రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌ | The Skin Doctor Neelam Singh Influencer arrest over posts targeting Kapurs family | Sakshi
Sakshi News home page

రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌

May 14 2026 4:19 PM | Updated on May 14 2026 4:24 PM

The Skin Doctor Neelam Singh Influencer arrest over posts targeting Kapurs family

నటి కరిష్మా కపూర్ మాజీ భర్త  ఆటో విడిభాగాల కంపెనీ సోనా కామ్‌స్టార్ ఛైర్మన్  సంజయ్ కపూర్‌ ఆకస్మిక మృతిలో కీలక పరిణామం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో "ది స్కిన్ డాక్టర్" (The Skin Doctor) గా పేరుగాంచిన డాక్టర్ నీలం సింగ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు.

డాక్టర్ నీలం సింగ్ వృత్తిరీత్యా డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధి నిపుణుడు).  కేవలం వైద్య విషయాలే కాకుండా రాజకీయాలు, సామాజిక అంశాలు , కరెంట్ అఫైర్స్‌పై తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో "సామాజిక సమస్యలపై మాట్లాడే చర్మవ్యాధి నిపుణుడు"గా అని తనను తాను అభివర్ణించుకుంటారు. అయితే అతని ఎక్స్ బయోలో, "నేను ముఖ్యం కాదు; నేను చెప్పేదే ముఖ్యం" అని రాసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అతనికి భారీ ఫాలోయింగ్‌ మాత్రమే కాదు, ఆయన పోస్టులు తరచుగా తీవ్రమైన చర్చలు , విమర్శలకు దారితీస్తాయి. తాజా అరెస్ట్‌ కూడా అందులో భాగమే.

అరెస్ట్‌కు కారణం ఏమిటి?
సంజయ్ కపూర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలోని వసంత్ కుంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్‌ చేసినట్టు సమాచారం.

గత ఏడాదిలో  జూన్‌లో సంజయ్ కపూర్ లండన్‌లో పోలో ఆడుతూ మరణించారు. వైద్య నివేదికల ప్రకారం  పోలో ఆడుతుండగా తేనెటీగ మింగిడం వల్ల, అది గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం తర్వాత రూ. 30,000 కోట్ల ఆస్తి వారసత్వం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ మరణం వెనుక ఉన్న పరిస్థితులను ప్రశ్నిస్తూ, ఆయన ఆస్తి , వారసత్వానికి సంబంధించిన అంశాలపై డాక్టర్ సింగ్ ఒక పోస్ట్  పెట్టారు.  

సంజయ్ కపూర్ భార్య ప్రియా కపూర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, అలాగే మరణానికి కొద్దిరోజుల ముందే ఆయన వీలునామా (Will) రాయడంపై  కూడా  సింగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, కల్పితాలని ప్రియా కపూర్ పేర్కొన్నారు. అయితే, స్క్రీన్‌షాట్‌లు మరియు తొలగించిన పోస్టుల ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయారు.


డాక్టర్‌ స్పందన 
బెయిల్‌పై విడుదలైన తర్వాత డాక్టర్ నీలమ్ సింగ్  ఎక్స్‌ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను ఏ తప్పూ చేయలేదని నమ్మాను, అందుకే విచారణకు హాజరయ్యానని, బెయిల్ మంజూరైందని తెలిపారు. ఈ కేసులో అసలు నేరమేమీ కనిపించడం లేదని,  తనను  ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని జడ్జి వ్యాఖ్యానించారని కూడా తెలిపారు.  తనకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులకు, అనుచరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో భావప్రకటనా స్వేచ్ఛ మరియు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: రూ. 30 వేల‌ కోట్ల ఆస్తి వివాదం, సుప్రీంకోర్టు అసహనం

 

Advertisement
 
Advertisement
Advertisement