Unitedstate
-
యుఎస్ క్యాపిటల్ హిల్స్ పై అటాక్ ప్లాన్.. కుట్రభగ్నం
అమెరికా భద్రతా సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఒక దుండగుడు తుపాకీతో యుఎస్ క్యాపిటల్ హిల్స్ భవనం వైపు పరుగెత్తుతుండగా అక్కడే ఉన్న క్యాపిటల్ హిల్స్ భద్రత బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవలే అక్కడి శ్వేతసౌధం వద్ద భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిగిన ఘటన మరవక ముందే ఈ ఘటన జరగడం అక్కడ కలకలం రేపింది.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గన్ లైసెన్స్ సులువుగా లభిస్తుండడంతో విచ్చలవిడిగా తుపాకులు పెరిగిపోతుంటాయి. అందుకే అక్కడ తరచుగా కాల్పుల ఘటనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల అక్కడ శ్వేతసౌధం పై దాడి జరిగింది. అక్కడి వైట్ హైస్ దగ్గర ఇటీవలే ఓ గుర్తు తెలియన వ్యక్తి కాల్పులు జరుపగా ఒక సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందారు. మరోకరు గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు మరోసారి క్యాపిటల్ హిల్ పై దాడిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.భద్రతా సిబ్బంది కథనం ప్రకారం.. "యూఎస్ క్యాపిటల్ హిల్స్ కు దగ్గరగా ఒక వ్యక్తి SUV వెహికల్ ఆపారు. ముఖానికి గ్లౌస్ ధరించి, హెల్మెట్ పెట్టుకొని, చేతిలో గన్ పట్టుకొని పరిగెత్తుతూ క్యాపిటల్ హిల్స్ వైపు దూసుకొస్తున్నారు. ఇంతలో మేము అతనని అడ్డుకున్నాం గన్ పడేయాలని కోరాం" అని అన్నారు. అనంతరం అతని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.అయితే ఆ గన్ లో బుల్లెట్స్ ఫుల్ గా లోడ్ చేసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహారించడంతో దాడి ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నారు. అయితే వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు యుఎస్ క్యాపిటల్ హౌస్ లో ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. -
ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కుట్ర.. నేరం ఒప్పుకున్న భారత సంతతి..?
ఖలీస్థాన్ ఉగ్రవాది గురుప్రీత్ సింగ్ పన్నూ హత్య కుట్ర కేసులో భారత సంతతికి చెందిన నికిల్ గుప్తా తన నేరాన్ని అంగీకరించినట్లు అమెరికా న్యాయ విభాగం పేర్కొంది. కాగా ఇదివరకే ఈ కేసులో ఆయనను అమెరికా అధికారులు అరెస్టు చేయగా తాజాగా ఆయన నేరం ఒప్పుకున్నట్లు తెలిపింది. భారత రా విభాగానికి చెందిన ఓ రా అధికారి డైరెక్షన్‌లోని ఆయన ఈ హత్య ప్రణాళిక చేసినట్లు USA ఆరోపిస్తుంది.అమెరికా న్యాయవిభాగం ప్రకారం ... 2023లో భారత్‌కు చెందిన వికాస్ యాదవ్ అనే అధికారి ఆదేశాల మేరకే నికిల్ గుప్తా, గుర్ప్రీత్ సింగ్ హత్యకు కుట్ర పన్నినట్లు అధికారులు తెలిపారు. ఆయన కుట్రకు గానూ లక్ష డాలర్లు సుఫారీగా నిర్ణయించారని అందుకు అడ్వాన్స్‌గా 15 వేల డాలర్లు చెల్లించారని అమెరికా అధికారులు పేర్కొన్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నందుకే గుప్తాను అంతమెుందించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. కాగా ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం కోసం పిలుపునిస్తూ, హింస, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని భారత్ ఆరోపిస్తున్నట్లు అమెరికా గతంలో పేర్కొంది. నికిల్ గుప్తా మాన్హాటన్లోని ఫెడరల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఎదుట తన దోషాన్ని అంగీకరించినట్లు అమెరికా న్యాయ విభాగం ప్రకటించింది. ఈ కేసులో ఆయనకు శిక్ష 2026 మే 29న విధించబడనుంది. గరిష్టంగా 40 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది శిక్షను కోర్టు నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత ప్రభుత్వం ఇదివరకే ఖలిస్థానీ ఉగ్రవాది గురుప్రీత్ సింగ్ పన్నూను ఉగ్రవాద నిరోధక చట్టమైన అన్యాయ కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయన సంస్థను సైతం భారత్‌లో బ్యాన్ చేసింది. అయితే పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని భారత్ తమకు వెల్లడించినట్లు గతంలోనే అమెరికా తెలిపింది. కాగా ఇప్పుడు భారత్ ఏవిధంగా స్పందిస్తోందో వేచి చూడాలి. -
ఎప్స్టీన్ ఫైల్స్ చరిత్ర ఇదే..!
అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ పేరు మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్స్టీన్ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.జెఫ్రీ ఎప్స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్స్టీన్అతనికి సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.ఎప్స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.అసలేంటి ఎప్స్టీన్ ఫైల్స్ ..ఇప్పుడు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది. అయితే వీరిలో చాలా మంది తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.ఎప్స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.మరోవైపు ట్రంప్ మరియు ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. ట్రంప్ పేరు ఈ స్థాయిలో బయటికి రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది రానున్న రోజుల్లో తెలుస్తోంది.అయితే ప్రజలు ఎందుకు ఇంకా ఆసక్తిగా చూస్తున్నారు? కారణం ఒక్కటే — ఇంకా అనేక ప్రశ్నలు సమాధానం లేకుండానే ఉన్నాయి. ఫ్లోరిడాలో ఎప్స్టీన్కు ఎందుకు తేలికైన శిక్ష విధించబడింది? అతని వెనుక మరెవరైనా ఉన్నారా? జైలులో అతని మరణంపై పూర్తిగా స్పష్టత ఉందా?ఎప్స్టీన్ ఫైళ్లు కేవలం ఒక కేసు పత్రాలు కావు. అవి అధికారం, డబ్బు, ప్రభావం, రహస్యాల కలయిక. ప్రతి విడుదల కొత్త పేర్లను తెస్తోంది… కానీ పూర్తి నిజం ఇంకా బయటకు రాలేదు. అసలు ప్రశ్న మాత్రం అదే ..ఇంకా విడుదల కాని పత్రాల్లో ఏముంది? ఇంకా ఎవరి పేర్లు బయటకు రావాల్సి ఉంది?ప్రపంచం ఇంకా ఆ సమాధానాల కోసం ఎదురుచూస్తోంది. -
చైనాకు షాక్.. తైవాన్‌తో యుఎస్ భారీ డీల్
చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోన్న వేళ వాషింగ్టన్, డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చింది. తైవాన్‌తో 11బిలియన్ డాలర్ల భారీ డీల్ చేసుకుంది. ఒక ద్వీపానికి ఇంత పెద్దమెుత్తంలో ఆయుధాలు అమ్మడం యూఎస్ చరిత్రలో ఇదే తొలిసారని ఆదేశ వర్గాలు తెలిపాయి. ఈడీల్తో చైనా-యుఎస్ మధ్య సంబంధాలు మరోసారి భగ్గుమనే అవకాశాలున్నాయని అంతా భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాడు. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ సమయంలో పన్నులు పెంచుతాడో తెలియక ప్రపంచ దేశాలు తలపట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో డ్రాగన్ కంట్రీతో ట్రేడ్ వార్‌కు దిగారు. ఈ పన్నుల యుద్ధం కొంత తగ్గి ఇప్పుడిప్పుడే రెండు దేశాల బంధాలు కొలిక్కి వస్తన్నాయనే తరుణంలో ట్రంప్ మరో బాంబు పేల్చారు.చైనా తమ భూభాగంగా ప్రకటిస్తున్న తైవాన్‌తో, అమెరికా, 11 బిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రి అమ్మకానికి ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌లో ఆధునాతన రాకెట్ సిస్టమ్స్, యాంటీ టాంక్ మిస్సైల్స్, డ్రోన్స్ లాంటి అధునాతన ఆయుధ సామాగ్రి ఉన్నట్లు పెంటగాన్ ప్రకటించింది. తైవాన్ తన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ ఒప్పందం ఎంతగానో సహకరిస్తుందని యుఎస్ తెలిపింది.ఈ భారీ ఒప్పందంపై తైవాన్ స్పందించింది. తమకు ఇంత భారీ మెుత్తంలో ఆయుధ సరఫరా చేస్తున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలని తైవాన్ అధికారులు తెలిపారు. తన జాతీయ భద్రతను కాపాడడంలో ఎటువంటి రాజీపడేది లేదని వారు ప్రకటించారు. ఇటీవలే ఆయుధ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి 40 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ ప్రకటించినట్లు తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని చైనా ఖండించింది. ఈ ఆయుధాల ఒప్పందంతో తైవాన్‌లో శాంతి, స్థిరత్వం దెబ్బతింటాయని తెలిపింది.చైనా దేశం తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమే అని ఆరోపిస్తుంది. అయితే తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర పరిపాలన ప్రాంతంగా ప్రకటించుకుంటుంది. ఈ నేపథ్యంలో తరచుగా వివాదం చెలరేగుతుంది. -
భారత్‌పై గౌరవం పెరిగింది
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో ప్రపంచం దృష్టిలో భారత్ గౌరవం మరింతగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దాదాపు వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ప్రధాని భారత్ తిరిగివచ్చారు. విమానాశ్రయానికి భారీగా తరలివచి్చన బీజేపీ కార్యకర్తలు మోదీకి ఘనస్వాగతం పలికారు. వారిని ఉద్దేశించి విమానాశ్రయం వెలుపల మోదీ కాసేపు మాట్లాడారు. ‘2014లోనూ అమెరికా వెళ్లాను. ఐరాస సమావేశాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు కూడా వెళ్లాను. ఈ ఐదేళ్లలో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో భారీ మార్పు చూశాను. భారత్ అంటే ఆసక్తి, గౌరవం మరింత పెరిగాయి’ అన్నారు. హ్యూస్టన్‌లో అట్టహాసంగా జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పలువురు డెమొక్రాట్, రిపబ్లికన్ పారీ్టల నేతలు హాజరుకావడాన్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రవాస భారతీయుల ఉత్సాహం తననెంతో ఆకర్షించిందన్నారు. మూడేళ్ల క్రితం పాక్ ఆక్రమిత కశీ్మర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా మోదీ గుర్తు చేసుకున్నారు. ‘మూడేళ్ల క్రితం నాటి ఈ రోజును మర్చిపోలేను. ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఆ రాత్రంతా నిద్రపోలేదు’ అన్నారు. భారతీయులను గర్వపడేలా చేసిన భారతీయ సైనికుల సాహసానికి గుర్తుగా ఆ రోజు నిలిచిపోతుందన్నారు. భారత్‌కు బయల్దేరే ముందు అమెరికన్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరిచ్చిన ఘన స్వాగతం, ప్రేమ, ఆతిథ్యాలను మర్చిపోలేను’ అన్నారు. తాను పాల్గొన్న వివిధ కార్యక్రమాలు భారత్ పురోభివృద్ధికి తోడ్పడతాయని ఆశిస్తున్నానన్నారు. అమెరికా పర్యటనలో కొన్ని విశేషాలు.. ►ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో (యూఎన్జీఏ) కశ్మీర్ అంశంపై మాట్లాడేం దుకు మోదీ నిరాకరించారు. ఈ సమస్య అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేది కాదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. భారత్ అభివృద్ధి గురించే మోదీ ప్రస్తావించారు. ►ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని పిలుపునిచ్చారే తప్ప పాక్ గురించికానీ, కశ్మీర్ గురించి కానీ యూఎన్జీఏ సదస్సులో ప్రస్తావించలేదు. ►పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రపంచం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలనే ప్రస్తావించి యూఎన్జీఏ సదస్సులో మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. ►పసిఫిక్ ఐలాండ్ దేశాలు, కరేబియన్ దేశాలు న్యూజిలాండ్, ఇరాన్ వంటి ఎన్నో దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ►హ్యూస్టన్‌లో గ్లోబల్ కంపెనీల సీఈఓలను కలుసుకొని భారత్‌కు పెట్టుబడులు వచ్చేలా మార్గాలు వేశారు. 500 కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయి. ►హ్యూస్టన్‌లో టెల్లూరియన్, పెట్రోనెట్ మధ్య కుదిరిన చారిత్రక ఇంధన ఒప్పందంతో భారతీయులకు భారీగా ఉద్యోగాలు కల్పించే అవకాశం కలిగింది. ►హౌడీ–మోదీ’ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ హాజరుకావడం ద్వారా రెండు దేశాల మధ్య మైత్రి మరింత పటిష్టమైంది.


