armed Forces." pic.twitter.com/iM4s91ktb8— ANI (@ANI) May 7, 2025👉ఆపరేషన్ సిందూర్‌లో ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన పాక్ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఇవే ఎల్ఈటీ-లష్కరే తోయిబా,జేఈఎం-జైషే మహమ్మద్, హెచ్ఎం-హిజ్బుల్ ముజాహిదీన్ 1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - ఎల్ఈటీ3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - హెచ్ఎం5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - ఎల్ఈటీ6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - హెచ్ఎం8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - ఎల్ఈటీ9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎం #WATCH | Video shows multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJKCol. Sofiya Qureshi says, "No military installation was targeted, and till now there are no reports of civilian casualties in Pakistan." pic.twitter.com/zoESwND7XD— ANI (@ANI) May 7, 2025 -
భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’పై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై భారత్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ వేదికగా స్పందించారు.పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ బలగాలు జరిపిన దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరోసారి పహల్గాం తరహా ఘటన పునరావృతం కాకుండా ఉండేలా పాకిస్తాన్‌కు గట్టి గుణ పాఠం చెప్పాలి. పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జై హింద్! అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. میں ہماری دفاعی افواج کی جانب سے پاکستان میں دہشت گرد ٹھکانوں پر کیے گئے ہدفی حملوں کا خیرمقدم کرتا ہوں۔ پاکستانی ڈیپ اسٹیٹ کو ایسا سبق سکھانا چاہیے کہ پھر کبھی دوسرا پہلگام نہ ہو۔ پاکستان کے دہشت گردی کے ڈھانچے کو تباہ کر دینا چاہیے۔ جے ہند!#OperationSindoor— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025 -
Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి?
delhi: పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తాజా సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..! అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్‌పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది.పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమ శివుడు పార్వతి దేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు.. భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు. ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. This video captures the moment an Indian missile hit Bahawalpur, Pakistan, during 'Operation Sindoor' — a series of retaliatory attacks for last month’s Pahalgam bombing that killed 26 people, which India blames on Pakistan. pic.twitter.com/9g0yzHhYVB— Al Jazeera English (@AJEnglish) May 6, 2025సింధూరం భారతీయ సాంస్కృతికలో వివాహ తత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజపుత్‌లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్.. పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు. ఇది నీతికోసం, ధర్మంకోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది. దేశాన్ని కుదిపేసిన వినయ్ నర్వాల్ ఘటన ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌నే. వినయ్ నర్వాల్ దంపతులకు పెళ్లై అప్పటికి ఆరు రోజుల క్రితమే. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. దెబ్బకు దెబ్బ తీసిందిఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే.. భారత్ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో, ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా, ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. -
గుర్తుపెట్టుకో.. నా పేరు అజిత్ దోవల్
-
ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది.ఆపరేషన్ సిందూర్ ఇలా.. 1:44 AM ఆపరేషన్ సిందూర్ ప్రారంభం1:45 AM మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఏక కాలంలో దాడులు.1:45 AM ఉగ్ర స్థావరాలపై మిసైల్స్‌తో దాడులు.2:00 AM న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్టులో భారత ఆర్మీ ప్రకటన..2:25 AM భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.2:30 AM శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు.3:00 AM ధర్మశాల, లేహ్, జమ్ము, అమృతసర్ విమానాశ్రయాలు మూసివేత.4:00 AM ఎల్వోసీ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులుభారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది. -
Operation Sindoor: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు. భారత్ జరిపిన దాడిని పాకిస్తాన్ అంగీకరించింది. తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని తెలిపింది. ఇక ఇండియన్ ఆర్మీ విజయవంతగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సిందూర్‌ను (OperationSindoor)ప్రధాని మోదీ రాత్రంతా సమీక్షించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ కేంద్రంగా ఉన్న బహావల్పూర్ సహా పంజాబ్ ప్రావిన్స్‌లోని ఐదు ప్రదేశాలు, పీఓకేలోని నాలుగు ప్రదేశాలు ఈ దాడులు జరిగాయి. వీటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం సైతం ఉంది. "प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో బుధవారం తెల్లవారు జామున ఉదయం 1:44 గంటలకు ఆపరేషన్ సింధూర్‌పై ప్రకటన చేసింది. తాము దాడులు నిర్వహించింది ఉగ్రవాద స్థావరాలేనని, పాకిస్తాన్ సైనిక స్థావరాలు కాదని స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నేరుగా సమీక్షించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, గూఢచార సంస్థల ఉన్నతాధికారుల నుండి నిరంతరంగా సమాచారం అందుకుంది. మంగళవారం రాత్రి నుంచే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో ప్రధాని పలుమార్లు మాట్లాడారు. పహల్గాం ఘటన అనంతరం ప్రభుత్వ గూఢచార సంస్థల ద్వారా పొందిన కీలక నిఘా సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచాఉరం. దాడుల అనంతరం భారత ప్రభుత్వం ముఖ్య అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించింది. అమెరికా, యూకే , రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాధికారులను భారత ఉన్నతాధికారులు సంప్రదించి ఈ దాడులు గురించి పూర్తిగా వివరించారు. -
పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..
-
ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశం
Indian Army Operation Sindoor Updates.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యవసర సమీక్షసరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు హాజరువీడియో కాన్ఫరెన్స్ ద్వారా సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షజమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు, లడఖ్ లెప్టినెంట్ గవర్నర్ హాజరు రేపు కేంద్రం అఖిలపక్ష సమావేశంవివరాలు వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజురేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని అఖిలపక్ష సమావేశం ఏర్పాటుఆపరేషన్ సిందూర్ వివరాలు అఖిలపక్షానికి వివరించనున్న కేంద్రంభారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత విషయాలను అఖిలపక్ష నేతలకు వివరించనున్న కేంద్రం ముగిసిన కేబినెట్ సమావేశం..పాక్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ గురించి కేబినెట్ సహచరులకు వివరించిన ప్రధానికేబినెట్లో భద్రతా బలగాలను కీర్తించిన ప్రధాని మోదీరాష్ట్రపతి నిలయానికి ప్రధాని మోదీ.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆపరేషన్ సిందూర్‌పై వివరించనున్న ప్రధాని. ప్రధాని నివాసం నుంచి వెళ్లిపోయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ #WATCH | Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah leave from 7, LKM, the official residence of PM Modi pic.twitter.com/U0rmI5nkEC— ANI (@ANI) May 7, 2025 మోదీ విదేశీ పర్యటనలు రద్దు.. మీడియా సమావేశం..ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు.మూడు దేశాల పర్యటన రద్దు అయ్యింది.నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్ పర్యటన రద్దుప్రధాని మోదీ మీడియా సమావేశం..భారత్ ఎన్నో విజయాలు సాధిస్తోంది.అంతరిక్ష ప్రయోగాలపై మోదీ సందేశం.అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం.మంగళ్యాన్, చంద్రయాన్ వంటి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాం. కేంద్ర కేబినెట్ భేటీ..కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశంఆపరేషన్ సిందూర్‌పై చర్చిస్తున్న కేబినెట్సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులపై సమీక్ష‘ఆపరేషన్ సిందూర్’పై ప్రపంచ నేతల స్పందన ఇదే..👉అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు.👉అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందన.. భారత్- పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. శాంతియుత పరిష్కార దిశగా చర్చలు జరపాలి👉భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్.. ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్‌కు మా మద్దతు ఉంటుంది.👉యూఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్.. భారత్-పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదు. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి👉చైనా స్పందన.. భారత్, పాక్ రెండూ దాయాది దేశాలు. ఇవి రెండూ చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్నిరకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని ఇరు దేశాలను కోరుతున్నాం. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని భారత్, పాకిస్థాన్‌లను కోరుతున్నాం👉ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్.. రెండు దేశాల సైనికులు సంయమనం పాటించాలి. పౌరులను చంపడం భావ్యం కాదు: ఒమర్ అబ్దుల్లాపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత బలగాలుపాక్ మిలిటరీ, పౌరులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉగ్ర శిబిరాలపై దాడిఅయినప్పటికీ పాక్ అన్యాయంగా పౌరులపై దాడి చేసి 10 మందిని పొట్టనపెట్టుకుందని విమర్శ.అమిత్ షా కీలక ఆదేశాలు..సెలవులో ఉన్న పారా మిలిటరీ బలగాలను వెనక్కి రప్పించండిఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాసెలవులో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని పేర్కొన్న అమిత్ షా ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం ప్రారంభంమీడియా సమావేశంలో మాట్లాడుతున్న విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: అమిత్ షాభారత్, ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుంది.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయని వెల్లడిఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని పోస్టు పెట్టిన అమిత్ షాజమ్ముకశ్మీర్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఆపరేషన్ సిందూర్ తర్వాత స్పందిస్తున్న కేంద్ర పెద్దలు..ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీఎస్ఎఫ్ డీజీతోనూ చర్చించిన అమిత్ షాసరిహద్దు భద్రతపై ఒమర్ అబ్దుల్లా సమీక్షపౌరుల ప్రాణాలను కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన సీఎంఅత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని అధికారులకు ఆదేశంజేపీ నడ్డా వార్నింగ్..మా జోలికొస్తే ఊరుకుంటామా అంటూ నడ్డా వ్యాఖ్యలు..ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చాయి.భారత గడ్డపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన నడ్డాఉగ్రవాదం అనే పీడను విరగడ చేస్తామని పోస్టు పెట్టిన నడ్డారక్షణ మంత్రితో సీడీఎస్ భేటీరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన సీడీఎస్ అనిల్ చౌహాన్సౌత్ బ్లాక్‌లో పరిస్థితిని వివరిస్తున్న అనిల్ చౌహాన్ త్రివిధ దళాల మీడియా సమావేశం..ఉదయం 10:30 కు ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశంసమావేశంలో పాల్గొననున్న రక్షణ, విదేశాంగ, ఆర్మీ ప్రతినిధులుఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులను వివరించనున్న ఆర్మీ.ఐదు భారత్ ఫైటర్ జెట్లను కూల్చేశామని చెబుతున్న పాకిస్తాన్Graphic representation of the targets taken by the Indian Armed Forces under #OperationSindoor in Pakistan and PoJK https://t.co/cEasBn51U9 pic.twitter.com/HMONRGQxWW— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన ఖర్గే..పాకిస్తాన్ మరియు పిఓకె నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉంది.పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత దళాల దాడి పట్ల చాలా గర్వపడుతున్నాం.భారత ఆర్మీ దృఢ సంకల్పం మరియు ధైర్యాన్ని మేము అభినందిస్తున్నాము.జాతీయ ఐక్యత, సంఘీభావం ఈ సమయంలో అవసరంభారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది.మన నాయకులు గతంలో మార్గాన్ని చూపించారు.జాతీయ ఆసక్తి మాకు అత్యున్నతమైనది. India has an unflinching National Policy against all forms of terrorism emanating from Pakistan and PoK. We are extremely proud of our Indian Armed Forces who have stuck terror camps in Pakistan and PoK. We applaud their resolute resolve and courage. Since the day of the…— Mallikarjun Kharge (@kharge) May 7, 2025ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.భారతీయ పౌరుడిగా మన సాయుధ దళాలతో బలంగా నిలబడి ఉండాలి...పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద స్థావరాల పై ఆర్మీ జరిపిన దాడి మానకు గర్వకారణం.జాతీయ ఐక్యత కోసం అందరం కలిసి పనిచేద్దాంఈ సమయంలో మనమందరం ఒకే గొంతులో మాట్లాడదాం.. జై హింద్!#ఆపరేషన్ సిందూర్As an Indian citizen first, standing strongly with our armed forces. The strikes against terror factories in Pakistan & PoK make us proud. Let us make this a moment for national solidarity and unity, and all of us speak in one voice - Jai Hind!#OperationSindoor— Revanth Reddy (@revanth_anumula) May 7, 2025 భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు..ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారిఆత్మ రక్షణ నిమిత్తం దాడి చేసే హక్కు భారత్‌కు ఉందన్న ఇజ్రాయెల్ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోందని, దానికి తమ మద్దతు ఉంటుందని తెలిపిన రూవెన్ అజర్‌అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలన్న రూవెన్‌భారత్ దాడుల్ని స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్ ఒవైసీ ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నాంపహల్గాం లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారుపాకిస్తాన్ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాల్సిందే.. జైహింద్ मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ స్పందన ఇదే..ట్విట్టర్ వేదికగా రాహుల్ పోస్ట్‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్’ Proud of our Armed Forces. Jai Hind!— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025 భారత సైన్యానికి మా మద్దతు: కాంగ్రెస్‌పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యంసైన్యం చర్యలకు మద్దతు ఇస్తున్నామని తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర మంత్రి జైశంకర్ పోస్ట్ఉగ్రవాదాన్ని సహించకూడదన్న కేంద్ర మంత్రి జైశంకర్‌ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని వ్యాఖ్యలుసరిహద్దుల నుంచే దాడులు.. ఆపరేషన్ సిందూర్‌పై 10 గంటలకు మీడియా సమావేశంభారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులుఆపరేషన్ సిందూర్.. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్త ఆపరేషన్‌ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు పేర్కొన్న భారత భద్రతా వర్గాలుఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో దాడిభారత భూభాగం నుంచే దాడులు నిర్వహించినట్లు పేర్కొన్న ఆర్మీ వర్గాలు ఆపరేషన్ సిందూర్‌లో 80 టెర్రరిస్టుల మృతిఆపరేషన్ జరిగిన ప్రాంతాలు1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - LeT3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - HM5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - LeT6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - HM8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - LeT9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎంసరిహద్దుల్లో టెన్షన్..భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ఆక్టివేట్ చేసిన భారత్రాఫెల్ యుద్ధ విమానాలతో మిసైల్స్ ఉపయోగించిన భారత్తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని అంగీకరించిన పాకిస్తాన్దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసిన పాకిస్తాన్తమకు అన్ని విషయాలపై సమాచారం ఉందన్న అమెరికాఉదయం 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశంమెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్న ఆర్మీబహవల్పూర్ లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడిమురిడీకే లోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్తావరాన్ని ధ్వంసం చేసిన భారత్మురిడీకే లోని భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న జైషే మహమ్మద్ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆర్మీభారత్ ఆర్మీ దాడి చేసిన ప్రాంతాలు ఇవే.. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై దాడులు..పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలో ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు.తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ,కోట్లీ, బహ్వాల్పూర్, ముజఫరాబాద్‌లో క్షిపణి దాడులు.బహ్వల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతం.పీవోకేతో పాటు పాక్‌లో ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసంత్రివిధ దళాల సమస్వయంతో మెరుపు దాడులు.భారత్ దాడుల్లో పాక్ ఆర్మీ ఐఎస్ఐ కంట్రోల్ రూమ్ ధ్వంసంఅర్ధరాత్రి 1:44 నిమిషాలకు భారత సైన్యం దాడులు.200 ఎకరాల్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు. Operation Sindoor UPDATES: Here is the list of nine terror facility locations in Pakistan and Pakistan-occupied Kashmir that have been successfully neutralised-1. Markaz Subhan Allah, Bahawalpur - JeM2. Markaz Taiba, Muridke - LeT3. Sarjal, Tehra Kalan - JeM4. Mehmoona Joya,… pic.twitter.com/Q3Q6vyw0Sa— Press Trust of India (@PTI_News) May 7, 2025 పాక్ అప్రమత్తం.. విమానాశ్రయాలు మూసివేతఅప్రమత్తమైన పాక్ డిఫెన్స్ వ్యవస్థలుభారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది.లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.हम जो कहते हैं, वो डेफिनिटली करते हैं...भारतीय सुरक्षा बलों ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।पाकिस्तान में 9 आतंकी ठिकाने पूरी तरह तबाह!भारतीय सेना कहा"पहलगाम का न्याय हुआ..."#OperationSindoorभारत माता की जय! 🇮🇳 pic.twitter.com/0Gve2IVl6J— Ankit Kumar Avasthi (@kaankit) May 7, 2025 పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులుపహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టిన భారత్‌తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వంసోషల్ మీడియాలో వైరల్‌గా మారి దాడి ఘటన వీడియోలుभारतीय सेना ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।#OperationSindoor के तहत पाकिस्तान में 8 आतंकी ठिकाने पूरी तरह तबाह!पहलगाम का न्याय हुआ... भारत माता की जय! 🇮🇳 pic.twitter.com/bzd6bu7IWd— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 7, 2025 #WATCH | Indian Army tweets, ""प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः" Ready to Strike, Trained to Win.(Video Source: Indian Army) pic.twitter.com/5tJbfBX4Nk— ANI (@ANI) May 6, 2025భారత్ దాడులు.. పలు విమానాలు రద్దు శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపిన స్పైస్ జెట్‌ధర్మశాల, లేహ్, జమ్మూ, అమృత్సర్ విమానాశ్రయాల మూసివేతఉత్తరభారతంలోని పలు ఎయిర్‌పోర్టులు మూసివేతఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూకేంద్రం నిర్ణయంజమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ విమానాశ్రయాలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేతకేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం పాక్ ఉగ్ర స్థావరాలు ధ్వంసం..అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యంఅంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్ చేసిన భారత్‌మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్‌జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్👉పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.👉పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. 👉దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. 👉పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. 👉కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రాజ్‌నాద్ సింగ్. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాక్ పై భారత్ మెరుపుదాడి.. ఆపరేషన్ సిందూర్
-
అబద్ధాల బురదలో పాక్
న్యూఢిల్లీ: భారత ఆర్మీని నేరుగా ఎదుర్కొనే సత్తాలేని పాకిస్తాన్ దొడ్డిదారిన పాక్షికంగానైనా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కుట్ర పన్నింది. అందులోభాగంగా తప్పుడు వార్తలను ఆన్లైన్లో కుమ్మరిస్తోంది. భారత ఆర్మీలో సిక్కు సైనికులు, ఉన్నతాధికారులు, సైన్యాధికారులు పాకిస్తాన్‌తో పోరుకు విముఖత చూపుతున్నారని, వాళ్లంతా ఐక్యమై తిరుగుబాటు లేవదీస్తున్నారని ఇష్టమొచ్చిన తప్పుడు కథనాలు వండివార్చి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్చేస్తోంది. భారత సైన్యంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆర్మీలో ఐక్యత దెబ్బతీయడమే లక్ష్యంగా పాకిస్తాన్ సోషల్‌మీడియా వేదికగా అహరి్నశలు పనిచేస్తోంది. ముఖ్యంగా సిక్కు సైనికులపై గురి పెట్టింది. అన్ని రకాలుగా ప్రయత్నాలు పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ అవాస్తవ కథనాల అల్లిక ఎక్కువైంది. పాకిస్తానీ సైనికులకు చెందిన సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి విపరీతంగా ఈ అబద్ధాల ఒరవడి ఊపందుకుంది. సంబంధంలేని, పాత, కృత్రిమమేధ సృష్టించిన విరుద్ద నివేదికలతో అవాస్తవాలను అద్భుతంగా రచించి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. సరిహద్దు వెంట కీలకమైన స్థావరాల వద్ద సిక్కు సైనికులు, సిక్కు అధికారుల వ్యవహార శైలిపై ఓ కంట కనిపెట్టాలని ఇతర మతాలకు చెందిన అధికారులకు భారత ఆర్మీ రహస్య సూచనలు చేసిందని, లీక్ అయిన ఒక నిఘా నివేదికతో ఈ విషయాలు బహిర్గత అయ్యాయంటూ ఒక పేద్ద అసత్య కథనం ఇప్పుడు సోషల్‌మీడియాల్ షేర్ అవుతోంది. దీంతో ఆర్మీ పట్ల సిక్కు సైనికుల్లో విధేయత తగ్గి, సైన్యంలో ఐక్యత లోపిస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది. ‘‘భారత ఆర్మీలో ప్రస్తుతమున్న కఠోర వాస్త వం ఇది. సొంత సైనికులనే నమ్మని భారత ఆర్మీ.. పొరుగున పాక్‌తో ఏపాటి యుద్ధం చేయగలదు?’’అని ఒక పాకిస్తాన్ సైన్యాధికారి వ్యాఖ్యానించినట్లు మరో తప్పుడు పోస్ట్ ఇప్పుడు అధికంగా షేర్ అవుతోంది. ‘ఇండియా ఆజ్ తక్’వార్తాసంస్థ ప్రచురించినట్లుగా ఒక తప్పుడు, నకిలీ కథనాన్నీ పాకిస్తానీయులు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. ధమాకా ఏఐ పేరిట నకిలీ ఏఐ వీడియోలు కృత్రిమమేధతో సృష్టించిన భారతవ్యతిరేక తప్పుడు వీడియోలు ఃధమాకాఏఐ ఖాతా నుంచి షేర్ అవుతున్నాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేయబోమని, ముందుగా ఖలిస్తాన్ విషయం తేల్చాలని, ఇందుకోసం రెఫరెండం నిర్వహించాల్సిందేనని సిక్కు సైనికులు పట్టుబడుతున్నారని ఒక తప్పుడు ఏఐ వీడియోను సృష్టించారు. ‘‘సైన్యంలో వెలుగుచూసిన తిరుగుబాటుతో మోదీ షాక్‌కు గురయ్యారు. సిక్కు శక్తులన్నీ ఏకమయ్యాయి. యుద్ధం చేయబోమని తేల్చిచెప్పాయి’’అని మరో అవాస్తవ వార్త ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. సిక్కు సంబంధ అసత్య వార్తలు, వీడియోలను ఖలిస్తానీ సానుభూతిపరుల ఖాతాల ద్వారా షేర్ చేయిస్తోంది. ఏప్రిల్ 25న సరిహద్దు వెంబడి భారత ఆర్మీలోని వేర్వేరు యూనిట్ల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో ఐదుగురు సైనికులు చనిపోయారని ఒక తప్పుడు వార్త సారాంశం. ఈ ఘటనలో ఒక అత్యున్నత స్థాయి సిక్కు సైన్యాధికారిని మాత్రమే అరెస్ట్‌చేశారని మరో పోస్ట్ ఆన్లైన్లో కనిపిస్తోంది. యుద్ధం చేయాల్సివస్తే మీరు మాత్రం రణక్షేత్రంలోకి కాలుపెట్టొద్దని సిక్కులకు ఖలిస్తానీ వేర్పాటువాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పిలుపు ఇచ్చినట్లు మరో నకిలీ వీడియో షేర్ అవుతోంది. భారత వైమానిక స్థావరాల గుట్టుమట్లు చెప్పిన వాళ్లకు 1.1 కోట్ల డాలర్ల నజరానా ఇస్తానని గురుపత్వంత్ చెప్పినట్లు ఆ ఏఐ సృష్టించిన వీడియోలో ఉంది. ఇలాంటి వీడియోలు, కథనాలను షేర్‌చేస్తున్న చాలా సోషల్‌మీడియా ఖాతాలను భారత్ ఇప్పటికే నిషేధించి బ్లాక్‌చేసింది. అయితే విదేశాల్లో భారత్ పట్ల వ్యతిరేక భావనను పెంచే ఉద్దేశ్యంతో పలు తప్పుడు వెబ్సైట్ల ద్వారా ఈ కపట కథనాలపరంపర కొనసాగుతోంది. -
బోర్డర్‌కు అదనంగా భారత సైన్యం.. ఆర్మీ ప్లానేంటి?
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ మరోసారి రెచ్చిపోయింది. నియంత్రణ రేఖ వెంబడి 11వ రోజు మరోసారి కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. దీంతో, వెంటనే భారత భద్రతా బలగాలు అప్రమత్తమై పాక్ ఆర్మీ ప్లాన్‌ను తిప్పికొట్టాయి.మరోవైపు.. సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించింది. కొత్తగా 16 అదనపు బెటాలియన్లు రంగంలోకి దిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేశారు. కాగా, పాకిస్తాన్‌పై దాడి సన్నాహాల్లో భాగంగా సైన్యం మోహరించినట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఇరు దేశాల సరిహద్దుల్లో 193 బెటాలియన్లు మోహరించాయి. ఒక్కో బెటాలియన్‌లో దాదాపు 1000 మందికిపైగా సైనికులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి కీడు తలపెట్టాలని చూసేవారి తాట తీయడంలో సైనిక బలగాలతో కలిసి పనిచేయడం, దేశ సరిహద్దుల్ని కాపాడుకోవడం తన కర్తవ్యమని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ గురించి ప్రజలకు బాగా తెలుసునని.. ఆయన పనితీరు, కట్టుబాటు, జీవితంలో రిస్కు తీసుకునే విధానంపైనా వారికి అవగాహన ఉందని చెప్పారు. ప్రజలు కోరుకున్నవన్నీ మోదీ నేతృత్వంలో తప్పకుండా జరిగి తీరుతాయని చెప్పారు. అంతకు మించి దానిపై వివరించలేదు. -
బోర్డర్లో టెన్షన్.. బీఎస్ఎఫ్ అదుపులో పాక్ సైనికుడు
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో భారత్–పాకిస్తాన్ సరిహద్దుల వద్ద పాక్ ఆర్మీ అధికారి ఒకరు బీఎస్ఎఫ్ జవాన్లకు పట్టుబడ్డారు. అతడిని వెంటనే కస్టడీలోకి తీసుకున్నామని బీఎస్ఎఫ్ తెలిపింది. పదిహేను రోజుల క్రితం, ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ పాక్ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించి అక్కడి జవాన్లకు దొరికిపోవడం తెల్సిందే. భారత బలగాలు తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ఆయన్ను తిరిగి అప్పగించేందుకు పాక్ అధికారులు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. భారత్, పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పదో రోజు కూడా దాయాది ఆర్మీ కాల్పులు జరిపింది. వాస్తవాధీన రేఖ వద్ద కుప్వారా, ఫూంచ్‌ర, అక్నూర్ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపులకు దిగింది. దీంతో, భారత సైన్యం పాకిస్తాన్ కాల్పులను తిప్పికొట్టింది. ధీటుగా బదులిచ్చింది. రెచ్చగొట్టేలా పాక్ క్షిపణి పరీక్షలు..మరోవైపు.. పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. -
పాక్‌పై భారత్ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయమై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. -
దేశంలో వెపన్స్ తయారీ పెంపు
అంతర్జాతీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో దేశాలు తమ డిఫెన్స్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. అందుకు భారీగానే నిదులు గుమ్మరిస్తున్నాయి. కొన్నిదేశాలు స్వయంగా ఆయుధాలు సమకూర్చుకుంటున్నా, అత్యాధునిక వెపన్స్ దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. ఇటీవల ఇండియా-పాక్ మధ్య యుద్ధ భయాలు నెలకొంటున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఆయుధ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం.దేశీయ ఉత్పత్తిఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ రంగంలో స్వావలంబనపై ప్రభుత్వం ఎప్పటినుంచో దృష్టి సారించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా పాత ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి రష్యాతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఎస్ఐజీ సౌర్ 716 రైఫిల్స్‌ను అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది. యూఏఈకి చెందిన కారకల్‌తో క్వార్టర్ బాటిల్ కార్బైన్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ తరుణంలో పాక్ ఇండియాతో తలపడి గెలవడం దాదాపు అసాధ్యం.రక్షణ బడ్జెట్భారత్ 2025 సంవత్సరానికిగాను రూ.6.81 లక్షల కోట్ల (80 బిలియన్ డాలర్లు) రక్షణ బడ్జెట్‌ను కేటాయించింది. ఇండియా అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉంది. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 9.8%గా ఉంది. దిగుమతులు తగ్గించుకుంటూ క్రమంగా దేశీయ తయారీను పెంపొందించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇదీ చదవండి: మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లుకీలక సరఫరాదారులుప్రస్తుతానికి దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి పెరిగినప్పటికీ, అధునాతన ఆయుధాల కోసం భారత్ ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ విభాగంలో ప్రధాన సరఫరాదారులుగా ఉన్న దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.రష్యా: చారిత్రాత్మకంగా భారత్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయినప్పటికీ దాని వాటా 64% నుంచి 45%కి తగ్గింది.ఫ్రాన్స్: భారత్ ఆయుధ దిగుమతుల్లో 29 శాతం వాటాతో రెండో అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.అమెరికా: డ్రోన్లు, యుద్ధ విమానాలతో సహా భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 11% సరఫరా చేస్తుంది. -
భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం.మరో వైపు అరేబియా సముద్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్, పాకిస్థాన్‌లు యుద్ధనౌకలను మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ వద్ద భారత్ యుద్ధనౌకలు.. సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న(బుధవారం) సైతం ఎల్ఓసీలో పాక్ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నారు. ప్రధానంగా జమ్మూ, రాజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో ఈ కాల్పులు జరుగుతున్నాయి. భారత్–పాక్ మధ్య 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. -
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ : భారత్ ఓ వైపు సైనిక చర్యకు సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్ బతిమలాడుతోంది. అదే సమయంలో భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్వాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి. BREAKING news :What kind of Pakistani army is this that is hell-bent on breaking its own country into 5 pieces?Pakistan indulges in ceasefire violation along the International Border (IB) in Jammu’s Akhnoor Sector, Pargwal. This is not LoC but IB making it a serious… pic.twitter.com/Z5VWPu4MVL— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 29, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్.. పాక్‌ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్‌ను తక్షణమే మూసివేసింది. -
ఇంకెంత దిగజారుతారు.. కార్గిల్‌లో ఓడించినా బుద్ధి రాలేదా.. అఫ్రిది వ్యాఖ్యలకు ధవన్ కౌంటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ గట్టి కౌంటరిచ్చాడు. అఫ్రిదిని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. కార్గిల్‌లో ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా..? ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకెంత దిగజారుతారు. ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మాకు ఇండియన్ ఆర్మీ పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ మాతా కి జై. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు. Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025అఫ్రిదికి చురకలంటిస్తూ ధవన్ చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాకీలకు ఈసారి మాటలతో బుద్ధి చెప్పినా ఉపయోగం లేదు. వారి అంతు చూడాల్సిందే అంటూ చాలా మంది భారతీయులు ధవన్ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అఫ్రిది వ్యాఖ్యలపై ధవన్ స్పందించిన వైనాన్ని మెచ్చుకుంటున్నారు.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఫ్రిది ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. అఫ్రిదిపై చాలామంది భారతీయులు సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. భారత సైన్యంపై నోరు పారేసుకున్న ఆఫ్రిదిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టయిల్లో కౌంటరిచ్చాడు. అఫ్రిది ఓ జోకర్, పనికిరాని వాడంటూ విమర్శించారు. పనికిరాని వాళ్ల వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. -
భారత్‌తో యుద్ధ భయం.. పాక్ సైన్యంలో భారీ రాజీనామాలు
ఇస్లామాబాద్: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. తమపై భారత్ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి పాక్ సైన్యం తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలో పాక్ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 🚨 Breaking News.4500 Soldiers and 250 Officers of Pakistan Army resigned from service amid arising tension with India after #PahalgamTerroristAttackLt. Gen Umar Ahmad Bukhari, 11 Corp Cdr has written this letter to the Chief of army Staff. This letter is being circulated on… pic.twitter.com/XLE1G84rrY— JK CHANNEL (@jkchanneltv) April 28, 2025మునీర్ ఎక్కడ?మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి -
భారత్ ఆర్మీ అండతో పహల్గమ్ కు క్యూ కట్టిన టూరిస్టులు
-
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Incident) నేపథ్యంలో భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు.బైసరన్ లోయలోభారత్లో చిన్న టపాసు పేలినా పాక్‌నే నిందిస్తున్నారని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ ఓ షోలో ఆఫ్రిది అతి చేశాడు. కాగా అందమైన కశ్మీరంలో ఉగ్రవాదులు ఇటీవల కల్లోలం సృష్టించిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో కాల్పులకు తెగబడి.. 26 మంది పర్యాటకులను చంపేశారు.కఠిన చర్యలకు ఉపక్రమంచిన భారత్ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకులు ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం సహా పలు విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టేలా ముందుకు సాగుతోంది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. అంతేకాదు.. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను బ్యాన్ చేసింది.మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థంఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌లో చిన్న పటాకా పేలినా వాళ్లు పాకిస్తాన్నే నిందిస్తారు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉంది. అయినా సరే ఇదెలా జరిగింది?.. మీరంతా పనికిరాని వాళ్లనేగా దీని అర్థం.ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేతకావడం లేదు. ఘటన జరిగిన గంటలోపే మీడియా మొత్తం బాలీవుడ్ వైపే గురిపెట్టింది. వారి మాట తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది.తమకు తాము విద్యావంతులమని చెప్పుకొంటారు. కానీ వారి ఆలోచనా విధానం ఇంత వరకే పరిమితం. ఇండియాలో ఇద్దరు టాప్ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్‌కు అంబాసిడర్లుగా కొనసాగారు. కానీ వాళ్లు కూడా నేరుగా పాకిస్తాన్ వైపే వేలు చూపిస్తూ నిందిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలి’’ అని షాహిద్ ఆఫ్రిది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు.ఇదిలా ఉంటే.. పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం పహల్గామ్ ఘటన నేపథ్యంలో తమ దేశ నాయకత్వ తీరుపై మండిపడ్డాడు. ఉగ్రదాడిని వెంటనే ఖండించకపోవడం అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నాడు. ఇక పాక్ ఉప ప్రధాని ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తన వ్యాఖ్యల ద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది తామేనని నేరుగానే అంగీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముక్తకంఠంతో ఖండించారుఇక పహల్గామ్ ఉగ్రదాడిని భారత క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అదే విధంగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని బీసీసీఐకి సూచించాడు. ప్రతి ఏడాది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఉగ్రవాదులకు అలవాటై పోయిందని.. ప్రభుత్వం కఠిన చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని కోరాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
మోదీతో రాజ్‌నాథ్ భేటీ.. భారత సైన్యం, సరిహద్దు భద్రతపై చర్చ!
సాక్షి, ఢిల్లీ: పహల్గాం దాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పహల్గాంలో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఇక.. మోదీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా పాల్గొన్నారు. మరోవైపు.. రక్షణ వ్యవహారాలపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సోమవారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాక్ జాతీయులను వారి దేశానికి పంపించింది.#WATCH | Delhi: Defence Minister Rajnath Singh leaves from 7 Lok Kalyan Marg, Prime Minister Narendra Modi's residence. pic.twitter.com/lCINxlD82x— ANI (@ANI) April 28, 2025మరోవైపు.. నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే పాక్.. కొన్నేళ్లుగా రూటు మార్చిందని నిఘా వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఆన్లైన్ వేదికగా కశ్మీరీ యువతను ఆకర్షించి, తమ భావజాలం వైపు మొగ్గు చూపిన వారికి సరైన పత్రాలతో వీసాలిచ్చి పాక్‌లోకి తీసుకెళ్తోందని పేర్కొన్నాయి. తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకోవడంతో పాటు ఆయుధాలు వాడగల, దాడులు నిర్వహించగల సామర్థ్యం ఉన్నవారిని తమవైపు ఆకర్షిస్తోందని చెప్పాయి.కొన్నేళ్లలో ఇలా 300 మందికి పైగా కశ్మీర్ యువత అధికారిక ప్రయాణ పత్రాలతో పాక్‌కు ప్రయాణించారని పలు కథనాలు వెల్లడించాయి. వీరిలో పలువురు నిషేధిత ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ పొందుతున్నారు. తర్వాత ఉగ్రసంస్థల్లో చేరి, సరిహద్దు ద్వారా అక్రమంగా చొరబాట్లకు పాల్పడతారు. అనంతరం జమ్ముకశ్మీర్‌లోని పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు చేస్తారు. అయితే ఇలా చొరబాట్లకు పాల్పడినవారిలో 15 మంది ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ప్రస్తుతం ఇలా శిక్షణ పొందిన తొమ్మిది మంది క్రియాశీలకంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. వారిలో కొందరు పాకిస్తాన్లో ఉండి, మరికొందరు కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు సహకారం అందిస్తున్నారు.పాక్‌కు సైనిక విమానాలు..పహల్గాం దాడితో సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంది. భారత్ వైపు నుంచి దాడి ఉండొచ్చన్న అంచనాలతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా టర్కీకి చెందిన పలు సీ-130 హెర్క్యులస్ విమానాలు పాక్‌లో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ కూడా అలర్ట్ అయ్యింది. -
సరిహద్దుల్లో టెన్షన్.. విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టిన భారత్
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది.వివరాల ప్రకారం.. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు క్షిపణి పరీక్షలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, మూడు రోజుల క్రితమే భారత్ ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎంఆర్-ఎస్ఏఎం)తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు.#IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025 -
మరో ఉగ్రవాది ఇంటిని బాంబు పెట్టి లేపేశారు
జమ్మూ: పహల్గాం ఉగ్ర దాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదల ఏరివేతే లక్ష్యంగా కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా అనుమానిత ఉగ్రవాదుల స్థావరాల్ని గుర్తించి, బాంబులతో నేలమట్టం చేస్తోంది. శనివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో ధ్వంసం చేశాయి. గత మంగళవారం (ఏప్రిల్22న) పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడికి పాల్పడ్డ ముష్కరులు, వారి మద్దతు దారుల్ని గుర్తించే పనిలో పడ్డాయి భారత భద్రతా బలగాలు. పనిలో పనిగా ఉగ్రవాదుల ఇళ్లను, స్థావరాల్ని గుర్తిస్తున్నాయి. ఈ తరుణంలో 48 గంటల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న కీలక ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురు ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన వారి స్థావరాల్ని గుర్తించాయి. #BREAKING: House of Lashkar-e-Taiba terrorist Farooq Ahmed Tadwa destroyed. Tadwa a resident of Narikoot Kalaroos, Kupwara (North Kashmir) is, now in Pakistan and works with the Pakistan Army to target innocent civilians in Kashmir. pic.twitter.com/O5v4Xnrio5— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) April 26, 2025 పీవోకేలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వాశనివారం సముద్రమట్టానికి 5,300 మీటర్ల ఎత్తులో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతమైన కుప్వారా జిల్లా కలరూస్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని గుర్తించాయి. బాంబులతో ధ్వంసం చేశాయి. 60 ప్రాంతాల్లో దాడులు అటూ శ్రీనగర్‌లోనూ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్‌లో ఏకకాలంలో 60కి పైగా ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధులు వెల్లడించారు. తాము జరిపిన దాడుల్లో వెపన్స్ సీజ్ చేయడం,కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం, డిజిటల్ డివైజ్‌ల గుర్తింపు, దేశ భద్రతకు విఘూతం కలిగించేందుకు వినియోగించే వస్తువుల్ని, వాటి ఆధారాల్ని సేకరించినట్లు చెప్పారు. అలాంటి వారిని ఉపేక్షించబోంఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదానికి మద్దతిచ్చే అన్నీ వ్యవస్థల్ని గుర్తించి వాటిని నిర్విర్యం చేస్తున్నాం. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారికి, దేశ భద్రతకు విఘూతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
LOC వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు
-
ఇండియన్ ఆర్మీ ఆన్ ఫైర్.. కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం
శ్రీనగర్: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో.. శుక్రవారం ఐదుగురు కశ్మీరీ ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. సోఫియాన్, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో.. కశ్మీరి ఎల్ఈటీ ఆపరేటివ్స్‌పై ఉక్కుపాదం మోపే క్రమంలోనే సైన్యం ఈ చర్యలకు ఉపక్రమించింది.పుల్వామాలో ఎసాన్ ఉల్ హక్, షోపియాన్‌లోని చోటీపోరాలోని షాహిద్ అహ్మద్ , కుల్గాంలో జకీర్ గని ఇళ్లు బుల్డోజర్, పేలుడు పదార్థాల సాయంతో నేలమట్టం చేశారు. సోషియాన్‌లో చోటిపోరా గ్రామంలో ఎల్టీ కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్టే నివాసానికి బుల్డోజర్ సాయంతో నేలమట్టం చేసినట్లు సమాచారం. షాహిద్ అహ్మద్ గత నాలుగు ఏళ్లుగా జమ్ములో జాతి వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నాడు. కుల్గాంలోని మటలం ఏరియాలో జహిద్ అహ్మద్(జకీర్ గని) నివాసాన్ని కూల్చేశారు. #BreakingNews : The house of LeT militant Shahid Ahmad, Kuty resident of #Chotipora #Shopian active since 2022 , was destroyed in a blast in Chotipora area of Shopian. pic.twitter.com/DT79ZJ7vxb— The Lal Chowk Journal (@LalChowkJournal) April 26, 2025పుల్వామా ముర్రాన్ ప్రాంతంలో ఎషన్ ఉల్ హక్ ఇంటిని పేలుడు పదార్థాలతో నేలమట్టం చేశారు. 2018 నుంచి పాక్‌లో ఉగ్రశిక్షణలో ఉన్న అషన్.. ఈ మధ్యే తిరిగి కశ్మీర్లో అడుగు పెట్టినట్లు నిఘా వర్గాల సమాచారం. ఎల్ఈటీ ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్‌కు సంబంధించిన రెండంతస్తుల భవనాన్ని కూడా నేలమట్టం చేశారు. ఇక.. పుల్వామా కాచిపోరా ప్రాంతంలో హరిస్ అహ్మద్ అనే ఉగ్రవాది ఇంటిని అధికారులు పేలుడుతో కుప్పకూల్చారు.ఇదిలా ఉంటే.. అంతకుముందు జమ్ము కశ్మీర్ లోకల్ టెర్రరిస్టులు ఆసిఫ్ షేక్, అదిల్ మహమ్మద్ ఇళ్లను తనిఖీలు చేసిన టైంలో.. అందులో అమర్చిన పేలుడు పదార్థాల ధాటికి ఇద్దరి ఇళ్లు పాక్షికంగా నేలమట్టం అయ్యాయి. ఇది సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఆ ఇద్దరి చేసిన ప్లాన్‌గా భారత బలగాలు భావిస్తున్నాయి.ఇక.. అసిఫ్ షేక్ సోదరి మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు ముజాహుద్దీన్ అని వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్ సోదరితమ ఇల్లు నేలమట్టం కావడంతో.. ప్రస్తుతం ఆమె బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందుతోందట. ఇక అసిఫ మరో సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నట్లు వెల్లడించింది ఆమె. -
బోర్డర్లో పాక్ కవ్వింపు చర్యలు.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్!
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదేపదే కాల్పులు జరుపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పాక్ ఆర్మీ మరోసారి.. నియంత్రణ రేఖ(LOC) వెంబడి కాల్పుల జరిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్ చర్యలను తిప్పికొట్టింది.వివరాల ప్రకారం.. భారత్, పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ(LOC) వద్ద పాక్ ఆర్మీ శుక్రవారం రాత్రి కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత చెక్‌పోస్టుల వద్ద రెచ్చగొట్టే ధోరణితో కాల్పులకు తెగబడింది. భారత ఆర్మీ చెక్‌పోస్టులను టార్గెట్ చేసి ఫైరింగ్ చేసింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ ప్రతిదాడులు జరిపింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత ఆర్మీ వెల్లడించింది. ఏప్రిల్ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. అలాగే, ఏప్రిల్ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్ ఎల్ఓసీ వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.On the night of the 25th-26th of April 2025, unprovoked small firing was carried out by various Pakistan Army posts all across the Line of Control in Kashmir. Indian troops responded appropriately with small arms. No casualties reported: Indian Army pic.twitter.com/B6lO5oldJ2— ANI (@ANI) April 26, 2025మరోవైపు.. కుల్గాం జిల్లాలో టెర్రరిస్టులతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కోయిమాహ్‌లోని తోకిర్‌పురాకు చెందిన వారిగా గుర్తించారు. J&K | Two Terrorist associates arrested by security forces in Thokerpora in Qaimoh area of Kulgam district: Police Sources pic.twitter.com/KstcuocVek— ANI (@ANI) April 26, 2025ఇదిలా ఉండగా.. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది దేశం అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతోపాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది. తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామాల వేళ సరిహద్దుల్లో కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. -
పహల్గాం ఘటన.. పేలుడులో కశ్మీరీ ఉగ్రవాదుల నివాసాలు ధ్వంసం!
పహల్గాం దాడిలో పాల్గొన్న ఇద్దరు కశ్మీరీ ఉగ్రవాదుల నివాసాలు పేలుళ్లలో దెబ్బతిన్నాయి. అసిఫ్ షేక్((Asif Sheikh) , అదిల్ హస్సేన్ తోకర్‌ల ఇళ్లను భద్రతా బలగాలు గురువారం తఖీలు చేస్తుండగా ఇది చోటు చేసుకుంది. బలగాలను లక్ష్యంగా చేసుకునే వాళ్లు పేలుడు పదార్థాలు అమర్చి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నాం పహల్గాం బైసరన్ లోయలో జరిగిన మారణకాండలో 26 మంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఈ ఇద్దరు కశ్మీరీలు పాల్గొన్నట్లు సైన్యం ధృవీకరించుకుంది. దాడి తర్వాత ఈ ఇద్దరితో పాటు ఉగ్రవాదులంతా పిర్పంజల్ పర్వతాల్లో దాక్కొని ఉండొచ్చని భద్రతా బలగాలు భావించి గాలింపు చేపట్టాయి. డ్రోన్లు, భద్రతా బలగాల కూంబింగ్‌తో ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి.అదిల్ హస్సేన్ తోకర్ స్వస్థలం అనంత్‌నాగ్ కాగా, అసిఫ్ షేక్((Asif Sheikh)ది త్రాల్. గురువారం ఈ ఇద్దరి నివాసాలను భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఆ సమయంలో ఐఈడీ పేలుడు పదార్థాలు యాక్టివేట్ ఉండడం గమనించి బయటకు వచ్చాయి. ఈ క్రమంలో పేలుడు సంభవించి నివాసాలు పేలిపోయాయి. తొలుత ఆర్మీనే వీటిని పేల్చినట్లు కథనాలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత అధికారులు ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. అలాగే.. బుల్డోజర్తో నివాసాలను కూల్చిన కథనాల్లోనూ వాస్తవం లేదని తెలిపారు.అనంత్ నాగ్ పోలీసులు ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు పాక్ టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. గురువారం రాత్రి ఈ ఇద్దరి ఇళ్లను ఐఈడీతో భద్రతా బలగాలు ధ్వంసం చేశారు. 2018లో పాక్‌కు వెళ్లిన ఈ ఇద్దరూ.. లష్కరే తాయిబా ఉగ్ర సంస్థలో చేరి శిక్షణ తీసుకున్నారు. ఈ ఇద్దరూ ఈ మధ్యే మరో నలుగురితో కలిసి కశ్మీర్లోకి చొరబడినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. As per initial reports Asif Sheikh was Involved in #Pahalgam attack. When army reached his House, suspicious IED type material was seen, BDS along RR, destroyed that IED in which Asif's house partially damaged. pic.twitter.com/dhB37wLumw— War & Gore (@Goreunit) April 25, 2025అదిల్ హుస్సేన్ తోకర్‌కు ఇద్దరు సోదరులు. అనంత్ నాగ్‌లో కొంత భూమి ఉంది ఈ కుటుంబానికి. అసిఫ్ కుటుంబానికి సంబంధించిన వివరాలు పెద్దగా తెలియరాలేదు. పహల్గాం దాడి తర్వాత ఈ ఇద్దరి కుటుంబాలను భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించి విచారణ జరుపుతున్నట్లు అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. -
భారత సరిహద్దుల్లో టెన్షన్.. పాక్ ఆర్మీ కాల్పులు
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులు చేస్తున్నాయి. దీంతో, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో, శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది. Small arms firing at some places on the Line of Control were initiated by the Pakistan Army. Effectively responded to by the Indian Army. No casualties. Further details are being ascertained: Indian Army officials pic.twitter.com/SlBSDPSJHA— ANI (@ANI) April 25, 2025మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని బందీపురాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BREAKINGEncounter breaks out in Bandipora, Jammu & Kashmir as terrorists open fire during a search operation.Security forces retaliate. No casualties reported yet. Updates awaited. pic.twitter.com/7jz8O8x4Ud— 𝕿𝖆𝖗𝖚𝖓 तरुण 卐 🇮🇳 (@fptarun) April 25, 2025 -
అందానికి మించి అద్భుతమైన మనసు, ఎవరీ సాహసి! (ఫోటోలు)
-
వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!
బాలీవుడ్ నటి దిశా పటానీ అక్క ఖుష్బూ పఠానీ ఒక పసికందును రక్షించి ఇంటర్నెట్ హృదయాన్ని గెలుచుకుంది. ఆమె ప్రదర్శించిన కరుణ , ధైర్యసాహసాలు నెట్టింట ప్రశంసలు దక్కించుకున్నాయి. ఇంతకీ ఎవరీ ఖుష్బూ పటానీ? సోదరి దిశా గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతోంటే.. ఖుష్బూ దేశానికి సేవ చేసే ఆర్మీ ఆఫీసర్ ఎలా అయింది? మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ ఇంట్రస్టింగ్ జర్నీ గురించి తెలుసుకుందామా.అద్భుతనటిగా, ఫిట్నెస్ ప్రియురాలిగా పేరు తెచ్చుకున్న దిశా పటానీతో పాటు, ఆమె అక్క ఖుష్బూ పటానీ పేరు కూడా పాపులరే. భారతీయ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఖుష్బూ ఇప్పుడు బహుళ పాత్రల్లో నిమగ్నమై ఉంది. వదిలివేయబడిన బిడ్డను రక్షించిన తర్వాత ఖుష్బూ ఇటీవల చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తన సోదరి దిశాతో సమానంగా అద్భుతమైన ఇపుడు బరేలీలో పాపను రక్షించి వార్తల్లో నిలిచింది.1991 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది ఖుష్బూ. బిబిఎల్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చేరింది. ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఖుష్బూ పటానీ తెలివైన విద్యార్థి. కానీ కాలేజీ చదువుకొనే రోజుల్లో వేధింపులకు గురైంది. కొంతమంది అబ్బాయిలు ఆమెను కారులో వెంబడించి వేధించారు. ఒక ప్రాజెక్ట్ పని తర్వాత తన స్నేహితుడితో కలిసి రాత్రి ఆలస్యంగా తన హాస్టల్‌కు వచ్చేది. ఆ సమయంలో కారులో ఒకడు పిచ్చిగా వెంటబడి, వేధించేవాడు. ఒక సందర్భంగా ఖుష్బూ ఒక మహిళల పబ్లిక్ వాష్‌రూమ్‌లో దాక్కుని తనను తాను రక్షించుకుంది. ఈ సమయంలో చాలా భయపడేపోయేదట. దీంతో ఆమె ఒంటరిగా వెళ్లడం మానేసింది. చదవండి: 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీపట్టుదలగా చదువుకు పూర్తి చేసి ఎంఎన్సీలో జాబ్ సంపాదించింది కానీ ఆ ఉద్యోగం ఖుష్బూకి సంతొషాన్నివ్వలేదు. కాలేజీ రోజుల నాటి భయంకరమైన అనుభవం వెంటాడేది. ఆ భయంనుంచి వచ్చిన ఆలోచనే సైన్యంలో చేరడానికి ప్రేరేపించింది. అప్పటి వరకు, ఆమెకు సైన్యంలో చేరాలనే ఆలోచన లేదు.భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాక, తన వేధింపుల గురించి తన తండ్రితో చెప్పుకుంది. SSB ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే పరీక్షలో ఉత్తీర్ణురాలై లెఫ్టినెంట్‌గా ఆర్మీలో చేరింది. నిజమైన దేశభక్తురాలిగా దేశానికి సేవ చేసింది. ఖుష్బూ పటానీ 34 సంవత్సరాల వయసులో మేజర్ హోదాలో సైన్యం నుండి పదవీ విరమణ చేసి వెల్నెస్ కోచ్‌గా ఉంది. అంతేకాదు ఆమె TEDx స్పీకర్ కూడాసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అభమానులకు స్ఫూర్తినిస్తోంది. ఖుష్బూ టారో కార్డ్ రీడర్ కూడా, కెరీర్, వ్యాపారం, డబ్బు, అనేక ఇతర విషయాలలో సూచనలిస్తుంది. -
రక్షణ దళాలకు, ఉగ్రవాదులకు, మధ్య ఎన్కౌంటర్!
హిరానగర్: జమ్మూ కశ్మీర్‌లోని కతూవా జిల్లాలో భారత్-పాక్ సరిహద్దు ప్రాంతమైన హిరానగర్ సెక్టార్ సన్యాల్ గ్రామంలో ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పూంచ్ పోలీసులు కలిసి సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా భారత రక్షణ దళాల బృందంపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు జరపడానికి యత్నించారు. దాంతో రక్షణ దళాలు కూడా అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగింది. కొంతమంది అనుమానితులు ఆ ప్రాంతంలో నిఘా వేసినట్లు సమాచారం అందుకున్న రక్షణ దళాలు.. ఆదివారం సాయంత్రం వేళ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, రక్షణ దళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.నిన్న భారత ఆర్మీ బలగాలు, పూంచ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. సురాన్ కోట్ లో ఉగ్రవాదులు మాటు వేశారన్న సమాచారంలో ఈ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన విషయాన్ని పసిగట్టిన ఉగ్రమూకలు.. ఓ అటవీ ప్రాంతంలోకి జారుకున్నారు. అయితే అక్కడ ఉగ్రవాదులకు సంబంధించిన కొన్ని మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కొనసాగింపులో భాగంగా ఆదివారం నాడు ఉగ్రవాదులు, భారత రక్షణ దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌కు సంబంధించి ఎవరైనా గాయపడ్డారా, మరణించారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. -
ఆర్మీలో నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
లక్డీకాపూల్ (హైదరాబాద్): ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల్లో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ , అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ పీ.సీ.రాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 10వ తరగతి, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు తమ అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, ఎన్సీసీ అర్హత పొందిన అభ్యర్థులకు బోనస్ మార్కులుంటాయని, 13 భాషలలో కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆన్లైన్లో జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు www.joinindianarmy. nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు జూన్‌లో సంబంధిత సైట్ నుంచి అడ్మిట్ కార్డు పొందవచ్చని, అప్డేట్స్, ఈ–మెయిల్ ఐడీని వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. సలహాలు, సూచనలకు రిక్రూటింగ్ కార్యాలయం సికింద్రాబాద్ 040–27740205 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చని రాయ్ పేర్కొన్నారు. -
అరుదైన మిలిటరీ థ్రిల్లర్!
ఒక సైనిక ప్రధానాధికారి నవల రాయటం అన్నది ప్రతిరోజూ జరిగేది కాదు. నిజానికి, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ 77 ఏళ్లలో ఇలా ఒకసారి మాత్రమే సంభవించింది. జనరల్ ముకుంద్ మనోజ్ నరవణే రాసిన పుస్తకాన్ని అరుదైన వాటిలో ఒకటిగా, ప్రత్యేకమైనదిగా చేస్తున్నది ఇదే. నేను ఈ పుస్తకం గురించి రాస్తున్నది కూడా దానికున్న ఈ ప్రత్యేకత కారణంగానే! నరవణే రాసిన ఈ నవల పేరు ‘ద కంటోన్మెంట్ కాన్స్పిరసీ’. టైటిల్ కింద ఉన్న ఉపశీర్షికను బట్టి ఇదొక మిలిటరీ థ్రిల్లర్. ఇది ‘లూ కరే’ (గూఢచారి నవలలకు ప్రసిద్ధి చెందిన స్వర్గీయ బ్రిటిష్ రచయిత డేవిడ్ జాన్ కార్న్వెల్ కలం పేరు) ఒరవడిని కలిగి ఉన్నటువంటిది కాకున్నా... వేగంగా చదివిస్తూ, ముందుకు నడిపించేలా ఉంటుంది. నేనైతే, తెరిచిన పుస్తకం ముగిసే వరకు కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. పేజీలు వాటంతటవే తిరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఈ కథ, కొత్తగా ఆర్మీలో చేరిన ఇద్దరు యువ అధికారుల చుట్టూ తిరుగుతుంది. ఒకరు లెఫ్ట్‌నెంట్ రోహిత్ వర్మ. ఇంకొకరు లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రీ. రోహిత్ మూడో తరం అధికారి. రేణుక పదాతిదళం రెజిమెంట్‌లో నియామకం పొందిన తొలి మహిళ. రోహిత్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తాయి. చాలామంది అతడు దోషి అని భావిస్తుంటారు. రోహిత్, రేణుకలలో రేణుకే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిత్వం కల ఆఫీసర్. ఒక్క దుముకుతో రోహిత్ వెనుక అండగా నిలబడి ఈ కథను ముందుకు నడిపిస్తుంది రేణుక పాత్ర. కథాంశంలో ఒక్కో ముడీ విడివడుతున్నప్పుడు రెండు హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసిన వ్యక్తి మొదట మీరు అనుమానించిన వ్యక్తి కాదు. ఇంతకుమించి నేను మీకు చెప్పను. అలా చెప్తే కథ తెలిసి పోతుంది. కథా నేపథ్యం భవిష్యత్ కాలం. ఇదంతా కూడా 2026 జూన్ తర్వాత జరుగుతుంది. ఫతేపురిలోని సిఖ్ రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్లో కథ మొదలవుతుంది. రోహిత్, రేణుక ఓరియెంటేషన్ ట్రైనింగ్ కోసం అక్కడ ఉంటారు. కొత్తను పోగొట్టి, దిశా నిర్దేశం చేసే శిక్షణ కార్యక్రమం అది. జనరల్ నరవణే సొంత రెజిమెంట్ కూడా ‘7వ సిఖ్ లైట్ ఇన్ఫాంట్రీ’ కనుక ఆయన స్వీయానుభవాలు, ప్రత్యక్ష పరిశీలన ద్వారా గ్రహించిన విషయాలు ఈ నవల రాసేందుకు తోడ్ప డ్డాయని స్పష్టంగా తెలుస్తోంది. ఏమైనా, థ్రిల్లర్ కథలు రాయటం అంత తేలికేమీ కాదు. మొదట కథాంశం అన్నది ఉండాలి. అది ఆసక్తికరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా – చదువుతున్న కొద్దీ అది మనల్ని లోలోతుల్లోకి లాక్కెళు తుండాలి. తర్వాత ప్రధానమైనది కథన వేగం. అది మనల్ని ముగింపు వైపు పరుగులెత్తించాలి. మహోగ్రమైనదిగా కూడా ఆ ముగింపు ఉండాలి. చివరిగా భాష. అది కుదింపుగా, ఉద్వేగభరి తంగా ఉండాలి. సుదీర్ఘమైన తాత్విక ప్రసంగాల్లా కాకుండా, వాక్యాలు చిన్న చిన్నవిగా ఉండాలి. వీటి ద్వారా ప్రధాన పాత్రలు ఎటువంటి స్వభావం కలిగినవో మనకొక స్పష్టమైన అవగాహనను కలిగించటం అవసరం. ఇక రచయిత ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని సూటిగా, పదునుగా శిల్పీకరించాలి. అంతేనా, ఏది తప్పో ఏది ఒప్పో చెప్ప గలిగేలా ఉండాలి. థ్రిల్లర్ పుస్తకాలు సాధారణంగా నీతి కథలుగా ముగుస్తాయి.ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. నిజానికైతే, ఇది మనం ఆర్మీ జనరల్స్ నుంచి ఆశించేది కాదు. ఈ పుస్తకంలోని వివిధ వర్ణాల ఛాయలు, వివరాల్లోని సూక్ష్మత్వం ఆహ్లాదకరమైన అబ్బురపాటును కలిగించేలా ఉన్నాయని నేను చెప్పగలను. నేను ఎంతో మంది ఆర్మీ చీఫ్‌లను కలిశాను కానీ – మీరు నమ్మండి – ఈ విధమైన సాహితీ నైపుణ్యాలను కలిగి ఉన్న ఆర్మీ చీఫ్‌ను నేనెప్పుడూ కలవలేదు. కథలో బ్రిగేడియర్ అశోక్ మీనన్‌ది కేవలం పైపైన పాత్రే అయినప్పటికీ, ఆ రెజిమెంటల్ సెంటర్ కమాండెంట్ ఇంగ్లిషు నన్ను పడేసింది. మీనన్ మాట్లాడేటప్పుడు ‘బ్లింప్’ అనే ఒక ఇంగ్లిష్ కల్నల్ (కార్టూన్ క్యారక్టర్) గుర్తొచ్చారు నాకు. ‘What the deuce?' (ఆశ్చర్యాన్ని, గందరగోళాన్ని లేదా చికాకును వ్యక్తపరిచే యాస), ‘darn’ (డామిట్) వంటి పదాలు ఆయన నోటి నుండి వచ్చేవి. ఆయన ప్రసంగమంతా కూడా ruddy, blighter, bugger అనే పదాల చిలకరింపుతో ఉంటుంది. అవన్నీ తిట్లు. జనరల్ నరవణే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన తన పాత్ర మాట్లాడే భాషతో ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించారు. కొన్నిసార్లు ఇది నాకు ఆర్థర్ కానన్ డోయల్ (రచయిత), షెర్లాక్ హోమ్స్(కానన్ డోయల్ సృష్టించిన పాత్ర)ను కూడా గుర్తుకు తెచ్చేది. అయితే ఆర్మీ బ్రిగేడియర్లు నిజంగా అలా ఉంటారా? లేదా, అలా ఉండాలని పాఠకులు ఆశిస్తా రని ఈ రచయిత నమ్ముతున్నారా? ఏదైనా సరే, అది పని చేస్తుంది. అయితే, సునిశితమైన శ్రద్ధతో సాగిన పాత్రల చిత్రీకరణ, సైనిక జీవిత స్ఫూర్తి, స్వభావాల సంగ్రహణలతో ఈ థ్రిల్లర్ పుస్తకం దోష రహితంగా ఉన్నప్పటికీ, ఇందులో నాకొక వింత లోపం మార్మికంగా అనిపించింది. బ్రిగేడియర్ మీనన్, రోహిత్‌తో మాట్లాడే సందర్భంలో రచయిత ఇలా రాశారు: ‘‘గోడవైపు చూపిస్తూ ఆయన అంటారు, ‘గురునానక్ చెప్పిన ఆ మాట నీకు తెలుసా? చెడు విజయం సాధించటానికి కావలసిన ఒకే ఒకటి, మంచి మనుషులు ఏమీ చేయకపోవ టమే’’ అని. నాకు తెలిసినంత వరకు ఈ మాటను 18వ శతాబ్దం నాటి బ్రిటిష్ కన్జర్వేటివ్ నాయకుడు ఎడ్మండ్ బర్క్ అన్నారని చెబు తుంటారు. అయితే ఈ మాటను అన్నది బర్క్ కాదు అని ఇటీవలి కాలంలో కొన్ని పండిత వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురు నానక్ నిజంగా అలా చెప్పారా? చెబితే ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పారు?ఈ చిన్న విషయాన్ని పక్కన పెడితే జనరల్ నరవణే తర్వాతి థ్రిల్లర్ కోసం నేను కుతూహలంతో వేచి చూస్తున్నాను. ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తే, హత్యల గురించి లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రి చెప్పే రహస్యాలు వరుసగా వెలువడతాయని ఆయన నాతో అన్నారు. ఎవరికి తెలుసు? ఆమె మన సొంత ‘మిస్ మార్పుల్’ (ఆంగ్ల రచ యిత్రి అగాథా క్రిస్టీ డిటెక్టివ్ నవలల్లోని కల్పిత పాత్ర) కావచ్చు. అలా జరిగితే కనుక జనరల్ నరవణే కొత్త అగాథా క్రిస్టీ అవుతారు!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఉత్తరాఖండ్: 46 మంది సేఫ్.. నలుగురి మృతి.. ఐదుగురు మిస్సింగ్
డెహ్రాడూన్: మంచు చరియలు విరిగిపడిన(Uttarakhand avalanche) ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందినట్లు భారత సైన్యం శనివారం ప్రకటించింది. రెండో రోజు సహాయక చర్యల్లో 17 మందిని రక్షించినట్లు.. మిగిలిన మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.ఛమోలి జిల్లాలో శుక్రవారం వేకువజామున బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంప్ వద్ద భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 55 మంది బీఆర్వో కార్మికులు చిక్కుకుపోగా.. భారత సైన్యం(Indian Army) రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మంచు వర్షంతో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నిన్న 33 మందిని.. ఇవాళ మరో 17 మందిని భారత సైన్యం రక్షించింది. వీళ్లలో తీవ్రంగా గాయపడిన వాళ్లను జోషిమఠ్‌లోని ఆస్పత్రులకు హెలికాఫ్టర్ల ద్వారా తరలించింది. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు తెలిపింది.ఇండో-టిబెటన్ సరిహద్దు గ్రామమైన మనాలో.. సైన్యం కదలికల కోసం రోడ్ల నుంచి మంచును తొలగించే పనుల్లో బీఆర్వో బృందం తలమునకలైంది. ఈ క్రమంలో.. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. ఎనిమిది కంటైనర్లతో పాటు ఒక షెడ్డూలో వాళ్లను మంచు చరియలు కప్పేశాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు అడుగుల మేరలో పేరుకుపోయిన మంచులో మరికొన్ని ఏజెన్సీల సాయంతో సైన్యం సహాయక చర్యలు కొనసాగించింది. వీళ్లలో కొందరు ఉత్తరాఖండ్(Uttarakhand) నుంచి ఉండగా, చాలామంది బీహార్, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ము కశ్మీర్, ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు ఉన్నారు.సహాయక చర్యలపై ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి సమీక్ష జరుపుతున్నారు. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్నామని అన్నారాయన. -
మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్
జమ్మూ: భారత్ విషయంలో పాక్ తన వైఖరిని మార్చుకోవడంలేదు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులకు తెగబడిన పాక్‌కు భారత్ తగిన సమాధానం చెప్పింది. ఈ ఘటనలో పలువురు పాకిస్తాన్ సైనికులు మరణించారని భారత భద్రతా అధికారులు తెలిపారు.ఈ ఉదంతంలో పాకిస్తాన్‌కు ఎంతంటి ప్రాణనష్టం జరిగిందో తెలియకపోయినా, శత్రు దళాలు భారీ నష్టాలను చవిచూశాయని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ జిల్లాలోని అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ పేలుడులో కెప్టెన్‌తో సహా ఇద్దరు భారత ఆర్మీ సిబ్బంది మరణించారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత కృష్ణ ఘాటి సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిదని అధికారులు తెలిపారు.2021, ఫిబ్రవరి 25న భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుండి ఎల్ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు తక్కువగా నమోదయ్యాయి. అయితే తాజాగా తార్కుండి సెక్టార్‌లోని ఫార్వర్డ్ పోస్ట్‌పై పాకిస్తాన్ దళాలు ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండా కాల్పులు జరిపి, కాల్పుల విరమణను ఉల్లంఘించాయని, దీనికి భారత సైన్యం తగిన సమాధానం చెప్పిందని అధికారులు పేర్కొన్నారు. కాగా గత వారం రోజులుగా సరిహద్దు వెంబడి శత్రుదేశపు కార్యకలాపాలు పెరిగాయి. దీంతో ఎల్ఓసీ వెంబడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది -
రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు
న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ల తయారీదారులకు భారత సైన్యం షాక్ ఇచ్చింది. రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది. ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్‌వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తప్ప ఇతర దేశాల విడిభాగాలను డ్రోన్లలో ఉపయోగించేందుకు అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. -
జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్..ఏడుగురు ఉగ్రవాదులు హతం
పూంచ్:జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు(ఎల్వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగింది. పూంచ్ జిల్లాలోని క్రిష్ణఘాటి సెక్టార్లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు దాకా పాకిస్తాన్ ఆర్మీ జవాన్లే కావడం గమనార్హం.పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు ఫిబ్రవరి 4 అర్ధరాత్రి సరిహద్దు ద్వారా భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు మృతి చెందారు. ఫిబ్రవరి5వ తేదీని కాశ్మీర్ లిబరేషన్ డేగా పాకిస్తాన్ జరుపుకుంది. ఈ నేపథ్యంలో అదే రోజు పాక్ ఆర్మీకి చెందిన జవాన్లు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం పట్ల సైన్యం అప్రమత్తమై వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది.ఇటీవల జమ్ముకశ్మీర్‌లో వరుస ఘటనల్లో పలువురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ ఎన్కౌంటర్లలో పలువురు జవాన్లు కూడా గాయపడ్డారు. డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమైన విషయం తెలిసిందే. -
మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి సమీపంలో వైమానిక దళానికి చెందిన ట్విన్ సీటర్ మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. నివాస ప్రాంతాల్లో కూలకపోవడంతో పెనుప్రమాదమే తప్పింది. ట్విన్ సీటర్ మిరాజ్ 2000లో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా ప్రాణాలతో భయటపడ్డారు. A twin-seater Mirage 2000 fighter aircraft today crashed near Shivpuri in Madhya Pradesh while it was on a routine training sortie. A Court of Inquiry is being ordered to ascertain the cause of the crash. More details are awaited: Defence officials pic.twitter.com/I1mMYpN6gj— ANI (@ANI) February 6, 2025 -
పర్యాటక ప్రాంతాలుగా యుద్దభూములు
-
Nag Mark 2: ఆర్మీ అమ్ములపొదిలోకి నాగ్ మార్క్-2
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించుకున్న ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్-2(Nag MK-2) పరీక్ష విజయవంతమైంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో సోమవారం పరీక్షను నిర్వహించారు. అత్యంత కచ్చితమైన లక్ష్యాలను ఇది చేధించడంలో విజయవంతమైందని భారత రక్షణ పరిశోధన సంస్థ(DRDO) ప్రకటించింది.ఇది మూడోతరం(Third Generation) ‘ఫైర్ అండ్ ఫొర్గెట్’ క్షిపణి. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. అలాగే.. లక్ష్యాలను చేధించడంలో క్షిపణి కనిష్ఠ, గరిష్ఠ పరిధి నిర్ధారణ అయింది. మొత్తం మూడుసార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్(NAMICA) -2ని కూడా పరీక్షించినట్లు తెలిపారు. ‘‘ఈ పరీక్షలతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం.. భారత సైన్యం(Indian Army)లో ప్రవేశించేందుకు సిద్ధమైంది’’ అని రక్షణ మంత్రిత్వశాఖ ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. -
రక్షణ రంగంలో రావాల్సిన మార్పులు
⇒ కీలకమైన ఆయుధ, సమాచార వ్యవస్థలు, టెక్నాలజీల కోసం విదేశాలపై ఆధారపడటం వీలైనంత తగ్గించుకోవాలి.⇒ యుద్ధ ట్యాంక్, యుద్ధ విమానం, జలాంతర్గాముల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. వ్యక్తిగత ఆయుధాల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అగ్ని–5 వంటి క్షిపణులను సమర్థంగా ఉత్పత్తి చేయగల దేశానికి ఇదే మంత అనుకూలమైన అంశం కాదు.⇒ స్థూల జాతీయోత్పత్తిలో ‘ఆర్ అండ్ డీ’కి భారత్ వెచ్చిస్తున్న మొత్తం కేవలం 0.65 శాతమే. అమెరికా 2.83 శాతం, ఫ్రాన్స్ 2.19 శాతం, చైనా 2.14 శాతం, దక్షిణ కొరియా 4.8 శాతం ఖర్చు చేస్తున్నాయి. ఏ దేశమైనా భద్రంగా ఉండాలన్నా, సార్వభౌమత్వానికి సవాళ్లు ఎదురు కాకూడ దన్నా పటిష్టమైన మిలిటరీ, రక్షణ వ్యవస్థలు అత్యవసరం. 2014లో ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి నరేంద్ర మోదీ ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. అయితే భారత మిలిటరీ, రక్షణ వ్యవస్థలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడంతోపాటు సమీక్షించి అవసరమైన సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ అంశాన్ని తరచూ మిలిటరీ పెద్దల వద్ద ప్రస్తావిస్తూండేవారు. దురదృష్టవశాత్తూ ఈ వ్యవస్థ సంస్కరణ పథం పట్టేందుకు ఇప్పటికీ నిరాకరిస్తోంది. నరేంద్ర మోదీ రెండో దఫా ప్రధానిగా ఎన్నికైన తరువాత ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ పదవిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రక్షణ రంగ సంస్కరణలనే భారీ ప్రయత్నానికి ఇది చిన్న ముందడుగు మాత్రమే. చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి.రక్షణ శాఖ ఆధ్వర్యంలోని మిలిటరీ వ్యవస్థ బహుముఖమైనది.ఎన్నో భాగాలు, విభాగాలు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల వంటివి బిట్రిష్ కాలం నాటివి. అన్నీ వేటికవే ప్రత్యేకమన్నట్టుగా పనిచేస్తున్నాయి. మార్పును సుతరామూ ఇష్టపడటం లేదు. అయితే ఈ లక్షణం భారతీయులది కాకపోవడం కాకతాళీయమే. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మిలిటరీలు పాతకాలపు మూస ధోరణుల్లోనే కొట్టుకు పోతున్నాయి. భారత మిలిటరీ కూడా ఇలాంటి వ్యవస్థాగతమైన లక్షణాన్నే వ్యక్తం చేస్తోంది.లేని యుద్ధ సన్నద్ధతఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 2025 సంవత్సరాన్ని మిలిటరీ సంస్కరణలను ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవడం, ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పాలి. ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్డీవో) 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని ఉద్దేశాలను బహిరంగ పరిచారు. సంస్కరణల లక్ష్యాల సాధనలో డీఆర్డీవో కీలక భూమిక ఏమిటన్నది కూడా రక్షణ మంత్రి ఆ సమావేశంలో వివరించారు. మిలిటరీ సంస్కరణల గురించి స్థూలంగా చెప్పాలంటే... దేశ రక్షణకు వ్యూహాత్మకంగా, సాంకేతిక పరిజ్ఞానాల విషయంలో, భౌగోళిక, రాజకీయ అనివార్యతలకు తగ్గట్టుగా యుద్ధ సన్నద్ధతను సంపా దించుకోవడం ఒకటి. కీలకమైన ఆయుధ, సమాచార వ్యవస్థలు, టెక్నాలజీల కోసం విదేశాలపై ఆధారపడటం వీలైనంత తగ్గించడం రెండోది. ఈ రెండు లక్ష్యాలను సాధించాలంటే డీఆర్డీవోతో పాటు దేశంలోని శాస్త్ర, తయారీ రంగాలు ప్రధానమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది.శాస్త్రవేత్తలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలనీ, తమ సామ ర్థ్యాలను పెంచుకోవాలనీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘ప్రపంచంలోనే అగ్రగామి పరిశోధన, అభివృద్ధి సంస్థగా డీఆర్డీవో ఎదగాలి’ అని ఆకాంక్షించారు. డీఆర్డీవో కీర్తి కిరీటంలో కొత్తగా చేరిన కలికితురాయి దీర్ఘశ్రేణి ‘హైపర్ సానిక్ యాంటీ–షిప్’ క్షిపణి డిజైన్ బృందం కృషిని రక్షణ మంత్రి అభినందించారు కూడా. అయితే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విషయాల్లో వ్యవస్థాగతమైన పరిమితులు కొన్ని పట్టిపీడిస్తున్నాయన్నది కఠోర సత్యం. వీటిని పరిష్కరించకుండా సంస్కరణల లక్ష్యం సాధించడం అసాధ్యం. ‘ఆర్ అండ్ డీ’ విషయంలో భారత్ ప్రపంచ అగ్రగామి దేశాల జాబితాలో లేదు. రక్షణ రంగంలో పెట్టుబడులు, ఉత్పాదకతలు కూడా దశాబ్దాలుగా ఓ మోస్తరుగా మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు అక్కడక్కడ ఒకట్రెండు మినహాయింపులు కనిపిస్తాయి అంతే. కేటాయింపులు పెరిగేనా?గత ఏడాది సెప్టెంబరులో డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ మాట్లాడుతూ, ‘ఆర్ అండ్ డీ’కి వెచ్చిస్తున్న మొత్తం భారత స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 0.65 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఈ రంగంపై అమెరికా 2.83 శాతం, ఫ్రాన్స్ 2.19 శాతం, చైనా 2.14 శాతం, దక్షిణ కొరియా 4.8 శాతం ఖర్చు చేస్తున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు. భారత్ కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసుననీ, మోదీ హయాంలోనైనా ఈ మొత్తం జాతీయోత్పత్తిలో ఒక శాతానికి చేరుకోవాలనీ ఆశిస్తున్నట్లు సమీర్ కామత్ తెలిపారు. 2035 నాటికి రెండు శాతానికి చేరడం అభిలషణీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఈ ఆశలు నెరవేరే సూచనలేవీ లేవు. రక్షణ రంగం మొత్తానికి కేటాయిస్తున్న నిధులే స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతానికి దగ్గరగా ఉన్న పరిస్థితుల్లో భారీ రాజకీయ జోక్యంతో గానీ ‘ఆర్ అండ్ డీ’కి ఒక శాతం కేటాయింపులు సాధ్యం కావు. ఇక డీఆర్డీవో, రక్షణ మిలటరీ వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్య విదేశీ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, 2012–13 నుంచి 2021–22 మధ్యకాలంలో మిలిటరీ, రక్షణ రంగాల మూలధన వ్యయం విదేశీ మారక ద్రవ్యంలో 35 శాతం వరకూ ఉందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. ఒకానొక దశలో ఇది 49 శాతానికి కూడా చేరు కున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. వ్యూహాత్మక విషయాల్లో స్వతంత్రంగా ఉండాలన్న దేశ ఆకాంక్షలకు ఇది భిన్నం.డీఆర్డీవో, ఇతర రక్షణ రంగ సంస్థలు మొదలై సుమారు ఏడు దశాబ్దాలు అవుతోంది. అణ్వాయుధాలు, క్షిపణులు, అణు చోదక వ్యవస్థల విషయంలో ప్రశంసార్హమైన ప్రగతి సాధించాము. ఇందులో ముప్ఫై ఏళ్లు అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆంక్షలున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధ ట్యాంక్, యుద్ధ విమానం, జలాంతర్గాముల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. డీఆర్డీవో, ప్రభుత్వ రంగ సంస్థలు రెండూ దేశ యుద్ధ సన్నద్ధతను గణనీయంగా పెంచిందీ లేదు. సొంత డిజైన్లు లేవు!ప్రస్తుత ప్రభుత్వం దృష్టి ప్రధానంగా ప్రైవేట్ రంగం, విద్యాసంస్థల సహకారంపై ఉంది. ఆహ్వానించ దగ్గదే. కానీ ఈ సహకారానికి సంబంధించి పద్ధతులు, సమయావధులు నిర్ణయం కావాల్సి ఉంది. భారత్‌కు ఉన్న ఇంకో బలహీనత ఏమిటంటే... గణనీయమైన జీడీపీ, నైపుణ్యం, విద్యార్హతలున్న మానవ వనరులు, ఉన్నత విద్యాసంస్థలు ఎన్ని ఉన్నా... మిలిటరీ పరికరాలకు సంబంధించి సొంత డిజైన్ లేకపోవడం! 1960లలో ఐషాపోర్ రైఫిల్, హెచ్ఎఫ్–24 మారుత్ యుద్ధ విమానాలు కొంతమేరకు మాత్రమే విజయం సాధించాయన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫలితంగా ఇప్పటికీ మనం వ్యక్తిగత ఆయుధాల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. అగ్ని–5 వంటి క్షిపణులను సమర్థంగా ఉత్పత్తి చేయగల భారత్ లాంటి దేశానికి ఇదేమంత అనుకూలమైన అంశం కాదు. డీఆర్డీవో విషయాన్నే ప్రత్యేకంగా పరిశీలిస్తే... సంస్కరణలను ఆహ్వానిస్తూనే తన సొంత శక్తి సామర్థ్యాలపై లోతైన సమీక్ష చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. స్వతంత్ర నిపుణుల ఆధ్వర్యంలో ఇలాంటి అధ్యయనం ఒకటి జరిపి ఫలితాల ఆధారంగా భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకోవడం అవసరం. లేదంటే సంస్కరణల ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయే ప్రమాదం ఉంది. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గోల్కొండ కోటలో ఇండియన్ ఆర్మీ ‘నో యువర్ ఆర్మీ’ మేళా (ఫొటోలు)
-
జమ్మూకశ్మీర్‌లో 60 శాతం పాక్ టెర్రరిస్ట్‌లు హతం
ఢిల్లీ : భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలకు తెగించి ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్‌లో సుమారు 60 శాతం పాకిస్తాన్ తీవ్ర వాదుల్ని హత మార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి ప్రతి ఐదురోజులకు ఒక టెర్రరిస్ట్‌ను, మొత్తంగా 75 మంది టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టామని తెలిపారు. వారిలో అధిక శాతం(60) పాక్ ముష్కరులు ఉన్నట్లు నిర్ధారించారు.ఆర్మీ అధికారుల నివేదిక ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాలు-జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరిలో మరణించిన 42 మందిలో స్థానికేతర ఉగ్రవాదులు ఎక్కువ మంది ఉన్నారని డేటా వెలుగులోకి వచ్చింది. స్థానికేతర కశ్మీర్ లోయలోని బారాముల్లా, బందిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.జమ్మూ కశ్మీర్‌లోని తొమ్మిది జిల్లాలలో బారాముల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో అత్యధికంగా ఉరీ సెక్టార్‌లోని సబురా నాలా ప్రాంతం, మెయిన్ ఉరి సెక్టార్, కమల్‌కోట్ ఉరి నియంత్రణ రేఖ వెంబడి, చక్ తప్పర్ క్రిరి, నౌపోరా, హడిపొర, సాగిపోరా, వాటర్‌గామ్, రాజ్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలలో ఆర్మీ జవాన్లు హతమార్చారు. నియంత్రణ రేఖ (Line of Control (LoC),ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబీ)17 మంది, జమ్మూకశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో 26 మందిని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అదే సమయంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరగకుండా భద్రత బలగాలు ప్రముఖ పాత్ర పోషించాయి. జమ్మూ కశ్మీర్లో పనిచేస్తున్న స్థానిక ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ప్రధానంగా పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నారని సంఖ్యలు సూచిస్తున్నాయి. స్థానిక ఉగ్రవాద సంస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఓ అధికారి తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్లో 60 ఉగ్రదాడి ఘటనల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బందితో సహా మొత్తం 122 మంది చనిపోయారు.


