హన్మకొండ కల్చరల్: టూరిజం హబ్‌గా వేయిస్తంభాల ఆలయం నిలుస్తుందని, దేవాలయ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నామని, యునెస్కోలో చేర్చడమే తమ ధ్యేయమని ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అన్నారు. ఈమేరకు మంగళవారం హనుమకొండ శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. మంగళవారం జరిగిన పూజల్లో వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాగా, హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ఘనంగా జయంత్యోత్సవం, పూజలు నిర్వహించారు. శివప్రసాద్ దంపతుల సౌజన్యంతో అన్నప్రసాదాల వితరణ చేశారు. గుజ్జ సంపత్‌రావు భక్తుల కు మామిడిపండ్లు వితరణ చేశారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తదితరులున్నారు.


