డ్రగ్స్ బోట్ల‌పై అమెరికా సైన్యం దాడి.. 11 మంది మృతి | US strikes 3 suspected drug-trafficking boats in Pacific and Caribbean | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ బోట్ల‌పై అమెరికా సైన్యం దాడి.. 11 మంది మృతి

Feb 18 2026 2:24 AM | Updated on Feb 18 2026 2:24 AM

US strikes 3 suspected drug-trafficking boats in Pacific and Caribbean

డ్రగ్స్ ముఠాలను అంతమొందించేందుకు యుద్దం చేస్తున్న అమెరికా.. తమ దాడుల‌ను మరింత ఉధృతం చేసింది. లాటిన్ అమెరికా తీరప్రాంత జలాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న‌ మూడు డ్రగ్స్ స్మగ్లింగ్ నౌకలపై అమెరికా సైన్యం సోమవారం క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మంది మరణించారు. 

ఈ విషయాన్ని యుఎస్ సదరన్ కమాండ్ ధ్రువీక‌రించింది. ఈ దాడులు తూర్పు పసిఫిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రంలో జరిగాయి. పసిఫిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై జరిగిన దాడిలో ఎనిమిది మంది, కరేబియన్ సముద్రంలో ఒక నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఈ ఆపరేషన్లలో అమెరికా సైనికులకు ఎవరూ గాయపడలేదని యుఎస్ సదరన్ కమాండ్ తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత సెప్టెంబర్ నుంచి మాదకద్రవ్యాల ముఠాలపై యుద్దాన్ని ప్ర‌క‌టించారు. ఈ స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ వ‌ల్ల ఇప్పటివరకు దాదాపు 145 మంది అనుమానిత స్మగ్లర్లు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అప‌రేష‌న్స్‌పై అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ స్పందించారు. 

"ట్రంప్ అధ్యక్షతన డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడం సురక్షితం కాదు" అని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. అయితే ఈ దాడులపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ నౌకల్లో నిజంగా డ్రగ్స్ ఉన్నాయా లేదా అనే విషయంలో సైన్యం స్పష్టమైన ఆధారాలను బ‌హిర్గ‌తం చేయ‌డం లేద‌న్న విమర్శలు వస్తున్నాయి
 

Advertisement
 
Advertisement
Advertisement