కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు | Union Cabinet decisions on Delhi | Sakshi
Sakshi News home page

కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు

Feb 14 2026 1:52 PM | Updated on Feb 14 2026 3:12 PM

Union Cabinet decisions on Delhi

ఢిల్లీ: దేశ రాజధాని అభివృద్ధికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.  నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 11.6 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి రూ.2,254 కోట్ల రూపాయల కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొంది.  నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది.

అదే విధంగా  61 కిలోమీటర్ల మేర  నోయిడా గ్రేటర్ నోయిడా మధ్య మెట్రో నెట్‌వర్క్ నిర్మాణానికి కేటాయింపులు చేపట్టనున్నట్లు  తెలిపింది. రూ. లక్ష కోట్ల కేంద్ర సహాయంతో   రూ. 4 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ సెక్టార్ సహకారంతో ఫైనాన్స్ మార్కెట్ క్రియేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది.  

స్టార్టప్ ఇండియా ఫండ్ కోసం పదివేల కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు దేశంలో రెండు లక్షల  స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రాలు, మున్సిపల్ సంస్థలకు కేంద్రం మరింతగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement