Warangal
-
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిభావంతులు
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండ: ప్రైవేట్ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రతిభావంతులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన టాప్ ర్యాంకర్లకు ఆదివారం రూ.10 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడినని, ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకున్నానని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఐపీఎస్ అధికారిగా విజయం సాధించానని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం తన నియోజకవర్గంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలకు రూ.10 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘స్ఫూర్తి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రజాప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్య నాయుడు, జిల్లా సైనన్స్ అధికారి శ్రీనివాస్ రావు, ఏసీజీఈ అరుణ పాల్గొన్నారు. -
హౌస్ లిస్టింగ్‌ను వేగవంతం చేయాలి
వరంగల్ అర్బన్: జనగణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను వేగంగా, సమర్థవంతంగా పూర్తిచేయాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సూచించారు. కాజీపేట పరిధి నక్కలగుట్ట, వరంగల్‌లోని కాశిబుగ్గ జీడబ్ల్యూఎంసీ సర్కిల్ కార్యాలయాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. జనగణన వివరాల సేకరణ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో నమోదవుతున్న వివరాలు, డేటా ఎంట్రీ పురోగతి, సిబ్బంది పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో ప్రతీ ఇంటి వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని సూచించారు. ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చే సేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్ర సన్నారాణి, అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ -
బినామీ కొలువులు!
రెగ్యులర్ కార్మికుల స్థానంలో ఇతరుల విధులువరంగల్ అర్బన్: నగరం పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకం. వీరిలో కొందరు విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్ల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. దీనికి తోడు శాశ్వత ప్రాతిపదికన పనిచేసే కొందరు పారిశుద్ధ్య కార్మికులు తమ స్థానంలో మరొకరిని నియమించుకుని పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పాలకవర్గం లేదు. రెగ్యులర్ కమిషనర్ లేరు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాలో ఉన్నట్లు సమాచారం. ప్రజారోగ్యం వదిలి ఇతర విభాగాలకు.. బల్దియా ప్రజారోగ్య విభాగంలో మొత్తం 2,667 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 30 శాతం మంది ఆ విభాగాన్ని వదిలి ఇతర విభాగాలకు వెళ్తున్నారు. కానీ, ప్రతీనెలా వీరికి బల్దియా పక్కాగా వేతనాలు అందిస్తోంది. కొందరు కార్మికులు కార్యాలయాల్లో, సర్కిల్ ఆఫీస్, వార్డు కార్యాలయాల్లో ఆఫీస్ సబార్డినేటర్లుగా చేరి టీ, కాఫీలు అందిస్తున్నారు. ఇంకొందరు వార్డు ఆఫీసర్లకు, బిల్ కలెక్టర్లకు సహాయకులుగా పనిచేస్తున్నారు. మరికొందరు ప్లాస్టిక్ కవర్ల నిషేధం, డంప్ యార్డు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు సవ్యంగా సాగడం లేదు. వాస్తవానికి కార్మికులు ఎక్కడి వారు అక్కడ పనిచేస్తే సమస్యలు ఉత్పన్నం కావు. పారిశుద్ధ్య విభాగంలో కొందరు మరో విభాగానికి వెళ్లి పోతుండడంతో నగరంలో పలు డివిజన్లలో పారిశుద్ధ్య విభాగంపై ప్రభావం పడుతోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పని కార్మికుల కొరత ఉందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికుల లెక్కలు పూర్తిగా వెలికి తీస్తే వాస్తవంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఆ సహసం చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఒకరి బదులు మరొకరు.. గ్రేటర్లో పర్మనెంట్ పారిశుద్ధ్య కార్మికులు 167 మంది ఉన్నారు. అందులో 70 శాతం మంది కేవలం ఉదయం వేళ ఫేస్ మొబైల్ యాప్‌లో అటెండెన్స్ వేసి ఇంటి ముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి సీనియార్టీ ప్రకారం.. నెలకు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు వేతనాలు అందుతున్నాయి. వీరిలో 70 శాతం మంది పనులకు వెళ్లకుండా వేరొకరిని ఏర్పాటు చేసుకుని నెలవారీ శానిటరీ ఇన్స్పెక్టర్లకు, జవాన్లకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వేతనం ఇస్తున్నట్లు సమాచారం. అనారోగ్యం తదితర కారణాల వల్ల బదిలీ కార్మికుడితో పనిచేయిస్తూ వారికి నెలకు రూ.8 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరు తూతూమంత్రంగా పనిచేస్తున్నట్లు విమర్శలున్నాయి. దీంతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేయకుండా బదిలీ కార్మికులను నియమిస్తే ఒక్కో శానిటరీ ఇన్స్పెక్టర్లకు రూ.6వేల నుంచి రూ.8వేల వరకు నెలవారీ మామూళ్లను ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇక జవాన్లు తామేం తక్కువంటూ రెగ్యులర్ కార్మికుల నుంచి రూ.వెయ్యి చొప్పున దండుకుంటున్నట్లు విమర్శలున్నాయి. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో బదిలీ కార్మికుడిని నియమిస్తే శానిటరీ ఇన్స్పెక్టర్కు రూ.2వేలు, జవాన్‌కు రూ.వెయ్యి చొప్పున ముట్టచెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈవిషయమై బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. డిప్యుటేషన్‌పై, బినామీ కార్మికులుగా పనిచేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకు నెలకు రూ.8 వేలు ఇస్తున్నట్లు ఆరోపణలు సహకరించినందుకు శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్ల వసూళ్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్టారాజ్యం -
జనగణనలో బాధ్యతాయుతంగా పాల్గొనాలి
వర్ధన్నపేట: జనగణన.. దేశ భవిష్యత్, అభివృద్ధికి బలమైన పునాది అని, జనగణనలో ప్రతీ పౌరుడు బాధ్యతాయుతంగా పాల్గొనాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద అన్నారు. పట్టణ కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు జనగణన అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారదతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జనాభా గణన కేవలం లెక్కలు సేకరించే ప్రక్రియ మాత్రమే కాదని, దేశ భవిష్యత్, అభివృద్ధికి దిశానిర్దేశం చేసే మహత్తర కార్యక్రమం అని గుర్తుచేశారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సెన్సస్ ద్వారా లభించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అవగాహన ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ ఖన్నా, వైస్ చైర్మన్ నేతావత్ శీభారాణి రాజేందర్, కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, నూనావత్ కమ్లి కీమా, మాలోతు దేవేందర్, వాణి కుమారస్వామి, నాయకులు రవి, సురేష్, సత్యనారాయణ, దామోదర్, వెంకన్న, సర్పంచ్, మహిళలు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద -
మాక్‌డ్రిల్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
ఖిలా వరంగల్: వివిధ శాఖల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్ పార్కు ప్రాంగణం గుండు చెరువులో వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాక్‌డ్రిల్ జరగనుంది. ఈ మేరకు మాక్‌డ్రిల్ ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద ఆదివారం సాయంత్రం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరెల్లి బుచ్చయ్య స్కూల్లో పునరావాస కేంద్రం, హెల్త్ క్యాంపు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. వరదల సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సహాయక చర్యలు, వైద్య సేవలు, తాగునీరు, ఆహార సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాని సూచించారు. మాక్ డ్రిల్ నిర్వహణలో పాల్గొనే రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్యం, విద్యుత్, ఆర్అండ్బీ, మున్సిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వేగవంతమైన స్పందన, ప్రజలకు రక్షణ, శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
వసతులు కరువు
కొనుగోలు కేంద్రాల్లో కానరాని సదుపాయాలుధాన్యం కొనుగోళ్ల వివరాలు (మెట్రిక్ టన్నుల్లో..) ధాన్యం సేకరణ లక్ష్యం: 1,93,000ఇప్పటివరకు కొన్నది: 37,387మిల్లులకు తరలించినది: 34,862మిల్లర్లు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది: 19,818ఇప్పటివరకు రైతులకు చెల్లించిన మొత్తం: రూ.44.35 కోట్లుదుగ్గొండి మండలం మందపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో గిర్నిబావిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ఆదివారం ప్రారంభమైంది. రైతులు వారం రోజుల క్రితమే ధాన్యాన్ని ఆరబోసి ఎండబోశారు. రైతులకు నీడ వసతి కోసం టెంట్ ఏర్పాటు చేశారు. అయితే, తాగేందుకు మాత్రం నీరు అందుబాటులో లేదు. అలాగే, సరిపడా టార్పాలిన్లు కూడా లేవు.సాక్షి, వరంగల్: జిల్లాలోని 233 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘ఫస్ట్ ఎయిడ్ కిట్’ సమకూర్చాలనే డిమాండ్ ఇటు రైతులు, అటు హమాలీల నుంచి వినిపిస్తోంది. ఎండను ఓర్చుకుంటూ ధాన్యం ఆరబెట్టడం, బస్తాలు మోయడం వంటి పనుల్లో గాయాలు కావడం, వడదెబ్బ తగిలినప్పుడు తక్షణ వైద్య సహాయం అందక వారు అస్వస్థతకు గురవుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజు ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం ద్వారా కాస్త ఉపశమనం కలుగనుంది. వీలైతే ఏఎన్ఎంల సేవలను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులోకి తీసుకొస్తే తక్షణ వైద్య సహాయం అందేందుకు ఆస్కారముంటుందనే డిమాండ్ వస్తోంది. ఆందోళనలో రైతులు కొన్ని కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు, షామియానాలు ఉన్నప్పటికీ మరికొన్ని కేంద్రాల్లో నీడ లేక రైతులు, హమాలీలు ఎండ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. తాగునీరు అందుబాటులో లేకపోవడంతో అల్లాడుతున్నారు. నెక్కొండ మండలం అలంకానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గాజుల పెద్ద వెంకటేశ్వర్లు (65) ధాన్యం కుప్ప వద్ద గుండెపోటుతో మరణించడంతో రైతులు, హమాలీల అవస్థలు చర్చకు వచ్చాయి. వర్షం వస్తే ధాన్యం రాశులపై కప్పేందుకు టార్పాలిన్లు, ధాన్యం నింపేందుకు గోనె సంచుల లభ్యత డిమాండ్‌కు తగ్గట్టుగా లేకపోవడంతో కాంటాలు ఆలస్యమవుతోందని రైతుల్లో ఆందోళన నెలకొంది. మరో కొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కానుండడంతో వర్షం వస్తే ఇబ్బందులొస్తాయని, సాధ్యమైనంత తొందరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. నీడ ఉంది కానీ.. నీరు లేదు రైతులు, హమాలీలకు వడదెబ్బ భయం అందుబాటులో లేని ఫస్ట్ ఎయిడ్ కిట్, ఏఎన్ఎం సేవలుప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..? పంట ఉత్పత్తులు అమ్ముకోవడానికి అష్టకష్టాలు అలంకానిపేట కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో రైతు మృతినర్సంపేట: పంటలను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇన్ని రోజులు మక్కలు అమ్ముకోవడానికి రోజుల తరబడి కష్టపడ్డ రైతులు ఇప్పుడు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మక్కలకు ప్రభుత్వం మద్దతు ధర రూ.2,400 ప్రకటించడంతో కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా, నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొని మార్క్‌ఫెడ్‌కు అమ్ముకుని రెండు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క రైతుకు కూడా సరిపడా డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎండ వేడిమితో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సి రావడంతో గుండెపోట్లకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలంలోని అలంకానిపేట గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు.. గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోస్తుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో ఆదివారం మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నిలిపింది. నెల రోజులుగా మార్కెట్లో ఎదురుచూశా నాకున్న నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. వచ్చిన దిగుబడిని అమ్ముకునేందుకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో నెల రోజులుగా పడిగాపులు కాశా. తాజాగా కాంటా కాగా, బస్తాల్లో నింపా. – పెండ్లి మోహన్, అశోక్‌నగర్ -
కేఎంటీపీ ఆర్ఓబీ నిధులు పక్కదారి
కిలోమీటరు ఫోర్‌లేన్ ఆర్ఓబీ పనులకు రూ.67.70 కోట్లు మంజూరు● రైల్వే నిధులను వాడుకున్న రాష్ట్ర సర్కారు ● ఫలితంగా ఆలస్యమవుతున్న పనులు గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ – సంగెం మండలాల పరిధిలోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)కు సరుకు రవాణా వాహనాల రాకపోకల కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులకు గ్రహణం పట్టింది. ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వేశాఖ నిధులను మంజూరు చేసి రాష్ట్రానికి బదలాయించగా, వాటిని రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్ఓబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2017, అక్టోబర్ 22న కేఎంటీపీ పనులకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అప్పుడే కేఎంటీపీకి రవాణా మార్గాలను మెరుగుపర్చడానికి ఆర్ఓబీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత రైల్వే శాఖ ఆర్ఓబీ నిర్మాణానికి రూ.67.70 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించింది. దాంతో నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు. పనులు చేపట్టే బాధ్యతను ఆర్‌అండ్‌బీకి అప్పగించగా 2023, జూలై 31న పనులకు ఒప్పందం ఖరారైంది. ఆ తర్వాత సదరు కాంట్రాక్టర్ పనులను ప్రారంభించగా, సంబంధిత అధికారులు రెండేళ్లలో పూర్తి చేయాలని ఆదేశించారు. సుమారు రూ.33 కోట్ల మేర పనులు చేయగా రాష్ట్ర సర్కారు నుంచి బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ వాపోతున్నాడు. ఆర్ఓబీకి కేటాయించిన నిధులను వేరే అవసరాలకు ప్రభుత్వం మళ్లించడంతో పనులకు గ్రహణం పట్టినట్లైంది, నిధులను సకాలంలో విడుదల చేస్తే నాలుగు నెలల్లో పనులను పూర్తి చేస్తామని సదరు కాంట్రాక్టర్ చెబుతున్నాడు. పనులను పరిశీలించిన కలెక్టర్ ఇటీవల ఆర్ఓబీ నిర్మాణ పనులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. బిల్లులు మంజూరు కావడం లేదని, నిర్మాణ పనుల కోసం మట్టి (మొరం) లభించడం లేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆమె వెంటనే స్పందించి శాయంపేట హవేలిలోని ఊర చెరువు నుంచి మట్టిని తీసుకెళ్లాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొందరు మట్టి తరలింపు పనులను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఆర్ఓబీతో ఎంతో ప్రయోజనం ఆర్ఓబీని ఫోర్ లేన్‌గా రైల్వే ట్రాక్‌లపై నుంచి కిలోమీటరు పొడవులో ఇరువైపులా నిర్మిస్తున్నారు. రెండు లేన్లు కలిపి ఒక రోడ్డు.. ఇలా నాలుగు లేన్లకు రెండు రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు. రెండు లేన్ల రోడ్డు 30 అడుగుల వెడల్పుతో ఉండి భారీ వాహనాలు అటు, ఇటు వెళ్లేంత వీలుగా ఉంటుంది. నిర్మాణం పూర్తైతే కేఎంటీపీకి ముడిసరుకుల చేరవేత, తయారైన దుస్తుల కంటెయినర్లు, ఇతర వస్తువుల రవాణా సులభతరం కానుంది. అలాగే, గీసుకొండ – సంగెం మండలాల ప్రజలకు ఇది వారధిగా మారనుంది. రైల్వే గేట్లతో ఇబ్బందులు తొలగి బ్రిడ్జిపై నుంచి సులభంగా రాకపోకలను సాగించవచ్చు. కాజీపేట – విజయవాడ రైలు మార్గంలో శాయంపేట రైల్వే గేట్ (ఎల్సీ 66), దానికి కొంతదూరంలో చింతలపల్లి రైల్వే గేట్ (ఎల్సీ 67)ల మధ్య ఆర్ఓబీని నిర్మిస్తున్నారు. నిర్మాణం పూర్తైతే గ్రీన్‌ఫీల్డ్ హైవే నుంచి వెళ్లే వాహనాలకు ఆర్ఓబీ లింక్‌గా మారనుంది. వరంగల్ – నర్సంపేట రహదారికి ట్రాఫిక్ దృష్ట్యా ప్రాధాన్యం పెరగనుంది. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని గీసుకొండ, సంగెం మండలాల ప్రజలు కోరుతున్నారు. పనుల విషయమై ఆర్అండ్బీ డీఈ దేవికను వివరణ కోరగా.. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తి అయ్యాయని, మరో రెండు నెలల్లో మిగతా పనులు పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. -
ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలి
కాజీపేట అర్బన్: ముదిరాజ్‌లు రాజకీయంగా ఎదగాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ సూచించారు. హంటర్‌రోడ్డులోని లయన్స్‌క్లబ్ హాల్లో పొన్నం మొగిలి అధ్యక్షతన ముదిరాజ్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ల సన్మానంతో పాటు ఉగాది డైరీని ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండా ప్రకాశ్ హాజరై మాట్లాడుతూ ముదిరాజ్‌లు పదవులు వదులుకోవద్దని సూచించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ద్వారానే హైదరాబాద్‌లో ముదిరాజ్‌ల ఆత్మగౌరవ భవనానికి స్థలం, నిధులు మంజూరు చేయించామన్నారు. బీసీ–డీ నుంచి బీసీ–ఏలో చేర్చాలనే పోరాటంలో ముది రాజ్‌లు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల వెంకటనర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ జిల్లా మత్స్యశాఖ చీఫ్ ప్రమోటర్ చొప్పరి సోమయ్య, రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ శానబోయిన రాజ్‌కుమార్, జిల్లా మహాసభ ప్రధాన కార్యదర్శి నీరటి సదానందం, నాయకులు సోమయ్య, బుస్సా మల్లేశం, బయ్య స్వామి, పులి రజినీకాంత్, పోలు అయర్ చంద్, గోనెల పద్మ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ -
మాక్‌డ్రిల్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: వివిధ శాఖల ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. మధ్యకోటలోని ఏకశిల చిల్డ్రన్స్ పార్కు ప్రాంగణం, గుండు చెరువులో వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాక్‌డ్రిల్ జరగనుంది. ఈ మేరకు మాక్‌డ్రిల్ ఏర్పాట్లను కలెక్టర్ సత్యశారద ఆదివారం సాయంత్రం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరెల్లి బుచ్చయ్య స్కూల్లో పునరావాస కేంద్రం, హెల్త్ క్యాంపు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. వరదల సమయంలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సహాయక చర్యలు, వైద్య సేవలు, తాగునీరు, ఆహార సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలని సూచించారు. మాక్ డ్రిల్ నిర్వహణలో పాల్గొనే రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్యం, విద్యుత్, ఆర్అండ్బీ, మున్సిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో వేగవంతమైన స్పందన, ప్రజలకు రక్షణ, శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నేటి ‘గ్రేటర్’ గ్రీవెన్స్ రద్దు
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) జరిగే గ్రీవెన్స్ సెల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రత్యేకాధికారి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మాక్ ఎక్సర్సైజ్ (మాక్ డ్రిల్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగనున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని వివరించే మాక్ ఎక్సర్సైజ్ (డ్రిల్)ను నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నందున గ్రీవెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో యువతలో నైపుణ్యాభివృద్ధి, శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు యువజన క్రీడా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఉచిత శిక్షణ కోసం పరీక్షన్యూశాయంపేట: నిరుపేద మైనార్టీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించేందుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హనుమకొండ కుమార్‌పల్లి మార్కెట్ హైస్కూల్, వరంగల్ జిల్లా వారికి సుఫా హైస్కూల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. సుమారు 160 మంది దరఖాస్తులు సమర్పించినట్లు శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ ఫ్యాకల్టీలు తెలిపారు. కాగా, 140 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు ఫర్హానా తబస్సుమ్, ఆసిఫ్అఫ్జల్ తెలిపారు. ఖిలా వరంగల్: ఓరుగల్లు వీరత్వానికి పురిటిగడ్డ అని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, సినీగేయ రచయిత కాసర్ల శ్యాం, ఓయూ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఖిలా వరంగల్ ఖుష్‌మహల్ ప్రాంగణంలో చేతనే కళావేదిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల నాగేశ్వర్ ఆధ్వర్యంలో కాకతీయ కళాజాతర ఉత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ నేల చారిత్రక వైభవంతోపాటు కళలు, సాహిత్యం, జానపద సంప్రదాయాలకు చిరునామాగా నిలిచిందని చెప్పారు. కాకతీయుల వారసత్వాన్ని కొనసాగించడం ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. గేయ రచయిత శ్రీనివాస్, గందె నవీన్, ఎడ్ల అశోక్‌రెడ్డి, పుల్లారావు, గోకారపు శ్యాం, సంగీత దర్శకుడు కార్తీక్, గాయకుడు కొల్లూరి యోగానంద్, కళాకారులు పాల్గొన్నారు. -
ఖర్చులను నియంత్రించుకోవాలి
ఖిలా వరంగల్: వినియోగదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఖర్చులను నియంత్రించుకోవాలని వినియోగదారుల దక్షిణాది రాష్ట్రాల సమన్వయ సమితి ఇన్చార్జ్ చైర్మన్, కార్యదర్శి మొగిలిచర్ల సుదర్శన్ సూచించారు. వరంగల్ శివనగర్‌లోని వినియోగదారుల సమాఖ్య ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఆర్.ఆనందరావు అధ్యక్షతన ఆది వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచ ఆందోళనకర పరిస్థితుల ప్రభావం ప్రతి వినియోగదారుడిపై ఉంటుందని, ఖర్చుపై ప్రణాళికాబద్ధమైన నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. జంక్‌ఫుడ్, ఇతర హోటల్ వంటకాలతో వచ్చే రోగాలపై మహిళలకు అవగాహన కల్పించాలని సుదర్శన్ కోరారు. అనంతరం దక్షిణాది రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తుల వ్యాట్‌ను తగ్గించాలని తీర్మానం చేశారు. జిల్లా ప్రతినిధులు లక్ష్మీనారా యణ, ఫజలుద్దీన్ అహ్మద్, రవికిరణ్, రామకృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు -
బదిలీల భయం
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్‌లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం.. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది. ఇక్కడే తిష్ట.. ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బదిలీలు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రావాలన్నా.. పోవాలన్నా భయమే! ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికారుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్చార్జ్గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ గోపాల్‌రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సీటీలో కూడా పనిచేశారు. అయితే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులకు స్థానచలనం తప్పదా? ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్ -
కార్మికులను ఆదుకోవాలి
కాశిబుగ్గ: ఎంజీఎంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సూపర్వైజర్ వర్కర్లు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య అన్నారు. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు అధ్యక్షతన ఆదివారం ఎంజీఎంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు తమ పొట్ట గొడుతూ జేబులు నింపుకుంటున్నారని ఆరో పించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంజీఎం హాస్పిటల్ కార్మికులు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గొర్రె నాగరాజు, అధ్యక్షుడిగా విజయ్, ఉపాధ్యక్షులుగా రాజేష్, అరుణ్‌కుమార్, భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా లక్ష్మణ్, ఆనందం, శ్రీనివాస్, కమల, కోశాధికారిగా పవన్, రాజవీరు, లలిత, ప్రచార కార్యదర్శులుగా లింగమూర్తి, కరుణ, కిరణ్, సలహాదారులుగా స్వరూప, రమేష్, ఇందిర, సభ్యులను ఎన్నుకున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు రెస్క్యూ బృందాల పనితీరు విధానాన్ని వివరించే మాక్ ఎక్సర్సైజ్ (డ్రిల్)ను ఖిలా వరంగల్ గుండు చెరువు వద్ద నిర్వహిస్తున్నందున గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ‘గ్రేటర్’ గ్రీవెన్స్ కూడా.. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం(నేడు) జరిగే గ్రీవెన్స్ సెల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రత్యేకాధికారి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో వివిధ శాఖలు సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలు, రెస్క్యూ బృందాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మాక్ ఎక్సర్సైజ్ (మాక్ డ్రిల్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ జరుగనున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఉచిత శిక్షణ కోసం పరీక్షన్యూశాయంపేట: నిరుపేద మైనారిటీ విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించేందుకు రాష్ట్ర ఉర్దూ అకాడమీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హనుమకొండ కుమార్‌పల్లి మార్కెట్ హైస్కూల్, వరంగల్ జిల్లా వారికి సుఫా హైస్కూల్లో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. సుమారు 160 మంది దరఖాస్తులు సమర్పించినట్లు శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ ఫ్యాకల్టీలు తెలిపారు. కాగా, 140 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాసినట్లు ఫర్హానా తబస్సుమ్, ఆసిఫ్అఫ్జల్ తెలిపారు. ప్రమాదవశాత్తు ఆయిల్‌పామ్ తోట దగ్ధం పర్వతగిరి: మండలంలోని అన్నారం శివారులో నూనావత్ బిక్కుకు చెందిన నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్ తోట దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయపర్తి మండలం సూర్యతండాకు చెందిన రైతు బిక్కుకు పర్వతగిరి మండలం అన్నారం శివారులో ఆయిల్‌పామ్ తోట ఉంది. ఆదివారం మధ్యాహ్నం అన్నారం గ్రామానికి చెందిన రైతు గొడుగు సారయ్యకు చెందిన మొక్కజొన్న చేనులో ఏర్పడిన మంటలు వేగంగా సుమారు రెండు కిలో మీటర్ల మేర వ్యాపించాయి. దాంతో ఆయిల్‌పామ్ తోటలోని 215 చెట్లు, డ్రిప్ పైపులు, స్టార్టర్ మోటార్లతో సహా బిందు సేద్యం పరికరాలు కాలిపోయాయి. ఈ ఘటనతో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు. ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీలో ప్రజ్వలకు మాస్టర్స్ పట్టా నర్సంపేట: అమెరికా న్యూజెర్సీలోని ప్రఖ్యాత సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో నర్సంపేట పట్టణానికి చెందిన పెద్దారపు ప్రజ్వల పాల్గొని ప్రతిభ కనబర్చి మాస్టర్స్ పట్టా సాధించారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ చేతుల మీదుగా పట్టా అందుకుంది. దీంతో ప్రజ్వల తల్లిదండ్రులు పెద్దారపు రమేష్ – రాధ, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజ్వల ఏడో తరగతి వరకు నర్సంపేటలో, ఇంటర్ వరకు వరంగల్‌లో, ఫోరెన్సిక్ గ్రాడ్యుయేషన్ ఉత్తరప్రదేశ్ మధుర లో అభ్యసించారు. అనంతరం, ఫోరెన్సిక్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికాలోని న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ అడ్మిషన్ ఇవ్వగా, ప్రజ్వల ప్రతిభ కనబర్చి మాస్టర్స్ పట్టా సాధించిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతిభావంతులు
హన్మకొండ: ప్రైవేట్ విద్యాసంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రతిభావంతులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన టాప్ ర్యాంకర్లకు ఆదివారం రూ.10 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కుమారుడినని, ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకున్నానని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఐపీఎస్ అధికారిగా విజయం సాధించానని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం తన నియోజకవర్గంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలకు రూ.10 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ‘స్ఫూర్తి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని గుర్తు చేశారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, డీఈఓ రంగయ్య నాయుడు, జిల్లా సైనన్స్ అధికారి శ్రీనివాస్ రావు, ఏసీజీఈ అరుణ పాల్గొన్నారు. -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
మాక్ ఎక్సర్సైజ్ పకడ్బందీగా నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: రెవెన్యూ, పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో ఈనెల 18న మాక్ ఎక్సర్సైజ్ను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వివిధ శాఖల సమన్వయంతో రక్షణ, సహాయక చర్యలు ఎలా చేపడతామో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ నగర పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ ఫేజ్–2, వివేక్‌నగర్, సమ్మయ్యనగర్, ప్రగతినగర్, గోపాలపూర్, టీవీటవర్ కాలనీ, యూపీహెచ్సీ లష్కర్‌సింగారం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించే ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు అవగాహన కల్పించాలని, బల్దియా స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. డీఆర్వో కె.శ్రీనివాస్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఎంహెచ్ఓ అప్పయ్య, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కళలు, క్రీడల్లోనూ రాణించాలి విద్యారణ్యపురి: విద్యార్థులు చదువుతోపాటు కళలు, క్రీడల్లోను రాణించాలని కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ సూచించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ స్కూల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల విద్యార్థులకు ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్డే నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్, క్రాఫ్ట్ వస్తువులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం హనుమకొండ బాలభవన్ విద్యార్థుల ఏకదంతాయ వక్రతుండాయ నృత్య ప్రదర్శన, ఎంపీపీఎస్ విద్యార్థుల బంజార జానపద నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్, డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్, జీసీడీఈఓ సునీత, ప్లానింగ్ కోఆర్డినేటర్ బి.మహేశ్, అకడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ ఎ.శ్రీనివాస్, ఏసీజీఈ భువనేశ్వరి పాల్గొన్నారు. -
డెంగీ రహిత సమాజానికి కృషి చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: డెంగీ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున చింతల్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అందరూ ఐక్యంగా డెంగీ నివారణ చర్యలు చేపట్టడంతోనే వ్యాధిని నిర్మూలించవచ్చన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించి, రక్త పరీక్షలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు, కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ రాజేశ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు ఇఫ్తకార్ అహ్మద్, వైద్యులు అరుణ్, విజయ్‌కుమార్, దిలీప్, వేద కిరణ్, శ్రవణ్, అనిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి న్యూశాయంపేట: సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయాన్ని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, రెడ్‌క్రాస్ పాలక మండలి సభ్యులు ఇ.వి.శ్రీనివాస్, డీఎంహెచ్ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించాలి ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ, అధికారులు పాల్గొన్నారు. 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జిల్లాలో ఇప్పటి వరకు 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 32,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించగా 2,933 మంది రైతులకు రూ.40.64 కోట్ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. అలాగే 19,780 మంది రైతుల నుంచి 1,00,624.15 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసి సుమారు రూ.241.49 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. -
సామాజిక న్యాయసూత్రాలు తెలుసుకోవాలి
హన్మకొండ: భావోద్వేగాలకు సంబంధించిన నైపుణ్యాలుంటే నేరాలు జరగవని హనుమకొండ జిల్లా అదనపు న్యాయమూర్తి, జిల్లా పరిశ్రమలు, లేబర్ కోర్టు జడ్జి టి.శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండ జెడ్పీ కార్యాలయ ఆవరణలోని వృద్ధుల డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా పెంచాలన్నారు. తద్వారా వృద్ధాప్యంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని వివరించారు. అశోకుడు పురాతన కాలంలోనే తెలి పిన సామాజిక న్యాయసూత్రాలు అందరూ తెలు సుకోవాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాసేవాధికార సంస్థకు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామెర నర్సయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చొల్లేటి రామకృష్ణ, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్ కె.అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్‌కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్‌లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఖిలా వరంగల్: దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని దివ్యాంగుల సహకార సంస్థ రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా శనివారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జిల్లా సంక్షేమ శాఖ, తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ముత్తినే ని వీరయ్యతో పాటు నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండ్యాల శ్రీలక్ష్మీరామానంద్ హాజరై లబ్ధి దారులకు 20 రిట్రో ఫిటెడ్ మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్ (ఎంపవర్ కార్ట్)–1, ట్యాబ్–1 పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి, సాధికారతకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆత్మబంధువుగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ అనిరుద్ యాదవ్, జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్, జిల్లా దివ్యాంగుల కమిటీ సభ్యుడు వీరన్న, చక్రపాణి, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సహకార సంస్థ రాష్ట్ర చెర్మన్ ముత్తినేని వీరయ్య దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్‌కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్‌లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
100కు డయల్ చేస్తే తక్షణ సాయం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హసన్‌పర్తి: ఏదైనా సమస్య ఎదురైనప్పుడు 100కు డయల్ చేస్తే తక్షణ సాయం అందుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. జాగృతి పోలీస్ కళాబృందం హసన్‌పర్తిలో శనివారం కళాజాత ప్రదర్శన నిర్వహించింది. కార్యక్రమానికి కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తొలుత కల్లుకు అలవాటు పడి మెల్లమెల్లగా డ్రగ్స్ తీసుకునే స్థాయి వరకు చేరుతారని పేర్కొన్నారు. తప్పిదాలతోనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాలకు గురెతే 1930కు డయల్ చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇంటర్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఆదిత్యను శాలువాతో సత్కరించారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్సై దేవేందర్, రవి, డాక్టర్ తహసిద్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ భార్గవ్, నాయకులు పావుశెట్టి శ్రీధర్, కిరణ్ పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
నర్సంపేట: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకొని, ఏఐ భవిష్యత్ ప్రపంచాన్ని మలిచే శక్తిగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని ప్రిన్సిపాల్ మల్లం నవీన్ సూచించారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాల సందర్భంగా శనివారం కృత్రి మ మేధస్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ వి.పూర్ణచందర్, కంప్యూటర్ ఫ్యాకల్టీ దివ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించగా కృత్రిమ మేధస్సు అవగాహన ఆవిష్కరణ అనే అంశంపై ప్రిన్సిపాల్ నవీన్ మాట్లాడుతూ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక అంశాలపై యువత అవగాహన పెంపొదించుకోవాలన్నారు. ఏఐ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదని, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు మార్గదర్శకమన్నారు. హనుమకొండ పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ డి.సురేష్‌బాబు మాట్లాడుతూ ఆధునిక విద్యా వ్యవస్థలో ఏఐ యొక్క ప్రాధాన్యత, బోధన–అభ్యాసన ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిలో ఏఐ పాత్రను వివరించారు. ఏఐ వినియోగంలో జాగ్రత్తలు, డేటా భద్రత, మానవ విలువల పరిరక్షణ, విద్యార్థుల సృజనాత్మకత తగ్గిపోకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి.సత్యనారాయణ, అకడమిక్ కో ఆర్డినేటర్ కందాల సత్యనారాయణ, ప్రజా పాలన సమన్వయకర్త ఎస్.కమలాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయాన్ని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాల బలోపేతానికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ పౌరుడు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాన్ని తీసుకోవాలన్నారు. సభ్యత్వ ప్రత్యేక డ్రైవ్ జూన్ 14వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, రెడ్‌క్రాస్ పాలక మండలి సభ్యులు ఈవీ. శ్రీనివాస్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించాలి ఎస్ఐఆర్ను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 24 నుంచి జూలై 25వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నా రు. మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ, అధికారులు పాల్గొన్నారు. 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జిల్లాలో ఇప్పటి వరకు 34,782 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో 32,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించగా 2,933 మంది రైతులకు రూ.40.64 కోట్ల మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. అలాగే 19,780 మంది రైతుల నుంచి 1,00,624.15 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసి సుమారు రూ.241.49 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు.డెంగీ రహిత సమాజానికి కృషి చేయాలిఖిలావరంగల్/కాశిబుగ్గ: డెంగీ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శనివారం జాతీ య డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున చింతల్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అందరూ ఐక్యంగా డెంగీ నివారణ చర్యలు చేపట్టడంతోనే వ్యాధిని నిర్మూలించవచ్చన్నా రు. డెంగీ వ్యాధి నివారణకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, వ్యాధి చికిత్స కంటే వ్యాధి నివారణ ముఖ్యమన్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించి, రక్త పరీక్షలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు, కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ రాజేష్, డీప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు ఇఫ్తకార్ అహ్మద్, వైద్యులు అరుణ్, విజయ్‌కుమార్, దిలీప్, వేద కిరణ్, శ్రవణ్, అనిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.518.40 కోట్లు
గీసుకొండ: ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల ఆర్థిక బలోపేతానికి బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–2027 కోసం రుణ లక్ష్యాన్ని అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో 9,145 ఎస్‌హెచ్‌జీలు ఉండగా రూ. 518.40 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఐదేళ్ల నుంచి వందశాతం లక్ష్యం పూర్తి బ్యాంకు లింకేజీ రుణాల విషయంలో వందశాతం లక్ష్యాలను సాధించడంలో జిల్లా ముందంజలో ఉంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఎక్కువ ఎస్‌హెచ్‌జీలకు రుణాలను అందించి జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలవడం విశేషం. ఈ విషయంలో మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపెల్లి జిల్లాలు వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జిల్లాలో 8,226 సంఘాలకు రూ.502,83,46,000 లింకేజీ రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా 7,242 సంఘాలకు రూ.503,14,10,000 రుణాలను ఇచ్చారు. దీంతో వంద శాతం లక్ష్యాన్ని జిల్లా అధిగమించింది. 2021 నుంచి జిల్లా లింకేజీ రుణాల పంపిణీ విషయంలో వందశాతం లక్ష్యాన్ని సాధిస్తూ వస్తుంది. దీనికి సెర్ప్ అధికారులు, సిబ్బంది కృషి కారణమని చెబుతున్నారు. ఆర్థిక బలోపేతానికి.. బ్యాంకు లింకేజీ రుణాలను అందించడం ద్వారా పేదరికంలో మగ్గుతున్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే లక్ష్యంగా సెర్ప్ ముందుకు సాగుతోంది. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు లింకేజీ రుణాలు దోహదపడతాయి. సంఘాల్లో రుణ అవసరాలు ఉన్న మహిళలను గుర్తించి సెర్ప్ అధికారులు, మండల సమాఖ్య నిర్వాహకులు, వీఏఓలు, సంఘాల అధ్యక్షులు, సీసీలు సంఘాల వారీగా రుణ ప్రణాళిక తయారు చేస్తారు. ఎస్‌హెచ్‌జీల్లోని సభ్యులకు కుట్టు మిషన్లు, పిండిగిర్ని, కిరాణం, బట్టల షాపు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వ్యవసాయ పనిముట్లు, పెట్టుబడి సహాయం, శానిటరీ న్యాప్కిన్ల తయారీ .. ఇలా అనేక రకాల వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు సంబంధించిన రుణాలను ఇస్తారు. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణ సహాయం అందిస్తూ మహిళల జీవనోపాధికి బాటలు వేస్తారు. అలాగే ఇటీవల సోలార్ ప్లాంట్లు, పాల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వందశాతం రుణ లక్ష్యం పూర్తి చేస్తాం..గత ఆర్థిక సంవత్సరంలో పొదుపు సంఘాల మహిళలకు వందశాతం రుణాలు ఇచ్చి లక్ష్యాన్ని సాధించాం. ఈ ఏడాది కూడా అందరి అధికారుల సహకారంతో బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం అందించడానికి కృషి చేస్తాం. – శంకర్, డీపీఎంఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం ఖరారు జిల్లాలో 9,145 ఎస్‌హెచ్‌జీలు గత ఆర్థిక సంవత్సరంలో వందశాతం పూర్తి మండలాల వారీగా రుణ లక్ష్యం (రూ.కోట్లలో)మండలం ఎస్‌హెచ్‌జీలు రుణ లక్ష్యం చెన్నారావుపేట 720 39.90 దుగ్గొండి 1,016 54.40 గీసుకొండ 506 23.84 ఖానాపురం 677 38.33 నల్లబెల్లి 796 43.61 నర్సంపేట 568 40.07 నెక్కొండ 1,053 61.12 పర్వతగిరి 1,006 58.05 రాయపర్తి 1,116 70.30 సంగెం 919 49.02 వర్ధన్నపేట 768 39.71 -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
గీసుకొండ: కొమ్మాల అంగడిలో పశువులు, జీవాల కొనుగోలు అమ్మకాల సందర్భంగా నిర్వాహకులు అధికంగా ఫీజు వసూలు చేస్తే వారి టెండర్ రద్దు చేస్తామని డీఎల్పీఓ వేదవతి హెచ్చరించారు. శనివారం ఎంపీఓ పాక శ్రీనివాస్‌తో కలిసి అంగడిని ఆకస్మికంగా సందర్శించారు. అంగడికి వచ్చే వ్యాపారులు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, నిర్ధేశించిన ఽఫీజులను మించి వసూలు చేయొద్దన్నారు. అంగడికి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని, అవసరమైన చోట నీడనిచ్చే పందిళ్లను ఏర్పాటు చేయాలని, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు తదితరాలను వాడొద్దన్నారు. అంగడిలో షాపులు, హాటళ్లు, టీ పాయింట్లను నిర్వహించే వా రు ప్లాస్టిక్ కవర్లను వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగడి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు మురళి, రాజు, లావణ్య, అంగడి నిర్వాహకులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంతోనే అధిక లాభాలుసంగెం: రైతులు పర్యావరణ హితమైన సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసి అధిక లాభా లు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, పద్మజలు సూచించారు. శనివారం మండలంలోని కాట్రపల్లి, సంగెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవసరం మేరకే రసాయనిక ఎరువులు వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వరిలో కేవలం 50 కిలోల డీఏపీ, 100 కిలోల యూరియా, 25 కిలోల పోటాష్ వాడుకోవాలన్నారు. వానాకాలానికి అనువైన వరి రకాలు కునారం 1638, వరంగల్ సిద్ది, రాజేంద్రనగర్ ఆర్ఎన్ఆర్ 15048 రకాలు, పంటల మార్పిడి గురించి వివరించారు. సాగునీటి ఆదా చేసి భావితరాలకు అందించాలన్నారు. అనంతరం పంటల సాగు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్కాల శ్రావణి, ఏఓ జగదీశ్వర్, ఏ ఈఓ కార్తీక్, లావణ్య, రైతులు పాల్గొన్నారు. పంట అవశేషాలు కాల్చొద్దుగీసుకొండ: రైతులు వేసంగి పంటల అవశేషాలను కాల్చొద్దని, వాటిని భూమిలో కలిసిపోయేలా చేస్తే భూసారాన్ని పెంచుకోవచ్చని జిల్లా ఇన్చార్జ్ వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. గీసుకొండ మండలం వంచనగిరిలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిధ్యాలయం, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. రసాయన, పురుగుల మందులను మోతాదుకు మించి వాడితే నేల, నీరు, గాలి కలుషితం అవుతాయని, కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ విశ్వతేజ్, డాక్టర్ బి.సౌందర్యలు మాట్లాడుతూ వానాకాలంలో సాగులో విత్తన ఎంపికలో పొరపాట్లు చేయవద్దన్నారు. మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్‌బాబు మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువులను ఆధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలన్నారు. సర్పంచ్ కొమ్ముల కమల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఈఓ ఎం.కావ్య, పంచాయతీ కార్యదర్శి అనిల్, కస్తూర్ డ్రోన్ ప్రతినిధి నరేందర్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. అంబులెన్స్‌పై విరిగిపడిన చెట్టుకొమ్మ నర్సంపేట రూరల్: అంబులెన్స్‌పై చెట్టుకొమ్మ విరిగి పడడంతో పెను ప్రమాదం తప్పిన సంఘటన నర్సంపేట మండలంలోని లక్నెపల్లిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికల కథనం ప్రకారం.. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో 108 వాహనంలో వరంగల్ వైపు ఓ పేషంట్‌ను తీసుకొని వెళ్తున్నారు. వాహనం నర్సంపేట– వరంగల్ ప్రధాన రహదారి లక్నెపల్లి గ్రామశివారులోకి రాగానే భారీ వృక్షానికి సంబంధించిన చెట్టుకొమ్మ ఒక్కసారిగా విరిగి అంబు లె న్స్‌పై పడింది. దీంతో అంబులెన్స్ ఒకవైపు ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు పెను ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో 108 వాహనాన్ని రప్పించి వారిని ఎంజీఎంకు తరలించారు. -
నాలాల్లో పూడికతీత పనులు పూర్తిచేయాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హన్మకొండ/కాజీపేట/వరంగల్ అర్బన్: నాలాల్లో పూడికతీత పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి రాజాజీనగర్‌లో నాలాలో పూడికతీత పనులు, అశోకా జంక్షన్ నుంచి బుద్ధ భవన్ మీదుగా కాకతీయ యూనివర్సిటీ వరకు రోడ్డు, నిట్ ప్రధాన రహదారి వెంట కల్వర్టు, డ్రైనేజీ, 60, 61 డివిజన్లలో అభివృద్ధి పనులను పరిశీలించారు. బాలాజీనగర్ నాలా బ్రిడ్జి పూడికతీత పనులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేపడుతున్న పనులపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్షణమే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే నాయిని అధికారులను ఆదేశించారు. అశోకా జంక్షన్ నుంచి కేయూ రోడ్డు వరకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, ఆర్టీసీ బస్సులు సులభంగా రాకపోకలు సాగించేలా బస్టాండ్ నుంచి కాంగ్రెస్ భవన్ రోడ్డు మీదుగా కేయూ రోడ్డుకు అనుసంధానం చేసే ప్రతిపాదనలను పరిశీలించినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అంబేడ్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రూ.24 కోట్లతో అభివృద్ధి పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, నాగరాజు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
దుగ్గొండి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యమని ట్రాన్స్‌కో వరంగల్ ఎస్ఈ ఆనందం అన్నారు. మండలంలోని అడవి రంగాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి సబ్‌స్టేషన్‌ను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన 33/11 కేవీ నూతన విద్యుత్‌లైన్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తులు సంభవించడం, సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో వినియోగదారులకు, రైతులకు విద్యుత్ స రఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా నూతన లైన్లు ఏర్పాటు చేసి సబ్స్టేషన్లను అనుసంధానిస్తున్నామన్నారు. ఫలితంగా ఎలాంటి సమస్యలు వచ్చి నా విద్యుత్ సరఫరా చేయడంలో ఇబ్బందులు లే కుండా నిరంతర విద్యుత్ అందుతుందన్నారు. రైతులు మోటార్ల వద్ద ఆటోమెటిక్ స్టాటర్‌ను తీసివేయాలని సూచించారు. డీఈలు హర్జనాయక్, తిరుపతి, ఏడీఈలు లక్ష్మణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
గాడి తప్పిన పాలన!
వరంగల్ అర్బన్: పరిపాలన బలోపేతం కోసం గత ప్రభుత్వం నాలుగేళ్ల కిందట వార్డు ఆఫీసర్లను నియమించింది. వారు క్షేత్రస్థాయిలో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పైస్థాయి ఉద్యోగులకు, అధికారులకు సమాచారం అందించాలి. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు ఫిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలి. కానీ, అధికారుల పర్యవేక్షణాలోపం, వార్డు ఆఫీసర్ల పనుల్లో నిబద్ధత కొరవడిన కారణంగా పౌరసేవలు సకాలంలో అందట్లేదు. బల్దియాలో వందల సంఖ్యలో సమస్యలపై ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వార్డు ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం ఇక్కడ పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. వార్డు ఆఫీసర్ల విధులేంటంటే.. నగరంలో 66 వార్డులున్నాయి. వార్డుకో అధికారిని నియమించారు. వార్డు పాలన వ్యవస్థలో పౌర సేవల పట్టిక అమలు కోసం పనిచేయాలి. పౌరుల సౌకర్యార్థం పట్టికలను వార్డు కార్యాలయాల్లో ప్రదర్శించాలి. ప్రజలు వార్డు కార్యాలయాల్లో అందించే ఫిర్యాదులపైనే కాకుండా సామాజిక మధ్యమాలు, కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఫిర్యాదులపై స్పందించి పరిష్కారం చూపాలి. ఆస్తి, నీటి, గార్బేజీ చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ సొమ్ము వసూలు చేయాలి. వార్డు ఆఫీసర్లు జనన మరణ ధ్రువ పత్రాల అసిస్టెంట్లుగా, విచారణ అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించాలి. రోడ్లపై గుంతలు, మ్యాన్‌హోళ్ల మూతలు, రోడ్లపై మురుగునీరు, నీటి నిల్వ లు, నాలాల్లో ప్రవాహం అడ్డంకులు, పుట్‌పాత్ సమస్య, వీధిలైట్లు, రోడ్లు పక్కన మట్టికుప్పలు, ఇంటింటా చెత్త సేకరణ తీరు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ, దోమల సమస్య, జంతు, పక్షుల కళేబారాలు, పెంపుడు కుక్కల లైసెన్స్, దివ్యాంగులకు, వృద్ధులకు గుర్తింపు కార్డులు, తాగునీటి సరఫరాలో కొరత, లీకేజీలను గుర్తించడం తదితర సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని సంబంధిత విభాగాధికారులకు, సిబ్బందికి సమాచారం చేరవేయాలి. ఎవరికి వారే.. వార్డు ఆఫీసర్లు కేవలం ఆస్తి, నీటి పన్నుల వసూళ్లు, సామాజిక పింఛన్ల దరఖాస్తులకే పరిమితమయ్యారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్యం తదితర విభాగాల పనులపై కన్నెత్తి చూడడం లేదు. ఆయా విభాగాలకు చెందిన చైన్మెన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లను శానిటరీ జవాన్లు, బిల్ కలెక్టర్లను భాగస్వామ్యం చేసుకోవాలి. కానీ, బల్దియాలో ఆ విధానం అమలు కాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నచిన్న పనులకు సైతం నగరవాసులు అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. సమస్యల సత్వర పరిష్కారం కోసం వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం సెల్ఫోన్లను అందించింది. నగరవాసులు ఫోన్ ద్వారా సమస్యలు తెలుపవచ్చు. కానీ, వార్డు ఆఫీసర్లే కాదు.. ఇతర విభాగాల సిబ్బంది కూడా ఫోన్లు ఎత్తడానికి ఇబ్బంది పడుతున్నారు. వాట్సాప్‌లో సందేశం పంపినా సమాధానం కరువవుతోందని పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమీక్షల్లేవు.. సమస్యలు పరిష్కారం కావు.. వార్డుల్లో బల్దియాకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంనే వార్డు ఆఫీసర్లు కార్యాలయంగా ఎంచుకుంటున్నారు. నెలకోసారి డిప్యూటీ కమిషనర్లు వార్డు ఆఫీసర్లతో సమావేశమై ఫిర్యాదులు, పనితీరును సమీక్షించాల్సి ఉన్నా అవేమీ అమల్లోకి రావట్లేదు. ఇలా బల్దియాలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా నగర వాసులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఉన్నతాధికారులు వార్డు ఆఫీసర్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పౌరులు కోరుతున్నారు. బల్దియాలో వార్డు ఆఫీసర్ల పనితీరుపై విమర్శలు కార్యాలయాల్లేవు.. కొరవడిన సమన్వయం క్షేత్రస్థాయిలో సమస్యలతో నగరవాసులు సతమతం -
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, పూర్ణచందర్, మయూరి, స్రవంతి, సతీశ్, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, శ్రీధర్‌రావు.. ఎమ్మెల్యే దంపతులను పూర్ణకుంభంతో స్వాగతించారు. ఎమ్మెల్యే దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయంలో నూతన రథం నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వీలైనంత త్వరగా రథనిర్మాణం పూర్తి చేయాలని రథ శిల్పి ప్రవీణ్ ఆచార్యకు సూచించారు. -
‘బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి’
నర్సంపేట: బాలికపై అత్యాచారం చేసిన బండి సాయిభగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశభక్తి, దైవభక్తి, సీ్త్రల మీద తమకు ఎక్కడాలేని గౌరవం ఉన్నట్లు బహిరంగ సభలు, ప్రెస్మీట్లలో గొప్పలు చెప్పుకునే బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకులకు బండి సాయి భగీరథ్ దుర్మార్గం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తండ్రి అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా పరాయి ఆడపిల్లలను ముఖ్యంగా మైనార్టీ తీరని బాలికలను నిత్యం వేధిస్తూ వెంటపడే క్రూర మనస్తత్వం కలిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ కుమారుడు సాయి భగీరథ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణమే బండి సంజయ్‌కుమార్‌ను మంత్రివర్గం నుంచి భర్తరప్ చేయాలని పేర్కొన్నారు. బండి సంజయ్ చేతిలో అధికారం ఉన్నంతసేపు బాధిత బాలికకు న్యాయం జరగదని వాపోయారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, మహమ్మద్ సంథాని, తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు
ఖిలా వరంగల్: రౌడీషీటర్లు శాంతిభద్రతలకు భంగం కలిగించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో మామునూరు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏసీపీ వెంకటేష్ నేతృత్వంలో స్థానిక రౌడీషీటర్లకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఈస్ట్ జోన్‌డీసీపీ అంకిత్ కుమార్ హాజరై మాట్లాడారు. రౌడీషీటర్లు, నేరప్రవర్తన కలిగిన వ్యక్తులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, గొడవలు, బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. చట్టాలను గౌరవిస్తూ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ యాదవ్, జవ్వాజి సురేష్, విశ్వేశ్వర్, సంగెం ఎస్సై వంశీకృష్ణ పాల్గొన్నారు. -
రైతులపై ఎరువుల పిడుగు
నర్సంపేట: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మార్కెట్లో పంటల ఉత్పత్తులను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతులపై పెరిగిన ధరలతో ఎరువుల భారం పడనుంది. ఇప్పటికే ఎరువుల కంపెనీలు డీలర్లకు పెరిగిన ధరలపై సమాచారం అందించారు. గతంతో పోలిస్తే ఎరువుల రకాన్ని బట్టి ఒక్కో బస్తాపై రూ.100 నుంచి రూ.350 వరకు ధరలు పెరుగుతాయనే అంచనాలతో ఎరువుల డీలర్లు ఉన్నారు. ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావం కారణంగా ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో పాటు ఎరువులు తరలించే నౌకల బీమా ప్రీమియం, ఇతరత్రా ధరలు భారీగా పెరగడం ప్రధాన కారణంగా వ్యాపారులు పేర్కొంటున్నారు. రైతులపై ఆర్థికభారం వరంగల్ జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్లో 2లక్షల 75వేల 500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా. అందుకోసం లక్షా 7వేల 500మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేసే రైతులు పెరుగుతున్న ధరల సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న, ధాన్యం పేరుకుపోవడం, మద్దతు ధరకు విక్రయించినప్పటికీ డబ్బులు ఇంకా అందకపోవడంతో వచ్చే వర్షాకాలంలో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా వినియోగించే ఎరువుల ధరలనే అధికంగా పెంచారని, రానున్న వర్షాకాలంలో పంటల సాగులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులపై భారం పడకుండా చూడాలి ఎరువుల ధరలు పెరుగుతున్నట్లు షాపు డీలర్లు వెల్లడించడంతో ఆందోళనలో ఉన్నాం. పశ్చిమాసియాలో యుద్ధాల వల్ల ఎరువుల ధరలు పెరిగినట్లు డీలర్లు చెబుతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలను అమలు చేస్తున్నారు. రైతులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులను ఆదుకోవాలి. – వేముల సంపత్ రెడ్డి, రైతు, కన్నారావుపేట ధరల పెరుగుదలతో వానాకాలంలో తిప్పలు ఆందోళనలో కర్షకులుఒకవేళ ఎరువుల ధరలు పెరిగితే.. ఎరువు రకం పాత ధర కొత్త ధర 16 – 20 – 013 1,400 1,750 20 – 20 – 013 1,500 1,800 15 – 15 – 15 – 09 1,650 1,950 14 – 35 – 14 2,150 2,350 10 – 26 – 26 1,950 2,025 సింగిల్ సూపర్ పాస్పెట్ 615 775 పొటాష్ (ఎంఓపీ) 1,850 1,975 16 – 16 – 16 1,675 2,050 12 – 32 – 16 1,850 1,950 24 – 24 – 0 2,000 2,200 -
వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆత్మకూరు: చెక్ పోస్ట్ వద్ద వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మండలంలోని కటాక్షపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రిజిస్టర్లను తనిఖీ చేసి చెక్ పోస్ట్ వద్ద సౌకర్యాలు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలిచ్చారు. కంటైనర్లను సైతం తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా మండలంలోని నీరుకుల్ల దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీ సందర్శించారు. లారీలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు సీపీ దృష్టికి తీసుకెళ్లగా, సమస్యను కలెక్టర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. సీపీ సన్ ప్రీత్ సింగ్ వెంట సీఐ సంతోశ్, సిబ్బంది ఉన్నారు. -
ఇసుక తిప్పలు
ఆన్లైన్లో దరఖాస్తు విధానంపై అవగాహన లేక లబ్ధిదారులకు ఇక్కట్లుఇందిరమ్మ ఇళ్లకుసాక్షి, వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక తిప్పలు తప్పడం లేదు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి న ‘మన ఇసుక వాహనం’ యాప్‌లో వివరాలు పొందుపరిచి ఇసుక బుకింగ్ చేసుకునే విధానం తెలియక చాలామంది నేరుగా తమ ఊరి ట్రాక్టర్ల ద్వారా ఒక్కో ట్రిప్పునకు రూ.నాలుగు వేల వరకు చెల్లిస్తూ ఇంటి నిర్మాణం ముందుకు సాగేలా చూసుకుంటున్నారు. నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని.. వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో ఈ పరిస్థితి ఉండగా, నర్సంపేట నియోజవర్గంలోని నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపూర్ మండలాల్లో మాత్రం టన్నుకు రూ.వెయ్యి ఆన్లైన్లో చెల్లించి కొంతమంది లబ్ధిదారులు కలిసి ఒకేసారి లారీలో ఇసుక తెప్పించుకుంటున్నారు. ఇంకొంతమంది నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని టన్నుకు రూ.1,650 చెల్లించి ఒకేసారి పెద్ద మొత్తంలో తెప్పించుకొని డంపు చేసుకుంటున్నారు. మన ఇసుక వాహనం యాప్‌లో బుక్ చేసుకోవడం ద్వారా ఉచితంగానే ఇసుక వస్తున్నా, ఆయా ట్రాక్టర్, లారీలకు రవాణా చార్జీలు కూడా తక్కువ మొత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నా లబ్ధిదారులకు సరైన అవగాహన లేక ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. కూపన్ల సిస్టమ్ రద్దు లబ్ధిదారులు అత్యవసరం పేరుతో ఒక్కో ట్రాక్టర్‌కు రూ.నాలుగు వేల నుంచి రూ.ఆరు వేల వరకు వెచ్చిస్తూ పనులు సాగేలా చూసుకుంటున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వపరంగా సమీప ఇసుక క్వారీ నుంచి తక్కువ ధరకు ఇసుక తెచ్చుకునేందుకు ఒక్కో ఇంటికి కూపన్లు సరఫరా చేసేవారు. నిర్మాణ దశలను బట్టి కూపన్లు ఇచ్చేవారు. అయితే, ఆ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్లో బుక్ చేసుకొని కూపన్లు పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, చాలామంది లబ్ధిదారులకు ఈ రెండింటి విషయంలో అవగాహన లేక సతమతమవుతున్నారు. గత నెల ఒకటి నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకొని కూపన్లు పొందాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులు ఈ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక బుక్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆమోద పత్రం తప్పనిసరి కావడంతో నిరీక్షించే సమయం లేక ప్రైవేట్‌లో ఎక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం ఆగకుండా చూసుకుంటున్నారు. ఫలితంగా లబ్ధిదారులకు ఉచిత ఇసుక పంపిణీ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలొస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ అవసరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పడు ఆయా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తూ ఇసుక అవసరం ఉందనుకున్న సమయంలో ముందుగానే గుర్తించి లబ్ధిదారులను ఆన్లైన్లో అప్లై చేసుకునేలా ప్రోత్సహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొందరు కార్యదర్శులైతే లబ్ధిదారులను మీ సేవతో పాటు ఇతర ప్రైవేట్ నెట్ కేంద్రాలకు పంపించి అక్కడా అప్లై చేసుకొని కొంత చార్జీలు చెల్లించేలా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్లు ఇసుక పరిమాణం అవసరమవుతోంది. పునాది, పిల్లర్లు, స్లాబ్, గోడల నిర్మాణ దశల్లో పంపిణీ చేయాల్సి ఉంటుంది. మొన్నటివరకు అమలైన కూపన్లు వ్యవస్థతో ఇబ్బందిపడని లబ్ధిదారులు.. ఆన్లైన్ సాండ్ బుకింగ్‌తో ఆగమాగం అవుతున్నారు. పూర్తిస్థాయిలో వివరాలు తెలియక ప్రైవేట్‌లో ఇసుక కొనుగోలు చేస్తుండడం గమనార్హం. ‘ఆన్లైన్ యాప్‌లో ఇసుక బుక్ చేసుకుంటే ఉచితం. దాన్ని తీసుకెళ్లే ట్రాక్టర్ రవాణా చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయంలో కార్యదర్శుల సహాయం తీసుకోవాలి’ అని జిల్లా గృహ నిర్మాణ విభాగం బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తెలిపారు. లబ్ధిదారులకు సహకారం అందిస్తున్నాం గొడిశాల వికాస్, కాల్‌నాయక్ తండా పంచాయతీ కార్యదర్శి చెన్నారావుపేట మండల పరిధిలోని కాల్‌నాయక్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తొమ్మిది మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల మేరకు మేమే ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయడానికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. మండలంలోని అన్ని గ్రామాల్లో ఇసుకకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – గొడిశాల వికాస్, పంచాయతీ కార్యదర్శి, కాల్‌నాయక్ తండా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలురూఫ్ లెవల్: 824పూర్తి అయినవి: 775మంజూరైన ఇళ్లు: 12,053ముగ్గు పోసినవి: 6,754బేస్మెంట్ దశలో: 1,095 ప్రైవేట్‌గా ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇసుకకు రూ.వేలల్లో ఖర్చు ఫలితంగా అదనంగా ఆర్థిక భారంతో సతమతం పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకుంటేనే సులభతరం -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారుసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు.. మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్‌షాప్ షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గం.నుంచి మధ్యాహ్నం 01 గం. వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
‘కారుణ్య’ దరఖాస్తుల పరిశీలన
వరంగల్ అర్బన్ : బల్దియా పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల కారుణ్య నియామకాల కమిటీ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఈఈ మహేందర్, రాజేశ్ పాల్గొన్నారు. కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. మొత్తం 42 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 34 మంది అ భ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపా రు. మిగతా దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు వెల్లడించారు. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరీదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కాగా, నేడు శనివారం వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఉపేంద్రశర్మ తెలిపారు. -
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
వర్ధన్నపేట: ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను జిల్లా పంచాయతీ అధికారి కల్ప న ఆదేశించారు. మండలంలోని ఇల్లంద గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుల ప్రస్తుత స్థితిగతులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పాలనాపరమైన అంశాల్లో నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బేతి సాంబయ్య, ఉప సర్పంచ్ బొచ్చు జ్యోతి, ఎంపీఓ శేషంజన్ స్వామి, పంచాయతీ కార్యదర్శి శంకర్రావు, జీపీఓ లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.జిల్లా పంచాయతీ అధికారి కల్పన -
మల్లన్న ఆలయంలో మాస సంక్రమణ పూజలు
ఐనవోలు: మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం మాస సంక్రమణ పూజలు నిర్వహించారు. ఆదివారం సూర్యుడు మేషరాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఆలయంలో వృషభ సంక్రమణ పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం మేలుకొలుపు, నిత్య ఆరాధనలు పూర్తయిన తర్వాత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, మల్లికార్జున స్వామితో బలిజ మేడలమ్మ, గోల్ల కేతమ్మల కల్యాణం, ఒగ్గు పూజారులచే పెద్ద పట్నం తదితర కార్యక్రమాలు వేద పండితుల సమక్షంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, భానుప్రసాద్, మధు, శ్రీనివాస్, నరేశ్, అర్చక సిబ్బంది పాల్గొన్నట్లు ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్‌షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
పుస్తక పఠనంతోనే నిరంతర జ్ఞానం
రామన్నపేట: పుస్తక పఠనంతోనే నిరంతర విజ్ఞానం సాధ్యమని వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ రంగయ్యనాయుడు, వరంగల్ ఎంఈఓ వెంకటేశ్వరావు, మట్టెవాడ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె.అరుణ, సిబ్బంది పాల్గొన్నారు. హన్మకొండ: బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి బి.నిర్మల తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలెబుల్ స్కూల్ స్కీమ్ కింద ఒకటో తరగతి, ఐదో తరగతిలో అడ్మిషన్ కల్పించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాకు ఒకటో తరగతిలో 87 సీట్లు, 5వ తరగతిలో 88 సీట్లు కేటాయించినట్లు వివరించారు. ఈ నెల 15 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు హనుమకొండ, హసన్‌పర్తి సహాయ సాంఘిక సంక్షేమాధికారి కార్యాలయం నుంచి దరఖాస్తు ఫామ్ పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను అదే కార్యాలయంలో జూన్ 6న సాయంత్రం 5 గంటల్లోపు అందించాలని సూచించారు. వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్య, వైద్యం తర్వాత క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఏర్పాటైన తర్వాత మొదటి కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం హనుమకొండ రెడ్డికాలనీలోని వారాహి బాంక్వెట్ హాల్లో నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ చైర్మన్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో నగరంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్‌యాదవ్, తెలంగాణ రాష్ట్ర జూడో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి దుపాకి సంతోశ్‌కుమార్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు నాయకపు నాగరాజు, బొడ్డు విష్ణువర్ధన్, వల్లెం సుధాకర్, సంపత్, రాజు, రామకృష్ణ, దాసారపు సారయ్య, పరిపూర్ణచారి తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. హనుమకొండ జిల్లాలో 32 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్ ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ కలిపి 8,226 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 7,732 మంది (94 శాతం) హాజరయ్యారు. 494 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో 1,965 మంది విద్యార్థులకుగాను 1,811 మంది హాజరుకాగా.. (92 శాతం) 154 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ దేవాదాయఽ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 18 నుంచి ప్రతీ సోమవారం ధర్మవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వరంగల్ దేవాదాయశాఖ డీసీ, అసిస్టెంట్ కమిషనర్ సునీత శుక్రవారం తెలిపారు. ప్రజలు, భక్తులు, అర్చకులు, ఇతర ఉద్యోగులు తమ సమస్యలను వివరించి, పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు. -
ఓరుగల్లుకు స్వచ్ఛరక్ష
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద చేపట్టనున్న మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులో పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలకు ప్రాధాన్యం లభించింది. ఈ ఐదు పట్టణాల్లో మొత్తం ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 22.80 ఎంఎల్డీలుగా ఉంటుంది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి డా.టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా.. స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బీఎం) 2.0 కింద రాష్ట్రవ్యాప్తంగా 101 పురపాలక సంఘాల్లో మురుగునీటి నిర్వహణ పనులకు రూ.3,705.75 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేశారు. అందులో వరంగల్ విభాగానికి కూడా ప్రాధాన్యం లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టణ పారిశుద్ధ్యానికి ఊరటనిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ విభాగంలో మొత్తం 6 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) ఏర్పాటు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్.. భూసేకరణకు ప్రత్యేక నిధులు పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనుంది. ఎక్కువ కంపెనీలు టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంది. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు 24 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిలో అమలు చేయనున్నా రు. నిర్మాణ సమయంలో ప్రభుత్వం 50 శాతానికి పైగా వ్యయాన్ని చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించనుంది. నిర్మాణంతోపాటు ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టు సంస్థలదే ఉంటుంది. భూసేకరణ కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇదిలా ఉండగా పరకాల, భూపాలపల్లి, జనగామ, వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ప్రస్తుతం మురుగునీరు నేరుగా కాలువలు, చెరువులు, వాగుల్లోకి చేరుతుండటంతో కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణాల్లో చెరువులు, వాగులు, భూగర్భజలాల్లో కాలుష్యం గణనీయంగా తగ్గి పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘గ్రేటర్’లో ఉన్నా లేనట్లే.. తాజాగా ప్రతిపాదనలు ఇక గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటికే స్మార్ట్‌సిటీ నిధులతో రెడ్డిపురం వద్ద 100 ఎంఎల్డీ, బంధంచెరువు వద్ద 15 ఎంఎల్డీ, ఉర్సుగుట్ట వద్ద 15 ఎంఎల్డీల సామర్థ్యంతో మూడు ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టారు. కొన్ని అందుబాటులోకి రాకపోగా, వచ్చినవి ట్రైసిటీలో పెరుగుతున్న జనాభా, నగర విస్తరణకు సరిపోవడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 2057 విజన్‌కు అనుగుణంగా అదనపు ఎస్టీపీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వం రూ.5,257 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టును ప్రకటించిన నేపథ్యంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు మున్సిపాలిటీల్లో ఆరు ఎస్టీపీలు.. తీరనున్న కాలుష్య బాధలు పరకాల నుంచి నర్సంపేట వరకు గ్రీన్‌సిగ్నల్ 22.80 ఎంఎల్డీ సామర్థ్యం మూడు ప్యాకేజీలలో టెండర్లు.. పూర్తి చేసేందుకు 24 నెలల గడువు రూ.3,705 కోట్ల ప్రాజెక్టులో వరంగల్‌కు ప్రాధాన్యం -
మా డిగ్రీ ఎప్పుడు పూర్తవుతుంది?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులు శుక్రవారం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తాము 2023–24 విద్యాసంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందామని, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తాము రెండో సెమిస్టర్‌లోనే ఉన్నామని, ఇప్పటికీ తమకు పుస్తకాలు సైతం ఇవ్వలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 7నుంచి డిగ్రీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండో సెమిస్టర్ విద్యార్థులు కొందరు ఆందోళనకు దిగారు. మూడేళ్లు కావొస్తున్నా.. తాము డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొంది మూడేళ్లు కావస్తోందని, ఆరో సెమిస్టర్లో ఉండాల్సి ఉండగా, ఇంకా రెండో సెమిస్టర్ పరీక్షలే ఇప్పుడు జరగుతున్నాయని, ఇలా అయితే, తమ డిగ్రీ ఎప్పటికి పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత వర్సిటీ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఒక్క పుస్తకం ఇవ్వలేదని, పరీక్ష ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్‌ను కలిసేందుకు యత్నించగా.. డైరెక్టర్ సురేశ్‌లాల్ అందుబాటులో లేరు. అక్కడినుంచి వారంతా రిజిస్ట్రార్ చాంబర్‌కు వెళ్లారు. రిజిస్ట్రార్ కూడా అందుబాటులో లేకపోవడంతో వీసీ చాంబర్ వద్దకు వెళ్తుండగా.. ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామ్రెడ్డి, పరీక్షల నియంత్రణాఽధికారి రాజేందర్ విద్యార్థులతో మాట్లాడారు. వెంకట్రామ్రెడ్డి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ సురేశ్లాల్కు ఫోన్ చేసి విద్యార్థులతో మాట్లాడించారు. సురేశ్‌లాల్ మాట్లాడుతూ ‘వాస్తవంగా విద్యార్థులు ఆరో సెమిస్టర్లో ఉండాలని, ఇక నుంచి ప్రతీ మూడు నె లలకు ఒక సెమిస్టర్ చొప్పున మిగతా సెమిస్టర్లు పూర్తి చేస్తామని, స్టడీ మెటీరియల్ అందిస్తాం’ అని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న కేయూ పోలీస్టేషన్ పోలీసులు అక్కడికి వచ్చారు. మూడేళ్లు గడుస్తున్నా ఇంకా రెండో సెమిస్టర్‌లోనే.. ఇప్పటికీ ఒక్క పుస్తకం ఇవ్వలే.. కేయూ దూరవిద్య డిగ్రీ విద్యార్థుల ఆందోళన -
మాక్ డ్రిల్స్ స్పందన కీలకం
రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి దాసరి హరిచందన హన్మకొండ అర్బన్: వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, అటవీ అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపర్చడంలో మాక్ డ్రిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి దాసరి హరిచందన అన్నారు. టేబుల్‌టాప్ ఎక్సర్సైజ్కు సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లు, శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగంతో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ జనరల్ సుధీర్ బాహల్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా దాసరి హరిచందన మాట్లాడుతూ.. ఈనెల 18న రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాష్ట్ర స్థాయి మాక్ ఎక్సర్సైజ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఎడీఎంఏ లీడ్ కన్సల్టెంట్ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల పాత్రలు, బాధ్యతలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. -
రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
న్యూశాయంపేట: జిల్లాలో రబీ 2025 – 26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1,93,809 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతుల నుంచి 30,371 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా అందులో 27,680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు తెలిపారు. 2,492 మంది రైతుల ఖాతాల్లో రూ.36.43 కోట్ల విలువైన ధాన్యం డబ్బులను జమ చేసినట్లు కలెక్టర్ వివరించారు. 97,191 మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోలు వరంగల్ జిల్లాలో శుక్రవారం వరకు 97,191.350 మెట్రిక్ టన్నుల మక్కలను రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. 19,099 రైతుల నుంచి 233.25 కోట్ల రూపాయల విలువగల మొక్కజొన్నను సేకరించినట్లు వివరించారు. రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తులను తీసుకురావాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు. త్వరగా చేపలు పట్టాలి గీసుకొండ: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, జలాశయాల్లోని నీరు అడుగంటి పోతుండడంతో చెరుల్లోని చేపలను మత్స్యకారులు వీలైనంత త్వరగా పట్టుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి (డీఎఫ్ఓ) పిల్లి శ్రీపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 706 చెరువులు ఉండగా ఏప్రిల్ ఒకటి నాటికి 300 చెరువుల్లో చేపలు పట్టారని, మరో 200 చెరువుల్లో ఈనెల 25లోపు, జూన్ నెలాఖరులోపు 206 చెరువుల్లో పట్టడం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎండదెబ్బ తగలకుండా మత్య్సకారులు ఉదయం 5 నుంచి 11 గంటల లోపు చేపలు పట్టాలని పేర్కొన్నారు. చేపలు పట్టేవారు, అమ్మే వారు వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరీదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కాగా, నేడు శనివారం వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వరుడి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. హన్మకొండ కల్చరల్: వరంగల్ దేవాదాయఽ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 18 నుంచి ప్రతీ సోమవారం ధర్మవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వరంగల్ దేవాదాయశాఖ డీసీ, అసిస్టెంట్ కమిషనర్ సునీత శుక్రవారం తెలిపారు. ప్రజలు, భక్తులు, అర్చకులు, ఇతర ఉద్యోగులు తమ సమస్యలను వివరించి, పరిష్కరించుకోవచ్చునని పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ : బల్దియా పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల కారుణ్య నియామకాల కమిటీ శుక్రవారం ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఈఈ మహేందర్, రాజేశ్ పాల్గొన్నారు. కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించారు. మొత్తం 42 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 34 మంది అ భ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపా రు. మిగతా దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు వెల్లడించారు. -
ఓరుగల్లుపై గులాబీ ఫోకస్!
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే.. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్‌ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ముఖ్య నే తలతో కీలక భేటీ నిర్వహించిన కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్‌చార్జ్‌లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నా రు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవీందర్ రావుని ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మేడ్చల్–మల్కాజ్గిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్‌ను గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్ వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జ రిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధిక సంఖ్యలో సభ్యత్వ సేకరణే లక్ష్యం గ్రామం నుంచి డివిజన్ వరకు టార్గెట్లు త్వరలోనే రంగంలోకి జిల్లాల ఇన్‌చార్జ్‌లు చర్చనీయాంశంగా నియామకాలు.. కేడర్ యాక్టివేషన్‌పై అధిష్టానం ఫోకస్పల్లా రాజేశ్వర్రెడ్డిసత్యవతిరాథోడ్ -
మెరుగైన విద్యనందించడమే లక్ష్యం
మంత్రి పొన్నం ప్రభాకర్ భీమదేవరపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ)నిర్మించనున్న అదనపు తరగతి గదులు, ఇతర అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని అన్నారు. పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో నాణ్యాతా ప్రమాణాలు పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ రవి, డీఈఓ గిరిరాజ్ రావు, అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఎల్కతుర్తి : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే విస్తరణ, అభివృద్ధిలో భాగంగా లెవల్ క్రాసింగ్ లైన్ల వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి, రోడ్డు అండర్ బ్రిడ్జి, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సీ08 బావుపేట–సీతంపేట గ్రామాల మధ్య లెవెల్ క్రాసింగ్ కి.మీ 352/8–10 హసన్‌పర్తి–ఉప్పల్ స్టేషన్ల మధ్య ఎల్కతుర్తి మండలం బావుపేటలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి బుధవారం జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. రెండు గ్రామాల పెద్దలు, రైతులకు అలైన్మెంట్ గురించి అధికారులు వివరించారు.కార్యక్రమంలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సామ్రాట్ రాయ్, రోడ్ సెక్టార్ ప్రాజెక్టు రైల్వే భూ సేకరణ నిపుణుడు పి.దేవరాజు, ఆర్డీఓ రమేష్ రాథోడ్, తహసీల్దార్ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తి : మండల కేంద్రంలోని విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మక్కల కొనుగోల్లు సజావుగా జరిగేలా చూడాలని, రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వాజిద్ అలీ, డీసీఓ సంజీవరెడ్డి, డీసీసీసీఈఓ వజీర్ సుల్తాన్, తహసీల్దార్ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ విజయ్‌కుమార్ తదితర శాఖల అధికారులు ఉన్నారు. -
నిధుల సుస్తీ
పల్లె వైద్యానికి మూడేళ్లుగా పీహెచ్‌సీలకు రాని హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్సాక్షి, వరంగల్: గ్రామీణ ప్రజలకు తొలి వైద్య ఆశ్రయంగా నిలిచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీఏడాది ఆస్పత్రుల నిర్వహణ, చిన్న చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ బిల్లులు, ఫర్నిచర్, ల్యాబ్ రియాజెంట్లు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ (హెచ్డీఎఫ్) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్‌సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ప్రతీఏటా హెచ్డీఎఫ్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం నెలకొనడంతో పేదల వైద్యసేవలపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. మూడేళ్లుగా ప్రతిపాదనలు పంపించినా ఫలితం ఉండడం లేదు. దీంతో ప్రతీ చిన్న పనికి కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వసతులు సమకూర్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. వైద్య పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. రోగులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఔషధాల కొరత, ల్యాబ్ పరీక్షలపై ప్రభావం, విద్యుత్, తాగు నీటి బిల్లుల భారం, పారిశుద్ధ్యంపై ప్రభావం పడుతోంది. ఫలితంగా మందులు, పరీక్షలు, సౌకర్యాలు లేక ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యంపై నమ్మకం సన్నగిల్లి రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మూడేళ్లుగా రావాల్సిన నిధులు రూ.94.50లక్షలు ప్రాథమిక కేంద్రాల ఆరోగ్య నిర్వహణకు కేంద్రం ఆర్థిక చేయూతను అందిస్తోంది. ఒక్కో దానికి రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. జిల్లాలో 14 పీహెచ్‌సీలు, ఏడు యూపీహెచ్‌సీలు ఉన్నాయి. ఈ లెక్కన 21 కేంద్రాలను తీసుకుంటే ఏడాదికి రూ.31.50లక్షల చొప్పున మూడు సంవత్సరాలను రూ.94.50 లక్షల నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆరోగ్య కేంద్రాల పరిశీలనకు వచ్చిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా మోక్షం లభించడం లేదు. ఖానాపురం పీహెచ్సీలో పనిచేయని ఫ్యాన్ సరైన వసతులు లేక రోగులకు తిప్పలు వైద్య పరికరాలు, రిఫ్రిజిరేటర్లు మరమ్మతుకు నోచుకోక అవస్థలు ఇప్పటికై నా నిధులివ్వాలని కోరుతున్న వైద్యులుజిల్లాలో చాలా చోట్ల ప్రహరీలు లేకపోవడంతో పశువుల సంచారంతో అపరిశుభ్రత దర్శనమిస్తోంది. మూత్రశాలలు, భవనంపైకప్పు, గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఫ్యాన్లు, విద్యుత్ తీగలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. రోగుల తాకిడికి అనుకూలంగా వసతులు కల్పించడం లేదు. కనీసం కూర్చునేందుకు బెంచీలు, కుర్చీలు లేక నిలబడే పరిస్థితి నెలకొంది. చెడిపోయిన వైద్య పరికరాలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఏ వస్తువులు చెడిపోయినా బాగు చేసుకునేందుకు సిబ్బంది సతమతమవుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం..పీహెచ్సీ, యూపీహెచ్‌సీలకు రావాల్సిన హస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అత్యవసర వైద్య పరికరాలు, రిఫ్రిజిరేటర్లు మరమ్మతులయ్యేలా చూస్తున్నాం. రోగులకు తమ పరిధిలో వైద్యసేవలు అందించేలా చూస్తున్నాం. – డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్ఓ -
కమ్యూనిస్టుల ఐక్యతే దోపిడీ విముక్తికి మార్గం
నర్సంపేట: దేశంలో పెరిగిపోతున్న దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఎంసీపీఐ(యూ) జాతీ య ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ఓంకార్, పొలిట్‌బ్యూరో సభ్యుడు కుల్దీప్సింగ్ అన్నారు. ఈ మేరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపకుడు మ ద్దికాయల ఓంకార్ శతజయంతి వారోత్సవాల ము గింపు సందర్భంగా పట్టణంలోని నెక్కొండ రోడ్డు సర్కిల్ నుంచి సిటిజన్ క్లబ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ ముందు కోలాటాలు, డప్పు బృందం కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అధ్యక్షతన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఓంకార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో మోదీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయన్నారు. అరుణోదయ విమలక్క, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకుడు గంగాధర్, ఉపేందర్‌రెడ్డి, సుధాకర్, సుకన్య, తదితరులు పాల్గొన్నారు. ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ఓంకార్ -
విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేయూత
● అదనపు కలెక్టర్ గణేశ్ నర్సంపేట: విద్యాభివృద్ధికి ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ అన్నారు. ఈ మేరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల సందర్భంగా బుధవారం నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్లో సర్పంచ్‌లు, కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల్లోనే నాణ్యమైన విద్య లభించడంతో పాటు పలు రకాల సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్యా బలోపేతానికి ఉచితంగా పాఠశాల స్థాయి అవసరాలతో పాటు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదుకు ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం ఉండాలన్నారు. విద్యాభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ మాట్లాడుతూ అన్ని వర్గాల విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతూ వసతులతో పాటు బోధన సామగ్రిని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, జిల్లా పశువర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, సీఎంఓ శ్రీనివాస్, డీఎల్పీఓ రాజీవ్‌కుమార్, నర్సంపేట ఎంపీడీఓ కె.శ్రీనివాస్, ఎంఈఓ కొర్ర సారయ్య, ఎంపీడీఓలు వెంకటశివానంద్, కె.రవీందర్, అ ద్వైత, ఎంఈఓలు పాపమ్మ, రవీందర్, అనురాధ, వెంకటేశ్వర్లు, చరణ్‌సింగ్, రవి, నరసింహస్వామి, ప్రిన్సిపాల్ నవీన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ నీరందించడమే లక్ష్యం
సంగెం : ఇంటింటికీ తాగు నీరందించడమే లక్ష్యంగా గవిచర్లలో పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు సర్పంచ్ బాషిపాక సదయ్య తెలిపారు. ఆ గ్రామంలోని గుండ బ్రహ్మయ్య ఆలయం సమీపంలో సుమారు 1500 మీటర్ల పైపులైన్ నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామంలోని అన్ని వాడలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నీరు వృథా కాకుండా వాడుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుమ్మడి సంపత్, మాజీ సర్పంచ్ పత్తిపాక రమేశ్, వార్డు సభ్యులు అశోక్, వర్ష, రమ, రాధిక, పూజ, కరుణాకర్, అనిల్, జీపీ కార్యదర్శి సునీత, తదితరులు పాల్గొన్నారు. -
వరి సాగులో రకాల ఎంపిక కీలకం
● వ్యవసాయ శాస్త్రవేత్తలు రాములు, పద్మజరాయపర్తి : వరి సాగులో డిమాండ్ ఉన్న రకాల ఎంపిక కీలకమని వ్యవసాయ శాస్త్రవేత్తలు రాములు, పద్మజ స్పష్టం చేశారు. మండలంలోని గట్టికల్‌లో బుధవారం నిర్వహించిన అవగాహనా సదస్సులో వారు మాట్లాడారు. మార్కెట్లో డబ్ల్యూజీఎల్ 962, ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 1638 వంటి రకాలకు విదేశాల్లోనూ డిమాండ్ ఉందన్నారు. ఈ రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే బోనస్ సైతం పొందవచ్చని చెప్పారు. వరి సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలని చెప్పారు. వరి సాగు అనంతరం పెసర్లు, బొబ్బెర్లు, మినుములు వేసుకుంటే మేలన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని తెలిపారు. అనంతరం పంటల సాగు సూచనలకు సంబంధించిన బ్రోచర్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ చెవ్వు హేమలత కాశీనాథం, ఉపసర్పంచ్ చిర్ర నాగరాజు, ఏఓ గుమ్మడి వీరభద్రం, ఏఈఓ క్రాంతికుమార్, పంచాయతీ కార్యదర్శి సుమలత, తదితరులు పాల్గొన్నారు. -
‘వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి’
చెన్నారావుపేట : వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నమిండ్ల స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ శివానంద్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం స్వామి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. పాత విధానంలోనే ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ను పునరుద్ధరించాలని, కూలీలకు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా కూలి రూ.600లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు వమొగులోజు శారద, బూడిద యాదమ్మ, మండల స్వరూప, బల్లె చంద్రకళ, మాదాసి రజిత తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతిరాయపర్తి : విద్యుదా ఘాతానికి గురై దుక్కిటెద్దు మృతి చెందిన ఘటన బాలాజీ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మర్రి తండాలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోతు సోమన్న సాకుతున్న లక్ష రూపాయల విలువైన దుక్కిటెద్దు బుధవారం మేతకు వెళ్లింది. ఈ క్రమంలో వ్యవసాయ భూమిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సమీపంలోని వైర్లకు తగిలి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే దుక్కిటెద్దు మృతి చెందిందని సోమన్న వాపోయాడు. బాధిత రైతును సర్పంచ్ మోహన్‌లాల్ పరామర్శించారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. -
‘పల్లా’కు పెరుగుతున్న ప్రాధాన్యం.. సీనియర్లు నియోజకవర్గాలకే..
బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రాధాన్యత పెరిగింది. ఉమ్మడి వరంగల్ పార్టీ సమావేశాలు, సమీక్షలు, కేడర్ సమావేశాలు, వ్యూహాత్మక చర్చల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన రైతు సంగ్రామ సదస్సుకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. తాజాగా మంగళవారం కేసీఆర్ భేటీ అనంతరం నియమించిన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్‌ల నియామకంలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌కు పాత ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు ఇవ్వగా.. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్ గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలను పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన పలువురు సీనియర్లను సభ్యత్వ నమోదు విషయంలో నియోజకవర్గాలకే పరిమితం చేయడం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువుగా నిలిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి నుంచి నగర, డివిజన్ల వరకు విస్తృతస్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టి మళ్లీ కేడర్‌ను కదిలించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల కిందట ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించిన పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్ లను నియమించారు. సభ్యత్వ సేకరణకు రంగంలోకి ఇన్‌చార్జ్‌లు.. పార్టీ శ్రేణులను మళ్లీ యాక్టివ్ చేయడం, కార్యకర్తల్లో నమ్మకం పెంచడం, స్థానిక నాయకత్వాన్ని సమీకరించడం లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌లో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రానికి రాజకీయ సంకేతం ఇవ్వాలనే ఆలోచనతో పార్టీ ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు గతంలోనూ ఇన్చార్జ్గా ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇన్చార్జ్గా ఉన్న జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యతలు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్సీలు తక్కళ్లపెల్లి రవీందర్ రావుని ఖమ్మం, కొత్తగూడెం, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మేడ్చల్–మల్కాజ్గిరి, యాదాద్రి, మెట్టు శ్రీనివాస్‌ను గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. గ్రామాల వారీగా లక్ష్యాలు.. సభ్యత్వ సేకరణకు ప్లాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి కేవలం పేరుకే కాకుండా డేటా ఆధారిత రాజకీయ వ్యూహంగా మలచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లు, బూత్ వారీ బలం, స్థానిక నాయకత్వ ప్రభావం ఆధారంగా గ్రామాల వారీగా సభ్యత్వ లక్ష్యాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రతీ మండలానికి ప్రత్యేక టార్గెట్లు ఇవ్వడంతోపాటు యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పాత కార్యకర్తలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, మండల స్థాయి నాయకులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన రైతు సంగ్రామ సభకు వచ్చిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో మళ్లీ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసి, భవిష్యత్ ఎన్నికలకు సిద్ధం కావాలనే లక్ష్యంతో పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి కొత్త ఊపు వస్తుందనే భావన బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పల్లా రాజేశ్వర్రెడ్డిసత్యవతిరాథోడ్ -
మక్కల గోదాం ప్రారంభం
పర్వతగిరి : మండలంలోని దౌలత్‌నగర్‌లో మొక్కజొన్నల గోదాంను పర్వతగిరి పీఏసీఎస్ సీఈఓ సురేశ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రబీలో రైతులు మొక్కజొన్న పంట ఎక్కువగా సాగు చేయగా దిగుబడి సైతం అంచనాకు మించి వచ్చిందన్నారు. సరిపడా గోదాములు లేకపోవడంతో కొద్ది రోజులు రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ప్రభుత్వం గోదాంలను కేటాయించిందని తెలిపారు. త్వరలోనే మక్కల కొనుగోళ్లు, దిగుమతి పూర్తి అవుతాయని వివరించారు. కార్యక్రమంలో చింతపట్ల మల్లికార్జున్, సంపత్, శేఖర్, సునీల్, యాకయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
‘భగీరథ్’ కేసు నీరుగార్చే కుట్ర
● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్వర్ధన్నపేట : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును నీరు గార్చడానికి కుట్ర జరుగుతోందని స్థానిక మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడ పోక్సో కేసు నమోదైనా నిందితులను వెంటనే అరెస్టు చేస్తారని, బండి భగీరథ్‌పై కేసు నమోదైనా చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉండడం వల్లే భగీరథ్‌ను అరెస్టు చేయడం లేదని ధ్వజమెత్తారు. కేసును నీరు గార్చడానికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందన్నారు. చిత్తశుద్ధి ఉంటే భగీరథ్‌ను పోలీసుల ఎదుట హాజరుపర్చి విచారణకు సహకరించాలని కేంద్ర మంత్రి సంజయ్‌కు హితవు పలికారు. లేనిపక్షంలో పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం భగీరథ్‌ను సత్వరమే అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ జెడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్లు వనంరెడ్డి, జక్కు రమేశ్, నాయకులు తూళ్ల కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. భగీరథ్‌ను అరెస్టు చేయాలి బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరఽథను వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య, ఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లందాస్ కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ రేపిస్టులకు, నిందితులకు కేరాఫ్‌గా మారిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి సంజయ్ పదవికి రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్ జంగిలి భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కార్యదర్శి మామిండ్ల చెన్నయ్య, నాయకులు తుమ్మల కుమార్, మహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన జనగామ ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే చిన్నారి ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్ శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
‘ఉపాధి’లో బోగస్ హాజరుకు చెక్
● 95 శాతం ఈకేవైసీ పూర్తి సంగెం : జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద చేపట్టే పనులు కూలీల బోగస్ హాజరుకు చెక్ పడనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ యాప్‌లో కూలీల వివరాలు, ఈ–కేవైసీ నమోదు తప్పనిసరి చేసింది. తద్వారా జాబ్‌కార్డులకు కూలీల ఆధార్ అనుసంధానం చేయడంతోపాటు వారి నమోదు చేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ పనులు 95 శాతం పూర్తి కావచ్చాయి. మండలంలో 10,972 మంది కూలీలు మండలంలో 8007 జాబ్‌కార్డులుండగా 10972 మంది కూలీలున్నారు. ఇందులో ఇప్పటివరకు 10384 మందికి ఆధార్, ఈకేవైసీ పూర్తి అయ్యింది. ఇంకా 588 మందికి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఇందులో 116 మంది చనిపోగా, 52 మంది శాశ్వతంగా వలస వెళ్లారు. అలాగే 115 మంది తాత్కాలికంగా వలస వెళ్లగా 40 మంది వృద్ధులు, 183 మంది ఐరిష్ నమోదు కాని వారు, 33 మంది పని మానేసిన కూలీలున్నారు. మరో 49 మందికి మాత్రమే ఈకేవైసీ చేయాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు చొరవ చూపుతున్నారు. పని ప్రదేశం వద్ద.. పని ప్రదేశం వద్ద కూలీల హాజరును ఎన్ఎంఎంఎస్ యాప్‌లో అప్లోడ్ చేయడం ఆనవాయితీగా ఉండేది. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు నకిలీ ఫొటోలు అప్లోడ్ చేస్తున్నట్లు నిర్ధారణ కాగా కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ తీసుకొచ్చింది. దీన్ని దుర్విని యోగం చేస్తున్నట్లు గుర్తించి నకిలీ హాజరు అరికట్టేందుకు ఈకేవైసీ విధానం అమల్లోకి తెచ్చింది. తప్పులకు ఆస్కారం లేకుండా.. గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల వివరాల నమోదుకు ఈ–ఎంబీ (ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్) అమల్లోకి తీసుకొచ్చారు. పని ప్రదేశాల వివరాలను గుర్తించి ముందుగా లెక్కించి కొలత పుస్తకంలో రాసి తర్వాత ఆన్లైన్, ఈ–ఎంబీలో నమోదు చేయాల్సి ఉంటుంది. సాంకేతిక ఇబ్బందులు.. ఈ–కేవైసీ ప్రక్రియ ప్రారంభమై దాదాపు ఏడు నెలల 10 రోజులు గడుస్తున్నా మండలంలో దాదాపు 95 శాతం వివరాల నమోదు పూర్తయ్యాయి. సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ–కేవైసీ నమోదులో జాప్యం జరుగుతోంది. కొందరి ఐరిష్ నమోదు కాకపోగా మరికొందరికి ఈ–కేవైసీ పూర్తి చేయలేకపోయారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జాబ్‌కార్డు ఉన్న కూలీల వివరాలను ఈ–కేవైసీ చేయిస్తున్నాం. ఈ విధానం గురించి ఎఫ్‌ఏలకు, టీఏలకు అవగాహన కల్పించాము. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తి అయ్యింది. కొందరి ఐరిష్ నమోదు కావడం లేదు. అలాంటి వారిని మరోసారి మీసేవ కేంద్రాల్లో ఆధార్ అప్డేట్ చేయించుకోమని సూచిస్తున్నాం. – గణేశ్, ఏపీఓ -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
● మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హరిబాబుఖానాపురం : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభిస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు తెలిపారు. మండలంలోని బుధరావుపేట ఆంజనేయ పొదుపు, పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించి సరైన ధర పొందాలని సూచించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నర్సంపేట చెర్మన్ యడ్ల భిక్షంరెడ్డి మాట్లాడుతూ రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పెసరు రాణి, ఏఈఓ రాజ్‌కుమార్, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, లింగిడి వెంకటేశ్వర్లు, చెడిపాక ఉపేందర్, కొండ్లె మధు, బిక్కి మురళి, గిరగాని నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. దళారులకు విక్రయించొద్దు చెన్నారావుపేట : రైతులను దళారులకు ధాన్యం విక్రయించొద్దని మండల ప్రత్యేక అధికారి బాలకృష్ణ కోరారు. మండల కేంద్రంలో నవభారతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే పంట ఉత్పత్తులను విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు గంగిడి కవిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్దెన రమేశ్, నాయకులు వీరారెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణ చైతన్యరెడ్డి, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీలకు భవనాలు కరువు
● ప్రజలకు, పాలకవర్గాలకు ఇబ్బందులుఖానాపురం : గ్రామ పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ప్రజలు, పాలకవర్గాలకు ఇబ్బంది తప్పడం లేదు. పలు తండాలను పంచాయతీలుగా ప్రకటించిన గత ప్రభుత్వం సదరు జీపీలకు భవనాలు నిర్మింపజేయడాన్ని విస్మరించింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సొంత భవనాల్లేని గ్రామ పంచాయతీలను పట్టించుకున్న దాఖలాల్లేవంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 21 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా 14 పంచాయతీలకు సొంత భవనాలుండగా మిగతా ఏడు అద్దె గదుల్లో, ప్రభుత్వ పాఠశాల భవనాల్లో కొనసాగుతున్నాయి. కొడ్తిమాటుతండా, బాల్‌తండా, భద్రుతండా, బోటిమీదితండా, బండమీదిమామిడితండా, నాజీతండాలకు సొంత భవనాల్లేవు. కొత్తూరులో చేపట్టిన పంచాయతీ భవనం అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉంది. అద్దె గదుల్లో, అరకొర వసతుల నడుమ పంచాయతీల నిర్వహణ ఇబ్బందిగా పరిణమించిందంటూ పలువురు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. నిధుల కేటాయింపు కీలకం గ్రామ పంచాయతీలకు భవనాలు నిర్మించడానికి అవసరమైన స్థల సేకరణతోపాటు నిధుల కేటాయింపు కీలకం. కాగా గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఆ దిశగా చేసిందేమీ లేదు. కొడ్తిమాటుతండా, బాల్‌తండా, భద్రుతండా, బోటిమీదితండా, బండమీదిమామిడితండా, నాజీతండా గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి స్థల సేకరణ సైతం చేపట్టలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాల అమలులో, పాలకవర్గాల సమావేశాల నిర్వహణకు సర్పంచ్‌లు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇరుకై న అద్దె గదుల్లో తాగునీటి, మరుగుదొడ్లు, తదితర కనీస మౌలిక వసతులు సైతం లేవు. ఇకనైనా ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సొంత భవనాల్లేని గ్రామ పంచాయతీలన్నిటికీ స్థలాలు సేకరించడంతోపాటు నిధులు కేటాయించి సత్వరమే సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని కేటాయించారు. ఇరుకై న, ఒకే గదిలో కార్యాలయ నిర్వహణ చాలా ఇబ్బందిగా ఉంది. సమావేశం నిర్వహించాలన్నా సమస్య ఎదురవుతోంది. వర్షాలు కురిస్తే ఫైళ్లు తడిచి నష్టం జరిగే ప్రమాదం ఉంది. – బానోతు వీరన్న, సర్పంచ్, భద్రుతండా నూతన పంచాయతీలకు భవనాల నిర్మాణం కోసం ఏడాది క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. నాలుగు సార్లు సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే భవనాలు నిర్మింపజేసే దిశగా చొరవ తీసుకుంటాము. – అంబటి సునీల్‌కుమార్, ఎంపీఓ -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
వర్ధన్నపేట/రాయపర్తి/పర్వతగిరి: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు చెల్లింపులను త్వరగా అందించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల పరిధిలోని ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో రైతులకు అందిస్తున్న సౌకర్యాలు ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తేమశాతం పరీక్షలు, గన్నీ బ్యాగుల లభ్యత, ధాన్యం నిల్వలు, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, కూర్చునే కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేగవంతంగా కాంటాలు పూర్తిచేసి గోదాం, మిల్లులకు తరలించాలన్నారు. అనంతరం ఐకేపీ కేంద్రాల నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వర్ధన్నపేటలోని వీరభద్ర రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుమ, తహసీల్దార్ విజయ్‌సాగర్, సివిల్ సప్లై డీఎం సంధ్యారాణి, ఎంపీడీఓ వెంకటరమణ, వ్యవసాయ, ఐకేపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులపై సమీక్షన్యూశాయంపేట: మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష ని ర్వహించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన మౌలిక వసతులు, రహదారి సదుపాయాలు, విద్యుత్ తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీఓ సుమ, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, ఎయిర్పోర్ట్ అధికారి నటరాజ్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ ఆనందం, అధికారులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ వేగవంతం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కాకుండా మద్దతు ధర అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17,457 మంది రైతుల నుంచి రూ.213.45 కోట్ల విలువైన 88,937.20 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించాలి ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతీ 45 రోజులకు ఒకసారి ఆస్పత్రుల డైట్ క్యాంటీన్లలో తనిఖీ చేపట్టాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. స్ట్రీట్‌ఫుడ్ వెండర్స్ విక్రయిస్తున్న ఆహార పదార్థాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ -
మార్కెట్లో దళారీ వ్యవస్థను నిర్మూలించాలి
నర్సంపేట : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేజావత్ వాసునాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలోని బృందం స్థానిక ఆర్డీఓకు బుధవారం వినతిపత్రం అందజేసింది. అనంతరం వాసు మాట్లాడారు. మార్కెట్లో కాంటా వేసిన బస్తాలను భద్రపర్చాలని, వేలిముద్రల కౌంటర్ల సంఖ్య పెంచడంతోపాటు గన్నీ బ్యాగులు అందించాలని, వర్షానికి మక్కలు తడవకుండా పరదాలు సమకూర్చాలని, మక్కలను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ధారావత్ సుభాష్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బోడ బాబు, గోర్ సిక్వాడీ నాయకుడు సంతోశ్, సేవాలాల్ సేవ జిల్లా అధ్యక్షుడు చందులాల్, నాయకులు రాములు, వెంకన్న, చంద్రశేఖర్, రమేశ్, రాజు, శ్రీనివాస్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
బస్సు సర్వీసు నడిపించాలి
వర్ధన్నపేట : మండలంలోని నల్లబెల్లికి బస్సు సర్వీస్ ట్రిప్పులను నడిపించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకుడు బిర్రు మహేందర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడారు. బొల్లికుంటలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఐదు రోజులుగా బస్సు నడవడం లేదన్నారు. తాత్కాలికంగా పంథిని మీదుగా బస్సును నడిపించి ప్రజల రవాణా ఇబ్బందులు తొలగించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్యాల దేవేందర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు గోలి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. ఇద్దరిపై కేసుచెన్నారావుపేట : మండలంలోని అమీనా బాద్‌కు చెందిన బండి సారయ్య, బండి దిలీప్‌లపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన సింగరబోయిన ఎల్లయ్యపై సారయ్య, దిలీప్ దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసినట్లు ఎస్సై వివరించారు. ఆర్థికసాయందుగ్గొండి : మండలంలోని స్వామిరావుపల్లికి చెందిన దాసరి వెంకటయ్య ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబానికి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి బుధవారం రూ.5 వేల నగదుతోపాటు 50 కిలోల బియ్యం సాయంగా అందజేశారు. తొలుత వెంకటయ్య చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగె నర్సింగరావు, నాయకులు కూరతోట సురేశ్, బండారి ప్రకాశ్, కోర్కెల ప్రశాంత్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబురావు, తదితరులు పాల్గొన్నారు. ఇల్లందలో.. వర్ధన్నపేట : మండలంలోని ఇల్లందకు చెందిన చెన్న నాగమ్మ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి వన్నాల వెంకటరమణ, మండల అధ్యక్షుడు అడప రాజు, ఊట్ట పెద్దిరెడ్డి, రాంప్రసాద్ బుధవారం పరామర్శించారు. తొలుత నాగయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.2 వేల నగదు, క్వింటా బియ్యం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాంపెల్లి యాకయ్య, సట్ల అనిల్, దుర్గయ్య, బాబు, శంకర్, శ్రీధర్, రాము, హరీశ్, రాకేశ్, శ్రీకాంత్, రాము, అభి తదితరులు పాల్గొన్నారు. నివాళిగీసుకొండ : మండలంలోని కొమ్మాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయ వంశపారంపర ్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందగా ఆయన మృతదేహానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాసాచార్యులు అంత్యక్రియల కోసం ఆలయ నిధుల నుంచి బాధిత కుటుంబానికి కార్యనిర్వాహక అధికారి (ఈఓ) రూ.20 వేలు అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శసంగెం : మండలంలోని తిమ్మాపూర్ మాజీ సర్పంచ్ గన్ను శారద అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఆరోగ్య సమస్యపై అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గన్ను సంపత్, వేల్పుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై విచారణ చేయించాలి’ కాశిబుగ్గ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బీకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాల తో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. విద్యార్థులకు తీరని నిరాశ మిగిలిందని పేర్కొన్నారు. నిపుణుల సూచనల మేరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. -
సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం
నల్లబెల్లి : పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ తెలిపారు. మండలంలోని గుండ్లపహాడ్లో కూస అనిత రంజిత్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని చరణ్ సింగ్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి కట్టుబడి ఉందన్నారు. ఈ క్రమంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నట్టు తెలిపారు. మిగతా లబ్ధిదారులు సైతం త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోదన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చిట్యాల తిరుపతిరెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు వైనాల అశోక్, కడుదూరి కట్టయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్, సర్పంచ్ కడుదూరి అనిత శ్రీనివాస్, నాయకులు గోవిందు రంజిత్, కూస బాబు తదితరులు పాల్గొన్నారు. -
యువతి ఆత్మహత్యాయత్నం
● రహదారిపై ఆందోళనవర్ధన్నపేట : తన పిల్లలను తనకు ఇప్పించాలని కోరుతూ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో యువతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీస్‌స్టేషన్ సమీపంలో రహదారిపై బంధువులతో కలిసి ఆమె ఆందోళనకు దిగింది. వివరాలిలా.. గుబ్బెటితండాకు చెందిన సురేశ్‌కు తాళ్లకుంటతండాకు చెందిన మౌనికతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగి ముగ్గురు పిల్లలు కలిగారు. సురేశ్‌కు వివాహేతర సంబంధం ఉందని గతేడాది జరిగిన గొడవలో సురేశ్ తండ్రి మృతి చెందాడు. సురేశ్ జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. సురేశ్ పిల్లలను మౌనిక నుంచి తీసుకెళ్లి మరో యువతితో సహజీవనం సాగిస్తున్నాడు. తన పిల్ల లను తనకు ఇప్పించాలంటూ మౌనిక పెద్దమనుషులకు, పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. మూడ్రోజుల క్రితం మౌనిక మళ్లీ పోలీసులను ఆశ్రయించగా ఇరు కుటుంబాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో బుధవారం పోలీస్‌స్టేషన్ బయట ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ నిర్వహిస్తుండగా ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్ల పరస్పరం దాడి చేసుకున్నారు. మౌనిక ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. అలాగే రోడ్డుపై వెళ్తున్న వాహనం కింద పడేందుకు ప్రయత్నం చేసింది. సుమారు రెండు గంటలపాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు సురేశ్‌ను అదుపులోకి తీసుకోగా పోలీసులు సురేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, లంచం డిమాండ్ చేస్తున్నారని, తన పిల్లలను సురేశ్‌తో కలిసి ఉంటున్న యువతి హింసిస్తోందని మౌనిక ఆరోపించింది. సీఐ శ్రీనివాస్, ఎస్సై సాయిబాబు ఇరువర్గాలను అదుపులోకి తీసుకొచ్చారు. -
కాజీపేట మీదుగా వేసవి 8 ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం కాజీపేట జంక్షన్ మీదుగా హైదరాబాద్–గోరఖ్‌పూర్ మధ్య అప్ అండ్ డౌన్ రూట్లో 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జూన్ 5, 12, 19, 26వ తేదీల్లో హైదరాబాద్–గోరఖ్‌పూర్ (07075) మధ్య ప్రయాణించే సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు 23:28 గంటలకు చేరుకుంటుంది. జూన్ 7, 14, 21, 28వ తేదీల్లో హైదరాబాద్–గోరఖ్‌పూర్ (07076) వెళ్లే సమ్మర్ స్పెషల్ ట్రైన్ కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు 04:48 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్, నాగపూర్ జంక్షన్, బేతుల్, ఈటార్సీ, భోపాల్, బీనా జంక్షన్, విజిల్ ఝాన్సీ జంక్షన్, ఒరాయ్, పొక్రాయన్, ఖాన్పూర్ సెంట్రల్, ఆష్భాగ్ జంక్షన్, లక్నో సిటీ, గోంటినగర్, బరబంకి జంక్షన్, గోండా జంక్షన్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ వేసవి ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రుద్రేశ్వరుడిని దర్శించుకున్న జస్టిస్ తిరుమలాదేవి హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని బుధవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తిరుమలాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు ఆలయ మర్యాదలతో జస్టిస్ తిరుమలాదేవి దంపతులను ఘనంగా స్వాగతించారు. ఆమె రుద్రేశ్వరుడిని దర్శించుకుని గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగు ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ తిరుమలాదేవి మాట్లాడుతూ.. తాను పలుమార్లు ఈ దేవాలయాన్ని సందర్శించి మొక్కుబడులు సమర్పించుకున్నట్లు తెలిపారు. దేవాలయాలు సమాజహిత కేంద్రాలుగా విరజిల్లాలని, పురాతన దేవాలయాల్లో పూజలు నిర్వహించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రముఖులను దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ మోహన్‌శర్మ, ఆర్జేసీ రామకృష్ణరావు, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు. -
మనస్సు పెడితే మనోహరమే..
ఖిలా వరంగల్ : చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని మధ్యకోటలో పర్యాటక అభివృద్ధి పనులు కొనసాగడం లేదు. ప్రభుత్వం మనసు పెడితే మరింత మనోహరంగా కనిపిస్తుందని చరిత్రకారులు భావిస్తున్నారు. రాతికోట చుట్టూ విశాలమైన, లోతైన (నీటికోట) అగర్త చెరువు 60శాతం మేర నేటికి కనిపిస్తోంది. కాకతీయుల రాజధానిలోకి శత్రువులు అడుగు పెట్టేందుకు అవకాశం లేకుండా రక్షణగా అగర్త చెరువులో అప్పట్లో మొసళ్లను పెంచేవారు. నేడు మత్స్యకారులు చేపలు పెంచుతూ ఉపాధిని పొందుతున్నారు. నిలిచిన రూ.2కోట్ల అభివృద్ధి పనులు.. రాతికోట పక్కన తాచుపాములా వంపు సొంపులతో సుందరంగా (మోటు) అగర్త చెరువు కనిపిస్తుంది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సత్యశారద, మంత్రి కొండా సురేఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వీరి ప్రతిపాదనలతో మోటు పునరుజ్జీవనం/స్పాంజ్పార్కు కోసం గతేడాది డిసెంబర్ 16న ప్రభుత్వం రూ.2కోట్ల నిధులు కేటాయించి పనులను మంత్రి ప్రారంభించారు. పర్యాటకులకు బోటింగ్, చెరువు గట్టుపై సేదదీరేందుకు టేబుల్స్, టీ స్టాల్స్, విశ్రాంతి గదులు, సాయంత్రం గ్రీనరీలో పర్యాటకులు కోట అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించి మొదటి దఫా రాతికోట ఉత్తర ద్వారం నుంచి తూర్పు ద్వారం వరకు అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఆదిలోనే అడ్డంకులు శంకుస్థాపన కాగానే అధికారులు పునరుజ్జీవనం కోసం మోటులోని నీటిని తొలగించి, పనులు ప్రారంభించారు. అంతలోనే పలువురు భూ నిర్వాసితులు పరిహారం కోసం పనులు అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద ఐదుగురు రైతులు ఐదెకరాల భూమిని కోల్పోతున్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని స్థానికులనుంచి ఒత్తిడి రావడంతో రైతులు నామమాత్రపు పరిహారంతోపాటు ఉపాధిని చూపిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మంత్రి దృష్టి సారిస్తే.. మోటును అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక పెరగడంతోపాటు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అభివృద్ధి పనులపై మంత్రి కొండా సురేఖ దృష్టి సారిస్తే, అధికారులు తక్షణమే స్పందించి భూ నిర్వాసితులతో మాట్లాడితే.. పునరుద్ధరణ పనులు ప్రారంభమవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. పరిహారం చెల్లిస్తే సహకరిస్తాం.. మోటు పునరుద్ధరణ కింద ఐదుగురు రైతులు ఐదెకరాల భూమిని కోల్పోతున్నాం. ప్రభుత్వం నామమాత్రపు పరిహారంతోపాటు ఉపాధిని చూపిస్తే భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో అధికారులు చర్చలు జరిపితే ఆభివృద్ధికి సహకరిస్తాం.. – బైరబోయిన శివాజీ, భూ నిర్వాసితుడు రూ.2కోట్లతో మోటు, గ్రీనరీ, తదితర పనులకు శంకుస్థాపన అడ్డుకున్న భూమి కోల్పోతున్న రైతులు నిలిచిన పునరుద్ధరణ పనులు పరిహారం చెల్లిస్తే సహకరిస్తామంటున్న రైతులు -
ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో బుధవారం కలెక్టరేట్లో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కావ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. గుడిని ఎంత శ్రద్ధగా చూసుకుంటారో బడిని కూడా అదే బాధ్యతతో చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి సర్పంచ్‌లు ముందుండాలని కోరారు. డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. డీఈఓ గిరిరాజు బాబు, అధికారులు, సర్పంచ్‌లు, ఎంఈఓలు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్.. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక బాధ్యతలపై అవగాహన పెంపొందించేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో 12వ జాతీయ స్థాయి ‘హ్యూమన్ రైట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటిషన్–2026’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. 3 నుంచి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లను ఏ భారతీయ భాషలోనైనా రూపొందించవచ్చని, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తప్పనిసరి అని వివరించారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.2లక్షలు, ద్వితీయ బహుమతి రూ.1.5 లక్షలు, తృతీయ బహుమతి రూ.లక్షతో పాటు ప్రత్యేక ప్రస్తావనకు ఎంపికై న నాలుగు చిత్రాలకు తలా రూ.50 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల సమాచారాన్ని విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంట్రీలను జూన్ 30లోగా పంపాలని తెలిపారు. -
పేగుబంధం వదులుకుంది..! వైద్యబంధం అల్లుకుంది..!!
ఆడశిశువుకు ‘అమ్మ’ ప్రేమను పంచిన జనగామ ఎంసీహెచ్తిక్కరపు పద్మ, నరేష్ దంపతులు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇటుక తయారీ పనులు చేస్తున్నారు. నలుగురు పిల్లలు ఉన్న వీరికి మార్చి 23న ఐదో సంతానంగా చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌లో ఆడపిల్ల జన్మించింది. పుట్టుక సమయంలో పాప బరువు 1.25 కిలోలు మాత్రమే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో వైద్యులు తక్షణ చికిత్స ప్రారంభించారు. వారం రోజుల తర్వాత పద్మ కుట్లు విప్పిన వెంటనే పాప ఆడపిల్ల కావడంతో ‘మేము సాకలేం, మీరే చూసుకోండి’ అంటూ డాక్టర్లకు చెప్పి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అసాధారణమైన ఈ ఘటనను గమనించిన డాక్టర్ మధుసూదన్‌రెడ్డి విషయం వెంటనే చైల్డ్ వెల్ఫేర్‌శాఖకు తెలియజేశారు. అధికారులు వచ్చి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, పాపను తామే పెంచుకుంటామని వారినుంచి హామీ తీసుకున్నారు. అయితే తల్లిదండ్రులు రెండు రోజులు గడవకముందే ఎవరికీ చెప్పకుండా ఆస్పత్రిలోనే పాపను వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే ఆస్పత్రి రికార్డులో ఉన్న ఫోన్‌నంబర్ ఆధారంగా నరేష్‌కు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు, మీ ఊరు ఏంటి అని అడిగారు. ఒకసారి రాయలసీమ, మరోసారి ఉత్తరాంధ్ర అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు డాక్టర్లు తెలిపారు. లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి వెళ్లిచూడగా వారు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. జనగామ: నెలలు నిండకముందే 1.25 కిలోల బరువుతో పుట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాపతో రక్తబంధం వదిలేసుకున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ పసికందును ఈ లోకంలోకి తీసుకువచ్చిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రం అక్కున చేర్చుకున్నారు. రోజంతా పర్యవేక్షణ, పాల ఫీడింగ్, ప్రేమతో కూడిన సంరక్షణతో ఆ శిశువులో నెమ్మదిగా మార్పు తీసుకువచ్చారు. తల్లి దూరమైన చోట మానవత్వం వెల్లివిరిసింది. నేడు పాప బరువు 2.3 కిలోలకు చేరి ఆరోగ్యంగా మారింది. జనగామ జిల్లా చంపక్ హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 50 రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇప్పటికీ అందరినీ కదిలిస్తోంది. పేగుబంధం వదిలి వెళ్లినా.. అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి, శిశువు కథ ఇది. అమ్మగా మారిన ఎస్ఎన్సీయూ పాపను పేగుబంధం కాదనుకున్నా.. వైద్యులు అక్కున చేర్చుకున్నారు. డాక్టర్ మధుసూదన్‌రెడ్డి పర్యవేక్షణలో పాపకు ఎస్‌ఎన్‌సీయూలో మెరుగైన వైద్యం అందిస్తూ, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు చికిత్స చేసుకుంటూ వచ్చారు. రోజూ పాల డబ్బాతో ఫీడింగ్, అమ్మ ప్రేమ, లాలన అందిస్తూ పసిబిడ్డకు మాతృమూర్తుల్లా డాక్టర్లు, నర్సులు సంరక్షిస్తున్నారు. ఎనిమిది రోజుల వయసులో తల్లి ప్రేమ కోల్పోయిన ఈ పాపకు, ఎస్ఎన్సీయూ సిబ్బందే దేవుడిచ్చిన అమ్మలు అయ్యారు. తక్కువ బరువు నుంచి సంపూర్ణ ఆరోగ్యానికి.. 50 రోజుల చికిత్సతో పాప స్థితి రోజురోజుకూ మెరుగైందని డాక్టర్లు తెలిపారు. పాప పుట్టిన సమయంలో కిలో 250 గ్రాములు ఉండగా, ప్రస్తుత బరువు 2.300 కిలోలతో పూర్తిగా కోలుకుంది. ఎటువంటి అనారోగ్య సమస్య లేదు. బరువు 2.5 కిలోలకు చేరగానే చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో హనుమకొండ శిశుగృహానికి పాపను తరలించనున్నట్లు ఎంసీహెచ్ వైద్యుడు మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.శిశువుకు అమ్మ ప్రేమను పంచుతున్న డాక్టర్, సిబ్బంది నెలలు నిండక తక్కువ బరువు, అనారోగ్య సమస్యలతో శిశువు జననం సాకలేమని వదిలివెళ్లిన తల్లిదండ్రులు.. అక్కున చేర్చుకున్న ఆస్పత్రి రక్తబంధం వదిలినా.. తల్లి ప్రేమ పంచి అన్నీ తామై చూసుకున్న వైద్యులు, సిబ్బంది 50 రోజుల్లో అద్భుతం.. బరువు పెరగడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా శిశువు -
గుడి.. రాజకీయ వేడి!
● ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో కాకతీయుల నాటి శివాలయం కూల్చివేత ● ప్రతిపక్ష పార్టీల నాయకుల రాకతో పెరిగిన పొలిటికల్ హీట్ ● ప్రభుత్వంపై బీజేపీ ప్రతిపక్ష నేత ఏలేటి, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం ● గుడి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామంటున్న కాంగ్రెస్ నేతలు సాక్షి, వరంగల్/ఖానాపురం: ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఉన్న 794 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన శివాలయం కూల్చివేత రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ ఆలయాన్ని సందర్శించారు. కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. భూములపై ఉన్న పిచ్చితో దేవాలయ భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఈ నెల 8న ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్షలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిలో దేవాదాయశాఖ భూమిగా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూభారతిలో ప్రభుత్వ భూమిగా ఎలా మారిందో చెప్పాలని, లంకెబిందెల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం శివాలయాలను కూల్చేస్తోందని హరీశ్‌రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ‘తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన సాగుతోందంటూ.. తక్షణం ప్రభుత్వమే శివాలయాన్ని పునఃరుద్ధరించాలి’ అని డిమాండ్ చేశారు. ఆలయాన్ని పునఃరుద్ధరించడంతో పాటు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఆర్కియాలజీ పరిధిలోకి తీసుకువస్తామని నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అంతకుముందే బదులిచ్చినా.. ఈ శివాలయం కూల్చివేత రాజకీయ వేడిని మాత్రం పెంచేసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నెల 7న ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి సందర్శించింది. గర్భగుడి కింద సుమారు 24 ఫీట్ల లోతు తవ్వకాలు చేపట్టి, ఆ తర్వాత సగానికి పైగా కూల్చివేసినట్లు ఆనవాళ్లు కనిపించినట్లు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి హరీశ్‌రావు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆలయం కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖానాపురం పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఫిర్యాదు చేయడంతో మరింత వేడి నెలకొంది. గర్భగుడి కింద భారీగా తవ్వకాలు ఎందుకు జరిగాయనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కూల్చివేత మరిన్ని విమర్శలకు తావిస్తోంది. అసలేం జరిగిందంటే.. ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో 1232లో గణపతి దేవుని ఆధ్వర్యంలో శివాలయ నిర్మాణం చేశారు. సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో శివాలయాన్ని నిర్మించి చుట్టూ మట్టికోటను ఏర్పాటు చేశారు. ఇటీవల నర్సంపేటకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం శివాలయానికి చెందిన 30 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో మట్టికోట లోపల శివాలయంతో కూడిన 14 ఎకరాల స్థలాన్ని సైనిక్‌స్కూల్ అధికారులు అప్పగించారు. దీంతో ఈనెల నాలుగో తేదీ రాత్రి సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో పనులు చేస్తూ శివాలయాన్ని కూల్చడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పురాతన శివాలయం ఆలయాన్ని పునఃరుద్ధరించడంతో పాటు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెప్పిన మాటలు ఆచరణ రూపంలోకి వచ్చేంత వరకు ఈ రాజకీయ సెగలు చల్లారేలా లేదు. ఆలయాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోకున్నా ఈ ఆధ్యాత్మిక అంశం ఎటువైపు మళ్లుతుందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది. -
కులమతాలకతీతంగా కలిసి ఉండాలి
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ దామెర: కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలసి ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మండలంలోని ముస్త్యాలపల్లిలో బొల్లం లక్ష్మణ్–మంజు దంపతులు నిర్మించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు దామెర క్రాస్ వద్ద కాంగ్రెస్ జిల్లా నాయకులు గోపాల నవీన్‌రాజ్ ఆధ్వర్యంలో గజమాల వేసి స్వాగతం పలికారు. ముస్త్యాలపల్లిలో డప్పుచప్పుళ్ల మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రేణుకా ఎల్లమ్మతల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ‘కుడా’ చైర్మన్, హనుమకొండ డీసీసీ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అరుణోదయ సంస్థ అధ్యక్షురాలు విమలక్క, వరంగల్ డీసీసీ చైర్మన్ అయూబ్, రాష్ట్ర నాయకులు మీసాల ప్రకాశ్, బుద్దె పెద్దన్న, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా వరంగల్ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పాల్గొని పూజలు నిర్వహించారు. -
అక్రమాల బాట.. అవినీతి మేట!
ఫైల్ కదలాలన్నా.. పని కావాలన్నా.. పైసలివ్వాల్సిందే!ఏప్రిల్ 23–24 తేదీల్లో వరంగల్ జిల్లా విద్యాశాఖ (డీఈఓ) కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. పాఠశాలల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ఫైళ్లు, ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, పెండింగ్ బిల్లులు, చెల్లింపుల వివరాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల అనుమతుల ఫైళ్లను పరిశీలించి ఉన్నతాధికారులకు అక్రమాలపై నివేదిక పంపారు.ఏప్రిల్ 16న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ వెంకట్లాల్ను విచారించి, పలు కీలక రికార్డులు పరిశీలించారు. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం, ఫైళ్ల పెండింగ్, రిజిస్ట్రేషన్ విధానాలపై నివేదిక ప్రభుత్వానికి పంపారు. ఏప్రిల్ చివరి వారం, ఈ నెల మొదటివారంలో విజిలెన్స్, ఏసీబీ అధికారులు వేర్వేరుగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వడ్డేపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులు స్వాధీనం చేసుకుని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేశారు, ఆ తర్వాత విజిలెన్స్ నివేదికల ఆధారంగా వారిని సస్పెండ్ కూడా చేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ‘పైసలిస్తేనే ఫైలు కదులుతుంది’ అనే పరిస్థితులు నెలకొన్న ఆరోపణలకు తాజాగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు బలం చేకూర్చినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, రవాణా, సంక్షేమ, విద్య, వైద్యశాఖలతో పాటు పారిశ్రామిక యూనిట్లలోనూ జరిగిన ఆకస్మిక తనిఖీల్లో అనేక అక్రమాలు, నిర్లక్ష్యాలు, నిబంధనల ఉల్లంఘన వెలుగుచూసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విజిలెన్స్ అధికారులు త్వరలో సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. ‘రేటు’ లేకపోతే ఫైల్ కదలదా.. విజిలెన్స్ తనిఖీల్లో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం ‘ప్రతీ పనికి ఓ రేటు’ వ్యవస్థ కొనసాగుతున్నదేనని తెలిసింది. కొందరు అధికారులు, సిబ్బంది ఫైళ్ల పరిష్కారం కోసం బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వనివారి ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంచుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు సమాచారం. విజిలెన్స్ దృష్టి.. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తుల వ్యవస్థ బలంగా పనిచేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అధికారులపై ప్రభావం చూపుతున్నారని, సాధారణ ప్రజలు నేరుగా కార్యాలయాల్లో పనులు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. దవాఖానాల్లో వైద్య సేవల దుస్థితి ఎంజీఎం ఆస్పత్రితో పాటు జిల్లా, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో నిర్వహించిన తనిఖీల్లో కూడా పలు లోపాలు బయటపడినట్లు తెలిసింది. కొన్నిచోట్ల వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడం, రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, ఆధునిక పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు లేక వినియోగంలోకి రాకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మందుల కొరత, సిబ్బంది ఖాళీలు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తేలినట్లు తెలిసింది. పరిశ్రమల్లో భద్రతా లోపాలు.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ధర్మసాగర్, పర్వతగిరి, జనగామ పరిసర పారిశ్రామిక యూని ట్లలోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలుష్య నియంత్రణ చర్యలు కేవలం రికార్డులకే పరిమితమవుతున్నాయని, కొన్ని పరిశ్రమలు తక్కువ వేతనాలతో అనుభవం లేని కార్మికులను నియమించుకుని భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వరుస తనిఖీలతో కలకలం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న విజిలెన్స్ దాడులు అధికారవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిన అవినీతి, జాప్యం, మధ్యవర్తుల వ్యవస్థపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. వివిధ శాఖల్లో గుర్తించిన అక్రమాలు, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర నివేదిక ఆధారంగా త్వరలో మరిన్ని చర్యలు ఉండొచ్చన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంతమంది అధికారుల తీరిది వెల్ఫేర్, రిజిస్ట్రేషన్, రవాణా, రెవెన్యూలో విచ్చలవిడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిశీలనలో బట్టబయలు -
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాళోజీ సెంటర్: పదో తరగతిలో ఉత్తీర్ణులు కాని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే స్పెషల్ రెమీడియల్ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. వరంగల్ నరేంద్రనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సంపేట బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన క్యాంపులను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు నిరుత్సాహానికి గురికాకుండా తిరిగి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని క్యాంపులను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాశాఖ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ మూడో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. మొదటి రోజు గీసుకొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల నుంచి 70 మంది విద్యార్థులు నరేంద్రనగర్ పాఠశాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ, డీడబ్ల్యూఓ రాజమణి, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ, జీహెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొక్కజొన్నల కొనుగోళ్లకు చర్యలు న్యూశాయంపేట: మొక్కజొన్నల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పలు శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 16,546 మంది రైతుల నుంచి 201.81 కోట్ల విలువైన 84,090.9 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోల్లు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 1,37,250 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేయగా.. అందులో ఇప్పటికే 65,729 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వచేసినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత నమోదు భారత రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సభ్యత్వ నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు(క్రిమినల్ కేసులు లేనివారు) సభ్యత్వాన్ని పొందవచ్చన్నారు. దరఖాస్తు ఫారం పూర్తిచేసి రెండు ఫొటోలు, ఆధార్‌కార్డు ప్రతితో పాటు శాశ్వత సభ్యత ఫీజు 1,100 రూపాయలు చెల్లించాలని సూచించారు. సభ్యత్వం పొందిన వారికి శాశ్వత సభ్యత్వ కార్డు అందించనున్నట్లు తెలిపారు. ఈనెల 13 నుంచి 31 వరకు వరంగల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ వివరించారు. మహిళలకు ఉపాధి కల్పించాలి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కిటెక్స్ కంపెనీలో 1800 స్టిచ్చింగ్ పోస్టుల భర్తీపై కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. టైలరింగ్‌పై పట్టు ఉన్న మహిళలను ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు 12,300 నుంచి 21,800 వరకు వేతనం నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నరసింహామూర్తి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, కంపెనీ ప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
విద్యారణ్యపురి: ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హనుమకొండ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఈనెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఐఈఓ ఎ.గోపాల్ మంగళవారం తెలిపారు. జిల్లాలో ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు కలిపి 16,424 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 32 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 32 మంది డిపార్ట్మెంటల్ ఆపీసర్లను, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లను 23 మందిని నియమించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు రెండు ఫ్లయింగ్‌స్క్వా డ్ల బృందాలు, మూడు సిట్టింగ్ స్క్వాడ్ల బృందాలను నియమించినట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమాచారం కోసం కంట్రోల్ రూమ్‌కు 93816 72094, 95027 43435లో సంప్రదించాలని గోపాల్ సూచించారు. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీస్ వాహనాల పాత విడిభాగాలను ఈ నెల 15న (శుక్రవారం) వేలం వేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ పోలీస్ వాహనాలకు సంబంధించి రిపేర్ చేయబడిన బ్యాటరీలు, టైర్లు, విడిభాగాలను వేలంలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిషనరేట్ కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఎంటీఓ)లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 87126 85158, 94402 42895, 99495 68320 నంబర్లలో సంప్రదించాలని సీపీ సూచించారు. కేయూ క్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలు పెంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో ప్లేస్మెంట్ సెల్, మేజిక్ బస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోందన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. కేయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ చిర్రరాజు మాట్లాడారు. ఈజాబ్ మేళాలో 12 ప్రముఖ సంస్థలు పాల్గొనగా విద్యార్థులు హాజరయ్యారు. కాశిబుగ్గ: ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది పేషెంట్లకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ నర్సెస్ డే సందర్భంగా ఎంజీఎంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి, నర్సింగ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు అశ్విన్, ఎ.మధుకర్, నర్సింగ్ ఆఫీసర్ దయాశీల, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ వై.సుజాత, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీకేఎం ఆస్పత్రిలో... వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో నర్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రతిజ్ఞ చేశారు. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు స్వరూప, బేబీ రాణి, జ్యోతిర్మయి, మురళి, పద్మ, దిలీప్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు జి.రమణ, జి.వసంత లీల, ఉమారాణి, సుధ, అనిత, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి న్యూశాయంపేట: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలించిన వెంటనే రశీదులు ఇవ్వాలని పేర్కొన్నారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జిల్లాల్లో అవసరమైతే ప్రైవేట్ గోదాములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఎస్ఓ కిష్టయ్య,, డీఆర్డీఓ నాగపద్మజ, అధికారులు పాల్గొన్నారు. -
అజ్ఞాతం వీడిన పసునూరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోశ్ ఎట్టకేలకు ఉద్యమ బాటను వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సోమిడి నుంచి జార్ఖండ్ వరకు.. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా ఉన్న రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్ లీగ్‌లో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణదేవ్, గోపగాని అయిలన్న అలియాస్ మహేశ్‌తో కలిసి వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్‌గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకున్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏఓబీ, జార్ఖండ్‌లో మావోయిస్ట్ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్‌గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మ ణ్‌రావు అలియాస్ గణపతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్‌లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోష్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత నరహరి అలియాస్ విశ్వనాథ్ పార్టీ మెంబర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ప్రస్థానం.. నాలుగున్నర దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన అనుభవం జార్ఖండ్ ఇన్చార్జ్గా పనిచేసి లొంగిపోయిన నేత -
రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్
గీసుకొండ: మొగిలిచర్ల రైతువేదికలో భూసార పరిరక్షణ కోసం కలెక్టర్ సత్యశారద వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు వానాకాలం సాగు విషయంలో దిశానిర్దేశం చేశారు. తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఏఓ హరిప్రసాద్‌బాబు, బొడ్డుచింతలపల్లి సర్పంచ్ పోగుల వనితయుగేందర్, డీలర్స్ అసోసియేషన్ మెంబర్ బూసాని వేణుగోపాల్, ఏఈఓలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, పంచాయతీ కార్యదర్శులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. ఇళ్ల నమోదులో నిర్లక్ష్యం వద్దు నర్సంపేట: కేటాయించిన బ్లాక్‌లోని అన్ని రకాల ఇళ్లను నమోదు చేయడంలో ఎన్యుమరేటర్లు నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జేడీ సుబ్బరాజు అన్నారు. పట్టణంలోని ఒకటో వార్డు, మాదన్నపేటలో ఇళ్ల జాబితా నమోదును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాపులు తయారు చేయడంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. జాబితాలో వివరాలు క్షుణ్ణంగా నమోదు చేయాలన్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సతీశ్, అడిషనల్ చార్జ్ ఆఫీసర్ విజేందర్, సూపర్వైజర్ సర్దార్, ఎన్యుమరేటర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. నాగేంద్రస్వామికి ప్రత్యేక అలంకరణ గీసుకొండ: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఊకల్‌హవేలిలో ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని లక్ష తమల పాకుల (నాగవల్లి పత్రాల)తో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు, అర్చకులు శ్రీహర్ష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 15న వాహనాల పాత విడిభాగాల వేలంవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి పోలీసు వాహనాల పాత విడిభాగాలను ఈ నెల 15న (శుక్రవారం) వేలం వేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ప్రభుత్వ పోలీస్ వాహనాలకు సంబంధించి రిపేర్ చేయబడిన బ్యాటరీలు, టైర్లు, విడిభాగాలను వేలంలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిషనరేట్ కార్యాలయంలోని మోటారు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ (ఎంటీఓ)లో సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 87126 85158, 94402 42895, 99495 68320 నంబర్లలో సంప్రదించాలని సీపీ సూచించారు. కొమ్మాల ఆలయ ధర్మకర్త శ్రీనివాసాచార్యులు మృతి గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు (85) మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాసాచార్యులుతో పాటు వంశంలోని పూర్వీకుల హయాంలోనే ఆలయ ప్రాశస్థ్యం వెలుగులోకి వచ్చింది. శ్రీని వాసాచార్యులుకు వెంకటాచార్యులు, వేణుగోపాలాచార్యులు, దామోదరాచార్యులు కుమారులు, భార్య పద్మావతి ఉంది. రెండో కుమారుడు వేణుగోపాలాచార్యులు అర్చక వృత్తిలోనే కొనసాగి గతంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆలయం వద్ద ఉన్న ఇంటి వద్దకు సమీప గ్రామాలవారు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. అంత్యక్రియలు బుధవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
టూరిజం హబ్‌గా వేయిస్తంభాల ఆలయం
హన్మకొండ కల్చరల్: టూరిజం హబ్‌గా వేయిస్తంభాల ఆలయం నిలుస్తుందని, దేవాలయ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నామని, యునెస్కోలో చేర్చడమే తమ ధ్యేయమని ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం హనుమకొండ శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. మంగళవారం జరిగిన పూజల్లో వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాగా, హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ఘనంగా జయంత్యోత్సవం, పూజలు నిర్వహించారు. శివప్రసాద్ దంపతుల సౌజన్యంతో అన్నప్రసాదాల వితరణ చేశారు. గుజ్జ సంపత్‌రావు భక్తుల కు మామిడిపండ్లు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తదితరులున్నారు. -
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026
విజిలెన్స్ తనిఖీల్లో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం ‘ప్రతీ పనికి ఓ రేటు’ వ్యవస్థ కొనసాగుతున్నదేనని తెలిసింది. కొందరు అధికారులు, సిబ్బంది ఫైళ్ల పరిష్కారం కోసం బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వనివారి ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంచుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో పెండింగ్ ఫైళ్లపై ప్రత్యేకంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. సాక్షిప్రతినిధి, వరంగల్: ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ‘పైసలిస్తేనే ఫైలు కదులుతుంది’ అనే పరిస్థితులు నెలకొన్న ఆరోపణలకు తాజాగా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు బలం చేకూర్చినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, రవాణా, సంక్షేమ, విద్య, వైద్యశాఖలతో పాటు పారిశ్రామిక యూనిట్లలోనూ జరిగిన ఆకస్మిక తనిఖీల్లో అనేక అక్రమాలు, నిర్లక్ష్యాలు, నిబంధనల ఉల్లంఘన వెలుగుచూసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విజిలెన్స్ అధికారులు త్వరలో సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. దవాఖానాల్లో వైద్య సేవల దుస్థితి ఎంజీఎం ఆస్పత్రితో పాటు జిల్లా, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో నిర్వహించిన తనిఖీల్లో కూడా పలు లోపాలు బయటపడినట్లు తెలిసింది. కొన్నిచోట్ల వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడం, రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, ఆధునిక పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు లేక వినియోగంలోకి రాకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మందుల కొరత, సిబ్బంది ఖాళీలు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తేలినట్లు తెలిసింది. పరిశ్రమల్లో భద్రతా లోపాలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ధర్మసాగర్, పర్వతగిరి, జనగామ పరిసర పారిశ్రామిక యూ నిట్లలోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలుష్య నియంత్రణ చర్యలు కేవలం రికార్డులకే పరిమితమవుతున్నాయని, కొన్ని పరిశ్రమలు తక్కువ వేతనాలతో అనుభవం లేని కార్మికులను నియమించుకుని భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వరుస తనిఖీల కలకలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న విజిలెన్స్ దాడులు అధికారవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిన అవినీతి, జాప్యం, మధ్యవర్తుల వ్యవస్థపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. వివిధ శాఖల్లో గుర్తించిన అక్రమాలు, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర నివేదిక ఆధారంగా త్వరలో మరిన్ని చర్యలు ఉండొచ్చన్న చర్చ సాగుతోంది. ఫైల్ కదలాలన్నా.. పని కావాలన్నా.. పైసలివ్వాల్సిందే! ప్రభుత్వశాఖల్లో కొందరు అధికారుల తీరిది వెల్ఫేర్, రిజిస్ట్రేషన్, రవాణా, రెవెన్యూలో విచ్చలవిడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి.. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిశీలనలో బట్టబయలు ప్రభుత్వానికి ‘విజిలెన్స్’ నివేదిక హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తుల వ్యవస్థ బలంగా పనిచేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అధికారులపై ప్రభావం చూపుతున్నారని, సాధారణ ప్రజలు నేరుగా కార్యాలయాల్లో పనులు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఏప్రిల్ చివరి వారం, ఈ నెల మొదటివారంలో విజిలెన్స్, ఏసీబీ అధికారులు వేర్వేరుగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వడ్డేపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులు స్వాధీనం చేసుకుని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేశారు, ఆ తర్వాత విజిలెన్స్ నివేదికల ఆధారంగా వారిని సస్పెండ్ కూడా చేశారు. ఏప్రిల్ 16న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ వెంకట్లాల్ను విచారించి, పలు కీలక రికార్డులు పరిశీలించారు. కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం, ఫైళ్ల పెండింగ్, రిజిస్ట్రేషన్ విధానాలపై నివేదిక ప్రభుత్వానికి పంపారు. ఏప్రిల్ 23–24 తేదీల్లో వరంగల్ జిల్లా విద్యాశాఖ (డీఈఓ) కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. పాఠశాలల రిజిస్ట్రేషన్, రెన్యూవల్ ఫైళ్లు, ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, పెండింగ్ బిల్లులు, చెల్లింపుల వివరాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల అనుమతుల ఫైళ్లను పరిశీలించి ఉన్నతాధికారులకు అక్రమాలపై నివేదిక పంపారు. -
పంటలకు యూరియా వాడకం తగ్గించాలి
శాయంపేట: పంటలో యూరియా వాడకాన్ని తగ్గించి రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలని వరంగల్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ విద్యాధర్, డాక్టర్ శ్రీజయ అన్నారు. మంగళవారం మండలంలోని వసంతాపూర్, ఆరెపల్లి గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. రైతుల ఆదాయ వృద్ధి, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, సమష్టి మార్కెంటింగ్, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో ఎఫ్పీఓల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు సంఘటితంగా పని చేసినప్పుడే వ్యవసాయం లాభదాయక రంగంగా మారుతుందని పేర్కొన్నారు. అనంతరం కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఓ ప్రియదర్శిని, ప్రొఫెసర్లు సిద్ధార్థ నాయక్, ఏఈఓ జ్యోస్న, వంశీకృష్ణ, సర్పంచ్‌లు భాస్కర్, దుర్నాల రమ, పీపీఓ హెడ్ ఉస్మాన్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు అశ్మిత, అరుణ, దేవేందర్, శివాజీ, ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఎన్జీఓ రాంబాబు, రైతులు పాల్గొన్నారు. -
న ర్సుల సేవలు అభినందనీయం
● ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి ● ఎంజీఎం, సీకేఎం ఆస్పత్రుల్లో ఘనంగా నర్సింగ్ దినోత్సవంకాశిబుగ్గ: ఆస్పత్రుల్లో నర్సింగ్ సిబ్బంది పేషెంట్లకు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ నర్సెస్ డే సందర్భంగా ఎంజీఎంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి, నర్సింగ్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు అశ్విన్, ఎ.మధుకర్, నర్సింగ్ ఆఫీసర్ దయాశీల, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ వై.సుజాత, జ్యోతి, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సీకేఎం ఆస్పత్రిలో... వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో నర్సింగ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రతిజ్ఞ చేశారు. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు స్వరూప, బేబీ రాణి, జ్యోతిర్మయి పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్ తోట దగ్ధం
నెక్కొండ: ప్రమాదవశాత్తు ఆయిల్‌పామ్ తోట దగ్ధమైన సంఘటన అలంకానిపేట గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన బాధిత రైతు చీకటి శ్రీనివాస్ కథనం ప్రకారం.. తనకున్న 6 ఎకరాల్లో ఉపాధి హామీ పథకం కింద 2019లో ఆయిల్‌పామ్ సాగుచేశాడు. ఇప్పుడు గెలలు కోసే దశకు వచ్చింది. ప్రమాదవశాత్తు తోటకు నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. దీంతో గమనించిన స్థానికులు, రైతులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని శ్రీనివాస్ వాపోయాడు. తోట మీదుగా వదులుగా ఉన్న విద్యుత్ తీగల రాపిడితో నిప్పు వచ్చి పడడంతోనే ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నాడు. అధికారులు స్పందించి పరిహారం అందించి న్యాయం చేయాలని కోరాడు. -
నీట్ రద్దు చేయడం బాధాకరం
రాజస్థాన్‌లో పేపర్ లీకై ందని నిర్ధారణ కావడంతో నీట్(యూజీ) పరీక్షను ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. నీట్ పరీక్ష కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. పరీక్ష బాగా రాశా. ఎక్కడో పేపర్ లీక్ అయిందనే సాకుతో నీట్ పరీక్షను రద్దు చేయడం బాధాకరం. ఇలాంటి ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవాలి. – వంగపండ్ల గౌతమి, స్టేషన్ ఘన్పూర్చివరికి నిరాశే మిగిలింది..ఎంతో కష్టపడి నీట్–26 ఎంట్రన్స్ పరీక్ష రాస్తే నిరాశే మిగిలింది. ఇంటర్మీడియెట్‌లో అధిక మార్కులు సాధించి, నీట్ పరీక్ష కోసం సమయాన్ని వృథా చేయకుండా చదివాను. ఎక్కువ మార్కులు తెచ్చుకుని పేదలకు సేవ చేసే డాక్టర్ కోర్సు చదువుకోవాలనేది నా లక్ష్యం. రాజస్థాన్‌లో పేపర్ లీక్ అవడంతో మా ఆశలు నీరుగారాయి. మళ్లీ పరీక్ష రాస్తే గతంలో మాదిరిగా రాస్తామో, లేదోనని ఆందోళన చెందాల్సి వస్తోంది. – జోగు రక్షిత, వరంగల్ పేపర్‌లీక్.. అభ్యర్థులకు శాపమే..నీట్ పేపర్ లీక్‌కావడం, ఎన్టీఏ నీట్‌ను రద్దు చేయడంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు శాపంగా మారింది. నేను ఇంటర్ బైపీసీలో 1,000 మార్కులకు 984 మార్కులు సాధించా. నీట్‌కు ప్రిపేర్ అయి పరీక్ష బాగా రాశాను. మంచి మార్కులు సాధించి సీటు వస్తుందనే భావనతో ఉన్నా. పేపర్ లీకై ందని పరీక్ష రద్దు చేశారనడంతో కంగుతిన్నా. మళ్లీ మొదటి నుంచి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మళ్లీ ప్రశ్నపత్రం ఎలా వస్తుందో తెలియదు. – ఎం.రిషిత, పున్నేలు, ఐనవోలు -
నగర సేవలు మరింత మెరుగుపడాలి
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ నగర సేవలు మరింత మెరుగుపడాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. అధికారులను ఆదేశించారు. మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలో పారిశుద్ధ్యం, ప్రజాసేవలు, ఆదాయ వనరుల బలోపేతం, వ్యర్థాల నిర్వహణ, వాహనాల వినియోగం, పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత వింగ్ అధికారులతో ఆమె సమీక్షించాకరు. సమావేశంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీపీ రవీంద్ర రాడేకర్, ఉప కమిషనర్లు బి.శ్రీను, సమ్మయ్య, సీహెచ్ఓ రమేష్, ఈఈలు రవి కుమార్, సంతోష్ బాబు, మాధవి, మహేందర్ తదితరులున్నారు. జనగణను పరిశీలన హనుమకొండలోని 28వ డివిజన్ పరిధిలో గోవిందరాజుల గుట్ట, సత్యం లేన్, స్టేషన్ రోడ్ ప్రాంతాల్లో జరుగుతున్న జనగణన ఎన్యుమరేషన్ ప్రక్రియను హైదరాబాద్ జనగణన శాఖ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు పరిశీలించారు. ప్రతీ కుటుంబ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ‘ఎస్ఐఆర్’ మ్యాపింగ్ వేగంగా పూర్తి చేయండివరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను వందశాతం పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులకు అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ పురోగతిపై సోమవారం మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ -
అజ్ఞాతం వీడిన పసునూరి
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ (మావోయిస్ట్) పార్టీ అగ్రనేత పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ అలియాస్ సంతోశ్ ఎట్టకేలకు ఉద్యమ బాటను వదిలారు. పార్టీ సాధారణ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నాయకుడి వరకు ఎదిగిన ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లారు. సుమారు మూడు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీ ఉద్యమంలో కొనసాగిన ఆయన మంగళవారం అడవిబాటను వదిలి పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. సోమిడి నుంచి జార్ఖండ్ వరకు.. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామం. 1980 నుంచి పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా ఉన్న రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్ లీగ్‌లలో ఆయన చురుకై న పాత్ర పోషించారు. పులి అంజయ్య, క్రాంతి రణదేవ్, గోపగాని అయిలన్న అలియాస్ మహేశ్‌తో కలిసి వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహించిన నరహరి.. అనతికాలంలోనే పోలీసులకు వాంటెడ్‌గా మారారు. నిర్బంధం తీవ్రం కావడంతో 1982లో పూర్తికాలపు కార్యకర్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి.. ఉత్తర తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేసిన ఆయన ఆంధ్రా ఒడిశా సరిహద్దుకు బదిలీపై వెళ్లారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఉద్యమ సహచరిని పెళ్లి చేసుకున్న ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఏఓబీ, ఝార్ఖంఢ్‌లో మావోయిస్ట్ ఉద్యమ విస్తరణకు కీలకంగా పని చేశారు. నరహరి పలు ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించినట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ క్రమంగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి వరంగల్ నుంచి చివరి లొంగుబాటు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్‌గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్‌లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్ట్ అగ్రనేత నరహరి అలియాస్ విశ్వనాథ్ పార్టీ మెంబర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ప్రస్థానం నాలుగున్నర దశాబ్దాలపాటు ఉద్యమంలో పనిచేసిన అనుభవం జార్ఖండ్ ఇన్చార్జ్గా పనిచేసి లొంగిపోయిన నేత -
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, హనుమకొండ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగిపోయారు. నరహరి భార్యతో పాటు పోలీసులు ఎదుట లొంగిపోయారు. రెండు పదుల వయస్సులో పోరుబాట పట్టి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో కొనసాగారు. సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ–సోమనారాయణకు ఐదుగురు కొడుకులు. వీరిలో రెండో కుమారుడు నరహరి.1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నక్సల్స్ విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతిరణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన స్నేహం ఆయనను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతోపాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టారు. -
వేసవి శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్‌గౌడ్ కమలాపూర్: విద్యార్థులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ గిరిరాజ్‌గౌడ్ సూచించారు. కమలాపూర్‌లోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వేసవి శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రీడలు, సంగీతం, నృత్యం, డ్రాయింగ్, వివిధ రకాల బోధనలు, నైపుణ్యాలు, యోగ, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లిష్, క్విజ్ కాంపిటీషన్స్, స్టోరీ టెల్లింగ్, పుస్తక పఠనం, కంప్యూటర్ బేసిక్ పరిజ్ఞానం, కుట్లు, అల్లికలు, కాలీగ్రఫీ, ఇండోర్ గేమ్స్, బేసిక్ మ్యాథ్స్, మోరల్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తదితర అంశాల్లో నిపుణులతో మెళకువలు నేర్పిస్తారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పబ్బు సతీశ్, బండి వనజకళాధర్, ఉపసర్పంచ్ పాక మమత, ఎంఈఓ శ్రీధర్, ప్రిన్సిపాల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిత, ఐఈబీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ సుమాదేవి, ఏఎంఓ మన్మోహన్, ఎంపీడీఓ గుండె బాబు, ఏఏపీసీ చైర్మన్ సరిత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. సెలవులు వినియోగించుకోండిహసన్పర్తి: విద్యార్థులు వేసవి సెలవులు వినియోగించుకోవాలని డీఈఓ గిరిరాజ్‌గౌడ్ అన్నారు. హసన్‌పర్తి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. గిరిరాజ్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరవగా, ఎంఈఓ శ్రీనివాస్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మహేశ్, ఏఎంఓ మన్మోహన్, కళాశాల అభివృద్ధి కమిటీ కోశాధికారి చకిలం రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కేజీవీవీలో... కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం ప్రత్యేక వేసవి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి డీఈఓ గిరిరాజ్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, కో–ఆర్డినేటర్ సునీత, స్పెషల్ ఆఫీసర్ స్వప్న తదితరులున్నారు. -
మంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026
మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్సిగ్నల్సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికా రులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్‌లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండడంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్‌కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్‌లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్‌కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్‌లో బ్లాక్ గ్రానైట్, భూపాలపల్లిలో రోడ్ మెటల్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: బాలికల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యంపై అవగాహన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. స్నేహ సమ్మర్ క్యాంపుల నిర్వహణపై డీఆర్డీఓ మేన శ్రీను, డీడబ్ల్యూఓ విశ్వజ, డీఈఓ గిరిరాజ్ గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, డీపీఓ లక్ష్మీ రమాకాంత్ తదితర అధికారులతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కౌమార దశలో బాలికల్లో చోటు చేసుకునే శారీరక, మానసిక మార్పులపై అవగాహన కల్పించాలని సూచించారు. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై బాలికలకు స్పష్టమైన అవగాహన కలిగించాలన్నారు. బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించాలని, ప్రతీ గ్రామపంచాయతీలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, డీపీఎం పద్మప్రియ, ఏపీఎం శ్రీలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, అధికారులు పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్ ’మ్యాపింగ్ వేగవంతానికి చర్యలు జిల్లాలో ‘ఎస్ఐఆర్’ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యా పింగ్ ప్రక్రియపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మ్యాపింగ్ ప్రక్రియకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి నియమిస్తున్నామని తెలిపారు. డీఆర్ఓ శ్రీనివాస్, ఆర్డీఓలు రమేశ్ రాథోడ్, నారాయణ, తహసీల్దార్లు విజయలక్ష్మి, రవీందర్‌రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ జగత్సింగ్ అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలి వరంగల్ అర్బన్: నగరంలోని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, ఇన్చార్జ్ కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ ఆదేశించారు. వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు, రామన్నపేట, లక్ష్మీపురం, మట్టెవాడ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈఈ సంతోశ్‌బాబు, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల విజయం జిల్లాకే గర్వకారణం
● మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన విజయాలు జిల్లాకే గర్వకారణమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉర్సుగుట్ట సమీపంలోని ఆకుతోట కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో (యంగ్ ఆచీవర్స్ సన్మాన కార్యక్రమం) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథులుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్యశారద, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్డీఓ సుమ హాజరై 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో 550 మార్కులకు పైగా, ఇంటర్మీడియట్లో 980 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులతో పాటు రెండుసార్లు చదరంగం పోటీల్లో ప్రపంచ రికార్డు సాధించిన శ్రీయాంశ్ మురళీకృష్ణను ఘనంగా సత్కరించారు. తహసీల్దార్లు శ్రీకాంత్, ఇగ్బాల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు భాగ్యలక్ష్మి, పుష్పలత, రమేశ్, నారాయణరెడ్డి, డీవైఎస్ఓ అనిల్ పాల్గొన్నారు. -
ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల
నేటి నుంచి కళాశాలల్లో ప్రవేశాలు విద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధి జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం తొలుత యోచించి ప్రవేశాలకు జారీచేసిన షెడ్యూల్‌ను నిలిపివేసిన విషయం విధితమే. అయితే ఆ నిర్ణయాన్ని (విలీన ప్రక్రియను) ప్రభుత్వం మార్చుకొని ఈఏడాది యథావిఽధిగానే ఇంటర్ అడ్మిషన్లకు పచ్చజెండా ఊపింది. ఇంటర్ బోర్డు తాజాగా అడ్మిషన్లకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ ప్రవేశాలు కల్పించన్నారు. జూన్ 1 నుంచి తరగతులు.. మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఆ తర్వాత ఒరిజినల్ టెన్త్ మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
ఓరుగల్లు పీఠకాపరి బిషప్ విజయపాల్‌రెడ్డి కాజీపేట రూరల్: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని రోమన్ క్యాథలిక్ సంఘం 40 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తోందని ఓరుగల్లు మేత్రాసనం పీఠాధిపతి బిషప్ దుగ్గుంపుడి విజయపాల్‌రెడ్డి అన్నారు. దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కుల సాధన రౌండ్ టేబుల్ సమావేశం కాజీపేట ఫాతిమానగర్‌లో సోమవారం ఫాదర్ నవీన్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఏటా ఆగస్టు 10న నిరసన దినం జరుపుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ కాంగ్రెస్ తరఫున, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. సీపీఐ నాయకులు రాజమౌళి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి నున్నా అప్పారావు మాట్లాడుతూ.. దేశంలో మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోలేదని, కులం ఉన్నంత కాలం ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రెవ.అశోక్‌పాల్, బోడ డిన్నా, ఫాదర్ జోసెఫ్, రాజమోహన్, పొలిమెర సృజన్‌కుమార్, ప్రవీణ్, ఎన్.కిరణ్, జన్ను ఈర్మియా, అరుణ్జెమ్స్, కొవడవటి రవి తదితరులున్నారు. -
పెండింగ్ అర్జీలు వెంటనే పరిష్కరించండి
ప్రజావాణిలో హనుమకొండ కలెక్టర్ చాహత్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో వివిధ రకాల సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. పాత ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసిన అర్జీలను తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 126 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం నూతన ప్రజావాణి పోర్టల్‌కు సంబంధించిన అంశాలను ఈడీఎం శ్రీధర్ కలెక్టర్ సమక్షంలో అధికారులకు వివరించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, జీడబ్ల్యూఎంసీ సీహెచ్ఓ రాజారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమస్యలు సత్వరమే పరిష్కరించండి: వరంగల్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 121 దరఖాస్తులు వచ్చాయి. అలాగే, రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ 31, నర్సంపేటలో 14 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీపీఓ కల్పన, డీఆర్డీఓ నాగపద్మజ, హౌసింగ్ పీడీ దామోదర్, అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు వారసత్వంగా రావాల్సిన అసైన్డ్ భూమికి జీపీఓ, ఆర్ఐలు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని నర్సక్కపెల్లికి చెందిన రవికుమార్, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి తమకు న్యాయం చేయాలని తిరుమలాయపల్లి గ్రామస్తులు వినతిపత్రాలు ఇచ్చారు. -
ఖరీఫ్ ప్రణాళిక ఖరారు
ఖిలా వరంగల్: జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. ప్రస్తుతం యాసంగి వరి కోతలు, ధాన్యం విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 25 నుంచి రోహిణీ కార్తె ప్రారంభం కానుండటంతో వానాకాలం సీజన్‌కు సంబంధించి సాగు పనులు మొదలుకానున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాలో వరి ప్రధాన పంటగా సాగు కానుండగా, పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పప్పు దినుసులు, చిరుధాన్యాల సాగు చేపట్టనున్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువుల వినియోగం తదితర అంశాలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సన్నరకాల సాగుకు ప్రాధాన్యం.. రైతులు సన్న రకాల వరి సాగు ప్రాధాన్యం ఇవ్వాలని, వివిధ పంటలకు విత్తనాలను సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో జిల్లాలో సాగు ప్రణాళిక ఖరారు చేసింది. జిల్లాలో ఎస్సారెస్పీ కాల్వలు, బోర్లు, బావులు, చెరువులు, కుంటలు నమ్ముకొని పంటలు వేస్తారని అధికారులు నివేదించారు. 2,75,500 ఎకరాల్లో సాగు అవకాశం.. జిల్లాలో గతేడాది ఖరీఫ్ 2,95,300 ఎకరాల్లో వరితోపాటు వివిధ పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది 2,75,500 ఎకరాలు వరితోపాటు ఇతర పంటలు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాది కంటే ఈ ఏడాది 20 ఎకరాల వరకు తగ్గనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2,75,500 ఎకరాలకు 1,07,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం, ఇందు కోసం ఇప్పటి నుంచి సెప్టెంబర్ వరకు నెల వారీ కోటా ఈ మేరకు తెప్పించనున్నారు. విత్తన రకాలు వరి రకాలు: ఆర్ఎన్ఆర్ 15048, ఆర్ఎన్ఆర్ 10754, ఆర్ఎన్ఆర్ 28361, ఆర్ఎన్ఆర్ 29325, కెఎన్ఎం 1638, కెఎన్ఎం 118, డబ్ల్యూజీఎల్ 44, భద్రకాళి(డబ్ల్యూజీఎల్3962) బీపీటీ 52034, ఎంటీయూ 1010, అమన గోల్డ్, సూపర్ అమన, అంకూర్సోనా, చిట్టి పొట్టి రకాలు ఉన్నాయి. పత్తి : యూఎస్ 7067, యూఎస్ 704, సాంకేత్, స్వీఫ్ట్, రణధీర్, చంద్రగోల్డ్, సదానంద, సీసీహెచ్ 369, నవనీత్, రాణ. మిర్చి: యూఎస్ 341, షార్క్ 1, యశశ్విని, హెచ్‌పీహెచ్ 5531, అగ్నివన్, తేజశ్విని మైకో 641, ప్రాహార్ 121. మొక్కజొన్న: డీకేసీ 6217, డీకేసీ 8171, 4422, ఎన్‌కె–30, ఎస్ 6668, ఎంఎం 9445, పీఏసీ 741, ఎంఆర్ఎం 4065 రకాలను సాగుకు ఎన్నుకోవాలని గ్రామాల వారీగా ఏఈఓ అధికారులు నిర్ధేశించారు. అన్నదాతలకు అండగా.. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం, రుణమాఫీ అమలు పూర్తి చేయడంతో పాటు పంటల బీమా, యంత్ర లక్ష్మి పథకాలను అమలు చేయడం ద్వారా రైతన్నలకు అండగా నిలవాల్సి ఉంది. వానాకాలం రైతుభరోసా నిధులను సకాలంలో అందించడంతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు పంట రుణాలు మంజూరు చేయడం, పంట రుణాలపై పావలా వడ్డీని వర్తింపజేస్తే రైతులకు మేలు చేకూరనుంది. నాణ్యమైన విత్తనాలు విక్రయించాలిరానున్న ఖరీఫ్‌లో ఆరుతడి పంటలు, సన్న గింజ వరి రకాలను సాగు చేయాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాకు విత్తన షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. నకిలీల నిరోధానికి పోలీసులతో కలిసి టాస్క్‌ఫోర్స్ బృందాలతో సోదాలు చేపడుతాం. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించడంతో పాటు బిల్లు వెంటనే ఇవ్వాలి. – అనురాధ, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో 2,75,500 ఎకరాల్లో పంటల సాగు అంచనా కావాల్సిన విత్తనాలు 36,740 క్వింటాళ్లు, పత్తి ప్యాకెట్లు 3,62,100 ఎరువులు 1,07,500 మెట్రిక్టన్నులుపంట గతేడాది ఖరీఫ్ సాగు సాగు అంచనావరి 1,39,997 1,25,000 మొక్కజొన్న 10,307 8,000 పత్తి 1,23,176 1,10,200 పప్పులు 676 2,000 పసుపు 833 900 మిరప 2,100 8,000 కూరగాయలు 1,440 2,500 పండ్లు 6,662 7,150 ఆయిల్‌పామ్ 6,980 7,800 పూల పంటలు 280 300 ఇతర పంటలు 2,500 2,750 మొత్తం 2,95,300 2,75,500 వరి 33,750 మొక్కజొన్న 1,200 పసుపు 1,530 పత్తి (ప్యాకెట్లు) 3,62,100 పప్పులు 52 కేజీలు మిర్చి 13.50 కేజీలు ఇతర పంటలు 195 కేజీలుకావాల్సిన ఎరువులు మెట్రిక్ టన్నుల్లో యూరియా 41,000 డీఏపీ 17,500 ఎంఓపీ 14,500 ఎస్ఎస్పీ 6,500 కాంప్లెక్స్ ఎరువులు 28,000 మొత్తం 1,07,500 -
సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ ● ప్రజావాణిలో 121 దరఖాస్తులున్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలన్నారు. మొత్తం 121 దరఖాస్తులు రాగా రెవెన్యూ 62, జీడబ్ల్యూఎంసీ 32, వివిధ శాఖలకు సంబంధించినవి 28 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అలాగే రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ 31, నర్సంపేటలో 14 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీపీఓ కల్పన, డీఆర్డీఓ నాగపద్మజ, హౌసింగ్ పీడీ దామోదర్, అధికారులులు పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి పూర్తి చేయాలిగత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇళ్లు పునాది, పిల్లర్ల వరకు నిర్మించాం. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు బిల్లులు రావడం లేదు. ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చేర్చి పూర్తి చేసి న్యాయం చేయాలి. –తిరుమలాయపల్లి గ్రామస్తులు, రాయపర్తి తప్పుడు రిపోర్టు ఇచ్చిన అధికారిపై చర్య తీసుకోవాలితనకు వారసత్వంగా రావాల్సిన అసైన్డ్ భూమిని అక్రమంగా ఇతరులు ఆక్రమించే విధంగా తప్పుడు రిపోర్టు ఇచ్చిన జీపీఓ, ఆర్‌ఐలపై చర్య తీసుకోవాలి. ఈ విషయమై గతంలో కలెక్టర్ ప్రజావాణిలో వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. న్యాయం చేయాలి. –బానోత్ రవికుమార్, నర్సక్కపేట, నల్లబెల్లి -
ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
నల్లబెల్లి: రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని, శాస్త్రవేత్తల సిఫారసు మేరకే వాడాలని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకట్‌రెడ్డి సూచించారు. మండలంలోని గుండ్లపాహడ్లో సోమవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగు మెళకువలు, భూసార పరిరక్షణపై కీలక సూచనలు చేశారు. శాస్త్రవేత్త బి.మాధవి మాట్లాడుతూ మార్కెట్లో మంచి ధర పలికే వరి రకాల గురించి వివరించారు. అనంతరం పలు సూచనలతో ముద్రించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బన్న రజిత, ఏఈఓ వినూష, రైతులు పాల్గొన్నారు. ఖానాపురంలో.. ఖానాపురం: పంటల సాగులో రైతులు మెళకువలు పాటించాలని శాస్త్రవేత్తలు శ్రావణ్, హరీష్‌లు అన్నారు. మండలంలోని మంగళవారిపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధునాతన పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈ సమావేశంలో జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం, ఏఓ భోగ శ్రీనివాస్, సర్పంచ్ గొంది సుజాత, విస్తరణ అధికారి అంకుశావలీ, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● ‘పీఎం శ్రీ’లో వేసవి శిబిరాలు ప్రారంభంకాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నారని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం వరంగల్‌లోని నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరాన్ని డీఈఓ రంగయ్యనాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత, ఆత్మ విశ్వాసం, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వేసవి శిబిరాలు ఈనెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఈఓ రంగయ్య నాయుడు మా ట్లాడుతూ జిల్లాలోని 11 పీఎం శ్రీ పాఠశాలల్లో కొనసాగుతున్న సమ్మర్ క్యాంపులు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవిధంగా ప్రణాళికబద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ, డీబీసీడీఓ పుష్పలత, ఎంఈఓ, హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
కాళోజీ సెంటర్: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 16 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడుతాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కె.మాధవరావు, శారద, అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలవిద్యారణ్యపురి: అన్ని యాజమాన్యాల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ గురుకులాల్లోనూ ప్రవేశాలు కల్పించనున్నారు. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం తొలుత యోచించి ప్రవేశాలకు జారీచేసిన షెడ్యూల్‌ను నిలిపివేసిన విషయం విధితమే. అయితే ఆ నిర్ణయాన్ని (విలీన ప్రక్రియను) ప్రభుత్వం మార్చుకొని ఈఏడాది యథావిఽధిగానే ఇంటర్ అడ్మిషన్లకు పచ్చజెండా ఊపింది. దీంతో ఇంటర్ బోర్డు తాజాగా అడ్మిషన్లకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ ప్రవేశాలు కల్పించన్నారు. జూన్ 1 నుంచి తరగతులు.. మొదటి దశ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 12 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూనియర్ కళాశాలల్లో ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 1 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు పూర్తిచేయాల్సి ఉంటుంది. టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇంట ర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఆ త ర్వాత ఒరిజనల్ టెన్త్ మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి న్యూశాయంపేట: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్ఐఆర్ జాబితాలో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. అన్ని నియోజక వర్గాల్లో రానున్న 15 రోజుల్లో కనీసం 90శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. మ్యాపింగ్ పురోగతిని పెంచేందుకు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల సహకారాన్ని వినియోగించుకోవాలన్నారు. వీసీలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రేపటి నుంచి కాకతీయ కళల జాతర నయీంనగర్: కాకతీయ కళల జాతర ఈ నెల 13, 15, 17 తేదీల్లో నిర్వహించనున్నట్లు చేతన కళావేదిక వ్యవస్థాపకుడు, పూర్వ ఫిలిం సెన్సార్‌బోర్డ్ మెంబర్, రచయిత గాయకుడు ఆకుల నాగేశ్వర్ తెలిపారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వంటి అంశాలు, భారతదేశంలో అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, పేరిణి, జానపదాలకు నిలయమన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న మొదటి రోజు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాశ్ హాజరవుతారన్నారు. అనంతరం కళల జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సహ కార్యనిర్వాహకుడు గోకారపు శ్యాంకుమార్, బూరం ప్రశాంత్, నిర్వాహకులు మచ్చ రాజు, గాయకులు శివ, రాజేశ్, సునీల్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రాజి రెడ్డి, దేవేందర్, అమర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల విజయం జిల్లాకే గర్వకారణం
● ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖఖిలా వరంగల్: విద్యార్థులు వార్షిక పరీక్షల్లో సాధించిన విజయాలు జిల్లాకే గర్వకారణమని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉర్సుగుట్ట సమీపంలోని ఆకుతోట కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో (యంగ్ ఆచీవర్స్ సన్మాన కార్యక్రమం) విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ రంగయ్యనాయుడు, ఆర్డీఓ సుమ హాజరై 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో 550 మార్కులకు పైగా, ఇంటర్మీడియట్లో 980 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులతో పాటు రెండుసార్లు చదరంగం పోటీల్లో ప్రపంచ రికార్డు సాధించిన శ్రీయాంశ్ మురళీకృష్ణను మెడల్స్, మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చదువుకు వయస్సుతో సంబంధం లేదని, లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కలలు కనండి ఆ కలలను నిజమయ్యేలా కష్టపడాలాన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, ఇగ్బాల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు భాగ్యలక్ష్మి, పుష్పలత, రమేష్, నారాయణరెడ్డి, డీవైస్ అనిల్, అధ్యాపకులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్‌కు ఊతం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వం మైనర్ ఖనిజ బ్లాకుల వేలం విధానంలో కొత్త మార్గదర్శకాలకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకాల్లో పారదర్శకత, ఆదాయం పెంపు లక్ష్యంగా హైబ్రిడ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ద్వారా ఖనిజాల లీజులు కేటాయించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎన్.శ్రీధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనింగ్ రంగానికి ఊతమివ్వనున్నాయి. ముఖ్యంగా గ్రానైట్, స్టోన్ మెటల్, బ్లాక్ గ్రానైట్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక వంటి ఖనిజాల తవ్వకాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు.. ఉమ్మడి వరంగల్‌లో ఇప్పటికే వందల సంఖ్యలో లీజులు ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అధికంగా క్వారీలు ఉన్నాయి. మైన్స్ అండ్ జియాలజీ శాఖ అంచనాల ప్రకారం ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల పరిధిలో ప్రస్తుతం చిన్నా, పెద్దవి కలిపి సుమారు 250కు పైగా మైనింగ్, క్వారీ లీజులు అమలులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అధిక భాగం స్టోన్ మెటల్, రోడ్ మెటల్ యూనిట్లు, గ్రానైట్ తవ్వకాలు, బ్రిక్ ఎర్త్, మట్టి క్వారీలు, ఇసుక రీచ్‌లు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అధికంగా ఉండండంతో గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాదారులకు తీపి కబురు ఇకపై మైనర్ ఖనిజాల వేలం మొత్తం ఆన్లైన్లోనే జరగనుంది. బిడ్డింగ్ నుంచి లీజు కేటాయింపు వరకు ప్రతీ దశ డిజిటల్ విధానంలో ఉండడంతో అక్రమాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం ముగ్గురు బిడ్డర్లు తప్పనిసరి చేయడం ద్వారా పోటీ పెరిగి ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పట్టా భూముల్లో ఖనిజ తవ్వకాలకు అంగీకరించిన భూ యజమానులకు ప్రభుత్వం అదనపు సొమ్ము చెల్లించనుంది. గ్రానైట్, మార్బుల్ మినహా ఇతర ఖనిజాలకు సీనియరేజ్ ఫీజులో 10 శాతం, గ్రానైట్, మార్బుల్‌కు 5 శాతం పెంచనున్నారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని ప్రైవేట్ భూముల్లో కొత్త క్వారీలకు భూ యజమానులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాయల్టీ పెరిగే అవకాశం.. కొత్త వేలం విధానం అమలైతే ఉమ్మడి వరంగల్‌లో ఖనిజ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుమారుగా ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తుండడంతో రోడ్ మెటల్, స్టోన్ మెటల్, గ్రానైట్‌కు డిమాండ్ పెరుగుతోంది. కొత్త లీజులు మంజూరైతే ప్రభుత్వానికి రూ.25–30 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని మైనింగ్ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైనర్ ఖనిజాల వేలంలో భారీ మార్పులు హైబ్రిడ్ విధానానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్ పూర్తిగా ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త లీజులు గ్రానైట్, స్టోన్ మెటల్, ఇసుక క్వారీలపై ఫోకస్ 40–60 కొత్త లీజులకు అవకాశం? ఇప్పటి వరకు పర్యావరణ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేక వేలం జరగని అనేక ఖనిజ బ్లాకులు కొత్త ‘హైబ్రిడ్ విధానం’ ద్వారా వేలంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్‌లోనే మరో 40 నుంచి 60 వరకు కొత్త మైనింగ్ లీజులు, క్వారీ బ్లాకులు వేలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మైనింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్‌లో బ్లాక్ గ్రానైట్, ములుగులో స్టోన్ క్వారీలు, వరంగల్, హనుమకొండ పరిసరాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన మెటల్ క్వారీలు అధికం. కాగా, ఆయా జిల్లాల్లో కొత్త విధానంతో వేగంగా అనుమతులు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
ప్రపంచ యవనికపై వరంగల్ 5ఎఫ్
పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై..సాక్షి, వరంగల్/ గీసుకొండ : కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్టరీ.. టు ఫ్యాషన్.. టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుంచి వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దశల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)కు సుస్థిర అభివృద్ధిని అందించనుంది. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికై న తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభాగాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వార్షికంగా రూ.1,990 కోట్ల వ్యాపార లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ‘పీఎం మిత్ర’ హోదాతో జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుని, అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై వరంగల్‌కు ప్రత్యేక స్థానం కల్పించనుంది. చారిత్రక కాకతీయ నగరం ఇప్పుడు పారిశ్రామిక రంగంలోనూ ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకోనుంది. ఈ పార్కు దేశంలోనే తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవడం తెలంగాణకు, ముఖ్యంగా వరంగల్‌కు విశేష గౌరవంగా పేర్కొనవచ్చు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పార్కును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కై టెక్స్, యంగ్వన్, గణేశా కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ ద్వారా రూ.300 కోట్లు వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం దిశగా అడుగులు పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్‌లో ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ.. కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800, 900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనుల నిమిత్తం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వి.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి జనగణన ప్రక్రియ
న్యూశాయంపేట : జిల్లావ్యాప్తంగా జనగణన–2027కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రణాళిక, గణాంక శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనాభా లెక్కలు రెండు విడతల్లో 33 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ (ఆదివారం) వరకు ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ జనగణన) ప్రక్రియ ముగిసింది. మలివిడతలో సోమవారం(నేటి) నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్స్ బ్లాక్‌ల వారీగా ఇళ్ల సంఖ్యను లెక్కించనున్నారు. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టే రెండో దశలో జనాభా పూర్తి వివరాలను నమోదు చేస్తారు. వివరాల సేకరణ.. జనగణనలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటిపేరు, కుటుంబ యజమానితో బంధుత్వం, వయస్సు, లింగం, చదువు, టీవీ, బైక్, కారు వంటి వివరాలను అధికారులు సేకరించి నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు కూడా సేకరిస్తారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో (12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు) 1,237 హౌజ్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్ఎల్బీస్) గుర్తించారు. ఇందుకు 933 మంది ఎన్యుమరేటర్స్ను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు 161 మంది సూపర్ వైజర్లను ఎంపిక చేసి ఇందులో భాగస్వాములు చేయనున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,094 మంది సిబ్బంది పాల్గొననున్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు ఆదిరెడ్డి
కేయూ క్యాంపస్ : అమెరికాలోని ఎరోడెక్స్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్అండ్ సైన్స్‌కళాశాల అధ్యాపకుడు, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ రుక్కిరెడ్డి ఆదిరెడ్డి పాల్గొననున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఆదివారం తెలిపారు. ఈ సదస్సులో మీడియా అధ్యయనాలు, డిజిటల్ కమ్యూనికేషన్ సమకాలిన జర్నలిజం ధోరణలపై ఆదిరెడ్డి తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారని ఆమె వెల్లడించారు. ఈమేరకు అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆదిరెడ్డికి ఆహ్వానం అందిందన్నారు. ప్రిన్సిపాల్‌తోపాటు పలువురు అధ్యాపకులు ఆదిరెడ్డిని అభినందించారు. విద్యారణ్యపురి : వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీజీఈటీ పరీక్షకు ఉచిత శిక్షణను హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ ఉచిత కోచింగ్‌ను ఈనెల 12 నుంచి ప్రారంభించినున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏటా కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో 40 రోజుల ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్రీ విభాగం అధిపతి ప్రొఫెసర్ వాసం శ్రీనివాస్ తెలిపారు. ఈ సారి కెమిస్ట్రీ సబ్జెక్టుతోపాటు ఇంగ్లిష్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, కామర్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టులో కూడా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తమ తమ సబ్జెక్టు విభాగాల అధిపతులను ఇతర వివరాలకు పీజీ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కోరారు. నయీంనగర్ : చారిత్రాత్మక హనుమకొండ కలెక్టర్ బంగ్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరిశీలించారు. కుడా హార్టికల్చర్ అధికారి ఆసిఫ్అలీ పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ గ్రీవెన్ సెల్‌ను నేడు (సోమవారం) నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. గ్రీవెన్స్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హన్మకొండ అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం సూచించారు. జిల్లాలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ‘కుడా’ కార్యాలయం సమీపంలోని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయం, పరకాల ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ప్రజలు తమ సమస్యలను సంబంధిత ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో వినిపించి, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లా, డివిజన్ స్థాయిలో.. న్యూశాయంపేట : ప్రభుత్వం ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణితో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆయా ప్రజావాణిలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. -
పదిలమా.. ప్రశ్నార్థకమా?
అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలలలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం కాశిబుగ్గ: వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి సంవత్సరం యూజీ అడ్మిషన్ల సమయంలో బీఏఎంఎస్ సీట్ల భర్తీపై అయోమయం నెలకొంటుంది. సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కళాశాలలోని సీట్లు పూర్తిస్థాయిలో భర్తీకి నోచుకోవడం గగనమవుతోంది. తాజాగా 2026–2027 విద్యాసంవత్సరానికి యూజీ అడ్మిషన్ల కోసం నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ (ఎన్సీఐఎస్ఎం) బృందం సభ్యులు రెండు రోజులు తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్లు అంజనా సక్సేనా, లక్ష్మీప్రసాద్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద వైద్యకళాశాలలో తనిఖీలు చేశారు. కళాశాలలోని 50 సీట్లతోపాటు 13 ఈడబ్ల్యూఎస్ సీట్లు కలిపి మొత్తం 63 సీట్లకు సరిపడా ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్, ఇతర సౌకర్యాలు తెలుసుకున్నారు. టీచింగ్, టీచింగ్ డైరీ మెయింటెనెన్స్, స్టూడెంట్ అటెండెన్స్ ల్యాండ్, ల్యాబ్, లైబ్రరీ, పలు మొక్కల గార్డెన్, పరికరాలు పరిశీలించారు. సమయానికి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు వస్తున్నారా అని బయోమెట్రిక్ అటెండెన్స్, ఐరిస్ ద్వారా తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, అంబులెన్స్, నర్సింగ్ స్టాఫ్ వివరాలపై ఆరా తీశారు. అలాగే, విద్యార్థులకు సంబంధించిన రెండు హాస్టళ్లను తనిఖీ చేశారు. కళాశాల అనుబంధ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను కూడా సందర్శించారు. ఇందులో కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఓపీ, ఐపీ వివరాలను నమోదు చేసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డైట్, మందులు, వివిధ రకాల చికిత్స గురించి తెలుసుకున్నారు. వంద పడకల ఆస్పత్రి స్థాయికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో తెలుసుకుని వివరాలను ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని స్పెషల్ అబ్జర్వర్‌కు అందజేశారు. హెడ్ ఆఫీస్ లింక్ ద్వారా ఆన్లైన్న్లో క్షుణ్ణంగా చూపించి రికార్డు చేయించారు. ఎన్సీఐఎస్ఎం నిబంధనలకు అనుకూలంగా.. ఎన్సీఐఎస్ఎం నిబంధనల ప్రకారం కళాశాలలో కొన్ని అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. బోధనపరంగా హయ్యర్, లోయర్‌లో 12 మంది టీచింగ్ ఫ్యాకల్టీ లేనట్లు తెలుస్తోంది. అలాగే, నాలుగు విభాగాల్లో అసలే ప్రొఫెసర్లు లేకపోవడంతో 12 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. హై ఫ్యాకల్టీ పరంగా మరో మూడు సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. నాన్‌టీచింగ్ పరంగా 71 మందికి 28 మంది, 87 మంది సిబ్బందికి 47 మంది, 23 మంది నర్సింగ్ సిబ్బంది అవసరం ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అలాగే, కళాశాలకు ప్రత్యేకంగా పరీక్ష హాల్, డిజిటల్ టైబ్రరీ, అంబులెన్స్ సదుపాయం లేదు. పదేళ్లుగా లైబ్రేరియన్ పోస్టు భర్తీ కావడం లేదు. దీంతో బీఏఎంస్ సీట్లు పదిలంగా ఉంటాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది పరిస్థితి రాకూడదు.. గతేడాది కూడా ఈ పరిస్థితులు ఉండటంతో 14 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కళాశాల, వైద్యశాలలో ఉన్న లోపాలను సరిదిద్దుతామని ఎన్సీఐఎస్ఎం అధికారులకు హామీ ఇవ్వడం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాయడంతో యథావిధిగా సీట్లకు అనుమతించారు. కాగా, ఇలాంటి లోపాలు ఈ విద్యా సంవత్సరంలో కూడా పునరావృతం కావడంతో మళ్లీ ఆయుర్వేద సీట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తర్వాత ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉనికిని కాపాడాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు. కాగా, ఇప్పటికే విద్యార్థులు నీట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది 14 సీట్లు రద్దు.. తిరిగి సాధించుకున్న అధికారులు ఈ విద్యాసంవత్సరంలో కూడా కొన్ని గల్లంతయ్యే అవకాశం సరిపడా సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడమే కారణం తాజాగా ఎన్సీఐఎస్ఎం బృందం తనిఖీలు -
ప్రారంభోత్సవాన్ని వీక్షించిన కలెక్టర్, అధికారులు
పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మోదీ హైదరాబాద్‌లో ఆదివారం వర్చ్‌వల్‌గా ప్రారంభించగా ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా కలెక్టర్ సత్యశారద, అధికారులు పార్కు వద్ద వీక్షించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్ మాట్లాడుతూ కేఎంటీపీ నిర్మాణానికి రూ.1,695 కోట్లను అంచనా వేశారని, వాటిలో సుమారు రూ. 800–900 కోట్ల వరకు పలు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల పనులతో పాటు భూ సేకరణ పనుల నిమిత్తం ఖర్చు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వి.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, టీజీఐఐసీ జోన్ మేనేజర్ స్వామినాయక్, సంగెం తహసీల్దార్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఘనంగా వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని ద్వారకా వేణుగోపాల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం బ్రహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీలతకు ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డు కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డును అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. డాక్టర్ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా టీపీఏ సభ్యులు, ప్రముఖులు ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నేడు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి న్యూశాయంపేట: ప్రభుత్వం ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణిని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రజావాణితో పాటు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఆయా ప్రజావాణిల్లో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రజల వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేటినుంచి జనగణన ప్రక్రియన్యూశాయంపేట : జిల్లావ్యాప్తంగా జనగణన–2027కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, తదితర అంశాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రణాళిక, గణాంక శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనాభా లెక్కలు రెండు విడతల్లో 33 అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ (ఆదివారం) వరకు ఆన్లైన్లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ జనగణన) ప్రక్రియ ముగిసింది. మలివిడతలో సోమవారం(నేటి) నుంచి జూన్ 9వ తేదీ వరకు ఎన్యుమరేటర్స్ బ్లాక్‌ల వారీగా ఇళ్ల సంఖ్యను లెక్కించనున్నారు. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టే రెండో దశలో జనాభా పూర్తి వివరాలను నమోదు చేస్తారు. వివరాల సేకరణ.. జనగణనలో భాగంగా వ్యక్తి పేరు, ఇంటిపేరు, కుటుంబ యజమానితో బంధుత్వం, వయస్సు, లింగం, చదువు, టీవీ, బైక్, కారు వంటి వివరాలను అధికారులు సేకరించి నమోదు చేస్తారు. ఎస్సీ, ఎస్టీల కులం వివరాలు కూడా సేకరిస్తారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 14 మండలాల్లో (12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు) 1,237 హౌజ్ లిస్టింగ్ బ్లాక్స్ (హెచ్ఎల్బీస్) గుర్తించారు. ఇందుకు 933 మంది ఎన్యుమరేటర్స్ను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వీరితో పాటు 161 మంది సూపర్ వైజర్లను ఎంపిక చేసి ఇందులో భాగస్వాములు చేయనున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1,094 మంది సిబ్బంది పాల్గొననున్నారు. -
ప్రపంచ యవనికపై వరంగల్ ‘5ఎఫ్’
సాక్షి, వరంగల్/గీసుకొండ: కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా 5ఎఫ్ (ఫామ్ టు ఫైబర్.. టు ఫ్యాక్ట రీ.. టు ఫ్యాషన్...టు ఫారిన్) దృక్కోణంతో ఓరుగల్లు ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా మరో అడుగు ముందుకు పడింది. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతుల దాకా ఒకే వేదికపై పూర్తి విలువ వ్యవస్థను కల్పించేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ నుంచి వరంగల్‌లోకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పీఎం మిత్ర (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కు) పథకం కింద 2023లో ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.200 కోట్లతో కూడిన అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విడుదల చేసిన రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, మరో రూ.170 కోట్ల దఫాల వారీగా కేంద్రం రాష్ట్రానికి అందివ్వనుంది. దీంతో పాటు ‘కాంపిటిటివ్ ఇన్సెంటివ్ సపోర్ట్’ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహక మద్దతు ఇవ్వనుండడంతో దేశ, విదేశీ కంపెనీలు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉంది. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో మొత్తం 1,327 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. శూన్య ద్రవ వ్యర్థ సాంకేతికతతో నిర్మించిన సార్వత్రిక ద్రవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు (సీఈటీపీ)కు సుస్థిర అభివృద్ధిని అందించనుంది. ఇప్పటివరకు ఈ పార్కులో 548 ఎకరాల్లో పరిశ్రమలు వస్తే పీఎం మిత్ర కింద కేఎంటీపీ ఎంపికై న తర్వాతనే 310 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయని కేంద్ర జౌళి పరిశ్రమ మంత్రిత్వ విభాగాధికారులు అంటున్నారు. ఇందులో భాగంగానే ‘ఎవర్టాప్ టెక్స్టైల్ అండ్ అపెరెల్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వంటి సంస్థలు భారీ పెట్టుబడులతో ముందుకు రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1695.54 కోట్ల వ్యయం కాగా, వివిధ మార్గాల ద్వారా రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ పార్కు ద్వారా 24,400కు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వార్షికంగా రూ.1,990 కోట్ల వ్యాపార లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ‘పీఎం మిత్ర’ హోదాతో జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుని, అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై వరంగల్‌కు ప్రత్యేక స్థానం కల్పించనుంది. చారిత్రక కాకతీయ నగరం ఇప్పుడు పారిశ్రామిక, జౌళి రంగంలోనూ ప్రపంచ స్థాయి గుర్తింపును అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పార్కు దేశంలోనే తొలి పీఎం మిత్ర పార్కుగా నిలవడం తెలంగాణకు, ముఖ్యంగా వరంగల్‌కు విశేష గౌరవంగా పేర్కొనవచ్చు. 2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి సీఎం కేసీఆర్ ఈ పార్కును ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కై టెక్స్, యంగ్వన్, గణేశా కంపెనీలు ఉత్పత్తులు ప్రారంభించాయి. పత్తి ఉత్పత్తి నుంచి అంతర్జాతీయ ఎగుమతులు ఒకే వేదికపై.. కేఎంటీపీకి పీఎం మిత్ర కింద రూ.200 కోట్లు, సీఐఎస్ కింద రూ.300 కోట్లు వర్చువల్‌గా హైదరాబాద్ నుంచి ప్రారంభించిన పీఎం నరేంద్రమోదీ అంతర్జాతీయ జౌళి మ్యాప్‌పై ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం దిశగా అడుగులు -
13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కాళోజీ సెంటర్: ఈనెల 13 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు డీఈఐఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో జనరల్ కోర్సులో 3,263 మంది, ఒకేషనల్ కోర్సులో 329 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ కోర్సులో 2,083 మంది, ఒకేషనల్ కోర్సులో 182 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్షల కమిటీ, ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు వివరించారు. విద్యార్థులకు ఏమైన సందేహాలు ఉంటే 924020 5555 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కె.మాధవరావు, శారద, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నల్లబెల్లి.. రైతు తల్లడిల్లి..
● అకాల వర్షంతో తడిసిన మక్కలు, ధాన్యం ● కాంటాలు కాక అన్నదాతల ఆందోళననల్లబెల్లి: అకాల వర్షాలు రైతుల కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నోటికాడికొచ్చిన ధాన్యం, మక్కలు తడిసిపోతున్నాయి. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి నల్లబెల్లి ఽమక్కజొన్న కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న మక్కలు తడిశాయి. రాత్రి సమయంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని గాలితో పాటు వ ర్షం రావడంతో ఆరబోసిన, బస్తాల్లో నింపిన మక్కలు తడిశాయి. రాత్రి సమయంలో ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు ఏమిచేయలేని స్థితిలో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని మక్కలను తీసుకొస్తే నిర్వాహకులు సకాలంలో కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేసిన వాటిని గోదాములకు తరలించకపోవడంతో మక్కలు తడుస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి కొ నుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న మక్కలను గోదాములకు తరలించాలని రైతులు కోరుతున్నారు. నేలవాలిన వరి పొలాలు ఖానాపురం: అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం కలుగుతుంది. సబ్‌మార్కెట్‌లో ఆరబోసుకు న్న మక్కలతో పాటు పొలాలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శనివా రం రాత్రి కురిసిన వర్షంతో వరి పొలాలు నేలవాలి పోయాయి. కోతదశలో ఉన్న పొలాలు నేలవాలడంతో రైతులకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈఫొటోలో తడిసిన మక్కల బస్తాలను వేరు చేస్తున్న రైతు నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన పత్తి సారయ్య. తనకున్న 30 గుంటల భూమిలో పండించిన మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. నిర్వాహకులు గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో రూ.1,500 పెట్టి సంచులు కొనుగోలు చేసి మక్కలు నింపాడు. 10 రోజుల క్రితం నిర్వాహకులు కాంటా పెట్టడంతో రూ.1,250 హమాలీలకు ఇచ్చాడు. వాతావరణం సరిగా లేదని, టార్పాలిన్లు ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడంతో రూ.5,600 ఖర్చు చేసి టార్పాలిన్లు కొనుగోలు చేసి బస్తాలపై కప్పాడు. అయినా శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో పరుదాల్లోనుంచి వర్షపు నీరు వెళ్లి బస్తాలు తడిశాయి. ఇలాంటి దుస్థితి సారయ్య ఒక్కడిదే కాదు కొనుగోలు కేంద్రాల్లోకి మక్కలు తీసుకొచ్చిన రైతులందరిదీ ఇలానే ఉంది. -
టెన్షన్..టెన్షన్
సాక్షి, వరంగల్: జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు ఈ–కేవైసీ గుబులు పట్టుకుంది. 1,11,381 మంది కూలీలకు ఉండగా 1,07,235 మందికి మాత్రమే నమోదైంది. 96.27 శాతంతో రాష్ట్రంలో ఈ–కేవైసీ ప్రక్రియలో మూడో స్థానంలో నిలిచింది. కేంద్రం నిర్దేశించిన ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ నేటి (సోమవారం)తో ఆఖరు కావడంతో మిగిలిన 4,146 మందివి కూడా సాధ్యమైనంత తొందరగా చేయాలని సిబ్బంది భావిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలతో కాస్త ఉపాధి హామీ కూలీల డేటా అప్డేట్ ఆలస్యమవుతోంది. ఉపాధి హామీలో అక్రమాలను నిరోధించడానికి ప్రతిఒక్కరికీ ఈ– కేవైసీ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పని ప్రదేశాల్లో కూలీల నమోదు, వేతనాల చెల్లింపులకు ఈ–కేవైసీనే ప్రామాణికంగా తీసుకొని కేంద్రం ముందుకెళ్లనుంది. కొంత మంది కూలీలు అందుబాటులో లేకపోవడం, ఆధార్‌లోని వివరాలు, ఫొటో సరితూగకపోవడం, ఐరిస్‌లో మార్పులు తదితర సమస్యలు నమోదుకు ఆటంకంగా మారాయి. ఇప్పటికే ఈ–కేవైసీ ప్రక్రియను సోమవారం వరకు అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ–కేవైసీ ప్రక్రియ మరింత వేగవంతం చేశారు. అయితే కేంద్రం నుంచి గడువు పొడిగింపు వస్తేనే వందశాతం పూర్తయ్యే అవకాశముంది. లేదంటే జిల్లాలోని ఈ–కేవైసీ కానీ కూలీలకు వేతనాలు చెల్లింపు, హాజరు నమోదు, పనిదినాల లబ్ధిలో ఆటంకాలు ఎదురవుతాయన్న ఆందోళన కనబడుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండో స్థానం ఈ–కేవైసీ నమోదు చేసిన వాటిపరంగా ఉమ్మడి వరంగల్ లెక్కన చూసుకుంటే వరంగల్ జిల్లా 96.27 శాతంతో రెండో స్థానంలో ఉంది. హనుమకొండ జిల్లా 89,478 మందికి 86,357 (96.53 శాతం) ఈ–కేవైసీ నమోదుతో తొలి స్థానంలో ఉండగా, 1,11,381 మందికి 1,07,235 మంది (96.27 శాతం)తో వరంగల్ రెండో స్థానంలో ఉంది. జనగామ జిల్లా 1,14,974 మందికి 1,09,003 మంది (94.83 శాతం)తో మూడో స్థానంలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1,11,376 మందికి 1,03,876 (93.35 శాతం)తో నాలుగో స్థానంలో, ములుగు జిల్లా 82,091 మందికి 75,596 మంది (92.21 శాతం)తో ఐదో స్థానంలో, మహబూబాబాద్ జిల్లా 2,23,580 మందికి 2,04,580 మంది (91.11) శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ ఇబ్బందులు జిల్లాలో ఇప్పటి వరకు 1,07,235 మందికి మాత్రమే పూర్తి 4,146 మంది కూలీలకు పూర్తి కాని పరిస్థితి నేటితో ముగియనున్న గడువు వందశాతం పూర్తి చేస్తామంటున్న అధికారులుమండలం మొత్తం ఈ–కేవైసీ కావాల్సినవి కూలీలు నమోదు చెన్నారావుపేట 8,645 8,233 412 దుగ్గొండి 13,148 12,680 468 గీసుగొండ 5487 5,244 243 ఖానాపురం 7,662 7,392 270 నల్లబెల్లి 10,227 9,905 322 నర్సంపేట 8,210 7,946 264 నెక్కొండ 15,731 15,064 665 పర్వతగిరి 11,881 11,551 330 రాయపర్తి 13,067 12,644 420 సంగెం 10,942 10,394 548 వర్ధన్నపేట 6,387 6,182 204 -
ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి శిబిరాలు
కాళోజీ సెంటర్: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు జిల్లా విద్యాశాఖ సమాయత్తమైంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక వేసవి శిబిరాల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. విద్యార్థుల ప్రతిభా, వికాసం, నైపుణ్యాల పెంపు లక్ష్యంగా ఈ శిబిరాలను రూపొందించారు. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఈనెల 12 నుంచి జూన్ 3 వరకు నిపుణులైన ఉపాధ్యాయులచే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో పాటు అభ్యసనం జిల్లాలోని 11 పీఎం శ్రీ పాఠశాలల్లో ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ శిబిరాలు జరుగుతాయి. ఇందులో కేవలం చదువే కాకుండా విద్యార్థులకు ఇష్టమైన అనేక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. శారీరక ధృడత్వం, ఆటలు, యోగా, సృజనాత్మకత, డ్రాయింగ్, పెయింటింగ్, భాషా నైపుణ్యం, స్పీకింగ్, రీడింగ్ స్కిల్స్, మాథ్స్, సైన్స్‌లో సులభతర పద్ధతులను వివరించనున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. విద్యార్థులు తిరిగి విజయం సాధించేలా ఈ నెల 12 నుంచి జూన్ 3వ తేదీ వరకు ప్రత్యేక సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. వీరి కోసం నరేంద్రనగర్ ప్రభుత్వ హైస్కూల్, నర్సంపేట జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక తరగతుల్లో రిమీడయల్ క్లాసులు, నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మానసిక ప్రోత్సాహం ఇవ్వనున్నారు. విజయవంతంగా నిర్వహించాలిరాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో సమ్మర్ క్యాంపులు విజయవంతంగా నిర్వహించాలి. శిబిరాల నిర్వహణకు అవసరమైన విద్యా సామగ్రి క్రీడా వస్తువుల కొనుగోలుకు ఇప్పటికే నిధులు కేటాయించాం. హెచ్ఎంలు, ఎస్ఎంసీలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలి. –బి.రంగయ్య నాయుడు, డీఈఓ జిల్లాలో 11 పీఎంశ్రీ పాఠశాలలు ఎంపిక విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యం టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకూ తరగతులు -
13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నట్లు వరంగల్ డీఈఐఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఆదివారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ కోర్సులో 3,263 మంది, ఒకేషనల్ కోర్సులో 329 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ కోర్సులో 2,083 మంది, ఒకేషనల్ కోర్సులో 182 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్షల కమిటీ, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, 16 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు వివరించారు. ఏమైనా సందేహాలు ఉంటే 9240205555 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కె.మాధవరావు, శారద, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
డాక్టర్ శ్రీలతకు అవార్డు
కాళోజీ సెంటర్: తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీలత అందేకు ప్రతిష్టాత్మకమైన ఉత్తమ మహిళా సైకాలజిస్ట్ అవార్డు అందుకున్నారు. టీపీఏ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగి కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతు ల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. డాక్టర్ శ్రీలత మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు లభించగా టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామచందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని అభినందించారు. -
ఆలయ అభివృద్ధికి కృషి
కాశిబుగ్గ: వరంగల్ ఓసిటీ కాశిబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయంలో కల్యాణ మండపం నిర్మిస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం సీతారామాంజనేయ హరి హర పుత్ర అయ్యప్పస్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు ప్రత్యేక భిక్ష ఏర్పాటు చేశారు. నాయకులు గోపాల నవీన్‌రాజు, మీసాల ప్రకాశ్, దాసరి రాజేశ్ పాల్గొన్నారు. హన్మకొండ: పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహేందర్ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని అసోిసియేషన్ ప్రతినిధులు కలిసి సమస్యలు విన్నవించారు. అనంతరం మంత్రిని సన్మానించారు. డాక్టర్లు వెంకటేశ్, శివశంకర్, అనుపచంద్, ఆశాజ్యోతి, స్వప్న, సంగీత, సుష్మ, భార్గవి, ప్రియాంక పాల్గొన్నారు. -
ప్రైవేటే దిక్కు..
కాశిబుగ్గ: సంతానం లేని పేదలకు అవసరమైన ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలు (ఫెర్టిలిటీ సెంటర్లు) అందుబాటులో ఉండడం లేదు. ఆర్థికంగా ఉన్న దంపతులు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పిల్లలకు జన్మనిస్తారు. ఇటీవల కాలంలో సంతాన సాఫల్య కేంద్రాలు కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగా పుట్టుకొస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన ఈ సెంటర్లు పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించాయి. సంబంధిత వైద్యులు సంతానం పేరుతో నెలల తరబడి వైద్యం అందిస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐయూఐ, ఐవీఎఫ్ ద్వారా మహిళలకు గర్భం వచ్చేటట్లు చేస్తారు. దీనికోసం ఆర్థికంగా ఉన్న దంపతులు లక్షలాది రూపాయలు ఖర్చు చేయడానికి ముందుకు వస్తారు. ప్రస్తుతం హనుమకొండలో సుమారు 15, వరంగల్‌లో రెండు ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్లు సమాచారం. సీకేఎంలో పరీక్షలు.. తర్వాత గాంధీకి రెఫర్ వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో ఇన్ఫెర్టిలిటీ సెంటర్ లేదు. వైద్యులు మెడికల్ మేనేజ్మెంట్ సేవలు అందిస్తున్నారు. ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని గతేడాది మార్చి 15న ప్రారంభించారు. ముందుగా సంతానం సమస్యతో వచ్చినవారికి కౌన్సెలింగ్ ఇస్తారు. ఆ తర్వాత భర్త, భార్యకు అవసరమైన పరీక్షలు చేయిస్తారు. రిపోర్టుల ఆధారంగా వారికి సలహాలు ఇస్తారు. తర్వాత సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. కాగా, సీకేఎంలో వీరికి ప్రతిరోజు ఓపీ ద్వారా సేవలు అందిస్తారు. దంపతులకు మూడు నెలల పాటు సేవలు అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. రూ.25 లక్షల నిధులు వృథా.. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి తర్వాత గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఫెర్టిలిటీ సెంటర్ మంజూరు చేశారు. దీంతో సంతాన లేమితో బాధపడేవారికి ఎంజీఎంలో ఫెర్టిలిటీ సేవలు అందిస్తారని ఆశిస్తే నిరాశే మిగిలింది. తొలుత ఓ భవనంలో ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించారు. పనులు సగం పూర్తయిన తర్వాత ఎంజీఎంను 24 అంతస్తుల సముదాయానికి మార్చే అవకాశం ఉండడంతో పనులు నిలిపివేశారు. ఈ పనుల కోసం రూ.25 లక్షల నిధులు వృథా అయినట్లు తెలుస్తోంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనూ అంతే.. అధికారుల ఆదేశాల మేరకు ఎంజీఎం నుంచి కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఫెర్టిలిటీ సెంటర్ మారినా ఫలితం లేకుండా పోయింది. ఇందులోని ఐదో అంతస్తులో దీనిని ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఇచ్చినట్లు చెబుతున్నారు. దీని గురించి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించిన అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. అధికారులు స్పందించి ఫెర్టిలిటీ సేవలు ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. సీకేఎంలో సేవలు అందిస్తున్నాం.. సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో సంతానం లేనివారికి సంబంధిత వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా మెడికల్ మేనేజ్మెంట్ సేవలు మాత్రమే అందిస్తాం. దంపతులకు అవసరమైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తాం. వారి సమస్యలు గుర్తించి, ఇతర ఆస్పత్రులకు రెఫర్ చే స్తాం. ప్రతీరోజు ఓపీ ద్వారా సేవలందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీదేవి, సీకేఎం ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయని ప్రభుత్వం సీకేఎంలో మెడికల్ మేనేజ్మెంట్ సేవలకే పరిమితం సూపర్ స్పెషాలిటీలో అడుగడుగునా జాప్యం -
వివరాలు నమోదు చేసుకోవాలి
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ అర్బన్: స్వీయ జనగణనకు ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉందని, జిల్లా ప్రజలంతా తప్పనిసరిగా కుటుంబ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బాధ్యతగా పాల్గొని ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి స్వాగతం హన్మకొండ: భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం శమీరావు, టీఎస్ఐఐసీ ఎండీ శశాంకాకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి స్వాగతం పలికారు. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఆదివారం ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వారు హనుమకొండకు వచ్చారు. నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వారికి మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. -
పారదర్శకంగా మక్కల కొనుగోళ్లు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో మక్కల కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో శనివారం నాటికి 69,140 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలనే లక్ష్యం కాగా, అందులో 51,302 మెట్రిక్ టన్నులను గోదాంలలో నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భాగంగా.. ఎడ్యుకేషన్ వారోత్సవాలు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వీయగణనను వినియోగించుకోవాలి.. కాశిబుగ్గ: జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ ద్వారా స్వీయ జనగణనను (సెల్ప్ ఎన్యుమరేషన్) సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్ నుంచి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సీపీఓ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. -
నేడు మాతృదినోత్సవం
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్న లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉద్యోగం సాధించాలని అమ్మ చెబుతుండేది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించా. నన్ను చూసి మా అన్నదమ్ములు, అక్కా చెళ్లెళ్లు అందరూ బాగా చదివి మంచి పొజీషన్లో ఉన్నారు. నాన్న చనిపోయి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి అమ్మ మాతోనే ఉంటోంది. ఇప్పటికీ అమ్మతో మంచీ చెడు అన్నీ పంచుకుంటాం. అమ్మ నింపిన ధైర్యమే నా ఉద్యోగం. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్ -
ఓరుగల్లు బిషప్‌గా ఫాదర్ విజయపాల్‌రెడ్డి
అధికారికంగా ప్రకటించిన వాటికన్‌సిటీ 14వ పోప్ లియో కాజీపేట రూరల్: ఓరుగల్లు కథోళిక పీఠం నూతన బిషప్‌గా ప్రస్తుత పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డిని నియమిస్తూ వాటికన్‌సిటీలో 14వ పోప్ లియో శనివారం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు కాజీపేట ఫాతిమానగర్‌లోని కెథిడ్రల్ చర్చిలో శనివారం విశాఖ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఉడుములబాల, ఖమ్మం పీఠకాపరి మోస్ట్ రెవరెండ్ సగినాల ప్రకాశ్.. పోప్ లియో అధికార ప్రకటన నియామకపు బిషప్ పత్రాన్ని చదివి వరంగల్ బిషప్‌గా విజయపాల్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఓరుగల్లు పీఠం ఫాదర్లు, చర్చి కమిటీ బాధ్యులు, ప్రజలు ఫాదర్ విజయపాల్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఫాదర్లు కొమ్మారెడ్డి జెసెఫ్, అనుకిరణ్, మర్రెడ్డి, టి.జోసెఫ్, మత్యాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 34 ఏళ్లుగా ఫాదర్ విజయపాల్‌రెడ్డి సేవలు వరంగల్ జిల్లా గీసుకొండ మనుగొండ గ్రామంలో రాయపురెడ్డి, ఆగ్నేసమ్మ దంపతులకు 1956 జనవరి 8న విజయపాల్‌రెడ్డి జన్మించారు. చిన్ననాటి నుంచే వినయం, మృదుత్వం, సేవాభావం గుణాలను ఆయన అలవర్చుకున్నారు. జాన్స్ మేజర్ మిషనరీలో తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, విద్యను పూర్తి చేశారు. 1992 ఏప్రిల్ 2న వరంగల్ డయాసిస్‌కు యాజకునిగా అభిషేకం పొందారు. ఖమ్మం డయాసిస్‌లో అసిస్టెంట్ పారిష్ ప్రీస్ట్‌గా, ఎలూరు డయాసిస్‌లో హాస్టల్ డైరెక్టర్‌గా, వరంగల్ డయాసిస్ దేవగిరి పట్నం పారిష్ ఫ్రీస్ట్గా, ఫాతిమా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రినిపాల్‌గా, పాఠశాల ఉపాధ్యాయుడిగా, కాజీపేట లోడి సాంఘిక సంస్థ డైరెక్టర్‌గా, జనగామ క్రీస్తు జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ డైరెక్టర్‌గా సేవలందిస్తూ వరంగల్ డయాసిస్ అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. -
కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హన్మకొండ అర్బన్: ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, స్వీయ జనగణన, విద్యా వారోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద పాల్గొని జిల్లాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హనుమకొండ నుంచి అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, డీసీఓ సంజీవ్‌రెడ్డి, వరంగల్ నుంచి అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ సుబేదారిలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో తెలంగాణ పారా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గాడిపెల్లి ప్రశాంత్ అధ్యక్షతన శనివారం జరిగిన దివ్యాంగ క్రీడాకారుల సమావేశంలో కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ముప్పిడి రాజుకుమార్, సలహాదారుగా సింగారపు బాబు, ప్రెసిడెంట్‌గా నిషా ఇన్ననీ, నిర్వహణ కార్యదర్శిగా సీవీ జగన్నాథరావు, వైస్ ప్రెసిడెంట్లుగా బొట్ల కార్తీక్, దామెర మనీందర్, కోశాధికారిగా బల్లె రాజు, కార్యవర్గ సభ్యులుగా కృష్ణవేణి, జ్యోతి రఘువరన్, ప్రశాంత్, సంతోష్ ఎన్నికై నట్లు ప్రశాంత్ తెలిపారు. తమకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, పారా ఒలింపిక్స్ కమిటీ, ఖేలో ఇండియా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుల స్వీకరణ రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణంహసన్పర్తి: ఎల్కతుర్తి మండలం కేశవపూర్‌కు చెందిన చల్లా బతుకయ్య(42), లక్ష్మి (39) దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితం హసన్పర్తికి వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడే షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శనివారం సాయంత్రం వారు బైక్‌పై హసన్‌పర్తి నుంచి హనుమకొండ వైపు బయల్దేరారు. హసన్‌పర్తి సెంటర్ నుంచి అరకిలో మీటరు దూరంలోని 10 రూపాయల టిఫెన్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో బతుకయ్య పైనుంచి లారీ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్ర గాయాలైన లక్ష్మిని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. బతుకయ్య హెల్మెట్ ధరించినా ప్రాణాపాయం తప్పలేదు. -
సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్‌కు రెండు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల–సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ మంచిర్యాలలో ఉదయం 10–30 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్‌కు మధ్యాహ్నం 12–45 గంటలకు చేరుకొని వెళ్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మధిర–సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు ఉదయం 11 గంటలకు చేరుకొని వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక రైళ్లలో తరలివెళ్లనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. -
ఇంటర్ లేక విద్యార్థుల ఇబ్బందులు
వేలేరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇంటర్ చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు సరిపడా సాగునీరు గౌరవెల్లి ప్రాజెక్టు పైపులైన్ పనులు పూర్తిచేసి పంటలకు సరిపడా సాగునీరు అందిస్తామని డీఈ కిషన్‌ప్రసాద్ అన్నారు. సెంటర్‌స్ప్రెడ్‌లో uవాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. జఫర్‌గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
పారదర్శకంగా మక్కల కొనుగోళ్లు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జిల్లాలో మక్కల కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,07,991 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారని, సుమారు 2,80,776 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. శనివారం నా టికి 69,140 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా అందులో 51,302 మెట్రిక్ టన్నులను గోదాముల్లో నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వైవీ.గణేశ్, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రేషన్, జనగణన, విద్యా వారో త్సవాలపై సంబంధిత ఉన్నతాధికారులతో క లిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే విద్యావా రోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యా వారోత్సవాలను నిర్వహించాలి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఎడ్యుకేషన్ వారోత్సవాలు (విద్యా) విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వారోత్సవాల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు, బడి మానేసిన పిల్లలను తిరగి పాఠశాలల్లో చేర్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్వీయగణనను సద్వినియోగం చేసుకోవాలి కాశిబుగ్గ: జనగణనలో భాగంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ ద్వారా స్వీయ జనగణనను (సెల్ప్ ఎన్యుమరేషన్) సద్వినియోగం చేసుకొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద పిలుపునిచ్చారు. పోచమ్మమైదాన్ నుంచి ఐఎంఏ హాల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎంఏ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈనెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా వివరాలను వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, సీపీఓ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. -
కేఎంటీపీకి ‘పీఎం మిత్ర’ బూస్ట్ ఇచ్చేనా?
● భారీగా నిధులు మంజూరు చేస్తేనే అభివృద్ధి, ఉపాధి ● నేడు పీఎం మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆశలుగీసుకొండ: గీసుకొండ, సంగెం మండలాల్లో నెలకొల్పిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ) అభివృద్ధి ‘పీఎం మిత్ర’ నిధులతో ముడిపడి ఉంది. నిధులు భారీగా మంజూరు చేస్తేనే పార్కులో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాకాలు అందే అవకాశం ఉంటుంది. ప్రధాని మోదీ 2023 మార్చి 17న కేఎంటీపీని ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్’ (పీఎం మిత్ర) కింద ఎంపిక చేశారు. పార్కులో యూనిట్లను ఏర్పాటు చేసుకునే కంపెనీలకు అనేక రాయితీలు, ప్రోత్సాహకాలను పీఎం మిత్ర ద్వారా అందించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ‘ఎక్స్’ వేదికగా పీఎం మోదీ ఈ నెల 10న కేఎంటీపీని హైదరాబాద్‌లో వర్చువల్‌గా ప్రారంభిస్తారన్నారు. ఈ ప్రాజెక్టును రూ.1,695.54 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో నిర్మించినట్లు పేర్కొన్నారు. కేఎంటీపీ ప్రాజెక్టుతో రాష్ట్రానికి రూ.6 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తుండగా ఇప్పటికే రూ.3,800 కోట్లకు పైగా వచ్చినట్లు వెల్లడించారు. పార్కు అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయన్నారు. ప్రస్తుతం మూడు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. కేఎంటీపీ పరిశ్రమల సందర్శన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (కేఎంటీపీ)లో నెలకొల్పిన కై టెక్స్, యంగ్వన్, గణేశా కంపెనీలను భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వశాఖ సెక్రటరీ నీలం శమిరావు శనివారం సందర్శించారు. ఆయా కంపెనీల్లో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, కార్మిక సంక్షేమ చర్యలు, పారిశ్రామిక అభివృద్ధిని పరిశీలించారు. కంపెనీల పనితీరు, నిర్వహణ పద్ధతులు బాగున్నాయని ప్రశంసించారు. -
విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలి
● డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ కాళోజీ సెంటర్: ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న విద్యావారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. శనివారం గూగుల్ మీట్ ద్వారా ప్రిన్సిపాల్స్‌తో మాట్లాడారు. విద్యావారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అడ్మిషన్స్ ప్రచార సామగ్రి ప్రదర్శన, రెండో రోజు రెమీడియల్ తరగతుల ముగింపు, మూడో రోజు అడ్మిషన్లకు కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పేరెంట్స్ మీట్, లైబ్రరీ అవగాహన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన, చివరి రోజు విద్యా విజయోత్సవంగా ఉత్తమ విద్యార్థులను సన్మానించాలన్నారు. ఈ గూగుల్ మీట్లో 11 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బంది పాల్గొన్నారు. వైభవంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన గీసుకొండ: మండలంలోని రాంపూర్‌లో అభయాంజనేయస్వామి యంత్ర, విగ్రహ, ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన ఉత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య ప్రాణప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి పూ జా కార్యక్రమాలను నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రడం భరత్, ఆలయ కమిటీ చైర్మన్ తాబేటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. గోదాముల పరిశీలన చెన్నారావుపేట: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చర్యలు తీసుకుంటామని మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్ అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శనివారం గోదాముల ఇన్చార్జ్ సుమన్రావుతో కలిసి గోదాముల నిల్వల సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి మక్కల దిగుమతి వేగవంతం కానుందని, మక్కల నిల్వకు స్థానిక అధికారులు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్దన రమేశ్ మాట్లాడుతూ ప్రతీ గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య గోపాల్‌నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మంద యాకయ్య, సర్పంచ్ కంది శ్వేత కృష్ణచైతన్యరెడ్డి, రైతులు పాల్గొన్నారు. వరంగల్, కరీంనగర్ బిషప్‌గా విజయపాల్రెడ్డిగీసుకొండ: వరంగల్, కరీంనగర్ క్రైస్తవ సంఘం బిషప్‌గా గీసుకొండ మండలం మనుగొండకు చెందిన దుగ్గింపుడి విజయపాల్‌రెడ్డి శనివారం నియమితులైనట్లు గ్రామపెద్ద అల్లం మర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు రోమ్‌లోని పోప్ నుంచి ఆదేశాలు వెలువడినట్లు పేర్కొన్నారు. తమ గ్రామానికి చెందిన విజయపాల్‌రెడ్డి క్రైస్తవ మత, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో గుర్తింపు పొందాడన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. వడదెబ్బతో వ్యక్తి మృతి నర్సంపేట: వడదెబ్బతో నర్సంపేట 16వ వార్డు పరిధి నాగుర్లపల్లి గ్రామానికి చెందిన మెందుల ఐలయ్య(55) మృతి చెందాడు. ఐలయ్య శుక్రవారం మధ్యాహ్నం గేదెలను మేపుతున్న క్రమంలో ఎండ తీవ్రతతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు గమనించిన స్థానికులు, కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబీకులు శనివారం తెలిపారు. కాగా, స్థానిక కౌన్సిల్ బానోత్ నవీన్‌నాయక్.. ఐలయ్య మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. -
అనాథలకు అమ్మ
జఫర్‌గఢ్: వందలాది మంది అనాథ పిల్లలతో అమ్మ అని ఆప్యాయంగా పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె పుష్పరాణి. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీతండా వద్ద గాదె ఇన్నయ్య 20 ఏళ్ల క్రితం ‘మా ఇల్లు’ ప్రజాదరణ అనాథ ఆశ్రమాన్ని స్థాపించారు. 32 మంది పిల్లలతో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో ఇప్పటి వరకు వందకు పైగా అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఆశ్రమంలోని ఆడపిల్లల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధవహిస్తూ తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారు. ఆశ్రమానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలకు సొంత ఖర్చులతో వివాహాలు జరిపించారు. పుష్పరాణి కృషి ఫలితంగా ఆశ్రమానికి చెందిన పిల్లలు లాయర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, కానిస్టేబుల్‌గా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా గాదె పుష్పరాణి మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలకు అమ్మలా సేవ చేయడం, వారితో అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. -
సమస్యలు తెలిపారు.. పరిష్కరించారు
● వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ ● పైప్‌లైన్ లీకేజీలు, మరమ్మతులే ఎక్కువ.. ● ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందననర్సంపేట: నర్సంపేట మున్సిపాలి టీ పరిధిలో నెలకొన్న సమస్యల ను పరిష్కరిస్తామని చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, ము న్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ తెలిపారు. శనివారం వేసవిలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో పలువురు సమస్యలు తెలుపగా వెంటనే పరిష్కరించారు. పట్టణంలోని 62 మంది ప్రజలు, ప్రముఖులు స్పందించి పలు సమస్యలు తెలుపగా దాదాపుగా 40 శాతం సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని, వస్తున్న ఏరియాలో పైపులైన్ లీకేజీ సమస్యలు ఉన్నాయని తెలపడంతో చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ నీటి సరఫరా సిబ్బందితో మాట్లాడి గంట వ్యవధిలో సమస్యను పరిష్కరించేందుకు సిబ్బందిని కేటాయించి పనులు చేయించారు. దీంతో పట్టణానికి చెందిన జోషి రమేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు దార్ల సరస్వతి సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో పలువురు అడిగిన సమస్యలకు చైర్పర్సన్ లక్ష్మీరామానంద్తో పాటు మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్లు ఈ విధంగా సమాధానాలు చెప్పారు. ప్రశ్న: పైపులైన్ లీకేజీకి గుంత తీశారు..పూడ్చడం మరిచారు. – అపరాదపు సంపత్, 24వ వార్డు, పెరుమాళ్ల ఎల్లయ్య, 23వ వార్డు, జవాబు: పెద్ద పైపులైన్ పగిలిపోవడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. 27వ వార్డు కౌన్సిలర్ ములుకల సాంబయ్య ఇంటి సమీపంలో ఏర్పడిన గుంతను తక్షణమే పూడ్చి వేయిస్తాం. 23వ వార్డులో రెండు రోజుల్లో నీటి సరఫరా చేస్తా. ప్రశ్న: రెండు రోజులకు ఒకసారి తాగునీరు వస్తుంది. – బెజ్జంకి ప్రభాకర్, బీరం భాస్కర్ జవాబు: 28వ వార్డులో మిషన్ భగీరథ పైప్‌లైన్ వేసినప్పటికీ మెయిన్ పైప్‌లైన్ లింకేజీ చేయలేకపోయాం. త్వరలో సమస్యలు పరిష్కరించి తాగునీరు అందిస్తాం. ప్రశ్న: గతంలో వచ్చే నీరు ఇప్పుడు రావడం లేదు. – బొమ్మెర సతీష్, 25వ వార్డుజవాబు: ద్వారకపేట రోడ్డులో ఏర్పడిన గుంతను పూడ్చి మరమ్మతు చేస్తున్నాం. రెండు రోజుల్లో సమస్య లేకుండా కృషి చేస్తాం. ప్రశ్న: 26వ వార్డులో బోరు రిపేరు చేయించడం లేదు. – నాడెం రామకృష్ణ, 26వ వార్డు జవాబు: 26వ వార్డులోని జయశ్రీ టాకీస్ సమీపంలోని కడారి చంద్రయ్య ఇంటి ముందు ఉన్న బోరు రిపేరు రావడంతో 4రోజులుగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దానికి సంబంధించిన సామగ్రి వచ్చింది. రెండు రోజుల్లో బోరు రిపేరు చేసి నీటి సరఫరా చేస్తాం. దీని కోసం మున్సిపాలిటీ సిబ్బంది సదానందంను పంపిస్తున్నాం. ప్రశ్న: పైప్‌లైన్ లీకేజీ అవుతుంది. మరమ్మతు చేయాలి? – మఠారి విఠల్, 27వ వార్డు జవాబు: వెంటనే రిపేరు చేయిస్తాం. సిబ్బందిని పంపిస్తామంటూ.. సిబ్బందిని సంఘటనా స్థలానికి వెంటనే పంపించారు. ప్రశ్న: పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కరించడం అభినందనీయం. ఎప్పుడైన అధికారుల దృష్టికి వచ్చి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. –గోకా రామస్వామి, వనప్రేమి అవార్డు గహీత జవాబు: అందరి సహకారంతో ప్రతీ సమస్యను పరిష్కరిస్తున్నాం. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచన మేరకు అశోక్‌నగర్‌లోని ఢీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు నుంచి రానున్న రోజుల్లో నీటి సమస్య లేకుండా రూ.50లక్షల నిధులతో పట్టణానికి తాగునీటిని అందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ప్రశ్న:మఽగ్ధుంపురంలో ఇబ్బందులుఅవుతున్నాయి? – కోల కిరణ్‌కుమార్, కె.సదానందం జవాబు: మున్సిపాలిటీ పరిధిలోని 11వార్డు మగ్ధుంపురంలో నీటి సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. సిబ్బందిని మార్చి ప్రత్యేక వసతులు కల్పిస్తాం. ప్రశ్న: మిషన్ భగీరథ పథకంతో ఉపయోగం లేదు – వాజిత్, 17వ వార్డు జవాబు: పట్టణానికి రావాల్సిన భగీరథ తాగునీటిలో తక్కువ శాతం రావడం వల్ల అన్ని వార్డులకు అందించలేక పోతున్నాం. ఎమ్మెల్యే సహకారంతో వచ్చే సీజన్లో సమస్యను అధిగమించి అమృత్ పథకాన్ని అనుసంధానం చేసి పట్టణం మొత్తం తాగునీ రు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రశ్న: అధికారులకు అవగాహన ఉండడం లేదు. సమస్యలు పరిష్కారం కావడం లేదు? – నాడెం శాంతికుమార్, మాజీ ఖనిజాభివృద్ధి శాఖ డైరెక్టర్, 25వ వార్డుజవాబు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. మున్సిపాలిటీ పాలక వర్గం ఇటీవల బాధ్యతలు స్వీకరించింది. 25వ వార్డుతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 30వార్డుల్లో సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే సహకారంతో ముందుకు సాగుతున్నాం. సమస్యలన్నింటిని పరిష్కరిస్తాం. -
అమ్మ నింపిన ధైర్యమే ఉద్యోగస్తున్ని చేసింది
సాక్షి, మహబూబాబాద్: మాది ఉమ్మడి కుటుంబం. అమ్మాన్నాన్నలు లక్ష్మీ, నరసింహం. నాన్న వ్యవసాయం చేసేవారు. ఇంట్లో నేనే పెద్ద కొడుకును. నామీదనే అందరి ఆశలు. అందుకోసమే చిన్నప్పటి నుంచి నేను బాగా చదవాలని అమ్మ చెబుతుండేది. పరీక్షల్లో వచ్చిన మార్కులు కూడా అమ్మే చూసి సంతోషపడేవారు. పోలీస్‌శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ చూసి అమ్మకు చెప్పాను. ఈ ఉద్యోగం నీకు వస్తుంది.. నీకు ఆ శక్తి ఉందని ధైర్యం నింపింది. ఆమె చెప్పినట్లుగానే ఉద్యోగం సంపాదించాను. అప్పుడు ఆమె కళ్లల్లో చూసిన ఆనందం ఇప్పటికి మరవలేను. నన్ను చూసి మా అన్నదమ్ముళ్లు, ఆక్కా చెల్లెళ్లు బాగా చదివారు. మంచి పొజీషన్లో ఉన్నారు. అమ్మ మాతోనే ఉంటుంది. పని ఒత్తిడి, ఇతర సమస్యలు వచ్చినప్పుడు అమ్మతో మాట్లాడితే అంతా పోతుంది. – ఎన్.తిరుపతిరావు, డీఎస్పీ మహబూబాబాద్ -
వారం రోజుల టైం ఇస్తున్నాం..
● మక్కలు కొనకుంటే ధర్నా చేస్తాం ● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రాయపర్తి: ప్రభుత్వానికి వారం రోజుల టైం ఇస్తున్నాం.. ఆలోగా మక్కల కొనుగోళ్లు చేయకుంటే ఐదు వేల మంది రైతులతో ధర్నా చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఎదుట ఉన్న వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఆయన రైతులతో ధర్నా చేశారు. అనంతరం మార్క్‌ఫెడ్ అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండానే రైతుల పంటలు కొనుగోలు చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోయి రైతులకు కనీసం గన్నీ బ్యాగులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నర్సింహానాయక్, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, నాయకులు కర్ర రవీందర్‌రెడ్డి, రంగారెడ్డి, గారె నర్సయ్య, ఐత రాంచందర్, ఎల్లగౌడ్, రైతులు పాల్గొన్నారు. రైతు సమస్యలను విస్మరించిన ప్రభుత్వం నెక్కొండ: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను విస్మరించిందని ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. సాయిరెడ్డిపల్లి శివారులోని వీకేఆర్ గోదాంతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం మక్కలు, ధాన్యం కొనుగోళ్లు చేయకుండా రైతు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ విధానాలతో విసుగెత్తిన రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునే పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఎల్లమ్మతల్లి చల్లని చూపు అందరిపై ఉండాలి
హై కోర్డు జడ్జి జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి దామెర: ఎల్లమ్మ తల్లి చల్లని చూపు అందరిపై ఉండాలని హై కోర్టు జడ్జి జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి అన్నారు. దామెర మండలంలోని ముస్త్యాలపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జడ్జి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠను వేద పండితులు మంత్రోచ్ఛరణ మధ్య ఘనంగా నిర్వహించారు. కాగా, జడ్జి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి, దూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఎల్లమ్మతల్లి దయతో ప్రజలంతా సుఖఃసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, పరకాల ఏసీపీ సతీశ్‌బాబు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, నిర్వాహకులు బొల్లం లక్ష్మణ్, సాంబయ్య, చిలువేరు రాజు, శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ ఎండీ.జాకీర్‌అలీ, రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు. -
జనగణనలో భాగస్వాములు కావాలి
వరంగల్ అర్బన్: జనగణన–27లో భాగంగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, స్వీయ గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. ములుగు రోడ్ జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, ‘జనగణన–27లో పాల్గొని దేశాభివృద్ధికి సహకరిద్దాం’’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, మెప్మా సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, తెలంగాణ సాంస్కతిక సారథి బృందం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలి.. హన్మకొండ అర్బన్: జనగణన–27 విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ కోరారు. శుక్రవారం జనగణన–27 అవగాహన ప్రచార వాహనాన్ని హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ తనిఖీ నెలవారీ తనిఖీల్లో భాగంగా.. నగరంలోని రెడ్ క్రాస్ భవనం వెనుక ఉన్న ఈవీఎం గోడౌన్‌ను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మత్స్యకారులకు అవగాహన సదస్సు హన్మకొండ చౌరస్తా: చెరువుల పరిశుభ్రత, నీటి నాణ్యత పరిరక్షణ, చేపల వ్యాధుల నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తే మత్స్య ఉత్పత్తి పెరిగి మత్స్యకారులకు అధిక ఆదాయం లభిస్తుందని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ‘రైతు వారం’ ఐదో రోజు సందర్భంగా చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపల వ్యాధుల నియంత్రణ, చేపల అధికోత్పత్తి సాధనపై హనుమకొండలోని పద్మశాలి భవన్‌న్‌లో శుక్రవారం జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆధునిక మత్స్య సాగు పద్ధతులు, చెరువుల నిర్వహణ, చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. హైదరాబాద్ వ్యవసాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ నీలం పుష్పరాణి, జిల్లా మత్స్యశాఖ అధికారి పి.శ్రీపతి, మామునూరు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ గణేశ్ (ఆక్వాకల్చర్), ఎఫ్డీఓ (రిటైర్డ్), ఎస్.వేణుగోపాల్, డీఎఫ్‌సీఎస్ హనుమకొండ మల్లేశం, మత్స్యకారులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ -
జనగణనలో భాగస్వాములు కావాలి
● గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్వరంగల్ అర్బన్: జనగణన–27లో భాగంగా నిర్వహించనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, స్వీయ గణనలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం వరంగల్ ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ వేయిస్తంభాల ఆలయం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థల ప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. ములుగు రోడ్డు జంక్షన్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, ‘జనగణన–27లో పాల్గొని దేశాభివృద్ధికి సహకరిద్దాం’’ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది, మెప్మా సభ్యులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
● వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: ఉద్యోగంలో స్థాయి పెరిగినా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్సై భుజాలపై స్టార్స్‌ను అలంకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ పదోన్నతులతో కేవలం హోదా పెరగడమే కాకుండా ప్రజల కోసం మరింత బాధ్యతతో పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ప్రజా సమస్యలను సానుభూతితో వినడం, చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవడం, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. -
సమయపాలన లేదు..
వాళ్ల ఇష్టం వచ్చినసమయానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. ఒక్కోసారి ఉదయం, మరోసారి రాత్రిపూట నల్లాలు వదలడంతో తెలియక పట్టుకోలేకపోతున్నాం. గతంలోకంటే ఎండాకాలం నీరు తక్కువగా వస్తోంది. లైన్‌మన్‌ను అడిగితే పైపులైన్ లీకేజీ ఉందని, అందుకే నీరు ప్రెజర్ తక్కువగా ఉందని చెబుతున్నాడు. – పిల్లల సామ్రాజ్యం, ఉర్సుబొడ్రాయి, వరంగల్ రోజంతా నీళ్లకాడనే..నల్లా నీరు ప్రెషర్ తక్కువగా వస్తుంది. సన్నటి ధారలాగా వస్తుండడంతో రోజంతా నీళ్లకాడనే ఉండాల్సి వస్తోంది. మేము పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది. నీటిదగ్గరనే సమయమంతా గడిచిపోవడంతో పనికి పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. దీంతోపాటు ఏ సమయంలో నీటిని వదులుతారో అర్థంకాని పరిస్థితి. – భాగ్యమ్మ, మైసయ్యనగర్, వరంగల్ -
అకాల వర్షం.. రైతులు ఆగం
● కొనుగోలు కేంద్రాల్లో తడిసిన మక్కలు ● 20 రోజులుగా తప్పని ఎదురుచూపులునర్సంపేట/ఖిలా వరంగల్: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాలవర్షం మక్క రైతులను ఆగం చేసింది. చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నర్సంపేట, ఏనుమాముల మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో మక్కలు తడిసిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్క బస్తాలపై పరదాలు కప్పినా ఈదురుగాలుకు కొట్టుకుపోయాయని పేర్కొంటున్నారు. 32 వేల ఎకరాల్లో మక్కసాగు.. రైతులు ఈ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా 32 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. విస్తీర్ణం పెరిగి మార్కెట్ యార్డులకు మొక్కజొన్నలు పోటెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా మక్కల రాశులే కనిపిస్తున్నాయి. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో రైతులు 20 రోజులుగా నీరిక్షిస్తున్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు వద్ద వాహనాల వివరాలను నమోదు చేయడం వదిలేసినట్లు తెలుస్తోంది. రైతులు నేరుగా తెచ్చిన మక్కలను పక్కన పెట్టి వ్యాపారులు తెచ్చిన పంటను కోనుగోళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అకాల వర్ష భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మక్కలను తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
లీకేజీ.. టేకిటీజీ!
సాక్షి, వరంగల్: జిల్లాలోని వరంగల్ నగరం, నర్సంపేట మున్సిపాలిటీలో తాగునీటి తిప్పలు తప్పడం లేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 28 డివిజన్లు, నర్సంపేటలో 30 వార్డులు, వర్ధన్నపేటలో 12 వార్డులు ఉన్నాయి. కొన్ని కాలనీలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. అమృత్ పథకం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా నల్లా కనెక్షన్ ఉన్నా కొన్ని చోట్ల పైపులైన్ల లీకేజీలతో నీరు డ్రెయినేజీల్లోకి వృథాగా పోతుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. వరంగల్ మహానగరం, నర్సంపేట మున్సిపాలిటీలోని విలీన గ్రామాలకు సరిగా నీరందడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. వరంగల్ నగరానికి రోజుకు 80 ఎఎంల్డీల (80,00,000 లీటర్ల) నీరు, నర్సంపేటలో 7.36 ఎంఎల్డీల (7,36,000 లీటర్లు) నీరు, వర్ధన్నపేటలో 2.16 ఎంఎల్డీల నీరు అవసరం ఉంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌కు.. వరంగల్ నగరానికి ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌కు నీరు వస్తుంది. అక్కడ ఫిల్టర్ చేసి నీటిని సరఫరా చేస్తారు. అలాగే, ధర్మసాగర్ ఫిల్టర్‌బెడ్ నుంచి కడిపికొండ మీదుగా ఉర్సు కరీమాబాద్, అండర్ రైల్వే గేట్ ప్రాంతాలకు తాగునీరు సరఫరా అవుతోంది. శివనగర్, ఖిలా వరంగల్ ఎస్సీవాడ, పుప్పాలగుట్ట, పైడిపల్లి, కొత్తపేట తదితర ప్రాంతాలకు సరిపడా నీరు రావడం లేదన్న విమర్శలొస్తున్నాయి. నర్సంపేటకు పాకాలవాగు నీటిని పంపింగ్ చేసి ఆ తర్వాత ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నారు. కొన్ని వార్డులకు ఈ నీరు వెళ్తుండగా, మరికొన్ని వార్డులకు నేరుగా రా వాటర్ వెళ్తోంది. సమస్యలున్న ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. నర్సంపేటలో పరిష్కారం కాని తాగునీటి సమస్య నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలోని ప్రధాన రహదారుల వెంట పైపులైన్ల లీకేజీలతో తాగునీరు వృథాగా పోతోంది. దీంతో అన్ని కాలనీలకు నీరు సరఫరా కావడం లేదు. మల్లంపల్లి రోడ్డులో ఐదు సంవత్సరాలుగా లీకేజీ అవుతున్న పైపులైన్‌ను మున్సిపల్ చైర్పర్సన్ ఇటీవల మరమ్మతు చేయించారు. మిషన్ భగీరథ నీరు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదు. దీంతో రెండు రోజులకోసారి నల్లాల ద్వారా నీటిని అందిస్తున్నారు. వేసవి ప్రణాళికలో భాగంగా రూ.34 లక్షలతో తాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నారు. 60 సమస్యలు పరిష్కారం కాగా.. 40 సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సమయం సరిపోక.. గత పాలకవర్గం హయాంలో తాగునీటి సమస్య జఠిలమైంది. నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి నీటి సమస్య వివరించింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో ఉన్న డీఫ్లోరైడ్ ప్రాజెక్టు పనులను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ.50 లక్షలు అత్యవసరంగా అందించే ప్రయత్నం ఎమ్మెల్యే చేశారు. పనులు పూర్తయ్యే సరిగా ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. దీంతో సమయం సరిపోక ఈ వేసవిలో పనులు చేపట్టలేదు. నీరు వృథాగా పోతున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు వేసవిలో శివారుకాలనీలకు అందని తాగునీరు వరంగల్, నర్సంపేటలో ప్రజల ఇబ్బందులు -
ఆలయ నివేదికను పంపించాం..
ఖానాపురం: అశోక్‌నగర్‌లోని కూల్చివేసిన శివాలయానికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించామని ఆర్కియాలజీ వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ బుజ్జి అన్నారు. ఈ మేరకు కూల్చివేసిన శివాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించి మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోసారి ఆలయాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఆర్కియాలజీ పరిధిలో 25 దేవాలయాలు ఉన్నాయని, ఈ శివాలయాన్ని కూడా ఆర్కియాలజీ పరిధిలోకి తీసుకురావడానికి కృషిచేస్తామని, శివాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సై రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నేడు కేఎంటీపీకి కేంద్ర టెక్స్టైల్ సెక్రటరీ రాక గీసుకొండ: గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)కు పీఎం మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ సెక్రటరీ నీలం శామీరావు శనివారం రానున్నట్లు గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె కేఎంటీపీని పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కలెక్టర్ సత్యశారద, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామినాయక్ పాల్గొంటారని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 10న హైదరాబాద్ పర్యటన సందర్భంగా శామీరావు కేఎంటీపీకి వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పీఎం మోదీ వర్చువల్‌గా కేఎంటీపీకి సంబంధించిన పలు ప్రారంభోత్సవాలు, కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్లు, సిమ్‌లు తిరిగి ఇచ్చేయండి తాజా మాజీ కార్పొరేటర్లకు సమాచారం వరంగల్ అర్బన్: తాజా మాజీ కార్పొరేటర్లు తమ మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు వెనక్కి ఇవ్వాలని బల్దియా సిబ్బంది శుక్రవారం వారికి సమాచారం అందించారు. పలువురు మాజీ కార్పొరేటర్లకు ఫోన్ చేసి, ప్రధాన కార్యాలయంలో అందించాలని సూచించారు. దీంతో హైరానా పడిన కొంత మంది మాజీ కార్పొరేటర్లు గతంలో ఎన్నాడు లేని విధంగా ఇదేంటి అంటూ కలెక్టర్, గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. 2010, 2021 పాలకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, కొత్త విధానం ఏంటని విన్నవించినట్లు సమాచారం. తమ సిమ్‌లకు సంబంధించిన బిల్లు బల్దియా కట్టాల్సిన అవసరం లేదని, మేం చెల్లించుకుంటామని, కానీ సిమ్‌లు, ఫోన్లు వెనక్కి తీసుకోవడం ఏంటని కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐదేళ్లుగా ప్రజా సేవ చేశామని, ఆ నంబర్‌తో అనేక కార్యకలాపాలు ముడిపడి ఉన్నాయని, వెనక్కి ఇవ్వాలని కోరడం సరికాదని తాజా మాజీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు వెనక్కి తీసుకోవద్దని బల్దియా అధికారులకు కలెక్టర్ సూచించినట్లు తెలిసింది. రేపు జిల్లా రైల్వే ప్రాజెక్ట్ ప్రారంభం కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్ట్‌లను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మ్యాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్‌ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని అధికారులు తెలిపారు. -
రైతులకు అండగా ప్రభుత్వం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మార్కెట్లో ధాన్యం తడవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా వేగవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు త్వరితగతిన చెల్లించే విధంగా చూడాలని, ప్రతిపక్షాల నాయకులు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్‌రావు, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. కోనారెడ్డి చెరువును అభివృద్ధి చేస్తాం కోనారెడ్డి చెరువు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. కోనారెడ్డి చెరువు కట్టపై నిర్మించిన ఆలయంలో కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం చెరువు కట్టపై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, దీపాలను మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి ప్రారంభించారు. -
రోడ్లే కల్లాలవ్వడం బాధాకరం
సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి భీమదేవరపల్లి: రైతులు పంట నూర్పిడి చేసుకునేందుకు సరైన వసతులు లేక రోడ్లనే కల్లాలుగా వాడుకుంటున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామదేవతల ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు. ఐకేపీ ద్వారా మొదట ఆన్లైన్ అని, ఆ తర్వాత ఆఫ్‌లైన్ అని మార్చడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానివి కేవలం మాటలే తప్ప, క్షేత్రస్థాయిలో చేతలు లేవని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పరిస్థితి ఆత్మహత్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆదరి శ్రీనివాస్, పలువురు నేతలు, రైతులు పాల్గొన్నారు. -
నీళ్లు తక్కువొస్తున్న మాట నిజమే..
పరకాల జనాభాను దృష్టిలో ఉంచుకొని నీటి సరఫరాను పెంచాలని గతంలోనే మిషన్ భగీరథ నీటి సరఫరా విభాగం అధికారులను కోరాం. కానీ, వారు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో పట్టణ ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న మాట నిజమే. 6 లక్షల లీటర్ల నీటిని ప్రజలకు పంపిణీ చేయడం ఓ సవాలుగా మారుతోంది. – రంజిత్, పరకాల మున్సిపల్ ఏఈ, ఇన్చార్జ్ కమిషనర్ బావుల వద్ద నీళ్లు తెచ్చుకుంటున్నాం.. మిషన్ భగీరథ పైపులు వేస్తుంటే ఎంతో సంబురపడ్డాం. ఆసంబురం ఎన్నో రోజులు నిలవలేదు. రోజూ సరిపడా నీళ్లు రావట్లేదు. నీళ్లు వచ్చినా సరిపడకపోవడంతో బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ట్యాంకర్ల ద్వారా రోజూ ఒక డ్రమ్ము నీళ్లు ఇవ్వాలి. – రజని, గౌడవాడ, పరకాల ఏళ్లుగా నీళ్లకు గోస పడుతున్నాం.. ఈ ఊర్లో నీళ్ల కష్టాలు చూసి పిల్ల ను ఇవ్వాలంటే భయపడేవాళ్లు. వాళ్లు భయపడ్డట్లే ఎన్నో ఏళ్లుగా పరకాలకు నీళ్ల కష్టాలు పోవడం లేదు. నీళ్ల కష్టాలు చూసి కొందరు బోరింగులు వేస్తే వాటిని బాగుచేసేవాళ్లు లేరు. కేసీఆర్ సార్ ఇచ్చిన నల్లాల నుంచి నీళ్లు ఎక్కువ రావట్లేదు. – రాజేశ్వరి, వడ్లవాడ, పరకాల -
రైతులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ పబ్బం
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్: రైతులను రెచ్చగొట్టి బీఆర్ఎస్ నాయకులు రాజకీయ పబ్బం గడిపేందుకు యత్నిస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. మండలంలోని పెద్ద పెండ్యాలలో శుక్రవారం ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈమేరకు గ్రామంలో రూ.3 కోట్ల ‘కుడా’ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.48 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, ఎస్సీ, రజక, ముదిరాజ్ కమ్యూనిటీ హళ్ల ప్రహరీ మొత్తం రూ.3.62 కోట్ల విలువైన అభివృద్ధి పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరత, గోదాంలు ఖాళీ లేక ధాన్యం కొనుగోళ్లలో కొంత జాప్యం జరుగుతుందని, దీనిని రైతులు అర్థం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ తోట నాగరాజు, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నైపుణ్య ఆధారిత శిక్షణ
కేయూ క్యాంపస్: విద్యార్థులకు నైపుణ్య ఆధారిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వర్సిటీలోని సెనేట్ హాల్లో అధ్యాపకులకు, డీన్లకు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీ–స్కిల్ డిజైర్‌తో అవగాహన ఒప్పందం ద్వారా ఫుల్ స్టాక్ జావా, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నామన్నారు. స్కిల్ డిజైర్ డైరెక్టర్ ముప్పల శ్రీకాంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలు వివరించారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను కలిసిన పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం విభాగం అధిపతిగా ప్రొఫెసర్ టి.మనోహర్‌ను నియమిస్తూ రిజి స్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండేళ్లుగా రాజ్‌కుమార్ విభాగా ధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం పూర్తవడంతో ఆ స్థానంలో మనోహర్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన ఆ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కూడా కొనసాగుతున్నారు. ఈ మేరకు వీసీ కె.ప్రతాప్‌రెడ్డి చేతులమీదుగా మనోహర్ ఉత్తర్వులు అందుకున్నారు. ఓఎస్డీ బి.వెంకట్రామ్రెడ్డి, అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ పాల్గొన్నారు. వరంగల్ క్రైం: ఉద్యోగంలో స్థాయి పెరిగినా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలందించేలా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్సై భుజాలపై స్టార్స్‌ను అలంకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కాజీపేట రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు రైల్వే ప్రాజెక్టులను ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో వర్చువల్‌లో ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట–హసన్‌పర్తి రైల్వేస్టేషన్ల మధ్య కోమటిపల్లి రైల్వే గేట్‌సమీపంలో నిర్మించిన సొరంగమార్గం (రైల్ అండర్ రైల్), బల్లార్షా – కాజీపేట – విజయవాడ మూడో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. కాగా, కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ–కోచ్‌ఫ్యాక్టరీ) ప్రధాని ప్రారంభించే ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు లేదని రైల్వే అధికారులు తెలిపారు. పనులు పూర్తి స్థాయిలో కాలేదని పేర్కొన్నారు. -
పది రోజులుగా పనిచేయని సీటీ స్కాన్
కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 రోజుల నుంచి సీటీ స్కాన్ యంత్రం పనిచేయట్లేదు. దీంతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సిటీ స్కాన్ చేయించుకోవాలంటే ఇబ్బందిగా మారుతోంది. వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు సీటీ స్కాన్ ఎక్కడ చేయించుకోవాలో తెలియక ఆందోళనకు గురువుతున్నారు. దీంతో రోగులు ఎంజీఎం ఆస్పత్రి బాట పడుతున్నారు. మండుటెండలో సీటీ స్కాన్ కోసం పేషెంట్‌తో పాటు అటెండెంట్ ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్తుండడంతో వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అధిక భారం.. ప్రస్తుతం ఎంజీఎంలోని పేషెంట్లకే సీటీ స్కాన్ పరీక్షలు చేయడంలో క్యూ లైన్ పాటించాల్సి వస్తోంది. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా సిటీ స్కాన్ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. చివరకు సిటీ స్కాన్లు అధికంగా తీయాల్సి రావడంతో ఇక్కడి స్కాన్ పరికరం కూడా పనిచేయకుండా మూలన పడే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. కాగా, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని పరికరానికి సంబంధించిన వారెంట్ ముగియడంతో సంబంధిత టెక్నీషియన్లు హైదరాబాద్ నుంచి రావట్లేదని తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి రావాల్సిన బకాయిలు ఉండడంతో వారు రావట్లేదని సమాచారం. దీంతో స్కాన్ పరీక్షల కోసం ఇంకెన్ని రోజులు పడతాయో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి నట్లు అధికారులు చెబుతున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్ప్రతిలో రోగులకు ఇక్కట్లు -
పది రోజులుగా పనిచేయని సీటీ స్కాన్
● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోగులకు ఇక్కట్లు కాశిబుగ్గ: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 10 రోజుల నుంచి ిసీటీ స్కాన్ యంత్రం పనిచేయట్లేదు. దీంతో రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సీటీ స్కాన్ చేయించుకోవాలంటే ఇబ్బందిగా మారుతోంది. వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు ిసీటీ స్కాన్ ఎక్కడ చేయించుకోవాలో తెలియక ఆందోళనకు గురువుతున్నారు. దీంతో రోగులు ఎంజీఎం ఆస్పత్రి బాట పడుతున్నారు. మండుటెండలో ిసీటీ స్కాన్ కోసం పేషంట్‌తో పాటు అటెండెంట్ ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్తుండడంతో వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అధిక భారం.. ప్రస్తుతం ఎంజీఎంలోని పేషంట్లకే ిసీటీ స్కాన్ పరీక్షలు చేయడంలో క్యూ లైన్ పాటించాల్సి వస్తోంది. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి వచ్చిన పేషెంట్లకు కూడా ిసీటి స్కాన్ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. చివరకు సీటీ స్కాన్లు అధికంగా తీయాల్సి రావడంతో ఇక్కడి ిసీటీ స్కాన్ పరికరం కూడా పనిచేయకుండా మూలన పడే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. కాగా, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని ిసీటీ స్కాన్ పరికరానికి సంబంధించిన వారెంట్ ముగియడంతో సంబంధిత టెక్నీషియన్లు హైదరాబాద్ నుంచి రావట్లేదని తెలుస్తోంది. ఆస్పత్రి నుంచి రావాల్సిన బకాయిలు ఉండడంతో వారు రావట్లేదని సమాచారం. దీంతో ిిసీటీ స్కాన్ పరీక్షల కోసం ఇంకెన్ని రోజులు పడతాయో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. -
యంగ్ కలెక్టర్.. ఒకేసారి ఐదు కుర్చీల్లో..!
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)లో గురువారం నుంచి ప్రత్యేకాధికారి పాలన ప్రారంభమైంది. హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టీ.కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియా పాలక మండలి పదవీ కాలం బుధవారంతో పూర్తయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే నాటికి ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది. గ్రేటర్ వరంగల్ ఇన్చార్జ్ కమిషనర్‌గా, స్పెషల్ ఆఫీసర్‌గా చాలాతక్కువ మంది కలెక్టర్లకు ఇలాంటి అవకాశం లభిస్తుందని సీనియర్ అధికారులంటున్నారు. ఒకరికే.. నాలుగు అదనపు బాధ్యతలువరంగల్, హనుమకొండ జిల్లాలకు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అత్యంత కీలకమయ్యారు. గ్రేటర్ వరంగల్ మహానగరం, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) రెండు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. బల్దియా కమిషనర్‌గా పనిచేసిన ఆమె ఇటీవల పదోన్నతిపై హనుమకొండ కలెక్టర్‌గా నియామకమయ్యారు. ప్రభుత్వం కమిషనర్ పోస్ట్‌ను ఇంకా భర్తీ చేయలేదు. ఆమెనే కలెక్టర్‌గా, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్‌గా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) వైస్ చైర్‌పర్సన్‌గా, హనుమకొండ జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మీదట బల్దియా ప్రత్యేకాధికారిగా కొనసాగనున్నారు. ఇలా ఐదు కుర్చీల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. అయితే అన్నింటినీ చక్కదిద్దడం కత్తిమీద సామే అంటున్నారు విశ్లేషకులు. మహా నగర అభివృద్ధిని కొనసాగిద్దాం : ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్కిందిస్థాయి నుంచి వింగ్ అధికారి వరకు బాధ్యతాయుతంగా తమ విధులను సమన్వయంతో పనిచేస్తూ, మహా నగర అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేద్దామని గ్రేటర్ వరంగల్ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వింగ్ అధికారులతో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సుమారు రూ.100 కోట్ల విలువైన పెద్ద ప్రాజెక్టులు వేగంగా అమలయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా రహదారులు, పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పన దృష్టి కేంద్రీకరించాలన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రజా ఫిర్యాదులకు తక్షణం స్పందించాలని, ఫైళ్లు ఎక్కడా నిలిచిపోకూడదని హెచ్చరించారు. యూజీడీ ప్రాజెక్ట్ డీపీఆర్ అంతిమ దశకు చేరుకున్నందున ఇంజనీరింగ్ అధికారులు అందుకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, ఎంహెచ్ఓ డా.రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, మహేందర్, మాధవీలత పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్‌పాయ్‌కి అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
జలం.. పాతాళం
జిల్లాలో పడిపోతున్న సగటు నీటిమట్టంసాక్షి, వరంగల్: జిల్లాలో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. ఓవైపు పంటల సాగు.. మరోవైపు భానుడి భగభగతో క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్‌లోనే చేతికి అందివచ్చే వరి, మొక్కజొన్న, మిర్చి పంటల సాగుకు అత్యధిక నీటి వినియోగం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జనవరి నుంచి ప్రతి నెల నెలకు దిగువకు చేరుతున్న భూగర్భజలాలు.. నాలుగు నెలల్లో 2.33 మీటర్లకు తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో జిల్లాలో సగటు భూగర్భజల మట్టం 6.21 మీటర్లు ఉంటే ఈసారి మరో 0.03 మీటర్లు కిందకు దిగజారి 6.24 మీటర్లు ఉండడం గమనార్హం. గతేడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కలుపుకుంటే 854 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,102.4 మిల్లీమీటర్లు కురిసింది. అంటే 29 శాతం అదనంగా వర్షపాతం నమోదవడం కూడా ఈసారి పెద్దగా నీటి నిల్వలకు ఇబ్బంది లేకుండా పోయింది. పర్వతగిరి మండలంలో 13 మీటర్లు, సంగెం మండలంలో 12.54 మీటర్ల దిగువన నీరు ఉండడం కాస్త ఆందోళన కలిగించినా మేలో పెద్దగా వ్యవసాయ పనులు ఉండే అవకాశం లేకపోవడంతో నీటి ఇబ్బందులు ఉండకపోవచ్చని భూగర్భజల విభాగాధికారులు అంటున్నారు. మరోవైపు చెరువులు, కుంటల్లో నీరు ఇంకిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం నీటి కోసం తిప్పలు తప్పడం లేదు. బావులు, బోరుబావుల్లో నీటిమట్టం పడిపోతూ మే ఆరంభంలోనే ప్రజలకు నీటి కరువును చూపెడుతున్నాయి. కొన్నిచోట్ల వ్యవసాయదారులు తమ చేతికి అందివచ్చిన కూరగాయలు, ఇతర పంటలు కాపాడుకునేందుకు బోర్లు సైతం వేస్తుండడం కనిపిస్తోంది.ఏప్రిల్ నాటికి 6.24 మీటర్ల దిగువన నీరు పర్వతగిరి, సంగెం మండలాల్లో ఆందోళన ఈ నెలలో మరింత లోతుకు వెళ్లే అవకాశంప్రధాన కారణాలు.. వేసవి ప్రారంభమైన ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో నేలలోని తేమ వేగంగా ఆవిరైపోయింది. దీంతో భూగర్భజలాల పునరుత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్‌లో సాధారణంగా వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. భూమిలోకి కొత్తగా నీరు చేరకపోవడంతో జలమట్టం క్రమంగా దిగజారుతోంది. తాగు, సాగునీటి అవసరాల కోసం రైతులు, గ్రామాలు ఎక్కువగా బోర్లపై ఆధారపడతాయి. ముఖ్యంగా వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటల సాగుకు అధిక పంపింగ్ చేస్తారు. దీనివల్ల ఏప్రిల్ నెలలో ఎక్కువగా భూగర్భజలాలు వినియోగించారు. ఉపరితల జలవనరులైన చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల భూగర్భ జలాలకు సహజ రీచార్జ్ తగ్గిపోతుంది. వర్షపు నీరు భూమిలోకి చొప్పించే రీచార్జ్ పిట్స్, ఇంకుడు గుంతలు సరిపడా లేకపోవడం వల్ల జలమట్టం పునరుద్ధరణ కాకపోవడం కూడా ఓ కారణంగా ఉంది. గత పంటకాలంలోనే భూగర్భజలాలను విస్తృతంగా వినియోగించడం వల్ల ఏప్రిల్ నాటికి నిల్వలు తగ్గిపోయాయి. -
రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే
హన్మకొండ: రైతును కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా గురువారం ముగిసింది. చివరి రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మేళాలో ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులకు కావాల్సిన అన్ని అవకాశాలు కళ్ల ముందుంచాలని, యాంత్రీకరణ, పురుగు మందులు, ఎరువులు, మార్కెటింగ్ వ్యవస్థ, భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు పోవాలి తదితర అంశాలపై రైతులను అవగాహన కల్పించేందుకే హనుమకొండలో రైతుమేళా నిర్వహించామన్నారు. రైతుకు పాడి–పంట రెండూ అవసరమని, ఈ రెండింటి వైపు రైతును ప్రోత్సహించాలన్నారు. ఆయిల్‌పాం లాభదాయకమని, రైతులు దీని సాగుపై దృష్టి సారించాలన్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లాలన్నారు. రైతుబంధు పేరుతో యాంత్రీకరణ ఆపేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అష్టకష్టాల పాలు చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, యూరియా సరఫరాపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రైతులు దానం చేయాలని నాడు వైఎస్ చెప్పారు.. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రైతులు దానం చేయాలని, యాచించకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని, ఈ మేరకు వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఉచిత విద్యుత్ అందించారని, ప్రాజెక్టులు నిర్మించారన్నారు. అదే బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొనుగోళ్లు వేగంగా జరగడం లేదు.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగంగా జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలు రాకముందే కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, రైతులు గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, లావణ్య రెడ్డి, భాగ్యలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద, అదనపు కలెక్టర్లు ఎన్.రవి, సంధ్యారాణి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఎన్పీడీసీఎల్ అధికారులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.ఆయిల్‌పాం సాగు లాభదాయకం సేంద్రియ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముగిసిన రాష్ట్రస్థాయి మెగా రైతుమేళా -
నోటిఫికేషన్‌పై హర్షం
హన్మకొండ కల్చరల్: దేవాలయాల్లో పనిచేయడానికి గ్రేడ్ 1, 2, 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల నియామనికి 190 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడడంపై తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్, గ్రేటర్ వరంగల్ జేఏసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ శర్మ, రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రచారి, రాష్ట్ర దేవాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కొండూరు కృష్ణమాచారి తదితరులు హనుమకొండ రాంనగర్లో దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి దేవాదాయశాఖ ఈఓల నియామకానికి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఉప ప్రధానార్చక, ప్రధాన అర్చక పోసుల్లో నియామకం చేపట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దేవాదాయశాఖలో పనిచేస్తున్నారని, ఖాళీగా ఉన్న పోస్టుల్లో వారిని క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం నియామకాలు చేపట్టాలని కోరారు. మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయాలను చర్చించారు. అలాగే దేవాదాయశాఖలో 190 పోస్టులు కేబినెట్లో తీర్మానం చేసినందుకు అర్చక ఉద్యోగ జేఏసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


