స్పందించిన పాక్.. ఇమ్రాన్‌ ఖాన్ తరలింపు? | Pakistan to shift Imran Khan to another prison | Sakshi
Sakshi News home page

స్పందించిన పాక్.. ఇమ్రాన్‌ ఖాన్ తరలింపు?

Feb 14 2026 8:43 AM | Updated on Feb 14 2026 9:25 AM

Pakistan to shift Imran Khan to another prison

ఇటీవల పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వైద్యవసతి సరిగ్గా లేక ఆయన 85శాతం చూపు కోల్పోయారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇమ్రాన్‌ ఖాన్‌ని సరైన వైద్యవసతులు కల మరో కొత్త జైలుకు తరలించనున్నట్లు పేర్కొంది

ప్రస్తుతం ఆడియాలో జైల్లో ఉన్న పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకర వార్తలు ప్రచురితమయ్యాయి. ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమవుతువుతున్న ఇమ్రాన్‌ఖాన్‌ ప్రస్తుతం కంటి చూపు సన్నగిల్లుతున్నట్లు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85% చూపు కోల్పోయి, ప్రస్తుతం కేవలం 15% మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో ఇమ్రాన్‌ పట్ల ఉద్దేశపూర్వకంగా అత్యంత అమానుషంగా అడియాలా జైలు అధికారులు వ్యవహరిస్తున్నారని పాక్‌లో ఆరోపణలు వెల్లడయ్యాయి.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ను త్వరలోనే ఇస్లామాబాద్‌లోని జైలుకు తరలిస్తామని  ఆ దేశ మంత్రి మోసిన్ నఖ్వీ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులు, కంటిచూపు కోల్పోవడం దృష్ట్యా ప్రత్యేక వసతులతో ఆయన సెల్ నిర్మిస్తామని తెలిపారు.       

అయితే గతేడాది అక్టోబర్ వరకు ఆయనకు సాధారణ చూపు ఉన్నప్పటికీ, తరువాత రక్తం గడ్డకట్టడం (blood clot) వల్ల తీవ్రమైన నష్టం జరిగినట్లు వైద్యులు తెలిపారు.ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్‌లో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన చూపు కోల్పోవడం వైద్యపరమైన సమస్య మాత్రమే కాకుండా, జైలు పరిస్థితులు మరియు ప్రభుత్వ వైఖరిపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది దీంతో ప్రభుత్వం స్పందించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement