'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం | Colonel Sofiya Father Taj Mohammed Qureshi Said I am proud of my daughter. | Sakshi
Sakshi News home page

Operation Sindoor: 'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం

May 8 2025 1:12 PM | Updated on May 9 2025 12:30 PM

Colonel Sofiya Father Taj Mohammed Qureshi Said I am proud of my daughter.

పహల్గాం ఉగ్రవాద దాడికి భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్‌' చేపట్టి తగిన రీతీలో బదులిచ్చింది. దీనిపై యావత్ దేశం హర్షాతీరేకాలు వ్యక్తం చేసింది. అన్నింటికంటే ఈ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మీడియా ముందు వెల్లండించిన ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది ఒకరకంగా భారత రక్షణదళం ఎవరి సారథ్యంలో కొనసాగుతోంది అనేది ప్రపంచానికి తెలిసేలా చేసింది. వారే కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లు. అయితే తాతా ముత్తాతల నుంచి ఆర్మీలో సేవలందిస్తున్న సోఫియా కుటుంబం తమ కుమార్తె చేసిన పనికి ఆనందపారవశ్యంలో మునిగితేలుతోంది. 'ఇది మాకెంతో గర్వం' అని భావోద్వేగంగా చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి  సైతం ఇలాంటి గొప్ప అవకాశం తన కుమార్తెకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదన్నారు. ఆమె కారణంగా ఈ రోజు యావత్ దేశానికి తమ కుటుంబం గురించి తెలిసేలా వార్తల్లో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోఫియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఆమె కుటుంబసభ్యుల మాటల్లోనే చూద్దామా..!.

తమ కుమార్తె భారత ఆర్మీ, నేవీ, వైమానిక బలగాలు సంయుక్తంగా నిర్వహించి ఈ సిందూర్‌ ఆపరేషన్‌ గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు కల్నల్‌ సోఫియా తల్లి హనిమా ఖురేషి. అంతేగాదు తమ కుమార్తె సోపియా కొడుకు(18) కూడా ఐఏఎఫ్‌(IAF)లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారామె. 

ఇక కల్నల్‌ సోషియా తండ్రి తాజ్‌ ఖురేషి మాట్లాడుతూ.."నా కుమార్తె పట్ల నాకు గర్వంగా ఉంది" నా కుటుంబం ఎల్లప్పుడూ 'వయం రాష్ట్రే జాగ్రయం ( జాతి మొత్తాన్ని సజీవంగా, జాగరూకతతో ఉండేలా చేస్తాం)' అనే సూత్రాన్ని పాటిస్తుంది. 'ముందు మేము భారతీయులం ఆ తర్వాతే ముస్లీంలం' అని సగర్వంగా అన్నారు తాజ్‌ మొహ్మద్‌ ఖురేషి. అంతేగాదు ఆమె తాతతో ప్రారంభమైన ఈ దేశ సేవను..సోపియా మూడవ తరం సైనిక అధికారిగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. 

 

ఇక సోఫియా తండ్రి తాజ్‌ ఖురేషి వడోదరలో ఎలక్ట్రానిక్  అండ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌ కార్ఫ్స్‌ పనిచేయడమే గాక 1971 యుద్ధంలో సేవలందించారు. అలాగే సోఫియా తండ్రి (తాజ్‌)గారి అమ్మమ్మ తాతయ్య బ్రిటిష్ సైన్యంలో పనిచేయడమే గాక 1857 స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఇక ఆమెకు ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన మొహమ్మద్ సంజయ్ ఖురేషి మాట్లాడుతూ..'దేశ భక్తి మా రక్తంలోనే ఉంది' అని సగర్వంగా చెప్పారు. 

ఎందుకంటే సోఫియా ప్రొఫెసర్‌ కావాలనుకుంని, అనివార్య కారణాలతో భారత ఆర్మీ యూనిఫాం ధరించిందని అన్నారు. అలా ఆమె కుటుంబ సంప్రదాయన్ని పుణికి పుచ్చుకుందని అన్నారు. ఇక ఆమె భర్త తాజుద్దీన్‌ ఆర్మీ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి కావడం విశేషం. చివరిగా కుటుంబ సభ్యులంతా.."ఆమె మాకు ఆదర్శం... ప్రతీకారం తీర్చుకోవడానికి మేము చాలా కాలంగా ఎదురుచూశామం కానీ, ఇలాంటి అద్భుత అవకాశం మా కుటుంబ సభ్యల్లో ఒకరికి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. 

ఆ పహల్గాం ఘటనలో భర్తలను కోల్పోయిన సోదరీమణులు, తల్లుల ఆక్రందనలకు సిందూరంతో ప్రతీకారం తీర్చుకున్నాం" అని అన్నారు. కాగా, సోఫియా పేరు మీద అనేక అవార్డులు కూడా ఉన్నాయట. అలాగే భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక కవాతులో పాల్గొన్న 18 కంటింజెంట్లలో ఏకైక మహిళా కమాండర్‌ సోఫియానే అట.

విద్యా నేపథ్యం:
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్‌ మీడియంలో పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత 1995లో బీఎస్సీ, 1997లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరేందుకు తన పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ని మధ్యలోనే విడిచిపెట్టినట్లు వివరించారు. 

ఇక సైన్యంలో చేరాక తన కెరీర్‌లో ఆరేళ్లు యూఎన్‌ శాంతి పరిరక్షక దళాలలో పని చేయడం, సంఘర్షణ ప్రాంతాలలో పనిచేయడం, మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వంటి ఎన్నో అద్భుత సేవలందించారామె.

చదవండి: నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement