అమెరికా భద్రతా సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఒక దుండగుడు తుపాకీతో యుఎస్ క్యాపిటల్ హిల్స్ భవనం వైపు పరుగెత్తుతుండగా అక్కడే ఉన్న క్యాపిటల్ హిల్స్ భద్రత బలగాలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. ఇటీవలే అక్కడి శ్వేతసౌధం వద్ద భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిగిన ఘటన మరవక ముందే ఈ ఘటన జరగడం అక్కడ కలకలం రేపింది.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గన్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గన్ లైసెన్స్ సులువుగా లభిస్తుండడంతో విచ్చలవిడిగా తుపాకులు పెరిగిపోతుంటాయి. అందుకే అక్కడ తరచుగా కాల్పుల ఘటనలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల అక్కడ శ్వేతసౌధం పై దాడి జరిగింది. అక్కడి వైట్ హైస్ దగ్గర ఇటీవలే ఓ గుర్తు తెలియన వ్యక్తి కాల్పులు జరుపగా ఒక సెక్యూరిటీ సిబ్బంది మృతిచెందారు. మరోకరు గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు మరోసారి క్యాపిటల్ హిల్ పై దాడిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.
భద్రతా సిబ్బంది కథనం ప్రకారం.. "యూఎస్ క్యాపిటల్ హిల్స్ కు దగ్గరగా ఒక వ్యక్తి SUV వెహికల్ ఆపారు. ముఖానికి గ్లౌస్ ధరించి, హెల్మెట్ పెట్టుకొని, చేతిలో గన్ పట్టుకొని పరిగెత్తుతూ క్యాపిటల్ హిల్స్ వైపు దూసుకొస్తున్నారు. ఇంతలో మేము అతనని అడ్డుకున్నాం గన్ పడేయాలని కోరాం" అని అన్నారు. అనంతరం అతని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే ఆ గన్ లో బుల్లెట్స్ ఫుల్ గా లోడ్ చేసి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహారించడంతో దాడి ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నారు. అయితే వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు యుఎస్ క్యాపిటల్ హౌస్ లో ప్రసంగం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు.


