breaking news
sentenced jail
-
రాజభవనం టూ జైలు.. యువరాణి కుమారుడికి నాలుగేళ్ల శిక్ష
ఒస్లో: నార్వే రాజ కుటుంబాన్ని గత రెండేళ్లుగా కుదిపేస్తున్న లైంగిక దాడుల కేసులో కీలక తీర్పు వెలువడింది. నార్వే యువరాణి మెట్టే మారిట్(Mette-Marit) కుమారుడైన మారియస్ బోర్గ్ హోయిబీ(Marius Borg Hoiby)పై నమోదైన అత్యాచారం, గృహహింస, బెదిరింపులు తదితర కేసుల్లో ఓస్లో జిల్లా కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, ఈ కేసు నార్వే చరిత్రలో రాజ కుటుంబానికి సంబంధించిన అత్యంత వివాదాస్పద నేర విచారణల్లో ఒకటిగా నిలిచింది. నెలల తరబడి సాగిన దర్యాప్తు, ఆరు వారాలకు పైగా కొనసాగిన విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది.ఎవరు మారియస్?మారియస్ బోర్గ్ హోయిబీ నార్వే యువరాణి మెట్టే-మారిట్కి మొదటి వివాహం ద్వారా జన్మించాడు. 2001లో ఆమె యువరాజు హాకోన్‌ను వివాహం చేసుకుంది. అనంతరం, మారియస్ కూడా రాజకుటుంబంలో భాగమయ్యాడు. అయితే అతనికి రాజవంశ వారసత్వ హక్కులు లేదా అధికారిక రాజకుటుంబ హోదా లేవు. అయినప్పటికీ, చిన్నప్పటి నుంచే రాజకుటుంబ సభ్యుడిగా ప్రజల దృష్టిలో ఉన్నాడు.ఏయే ఆరోపణలు ఎదుర్కొన్నాడు?ప్రాసిక్యూషన్ ప్రకారం, మారియస్‌పై మొత్తం 40 వరకు క్రిమినల్ ఆరోపణలు నమోదయ్యాయి. వాటిలో.. నాలుగు అత్యాచార ఆరోపణలు, మహిళలపై లైంగిక దాడులు, గృహహింస, బెదిరింపులు, నిరోధాజ్ఞ (Restraining Order) ఉల్లంఘనలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి కేసులు ఉన్నాయి. దీంతో, ప్రాసిక్యూటర్లు అతడికి 7 సంవత్సరాల 7 నెలల జైలు శిక్ష విధించాలని కోరగా, కోర్టు చివరకు నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది.కోర్టు ఏం తేల్చింది?కోర్టు రెండు అత్యాచార కేసుల్లో మారియస్‌ను దోషిగా నిర్ధారించింది. మరికొన్ని అత్యాచార ఆరోపణల నుంచి అతడికి విముక్తి లభించినప్పటికీ, గృహహింస మరియు ఇతర నేరాల్లో కూడా దోషిగా తేలాడు. విచారణ సమయంలో బాధిత మహిళల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్ డేటా, సందేశాలు, వీడియో ఆధారాలు తదితర అంశాలను కోర్టు పరిశీలించింది. విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలు నార్వే సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి.మరోవైపు.. మారియస్ అత్యాచార ఆరోపణలను ఎప్పటి నుంచో ఖండిస్తున్నాడు. తాను అత్యాచారాలకు పాల్పడలేదని, అయితే కొన్ని చిన్న నేరాలు, మాదకద్రవ్యాల రవాణా, దాడి వంటి ఆరోపణలను మాత్రం అంగీకరించాడు. తీర్పుపై అప్పీల్ చేసే హక్కు అతనికి ఉంది.రాజ కుటుంబంపై తీవ్ర ప్రభావంఈ కేసు నార్వే రాజ కుటుంబ ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది. విచారణ సమయంలో రాజ్యాంగ రాజరిక వ్యవస్థపై ప్రజల మద్దతు కూడా తగ్గిందని సర్వేలు సూచించాయి. అయితే ఇటీవలి నెలల్లో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఈ పరిణామాల మధ్య యువరాణి మెట్టే-మారిట్ తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె ప్రస్తుతం ఊపిరితిత్తుల మార్పిడి (Lung Transplant) కోసం వేచి ఉన్నట్లు సమాచారం. తన తల్లి ఆరోగ్య పరిస్థితి కారణంగా తాత్కాలిక విడుదల కోరిన మారియస్ అభ్యర్థనను కూడా అప్పీల్ కోర్టు తిరస్కరించింది.నార్వేలో చర్చనీయాంశంరాజ కుటుంబానికి సమీప వ్యక్తి అయినప్పటికీ, చట్టం ముందు అందరూ సమానమేనని ఈ తీర్పు మరోసారి రుజువు చేసిందని మహిళా హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. రాజకీయ, సామాజిక వర్గాలు కూడా నార్వే న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రశంసిస్తున్నాయి. -
భర్తను చంపి, జ్ఞాపకార్థం బుక్ రాసింది.. కట్ చేస్తే!
ఊటా (Utah)కు చెందిన రచయిత్రి కౌరీ రిచిన్స్ (Kouri Richins) కేసు కీలక మలుపు తిరిగింది. తన భర్త ఎరిక్ రిచిన్స్‌ను విషమిచ్చి హత్య చేసిందన్న ఆరోపణలు దిగ్భ్రాంతి రేపాయి. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మే 13, 2026న కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది. అయితే ఆమే ఈ హత్య చేసిందనేందుకు పూర్తి సాక్ష్యాలు లేవు. కానీ కోర్టు కొన్ని ఆధారాలు ఆర్థిక కారణాల ఆధారంగ ఈ తీర్పు చెప్పింది. మరోవైపు ముగ్గురు కొడుకులు తల్లి దగ్గరికి వెళ్లాలంటే భయపడుతుండటం ఈ కేసులో మరో కీలక అంశం. అసలు కేసు ఏంటి?2013లో కౌరీ, ఎరిక్ వివాహం చేసుకున్నారు. ఆ సమయానికి, వారికి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే పెళ్లి రోజున వీరొక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆరేళ్ల తరువాత 2019లో కౌరీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో లాభాలొచ్చినా, 2022 నాటికి ఆమె వ్యాపారం భారీ అప్పుల్లో మునిగిపోయిందని, ఆ అప్పులు తీర్చడానికి ఆమె భర్త అనుమతి లేకుండానే అతని ఖాతాల నుండి డబ్బు వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే 2020 నుంచే తన భార్య తన డబ్బును దుర్వినియోగం చేస్తోందని గ్రహించిన ఎరిక్, తన ఆస్తి తన పిల్లలకు చెందేలా 'ఎరిక్ రిచిన్స్ లివింగ్ ట్రస్ట్' అనే ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, తన సోదరిని దానికి ట్రస్టీగా నియమించాడు. ఇదీ చదవండి: రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం: పాపులర్ ‘ది స్కిన్ డాక్టర్’ కి షాక్ఎరిక్ రిచిన్స్‌ను ఎందుకు చంపింది? (ఆరోపణలు మాత్రమే)2023 మే 8న సమ్మిట్ కౌంటీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే తరహా ఆరోపణలతో విచారణ జరిగిన వారం తర్వాత ఆమె అదే నేరాన్ని పునరావృతం చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. భర్త పానీయంలో విషం కలిపి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కౌరీ తన భర్తను చంపడానికి ప్రధాన కారణం ఆర్థిక లాభం అని ప్రాసిక్యూటర్లు భావిస్తున్నారు.కౌరీ వ్యాపారం మిలియన్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. పెళ్లి సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఎరిక్ చనిపోతే అతని కంపెనీ కౌరీకి చెందుతుంది. దీంతో ఎరిక్ పేరు మీదున్న భారీ భీమా సొమ్మును పొందేందుకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందని సమాచారం.ఇదీ చదవండి: అంతా క్షణాల్లో.. ఐసీయూ బెడ్‌మీదే పెళ్లికోర్టు పత్రాల ప్రకారం, కౌరీ తన భర్తకు ఫెంటానిల్ (Fentanyl) అనే శక్తివంతమైన మాదకద్రవ్యాన్ని ఇచ్చి విషప్రయోగం చేసింది. 2022 వాలెంటైన్స్ డే రోజున ఆమె ఎరిక్ ఇచ్చిన శాండ్విచ్లో విషం కలిపింది. అది తిన్న తర్వాత ఎరిక్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అతను అనారోగ్యంగా భావించి నిద్రపోయాడు తన భార్య తనను చంపడానికి ప్రయత్నిస్తోందని అప్పట్లోనే ఎరిక్ తన స్నేహితుడితో చెప్పాడు. అయితే, ఆమె ఈ వాదనను ఖండించి, ఆ రోజు తాను కేవలం ఇద్దరి కోసం భోజనం ఆర్డర్ చేశానని, కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పటికీ, మామూలే అనుకొని నిద్రపోయాడని కోర్టులో చెప్పింది.మార్చి 4, 2022న కౌరీ తన భర్తకు ఒక కాక్టెయిల్ తయారు చేసి ఇచ్చింది. అందులో భారీ మోతాదులో ఫెంటానిల్ కలిపింది. ఆ రాత్రి ఎరిక్ చనిపోయాడు. పోస్ట్‌మార్టం నివేదికలో ఎరిక్ రక్తంలో సాధారణ మరణానికి కారణమయ్యే మోతాదు (3 ng/ml) కంటే ఐదు రెట్లు ఎక్కువగా అంటే 15 ng/ml ఫెంటానిల్ ఉన్నట్లు తేలింది. ఈ కేసులో విచారణలో కోర్టు ఆమెకు జీవిత ఖైదు విధించింది.నేను నిర్దోషినిఅయితే, కౌరీ ఇప్పటికీ తాను నిర్దోషినని వాదిస్తోంది. తాను చేయని నేరానికి నిందించవద్దని, తన ముగ్గురు పిల్లల కోసం తానీ పోరాటాన్ని కొనసాగిస్తానని కోర్టులో ప్రకటించింది. మరోవైపు, ఆమె ముగ్గురు కుమారులు తమ తల్లి జైలు నుండి బయటకు రావడం ఇష్టం లేదని, ఆమె వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టుకు తెలిపారు. స్వయంగా రైటర్ అయిన కౌరీ భర్తను చంపి, ఆ తర్వాత అతని జ్ఞాపకార్థం 'Are You With Me?' అనే పుస్తకాన్ని కూడా కౌరీ రాయడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. -
బుద్ధి మారలేదు.. జైలు తప్పలేదు..
సిడ్నీ: ఆస్ట్రేలియాలో నివాసముంటున్న భారత వృద్హ జంట తమ వద్ద మరో భారతీయ వృద్ధురాలిని బానిసగా చేసుకుని చిత్రహింసలకు గురిచేసిన సంఘటనలో ఆస్ట్రేలియా న్యాయస్థానం వృద్ధ దంపతుల శిక్షా కాలాన్ని మరో రెండున్నరేళ్లకు పెంచుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. భారత్‌లోని తమిళనాడుకు చెందిన కుముదిని కణ్ణన్, కందసామి కణ్ణన్ జంట తమ వద్ద పని చేయడానికి ఒక భారతీయ మహిళను నియమించుకున్నారు. ఆమెకు ఇంటిపని వంటపని తోపాటు పిల్లలను చూసుకునే పని కూడా అప్పజెప్పి రోజుకు 23 గంటల పాటు పని చేయమని హింసించారు. ఒక పనిమనిషిలా కాకుండా మానవత్వం లేకుండా బానిసలా చూసినట్టు చూసి ఆమె అనారోగ్యానికి కారణమయ్యారు. పాపం ఆ మహిళ పోషకాహార లోపం, డయాబెటిస్, గాంగ్రీన్ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యింది. ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు శాఖ ఈ జంటపై బానిసల వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని 2021లో జైలుకు తరలించారు. ఈ కేసులో వాదోపవాదనలు పూర్తయిన తర్వాత ఆస్ట్రేలియా న్యాయస్థానం వృద్ధ జంటకు మరో రెండున్నరేళ్ళపాటు శిక్షను పొడిగించింది. 2016లో నమోదైన ఈ కేసులో సాక్షిని భయపెట్టేందుకు ప్రయత్నించిన కుముదిని కణ్ణన్ కు మొత్తం 8 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించగా అందులో నాలుగేళ్ల పాటు బెయిల్ నిరాకరిస్తున్నట్లు, అలాగే కందస్వామి కణ్ణన్ కు ఆరేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించి అందులో మూడేళ్లు బెయిల్ మంజూరు చేయడం కుదరదని తీర్పునిచ్చింది. ఈ సందర్బంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈ దంపతుల్లో కొంచెమైనా పశ్చాత్తాపం కనిపించడంలేదని.. వారిలో వీసమెత్తు మానవత్వం కూడా లేదని సాటి మనిషిని మనిషిగా కూడా చూడలేని కఠిన హృదయులని తెలిపారు. తప్పు చేసిన భావనే వారిలో కొరవడిందని చెబుతూ కఠిన శిక్షను అమలు చేయాల్సిందిగా కోరారు. ఇది కూడా చదవండి: కుటుంబంపై హత్యాయత్నం చేసిన డాక్టర్.. కారులో తీసుకెళ్లి.. -
చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష
ఒక వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు భారీ మూల్య చెల్లించుకున్నాడు. క్షణికావేశలోనూ లేక ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కూడా కాదు. ఒక వ్యక్తితో జరిగిన వివాదంలో కోపంలో తన వద్ద ఉన్న హ్యండ్ గన్‌తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అంతే అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదలైంది. అవతలి వ్యక్తి ఆ తూటా నుంచి తప్పించుకున్నాడు గానీ సమీపంలోని గదిలో ఆడుకుంటున్న చిన్నారి తలలో దూసుకుపోయింది. అభం శుభం తెలియని ఒక నిండు ప్రాణం ఆ తూటాకి బలైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తి ఏకంగా వందేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...ష్రేవ్పోర్ట్కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి సూపర్ 8 లగర్జీ హోట్లోని పార్కింగ్ వద్ద ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్ ఆవ్యక్తిపైకి ఎంఎం హ్యాండ్‌గన్‌ని ఎక్కుపెట్టారు. దీంతో విడుదలై బుల్లెట్ నుంచి సదరు వ్యక్తికి తప్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ హోటల్ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మయాపటేల్ తలలోకి దూసుకుపోయింది. దీంతో మయా పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..అక్కడ మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడి మార్చి 23, 2021న చనిపోయింది. దీంతో స్మిత్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ హోటల్ని విమల, స్నేహల్ పటేల్ యజామాన్యంలో ఉంది, వారే ఆ హోటల్ని నిర్వహిస్తున్నారు. వారు ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో తమ కూతరు మాయా పటేల్, ఆమె చిన్న చెల్లెలుతో కలిసి ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆ కుటుంబం ఒక బిడ్డను పోగోట్టుకోవలసి వచ్చింది. ఈ క్రమంలో కోర్టు సదరు వ్యక్తికి ఎలాంటి పెరోల్ లేదా శిక్ష తగ్గింపుకు అవకాశం లేకుండా 60 ఏళ్లు కఠిన కారాగారా శిక్ష విధించింది. అలాగే బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు గానూ 20 ఏళ్లు, అలాగే ఈ దారుణమైన ఘటనకు బాధ్యుడిగా మరో 20 ఏళ్ల కలిపి మొత్తం వందేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కాడో పారిష్ జిల్లా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సదరు నిందితుడు స్మిత్‌కి గతంలో కూడా కొంత నేర చరిత్ర ఉందని, దాన్ని పునరావృతం చేశాడే గానీ ప్రవర్తన మార్చుకోనందున ఈ శిక్ష విధించినట్లు సమాచారం. (చదవండి: క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు) -
ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!
కొన్ని దేశాల్లో చిన్న నేరాలకే పెద్ద పెద్ధ శిక్షలు విధిస్తారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఇలా చేస్తుంటారా? లేక మరేదైనా కారణమో తెలియదు. కానీ ఆ శిక్షలు చూస్తే మనకే చాలా సిల్లీగా అనిపిస్తుంది. నిందితుడు చేసింది నేరంగా పరిగణించేది కాకపోయినా..ఘోరమైన శిక్షలు విధిస్తుంటారు. అచ్చం అలానే 65 ఏళ్ల వృద్ధుడు దారుణమైన శిక్ష ఎదర్కొంటున్నాడు. అతడు చేసిన నేరం, పడిన శిక్ష! చూస్తే ఏంటిదీ?.. అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన 64 ఏళ్ల డేవిడ్ షెర్మాన్ పావెలన్స్ అనే వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అరెస్టు చేశారు. పైగా అతడిపై ఘోరమైన ఆరోపణలు చేస్తూ.. సీరియస్ కేసుగా నమోదు చేశారు. ఇంతకీ అతడు చేసిన నేరం ఏంటంటే.. తన సోదరుడి ముఖంపై కూల్ వాటర్‌ని పోశాడు. రెండు గ్లాస్‌ల వాటర్‌ని అతని ముఖంపై పోసి తనని చనిపోయేలా భయబ్రాంతులకు గురి చేశాడంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే అందువల్ల అతనికి ఎలాంటి హాని గానీ, గాయాలు గానీ కాలేదు. షెర్మాన్ చర్యకు తాను చాలా భయపడిపోయానంటూ కేసు నమోదు చేయించాడు. ఆ వృద్ధుడిని ఈ విషయమై విచారించగా.. ఫ్రిజ్‌లో ' కీ లైం పై' అనే కేకులాంటి స్వీట్ తినేందుకు అలా చేశానని చెబుతున్నాడు. ఆ స్వీట్‌ని తన సోదరుడు చాలా రోజులుగా ఫ్రిజ్‌లో ఉంచాడని, తనకు తినాలనిపించడంతో సోదరుడికి తెలియకుండా తినేసినట్లు తెలిపాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని, తాను సోదరుడిని కూల్ చేసేందుకు చల్లటి వాటర్ అతడి నెత్తిమీద నుంచి పోసినట్లు తెలిపాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న షెర్మాన్ సోదరుడు అతడిని కటకటాల పాలు చేశాడు. అతను గనుక నేరం చేసినట్లు తేలితే గనుక అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష తోపాటు పెద్ద మొత్తంలో జరిమాన కూడా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారుల కూడా అతడి దూకుడు ప్రవర్తన ఇతరుల ప్రాణాలను ప్రమాదకరంగా ఉందంటూ త్రీవమైన కేసుగా పరిగణించి మరీ నమోదు చేయడం గమనార్హం. Florida Man Faces Up to 30 Years for Dumping Water on Older Brother in Argument Over Key Lime Pie https://t.co/jYkWyrPF71 pic.twitter.com/4P2FVbtQVC — Florida Man (@FloridaMan__) February 24, 2023 (చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్) -
రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్‌కు జైలుశిక్ష
సాక్షి, అమరావతి: కోర్టుధిక్కార కేసులో అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏపీఎండీసీ) చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.సుదర్శనరెడ్డిలకు హైకోర్టు ఆరు నెలల జైలుశిక్ష, రూ.రెండువేల జరిమానా విధించింది. అప్పీల్‌కు వెళ్లేందుకు తీర్పు అమలును వారం రోజులు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. మంగంపేట ప్రాంతంలో కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. ఏ నిర్మాణాలను కూల్చివేశారో తేల్చి, ఆ నిర్మాణాల విలువను తేల్చేందుకు ఇంజనీర్లను నియమించేలా ఆదేశాలివ్వాలంటూ ఓబులవారిపల్లెకు చెందిన ఎ.నరసమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు నిర్మాణాల విలువ తేల్చేందుకు ఇంజనీర్లను నియమించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో నరసమ్మ కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి.. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడానికి రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఏపీఎండీసీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.సుదర్శనరెడ్డి కారణమని తేల్చి జైలుశిక్ష, జరిమానా విధించారు. చదవండి: (వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు) -
కామాంధునికి 20 ఏళ్ల జైలు
మైసూరు: మూడున్నరేళ్ల పసిపాపపై లైంగికదాడికి పాల్పడిన కామాంధునికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. హుణసూరు తాలూకాలోని జగదీష్ (45) దోషి. ఇతను 2019లో హుణసూరు తాలూకా బిళకెరె పోలీసుస్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు. పోక్సో కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి శ్యామ్ కంరోస్.. 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష
జోహన్నెస్‌బర్గ్: అత్యాచారం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన ఒక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 40 ఇండ్లలో దొంగతనాలు చేయడంతో పాటు 41 మందికి పైగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడినందుకు వెయ్యేండ్లకు పైగా జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి (2014-19) మధ్య ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగతనాలతో పాటు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవాడు. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన కోర్టు.. నిందితుడు సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్లలో చోరీలకు పాల్పడటంతో పాటు 41 మంది మహిళలపైగా అత్యాచారం చేసినట్టు ధృవీకరించింది. ఈ క్రమంలోనే న్యాయస్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. చదవండి: లైవ్‌లో రిపోర్టింగ్.. అనుకోని అతిథి రావడంతో షాక్ భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు -
ట్రాన్స్ఫార్మర్ దొంగలకు జైలు
చింతకొమ్మదిన్నె(వైఎస్సార్‌జిల్లా): వ్యవసాయ బావుల వద్ద ఉన్న ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లిన దొంగల ముఠాకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లి గ్రామ పరిధిలో ఐదు ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాను 2013 అక్టోబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించగా.. మంగళవారం నాడు నేరం రుజువు కావడంతో వారికి న్యాయమూర్తి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.


