భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్‌ రాసింది.. కట్‌ చేస్తే! | Husband Eric Richins assassination Kouri Richins Sentenced To Life In Prison | Sakshi
Sakshi News home page

భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్‌ రాసింది.. కట్‌ చేస్తే!

May 14 2026 5:17 PM | Updated on May 14 2026 6:31 PM

Husband Eric Richins assassination Kouri Richins Sentenced To Life In Prison

 విచారణ అనంతరం యావజ్జీవ ఖైదు

ఊటా (Utah)కు చెందిన రచయిత్రి కౌరీ రిచిన్స్ (Kouri Richins) కేసు  కీలక మలుపు తిరిగింది.  తన భర్త ఎరిక్ రిచిన్స్‌ను విషమిచ్చి  హత్య చేసిందన్న ఆరోపణలు దిగ్భ్రాంతి రేపాయి.  ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మే 13, 2026న కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఆమే ఈ హత్య చేసిందనేందుకు పూర్తి సాక్ష్యాలు లేవు. కానీ కోర్టు కొన్ని  ఆధారాలు ఆర్థిక కారణాల  ఆధారంగ ఈ తీర్పు చెప్పింది. మరోవైపు ముగ్గురు   కొడుకులు తల్లి  దగ్గరికి వెళ్లాలంటే భయపడుతుండటం ఈ కేసులో మరో కీలక అంశం.  

అసలు కేసు  ఏంటి?
2013లో కౌరీ, ఎరిక్ వివాహం చేసుకున్నారు. ఆ సమయానికి, వారికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే  పెళ్లి రోజున వీరొక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆరేళ్ల తరువాత 2019లో కౌరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో లాభాలొచ్చినా,  2022 నాటికి ఆమె వ్యాపారం భారీ అప్పుల్లో మునిగిపోయిందని, ఆ అప్పులు తీర్చడానికి ఆమె భర్త అనుమతి లేకుండానే అతని ఖాతాల నుండి డబ్బు వాడినట్లు ఆరోపణలు వచ్చాయి.   అయితే 2020 నుంచే తన భార్య తన డబ్బును దుర్వినియోగం చేస్తోందని గ్రహించిన ఎరిక్, తన ఆస్తి తన పిల్లలకు చెందేలా 'ఎరిక్ రిచిన్స్ లివింగ్ ట్రస్ట్' అనే ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తన సోదరిని దానికి ట్రస్టీగా నియమించాడు. 

ఇదీ  చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్‌ ‘ది స్కిన్‌ డాక్టర్‌’ కి షాక్‌

ఎరిక్ రిచిన్స్‌ను ఎందుకు చంపింది? (ఆరోపణలు మాత్రమే)
2023 మే 8న సమ్మిట్ కౌంటీ అధికారులు అరెస్టు చేశారు.  ఇదే తరహా  ఆరోపణలతో  విచారణ జరిగిన వారం తర్వాత ఆమె అదే నేరాన్ని పునరావృతం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. భర్త పానీయంలో విషం కలిపి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కౌరీ తన భర్తను చంపడానికి ప్రధాన కారణం ఆర్థిక లాభం అని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు.కౌరీ వ్యాపారం మిలియన్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. పెళ్లి సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఎరిక్ చనిపోతే అతని కంపెనీ కౌరీకి చెందుతుంది. దీంతో ఎరిక్ పేరు మీదున్న భారీ భీమా సొమ్మును పొందేందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని సమాచారం.

ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లి

కోర్టు పత్రాల ప్రకారం, కౌరీ తన భర్తకు ఫెంటానిల్ (Fentanyl) అనే శక్తివంతమైన మాదకద్రవ్యాన్ని ఇచ్చి విషప్రయోగం చేసింది. 2022 వాలెంటైన్స్ డే రోజున ఆమె ఎరిక్ ఇచ్చిన శాండ్‌విచ్‌లో విషం కలిపింది. అది తిన్న తర్వాత ఎరిక్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతను అనారోగ్యంగా భావించి నిద్రపోయాడు తన భార్య తనను చంపడానికి ప్రయత్నిస్తోందని అప్పట్లోనే ఎరిక్ తన స్నేహితుడితో చెప్పాడు. అయితే, ఆమె ఈ వాదనను ఖండించి, ఆ రోజు తాను కేవలం ఇద్దరి కోసం భోజనం ఆర్డర్ చేశానని,  కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పటికీ,  మామూలే అనుకొని  నిద్రపోయాడని కోర్టులో చెప్పింది.

మార్చి 4, 2022న కౌరీ తన భర్తకు ఒక కాక్‌టెయిల్ తయారు చేసి ఇచ్చింది. అందులో భారీ మోతాదులో ఫెంటానిల్ కలిపింది. ఆ రాత్రి ఎరిక్ చనిపోయాడు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎరిక్ రక్తంలో సాధారణ మరణానికి కారణమయ్యే మోతాదు (3 ng/ml) కంటే ఐదు రెట్లు ఎక్కువగా అంటే 15 ng/ml ఫెంటానిల్ ఉన్నట్లు తేలింది. ఈ కేసులో విచారణలో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.

నేను నిర్దోషిని
అయితే, కౌరీ ఇప్పటికీ తాను నిర్దోషినని వాదిస్తోంది. తాను  చేయని నేరానికి నిందించవద్దని, తన  ముగ్గురు పిల్లల కోసం తానీ పోరాటాన్ని కొనసాగిస్తానని కోర్టులో ప్రకటించింది. మరోవైపు, ఆమె ముగ్గురు కుమారులు తమ తల్లి జైలు నుండి బయటకు రావడం ఇష్టం లేదని, ఆమె వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు.  స్వయంగా రైటర్‌ అయిన కౌరీ  భర్తను చంపి, ఆ తర్వాత అతని జ్ఞాపకార్థం 'Are You With Me?' అనే పుస్తకాన్ని కూడా కౌరీ రాయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement