భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్‌ వీడియో | Court Denies Alimony Claim Woman Beats Estranged Husband viral video | Sakshi
Sakshi News home page

భర్తను జట్టుపట్టిలాగి, చితక్కొట్టిన భార్య : వైరల్‌ వీడియో

Dec 30 2025 6:51 PM | Updated on Dec 30 2025 8:04 PM

Court Denies Alimony Claim Woman Beats Estranged Husband viral video

కర్నాటకలోని ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో వింత సంఘటన చోటు చేసుకుంది. చుట్టుపక్కల ప్రజలు చూస్తుండగానే ఒక మహిళ మాజీ భర్తను కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ఆమె  పదే పదే కొడుతున్నా జుట్టు పట్టిలాగినా, దుర్భాషలాడినా ఎగిరి తన్నినా, నవ్వుతూనే ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. అసలేం జరిగిందంటే.

ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆమె భర్తకు ఉద్యోగం లేదు. ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకుల కోసం ఇద్దరూ కోర్టుకెక్కారు. విడాకులు మంజూరయ్యాయి. భరణం కోసం కూడా కేసు వేసింది. ఇక్కడే భర్త కపట తెలివితేటల్ని ప్రదర్శించాడు. అయితే విడాకులు మంజూరు అయితే భరణం చెల్లించాల్సి వస్తుందన్న కుట్రతో తన పేరిట ఉన్న ఆస్తులన్నింటిని తన తల్లి పేరు మీదు ముందుగానే బదలాయించేశాడు. 

ముందు అనుకున్న ప్లాన్‌ప్రకారమే తనకు ఎలాంటి ఆస్తులు, ఆదాయం లేదు కాబట్టి, భరణం ఇవ్వలేనని వాదించాడు. అతడి వాదనలను విశ్వసించిన కోర్టు  భార్యకు షాకిచ్చింది. తనకు భరణం రాకుండా చేశాడనే ఆగ్రహంతో భార్య చేశాడని, కోర్టు బయటే భర్తను కొట్టింది. చెంపలు వాయించేసింది. జుట్టు పట్టుకొని కొట్టింది. దుర్భాషలాండింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే  తాను అనుకున్నది సాధించిన అతగాడు మాత్రం ఏదో గొప్ప విజయం సాధించిన వాడిలాగా నవ్వుతూ ఉండటం ఈ వీడియోలో రికార్డైంది.

ఇదీ చదవండి: ప్రియురాలితో ప్రియాంక గాంధీ కొడుకు నిశ్చితార్థం : త్వరలోనే శుభకార్యం

ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. భర్తనుంచి విడి పోయిన మహిళల దీన పరిస్థితికి ఇది నిదర్శమని నెటిజన్లు  కొందరు వ్యాఖ్యానించారు. ఇది అన్యాయం అని మరికొందరు భర్తపై మండిపడ్డారు. మరోవైపు మహిళలకు భరణంపై ఉండే ప్రేమకు ఇది నిదర్శమన కొందరు, దాడి చేసిన దోషిని శిక్షించాలని  ఒకరు,  ప్లాన్  ఏ ఎదురు దెబ్బ తగిలితే,  ప్లాన్ బీ ఏమీ లేనప్పుడు అంటూ మరికొందరు  వ్యాఖ్యానించారు. 
ఇదీ చదవండి: హాస్టల్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి, బళ్లారికి చెందిన టెకీ దుర్మరణం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement