బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

‘రేటు’ లేకపోతే ఫైల్‌ కదలదా?

విజిలెన్స్‌ దృష్టి..

విజిలెన్స్‌ తనిఖీల్లో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం ‘ప్రతీ పనికి ఓ రేటు’ వ్యవస్థ కొనసాగుతున్నదేనని తెలిసింది. కొందరు అధికారులు, సిబ్బంది ఫైళ్ల పరిష్కారం కోసం బహిరంగంగానే డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వనివారి ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంచుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో పెండింగ్‌ ఫైళ్లపై ప్రత్యేకంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది.

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

లా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ‘పైసలిస్తేనే ఫైలు కదులుతుంది’ అనే పరిస్థితులు నెలకొన్న ఆరోపణలకు తాజాగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు బలం చేకూర్చినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, రవాణా, సంక్షేమ, విద్య, వైద్యశాఖలతో పాటు పారిశ్రామిక యూనిట్లలోనూ జరిగిన ఆకస్మిక తనిఖీల్లో అనేక అక్రమాలు, నిర్లక్ష్యాలు, నిబంధనల ఉల్లంఘన వెలుగుచూసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విజిలెన్స్‌ అధికారులు త్వరలో సమగ్ర నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది.

దవాఖానాల్లో వైద్య సేవల దుస్థితి

ఎంజీఎం ఆస్పత్రితో పాటు జిల్లా, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో నిర్వహించిన తనిఖీల్లో కూడా పలు లోపాలు బయటపడినట్లు తెలిసింది. కొన్నిచోట్ల వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడం, రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, ఆధునిక పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు లేక వినియోగంలోకి రాకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మందుల కొరత, సిబ్బంది ఖాళీలు, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తేలినట్లు తెలిసింది.

పరిశ్రమల్లో భద్రతా లోపాలు

కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, ధర్మసాగర్‌, పర్వతగిరి, జనగామ పరిసర పారిశ్రామిక యూ నిట్లలోనూ విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలుష్య నియంత్రణ చర్యలు కేవలం రికార్డులకే పరిమితమవుతున్నాయని, కొన్ని పరిశ్రమలు తక్కువ వేతనాలతో అనుభవం లేని కార్మికులను నియమించుకుని భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

వరుస తనిఖీల కలకలం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరుసగా జరుగుతున్న విజిలెన్స్‌ దాడులు అధికారవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిన అవినీతి, జాప్యం, మధ్యవర్తుల వ్యవస్థపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. వివిధ శాఖల్లో గుర్తించిన అక్రమాలు, నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర నివేదిక ఆధారంగా త్వరలో మరిన్ని చర్యలు ఉండొచ్చన్న చర్చ సాగుతోంది.

ఫైల్‌ కదలాలన్నా.. పని కావాలన్నా.. పైసలివ్వాల్సిందే!

ప్రభుత్వశాఖల్లో కొందరు

అధికారుల తీరిది

వెల్ఫేర్‌, రిజిస్ట్రేషన్‌, రవాణా,

రెవెన్యూలో విచ్చలవిడి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా

పలుచోట్ల ఇదే పరిస్థితి..

విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

పరిశీలనలో బట్టబయలు

ప్రభుత్వానికి ‘విజిలెన్స్‌’ నివేదిక

హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మధ్యవర్తుల వ్యవస్థ బలంగా పనిచేస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. డాక్యుమెంట్‌ రైటర్లు, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు అధికారులపై ప్రభావం చూపుతున్నారని, సాధారణ ప్రజలు నేరుగా కార్యాలయాల్లో పనులు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం.

ఏప్రిల్‌ చివరి వారం, ఈ నెల మొదటివారంలో విజిలెన్స్‌, ఏసీబీ అధికారులు వేర్వేరుగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. వడ్డేపల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులు స్వాధీనం చేసుకుని ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లను అరెస్ట్‌ చేశారు, ఆ తర్వాత విజిలెన్స్‌ నివేదికల ఆధారంగా వారిని సస్పెండ్‌ కూడా చేశారు.

ఏప్రిల్‌ 16న ఖిలా వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకట్‌లాల్‌ను విచారించి, పలు కీలక రికార్డులు పరిశీలించారు. కార్యాలయంలో ప్రైవేట్‌ వ్యక్తుల జోక్యం, ఫైళ్ల పెండింగ్‌, రిజిస్ట్రేషన్‌ విధానాలపై నివేదిక ప్రభుత్వానికి పంపారు.

ఏప్రిల్‌ 23–24 తేదీల్లో వరంగల్‌ జిల్లా విద్యాశాఖ (డీఈఓ) కార్యాలయంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు చేపట్టారు. పాఠశాలల రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ ఫైళ్లు, ఉద్యోగుల సర్వీస్‌ రికార్డులు, పెండింగ్‌ బిల్లులు, చెల్లింపుల వివరాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల అనుమతుల ఫైళ్లను పరిశీలించి ఉన్నతాధికారులకు అక్రమాలపై నివేదిక పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement