
భూమ్మీద ఎన్నో ఏకకణ జీవులు ఉన్నాయి. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఏకకణ ఫంగస్‌లు వంటివి కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి. వీటిని చూడాలంటే, మైక్రోస్కోప్ కావాల్సిందే! అయితే, ఇది అతిపెద్ద ఏకకణ జీవి.
చిన్నపిల్లలు ఆడుకునే గోలీ పరిమాణంలో, ఇంచుమించుగా ద్రాక్షపండు పరిమాణంలో ఉంటుంది. దీనిని నావికుల కనుగుడ్డు (సెయిలర్స్ ఐబాల్), సముద్రపు ద్రాక్ష (సీ గ్రేప్), బుడగ నాచు (బబుల్ ఆల్గే) అనే పేర్లతో పిలుస్తారు. దీని శాస్త్రీయనామం ‘వాలోనియా వెంట్రికోసా’.
ఇది ఎక్కువగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోని సముద్రాల్లో జీవిస్తుంది. సాధారణంగా ఏకకణ జీవులకు ఒకే కణ కేంద్రకం (న్యూక్లియస్) ఉంటుంది. ఈ ఏకకణ జీవి అనేక సైటోప్లాజమ్స్‌తో కలసి ఏర్పడటం వల్ల దీనిలో అనేక న్యూక్లియస్‌లు ఉంటాయి. కరీబియన్ తీర ప్రాంతాల్లోను, బ్రెజిల్ దక్షిణ తీరంలోను, ఫ్లోరిడా ఉత్తర తీరంలోను సముద్రపు ఒడ్డున ఇవి తరచుగా కనిపిస్తుంటాయి.
(చదవండి: ఇవోరకం పూతరేకులు..!)