రోడ్‌ సేఫ్టీ బోర్డ్‌ ఏర్పాటు జాప్యంపై సుప్రీం ఆగ్రహం | No Concept Of Lane Driving In India flags Supreme Court | Sakshi
Sakshi News home page

రోడ్‌ సేఫ్టీ బోర్డ్‌ ఏర్పాటు జాప్యంపై సుప్రీం ఆగ్రహం

May 14 2026 6:20 PM | Updated on May 14 2026 6:29 PM

No Concept Of Lane Driving In India flags Supreme Court

 లేన్‌ డ్రైవింగ్‌ ఎవరైనా పాటిస్తున్నారా?  సుప్రీంకోర్టు అసంతృప్తి

దేశంలో రోడ్డు ప్రమాదాలకు లేన్‌ డ్రైవింగ్‌ పాటించకపోవడమే ప్రధాన కారణం 

అడ్డదిడ్డ డ్రైవింగ్‌ ధోరణిలపై  సుప్రీంకోర్టు అసంతృప్తి    

న్యూఢిల్లీ: భారత్‌లో జాతీయ రహదారిలో డివైడర్‌కు ఒకవైపు రెండు లేన్ల రహదారి ఉంటే ఎడమ లేన్‌ నెమ్మదిగా వెళ్లే వాహనాలకు, కుడి లేన్‌ వేగంగా వెళ్లే, ఓవర్‌టేక్‌ చేసే వాహనాల కోసం ఉద్దశించారన్న కనీసం ఇంగిత జ్ఞానం దేశంలో అత్యధిక మంది వాహనదారులకు కొరవడిందని, రోడ్డు ప్రమాదాలకు ఇదే ప్రధాన హేతువుగా మారుతోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను పటిష్టపర్చడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు బుధవారం పలు మార్గదర్శకాలను సూచించింది. 

దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతా నిబంధనలను అమలుచేయాలంటూ 14 ఏళ్ల క్రితం దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ కేవీ వివ్వనాథన్‌ల ధర్మాసనం విచారించింది. రహదారిపై ఏ వాహనం ఎక్కడుంతో చెప్పే వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌(వీఎల్‌టీడీ)లు, అత్యయిక(ప్యానిక్‌) బటన్‌లను అన్ని వాహకాలను బిగించేలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాయంత్రాంగాలకు ఆదేశాలు జారీచేయాలని దాఖలైన పిల్‌ను ధర్మాసనం విచారించింది. ‘‘లేన్‌ల పద్ధతి ఎందుకుందో, వాటిని ఎలా ఆచరించాలో, వాటిని పాటించకపోతే జరిగే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయనే స్పృహ భారత్‌లో కొరవడింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఈ లేన్‌వ్యవస్థపై అవగాహనారాహిత్యం, ఆచరణ శుద్ధి లోపించడం. లేన్‌ డ్రైవింగ్‌ను పాటిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. వీఎల్‌టీడీలను అమర్చుకుంటే ప్రయాణికులు, డ్రైవర్లకు రోడ్లు ప్రమాదాల నుంచి రక్షణ ఉంటుంది. 

ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులకు రోడ్డు ప్రయాణ భరోసా ఉంటుంది. వీఎల్‌టీడీలను దేశంలో కేవలం ఒక శాతం వాహనాల్లోనే అమర్చారు. వీటిని తప్పనిసరిగా బిగించుకోవాలని 2018లోనే చట్టంచేసినా అది ఆచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమైంది’’ అని కోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. 

ఇదీ  చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌

బిగిస్తేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌
‘‘సెంట్రల్‌ మోటార్‌ వాహనాల నిబంధనలు, 1989లోని 125హెచ్‌ నిబంధనను ఇప్పటికైనా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి. పాత వాటితోపాటు కొత్త ప్రజారవాణా వాహనాల్లో వీఎల్‌టీడీలను ఖచి్చతంగా బిగించేలా చూడాలి. ఇకమీదట యథాలాపంగా వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ జారీచేయొద్దు. వీఎల్‌టీడీ, ఎమర్జెన్సీ బటన్స్‌ ఉన్న ప్రజారవాణా వాహనాలకే ఫిట్‌నెస్‌ సరి్టఫికేట్‌ ఇవ్వాలి. కొత్త వాహనాలకు తయారీ యూనిట్లలోనే ఈ వ్యవస్థను బిగించాలని ఉత్పత్తికర్మాగారాలకు సూచిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేయాలి. ఫలానా వాహనంలో ఈ వ్యవస్థ ఉందని తెలియజేసేలా వాహన్‌ యాప్‌ లేదా సంబంధిత పోర్టల్‌ను అప్‌డేట్‌ చేయాలి. ఏఏ వాహనాలకు వీఎల్‌టీడీ ఇన్‌స్టాల్‌ చేసి ఉందో వేటికి సరిగా పనిచేస్తుందో తెలిసేలా సమీకృత వాహన్‌ డేటాబేస్‌ను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించే వ్యవస్థను అందుబాటులోకి తేవాలి’’అని ధర్మాసనం ఆదేశించింది. 

ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి

స్పీడ్‌ లిమిట్‌పైనా అసంతృప్తి 
‘‘అత్యధిక వేగంతో వాహనం దూసుకెళ్లకుండా దాని వేగాన్ని నిర్ణీత పరిధిమేరకు కట్టిచేసే స్పీడ్‌ గవర్నర్‌(స్పీడ్‌ లిమిట్‌) ఉపకరణాలనూ వాహనాల్లో అమర్చాలి. ప్రస్తుతం ఎన్ని వాహనాలకు స్పీడ్‌ లిమిట్‌ డివైజెస్‌ (ఎస్‌ఎల్‌డీ) లు అమర్చి ఉన్నాయో, ఇంకెన్ని వాహనాలకు బిగించాల్సి ఉందో తెలిపే వివరాలను సమగ్ర నివేదికను ఈ కేసు తదుపరి విచారణ తేదీలోగా సమర్పించాలి. వాహన్‌/పరివాహన్‌ పోర్టల్‌లోనూ సంబంధిత గణాంకాలను పొందుపరచాలి’’అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ధర్మాసనం ఆదేశించింది. ‘‘రోడ్డు భద్రతా బోర్డ్‌ ఏర్పాటు చేయాలని ఎప్పుడ ఆదేశించాం. ఇంకా ఏర్పాటు చేయలేదా? ఇదే మీకు చివరి అవకాశం. మూడు నెలల్లోపు అది కొలువు తీరాలి. ఈసారి గడువులోపు రోడ్‌ సేఫ్టీ బోర్డ్‌ను ఏర్పాటు చేసి తీరాల్సిందే’’అని ధర్మాసనం సూచించింది.  

ఇదీ చదవండి: భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్‌ రాసింది.. కట్‌ చేస్తే!

Advertisement
 
Advertisement
Advertisement