అన్నీ మీరే చేశారు... తరహానా మీరు? | Positive Parenting Tips Raising Happy Kids | Sakshi
Sakshi News home page

Positive Parenting: అన్నీ మీరే చేశారు... తరహానా మీరు?

Nov 15 2025 7:29 PM | Updated on Nov 15 2025 7:43 PM

Positive Parenting Tips Raising Happy Kids

అన్నీ మీరే చేశారు నాన్నా! నా కలలు కూడా మీరే కన్నారు అని బొమ్మరిల్లులో హీరో సిద్ధార్ధ డైలాగ్‌. ఆ మాటలకు ప్రకాశ్‌రాజ్‌ దిమ్మెరపోతాడు. అన్నీ మీ మంచికే చేశానని అనుకుంటూనే పిల్లల స్వేచ్ఛను ఎంతగా దెబ్బతీశారో మరచిపోతుంటారు. అది చాలా ప్రమాదం. ఈ తరహా పెంపకం పిల్లలకు ఏమాత్రం సౌకర్యాన్నివ్వకపోగా వారిలో ఒక విధమైన నిర్లిప్తత, నిరాసక్తత చోటు చేసుకుంటుంది. ఫలితంగా తల్లిదండ్రులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మరి మీ పిల్లల పట్ల మీరు ఎలా బిహేవ్‌ చేస్తున్నారు? క్రమశిక్షణ (discipline) పేరుతో.. కఠినంగా ఉంటున్నారా? చెక్‌ చేసుకోండి.

తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ పిల్లల నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్‌ చేస్తూ ఉంటారు. తాము ఏం చెప్పినా ఎదురు ప్రశ్నలు వేయకుండా పిల్లలు తమ మాట వినాలని కోరుకుంటారు. ఒకవేళ ఏదైనా అడగాలి అనుకున్నా.. ఆ ప్రశ్న బయటకి రాకముందే దానిని అడగకుండా చేస్తారు. ఇలాంటి పరిస్థితిల్లో పిల్లలు మిమ్మల్ని అడగక΄ోవచ్చు కానీ.. వారి మనస్సులో ఉత్సాహం, ప్రశ్నలు వేయాలనే కోరిక పెరుగుతుంది. దాని కోసం వారు ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. అప్పుడు ఆ మైండ్‌ సెట్‌ ప్రమాదకరంగా పరిణమించవచ్చు.  

ప్రతి విషయంలో పరిపూర్ణత కోరుకుంటారా? 
తల్లిదండ్రులు తమ పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అలాగే వారి ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా సక్సెస్‌లో ఓ బార్‌ సెట్‌ చేసేస్తారు. పిల్లలకు ఏది కావాలి ఏది వద్దు అనేది కనీసం వారితో చర్చించకుండా.. తమకి నచ్చినట్టు పిల్లలు చదవాలని.. సక్సెస్‌ (success) అవ్వాలని కోరుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల మాట దాటలేక.. వారి ఇష్టాలు వదులుకోలేక సమతమవుతూ ఉంటారు. అప్పుడు పరిస్థితి దిగజారుతుంది. పిల్లలపై ఒత్తిడి పడుతుంది.

ఎక్కువగా కంట్రోల్‌ చేస్తే.. 
కొందరు తల్లిదండ్రులు పిల్లలను చిన్న విషయాలపై కూడా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడకు వెళ్లకూడదు.. అక్కడికి వెళ్లకూడదు. అది చేయకు. ఇది చేయకు వంటివి చెప్తూ ఎక్కువగా కంట్రోల్‌ చేసేస్తారు. వారి కెరీర్‌ నుంచి జీవిత భాగస్వామి వరకు ప్రతిదీ వారే నిర్ణయిస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలు ఎప్పటికీ స్వతంత్రంగా ఉండలేరు. జీవితంలో ప్రశాంతత ఉండదు. తనకి నచ్చని జీవితంలో తాను బతికేందుకు కూడా భయపడతారు.

భావోద్వేగాలను అణచటం
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను నొప్పి, విచారం, బలహీనత వంటి భావోద్వేగాలను చెప్తున్నప్పుడు.. వాటిని బలవంతంగా అణచివేస్తారు. దీనివల్ల తాము ఏమనుకుంటున్నదీ చెప్పడం పూర్తిగా మానేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది పిల్లల్లో శాడిజానికి పాదులు తీసే ప్రమాదం కూడా ఉంది. ఎమోషన్స్‌ అన్నింటినీ బలవంతంగా అణచుకోవడం వల్ల అన్నీ ఒకటేసారి బయటకు రావడమో.. లేదా ఒకేసారి టాక్సిక్‌గా మారడమో జరగవచ్చు.  

ప్రేమ ఇచ్చేది అప్పుడేనా?
చాలా ఇళ్లలో పిల్లల్లు ఏదైనా సాధించినప్పుడే తల్లిదండ్రులు ప్రేమను చూపిస్తారు. లేదా తమ వింటున్నప్పుడే పిల్లలను ఇష్టంగా చూసుకుంటారు. ఈ రెండిటిలో ఏదైనా తేడా వస్తే మొత్తానికి దూరం పెట్టేస్తారు. మంచి మార్కులు లేదా పతకాలు–ట్రోఫీలు సాధించినప్పుడే ప్రేమను చూపించడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి.

మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే ఉంటున్నారేమో చూసుకోండి. పిల్లలకు భద్రత ఇవ్వడం ముఖ్యమే కానీ.. వారికి ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వడం కూడా అలవాటు చేయాలి. అలాగే పిల్లలు మీ దగ్గర ఏదైనా చెప్పుకునే స్వతంత్రం ఇవ్వాలి. వారు మీకు భయపడేలా కాదు.. మీరంటే ప్రేమతో ఉండేలా పెంచడమే నిజమైన పేరెంటింగ్‌.

చ‌ద‌వండి: బుజ్జి కుక్క‌పిల్లను భ‌లే కాపాడారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement