మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హతం?.. వీడియో వైరల్ | Most wanted terrorist shot dead in Pakistan | Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హతం?.. వీడియో వైరల్

Feb 14 2026 11:55 AM | Updated on Feb 14 2026 12:31 PM

Most wanted terrorist shot dead in Pakistan

భారత మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మహ్మద్ ఖాసీం గుజ్జర్/ సల్మాన్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బైక్‌పై వెళుతున్న గుజ్జర్‌ను వెనుకనుంచి పాయింట్ బ్లాక్ రేంజ్‌లో షూట్ చేశారు. అయితే మరణించిన వ్యక్తి ఆయన కాదా అని స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.

2024లో భారత ఉగ్రవాద నియంత్రణ చట్టం (UAPA) కింద మహ్మద్ ఖాసీం గుజ్జర్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఈయనకు నిషేదిత ఉగ్రసంస్థ LETతో సంబంధాలున్నాయి. ఆపరేషన్ సిందూర్ అనంతరం పీవోకేలో ఆయన టెర్రరస్టు క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

భారత్ ప్రస్తుతం టెర్రరిస్టులను ఊక్కుపాదంతో అణిచివేస్తోంది. పాక్‌తో సరిహాద్దు పంచుకుంటున్న ప్రాంతాలలో భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. ఆధునాతన కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. పహల్గామ్ అటాక్ అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి  పాకిస్థాన్‌లోని టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement