ఖలీస్థాన్ ఉగ్రవాది గురుప్రీత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో భారత సంతతికి చెందిన నికిల్ గుప్తా తన నేరాన్ని అంగీకరించినట్లు అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. కాగా ఇదివరకే ఈ కేసులో ఆయనను అమెరికా అధికారులు అరెస్టు చేయగా తాజాగా ఆయన నేరం ఒప్పుకున్నట్లు తెలిపింది. భారత రా విభాగానికి చెందిన ఓ రా అధికారి డైరెక్షన్‌లోని ఆయన ఈ హత్య ప్రణాళిక చేసినట్లు USA ఆరోపిస్తుంది.
అమెరికా న్యాయవిభాగం ప్రకారం ... 2023లో భారత్‌కు చెందిన వికాస్ యాదవ్ అనే అధికారి ఆదేశాల మేరకే నికిల్ గుప్తా, గుర్‌ప్రీత్ సింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. ఆయన కుట్రకు గానూ లక్ష డాలర్లు సుఫారీగా నిర్ణయించారని అందుకు అడ్వాన్స్‌గా 15 వేల డాలర్లు చెల్లించారని అమెరికా అధికారులు పేర్కొన్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నందుకే గుప్తాను అంతమెుందించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. కాగా ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం పిలుపునిస్తూ, హింస, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని భారత్ ఆరోపిస్తున్నట్లు అమెరికా గతంలో పేర్కొంది.
నికిల్ గుప్తా మాన్‌హాటన్‌లోని ఫెడరల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఎదుట తన దోషాన్ని అంగీకరించినట్లు అమెరికా న్యాయ విభాగం ప్రకటించింది. ఈ కేసులో ఆయనకు శిక్ష 2026 మే 29న విధించబడనుంది. గరిష్టంగా 40 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది శిక్షను కోర్టు నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం ఇదివరకే ఖలిస్థానీ ఉగ్రవాది గురుప్రీత్ సింగ్ పన్నూను ఉగ్రవాద నిరోధక చట్టమైన అన్యాయ కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయన సంస్థను సైతం భారత్‌లో బ్యాన్ చేసింది.
అయితే పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని భారత్ తమకు వెల్లడించినట్లు గతంలోనే అమెరికా తెలిపింది. కాగా ఇప్పుడు భారత్ ఏవిధంగా స్పందిస్తోందో వేచి చూడాలి.


