బిగ్‌ క్యాట్‌, బిగ్‌ మిషన్‌ : భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు | India Gears Up for Global Conservation Summit With Nationwide Events | Sakshi
Sakshi News home page

బిగ్‌ క్యాట్‌, బిగ్‌ మిషన్‌ : భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు

May 14 2026 7:06 PM | Updated on May 14 2026 8:02 PM

India Gears Up for Global Conservation Summit With Nationwide Events

ఐబీసీఏ సదస్సుకు ముందు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు

పులి, సింహం, చిరుత,  మంచు చిరుత, చీతాల  సంరక్షణపై అవగాహన

చీతాల పునరావాసంలో  భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు

కేంద్ర పర్యావరణ, అటవీ, మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: బిగ్‌ క్యాట్‌లుగా ఖ్యాతికెక్కిన సింహం, పులి, చిరుత, మంచు చిరుత, చీతాల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో బిగ్‌క్యాట్‌ ఇతివృత్తంతో పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ (ఐబీసీఏ) సమ్మిట్‌–2026కు ముందస్తు సన్నాహక కార్యక్రమాలుగా మోదీ సర్కార్‌ వీటిని నిర్వహించబోతోంది. భారత్‌లో పులి, ఆసియా సింహం, చిరుత, మంచు చిరుత, చీతా సంరక్షణలో సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చర్యలను ఈ కార్యక్రమాల్లో ప్రదర్శించనున్నట్లు మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 

పులుల సంరక్షణలో మనమే ఆదర్శం
ప్రపంచంలోని అడవి పులులలో 70 శాతానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’(ఎన్‌టీఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలతో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చంద్రపూర్‌ కార్యక్రమంలో టైగర్‌ రిజర్వుల విస్తరణ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, వన్యప్రాణి కారిడార్ల రక్షణ, గ్రామాల పునరావాసం వంటి అంశాలను వివరించనున్నారు. ప్రపంచంలో ఆసియాటిక్‌ సింహాలు కేవలం భారత్‌లోనే ఉండటంతో గిర్‌ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ‘ప్రాజెక్ట్‌ లయన్‌’ కింద దీర్ఘకాలిక సంరక్షణ, నివాస ప్రాంతాల విస్తరణ, వ్యాధి నిరోధక పర్యవేక్షణ, మాల్ధారి సముదాయాల భాగస్వామ్యం వంటి అంశాలను ప్రదర్శించ నున్నారు.  

ఇదీ చదవండి: భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్‌ రాసింది.. కట్‌ చేస్తే!

మనుషుల మధ్యే చిరుతల సహజీవనం
భువనేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో చిరుతలు మానవ నివాస ప్రాంతాల దగ్గర ఎలా జీవిస్తున్నాయో, మానవులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించే చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. గ్యాంగ్‌టక్‌లో జరిగే కార్యక్రమంలో మంచు చిరుతల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం, స్థానిక సముదాయాల భాగస్వామ్యం, పర్వత జీవవ్యవస్థల పరిరక్షణపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి

చీతాల పునరావాసంలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కార్యక్రమంలో ‘ప్రాజెక్ట్‌ చీతా’పై ప్రత్యేకంగా దృష్టి సారించ నున్నారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను భారత్‌కు తీసుకువచ్చి పునరావాసం కల్పించడం ప్రపంచంలోనే తొలి అంతర్‌ఖండ పెద్ద మాంసాహారి జీవి మార్పిడి ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. భారత్‌ ప్రారంభించిన ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా బిగ్‌ క్యాట్‌ జాతుల సంరక్షణకు సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రపంచ స్థాయి సమ్మిట్‌కు వేదికగా నిలవనున్నాయి.

     

ఇదీ  చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌
ఐదు రాష్ట్రాల్లో బిగ్‌ క్యాట్‌లసంరక్షణపై అవగాహనా కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు..
ఆసియా సింహం – గిర్‌(గుజరాత్‌)
చీతా – భోపాల్‌(మధ్యప్రదేశ్‌)
చిరుత  – భువనేశ్వర్‌(ఒడిశా)
మంచు చిరుత – గ్యాంగ్‌టక్‌(సిక్కిం)
పులి – చంద్రపూర్‌(మహారాష్ట్ర)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement