నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

May 17 2026 12:36 AM | Updated on May 17 2026 12:36 AM

దుగ్గొండి: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యమని ట్రాన్స్‌కో వరంగల్‌ ఎస్‌ఈ ఆనందం అన్నారు. మండలంలోని అడవి రంగాపురం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి సబ్‌స్టేషన్‌ను అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన 33/11 కేవీ నూతన విద్యుత్‌లైన్‌ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తులు సంభవించడం, సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో వినియోగదారులకు, రైతులకు విద్యుత్‌ స రఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా నూతన లైన్లు ఏర్పాటు చేసి సబ్‌స్టేషన్‌లను అనుసంధానిస్తున్నామన్నారు. ఫలితంగా ఎలాంటి సమస్యలు వచ్చి నా విద్యుత్‌ సరఫరా చేయడంలో ఇబ్బందులు లే కుండా నిరంతర విద్యుత్‌ అందుతుందన్నారు. రైతులు మోటార్ల వద్ద ఆటోమెటిక్‌ స్టాటర్‌ను తీసివేయాలని సూచించారు. డీఈలు హర్జనాయక్‌, తిరుపతి, ఏడీఈలు లక్ష్మణ్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement